chandu mondeti
-
తండేల్ 2లో రామ్..?
-
నాగచైతన్య వందకోట్ల మూవీ.. ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్
తన పెళ్లి తర్వాత అక్కినేని హీరో నాగచైతన్య తండేల్ మూవీతో ప్రేక్షకులను పలకరించారు. చందు మొండేటి డైరెక్షన్లో వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్‌గా నిలిచింది. ఫిబ్రవరి 7న థియేటర్లలో విడుదలైన ఈ మూవీలో నేచురల్ బ్యూటీ సాయిపల్లవి హీరోయిన్గా నటించారు. మత్స్యకారుల బ్యాక్‌డ్రాప్‌లో వచ్చిన ఈ రియల్ స్టోరీ బాక్సాఫీస్ వద్ద రూ.100 కోట్ల మార్క్‌ను చేరుకుంది.బాక్సాఫీస్ వద్ద సూపర్‌హిట్‌గా నిలిచిన ఈ మూవీ ఓటీటీ రిలీజ్ కోసం టాలీవుడ్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ సినిమా డిజిటల్ రైట్స్ దక్కించుకున్న నెట్‌ఫ్లిక్స్ తాజాగా స్ట్రీమింగ్ డేట్‌ను రివీల్ చేసింది. ఈనెల 7 నుంచి తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళం భాషల్లో స్ట్రీమింగ్ చేయనున్నట్లు వెల్లడించింది. ఈ మేరకు పోస్టర్‌ను విడుదల చేసింది.తండేల్ అసలు కథేంటంటే..శ్రీకాకుళం జిల్లాకు చెందిన 22 మంది మూడు బోట్లలో గుజరాత్ వెరావల్ నుంచి బయలుదేరి చేపల వేట సాగిస్తుండగా పొరపాటున పాకిస్థాన్ ప్రాదేశిక జలాల్లోకి వారు ప్రవేశించారు. అప్పుడు పాక్ వారిని అరెస్ట్ చేసి జైల్లో వేస్తుంది. తండేల్ కథకు ఇదే మూలం.. డి.మత్స్యలేశం గ్రామం నుంచే తండేల్ కథ మొదలౌతుంది. రాజు (నాగచైతన్య), సత్య (సాయి పల్లవి) ప్రేమికులుగానే మనకు పరిచయం అవుతారు. ప్రాణాలకు ఎదురీదుతూ సముద్రంలోకి వేటకు వెళ్లిన మత్స్యకారులు సురక్షితంగా తిరిగొస్తారనే నమ్మకం ఉండదు. వారు ఎప్పుడైతే తమ ఇంటికి చేరుతారో అప్పుడే కుటుంబ సభ్యులు ఊపిరిపోసుకుంటారు. ఇదే పాయింట్ సత్యలో భయం కలిగేలా చేస్తుంది. తను ప్రేమించిన రాజు చేపల వేట కోసం సముద్రంలోకి వెళ్తే.. ఏదైనా ప్రమాదం జరగవచ్చని అతన్ని వేటకు వెళ్లొద్దంటూ ఆమె నిరాకరిస్తుంది. అప్పటికే తండేల్ (నాయకుడు)గా ఉన్న రాజు.. సత్య మాటను కాదని వేట కోసం గుజరాత్ వెళ్తాడు. ఇక్కడ నుంచి అసలు కథ మొదలౌతుంది. సాధారణ కూలీగా ఉన్న రాజు తండేల్ ఎలా అయ్యాడు..? వేటకు వెళ్లొద్దని సత్య చెప్పినా కూడా రాజు గుజరాత్‌కు ఎందుకు వెళ్తాడు..? ఈ కారణంతో తన పెళ్లి విషయంలో ఆమె ఎలాంటి నిర్ణయం తీసుకుంది..? అందుకు ఎదురైన కారణం ఏంటి..? వేటకు వెళ్లిన వారందరూ పాక్ చెరలో ఎలా చిక్కుకుంటారు..? రాజు మీద కోపం ఉన్నప్పటికీ వారందరినీ తిరిగి ఇండియాకు రప్పించేందుకు సత్య చేసిన పోరాటం ఏంటి..? చివరగా రాజు, సత్య కలుసుకుంటారా..? అనేది తెలియాలంటే 'తండేల్' మూవీని వీక్షించాల్సిందే.Prema kosam yedu samudhralaina dhaatadaniki osthunnadu mana Thandel! 😍❤️Watch Thandel, out 7 March on Netflix in Telugu, Hindi, Tamil, Kannada & Malayalam!#ThandelOnNetflix pic.twitter.com/GIBBYHnME9— Netflix India South (@Netflix_INSouth) March 2, 2025 -
Thandel Movie Review: 'తండేల్' మూవీ రివ్యూ
టైటిల్ : తండేల్నటీనటులు: నాగచైతన్య, సాయి పల్లవి, పృథ్వీ రాజ్, ప్రకాష్ బెలవాడి, కల్ప లత తదితరులునిర్మాణ సంస్థ: గీతా ఆర్ట్స్నిర్మాతలు: బన్నీ వాసు,అల్లు అరవింద్కథ: కార్తీక్ తీడదర్శకత్వం-స్క్రీన్‌ప్లే: చందూ మొండేటిసంగీతం: దేవి శ్రీ ప్రసాద్సినిమాటోగ్రఫీ: షామ్‌దత్ సైనుదీన్విడుదల: పిబ్రవరి 7, 2025సంక్రాంతి సినిమాల సందడి తర్వాత బాక్సాఫీస్ వద్ద విడుదలవుతున్న పెద్ద సినిమా 'తండేల్' కావడంతో బజ్ బాగానే క్రియేట్ అయింది. 'లవ్ స్టోరీ' చిత్రంతో మంచి విజయం చూసిన నాగ చైతన్యకు ఆ తర్వాత సరైన హిట్ పడలేదు. గతేడాదిలో విడుదలైన కస్టడీ కూడా అభిమానులను తీవ్రంగా నిరాశపరిచింది. ఇండస్ట్రీలో సరైన హిట్ కోసం గత ఐదేళ్లుగా నాగచైతన్య ఎదురుచూస్తున్న సమయంలో దర్శకుడు చందూ మొండేటితో 'తండేల్' కథ సెట్ అయింది. కార్తికేయ 2 విజయంతో పాన్ ఇండియా రేంజ్లో ఆయనకు గుర్తింపు దక్కింది. ఆ మూవీ తర్వాతి ప్రాజెక్ట్ ఇదే కావడంతో వీరిద్దరి కాంబినేషన్ తప్పకుండా విజయాన్ని తెచ్చిపెడుతుందని అభిమానులు ఆశిస్తున్నారు. వాస్తవ ఘటనల స్ఫూర్తితో ‘తండేల్’ స్టోరీని చూపించనున్నారు. ఈ కథలో సాయి పల్లవి ఎంపిక కూడా సినిమాపై మరింత బజ్ క్రియేట్ చేసింది. ఆపై ఈ మూవీ నుంచి విడుదలైన పాటలు, ట్రైలర్ భారీ అంచనాలు పెంచాయి. దానికి తోడు ప్రమోషన్స్ కూడా ఆఖరులో పెంచేశారు. జనాల్లోకి తండేల్ చొచ్చుకుపోయాడు. భారీ అంచనాల మధ్య వచ్చిన ఈ చిత్రం ఎలా ఉంది..? నాగచైతన్య, చందూ మొండేటి ఖాతాలో బిగ్ హిట్ పడిందా లేదా..? రివ్యూలో చూద్దాం.కథేంటంటే..శ్రీకాకుళం జిల్లాకు చెందిన 22 మంది మూడు బోట్లలో గుజరాత్ వెరావల్ నుంచి బయలుదేరి చేపల వేట సాగిస్తుండగా పొరపాటున పాకిస్థాన్ ప్రాదేశిక జలాల్లోకి వారు ప్రవేశించారు. అప్పుడు పాక్ వారిని అరెస్ట్ చేసి జైల్లో వేస్తుంది. తండేల్ కథకు ఇదే మూలం.. డి.మత్స్యలేశం గ్రామం నుంచే తండేల్ కథ మొదలౌతుంది. రాజు (నాగచైతన్య), సత్య (సాయి పల్లవి) ప్రేమికులుగానే మనకు పరిచయం అవుతారు. ప్రాణాలకు ఎదురీదుతూ సముద్రంలోకి వేటకు వెళ్లిన మత్స్యకారులు సురక్షితంగా తిరిగొస్తారనే నమ్మకం ఉండదు. వారు ఎప్పుడైతే తమ ఇంటికి చేరుతారో అప్పుడే కుటుంబ సభ్యులు ఊపిరిపోసుకుంటారు. ఇదే పాయింట్ సత్యలో భయం కలిగేలా చేస్తుంది. తను ప్రేమించిన రాజు చేపల వేట కోసం సముద్రంలోకి వెళ్తే.. ఏదైనా ప్రమాదం జరగవచ్చని అతన్ని వేటకు వెళ్లొద్దంటూ ఆమె నిరాకరిస్తుంది. అప్పటికే తండేల్ (నాయకుడు)గా ఉన్న రాజు.. సత్య మాటను కాదని వేట కోసం గుజరాత్ వెళ్తాడు. ఇక్కడ నుంచి అసలు కథ మొదలౌతుంది. సాధారణ కూలీగా ఉన్న రాజు తండేల్ ఎలా అయ్యాడు..? వేటకు వెళ్లొద్దని సత్య చెప్పినా కూడా రాజు గుజరాత్‌కు ఎందుకు వెళ్తాడు..? ఈ కారణంతో తన పెళ్లి విషయంలో ఆమె ఎలాంటి నిర్ణయం తీసుకుంది..? అందుకు ఎదురైన కారణం ఏంటి..? వేటకు వెళ్లిన వారందరూ పాక్ చెరలో ఎలా చిక్కుకుంటారు..? రాజు మీద కోపం ఉన్నప్పటికీ వారందరినీ తిరిగి ఇండియాకు రప్పించేందుకు సత్య చేసిన పోరాటం ఏంటి..? చివరగా రాజు, సత్య కలుసుకుంటారా..? అనేది తెలియాలంటే థియేటర్‌కు వెళ్లి 'తండేల్' కథ పూర్తిగా తెలుసుకోవాలి.ఎలా ఉందంటేచందూ మొండేటి దర్శకత్వం నుంచి వచ్చిన సినిమాలన్ని కూడా ప్రేక్షకులకు ప్రత్యేకంగానే ఉంటాయి. నాగ చైత్యన్యతో ప్రేమమ్, సవ్యసాచి చిత్రాలను తెరకెక్కించిడంతో వారిద్దరి మధ్య బాండింగ్ ఉంది. అయితే, కార్తికేయ2 సినిమా తర్వాత ఒక బలమైన కథతో దర్శకుడు వచ్చాడు. అందుకు తగ్గట్లుగానే ఒక టీమ్‌ను రెడీ చేసుకుని తండేల్ బరిలోకి ఇద్దరూ దిగారు. అనకున్నట్లుగానే తండేల్ కోసం సాయి పల్లవి, నాగచైతన్య, దేవిశ్రీప్రసాద్, సినిమాటోగ్రఫీ షామ్‌దత్ సైనుదీన్ నాలుగు పిల్లర్లుగా నిలబడ్డారు. శ్రీకాకుళం మత్స్యకారుడిగా నాగ చైతన్య ఇరగదీశాడని చెప్పవచ్చు. తండేల్ సినిమాతో అక్కినేని ఫ్యాన్స్ కాలర్ ఎగరేసుకుని తిరొగచ్చు అనేలా ఉంది. కార్తీక్ తీడ అందించిన కథకు చందు మొండేటి తనదైన స్టైల్లో భారీ ఎమోషనల్ టచ్ ఇచ్చారు. అందుకే చాలామంది సినిమాకు కనెక్ట్ అయ్యారు.ఈ సినిమా నేపథ్యం ఇద్దరి ప్రేమకుల మధ్యనే కొనసాగుతుంది. ప్రియుడికి ఏమైనా అవుతుందేమోననే భయం ప్రియురాలిలో ఆందోళన మొదలౌతుంది. ఆ సమయంలో ఆమె పడే తపన, మానసిక సంఘర్షణ ఎలా ఉంటుందో చూపించడంలో దర్శకుడు పూర్తిగా సక్సెస్ అయ్యాడు. కథలో ఇది జరగవచ్చు అని మనం అంచనా వేస్తున్నప్పటికీ వారి మధ్య వచ్చే భావోద్వేగభరితమైన సీన్లు ప్రేక్షకుడిని కట్టిపడేస్తాయి. ఎక్కడా కూడా కథలో సాగదీతలు లేకుండా సింపుల్‌గానే దర్శకుడు ప్రారంభిస్తాడు. హీరో, హీరోయిన్ల పరిచయం ఆపై వారిద్దరి మధ్య ఉన్న బాండింగ్ ప్రతి ప్రేమికులకు కనెక్ట్ అయ్యేలా ఉంటుంది. క్షణం కూడా ఒకరినొకరు విడిచి ఉండలేని పరిస్థితిలో వారు ఉంటారు. అలాంటి సమయంలో కొంత కాలం ఎడబాటు ఏర్పడితే.. ఆ ప్రేమికుల మధ్య సంఘర్షణ ఎలా ఉంటుందో చాలా ఎమోషనల్‌గా దర్శకుడు చూపించాడు. అందుకు తోడు దేవిశ్రీ ఇచ్చిన మ్యూజిక్ కథను మరో లెవల్‌కు తీసుకెళ్తాయి.చిత్ర యూనిట్ మొదటి నుంచి ఇదొక అద్భుతమైన లవ్‌స్టోరీ అంటూ చెప్పారు. వారు చెప్పినట్లుగా ప్రేమికులు అందరూ ఈ కథకు కనెక్ట్ అవుతారు. సినిమా ఫస్ట్ కార్డ్‌లోనే రాజు వద్దని చెప్పిన సత్య.. మరో పెళ్లి చేసుకుంటానని తన తండ్రితో చెబుతుంది. ఆమె అలా చెప్పడానికి కారణం ఏంటి అనేది ఫస్టాఫ్‌లో తెలుస్తుంది. ఇక సెకండాఫ్‌లో పాకిస్తాన్ జలాల్లోకి తండేల్ టీమ్ వెళ్లడం.. అక్కడ వారు పాక్‌కు చిక్కడంతో జైలు జీవితం మొదలౌతుంది. అక్కడ వారి జైలు జీవితం ఎంత దారుణంగా ఉండేదో మన కళ్ళకు కట్టినట్లు దర్శకుడు చూపించడంలో విజయం సాధించాడు. కానీ, కథ మొత్తంలో పాకిస్తాన్ ట్రాకే మైనస్ అని కూడా చెప్పవచ్చు. సెకండాఫ్ అక్కడక్కడా కాస్త స్లో అయినట్లు ఉంటుంది. గత చిత్రాలను మనకు గుర్తు చేస్తూ కొంచెం చిరాకు తెప్పిస్తాయి.అయితే, ఒక పక్క లవ్‌స్టోరీ.. మరో సైడ్ దేశభక్తితో పర్ఫెక్ట్గా చూపించారు. చివరిగా రాజు, సత్య కలిశాడా, లేదా అనే పాయింట్‌ను చాలా ఎంగేజ్ చేస్తూ అద్భుతంగా చూపించాడు. పాన్ ఇండియా రేంజ్లో సినిమా ఉండటంతో ఈ కథలో ఆర్టికల్ 370 రద్దు వల్ల పాక్ జైల్లో వారు ఎలాంటి సమస్యల్లో పడ్డారని చూపారు. ముఖ్యంగా తండేల్ కథలో లవ్‌స్టోరీ ఎంత బలాన్ని ఇస్తుందో.. దేశభక్తి కూడా అంతే స్ట్రాంగ్‌గా ఉంటుంది. పాక్‌కు చెందిన తోటి ఖైదీలతో మన జాలర్లకు ఎదురైన చిక్కులు ఏంటి అనేది బాగా చూపారు.ఎవరెలా చేశారంటే..నాగచైతన్య నట విశ్వరూపం చూపారు. గత సినిమాలకు భిన్నంగా ఇందులో ఆయన పాత్ర ఉంటుంది. అందుకు తగ్గట్లుగానే ఆయన తగిన జాగ్రత్తలు తీసుకున్నారనిపిస్తుంది. భాషతో పాటు ఒక మత్స్యకారుడి జీవితం ఎలా ఉంటుదో మనకు చూపించాడు. వాస్తవంగా ఒక సీన్లో సాయి పల్లవి ఉంటే అందులో పూర్తి డామినేషన్ ఆమెదే ఉంటుంది. కానీ, నాగ చైతన్య చాలా సీన్స్‌లలో సాయి పల్లవిని డామినేట్ చేశాడనిపిస్తుంది. ఎమోషనల్ సీన్ల నుంచి భారీ యాక్షన్ ఎపిసోడ్ వరకు ఆయన దుమ్మురేపాడని చెప్పవచ్చు. సాయి పల్లవి పాత్ర తండేల్ సినిమాకు ఒక ప్రధాన పిల్లర్‌గా ఉంటుంది. పృథ్వీ రాజ్, నరేన్, కరుణాకరన్, రంగస్థలం మహేష్ తమ పరిధిమేరకు నటించారు. తమిళ నటుడు కరుణాకరన్ పెళ్లికొడుకుగా అందరినీ మెప్పించగా.. మంగళవారం ఫేమ్ దివ్యా పిళ్లై కూడా సాయి పల్లవితో పాటుగా కనిపిస్తూ ఉన్నప్పటికీ తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుంది.ముఖ్యంగా సినిమాటోగ్రాఫర్ షామ్‌దత్ సైనుదీన్ చాలా అద్భుతంగా చూపించాడు. ప్రతి సీన్ సూపర్ అనేలా తన కెమెరాకు పనిపెట్టాడు. దేవిశ్రీప్రసాద్ ఈ సినిమాకి ఒక మిసైల్‌లా పనిచేశాడు. పాటలకు ఆయన ఇచ్చిన మ్యూజిక్‌తో పాటు బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ కూడా అదరగొట్టేశాడు. ఈ సినిమాకు హార్ట్‌లా ఆయన మ్యూజిక్ ఉండనుంది. సినిమా నిర్మాణ విలువలు చాలా బాగున్నాయి. ఫైనల్‌గా నాగచైతన్య- సాయి పల్లవి ఖాతాలో భారీ హిట్ పడిందని చెప్పవచ్చు.- కోడూరు బ్రహ్మయ్య, సాక్షి వెబ్‌డెస్క్ -
నటుడిగా సంతృప్తినిచ్చింది – అక్కినేని నాగచైతన్య
‘‘తండేల్’ అందమైన ప్రేమకథా చిత్రం. ఈ కథలో ఆ ప్రేమ వెనుకే మిగతా లేయర్స్ ఉంటాయి. నా కెరీర్లో కథ, నా పాత్ర పరంగానే కాదు... బడ్జెట్ పరంగా పెద్ద సినిమా ఇది. ఇప్పటికే మా యూనిట్ అంతా సినిమా చూశాం... విజయంపై చాలా నమ్మకంగా ఉన్నాం. ప్రత్యేకించి సెకండ్ హాఫ్, చివరి 30 నిమిషాలు, భావోద్వేగా లతో కూడిన క్లైమాక్స్ చాలా అద్భుతంగా ఉంటాయి. నటుడిగా నాకు బాగా సంతృప్తి ఇచ్చిన చిత్రం ‘తండేల్’’ అని అక్కినేని నాగచైతన్య అన్నారు. చందు మొండేటి దర్శకత్వంలో నాగచైతన్య, సాయి పల్లవి జంటగా అల్లు అరవింద్ సమర్పణలో బన్నీ వాసు నిర్మించిన ‘తండేల్’ రేపు (శుక్రవారం) తెలుగు, తమిళ్, హిందీ భాషల్లో విడుదలవుతోంది. ఈ సందర్భంగా బుధవారం నాగచైతన్య విలేకరులతో చెప్పిన విశేషాలు ఈ విధంగా... → ‘ధూత’ వెబ్ సిరీస్ చేస్తున్నప్పుడు ‘తండేల్’ మూవీ లైన్‌ని విక్రమ్ కె. కుమార్‌గారు చెప్పారు. ఈ కథని వాసుగారు గీతా ఆర్ట్స్‌లో హోల్డ్ చేశారని తెలిసింది. ఈ కథని డెవలప్ చేసి, ఫైనల్ స్టోరీని చెప్పమని వాసుగారికి చెప్పాను. సినిమాటిక్ లాంగ్వేజ్‌లోకి మార్చిన ‘తండేల్’ కథ విన్నాక అద్భుతంగా అనిపించింది. నాకు ఎప్పటి నుంచో వాస్తవ ఘటనల ఆధారంగా సినిమా చేయాలని ఉండేది. పైగా ఇది మన తెలుగోళ్ల కథ కావడంతో రాజు పాత్ర చేయాలనే స్ఫూర్తి కలిగింది. → ‘తండేల్’ అంటే లీడర్. ఇది గుజరాతీ పదం. ఈ సినిమాని దాదాపు సముద్రంలోనే చిత్రీకరించాం. రియల్ లొకేషన్స్‌లో షూట్ చేయడం నటనకి కూడా ప్లస్ అవుతుంది. జైలు సెట్లో చిత్రీకరించిన ఎపిసోడ్స్ చాలా భావోద్వేగంగా ఉంటాయి. రాజు పాత్రకి తగ్గట్టు నేను మారాలంటే మత్స్యకారుల జీవన శైలి తెలుసుకోవాలి. అందుకే శ్రీకాకుళం వెళ్లి వాళ్లతో కొద్ది రోజులు ఉండి... హోం వర్క్ చేశాక ఈ పాత్ర చేయగలననే నమ్మకం వచ్చాకే ‘తండేల్’ జర్నీ మొదలైంది. నటుడిగా తర్వాతి స్థాయికి వెళ్లే చాన్స్ ఈ సినిమాలో కనిపించింది. దాదాపు ఎనిమిది నెలలు స్క్రిప్ట్, నా ట్రాన్స్ఫర్మేషన్ మీదే ఉన్నాను. శ్రీకాకుళం యాసలో మాట్లాడటం సవాల్‌గా అనిపించింది. → చందు, నా కాంబోలో ‘తండేల్’ మూడో సినిమా. నన్ను కొత్తగా చూపడానికి ప్రయత్నిస్తాడు. ‘‘100 పర్సెంట్ లవ్’ మూవీ తర్వాత గీతా ఆర్ట్స్‌లో మళ్లీ సినిమా చేయాలని ఎప్పట్నుంచో అనుకుంటుంటే.. ‘తండేల్’తో కుదిరింది. అరవింద్‌గారు, వాసుగారు సినిమాలు, ఎంచుకునే కథలు చాలా బాగుంటాయి. → ‘తండేల్’ షూటింగ్ కోసం కేరళ వెళ్లినప్పుడు అక్కడి కోస్ట్ గార్డ్స్ కెమేరామేన్, కొందరు యూనిట్‌ని అరెస్ట్ చేసి తీసుకెళ్లారు. ఇలా కొన్ని సవాళ్లు ఎదురయ్యాయి. ఈ సినిమా చేస్తున్నప్పుడు అవార్డులు, రికార్డులు, వసూళ్ల గురించి ఆలోచించలేదు. ప్రేక్షకులను అలరించడమే నాకు ముఖ్యం. అయితే అరవింద్‌గారు మాత్రం ‘తండేల్’ రిలీజ్ తర్వాత నేషనల్ అవార్డ్స్‌కి పంపిస్తానని అన్నారు. సినిమా కోసం నా కాస్ట్యూమ్స్‌ని డిజైనర్స్ సెలక్ట్ చేస్తుంటారు. వ్యక్తిగత విషయానికొస్తే... ట్రిప్‌లకు వెళ్లినప్పుడు షాపింగ్ చేసి, నాకు నచ్చినవి కొనుక్కుంటాను. అలాగే ఆన్లైన్ షాపింగ్ చేస్తుంటాను. అయితే ప్రస్తుతం నా డ్రెస్‌లను నా భార్య శోభిత సెలెక్ట్ చేసి, నాకు సర్ప్రైజ్ ఇస్తోంది. -
నాగచైతన్య తండేల్ మూవీ.. ఐకాన్ స్టార్ ఫ్యాన్స్‌కు అదిరిపోయే న్యూస్
అక్కినేని హీరో నాగచైతన్య ప్రస్తుతం తండేల్ మూవీతో ప్రేక్షకుల ముందుకొస్తున్నారు. చందు మొండేటి డైరెక్షన్లో వస్తోన్న ఈ చిత్రం ఫిబ్రవరి 7న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఇటీవలే వైజాగ్ వేదికగా తండేల్ మూవీ ట్రైలర్‌న కూడా మేకర్స్ రిలీజ్ చేశారు. ‘తండేల్ అంటే ఓనరా..?’, ‘ కాదు లీడర్’ అనే డైలాగ్ ఆడియన్స్‌ను విపరీతంగా ఆకట్టుకుంటోంది. మత్స్యకార బ్యాక్ డ్రాప్లో తెరకెక్కించిన ఈ చిత్రంలో నేచురల్ బ్యూటీ సాయిపల్లవి హీరోయిన్గా నటించింది.సినిమా రిలీజ్‌కు మరో వారం రోజులు మాత్రమే గడువు ఉండడంతో మేకర్స్ ప్రమోషన్స్‌తో బిజీగా ఉన్నారు. తాజాగా ఈ మూవీకి సంబంధించి ఆడియన్స్‌కు అదిరిపోయే అప్డేట్ ఇచ్చారు. తండేల్ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు ముఖ్య అతిథిగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ రానున్నట్లు చిత్రనిర్మాణ సంస్థ గీతా ఆర్ట్స్ వెల్లడించింది. ఫిబ్రవరి 1న హైదరాబాద్‌లోనే గ్రాండ్ ఈవెంట్ నిర్వహించనున్నట్లు తెలిపింది. పుష్పరాజ్ ఫర్ తండేల్ రాజ్... తండేల్ జాతర అంటూ పుష్పరాజ్ మాస్ పోస్టర్‌తో పాటు తండేల్ మూవీ పోస్టర్‌ను రిలీజ్ చేసింది. దీంతో చైతూ ఫ్యాన్స్‌తో పాటు బన్నీ అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. తండేల్ కథేంటంటే...శ్రీకాకుళం మత్స్యకార కుటుంబంలో జరిగిన కథ అధారంగా ఈ సినిమా తీస్తున్నారు. 2018లో జరిగిన యథార్థ సంఘటనల ఆధారంగా ఈ సినిమా రానుంది. శ్రీకాకుళం సాంసృతిక, సామాజిక అంశాలతో పాటు మత్స్యకారుల జీవితాలు ఎలా ఉంటాయో ఈ సినిమాలో చూపించనున్నారు. శ్రీకాకుళం జిల్లాకు చెందిన రాజు అనే జాలరి పొరపాటుగా పాకిస్థాన్ సముద్రజలాల్లోకి ప్రవేశించాడు. దీంతో పాక్ నేవి అధికారులు అరెస్ట్ చేస్తుంది. ఈ ఘటనను ఆధారం చేసుకుని తండేల్ చిత్రాన్ని నిర్మించారు. ఆ జాలరిని తిరిగి భారత్‌కు రప్పించేందుకు తన ప్రియురాలు చేసిన పోరాటం ఏంటో ఈ సినిమాలో చూడొచ్చు. 𝐏𝐔𝐒𝐇𝐏𝐀 𝐑𝐀𝐉🔥for 𝐓𝐇𝐀𝐍𝐃𝐄𝐋 𝐑𝐀𝐉𝐔 ⚓🌊ICON STAR @alluarjun garu will grace the #ThandelJaathara on February 1st in Hyderabad ❤️🔥Stay excited for more details #Thandel GRAND RELEASE WORLDWIDE ON FEBRUARY 7th.#ThandelonFeb7th #AlluArjunYuvasamrat… pic.twitter.com/W9DfVSHkEK— Geetha Arts (@GeethaArts) January 31, 2025 -
అలా జరగకపోతే నా పరువు పోతుంది: నాగచైతన్య కామెంట్స్ వైరల్
అక్కినేని నాగచైతన్య ప్రస్తుతం తండేల్ మూవీతో ప్రేక్షకుల ముందుకొస్తున్నారు. చందు మొండేటి డైరెక్షన్లో తెరకెక్కించిన ఈ చిత్రం ఫిబ్రవరిలో రిలీజ్ కానుంది. ఈ చిత్రంలో చైతూ సరసన సాయిపల్లవి హీరోయిన్ నటించింది. ఈ నేపథ్యంలో ఈ మూవీ ట్రైలర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. వైజాగ్‌లో నిర్వహించిన ఈవెంట్లో ట్రైలర్ విడుదల చేశారు. ఈ సందర్భంగా నాగచైతన్య అభిమానులతో మాట్లాడారు.నాగచైతన్య అభిమానులతో మాట్లాడుతూ.. 'వైజాగ్ నాకు ఎంతో క్లోజ్. నేను వైజాగ్ అమ్మాయిని ప్రేమించి.. పెళ్లి చేసుకున్నా. ఇప్పుడు నా ఇంట్లో కూడా వైజాగ్ ఉంది. నా ఇంట్లో రూలింగ్ పార్టీ వైజాగ్ అమ్మాయే. అభిమానులకు నా చిన్న రిక్వెస్ట్. వైజాగ్‌లో తండేల్ మూవీ కలెక్షన్స్ షేక్ అయిపోవాలి. లేదంటే ఇంట్లో నా పరువు పోతుందని' సరదాగా మాట్లాడారు. కాగా.. ఈ చిత్రం ఫిబ్రవరి 7న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రాన్ని అల్లు అరవింద్ సమర్పణలో ప్రతిష్టాత్మకమైన గీతా ఆర్ట్స్ బ్యానర్‌పై బన్నీ వాస్ నిర్మించారు.తండేల్ కథేంటంటే..శ్రీకాకుళం మత్స్యకార కుటుంబంలో జరిగిన కథ అధారంగా ఈ సినిమా తీస్తున్నారు. 2018లో జరిగిన యథార్థ సంఘటనల ఆధారంగా ఈ సినిమా రానుంది. శ్రీకాకుళం సాంసృతిక, సామాజిక అంశాలతో పాటు మత్స్యకారుల జీవితాలు ఎలా ఉంటాయో ఈ సినిమాలో చూపించనున్నారు. శ్రీకాకుళం జిల్లాకు చెందిన రాజు అనే జాలరి పొరపాటుగా పాకిస్థాన్ సముద్రజలాల్లోకి ప్రవేశించాడు. దీంతో పాక్ నేవి అధికారులు అరెస్ట్ చేస్తుంది. ఈ ఘటనను ఆధారం చేసుకుని తండేల్ చిత్రాన్ని నిర్మించారు. ఆ జాలరిని తిరిగి భారత్‌కు రప్పించేందుకు తన ప్రియురాలు చేసిన పోరాటం ఏంటన్నదే తండేల్ మూవీ కథ. వైజాగ్ లో కలెక్షన్స్ రాకపోతే పెళ్ళాం ముందు నా పరువు పోతుంది - Yuvasamrat #NagaChaitanya #SobhitaDhulipala #Thandel #TeluguFilmNagar pic.twitter.com/izN3MSaue2— Telugu FilmNagar (@telugufilmnagar) January 28, 2025 -
అక్కినేని ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్.. 'తండేల్' విడుదలపై ప్రకటన
నాగ చైతన్య, సాయి పల్లవి కాంబినేషన్లో వస్తున్న 'తండేల్' సినిమా విడుదల డేట్‌పై అధికారికంగా ప్రకటన వచ్చేసింది. క్రిస్మస్, సంక్రాంతికి ఈ సినిమా విడుదల కానుందని అందరూ అనుకున్నారు. అయితే, పలు కారణాల వల్ల ఈ అవకాశం లేకుండాపోయింది. దీంతో మరో తేదీకి తండేల్ వస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు. చందూ మొండేటి దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ చిత్రాన్ని అల్లు అరవింద్ సమర్పణలో గీతా ఆర్ట్స్ పతాకంపై ‘బన్నీ’ వాసు నిర్మిస్తున్నారు. పాన్ ఇండియ రేంజ్లో ఈ సినిమా విడుదల కానుంది.'తండేల్' సినిమా విడుదల తేదీ కోసం ఎదురుచూస్తున్న అక్కినేని ఫ్యాన్స్‌కు నిర్మాత అల్లు అరవింద్ గుడ్‌న్యూస్ చెప్పారు. పాన్ ఇండియా రేంజ్లో తెలుగుతో పాటు హిందీ, కన్నడ, తమిళ్, మలయాళంలో ఫిబ్రవరి 7న ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. మొదట డిసెంబర్ 28న 'తండేల్' విడుదల చేయాలనుకుంటే కుదరలేదని ఆయన చెప్పారు. అయితే, సంక్రాంతి కానుకగా విడుదల చేద్దామని ప్లాన్ చేస్తే ఆ సమయంలో చాలా సినిమాలు పోటీలో ఉండటంతో విరమించుకున్నట్లు అరవింద్ పేర్కొన్నారు. అలా ఫైనల్‌గా ఫిబ్రవరి 7న వస్తున్నట్లు ఆయన చెప్పారు. కార్తికేయ2 తర్వాత చందూ మొండేటి తెరకెక్కిస్తున్న చిత్రం కావడంతో భారీ అంచనాలు నెలకొన్నాయి.నాగచైతన్య- సాయి పల్లవి ప్రధాన పాత్రలలో శ్రీకాకుళం మత్స్యకార కుటుంబంలో జరిగిన కథ అధారంగా ఈ సినిమా తీస్తున్నారు. 2018లో జరిగిన యథార్థ సంఘటనల ఆధారంగా ఈ సినిమా రానుంది. శ్రీకాకుళం సాంసృతిక, సామాజిక అంశాలతో పాటు మత్స్యకారుల జీవితాలు ఎలా ఉంటాయో ఈ సినిమాలో చూపించనున్నారు. శ్రీకాకుళం జిల్లాకు చెందిన రాజు అనే జాలరి పొరపాటుగా పాకిస్థాన్ సముద్రజలాల్లోకి ప్రవేశించాడు. దీంతో పాక్ నేవి అధికారులు అరెస్ట్ చేస్తుంది. ఈ ఘటనను ఆధారం చేసుకుని తండేల్ చిత్రాన్ని నిర్మించారు. ఆ జాలరిని తిరిగి భారత్‌కు రప్పించేందుకు తన ప్రియురాలు చేసిన పోరాటం ఏంటో ఈ సినిమాలో చూడొచ్చు. -
రామ్‌చరణ్,వెంకటేష్ కోసం వారిద్దరూ ఆలోచిస్తే మేము తగ్గాల్సిందే: దర్శకుడు
నాగచైతన్య హీరోగా నటిస్తున్న పాన్ ఇండియన్ సినిమా 'తండేల్' కోసం అక్కినేని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. చందూ మొండేటి దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ చిత్రంలో సాయి పల్లవి హీరోయిన్. అల్లు అరవింద్ సమర్పణలో గీతా ఆర్ట్స్ పతాకంపై ‘బన్నీ’ వాసు నిర్మిస్తున్నారు. ఈ చిత్రం విడుదల గురించి తాజాగా దర్శకుడు చందూ మొండేటి క్లారిటీ ఇచ్చారు.'తండేల్' షూటింగ్ గురించి మాట్లాడుతూ దర్శకుడు చందూ ఇలా చెప్పుకొచ్చారు. 'సినిమా షూటింగ్ దాదాపు పూర్తి అయింది. జనవరిలో విడుదల చేసేందుకు మేము రెడీగా ఉన్నాం. ఇంకో పదిరోజులు షూట్ చేస్తే సినిమా పూర్తి అవుతుంది. కానీ, చరణ్ గారి సినిమా వస్తుందని అరవింద్ గారు.. వెంకీ మామ సినిమా వస్తుందని చైతూ గారు ఆలోచిస్తే.. మాత్రం సంక్రాంతి నుంచి తప్పుకోవాల్సి ఉంటుంది. జనవరి 26న విడుదల చేద్దామనుకుంటే ఆదివారం కాబట్టి అవకాశం లేదు. సంక్రాంతి కంటే ముందే రిలీజ్ చేయాలంటే సినిమా పూర్తి కాదు.' అని చందూ మొండేటి తెలిపారు.తండేల్ సినిమా వచ్చే ఏడాది ప్రారంభంలోనే విడుదలయ్యే ఛాన్స్ ఉంది. 'లవ్ స్టోరీ' చిత్రం తర్వాత నాగచైతన్య, సాయి పల్లవి కలిసి నటిస్తున్న రెండో చిత్రం. ఈ మూవీలో ఆమె డీగ్లామర్ పాత్రలో కనిపించనుంది. అయితే.. చైతూ- చందు మొడేటి కాంబినేషన్లో మూడో చిత్రంగా తండేల్ రానుంది. వారిద్దరి నుంచి ఇప్పటికే ప్రేమమ్, సవ్యసాచి చిత్రాలు వచ్చిన విషయం తెలిసిందే. ఈ మూవీకి దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. అక్కినేని అభిమానులకి నా విన్నప౦.. దయచేసి త౦డేల్ గురించి ఆలోచించడం మానేసి మీ లైఫ్ గురి౦చి ఆలోచి౦చ౦డి..సంక్రాంతికి రావాలని అభిమానులు ఎ౦త కోరుకున్నా వాళ్ళు మన గురి౦చి 1% కూడా ఆలోచన చేయరు..Don't west ur Time.. Skip it#BoycottThandel 🗡 #Thandel@chay_akkineni @GeethaArts pic.twitter.com/QeXSObAWr9— King Venky (@KingVenkyKv) October 29, 2024 -
టాలీవుడ్ యంగ్ హీరో సూపర్ హిట్ సిరీస్.. ఫ్యాన్స్‌కు మరో గుడ్ న్యూస్!
టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్ 2014లో విడుదలైన కార్తికేయ మూవీతో సూపర్ హిట్‌ను సొంతం చేసుకున్నారు. ఆ తర్వాత ఈ సినిమాకు కొనసాగింపుగా రూపొందించిన కార్తికేయ-2 బాక్సాఫీస్ వద్ద సూపర్‌హిట్‌గా నిలిచింది. బాలీవుడ్‌లోనూ విశేష ఆదరణ దక్కించుకుంది. ఈ చిత్రానికి చందు మొండేటి దర్శకత్వం వహించారు. దీంతో నిఖిల్ ఈ సిరీస్‌లో మరో మూవీతో అలరించేందుకు సిద్ధమయ్యారు. ఈ చిత్రాలకు కొనసాగింపుగా రానున్న కార్తికేయ-3 ప్రాజెక్ట్‌కు సంబంధించి అధికారిక ప్రకటన వెలువడింది. ఈ విషయాన్ని నిఖిల్ ట్విటర్ వేదికగా పంచుకున్నారు. 'సరికొత్త అడ్వెంచర్ సెర్చ్ చేసే పనిలో డాక్టర్ కార్తికేయ నిమగ్నమయ్యారు. త్వరలో మీ ముందుకు రానున్నాం' తాజాగా పోస్ట్ పెట్టారు. దీంతో నిఖిల్ అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. నిఖిల్ - చందు కాంబోలో మరో అడ్వెంచర్ థ్రిల్లర్ చూసేందుకు రెడీగా ఉన్నామంటూ కామెంట్స్ పెడుతున్నారు. ప్రస్తుతం ఈ ప్రాజెక్ట్ స్క్రిప్ట్ పనులు జరుగుతున్నట్లు తెలుస్తోంది. కార్తికేయ-2తో పోలిస్తే ఇది భారీ స్థాయిలో ఉండనుందని టాక్ వినిపిస్తోంది. కాగా.. చందు మొండేటి దర్శకత్వంలో నిఖిల్ హీరోగా రానున్న మూడో చిత్రంగా నిలవనుంది. 2014లో విడుదలైన కార్తికేయతో వీరి కాంబో తొలి విజయం అందుకుంది. కార్తికేయ- 2తో పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నారు. ఈ చిత్రంలో అనుపమ పరమేశ్వరన్, అనుపమ్ ఖేర్, హర్ష, శ్రీనివాసరెడ్డి కీలకపాత్రలు పోషించారు. కాగా.. నిఖిల్ ప్రస్తుతం స్వయంభు చిత్రంలో నటిస్తున్నారు. మరో వైపు చందు మొండేటి, నాగ చైతన్య కాంబోలో తండేల్ మూవీని తెరకెక్కిస్తున్నారు. Dr. Karthikeya In Search of a Brand new Adventure ... Soon🔥 @chandoomondeti #Karthikeya3 #Karthikeya2 #cinema #adventure pic.twitter.com/xoNeD3F2KI — Nikhil Siddhartha (@actor_Nikhil) March 16, 2024 -
సాయిపల్లవికి నాగచైతన్య లవ్ ప్రపోజల్.. వీడియో చూశారా?
నటుడు నాగచైతన్య వాలెంటైన్స్ రోజున ఫ్యాన్స్‌కు సర్ప్రైజ్ ఇచ్చాడు. ఇన్‌స్టాగ్రామ్‌లో ఆయన ఒక వీడియో విడుదల చేశారు. అందులో హీరోయిన్ సాయి పల్లవికి లవ్ ప్రపోజల్ చేస్తున్నట్లు ఉంది. అసలు విషయం ఏమిటంటే దర్శకుడు చందూ మొండేటి కాంబినేషన్లో వీరిద్దరూ ‘తండేల్’ చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిదే. బన్నీ వాసు నిర్మిస్తున్న ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ స్వరాలు అందిస్తున్నారు. కొద్దిరోజుల క్రితం స్పెషల్ గ్లింప్స్‌ను మేకర్స్ విడుదల చేశారు. అందులో ఓ డైలాగ్ ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతుంది. ఈ డైలాగ్‌తో ఇన్‌స్టాలో లెక్కలేనన్ని రీల్స్ వచ్చాయి. ఇప్పుడు నాగచైతన్య కూడా సాయి పల్లవితో ఒక రీల్ చేశాడు. బుజ్జి తల్లి వచ్చేస్తున్నా కదే.. కాస్తా నవ్వవే అంటూ వాలెంటైన్స్ డే విషెష్ చెప్పాడు. తండేల్ గ్లింప్స్ పట్ల వస్తున్న రెస్పాన్స్ తనకు చాలా థ్రిల్లింగ్ ఉన్నట్లు నాగచైతన్య చెప్పాడు. దానిపై నెటిజన్లు రీల్స్ చేయడం మరింత సంతోషాన్ని ఇచ్చిందని పేర్కొన్నాడు. దీంతో అందరిలా తాము కూడా ఒక రీల్ చేయాలని నిర్ణయించుకొని వాలెంటైన్స్ డే రోజున అందిస్తున్నట్లు ఆయన తెలిపాడు. View this post on Instagram A post shared by Chay Akkineni (@chayakkineni) -
రాజు మనసులో సత్య
గోకర్ణలో రాజును కలిసింది సత్య. హీరో నాగచైతన్య, దర్శకుడు చందు మొండేటి దర్శకత్వంలో రూపొందుతున్న వినూత్న ప్రేమకథా చిత్రం ‘తండేల్’. అల్లు అరవింద్ సమర్పణలో ‘బన్నీ’ వాసు నిర్మిస్తున్నారు. వాస్తవ ఘటనల ఆధారంగా రూపొందుతున్న ఈ సినిమాలో రాజు పాత్రలో నాగచైతన్య, సత్య పాత్రలో సాయిపల్లవి నటిస్తున్నారు. కాగా ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ఇటీవల ఉడిపిలో ప్రారంభమైంది. తాజాగా గోకర్ణలో ఈ సినిమా చిత్రీకరణ కొనసాగుతోంది. ఈ లొకేషన్లో నాగచైతన్య, సాయి పల్లవి కాంబినేషన్లోని సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ‘‘రాజు అనే జాలరి మనసును గెలుచుకునే పల్లెటూరి అమ్మాయి సత్య పాత్రలో సాయిపల్లవి నటిస్తున్నారు’’ అని చిత్ర యూనిట్ పేర్కొంది. ఈ చిత్రానికి సంగీతం: దేవిశ్రీ ప్రసాద్. -
ఇలా కదా సినిమా తీయాలి అనిపించింది
‘‘వాస్తవ ఘటనలతో తెరకెక్కుతోన్న ‘తండేల్’ చిత్రం స్క్రిప్ట్, ప్రీ ప్రోడక్షన్‌కి ఏడాదిన్నర పట్టింది. ప్రీప్రోడక్షన్ వర్క్‌లో ‘తండేల్’ టీమ్ అంతా కూర్చొని ప్రతి విషయాన్ని చర్చించుకున్నప్పుడు సంతోషంగా అనిపించింది. ఇలా కదా సినిమా తీయాలి అనే తృప్తి కలిగింది’’ అని నిర్మాత అల్లు అరవింద్ అన్నారు. నాగచైతన్య హీరోగా సాయి పల్లవి హీరోయిన్గా నటిస్తున్న చిత్రం ‘తండేల్’. చందు మొండేటి దర్శకత్వంలో గీతా ఆర్ట్స్ బ్యానర్‌పై అల్లు అరవింద్ సమర్పణలో ‘బన్నీ’ వాసు నిర్మిస్తున్న ఈ సినిమా శనివారం ప్రారంభమైంది. ముహూర్తం వేడుకకు హీరో నాగార్జున కెమెరా స్విచ్చాన్ చేయగా, హీరో వెంకటేశ్ క్లాప్ ఇచ్చారు. అల్లు అరవింద్ స్క్రిప్ట్‌ను దర్శకుడికి అందజేశారు. ఈ సందర్భంగా నాగచైతన్య మాట్లాడుతూ–‘‘తండేల్’ అన్ని సినిమాల్లా కాదు. బలమైన కథ, చాలా ప్రత్యేకమైనది.. కావాల్సిన సమయం తీసుకొని పక్కాగా ప్లాన్ చేసుకొని వెళ్దామని అరవింద్‌గారు ్రపోత్సహించారు. నా కెరీర్లో గుర్తుండిపోయే విజయాన్ని ‘100% లవ్’ సినిమాతో అరవింద్‌గారే ఇచ్చారు. ఇప్పుడు ‘తండేల్’ని ఆయన నిర్మించడం ఆనందంగా ఉంది’’ అన్నారు. ‘‘ఏడాదిన్నరగా ‘తండేల్’ కథపై పని చేశాం. నేను నా బెస్ట్ ఇస్తాను’’ అన్నారు చందు మొండేటి. ‘‘మూడేళ్ల క్రితం ఈ స్క్రిప్ట్ గీతా ఆర్ట్స్‌కి వచ్చింది.. అప్పటి నుంచి కథ విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకున్నాం. ఏడాదిన్నరగా ప్రీప్రోడక్షన్ పనులు జరిగాయి’’ అన్నారు ‘బన్నీ’ వాసు. ఈ చిత్రానికి సంగీతం: దేవిశ్రీ ప్రసాద్, కెమెరా: శ్యామ్‌దత్. -
నాగచైతన్య- సాయి పల్లవి ‘తండేల్’ మూవీ ప్రారంభం (ఫొటోలు)
-
మంచి మనుసు చాటుకున్న నాగ చైతన్య.. ఫోటోలు వైరల్
టాలీవుడ్ హీరో అక్కినేని నాగ చైతన్య తాజాగా హైదరాబాద్‌లోని సెయింట్ జూడ్స్ చైల్డ్‌కేర్ సెంటర్లో సందడి చేశారు. అక్కడ క్యాన్సర్‌తో పోరాడుతున్న చిన్నారులతో కొంత సమయం గడిపారు. వారి ముఖాల్లో నవ్వులు చిందించారు. నవంబర్ 14న బాలల దినోత్సవం సందర్భంగా ఆయన అక్కడికి వెళ్లినట్లు తెలుస్తోంది. ఆ సమయంలో ఆ చిన్నారులకు బహుమతులు అందించి వారితో సరదాగ గడిపారు. వారితో కాసేపు ఆటలు ఆడటమే కాకుండా అందరితో కలిసి డ్యాన్స్ చేసి వారిని సంతోషపరిచారు. వాటికి సంబంధించిన ఫోటోలు తాజాగా బయటకు వచ్చాయి. అందులో నాగ చైతన్యతో ఓ చిన్నారి ఏదో చెబుతుంటే శ్రద్ధగా వింటూ కనిపించాడు. చైతూ రాకతో చైల్డ్ కేర్ సెంటర్ అంతా సందడిగా మారింది. ఈ ఫోటోలను షేర్ చేస్తూ నాగ చైతన్య ఫ్యాన్స్ చాలా సంతోషిస్తున్నారు. ఇలాంటి మంచి కార్యక్రమాలలో పాల్గొన్న చైతూను వారు అభినందిస్తున్నారు. ఈ ఏడాది ‘కస్టడీ’తో ప్రేక్షకుల ముందుకొచ్చన నాగ చైతన్య ప్రస్తుతం చందూ మొండేటి దర్శకత్వంలో NC23 షూటింగ్‌కు రెడీగా ఉంది. మత్స్యకారుల జీవితాలను అద్దం పట్టే ఓ యథార్థ కథాంశంతో ఈ సినిమా తెరకెక్కనుంది. ఈ సినిమా కోసం ఆయన ఇప్పటికే తన లుక్‌ను మార్చుకున్నారు. ఈ క్రేజీ కాంబోలో సాయి పల్లవి హీరోయిన్గా నటిస్తుంది. మరోవైపు, నాగ చైతన్య నటించిన తొలి వెబ్‌సిరీస్ ‘దూత’ విడుదలకు సిద్ధంగా ఉంది. విక్రమ్ కె. కుమార్ దర్శకత్వం వహించిన ఈ సిరీస్ ప్రముఖ ఓటీటీ అమెజాన్ ప్రైమ్‌లో డిసెంబరు 1 నుంచి స్ట్రీమింగ్ కానుంది. ఈ సిరీస్ తెలుగు, హిందీ, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో అమెజాన్ ప్రైమ్‌లో చూడొచ్చు. At St Judes in Hyderabad, Yuvasamrat @chay_akkineni makes the kids grin ✨ A delightful Children's Day to commemorate with happy children. The young cancer fighters received the supplies they needed from #NagaChaitanya and spent valuable time with them. pic.twitter.com/2n4VwzjCqY — Shreyas Media (@shreyasgroup) November 16, 2023 -
హీరో నాగచైతన్య, హీరోయిన్ సాయి పల్లవి మళ్లీ జోడీగా ...
హీరో నాగచైతన్య, హీరోయిన్ సాయి పల్లవి మళ్లీ జోడీగా కనిపించనున్నారు. ‘లవ్ స్టోరీ’ (2021) వంటి సూపర్ హిట్ చిత్రం తర్వాత ఈ ఇద్దరూ ‘ఎన్సీ 23’లో (వర్కింగ్ టైటిల్) మరోసారి స్క్రీన్ షేర్ చేసుకుంటున్నారు. చందు మొండేటి ఈ చిత్రానికి దర్శకుడు. అల్లు అరవింద్ సమర్పణలో ‘బన్నీ’ వాసు నిర్మించనున్న ఈ సినిమా ప్రీప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. ఈ సినిమాలో సాయిపల్లవి హీరోయిన్గా నటిస్తున్నట్లు బుధవారం మేకర్స్ ప్రకటించారు. ‘‘వాస్తవ ఘటనల ఆధారంగా తెరకెక్కనున్న చిత్రమిది. నాగచైతన్య, చందు మొండేటి కెరీర్లో భారీ బడ్జెట్ చిత్రం అవుతుంది. త్వరలోనే షూటింగ్ ్ర΄ారంభిస్తాం’’ అని యూనిట్ పేర్కొంది. -
ఎట్టకేలకు టాలీవుడ్ ఎంట్రీకి సిద్ధమైన సూర్య!
కోలీవుడ్ కథానాయకులు తెలుగు చిత్రాల్లో నటించడం ఇప్పుడు కొత్తేమీ కాదు. నట దిగ్గజం శివాజీ గణేషన్ నుంచి తాజాగా ధనుష్ వరకు ఎంతోమంది తెలుగు ప్రేక్షకులను అలరించిన వారే. ఇందులో నటుడు కార్తీ, విజయ్ వంటి వారు కూడా ఉన్నారు. ఐతే నటుడు సూర్య మాత్రం నేరుగా తెలుగు చిత్రాల్లో ఇంతవరకు నటించనేలేదు. కానీ ఈయన నటించిన పలు తమిళ చిత్రాలు ఇక్కడ అనువాదం అయ్యి విజయం సాధించాయి. అయితే సూర్యను తెలుగులో పరిచయం చేయాలని చాలా మంది దర్శక నిర్మాతలు ప్రయత్నాలు చేస్తున్నారు. అది త్వరలోనే జరగబోతుందనేది తాజా సమాచారం. ఇటీవల కార్తికేయ– 2 చిత్రంతో ఘన విజయాన్ని అందుకున్న దర్శకుడు చందు మొండేటి దర్శకత్వంలో సూర్య నటించడానికి సమ్మతించినట్లు ఆయనే ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. తాను చెప్పిన సింగిల్ లైన్ స్టోరీ సూర్యకు నచ్చినట్లు పేర్కొన్నారు. ఆయన తరచూ తనకు ఫోన్ చేసి కథ గురించి అడుగుతున్నారని చెప్పారు. తానిప్పుడు సూర్య కోసం కథను సిద్ధం చేస్తున్నట్లు చెప్పారు. సూర్య కమిట్ అయిన చిత్రాలను పూర్తి చేసిన తరువాత తన దర్శకత్వంలో ఆయన నటిస్తారని పేర్కొన్నారు. కాగా ఈయన సూర్య కోసం సోషియో ఫాంటసీ కథను సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. అదేవిధంగా ఇది కచ్చితంగా పాన్ ఇండియా చిత్రం అవుతుందని భావించవచ్చు. కాగా ప్రస్తుతం చందు మొండేటి నటుడు నాగచైతన్యతో ఓ సినిమా చేస్తున్నాడు. చదవండి: National film awards 2023: జాతీయ అవార్డుల జాబితా ఇదే! -
శ్రీకాకుళంలో పర్యటించిన హీరో నాగ చైతన్య, చందు, బన్నీ వాసు (ఫొటోలు)
-
జాలరి పాత్రలో చైతూ.. మత్స్యకారులతో కలిసి!
‘ప్రేమమ్, సవ్యసాచి’ వంటి చిత్రాల తర్వాత హీరో నాగచైతన్య, డైరెక్టర్ చందు మొండేటి కాంబినేషన్లో మూడో సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. గీతా ఆర్ట్స్ పతాకంపై అల్లు అరవింద్ ఈ సినిమాను నిర్మించనున్నారు. శ్రీకాకుళం, గుజరాత్ నేపథ్యంలోని మత్స్యకారుల జీవితాలను ఆవిష్కరించేలా ఈ సినిమా కథ ఉంటుందట. ఇందులో చైతన్య మత్స్యకారుడిగా కనిపించనున్నారని సమాచారం. అందుకే మత్స్యకారులను స్వయంగా కలిసి వారి జీవిత విశేషాలను తెలుసుకునేందుకు వైజాగ్ వెళ్లారు నాగచైతన్య, చందు మొండేటి, ‘బన్నీ’ వాసు. మూడు రోజుల ΄ాటు అక్కడే ఉండి పూర్తి వివరాలు తెలుసుకుంటారు. అలాగే సముద్ర యానం కూడా చేయాలను కుంటున్నారు. ఇక ఈ మూవీకి ‘తండెల్’ అనే టైటిల్‌ని పరిశీలిస్తున్నట్లు టాక్. శ్రీకాకుళంలో మత్స్యకారులను తండెల్ అని పిలుస్తారట. -
నార్నే నితిన్ కొత్త సినిమా షురూ
హీరో ఎన్టీఆర్ బావమరిది నార్నే నితిన్ హీరోగా కొత్త సినిమా షురూ అయింది. అంజిబాబు కంచిపల్లి దర్శకుడిగా పరిచయమవుతున్న ఈ చిత్రంలో నయన్ సారిక హీరోయిన్గా నటిస్తున్నారు. అల్లు అరవింద్ సమర్పణలో జీఏ 2 పిక్చర్స్‌పై బన్నీ వాసు, విద్యా కొప్పినీడి నిర్మిస్తున్న ఈ చిత్రం గురువారం ప్రారంభమైంది. తొలి సన్నివేశానికి నిర్మాత ‘దిల్’ రాజు కెమెరా స్విచ్చాన్ చేయగా, నిర్మాత అల్లు అరవింద్ క్లాప్ కొట్టారు. డైరెక్టర్ చందు మొండేటి గౌరవ దర్శకత్వం వహించగా, దర్శకుడు మారుతి స్క్రిప్ట్‌ను మేకర్స్‌కు అందించారు. ‘‘జీఏ 2 బ్యానర్లో ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న చిత్రమిది’’ అన్నారు మేకర్స్. ఈ చిత్రానికి సహనిర్మాత: ఎస్కేఎన్, కెమెరా: సమీర్ కళ్యాణ్, సంగీతం: రామ్ మిర్యాల, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్స్: భానుప్రతాప్, రియాజ్ చౌదరి, అజయ్ గద్దె. -
చైతూకి జోడీ?
హీరో నాగచైతన్య సరసన కీర్తీ సురేష్ హీరోయిన్గా నటించనున్నారన్నది ఫిల్మ్‌నగర్ టాక్. ‘ప్రేమమ్’, ‘సవ్యసాచి’ చిత్రాల తర్వాత హీరో నాగచైతన్య, దర్శకుడు చందూ మొండేటి కాంబినేషన్లో మరో సినిమా రూ΄÷ందనుందనే వార్తలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలోనే కీర్తీ సురేష్ కథానాయికగా నటించనున్నారట. సూరత్ బ్యాక్‌డ్రాప్‌లో సాగే ఈ లవ్‌స్టోరీలో నాగచైతన్య బోటు డ్రైవర్ ΄ాత్రలో నటించనున్నారని, జీఏ2 పిక్చర్స్ ఈ చిత్రాన్ని నిర్మించనుందని ప్రచారం జరుగుతోంది. కాగా హీరోయిన్ ΄ాత్ర కోసం కీర్తీ సురేష్, అనుపమా పరమేశ్వరన్ తదితర పేర్లను చందు పరిశీలిస్తున్నారట. కీర్తీ సురేష్‌ని ఫైనలైజ్ చేశారని భోగట్టా. మరి.. నాగచైతన్య, కీర్తీ సురేష్‌ల జోడీ కుదురుతుందా? వేచి చూడాల్సిందే. -
బయోపిక్ లో నాగచైతన్య...!
-
ఇండియన్ మోస్ట్ వాంటెడ్ డైరెక్టర్
-
బోటు డ్రైవర్..?
హీరో నాగచైతన్య బోటు డ్రైవర్‌గా మారనున్నారట. చందు మొండేటి దర్శకత్వంలో నాగచైతన్య హీరోగా ఓ సినిమా రూపొందనుందనే టాక్ వినిపిస్తున్న సంగతి తెలిసిందే. అల్లు అరవింద్ ఈ సినిమాను నిర్మించనున్నారట. ఈ సినిమా వాస్తవ ఘటనల ఆధారంగా తెరకెక్కనుందని, కథ రీత్యా నాగచైతన్య బోటు డ్రైవర్ పాత్రలో కనిపిస్తారనే వార్త తెరపైకి వచ్చింది. అంతేకాదు.. ఈ చిత్రం సూరత్ బ్యాక్‌డ్రాప్‌లో ఉంటుందట. ఈ అంశాలపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. -
ఎట్టకేలకు ఓ ఇంటివాడైన నాగచైతన్య.. ఫోటో వైరల్
అక్కినేని హీరో నాగచైతన్య ఎట్టకేలకు ఓ ఇంటివాడు అయ్యాడు. సమంతతో విడిపోయిన తర్వాత ఎక్కువగా హోటల్స్‌లోనే ఉంటున్న నాగచైతన్య తాజాగా కొత్త ఇల్లు నిర్మించుకున్నాడు. ఉగాది సందర్భంగా కొత్తింట్లోకి గృహప్రవేశం చేశాడు. నాగార్జున ఇంటికి దగ్గర్లోనే ఓ స్థలం కొన్న చై తన అభిరుచికి తగ్గట్లుగా ఇంటిని డిజైన్ చేయించుకున్నాడట. స్విమ్మింగ్ పూల్, అందమైన గార్డెన్, జిమ్, థియేటర్ సహా విలాసవంతంగా ఇంటిని రెడీ చేసుకొని ఎలాంటి హడావిడి, ఆర్భాటం లేకుండా కొత్త ఇంట్లోకి ప్రవేశించాడు. ఇక చైతూ ఇంట్లోకి మొదటి అతిథి మరెవరో కాదు.. ప్రేమమ్ సినిమాతో చైకు హిట్ ఇచ్చిన చందూ మొండేటి. ఈ విషయాన్ని స్వయంగా ఆయనే ఇన్‌స్టా వేదికగా షేర్ చేసుకున్నారు. ఉగాది రోజున యువసామ్రాట్ కొత్త ఇళ్ళు. నేనే మొదటి అతిథి. కంగ్రాట్యూలేషన్ అండ్ థాంక్యూ నాగ చైతన్య అంటూ చందూ మొండేటి ఓ ఫోటోను పంచుకోగా ప్రస్తుతం ఈ పిక్ నెట్టింట వైరల్‌గా మారింది. View this post on Instagram A post shared by Chandoo Mondeti (@chandoo.mondeti) -
కార్తికేయ 2 హీరో, దర్శకుడికి హ్యాట్సాఫ్: పరుచూరి గోపాలకృష్ణ
కార్తికేయ 2 సినిమా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల ప్రళయాన్నే సృష్టించింది. యంగ్ హీరో నిఖిల్ సిద్దార్థ్ కెరీర్లోనే అత్యధిక వసూళ్లు రాబట్టిన చిత్రంగా నిలిచింది. ఈ ఏడాది ఆగస్టు 13న రిలీజైన ఈ మూవీ రూ.130 కోట్లకు పైగా రాబట్టింది. తాజాగా ఈ సినిమాలోని బలాబలాలను విశ్లేషించాడు పరుచూరి గోపాలకృష్ణ. 'కష్టేఫలి అన్న సూత్రం నిఖిల్ విషయంలో నిరూపితమైంది. కార్తికేయ 2.. బడ్జెట్ కంటే నాలుగు రెట్లు ఎక్కువ లాభాలు తెచ్చిపెట్టింది. చందూ మొండేటి... ఈ జానపద కథను సాంఘిక కథగా మలిచి రాసినట్లు అనిపించింది. కథను నమ్మితే ఆ కథ ఎప్పుడూ మనల్ని మోసం చేయదు. సినిమాలో తల్లి సెంటిమెంట్‌ను వాడుకున్నారు. ఇద్దరు కమెడియన్స్‌ను, హీరోయిన్ను హీరో పక్కన పెట్టుకున్నాడు. సామాన్యంగా ఇలాంటి సినిమాల్లో ప్రేమ మిస్ అవుతుంది. తెలివిగా చందూ మొండేటిగారు ఏం చేశారంటే ప్రతి ఫ్రేములోనూ హీరో హీరోయిన్ ఉండేలా జాగ్రత్తగా రాసుకున్నారు. మధ్యలో హీరోయిన్.. హీరోకు ఝలక్ ఇచ్చి వెళ్లిపోయినట్లు చీట్ చేసినా మళ్లీ తిరిగొచ్చినట్లు చేశారు. క్లైమాక్స్‌లో హీరో పాముల మధ్యలో నడుచుకుంటూ వెళ్లి హంసను తీసుకువచ్చి మురళీకి తగిలించి కృష్ణుడి చేతిలో పెట్టేవరకు కూడా అద్భుతమైన స్క్రీన్‌ప్లే రాశారు చందు మొండేటి. నాలాగా చాలా సినిమాలు రాసిన కొద్దిమంది తప్ప మామూలు ప్రేక్షకులు దాన్ని క్యాచ్ చేయలేరు. చివర్లో కార్తికేయ 2కు సీక్వెల్ ఉంటుందని హింటిచ్చారు. చందూ మొండేటి అత్యంత సాహసం చేశారు. అతడి కెరీర్లో భారీ మొత్తంలో ఖర్చు పెట్టి సినిమా తీశారు. ఎవరికీ అమ్ముడుపోకుండా ప్రపంచానికి మంచి జరగాలనే కోరికతో దీన్ని ముగించారు. స్క్రీన్‌ప్లేలో ఎలాంటి దోషం లేదు. కావాలని కామెడీ సీన్స్ చొప్పించలేదు. కార్తికేయ 2ను కోట్లాది మంది చూడటం అంటే మామూలు విషయం కాదు. హీరో, దర్శకుడికి హ్యాట్సాఫ్' అని చెప్పుకొచ్చాడు పరుచూరి గోపాలకృష్ణ. చదవండి: నెట్‌ఫ్లిక్స్‌లో నాగార్జున ఘోస్ట్, స్ట్రీమింగ్ ఎప్పుడంటే? జైలుకు వెళ్లే డిజాస్టర్ కంటెస్టెంట్ ఎవరంటే? -
కలెక్షన్లలో కార్తీకేయ 2 అదుర్స్.. బాలీవుడ్‌లోనూ తగ్గేదేలే
యంగ్ హీరో నిఖిల్ సిద్ధార్థ్ హీరోగా నటించిన కార్తికేయ 2 మూవీ బాలీవుడ్‌లోనూ కలెక్షన్లతో అదరగొడుతోంది. ఈ ఏడాది టాలీవుడ్‌తో పాటు బాలీవుడ్లో అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాల్లో ఒకటిగా నిలిచింది. కేవలం నెల రోజుల్లోనే 31 కోట్లకు పైగా వసూళ్లు సాధించినట్లు సినిమా వర్గాలు అంటున్నాయి. ఈ సినిమా సక్సెస్ ఊహించని రీతిలో డిస్ట్రిబ్యూటర్లకు లాభాలను తెచ్చిపెట్టింది. బాలీవుడ్లో ఈ సినిమా థియేట్రికల్ బిజినెస్ నాలుగున్నర కోట్ల వరకు జరిగినట్లు తెలుస్తోంది. గతంలో నిఖిల్ బాలీవుడ్ సినిమాలు చేయకపోయినా పెద్దమొత్తంలో కలెక్షన్లు రావడం సినీ వర్గాలను ఆశ్చర్యానికి గురిచేసింది. నిఖిల్ జంటగా అనుపమ పరమేశ్వరన్ ఈ సినిమాతో నటించింది. (చదవండి: Karthikeya 2 Movie-Nikhil: శ్రీవారిని దర్శించుకున్న కార్తీకేయ 2 మూవీ టీం) ఎలాంటి అంచనాలు లేకుండా ఆగస్ట్ 13న విడుదలైన ఈ చిత్రం టాలీవుడ్లో ఊహించని విజయాన్ని అందుకుంది. తెలుగులో దాదాపు అరవై కోట్లకుపైగా కలెక్షన్లతో విజయాన్ని అందుకుంది. చిన్న సినిమా అయినప్పటికీ అందరి అంచనాలు తలకిందులుగా చేస్తూ ప్రపంచవ్యాప్తంగా 130 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టినట్లు తెలుస్తోంది. కలియుగ సృష్టి రహస్యాలను పొందుపరిచిన కృష్ణుడి కంకణాన్ని దుష్ట శక్తుల నుంచి కాపాడే ఓ యువకుడి కథతో దర్శకుడు చందూ మొండేటి ఈ సినిమాను తెరకెక్కించారు. కీలకమైన అతిథి పాత్రలో బాలీవుడ్ నటుడు అనుపమ్ ఖేర్ ఈ చిత్రంలో కనువిందు చేశారు. -
వంద కోట్ల క్లబ్లో చేరే దిశగా కార్తికేయ 2
హీరో నిఖిల్ సిద్దార్థ్ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం కార్తికేయ 2. చందూ మొండేటి దర్శకత్వం వహించిన ఈ మూవీలో అనుపమ పరమేశ్వరన్ కథానాయికగా నటించింది. ఆగస్టు 13న రిలీజైన ఈ చిత్రం టాలీవుడ్లో, బాలీవుడ్లో ఓ రేంజ్లో దూసుకుపోతోంది. రోజులు గడిచేకోద్దీ వసూళ్లు తగ్గుతాయి. కానీ ఈ సినిమా మాత్రం ఏరోజుకారోజు అధిక వసూళ్లు సాధిస్తూ రికార్డులు సృష్టిస్తోంది. తాజాగా ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ.75.33 కోట్లు రాబట్టింది. ఈ సినిమా దూకుడు చూస్తుంటే త్వరలోనే వంద కోట్ల క్లబ్లో చేరేట్లు కనిపిస్తోంది. Thank You🙏🏽 Indian Movie Lovers ki 🙏🏽🙏🏽🙏🏽🔥 #Karthikeya2 #Karthikeya2Hindi pic.twitter.com/CL7a5Uuthj — Nikhil Siddhartha (@actor_Nikhil) August 22, 2022 #Karthikeya2Hindi growth is outstanding. 2nd week numbers- Fri: ₹2.46 cr Sat: ₹3.04 cr Sun: ₹4.07 cr Total: ₹15.32 cr 🔥 At the same time, a film starring Tapsee and directed by Anurag Kashyap #Dobaaraa gets Fri: ₹72 lacs Sat: ₹1.02 cr Sun: ₹1.24 cr Total: ₹2.98 cr pic.twitter.com/vsMVigH3Ii — idlebrain jeevi (@idlebrainjeevi) August 22, 2022 చదవండి: విడాకుల తర్వాత ఒక్కటిగా కనిపించిన ధనుష్, ఐశ్వర్య.. ఫొటో వైరల్ నెపోటిజంపై నోరు విప్పిన నాగ చైతన్య.. ఏమన్నాడంటే -
శ్రీవారిని దర్శించుకున్న కార్తీకేయ 2 మూవీ టీం
యంగ్ హీరో నిఖిల్ సిద్ధార్థ్ తాజాగా నటించిన చిత్రం కార్తికేయ 2. ఆగస్ట్ 13న విడుదలైన ఈ చిత్రం ఊహించని విజయం సొంతం చేసుకుంది. బాలీవుడ్లో ఈ మూవీకి విపరీతమైన రెస్పాన్స్ వస్తోంది. హిందీలో తొలిరోజు కేవలం 50 థియేటర్స్‌లో విడుదల చేస్తే అది ఆరో రోజు వచ్చేసరికి 1000 థియేటర్స్‌లలో విజయవంతంగా ఆడుతోంది. ఇక ఈమూవీ సక్సెస్ నేపథ్యంలో నేడు(శనివారం) హీరో నిఖిల్, కార్తికేయ 2 టీం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. చదవండి: కరీనాకు ‘ది కశ్మీర్ ఫైల్స్’ డైరెక్టర్ చురక, ఆమె కామెంట్స్‌పై ఘాటు స్పందన ఉదయం వీఐపీ దర్శన సమయంలో హీరో నిఖిల్‌తో పాటు డైరెక్టర్ చందు మొండేటి, నిర్మాత అభిషేక్ అగర్వాల్, ఇతర టీం సభ్యులు స్వామివారిని దర్శించుకుని మొక్కలు చెల్లించుకున్నారు. ఈ సందర్బంగా ఆలయ అర్చకులకు వారిని ఆశీర్వదించి తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఆనంతరం మీడియాతో మాట్లాడుతూ.. కార్తికేయ 2 మంచి విజయం సాధించడంతో స్వామివారిని దర్శించుకున్నామని మూవీ టీం పేర్కొంది. ఇక నిఖిల్ మాట్లాడుతూ.. ‘కార్తికేయ 2 సినిమాకు ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ లభిస్తోంది. సినిమా విజయవంతం కావడంతో స్వామి వారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నాం’ అని తెలిపాడు. Went, Thanked and took the blessings of Tirumala Venkateshwara Swamy for bestowing team #Karthikeya2 with this Success 🙏🏽 @AbhishekOfficl @vishwaprasadtg @Actorysr @chandoomondeti @MayankOfficl @sahisuresh #Karthikeya2Hindi pic.twitter.com/lDCNNXogFf — Nikhil Siddhartha (@actor_Nikhil) August 20, 2022 -
50 థియేటర్లని సరదాగా అనుకుంటే, ఇప్పుడేమో..: అల్లు అరవింద్
Allu Aravind Speech In Karthikeya 2 Success Meet: క్రేజీ నిర్మాణ సంస్థలు పీపుల్స్ మీడియా ఫ్యాక్టరి, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్స్‌పై ఎనర్జిటిక్ యంగ్ హీరో నిఖిల్, అనుపమ పరమేశ్వరన్ జంటగా నటించిన చిత్రం "కార్తికేయ 2". ఈ సినిమాకు చందు మొండేటి దర్శకత్వం వహించారు. మంచి విజయం సాధించిన 'కార్తికేయక'కు సీక్వెల్‌గా వచ్చిన ఈ చిత్రాన్ని టి.జి. విశ్వప్రసాద్, అభిషేక్ అగర్వాల్ సంయుక్తంగా నిర్మించారు. ఈ నెల 13న థియేటర్స్‌లలో విడుదలై సక్సెస్‌ఫుల్‌గా ప్రదర్శితమవుతున్న సందర్బంగా చిత్ర యూనిట్ సక్సెస్ మీట్‌ను హైదరాబాద్‌లో ఘనంగా నిర్వహించింది. ఈ కార్యక్రమంలో ప్రముఖ నిర్మాతలు అల్లు అరవింద్, దిల్ రాజు, డైరెక్టర్ శ్రీ వాసు, మైత్రి అధినేత నవీన్ ఏర్నేని తదితరులు పాల్గొన్నారు. ముఖ్య అతిథిగా వచ్చిన నిర్మాత అల్లు అరవింద్ మాట్లాడుతూ.. ''ఈ సినిమాను హిందీలో సరదాగా రిలీజ్ చేద్దామని 50 థియేటర్స్‌లలో విడుదల చేస్తే అది రెండో రోజుకు 200 థియేటర్స్ అయింది. ప్రస్తుతం 700 థియేటర్స్‌లలో ఆడుతుంది. అంటే ఇవాళ భాష అనే బారికేడ్లను దాటుకొని ప్రజల గుండెల్లోకి వెళ్లింది అంటే సినిమాలో సత్తా లేకుంటే అలా జరగదు కదా. ఇలా అన్ని థియేటర్స్‌లలో ఆడదు కదా. కాబట్టి ఈ సినిమా ఇంకా పెద్ద విజయం సాదించాలి'' అని తెలిపారు. మా సినిమాను ఇంత పెద్ద హిట్ చేసిన ప్రేక్షకులకు ధన్యవాదాలు. చందు మొండేటి చాలా హార్డ్ వర్క్ చేశాడు. నిఖిల్, అనుపమ, టెక్నీకల్ టీం అందరూ బాగా సపోర్ట్ చేయడంతో సినిమా బాగా వచ్చింది అని చిత్ర నిర్మాత విశ్వ ప్రసాద్ పేర్కొన్నారు. చదవండి: ప్రభాస్ విషయంలో ఆ నిర్మాత వెనుకడుగు.. కారణం అదేనా? మహేశ్ బాబు థియేటర్లో దళపతి విజయ్.. వీడియో వైరల్ ''ఈ సినిమా ఒక్క తెలుగులోనే కాకుండా హిందీలో కూడా బాగా ఆడుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది. మా సినిమాను ఇంత పెద్ద హిట్ చేసినందుకు ఆడియెన్స్‌కు కృతజ్ఞతలు'' అని హీరో నిఖిల్ తెలిపాడు. ''సినిమా చూస్తుంటే చాలా కొత్తగా ఉంది. అందరూ కొత్త యాక్టర్స్ లా చాలా బాగా నటించారు. వీరందరికీ ఇది 2.0 అనుకోవచ్చు. ఈ సినిమా ఇన్స్పిరేషన్ గా తీసుకొని ముందుకు వెళ్లాలని కోరుకుంటున్నాను'' అని దర్శకుడు శ్రీ వాస్ పేర్కొన్నాడు. ''మా చిత్ర నిర్మాతల సహకారం మరువలేనిది. నాకింత మంచి అవకాశం ఇచ్చిన నిర్మాతలకు ధన్యవాదాలు'' అని డైరెక్టర్ చందు మొండేటి తెలిపాడు. చదవండి: నేను పెళ్లి చేసుకునే సమయానికే ఆమెకు ఒక బాబు: బ్రహ్మాజీ సిల్క్ స్మిత బయోపిక్కు రానున్న సీక్వెల్.. ఈసారి ఏ హీరోయిన్? బిగ్‌బాస్ బ్యూటీకి లైంగిక వేధింపులు.. ఆవేదనతో పోస్ట్ -
నిర్మాతలు ఆ విషయం చెప్పడం సంతోషంగా ఉంది: నిఖిల్
‘‘కార్తికేయ’ సినిమా చూశాను.. బాగుంది. ఆ సినిమాలానే ‘కార్తికేయ 2’ కూడా మంచి హిట్ కావాలని కోరుకుంటున్నాను. తెలుగు చిత్రపరిశ్రమ మూడు పువ్వులు ఆరుకాయలుగా ముందుకు వెళ్లాలి’’ అని తెలంగాణ రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. నిఖిల్, అనుపమా పరమేశ్వరన్ జంటగా చందు మొండేటి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘కార్తికేయ 2’. టీజీ విశ్వప్రసాద్, అభిషేక్ అగర్వాల్ నిర్మించిన ఈ సినిమా నేడు విడుదలవుతోంది. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రీ రిలీజ్ వేడుకలో ప్రముఖ దర్శకులు సింగీతం శ్రీనివాసరావు మాట్లాడుతూ– ‘‘కార్తికేయ 2’ తీసిన స్పిరిట్ నన్ను ఇక్కడికి నడిపించింది. ఇండస్ట్రీకి క్లిష్ట పరిస్థితి వచ్చినప్పుడు, సినిమానే దాన్ని అధిగమిస్తుంది.. ఎటువంటి పరిస్థితులకి ఇండస్ట్రీ లొంగలేదు’’ అన్నారు. ‘ ‘కొన్ని సినిమాలు ఆడవని తెలిసినా మొహమాటానికి కొన్నిసార్లు ఫంక్షన్స్‌కి రావాల్సి ఉంటుంది. కానీ, ‘కార్తికేయ 2’ చాలా బాగుంది’’ అన్నారు ఎంపీ, రచయిత విజయేంద్ర ప్రసాద్. ‘మా సినిమా కచ్చితంగా బాగుంటుంది’’ అన్నారు చందు మొండేటి. ‘‘మంచి కంటెంట్‌తో సినిమాలు చేస్తే ఆడియన్స్ థియేటర్‌కి వస్తారని ఇటీవల ‘బింబిసార, సీతారామం’ నిరూపించాయి. అలానే మా సినిమాకి కూడా బుకింగ్స్ బాగున్నాయని మా నిర్మాతలు చెప్పడం సంతోషంగా ఉంది’’ అన్నారు నిఖిల్. -
స్లోగా వెళుతున్నాను అంతే... డౌన్ కాలేదు
‘‘హిస్టరీ వర్సెస్ మైథాలజీగా ‘కార్తికేయ 2’ తీశాం. ఇందులో ప్రతి సీన్‌కు ఒక మీనింగ్ ఉంటుంది. మిస్టరీ, సస్పెన్స్, థ్రిల్లింగ్ అంశాలున్నాయి. దేవుడు ఉన్నాడా? లేదా అనేవారికి మా సినిమా నచ్చుతుంది. దేవుడంటే ఏంటి? అనేది ఈ చిత్రంలో చూపించాం’’ అన్నారు నిఖిల్. చందు మొండేటి దర్శకత్వంలో నిఖిల్, అనుపమా పరమేశ్వరన్ జంటగా నటించిన చిత్రం ‘కార్తికేయ 2’. టీజీ విశ్వప్రసాద్, అభిషేక్ అగర్వాల్ నిర్మించిన ఈ సినిమా రేపు రిలీజ్ అవుతోంది. ఈ సందర్భంగా నిఖిల్ చెప్పిన విశేషాలు. ► ‘కార్తికేయ’ కంటే ‘కార్తికేయ 2’కి చందూగారు కథ, మాటలు చాలా బాగా రాసుకున్నారు. ఈ సినిమాలో ఫుల్ టైమ్ డాక్టర్‌గా, పార్ట్ టైమ్ డిటెక్టివ్‌గా నటించాను. ఎక్కడ సమస్య ఉంటే అక్కడికి వెళ్లి, సాహసం చేసే పాత్ర నాది. ఎక్కడా గ్రాఫిక్స్ పెట్టలేదు. ఈ సినిమా కొంత నార్త్‌లో జరుగుతుంది కాబట్టి అనుపమ్ ఖేర్గారిని తీసుకున్నాం. ► ‘కార్తికేయ 2’ని అన్ని భాషల్లో డబ్ చేశాం. వేరే భాషల్లో నా సినిమా విడుదలవడం ఇదే తొలిసారి. కాలభైరవ మంచి బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఇచ్చారు. ఇందులోని మూడు పాటలు చాలా బాగుంటాయి. సాహస కథలైన టిన్ టిన్ బుక్స్ అంటే నాకు బాగా ఇష్టం.. బాగా చదివేవాణ్ణి. చందూకి కూడా చాలా ఇష్టం. హాలీవుడ్ ‘ఇండియానా జోన్స్’ చిత్రకథల్లా మనకు కూడా ఎన్నో కథలు ఉన్నాయి. అవన్నీ తీసి, భారతీయ సినిమా గొప్పతనాన్ని చూపించాలనుకుంటున్నాం. ► ప్రస్తుతం విలన్ క్యారెక్టర్ అనేది మర్చిపోవాల్సిందే. ఎందుకంటే ‘బ్యాట్ మేన్’ మూవీలో హీరో, విలన్.. ఇద్దరి పాత్రలు సమానంగా ఉంటాయి. మంచి క్యారెక్టర్స్ వస్తే తప్పకుండా విలన్‌గా చేస్తాను. నేను నటించిన ‘18 పేజెస్’ సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. సుధీర్ వర్మతో ఒక సినిమా చేస్తున్నాను. ఈ ఏడాది చివర విడుదలయ్యే నా ‘స్పై’ చిత్రాన్ని మల్టీ లాంగ్వేజ్‌లలో తీస్తున్నాం. నా కెరీర్ స్లోగా పైకి వెళుతోంది తప్ప ఇప్పటివరకు డౌన్ కాలేదు.. ప్రస్తుతం అన్ని విధాలుగా నేను చాలా హ్యాపీగా ఉన్నాను’’ అన్నారు. -
అందుకే ‘కార్తికేయ 2’కి స్వాతిని తీసుకోలేదు : దర్శకుడు క్లారిటీ
‘చిన్నప్పటినుండి నాకు రామాయణం, మహా భారతం పుస్తకాలు ఎక్కువగా చదవేవాన్ని. ఆలా ఇతిహాసాలపై ఎక్కువ ఇంట్రెస్ట్ గా ఉండడం వలన కృష్ణతత్వం అనే పాయింట్ తీసుకొని కార్తీకేయ సినిమా చేయడం జరిగింది. దేవుడు అంటే ఒక క్రమశిక్షణ.. మనం నమ్మే దంతా కూడా సైన్స్ తో ముడిపడి ఉంటుంది. శ్రీకృష్ణుడు గురించి చెప్పడం అంటే అనంతం. శ్రీకృష్ణుడు ద్వారకాలో ఉన్నాడా లేదా అన్నది ఒక చిన్నపాయింట్ బట్టి ‘కార్తికేయ2’ తీశాను’అని దర్శకుడు చందూ మొండేటి అన్నారు. యంగ్ హీరో నిఖిల్, అనుపమ పరమేశ్వరన్ జంటగా చందు మొండేటి దర్శకత్వంలో కార్తికేయకి సీక్వెల్ గా వస్తున్న చిత్రం కార్తికేయ 2. ఈ చిత్రాన్ని పీపుల్స్ మీడియా ఫ్యాక్టరి, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బేనర్స్ పై టి.జి. విశ్వప్రసాద్, అభిషేక్ అగర్వాల్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఆగస్ట్ 13న ప్రపంచ వ్యాప్తంగా విడుదల అవుతోంది.మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా తాజాగా దర్శకుడు చందూ మొండేటి మీడియాతో ముచ్చటించారు. ఆ విశేషాలు.. ► కృష్ణ తత్త్వం కాన్సెప్ట్ తీసుకొని ఈ చిత్రాన్ని తెరకెక్కించాం. ఇప్పటితరానికి అయన గొప్ప తనం గురించి చెప్పబోతున్నాం. శ్రీకృష్ణుడు ను మోటివ్ గా తీసుకొని తీసిన ఈ సినిమాలో చాలా మ్యాజిక్స్ ఉన్నాయి. ఈ మధ్య భక్తి సినిమాలు చూడడానికి ఎవరూ ఆలా రావడం లేదని భక్తి తో పాటు అడ్వెంచర్ తో కూడుకున్న థ్రిల్ ఉండాలని ఈ సినిమా తీయడం జరిగింది. ఈ సినిమాను చూసిన ఆడియన్స్ ఒక కొత్త అనుభూతితో బయటకు వస్తారు. ► కార్తికేయ 1 హిట్ అవ్వడంతో ఇప్పుడు వస్తున్న సీక్వెల్ కు ఆడియన్స్ నుంచి మంచి పాజిటివ్ వైబ్స్ వస్తున్నాయి. ‘కార్తికేయ 1’లో నిఖిల్ హీరో గా చెయ్యడంతో ‘కార్తికేయ 2’ లో నటించడం చాలా ఈజీగా అయ్యింది. అందులో మెడికల్ స్టూడెంట్ గా నటిస్తే ఇందులో డాక్టర్ గా నటించాడు. ►శ్రీనివాస్ రెడ్డి,ప్రవీణ్, వైవా హర్ష,సత్య వీరందరూ బిజీగా ఉన్నా ఈ కథను, కాన్సెప్ట్, నమ్మి, మాతో ట్రావెల్ అయ్యారు. ‘కార్తికేయ 2’ లో స్వాతికి పాత్ర కు ఎక్కువ స్కోప్ లేదు. అందుకే స్వాతిని తీసుకోలేదు. అయితే ఈ సినిమా ఫస్ట్ పార్ట్ చూడకపోయినా మీకు సెకెండ్ పార్ట్ లో అర్థమై పోతుంది . ► కథ హిమాచల్ ప్రదేశ్ లో నడుస్తున్నందున అక్కడి వారు అయితే బాగుంటుందని బాలీవుడ్ యాక్టర్ అనుపమ ఖేర్ ను తీసుకోవడం జరిగింది. అయన సీన్ సినిమాకే హైలెట్ గా నిలుస్తుంది. దేవి పుత్రుడు సినిమాకు ఈ కథకు ఎటువంటి సంబంధాలు లేవు ► ఏ కథకైనా నిర్మాతలు కొన్ని బౌండరీస్ ఇస్తారు. దాన్ని బట్టి ఈ కథను చేయడం జరిగింది. ‘కార్తికేయ 2’ కు బడ్జెట్ లో తీయడానికి చాలా ప్రీ ప్రొడక్షన్ వర్క్ చేయడం జరిగింది.అభిషేక్ అగర్వాల్, వివేక్ కూచిబొట్ల, మయాంక్ గార్లు మమ్మల్ని నమ్మారు. రెండు ప్యాండమిక్ స్విచ్వేషన్స్ వచ్చినా వెనుకడుగు వేయకుండా ఈ సినిమాను తెరకేక్కించారు.ఈ స్క్రిప్ట్ పైన నిర్మాతలు చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారు ► కార్తికేయ రెండు పార్ట్స్ కూడా అడవెంచర్స్ కాన్సెప్ట్ తో నే తీయడం జరిగింది. ఇందులో కార్తీక్ ఘట్టమనేని విజువల్స్ బాగుంటాయి. కాలభైరవ మ్యూజిక్ హైలెట్ గా ఉంటుంది. అలాగే టెక్నిషియన్స్ అందరూ కూడా బాగా సపోర్ట్ చేశారు. వి. యఫ్. ఎక్స్ చాలా బాగా వచ్చింది. ► థియేటర్ ద్వారా ప్రేక్షకులకు గ్రాండ్ గా బిగ్ స్క్రీన్ పై మంచి ఎక్స్పీరియన్స్ ఇవ్వాలని తీసిన సినిమా ఇది. ఈ చిత్రాన్ని ఐదేళ్ల నుంచి 15 ఏళ్ల పిల్లలు చూస్తే నాకు చాలా హ్యాపీ. ఎందుకంటే వారికి ఇతిహాసాలపై ఒక అవగాహన వస్తుంది ► నేను ఇంకా చెప్పాల్సింది చాలా ఉంది. ఆడియన్స్ ఈ చిత్రాన్ని రిసీవ్ చేసుకున్న దాన్ని బట్టి నెక్స్ట్ పార్ట్ చేస్తాను.ఈ సినిమా తరువాత నెక్స్ట్ గీతా ఆర్ట్స్ లో ఉంటుంది. రెండు సినిమా కథలు ఉన్నాయి. ఒకటి ప్రేమకథా చిత్రమైంటే ఇంకొకటి సోషల్ డ్రామా, ఈ రెంటిలో ఏ కథ ముందు అనేది ఫైనల్ కాలేదు. గీతా ఆర్ట్స్ తరువాత నాగార్జున గారితో మరో చిత్రం చేయబోతున్నాను. -
‘కార్తికేయ 2’కు వినూత్న ప్రచారం.. కాంటెస్ట్‌లో గెలిస్తే బంగారు కృష్ణుడి విగ్రహం
Nikhil Karthikeya 2 Movie Treasure Hunt Promotion: ఎనర్జిటిక్ యంగ్ హీరో నిఖిల్, చందు మొండేటి దర్శకత్వంలో వచ్చి హిట్ కొట్టిన చిత్రం 'కార్తికేయ'. ఈ సినిమాకు సీక్వెల్‌గా 'కార్తికేయ 2' వస్తున్న విషయం తెలిసిందే. దీంతో ఈ మూవీపై అంచనాలు భారీగా ఉన్నాయి. అత్యంత భారీ అంచనాల మధ్య ఆగస్టు 12న విడుదలకు సిద్ధంగా ఉంది ఈ చిత్రం. అయితే తాజాగా ఈ మూవీ ప్రమోషన్స్‌ను విభిన్నంగా చేపట్టారు దర్శకనిర్మాతలు. ఇందుకోసం సెపరేటుగా ఒక కాంటెస్ట్ నిర్వహిస్తున్నారు. హైదరాబాద్, విజయవాడ, వైజాగ్, తిరుపతిలో ఈ కాంటెస్ట్‌ను నిర్వహిస్తున్నారు. ఈ మిస్టికల్ టెస్ట్‌లో గెలుపొందిన విజేతలకు రూ. 6 లక్షల విలువ గల శ్రీకృష్ణుడి బంగారు విగ్రహాలను ప్రైజ్ మనీగా పొందవచ్చని దర్శక నిర్మాతలు ప్రకటించారు. ఇప్పటికే హైదరాబాద్‌లో మొదటి క్లూ విడుదల చేశారు. ఒక్కొక్కటిగా మరికొన్ని క్లూస్ రిలీజ్ చేయనున్నారు మేకర్స్. ఈ ప్రచారంతో సినిమాపై ఆసక్తిని మరింతగా పెంచేలా చేశారు. చదవండి: ప్రియుడితో బర్త్‌డే వేడుకలు!.. ఫొటోలతో దొరికిపోయిన హీరోయిన్ Soo many of u have cracked the first clue and have moved on to the next clue 🕵️♂️ The quest for the Lord Krishna Gold Idol is getting interesting 😃 You can be the lucky winner of #KarthikeyaQuest ❤️ Waiting for the one who finds the Gold Idol first#Karthikeya2 @actor_Nikhil https://t.co/WH4K16ibcy pic.twitter.com/akiO5p3DWv — Nikhil Siddhartha (@actor_Nikhil) July 31, 2022 కాగా ఇప్పటికే విడుదలైన ఈ మూవీ ట్రైలర్‌కు అద్భుతమైన స్పందన వచ్చింది. కమర్షియల్ చిత్రాలతో పాటు విభిన్నమైన కథలతో నిర్మాణాన్ని కొనసాగిస్తూ విజయాలు సొంతం చేసుకుంటున్న క్రేజీ నిర్మాణ సంస్థలు పీపుల్స్ మీడియా ఫ్యాక్టరి, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బేనర్స్ పై టి.జి. విశ్వప్రసాద్, అభిషేక్ అగర్వాల్ ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ మధ్యే 'కార్తికేయ 2' సెన్సార్ కార్యక్రమాలు ముగిసాయి. ఈ సినిమాకు ఒక్క కట్ కూడా లేకుండా సెన్సార్ బోర్డ్ యూ/ఏ సర్టిఫికేట్ ఇచ్చింది. సినిమాలోని అద్భుతమైన యాక్షన్ సీక్వెన్సులు, కాన్సెప్ట్ చూసి సెన్సార్ సభ్యులు ప్రశంసల వర్షం కురిపించినట్లు తెలుస్తుంది. చదవండి: కాజోల్ 30 ఏళ్ల సినీ ప్రస్థానం.. అజయ్ దేవగణ్ స్పెషల్ పోస్ట్ A lot of you have found out the location from the #KarthikeyaQuest’s 1st clue, Congratulations! But the job is half done. Head out to that location to find the clue for the next location which will lead you to the Lord Krishna Gold Idol ❤️ Good Luck!#Karthikeya2 @anupamahere pic.twitter.com/FzG84v2k7e — Nikhil Siddhartha (@actor_Nikhil) July 31, 2022 U cud be right. But have u checked the second clue that is placed there at the location ? https://t.co/ekRLdGV4or — Nikhil Siddhartha (@actor_Nikhil) July 31, 2022 Hyderabad 🚨 Here's the first clue to win Lord Krishna Gold Idol in the #KarthikeyaQuest ❤️ “Vishwam Oka Poosala Danda… Nidhi nee Bhagyam lo undi ante Bhagyanagarapu Nadiboddu lo unna Janala Poosala Dandani cheruko” Get searching 🔥#Karthikeya2 @actor_Nikhil pic.twitter.com/vzP8CGdnor — People Media Factory (@peoplemediafcy) July 31, 2022 -
‘కార్తికేయ2’ టీమ్‌కి అరుదైన గౌరవం
యంగ్ హీరో నిఖిల్, విలక్షణ దర్శకుడు చందూ మొండేటి కాంబినేషన్లో తెరకెక్కుతున్న ‘కార్తికేయ2’ చిత్రానికి తాజాగా అరుదైన ఆహ్వానం లభించింది. ఈ చిత్ర యూనిట్‌కి ఇస్కాన్ అత్యున్నత సంస్థానం బృందావన్‌కు రావాలని ఆహ్వానం అందింది. కార్తికేయ 2 చిత్రం శ్రీ కృష్ణుడి తత్వం, ఆయన బోధించిన ఫిలాసఫీ ఆధారంగా వస్తుందని.. టీజర్, మోషన్ పోస్టర్‌ను చూస్తుంటేనే అర్థమవుతుంది. ఇప్పటికే ఈ సినిమాపై ఇస్కాన్ వైస్ ప్రెసిడెంట్ రాధా రాందాస్ ప్రశంసల వర్షం కురిపించారు. తాజాగా ఇస్కాన్ మెయిన్ సంస్థానం నుంచి ఆహ్వానం అందడం పట్ల చిత్రయూనిట్ హర్షం వ్యక్తం చేస్తోంది. ఇప్పటి వరకు ఇతిహాసాల నేపథ్యంలో, మైథలాజికల్ స్టోరీస్ నేపథ్యంలో ఎన్నో వందల సినిమాలు వచ్చాయి. భారతం, భాగవతం, రామాయణాలపై సినిమాలతో పాటు తెలుగు, తమిళ, హిందీ భాషల్లో సీరియల్స్ రూపొందాయి. అయితే భారతీయ సినీ చరిత్రలో ఎవరికీ దక్కని గౌరవం కార్తికేయ 2 టీంను వరించడం గమనార్హం.పిపుల్స్ మీడియా ఫ్యాక్టరి, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బేనర్స్‌పై టి.జి. విశ్వప్రసాద్, అభిషేక్ అగర్వాల్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్ర విడుదల తేదీని త్వరలోనే ప్రకటించనున్నారు మేకర్స్. -
నిఖిల్ 'కార్తికేయ 2'గా వచ్చేది అప్పుడే..
Nikhil Karthikeya 2 Movie Release Date Announced: టాలీవుడ్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు యంగ్ హీరో నిఖిల్. హ్యాపీ డేస్ సినిమాతో వెండితెరకు పరిచయమైన నిఖిల్ ప్రస్తుతం ఐదారు సినిమాలతో బిజీగా ఉన్నాడు. 2014లో నిఖిల్ హీరోగా చందు మొండేటి దర్శకత్వంలో వచ్చిన 'కార్తికేయ' చిత్రం మంచి సక్సెస్ సాధించింది. ప్రస్తుతం ఈ సినిమాకు సీక్వెల్ 'కార్తికేయ 2' రానున్న విషయం తెలిసిందే. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ సంస్థలు నిర్మిస్తున్న ఈ సినిమాలో హీరోయిన్గా అనుపమ పరమేశ్వరన్ నటిస్తున్నట్లు ఇటీవల ప్రకటించారు. తాజాగా ఈ మూవీ రిలీజ్ డేట్‌ను ప్రకటించారు. 'ది కశ్మీర్ ఫైల్స్' చిత్ర నిర్మాత అభిషేక్ అగర్వాల్ 'కార్తికేయ 2' మూవీ ప్రొడ్యూసర్లలో ఒకరు. ఆయన పుట్టినరోజు సందర్భంగా సోమవారం (ఏప్రిల్ 11) ఈ సినిమా విడుదల తేదిని రివీల్ చేశారు. 'కార్తికేయ 2' జూలై 2న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు తెలిపారు. దీనికి సంబంధించిన పోస్టర్‌ను సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు. శ్రీకృష్ణుడు నివసించిన ద్వారక, దాపర యుగానికి సంబంధించిన కథతో ఈ సినిమా వస్తున్నట్లు పోస్టర్ ద్వారా తెలుస్తోంది. చందు మొండేటి దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీలో బాలీవుడ్ సీనియర్ నటుడు అనుపమ్ ఖేర్ ఓ కీలక పాత్రలో నటిస్తున్నారు. చదవండి: 'నాలుగు సినిమాలకు సైన్ చేశాను.. ఇప్పుడేమో ఇలా అయ్యింది' The date is locked to enter the mystical world of Lord Sri Krishna with #Karthikeya2. Bringing you a GRAND BIG SCREEN EXPERIENCE on July 22nd.@actor_Nikhil @anupamahere @chandoomondeti @AbhishekOfficl @kaalabhairava7 @AnupamPKher @vishwaprasadtg @vivekkuchibotla @MayankOfficl pic.twitter.com/Qge561F3Hb — Abhishek Agarwal 🇮🇳 (@AbhishekOfficl) April 11, 2022 చదవండి: అనుపమ అల్లరిని బయటపెట్టిన నిఖిల్, షూటింగ్ టైంలో అలా.. -
అంధురాలిగా నివేదా పేతురాజ్.. మేకింగ్ వీడియో వైరల్
Nivetha Pethuraj Bloody Mary Movie Making Video Released: యంగ్ హీరో శ్రీ విష్ణు నటించిన 'మెంటల్ మదిలో' చిత్రంతో టాలీవుడ్‌కు ఎంట్రీ ఇచ్చింది నివేదా పేతురాజ్. తర్వాత ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ 'అల వైకుంఠపురము' సినిమాతో తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరైంది. 'పాగల్' వంటి తదితర మూవీస్‌లో కీలక పాత్రల్లో నటించి గుర్తింపు తెచ్చుకుంది. చేసింది తక్కువ సినిమాలే అయినా తెలుగు, తమిళ ఇండస్ట్రీల్లో నటిగా బాగానే క్రేజ్ సంపాదించుకుంది. తాజాగా ఈ భామ నటించిన చిత్రం 'బ్లడీ మేరీ'. కార్తీకేయ, సవ్యసాచి ఫేమ్ చందు మొండేటి దర్శకత్వంలో పూర్తి తరహా క్రైమ్ థ్రిల్లర్‌గా తెరకెక్కింది 'బ్లడీ మేరీ'. ఈ సినిమాలో నివేదా పేతురాజ్ అంధురాలిగా అలరించనుంది. ప్రముఖ తెలుగు ఓటీటీ సంస్థ ఆహా వేదికగా ఏప్రిల్ 15 నుంచి స్ట్రీమింగ్ కానుంది. ఈ సందర్భంగా 'బ్లడీ మేరీ' మేకింగ్ వీడియోను రిలీజ్ చేసింది చిత్రబృందం. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పీపుల్ ఫ్యాక్టరీ బ్యానర్‌పై టీజీ విశ్వ ప్రసాద్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో కిరిటీ దామరాజ్, బ్రహ్మాజీ, అజయ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. కాలభైరవ సంగీతమందించగా.. కార్తీక్ ఘట్టమనేని సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. -
మైనస్ డిగ్రీలు: ఆగిపోయిన 'కార్తికేయ 2' షూటింగ్!
మంచు ఎక్కువగా కురుస్తున్న కారణంగా ‘కార్తికేయ 2’ షూటింగ్‌కి బ్రేక్ పడింది. నిఖిల్, అనుపమా పరమేశ్వర్వన్ జంటగా నటిస్తున్న చిత్రం ‘కార్తికేయ 2’. 2014లో వచ్చిన ‘కార్తికేయ’ సినిమాకు సీక్వెల్‌గా ఈ చిత్రం రూపొందుతోంది. టీజీ విశ్వప్రసాద్, అభిషేక్ అగర్వాల్ నిర్మిస్తున్న ఈ సినిమాను చందూ మొండేటి డైరెక్ట్ చేస్తున్నారు. ఇటీవల ఈ సినిమా షూటింగ్ గుజరాత్లో జరిగింది. తాజా షెడ్యూల్‌ను హిమాచల్ ప్రదేశ్‌లోని సిస్సులో ఆరంభించారు. అయితే అక్కడ మంచు ఎక్కువగా కురుస్తున్న కారణంగా ఈ సినిమా షూటింగ్‌ను తాత్కాలికంగా నిలిపివేశారు. ‘‘పరిస్థితులు అనుకూలంగా లేకపోవడం వల్ల షూటింగ్‌ను ప్రస్తుతానికి ఆపేశాం. త్వరలో ఈ లొకేషన్లోనే ఓ యాక్షన్ సీక్వెన్స్‌ను షూట్ చేయబోతున్నాం’’ అని చిత్రబృందం పేర్కొంది. కాలభైరవ సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి వివేక్ కూచిభొట్ల సహ నిర్మాత. చదవండి: లవర్ బాయ్ తరుణ్ రీఎంట్రీ, ఈ సారి.. -
ఖరీదైన కారు కొన్న యువ నటుడు
తాను నటించిన సినిమా విజయవంతం కావడంతో తనకు తానే బహుమతి ఇచ్చుకున్నట్లు యువ నటుడు నిఖిల్ సిద్ధార్థ్ చెప్పాడు. ఈ సందర్భంగా తాను కొత్తగా కొన్న రేంజ్ రోవర్ స్పోర్ట్స్ ఆటోబయోగ్రఫీ కారు ఫొటోను సోషల్ మీడియాలో షేర్ చేశాడు. లాక్డౌన్ వలన కారు కొనడం ఆలస్యమైందని తెలిపాడు. ఈ కారు విలువ దాదాపు రూ.2 కోట్ల వరకు ఉంటుంది. ‘హ్యాపీడేస్’ సినిమాతో సినీ పరిశ్రమలోకి వచ్చిన నిఖిల్ ఆ తర్వాత ‘స్వామి రారా’, ‘కార్తికేయ’, ‘ఎక్కడికి పోతావు చిన్నవాడా’ వంటి విజయవంతమైన చిత్రాల్లో నటించి ప్రేక్షకుల గుర్తింపు పొందాడు. గతేడాది ‘అర్జున్ సురవరం’ సినిమా విడుదలై విజయవంతమవడంతో ఈ కారు కొన్నట్లు తెలిపారు. కరోనా వలన కారు కొనుగోలు ఆలస్యమైందని పేర్కొన్నాడు. దీంతోపాటు గతేడాది తన ప్రేయసిని పెళ్లాడాడు. ప్రస్తుతం వైవాహిక జీవితం ఎంజాయ్ చేస్తున్నాడు. ఇక సినిమాలపరంగా చూస్తే నిఖిల్ కార్తికేయ సినిమాకు సీక్వెల్‌గా చందూ మొండేటి దర్శకత్వంలో కార్తికేయ- 2, గీతా ఆర్ట్స్ నిర్మాణంలో ‘18 పేజెస్’ అనే సినిమాలు చేస్తున్నాడు. View this post on Instagram A post shared by Nikhil Siddhartha (@actor_nikhil) -
డిసెంబరులో సెట్స్‌పైకి...
హీరో నిఖిల్, దర్శకుడు చందు మెుండేటి కాంబినేషన్ వచ్చిన ‘కార్తికేయ’ సినిమా ఎంతటి ఘనవిజయం సాధించిందో తెలిసిందే. ఆ చిత్రానికి సీక్వెల్‌గా వీరిద్దరి కలయికలో ‘కార్తికేయ 2’ తెరకెక్కనుంది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ పతాకాలపై టి.జి. విశ్వప్రసాద్, అభిషేక్ అగర్వాల్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రం మార్చిలో తిరుపతిలో పూజా కార్యక్రమాలతో ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఆ తర్వాత కరోనా లాక్డౌన్ వల్ల చిత్రీకరణకు బ్రేకులు పడ్డాయి. ఈ సినిమా డిసెంబరులో తిరిగి సెట్స్‌పైకి వెళ్లనుంది. ఈ చిత్రానికి సహ నిర్మాత: వివేక్ కూచిభొట్ల. -
కార్తికేయను మించి ఆదరించాలి
‘‘శ్రీకృష్ణుని చుట్టూ అల్లుకున్న కథాంశంతో ‘కార్తికేయ 2’ సినిమాని తెరకెక్కిస్తున్నట్లు నిర్మాతలు విశ్వప్రసాద్, అభిషేక్ చెప్పగానే చాలా సంతోషంగా అనిపించింది. ‘కార్తికేయ’ సినిమాని ప్రేక్షకులు ఎంతగా ఆదించారో అంతకు మించి ‘కార్తికేయ 2’ని ఆదరిస్తారని ఆశిస్తున్నా’’ అన్నారు తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి. నిఖిల్, చందు మెుండేటి కాంబినేషన్లో తెరకెక్కుతున్న ‘కార్తికేయ 2’ సినిమా తిరుమల తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వరస్వామి సన్నిధానంలో సోమవారం ప్రారంభమైంది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్‌పై టి.జి. విశ్వప్రసాద్, అభిషేక్ అగర్వాల్ నిర్మిస్తున్నారు. భూమన కరుణాకర్ రెడ్డి కెమెరా స్విచ్చాన్ చేయగా, ఆయన తనయడు అభినయ రెడ్డి క్లాప్ ఇచ్చారు. నిఖిల్ మాట్లాడుతూ– ‘‘భారతీయ సంప్రదాయాలను ‘కార్తికేయ 2’లో అద్భుతంగా చూపెట్టనున్నాం. ఉగాది తర్వాత రెగ్యులర్ షూటింగ్ మొదలు పెట్టి సాధ్యమైనంత త్వరగా సినిమాని విడుదల చేస్తాం’’ అన్నారు. ‘‘తాజాగా విడుదల చేసిన ‘కార్తికేయ 2’ టైటిల్ లోగో, కాన్సెప్ట్ వీడియోకి మంచి స్పందన రావడం హ్యాపీగా ఉంది. ఈ సీక్వెల్ కచ్చితంగా ప్రేక్షకులకు ప్రత్యేకమైన థ్రిల్ ఇస్తుంది’’ అన్నారు టి.జి. విశ్వప్రసాద్, అభిషేక్ అగర్వాల్, చందు మొండేటి, సహ నిర్మాత వివేక్ కూచిభొట్ల. -
5118 ఏళ్ల క్రితం నాటి రహస్యం ఏంటి?
యంగ్ హీరో నిఖిల్, దర్శకుడు చందు మొండేటి కాంబినేషన్లో 2014లో వచ్చిన థ్రిల్లర్ చిత్రం ‘కార్తికేయ’. . సరికొత్త కాన్సెప్ట్‌తో తెరపైకి వచ్చిన ఈ సినిమా ఎంత హిట్టయిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. తొలి చిత్రంతోనే పామును హిప్నటైజ్ చేయడమనే కొత్త కాన్సెప్ట్‌ను తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేశారు దర్శకుడు చందు మొండేటి. ఈ సినిమా యంగ్ హీరో నిఖిల్ కెరీర్లో సూపర్ హిట్‌గా నిలిచిపోయింది. ఇప్పుడు ఈ సినిమాకు సీక్వెల్ రాబోతుంది. ‘కార్తికేయ 2’ పేరిట వస్తోన్న ఈ సినిమా షూటింగ్ త్వరలోనే ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో సినిమా ప్రారంభానికి ముందు ఒక కాన్సెప్ట్ వీడియోను చిత్ర బృందం ఆదివారం విడుదల చేసింది. ఈ కాన్సెప్ట్ వీడియో చూస్తుంటే చందు మొండేటి మరో కొత్త విషయంతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నట్లు అర్థమవుతోంది. కొన్ని వేల సంవత్సరాల క్రితం నాటి రహస్యం ఆధారంగా ఒక సరికొత్త విషయాన్ని చెప్పబోతున్నారు. ‘కలియుగే ప్రథమ పాదే, జంబూ ద్వీపే, భరతవర్షే, భరత ఖండే. 5118 ఏళ్ల క్రితం ముగిసిన ఒక యుగం. ఆ యుగ అనంత జ్ఞాన సంపద. అందులో దాగి ఉన్న ఒక రహస్యం. ఈ యుగంలో అన్వేషణ. స్వార్థానికొక.. సాధించడానికొక.. అతని సంకల్పానికి సాయం చేసినవారెవరు? దైవం మనుష్య రూపేణా’’ అంటూ సాగే వాయిస్ ఓవర్‌తో ఈ కాన్సెప్ట్ వీడియో చాలా ఆసక్తికరంగా ఉంది. ‘అర్జున్ సురవరం’ వంటి బ్లాక్‌బస్టర్ చిత్రం తర్వాత కొంత గ్యాప్ తీసుకున్న నిఖిల్ తిరిగి కార్తికేయ 2కి శ్రీకారం చుట్టాడు. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ సంయుక్తంగా తెరకెక్కించనున్న ఈ సినిమాకి టీజీ విశ్వప్రసాద్, అభిషేక్ అగర్వాల్ నిర్మాతలుగా వ్యవహరించనున్నారు. కాలభైరవ సంగీతం అందించనున్నారు. ఈ ఏడాది చివర్లో ఈ సినిమా విడుదల కానుంది. -
సీక్వెల్ షురూ
నిఖిల్ హీరోగా చందు మొండేటి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘కార్తికేయ’. 2014లో విడుదలైన ఈ చిత్రానికి మంచి ప్రేక్షకాదరణ దక్కింది. అప్పట్లోనే ‘కార్తికేయ’ సినిమాకు సీక్వెల్ ఉన్నట్లు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. శనివారం (జూన్ 1) నిఖిల్ పుట్టినరోజు సందర్భంగా ‘కార్తికేయ –2’ చిత్రాన్ని అధికారికంగా వెల్లడించారు టీమ్. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్, వివేక్ కూచిభొట్ల ‘కార్తికేయ 2’ చిత్రాన్ని నిర్మిస్తారు. ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ– ‘‘కార్తికేయ –2’ చిత్రంపై అంచనాలు ఉంటాయని తెలుసు. ఆ అంచనాలకు తగ్గట్లుగానే సినిమా ఉంటుంది. ఈ చిత్రం ‘కార్తికేయ’ కు కొనసాగింపుగా ఉంటూనే కథ, కథనాల పరంగా కొత్తగా ఉంటుంది. పర్ఫెక్ట్ సీక్వెల్ అని చెప్పొచ్చు. నిర్మాణ కార్యక్రమాలు త్వరలోనే ప్రారంభం అవుతాయి’’ అని అన్నారు. -
సీక్వెల్లో స్వాతి
పెళ్లి చేసుకున్న తర్వాత స్వాతి సినిమాల్లో కనిపించరేమో అని భావించారంతా. ‘స్క్రిప్ట్ కుదిరితే మళ్లీ నటిస్తా’ అని ఆ మధ్య ‘సాక్షి’కి ఇచ్చిన ఇంటర్వ్యూలో స్వాతి పేర్కొన్నారు. అన్నట్లుగానే స్క్రీన్ మీద కనిపించడానికి రెడీ అయ్యారామె. చందు మొండేటి దర్శకత్వంలో నిఖిల్, స్వాతి జంటగా కనిపించిన చిత్రం ‘కార్తికేయ’. 2014లో రిలీజ్ అయిన ఈ మిస్టరీ థ్రిల్లర్ సూపర్ హిట్. ఈ సినిమాకు సీక్వెల్ ప్లాన్ చేశారు దర్శకుడు చందు. ఈ సీక్వెల్లోనూ నిఖిల్, స్వాతి జంటగా నటిస్తారని తెలిసింది. పెళ్లి తర్వాత స్వాతి చేయబోయే మొదటి సినిమా ఇదే. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టీజీ విశ్వప్రసాద్ ఈ సినిమాను నిర్మిస్తారు. త్వరలోనే ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లనుంది. -
పెళ్లయ్యాక మారిపోయా
‘‘పెళ్లి తర్వాత లైఫ్‌లో ఒక బ్యాలెన్స్ వచ్చింది. జీవితంలో ఎదురయ్యే ఎత్తు పల్లాలను తట్టుకోగలననే నమ్మకం ఏర్పడింది. హ్యూమన్ బీయింగ్‌గా ఇంకా బెటర్ అయ్యాననిపిస్తోంది’’ అన్నారు నాగచైతన్య. చందూ మొండేటి దర్శకత్వంలో నాగచైతన్య, నిధి అగర్వాల్ జంటగా మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ ఎర్నేని, చెరుకూరి మోహన్, వై. రవిశంకర్ నిర్మించిన ‘సవ్యసాచి’ చిత్రం నేడు విడుదలవుతోంది. ఈ సందర్భంగా నాగచైతన్య చెప్పిన విశేషాలు... ‘ప్రేమమ్’ రిలీజ్ తర్వాత కమర్షియల్ ఎలిమెంట్స్ జోడించి ‘సవ్యసాచి’ కథ చెప్పాడు చందు. కథ నచ్చింది. ‘ట్విన్ వ్యానిషింగ్ సిండ్రోమ్’ అనే కొత్త పాయింట్‌తో సినిమా కదా అని స్టార్టింగ్‌లో కాస్త భయపడ్డాను. రెండు మూడు షెడ్యూల్స్ తర్వాత ఆ భయం పోయింది. ‘ప్రేమమ్’ సినిమాను రీమేక్ చేద్దామనుకున్నప్పుడు కూడా ఆలోచించుకోమని కొందరు సలహాలు ఇచ్చారు. కానీ వర్కౌట్ చేశాం. నా కెరీర్లో బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది. దాంతో చందూపై ఉన్న నమ్మకం పెరిగింది. యాక్టర్‌గా నాలో ఆత్మవిశ్వాసం పెరగడానికి ఆయన ఒక కారణం. చందూ కొత్తగా ఆలోచిస్తాడు. అన్నీ కుదిరితే చందుతో మరో సినిమా చేస్తాను. ►మాధవన్‌గారు సూపర్‌గా చేశారు. ‘సఖి’ సినిమాతో ఆయన ట్రెండ్ క్రియేట్ చేశారు. ఇప్పుడు ‘విక్రమ్ వేదా, రాకెట్రీ: ది నంబి ఎఫెక్ట్’ సినిమాలోనూ అదే చేస్తున్నారు. యాక్టర్‌గా ఆయన దగ్గర్నుంచి నేర్చుకోవాల్సిన అంశాలు చాలా ఉన్నాయి. భూమికగారు బాగా చేశారు. కీరవాణిగారి సంగీతం ఈ సినిమాకు హైలైట్‌గా ఉంటుంది. నా బాడీ లాంగ్వేజ్‌కి తగ్గట్టుగా మూమెంట్స్‌ను కంపోజ్ చేసిన శేఖర్ మాస్టర్‌కు థ్యాంక్స్. నిధి అగర్వాల్ ఆల్‌రౌండర్. మంచి డ్యాన్సర్. ‘హాలోబ్రదర్’ సినిమాలోని నాన్నగారి(నాగార్జున) క్యారెక్టర్స్‌తో ఈ సినిమాకు సంబంధం లేదు. అక్కడ ట్విన్స్ ఉంటారు. ఇక్కడ ఒకే శరీరంలో ట్విన్స్ ఉంటారు. గ్రాఫిక్స్ కారణంగా ఈ సినిమా ఆలస్యం అయ్యింది. ►ఆర్ట్ డైరెక్టర్ రామకృష్ణగారికి ఫ్యాన్‌ని నేను. మా సినిమాకు బాగా వర్క్ చేశారు. నా సినిమానే కాదు ‘అంతరిక్షం’ సినిమా సెట్స్‌ను కూడా చూశాను. ఒక తెలుగు టెక్నీషియన్ ఆ రేంజ్లో చేస్తున్నారంటే అది మంచి పరిణామం. ►నిర్మాణ విలువల పరంగా ఇప్పటివరకు నా కెరీర్లో మైత్రీ మూవీ మేకర్స్‌కు ఫస్ట్ ప్లేస్ ఇస్తాను. ఎందుకంటే వాళ్లు కంటెంట్‌ని నమ్మి సినిమా తీశారు. నిజాయతీగా చెప్పాలంటే నాకు ప్రస్తుతం ఉన్న మార్కెట్‌కు అంత బడ్జెట్ పెట్టాల్సిన అవసరం లేదు కానీ పెట్టారు. మార్కెట్ ఏంటీ? ఎంత లాభం అనే విషయాలను ఆలోచించకుండా కథపై నమ్మకంతో ఖర్చు పెట్టారు. ►అసరమైతే రీషూట్ చేయాలన్న నాన్నగారి ఫార్ములాను నేను నమ్ముతాను. కచ్చితంగా రీషూట్స్ చేయాలనే ఫార్ములా లేదు. డౌట్స్ ఉన్నప్పుడు చేయడంలో తప్పులేదు. సినిమా రిలీజైన తర్వాత ఆ సీన్ రీపేర్ చేసి ఉన్నట్లయితే బాగుండేది. ఇప్పుడు ఆడియన్స్ చెబుతున్న ఆ మార్పు అప్పుడే మనకు అనిపించింది కదా. అప్పుడే చేసి ఉంటే బాగుండు అని అంతా అయిపోయాక ఆలోచించడంకన్నా సెట్స్‌లో ఉన్నప్పుడే రీషూట్స్ చేయడం మంచిదే అని నా అభిప్రాయం. ప్రపంచంలో ఉన్న టాప్ యాక్టర్స్, హీరోలు రీషూట్స్ చేస్తారు. రీషూట్స్ అంటే అది బెటర్మెంట్ అని నా అభిప్రాయం. ►‘శైలజారెడ్డి అల్లుడు’ రిజల్ట్ విషయంలో ఓపెనింగ్ కలెక్షన్స్ పరంగా హ్యాపీగానే ఉన్నాను. ప్రతి సినిమా స్క్రిప్ట్ విషయంలో ఇన్వాల్వ్ అవుతాను. కానీ ఒక లైన్ దాటి వెళ్లకూడదు. అది దర్శకుడికి మనం ఇచ్చే గౌరవంగా నేను ఫీలవుతాను. మారుతిగారు కథ చెప్పినప్పుడు కన్విన్స్ అయ్యాను. కానీ రిజల్ట్స్‌ను ఊహించలేం కదా. ఇక ఒకే రోజు రిలీజైన ‘శైలజారెడ్డి అల్లుడు, యు–టర్న్’ సినిమాల పోటీ అనేది ఓ డిఫరెంట్ సిట్యువేషన్. రివ్యూస్ పరంగా ‘యు–టర్న్’ గెలిచింది (నవ్వుతూ). ►శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న సినిమాలో నేను, సమంత దంపతులుగానే నటిస్తున్నాం. స్క్రిప్ట్ పరంగా కథలో నాకు, సమంతకు గొడవలు ఎక్కువ. నటించడానికి అది కొంచెం కష్టంగా ఉంది. రియల్ౖ లెఫ్‌లో లేవు కదా (నవ్వుతూ). శివ మంచి డైరెక్టర్. వచ్చే ఏడాది ఫిబ్రవరి కల్లా షూటింగ్ పూర్తవుతుందని అనుకుంటున్నాం. ‘మజిలీ’ అనేది వర్కింగ్ టైటిల్‌గా పెట్టుకున్నాం. ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను అలరిస్తుందన్న నమ్మకం ఉంది. ‘వెంకీమామ’ సినిమాను డిసెంబర్లో స్టార్ట్ చేస్తా. పౌరాణికం సినిమాలను టచ్ చేయాలని ఉంది. కానీ ముందు ఓ మూడు నాలుగు హిట్స్ సాధించాలి. ప్రస్తుతానికి నెక్ట్స్ ప్రాజెక్ట్స్ ఇంకా సైన్ చేయలేదు. ►నా కెరీర్ స్టార్టింగ్‌లో నాన్నగారు కథలు విన్నారు కానీ ఇప్పుడు నాకు ఫ్రీ హ్యాండ్ ఇచ్చారు. నాన్నగారు ‘సవ్యసాచి’ సినిమా చూశారు. కొన్ని సలహాలు చెప్పారు. నాన్నగారు చూస్తున్నప్పుడే ఎడిట్ రూమ్‌లో సమంత చూసింది. ►నాన్నగారి ‘నిన్ను రోడ్డు మీద చూసినది..’ సాంగ్ రీమిక్స్ చేస్తున్నప్పుడు మొదట్లో కాస్త కంగారు పడ్డాను. కానీ అవుట్‌పుట్ చూసి హ్యాపీ ఫీలయ్యా. కీరవాణిగారు మంచి సంగీతం ఇచ్చారు. సెకండాఫ్‌కు ఈ సాంగ్ ప్లస్ అవుతుందన్న నమ్మకం ఉంది. -
హలోబ్రదర్తో సంబంధం లేదు
‘‘దర్శకుడిగా నాకు థ్రిల్‌తో కూడుకున్న డిఫరెంట్ కాన్సెప్ట్ సినిమాలే నచ్చుతుంటాయి. అవే ప్రేక్షకులకు చెప్పాలని ప్రయత్నిస్తుంటాను’’ అని చందూ మొండేటి అన్నారు. నాగచైతన్య, నిధి అగర్వాల్ జంటగా చందూ మొండేటి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘సవ్యసాచి’. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ ఎర్నేని, రవిశంకర్, మోహన్ చెరుకూరి నిర్మించిన ఈ చిత్రం శుక్రవారం రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా చందూ మొండేటి పలు విశేషాలు పంచుకున్నారు. ► ‘ట్విన్ వానిషింగ్ సిండ్రోమ్’కి సంబంధించిన ఓ ఆర్టికల్‌ని మా ఫ్రెండ్ చూపించాడు. చాలా ఆసక్తికరంగా అనిపించింది. ఈ పాయింట్‌ని నా కథలో మిళితం చేసి చైతన్య, మైత్రీ నిర్మాతలకు చెప్పాను. అందరూ బాగా ఎగై్జట్ అయ్యారు. కొత్తగా ఉంటుందని అనుకున్నాం. అప్పుడే ‘సవ్యసాచి’ అనే టైటిల్ అయితే బావుంటుందనుకున్నాను. ► హీరోకు తెలియకుండానే తన ఎడమ చేయి పని చేస్తుందనే పాయింట్‌ని ట్రైలర్లో చూసి, ‘హలో బ్రదర్’ సినిమాతో పోలుస్తున్నారేమో. కానీ అలాంటిదేమీ లేదు. వీలున్న చోట మాత్రమే ఈ పాయింట్‌ని చూపించాం. కేవలం ఈ ఒక్క పాయింట్ చుట్టూనే కథ తిరగదు. ఇందులో ఫ్యామిలీ ఎమోషన్స్, థ్రిల్స్, ఫైట్స్, మంచి లవ్ స్టోరీ అన్నీ సమపాళ్లలో ఉంటాయి. ► మాధవన్ ప్యాన్ ఇండియా యాక్టర్. ఆయన ఫస్ట్ సినిమా నుంచి చూస్తే అన్నీ విభిన్న సినిమాలే ఉంటాయి. నేను ఓ 45 నిమిషాలు కథ చెప్పగానే బావుంది చేద్దాం అనడంతో నమ్మకం వచ్చింది. ఆ తర్వాత కీరవాణి గారు తోడయ్యారు. ఆయన మార్క్ సంగీతం అందిచారు. ► లెగసీ ఉన్న హీరో మన సినిమాలో ఉన్నప్పుడు వాళ్ల ఫ్యామిలీ వాళ్ల పాటలు పెడితే అభిమానులకు, ప్రేక్షకులకూ సరదాగా ఉంటుంది. ‘నిన్ను రోడ్డు మీద చూసినది...’ రీమిక్స్ సాంగ్ సెకండ్ హాఫ్‌లో వస్తుంది. చైతూ ఫుల్ జోష్‌తో చేశాడు. సాంగ్ టీజర్లో మీరు చూసింది శ్యాంపిలే. ముందుగా ఈ పాటకు తమన్నాని అనుకున్నాం. కానీ మా స్క్రిప్ట్‌కు తగట్టుగా కుదర్లే దని నిధితో చేశాం. నిధీ కూడా మంచి డ్యాన్సర్. ► మేమేదో కొత్త పాయింట్ తీశాం అని చెప్పడం లేదు. ఆల్రెడీ ఉన్న ఓ విషయాన్ని మళ్లీ చూపిస్తున్నాం. ప్రేక్షకులకు కూడా ఓ కొత్త అనుభూతి ఇస్తుందని నమ్మాం. ‘మున్నా మైఖేల్’ చిత్రం చూసి నిధిని సెలెక్ట్ చేసుకున్నాం. బాగా చేసింది. నిర్మాతలు అడిగింది అడిగినట్టు ఇచ్చారు. ఎప్పుడూ కంఫర్ట్ జోన్లో ఉంచుతారు. భూమికగారి పాత్ర నిడివి తక్కువైనా చాలా బాగుంటుంది. విజువల్ ఎఫెక్ట్స్ వల్ల చిత్రం ఆలస్యం అయింది. ► ముందు ‘చాణక్య’ అనే కథ కోసం చైతన్య, నేనూ కలిశాం. కానీ అది చేయడం కుదర్లేదు. ‘ప్రేమమ్’ రీమేక్ చేశాం. ‘సవ్యసాచి’ సినిమా కోసం చైతన్య చాలా కష్టపడ్డాడు. ► నెక్ట్స్ ‘కార్తికేయ 2 ’ లైన్ ఉంది. ఆ పాయింట్‌ని డీల్ చేసే సామర్థ్యం నాకింకా రాలేదనుకుంటున్నాను. నాగార్జునగారి కోసం ఓ స్క్రిప్ట్ రెడీగా ఉంది. కానీ నెక్ట్స్ ఏ సినిమా ఉంటుందో చెప్పలేను. -
‘సవ్యసాచి’ సెన్సార్ పూర్తి!
డిఫరెంట్ కాన్సెప్ట్‌తో తెరకెక్కుతున్న సినిమాలకు ఇది కలిసొచ్చే కాలమే. కొత్త ప్రయోగాలతో ముందుకు వస్తే.. ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్న ఈ తరుణంలో నాగచైతన్య సవ్యసాచితో రాబోతున్నాడు. తన మాట వినని ఎడమచేతితో ఎలాంటి పరిణామాలు ఎదుర్కొన్నాడు.. అసలు ఆ కథేంటి అన్న ఆసక్తికర అంశాలతో ఈ శుక్రవారం ఆడియన్స్ ముందుకు రాబోతున్నాడు. రీసెంట్గా విడుదల చేసిన ట్రైలర్, సాంగ్స్‌తో సినిమాపై పాజిటివ్ వైబ్రేషన్స్ క్రియేట్ అయ్యాయి. తాజాగా ఈ చిత్రం సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. సెన్సార్ బృందం ఈ మూవీకి యూ/ఏ సర్టిఫికెట్‌ను జారీ చేసింది. మాధవన్, భూమిక, నిధి అగర్వాల్ ప్రధాన పాత్రలో నటించగా చందూ మొండేటి ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ సినిమా నవంబర్ 2న థియేటర్లలో సందడి చేయనుంది. -
కాంబినేషన్‌ని కాదు.. కంటెంట్‌ని నమ్మారు
నాగచైతన్య, నిధి అగర్వాల్ జంటగా నటించిన చిత్రం ‘సవ్యసాచి’. మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ ఎర్నేని, మోహన్ సీవీయం, రవిశంకర్‌లు నిర్మించారు. ‘కార్తికేయ, ప్రేమమ్’ చిత్రాల దర్శకుడు చందూ మొండేటి దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి యం.యం. కీరవాణి సంగీత దర్శకత్వ బాధ్యతలు నిర్వహించారు. ఈ చిత్రం ట్రైలర్‌ను ప్రముఖ దర్శకులు సుకుమార్ హైదరాబాద్‌లో విడుదల చేశారు. ఈ సందర్భంగా సుకుమార్ మాట్లాడుతూ– ‘‘ట్రైలర్ చాలా బావుంది. ఇండియన్ సిల్వర్ స్క్రీన్‌పై ఇటువంటి సినిమా ఇంతవరకు రాలేదనుకుంటున్నాను. చాలా వెరైటీ సబ్జెక్ట్. ఇలాంటి సబ్టెక్ట్తో సినిమా చేయటం చందు అదృష్టం. కీరవాణి గారి సంగీతం గురించి నా స్నేహితుడు దేవీశ్రీ ప్రసాద్ ఎంతో గొప్పగా చెబు తుంటాడు. స్పూన్ కిందపడితే వచ్చే శబ్దం కూడా ఏ రాగమో కీరవాణిగారు చెబుతారని, ఆయన అంతటి సంగీత జ్ఞాని అని మేమిద్దరం మాట్లాడుకుంటాం. నిర్మాతల గురించి చెప్పాలంటే ముగ్గురూ మూడు పనులను పంచుకొని చాలా స్పీడ్‌గా వర్క్ చేస్తారు. నా ‘100 పర్సెంట్ లవ్’ టైమ్‌లో హీరో చైతూ, నేను రెగ్యులర్‌గా 100 పర్సెంట్ టచ్‌లో ఉండేవాళ్లం. ఇప్పుడు సామ్ (సమంత)తో ఉన్నందువల్ల 99 పర్సెంట్ మాత్రమే టచ్‌లో ఉన్నాడు (నవ్వూతూ). ట్రైలర్లో చైతూ చాలా అందంగా ఉన్నాడు’’ అన్నారు. కీరవాణి మాట్లాడుతూ– ‘‘చందూతో మంచి అనుబంధం ఏర్పడింది. ఈ జర్నీలో ఎన్నో సార్లు తిట్టాను, కసురుకున్నాను కూడా. తన మంచి కోసమే అనుకునేంత మంచి గుణం అతనిది’’ అన్నారు. నాగచైతన్య మాట్లాడుతూ– ‘‘మేము ‘ప్రేమమ్’ చేసే టైమ్‌లో వేరే కంట్రీలో షూటింగ్ జరుగుతున్నప్పుడు చిన్న లైన్లో ఈ కథ చెప్పాడు చందూ. చాలా బావుంది అన్నాను. మా కాంబినేషన్ కంటే కంటెంట్‌ను నమ్మి చిత్రాన్ని నిర్మించిన మైత్రీ మూవీ మేకర్స్‌కు థ్యాంక్స్. ఏ సినిమాకైనా ట్రైలర్ విడుదలైనప్పుడు మెసేజ్‌లు వచ్చేవి. కానీ ఈ సినిమా ఫస్ట్ సాంగ్ రిలీజవ్వగానే కాంప్లిమెంట్స్ వచ్చాయి’’ అన్నారు. ‘‘ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను ఈ నెల 27న హైదరాబాద్‌లో ఘనంగా నిర్వహించబోతున్నాం. నవంబర్ 2న సినిమాని విడుదల చేయబోతున్నాం’’ అన్నారు చిత్రనిర్మాతల్లో ఒకరైన నవీన్ ఎర్నేని. -
సవ్యసాచి రిలీజ్‌పై కన్ఫ్యూజన్
అక్కినేని యువ కథానాయకుడు నాగచైతన్య ఒకేసారి రెండు సినిమాలు చేసేస్తున్నాడు. ఇప్పటికే చందూ మొండేటి దర్శకత్వంలో తెరకెక్కుతున్న సవ్యసాచి షూటింగ్ దాదాపుగా పూర్తికాగా, మారుతి దర్శకత్వంలో శైలజా రెడ్డి అల్లుడు షూటింగ్ జరుగుతోంది. ముందుగా అనుకున్న ప్రకారం సవ్యసాచి ఇప్పటికే రిలీజ్ కావాల్సి ఉంది. అయితే షూటింగ్ ఆలస్యం కావటంతో కాస్త వాయిదా పడింది. కానీ తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాను ఆగస్టు రెండో వారంలో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారట. సినిమాకు గ్రాఫిక్స్ వర్క్ ఎక్కువగా ఉండటంతో ఆలస్యమవుతున్నట్టుగా తెలుస్తోంది. ఇప్పటికే ఓ సంస్థ గ్రాఫిక్స్ వర్క్ కొంత మేర పూర్తి చేసినా ఆ వర్క్ సంతృప్తికరంగా ఉండకపోవటంతో మరో సంస్థతో తిరిగి చేయిస్తున్నారన్న ప్రచారం జరుగుతోంది. అయితే ఈ విషయాలపై చిత్రయూనిట్ అధికారికంగా స్పందించకపోయినా... విడుదల మాత్రం ఆలస్యమవుతుందన్న విషయం తెలుస్తోంది. నాగచైతన్య సరసన నిధి అగర్వాల్ హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాలో మాధవన్ నెగెటివ్ రోల్ లో కనిపించనున్నారు. -
‘కార్తికేయ2’కు నిర్మాత ఆయనేనా?
నిఖిల్ హీరోగా నటించిన ‘కార్తికేయ’ సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. చందూ మొండేటి దర్శకత్వంలో సస్పెన్స్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ సినిమాకు సీక్వెల్ ఉంటుందని గతంలోనే ప్రకటించారు. కానీ కొన్ని కారణాల వల్ల అది ఆలస్యమవుతూ వచ్చింది. ప్రస్తుతం నిఖిల్ తమిళ్ రీమేక్ మూవీలో నటిస్తున్నారు. చందూ మొండేటి సవ్యసాచి షూటింగ్లో బిజీగా ఉన్నారు. ఈ ప్రాజెక్టులు పూర్తి అయిన తరువాత కార్తికేయ2 ను ప్రారంభిస్తారని సమాచారం. ఈ సినిమాకు నిర్మాతగా నైజాం డిస్ట్రిబ్యూటర్ సునీల్ నిర్మాతగా వ్యవహరించనున్నారని తెలుస్తోంది. సునీల్ నిర్మాణ రంగం వైపు ఆలోచిస్తుండగా.. కార్తికేయ2 స్క్రిప్టు నచ్చి ఈసినిమాను నిర్మించేందుకు ముందుకు వచ్చినట్టు తెలుస్తోంది. అయితే దీనిపై అధికారిక సమాచారం వెలువడాల్సి ఉంది. -
మరో స్పెషల్ సాంగ్‌లో మిల్కీ బ్యూటీ
అక్కినేని యువ కథనాయకుడు నాగచైతన్య హీరోగా తెరకెక్కుతున్న తాజా చిత్రం సవ్యసాచి. చైతూకు ప్రేమమ్ లాంటి సూపర్ హిట్ అందించిన చందూ మొండేటి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ దాదాపు పూర్తి కావచ్చింది. నాగచైతన్య సరసన నిధి అగర్వాల్ హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమా నిర్మాణాంతర కార్యక్రమాలు కూడా శరవేగంగా జరుగుతున్నాయి. తాజాగా ఈ సినిమాకు సంబధించిన ఆసక్తికర అప్ డేట్ ఒకటి టాలీవుడ్ సర్కిల్స్‌లో వినిపిస్తోంది. యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో ఓ మాస్ మసాలా స్పెషల్ సాంగ్‌లో మిల్కీ బ్యూటీ తమన్నా కనిపించనుందట. గతంలో అల్లుడు శీను, స్పీడున్నోడు, జై లవ కుశ సినిమాల్లో స్పెషల్ సాంగ్స్ చేసిన తమన్నా ఇప్పుడు నాగచైతన్య సినిమాలో స్పెషల్ సాంగ్ చేస్తున్నట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఈ విషయంపై చిత్రయూనిట్ మాత్రం ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. -
దుమ్ములేపుతున్న కిరాక్‌పార్టీ వసూళ్లు
స్వామిరారా సినిమాతో మళ్లీ సక్సెస్ రుచి చూసిన నిఖిల్... విజయరహస్యమేంటో తెలుసుకున్నాడు. అప్పటినుంచీ వైవిధ్యభరితమైన కథలతోనే సినిమాలు చేస్తున్నాడు. అదే తరహాలో కన్నడ రీమేక్‌లో నటించాడు. కిరాక్పార్టీగా శుక్రవారం(మార్చి 16) ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఇప్పుడు ఆ సినిమా వసూళ్లలో దూసుకెళ్లిపోతోంది. ఈ వారం కిరాక్‌పార్టీ మినహా ఏ సినిమాకు పాజిటివ్టాక్ రాకపోవడం...నిఖిల్‌కు ఉన్న క్రేజ్ దృష్ట్యా వీకెండ్లో ఈ సినిమా కలెక్షన్స్ పరంగా దుమ్ముదులిపింది. దీంతో మూడు రోజుల్లో దాదాపు పదికోట్ల వసూళ్లను సాధించింది. కిరాక్‌పార్టీ హవా ఇలాగే కొనసాగితే...వసూళ్లు ఇంకా పెరిగే అవకాశం ఉంది. ఈ చిత్రానికి సుధీర్ వర్మ స్క్రిప్ట్‌ను, చందూ మొండేటి మాటలను అందించగా శరణ్ కొప్పిశెట్టి దర్శకత్వం వహించారు. -
మార్చి 16న ‘పంచ్’ పడుద్ది!
నాగచైతన్యకు ప్రేమ కథా చిత్రాలే కలిసి వచ్చాయి. మాస్ హీరోయిజం ట్రై చేసిన ప్రతిసారి చేతులు కాలాయి. చైతు లవర్ బాయ్‌లా కనిపించిన సినిమాలే బాక్సాఫీస్ వద్ద విజయాన్ని సాధించాయి. అయినా సరే మాస్ హీరోగా గుర్తింపు తెచ్చుకోవడానికి తెగ కష్టపడుతున్నాడు అక్కినేని హీరో. తనకు ప్రేమమ్ లాంటి బిగ్ హిట్ ఇచ్చిన దర్శకుడు చందూ మొండేటి డైరెక్షన్లో ‘సవ్యసాచి’ సినిమాను చేస్తున్నాడు చైతు. మరి ఈ సినిమా తనకు మాస్ ఇమేజ్ను తెచ్చిపెడుతుందో లేదో వేచి చూడాలి. సవ్యసాచి అని టైటిల్ పెట్టే ఆసక్తి రేకెత్తించారు. అర్జునుడికి మరో పేరే సవ్యసాచి. అయితే ఈ సినిమాకు సంబంధంచిన తొలి పోస్టర్‌ను మార్చి 16న విడుదల చేయనున్నారు. ఫస్ట్ పంచ్ పేరుతో ఈ పోస్టర్ రేపు (శుక్రవారం) ఉదయం 10:30 లకు విడుదల కానుంది. ఈ సినిమాలో హీరో మాధవన్ విలన్‌గా నటిస్తున్నారు. వీరిద్దరి మధ్య వచ్చే సీన్లు, పోరాటాలు సినిమాకి హైలెట్ అవుతాయని చిత్రబృంద్ అంటోంది. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమాకు సీనియర్ సంగీత దర్శకులు ఎం.ఎం. కీరవాణీ సంగీతమందిస్తున్నారు. -
అమెరికాలో ఆటా పాటా
ఫైట్ తర్వాత కుర్రాడి ప్రేమకు అమ్మాయి ఫిదా అయినట్లు ఉంది. అందుకే సాంగ్ వేసుకోవడానికి అమెరికా వెళ్లనున్నారట ఈ రీల్ లవర్స్. నాగచైతన్య, నిధి అగర్వాల్ జంటగా చందు మొండేటి దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా ‘సవ్యసాచి’. హీరో నాగచైతన్య అక్క పాత్రలో భూమిక నటిస్తుండగా, ఓ కీలక పాత్రలో మాధవన్ కనిపించనున్నారు. రీసెంట్గా తీసిన హైదరాబాద్ షెడ్యూల్లో చేజింగ్ ఫైట్‌లో విలన్స్‌ను చితక్కొట్టాడు చైతూ. మార్చిలో జరిగే మరో షెడ్యూల్‌ను చిత్రబృందం అమెరికాలో ప్లాన్ చేసిందని ఫిల్మ్‌నగర్ సమాచారం. అక్కడ కొన్ని కీలకమైన సన్నివేశాలతోపాటు సాంగ్స్‌ను చిత్రీకరిస్తారట. అక్కడితో సినిమా ఆల్మోస్ట్ కంప్లీట్ అవుతుందట. జూన్‌లో ఈ చిత్రాన్ని విడుదల చేయాలనుకుంటున్నారని వినికిడి. ఈ చిత్రం కాకుండా ప్రస్తుతం మారుతి దర్శకత్వంలో నాగచైతన్య ఓ చిత్రంలో నటిస్తోన్న విషయం తెలిసిందే. ఈ చిత్రానికి ‘శైలజారెడ్డిగారి అల్లుడు’ అనే టైటిల్‌ని పరిశీలిస్తున్నారు. -
చందూ మొండేటితో సరదాగా కాసేపు
-
తొలి షెడ్యూల్ పూర్తి చేసుకున్న 'సవ్యసాచి'
పెళ్లి తరువాత నాగచైతన్య నటిస్తున్న సినిమా సవ్యసాచి. ప్రేమమ్ సినిమాతో నాగచైతన్యకు బిగెస్ట్ హిట్ అందించిన చందూ మొండేటి ఈ సినిమాకు దర్శకుడు. ఒక వ్యక్తి రెండు చేతుల్లో ఒక చెయ్యి అతని మాట వినకపోతే ఎలాంటి పరిణామాలు ఎదురవుతాయి అనే డిఫరెంట్ కాన్సెప్ట్ తో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. యాక్షన్ జానర్ లో తెరకెక్కుతున్న ఈసినిమాతో నిధి అగర్వాల్ టాలీవుడ్ కు హీరోయిన్ గా పరిచయం అవుతోంది. ఇటీవల రెగ్యులర్ షూటింగ్ ప్రారంభమైన ఈ సినిమా తొలి షెడ్యూల్ ను కూడా పూర్తి చేసుకుంది. ఈ సినిమాలో నాగచైతన్య డిఫరెంట్ లుక్ లో కనిపించనున్నాడట. సీనియర్ సంగీత దర్శకుడు కీరవాణి స్వరాలంధిస్తున్న ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తోంది. కెరీర్ స్టార్టింగ్ నుంచి యాక్షన్ హీరో ఇమేజ్ కోసం కష్టపడుతున్న నాగచైతన్యకు ఈ సినిమాతో ఆ కోరిక తీరుతుందన్న నమ్మకంతో ఉన్నారు చిత్రయూనిట్. -
సవ్యసాచికి సీనియర్ సపోర్ట్
యుద్ధం శరణం సినిమాతో నిరాశపరిచిన అక్కినేని నాగచైతన్య, ప్రస్తుతం పెళ్లి పనుల్లో బిజీగా ఉన్నాడు. సమంతతో పెళ్లి తరువాత షార్ట్ గ్యాప్ తీసుకొని తిరిగి సినిమాలతో బిజీ అయ్యేలా ఇప్పటికే షెడ్యూల్ ప్లాన్ చేశాడు. చైతూ హీరోగా ప్రేమమ్ లాంటి ఘనవిజయం అందించిన చందూ మొండేటి దర్శకత్వంలో సవ్యసాచి సినిమా చేయనున్నాడు. ఇప్పటికే రిలీజ్ అయిన ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ఈ సినిమాకు సంబంధించి మరో ఆసక్తికర వార్త టాలీవుడ్ సర్కిల్స్ లో వినిపిస్తోంది. కొంతకాలంగా సెలెక్టివ్ గా సినిమాలు చేస్తున్న సీనియర్ సంగీత దర్శకుడు కీరవాణి ఈ సినిమాకు సంగీతమందించనున్నాడట. అక్కినేని ఫ్యామిలీతో మంచి రిలేషన్ ఉండటంతో కీరవాణి ఈ సినిమాకు సంగీతమందించేందుకు అంగీకరించాడన్న టాక్ వినిపిస్తోంది. అయితే చిత్రయూనిట్ మాత్రం కీరవాణి సంగీతం అందిస్తున్న విషయాన్ని ఇంతవరకు అధికారికంగా ప్రకటించలేదు. -
అచ్చంగా అర్జునుడిలా...
అర్జునుడు సవ్యసాచి. కురుక్షేత్ర రణరంగంలో ఈ ధీశాలి రెండు చేతులతో శత్రువులపై బాణాలు సంధించాడు. నాగచైతన్య కూడా అచ్చంగా అర్జునుడిలానే. అప్పుడు అర్జునుడు బాణాలు వేయ గలిగితే, ఇప్పుడు చైతూ రెండు చేతులతో శూలాలు వేయగ లుగుతాడు. ఇదంతా సినిమా కోసమేనని ఊహించే ఉంటారు. చందు మొండేటి దర్శకత్వంలో రూపొందనున్న ‘సవ్యసాచి’ చిత్రంలో చైతూ పవర్ఫుల్ రోల్ చేయనున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించనున్న ఈ చిత్రం సెప్టెంబర్‌లో ప్రారంభం కానుంది. ఈ సినిమా టైటిల్ లోగోను, ప్రీ–లుక్‌ను బుధవారం విడుదల చేశారు. ‘‘చందు మొండేటి రాసిన హీరో క్యారెక్టరైజేషన్‌కు ‘సవ్యసాచి’ అనేది యాప్ట్ టైటిల్. హై ఓల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కనుంది. త్వరలో పూర్తి వివరాలను వెల్లడిస్తాం. ‘ప్రేమమ్’ తర్వాత నాగచైతన్య, చందు మొండేటిల హిట్ కాంబినేషన్ ఈ చిత్రంతో రిపీట్ అవుతోంది’’ అని మైత్రీ మూవీ మేకర్స్ పేర్కొంది. -
డైరెక్షన్‌కి రెడీ!
యస్... నాగచైతన్య దర్శకుడిగా మారుతున్నారు. త్వరలో మెగాఫోన్ పట్టుకోవడానికి ఆయన గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చేశారు. అయితే... చైతూ దర్శకత్వం వహించబోతున్నది సినిమాలకు కాదు, యాడ్ ఫిల్మ్స్‌కి! అది కూడా రియల్ లైఫ్‌లో కాదు, రీల్ లైఫ్లోనట. చందూ మొండేటి దర్శకత్వంలో హీరోగా నటించనున్న సినిమాలో నాగచైతన్య యాడ్ ఫిల్మ్‌మేకర్‌గా కనిపిస్తారట. క్యారెక్టర్ కోసం డైరెక్షన్ చేయడానికి చైతూ రెడీ అవుతున్నారన్న మాట. సస్పెన్స్ థ్రిల్లర్‌గా రూపొందనున్న ఈ సినిమాలో చైతూ క్యారెక్టర్, క్యారెక్టరైజేషన్ చాలా కొత్తగా ఉంటాయట! ఆల్మోస్ట్ ఈ సినిమా స్క్రిప్ట్ వర్క్ పూర్తయిందనీ, త్వరలో షూటింగ్ ప్రారంభించడానికి సన్నాహాలు చేస్తున్నారని యూనిట్ సన్నిహిత వర్గాల సమాచారం. -
పదమూడేళ్ల తరువాత!
‘నా పేరు శివమణి. నాక్కొంచెం మెంటల్’ - థియేటర్లో నాగార్జున ఈ డైలాగ్ కొడుతుంటే.. ‘‘ఖాకీ చొక్కాలో మన మన్మథుడు చితకొట్టేశాడు... అంతే!’’ అంటూ అభిమానులు ఈలలేశారు. నాగ్‌లోని మాస్ యాంగిల్‌ని ‘శివమణి’లో దర్శకుడు పూరి జగన్నాథ్ కొత్తగా చూపించారు. పదమూడేళ్ల తర్వాత ఇప్పుడు ఖాకీ డ్రెస్‌లో ఆయన కనిపించనున్నారు. నాగ్ కోసం ‘ప్రేమమ్’ ఫేమ్, ఆయన వీరాభిమాని దర్శకుడు చందు మొండేటి ఓ స్టోరీ లైన్ రెడీ చేసి, ఎప్పుడో వినిపించారు. ఈ వారంలో పూర్తి స్థాయి కథ వినిపించబోతున్నారట. ‘‘సమకాలీన అంశంతో సాగే పోలీసాఫీసర్ కథ ఇది. నాగ్ క్యారెక్టర్ ఆసక్తికరంగా ఉంటుంది’’ అని దర్శకుడి సన్నిహిత వర్గాలు తెలిపాయి. ‘కార్తికేయ’తో దర్శకుడిగా పరిచయమైన చందు ఆ తర్వాత నాగార్జునతో సినిమా చేయాలనుకున్నారు. కానీ, నాగచైతన్యతో ‘ప్రేమమ్’ సెట్ అయింది. ఆ సినిమా హిట్ తర్వాత ఎన్టీఆర్, రవితేజ లకూ చందు స్టోరీ లైన్స్ చెప్పారు. వాళ్లకూ ఆ యా కథలు నచ్చాయి. అయితే, నాగ్‌తో సినిమా ముందు సెట్స్‌కి వెళ్తుందని సమాచారం. ‘ఓం నమో వేంకటేశాయ’ తర్వాత ఇటు ఓంకార్‌తో చేసే ‘రాజు గారి గది-2’, అటు చందు పోలీసాఫీసర్ సినిమా - రెండింటితో నాగ్ బిజీ అన్న మాట. -
నాగార్జునగారూ... రెండు కథలున్నాయి
‘‘మలయాళ ‘ప్రేమమ్’ చిత్రాన్ని హైదరాబాద్‌లో ఫస్ట్ షో చూశా. బాగా నచ్చింది. అప్పుడీ చిత్రాన్ని నాగచైతన్యతో రీమేక్ చేసే ఆలోచన లేదు. మేమిద్దరం వేరే సినిమా చర్చల్లో ఉన్నాం. చైతూ ఓకే అంటే ‘ప్రేమమ్’ను రీమేక్ చేస్తామని వచ్చిన పదిమంది నిర్మాతల్లో సితార ఎంటర్టైన్మెంట్స్ కూడా ఉంది. దాంతో రీమేక్ ఓకే చేశాం అని దర్శకుడు చందూ మొండేటి అన్నారు. నాగచైతన్య, శ్రుతీహాసన్, అనుపమా పరమేశ్వరన్, మడోన్నా స్టెబాస్టియన్ ముఖ్య పాత్రల్లో సూర్యదేవర నాగవంశీ నిర్మించిన ‘ప్రేమమ్’ గత శుక్రవారం విడుదలైంది. దర్శకుడు మాట్లాడుతూ- ‘‘ఫస్ట్ కాపీ కంటే ముందు వచ్చే ఫస్ట్ కట్‌ను నాగార్జునగారు, త్రివిక్రమ్‌గారు చూశారు. నాగ్ సార్‌కు బాగా నచ్చడంతో కంగ్రాట్స్ చెప్పారు. ఆయన కాన్ఫిడెన్స్ మాలో నమ్మకం పెంచింది. మడోన్నా పాత్రకు సమంతను తీసుకోవాలనుకున్నాం. కానీ, శ్రుతీహాసన్ వంటి హీరోయిన్ ఉండగా మరో స్టార్ వద్దనుకున్నాం. నాగార్జునగారికి రెండు కథలు రెడీ చేశా. ఐ డ్రీమ్ ప్రొడక్షన్లో, ‘దిల్’ రాజుగారి బ్యానర్లో, సితార ఎంటర్టైన్మెంట్స్లో చిత్రాలు చర్చల దశలో ఉన్నాయి. -
ప్రేమమ్ తర్వాత...
‘కార్తికేయ’తో దర్శకుడిగా పరిచయమైన చందు మొండేటి, తొలి చిత్రంతోనే విజయం అందుకున్నారు. ప్రస్తుతం నాగచైతన్య హీరోగా ‘ప్రేమమ్’ తెరకెక్కిస్తున్నారు. దసరా కానుకగా ప్రేక్షకుల ముందుకు రానున్న ‘ప్రేమమ్’ తర్వాత ఐ డ్రీమ్ మీడియా సంస్థ నిర్మించబోయే సినిమాకి దర్శకత్వం వహించనున్నారు. ఐ డ్రీమ్ సంస్థ వ్యవస్థాపకులు వాసుదేవరెడ్డి, రాజ్ కుమార్ ఆకెళ్లతో ఎంతో కాలంగా పరిచయముందని చందు మొండేటి తెలిపారు. ఈ ఏడాది ఆఖరున ఈ సినిమా సెట్స్‌పైకి వెళ్లనుంది. హీరో హీరోయిన్లు, ఇతర ఆర్టిస్టులు, టెక్నీషియన్ల వివరాలు త్వరలో వెల్లడిస్తామని చిత్ర నిర్మాత వాసుదేవరెడ్డి తెలిపారు. -
కార్తికేయ డైరెక్టర్‌తో వరుణ్
మెగా వారసుడు వరుణ్ తేజ్ జెట్ స్పీడుతో దూసుకుపోతున్నాడు. ఇప్పటికే రెండు సినిమాలను లైన్లో పెట్టిన వరుణ్ ఇప్పుడు మూడో సినిమాను కూడా ఫైనల్ చేసే పనిలో ఉన్నాడు. ప్రస్తుతం శ్రీనువైట్ల దర్శకత్వంలో తెరకెక్కుతున్న మిస్టర్ సినిమాతో పాటు, శేఖర్ కమ్ముల డైరెక్షన్లో ఫిదా సినిమాల షూటింగ్లో పాల్గొంటున్నాడు వరుణ్ తేజ్. తాజాగా యువ దర్శకుడు చందూ మొండేటి దర్శకత్వంలో మరో సినిమా రెడీ అవుతున్నాడట. కార్తీకేయ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్న చందూ, ప్రస్తుతం నాగచైతన్య హీరోగా ప్రేమమ్ సినిమాను రూపొందిస్తున్నాడు. ఈ సినిమా తరువాత వరుణ్ హీరోగా ఓ మెడికల్ థ్రిల్లర్‌ను తెరకెక్కించేందుకు ప్లాన్ చేస్తున్నాడు. త్వరలోనే ఈ సినిమాకు సంబందించిన అధికారిక ప్రకటన వెలువడనుంది. -
ప్రేమమ్.... ఓ మధుర సంతకం
ప్రేమకథలకు ముగింపు ఉంటుంది గానీ, అనుభూతులకు కాదు. అందుకే ప్రేమకథల్లోని అనుభూతులు ప్రేక్షకుల మనోఫలకాలపై చెరగని ముద్ర వేస్తాయి. అలాంటి ప్రేమకథా చిత్రమే - ‘ప్రేమమ్’. రెండు అక్షరాల ప్రేమ ఓ యువకుని హృదయంలో రేపిన అందమైన అలజడే కథాంశంగా తెరకెక్కిన ఈ మలయాళ చిత్రం తెలుగులో రీమేక్ అవుతున్న విషయం తెలిసిందే. నాగచైతన్య హీరోగా చందూ మొండేటి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రానికి తెలుగులో కూడా చివరకు ‘ప్రేమమ్’ అనే టైటిల్‌నే ఖరారు చేశారు. సితార సినిమా పతాకంపై సూర్యదేవర నాగవంశీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. చందూ మొండేటి మాట్లాడుతూ- ‘‘ఈ చిత్రానికి ‘లవ్‌స్టోరీస్ ఎండ్... ఫీలింగ్స్ డోన్ట్...’ అనేది ఉపశీర్షిక. నాగచైతన్య పాత్ర ఇందులో మూడు వైవిధ్యమైన పార్శ్వాలతో సాగుతూ ఆసక్తి కలిగిస్తుంది. శ్రుతీహాసన్, అనుపమా పరమేశ్వరన్, మడొన్నా సెబాస్టియన్ లు ఈ చిత్రంలో కథానాయికలుగా బాగా సూట్ అయ్యారు. ఇక్కడి నేటివిటీకి తగ్గట్టుగా మార్పులు చేశాం’’ అని తెలిపారు. ఈ చిత్రానికి ఛాయాగ్రహణం: కార్తీక్ ఘట్టమనేని, సంగీతం: గోపీసుందర్, రాజేశ్ మురుగేశన్, సమర్పణ: పీడీవీ ప్రసాద్. -
నాగచైతన్యతో త్వరలో సినిమా
‘కార్తికేయ’ దర్శకుడు చందు గొరగనమూడి (పాలకోడేరు రూరల్): అన్నపూర్ణా బ్యానర్లో నాగచైతన్య, తమన్న హీరోహీరోరుున్లగా త్వరలో ఓ చిత్రానికి దర్శకత్వం వహించనున్నానని ‘కార్తికేయ’ చిత్ర దర్శకుడు చందు మొండేటి తెలిపారు. గొరగనమూడి సర్పంచ్ చెల్లబోరుున పాపారావు నివాసానికి సోమవారం వచ్చిన ఆయన విలేకరులతో మాట్లాడారు. మంచి కథ, కథనం ఉంటే చిన్న సినిమాలరుునా విజయం సాధిస్తాయని.. ఇందుకు కార్తికేయ చిత్రమే నిదర్శనమని అన్నారు. తన స్వస్థలం కొవ్వూరు తాలూకా వేములూరు అని చెన్నైలో ఇంజినీరింగ్ పూర్తి చేసి 2008లో చిత్రసీమలో ప్రవేశించానన్నారు. హీరో నిఖిల్, స్వామీరారా దర్శకుడు సుధీర్‌వర్మ తనకు మంచి స్నేహితులని చెప్పారు. సుధీర్ వర్మ, తాను యువత సినిమాకు అసిస్టెంట్ డెరైక్టర్సగా పనిచేశామన్నారు. నిఖిల్ ‘కలావర్ కింగ్’ సినిమాకు మాటలు రాశానన్నారు. వీటితో పాటు పలు యూడ్స్కు దర్శకత్వం వహించానని చందు చెప్పారు. తన దర్శకత్వంలో వచ్చిన తొలిసినిమా కార్తికేయ అని దీనిని చూసిన దర్శకుడు రాజమౌళి, వీవీ వినాయక్, సుకుమార్ అభినందించారన్నారు. నాగచైతన్య హీరోగా తెరకెక్కనున్న సినిమా రెగ్యులర్ షూటింగ్ జూలైలో ప్రారంభవుతుందని చెప్పారు. సోషల్ మీడియా సినిమాల ప్రమోట్‌కు బాగా ఉపయోగపడుతుందని చెప్పారు. స్నేహితులు పాపారావు, ఆయన కుటుంబ సభ్యులు, విస్సాకోడేరు ఉప సర్పంచ్ బోల్ల శ్రీనును కలవడం ఆనందంగా ఉందన్నారు. బోల్ల శ్రీను, బొమ్మిడి ప్రసాద్, నాగరాజు, కుదుషా పాల్గొన్నారు. -
మరోసారి విభిన్నమైన కథతో...
మొదట ప్రేమకథలతో కెరీర్ మొదలుపెట్టి, ఆ తర్వాత విభిన్నమైన కథాంశాలతో వరుస విజయాలు సాధిస్తున్నారు యువ హీరో నిఖిల్. ఇప్పుడు ఆయన మరో డిఫరెంట్ మూవీ చేయడానికి సిద్ధం అవుతున్నారు. సాయితేజ ప్రొడక్షన్స్ పతాకంపై సి.హెచ్.వి.శర్మ ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. ‘కార్తికేయ’ చిత్ర దర్శకుడు చందూ మొండేటి ఈ సినిమాకు రచనా సహకారం అందిస్తున్నారు. భారీ తారాగణంతో పాటు, ప్రముఖ సాంకేతిక నిపుణులు ఈ చిత్రానికి వర్క్ చేయనున్నారనీ, పూర్తి వివరాలు త్వరలోనే తెలియజేస్తామనీ నిర్మాత తెలిపారు. -
సినిమా రివ్యూ: కార్తికేయ
సినిమా రివ్యూ పాములు పగబడతాయా? పగబట్టి వెంటపడతాయా? దీనికి సైన్స్ ఏ రకమైన వివరణనిచ్చినప్పటికీ, కథల్లోనూ, సినిమాల్లోనూ పాము సెంటిమెంట్, పగ సెంటిమెంట్ బ్రహ్మాండమైన బాక్సాఫీస్ సూత్రం. పాము పగ అనేది మూఢనమ్మకమని కొట్టిపారేసే జనాన్ని కూడా కన్విన్స్ చేసేలా దానికి శాస్త్రీయ వివరణనిస్తే? అలా ఇటు నమ్మకాలనూ, శాస్త్రీయ వివరణనూ కలగలిపి వండుకున్న కథ - ‘కార్తికేయ’. కథ ఏమిటంటే... మెడికల్ స్టూడెంట్ కార్తికేయ (నిఖిల్ )కు మిస్టరీగా కనిపించే ఏ విషయాన్ని అయినా ఛేదించడం అలవాటు. మరోపక్క సుబ్రహ్మణ్యపురంలో వందల ఏళ్ళ నాటి గుడి ఉంటుంది. కార్తీక పౌర్ణమి నాటి రాత్రి ఆ ఆలయంలో నుంచి వెలుగులు ప్రసరించడం ఓ అద్భుతం. పాము కాటుతో అందరూ చనిపోతూ, అనుమానాలు రావడంతో ఆ ఆలయం మూతపడుతుంది. మెడికల్ క్యాంప్ కోసం హీరో హీరోయిన్లు అదే ఊరుకు వెళతారు. అప్పుడేమైంది? ఆలయ రహస్యం ఏమిటన్నది మిగతా కథ. ఎలా నటించారంటే... ఇటీవలి కాలంలో సస్పెన్స్‌తో కూడిన థ్రిల్లర్ చిత్రాలకు తెలుగులో ఆదరణ బాగుంది. ఈ లెక్కలతోనే వచ్చిన తాజా చిత్రం ఇది. స్టూడెంట్‌గా, ప్రేమికుడిగా, నిగూఢ రహస్యాన్ని ఛేదించాలని తపించే యువకుడిగా ఎప్పటికప్పుడు ఆ మార్పుల్ని చూపడానికి నిఖిల్ శ్రమించారు. కాకపోతే, స్క్రిప్టు కాసేపు అటు, కాసేపు ఇటు నడవడంతో పాత్ర కూడా దేని మీదా నిలకడ లేకుండా పరుగులు పెట్టాల్సి వచ్చింది. మెడికల్ కాలేజీ విద్యార్థిని వల్లిగా హీరోను అనుసరించడానికీ, ప్రేమ ట్రాక్‌కే హీరోయిన్ స్వాతి పరిమితమైంది. మిస్టరీ ఛేదనలోనూ ఆమెకు భాగం కల్పిస్తే, ఆసక్తి ఇంకా పెరిగేది. ఇక, సినిమాలో వచ్చే మిగిలిన పాత్రలన్నీ ఆటలో అరటిపండు వ్యవహారమే. కాకపోతే, సుపరిచిత ముఖాలుండడం ఉపకరించింది.నైట్ ఎఫెక్ట్ దృశ్యాల లాంటి వాటిని చిత్రీకరించడంలో ఛాయాగ్రాహకుడి పనితనం కనిపించింది. బాణీలు, పాటలు గుర్తుపెట్టుకుందామన్నా గుర్తుండవు. ఇలాంటి మిస్టరీ సినిమాలకు కీలకమైన రీ-రికార్డింగ్ ఎఫెక్టివ్‌గా ఉండాల్సింది. చరిత్ర చెప్పడానికి వాడుకున్న బొమ్మలు, విజువల్ ఎఫెక్ట్లు బాగున్నాయి. ఎలా ఉందంటే... పాత్రల పరిచయానికీ, కథలోకి ప్రధాన పాత్రను తీసుకురావడానికి ప్రథమార్ధం సరిపోయింది. అయినా తరువాతి కథేమిటన్న ఆసక్తి ప్రేక్షకులలో నిలపగలిగింది. ఇక, అసలు కథంతా ద్వితీయార్ధంలోనే! దాన్ని ఉత్కంఠగా చెబుతారనుకుంటే, అతిగా ఆశపడ్డామని కై్లమాక్స్కొచ్చాక ప్రేక్షకులకు అర్థమవుతుంది. స్క్రిప్టును పకడ్బందీగా రాసుకొని ఉంటే బాగుండేది. ఏ సీన్లో ఎలా తాను కథను నడిపించాలనుకుంటే అలా పాత్రలు ప్రవర్తించేలా, సంఘటనలు జరిగేలా చేయడంతో తంటా వచ్చిపడింది. రాజా రవీంద్ర రాసిన పుస్తకం, చేసిన ఫోన్ గురించైనా ఆరా తీయకుండానే పోలీసాఫీసర్ కేస్ మూసేశారనడం కథలో కన్వీనియన్స్ కోసమే! ఇక, హీరో ఫ్యామిలీ సీన్లు కృతకంగా ఉన్నాయి. తనికెళ్ళ, తంజావూరు పీఠాధిపతి కథలో ముందే పెదవి విప్పరెందుకో తెలీదు. హీరోది లియో (సింహరాశి) అని మొదట్లో చెప్పించి, చివరకొచ్చేసరికి మేషరాశి అనిపిస్తారు. క్లైమాక్స్ కొచ్చేసరికి కాస్తంత అసంతృప్తిగానే సినిమా ముగుస్తుంది. అయితే, లోటుపాట్లున్నా దర్శకుడి తొలి ప్రయత్నంగా భుజం తట్టవచ్చు. ఉత్కంఠభరిత చిత్రాల సీజన్లో వచ్చిన తాజా చేర్పుగా ఈ చిత్రాన్ని లెక్కించవచ్చు. బలాలు: ఎంచుకున్న మిస్టరీ కథాంశం హిట్ జంటగా పేరు తెచ్చుకున్న నాయికా నాయకులు కొన్ని చోట్ల బాగున్న కెమేరా పనితనం బలహీనతలు: పాత్రలు, సంఘటనల రూపకల్పన సంతృప్తినివ్వని ద్వితీయార్ధం బలహీనమైన స్క్రీన్‌ప్లే నమ్మకానికీ, సైన్స్కూ మధ్య సంఘర్షణకు కుదరని లంకె కెమేరా: కార్తీక్ ఘట్టమనేని, సంగీతం: శేఖర్ చంద్ర, కళ: సాహి సురేశ్, కూర్పు: కార్తీక శ్రీనివాస్, నిర్మాత: వెంకట శ్రీనివాస్ బొగ్గరం, కథ-కథనం- మాటలు-దర్శకత్వం: చందు మొండేటి - రెంటాల జయదేవ -
సాంకేతిక అద్భుతం ఇది
‘‘కమిట్మెంట్, ఎగ్జైట్మెంట్ ఉన్న యువ బృందం చేసిన సాంకేతిక అద్భుతం ‘కార్తికేయ’. ‘స్వామి రారా’ తర్వాత నిఖిల్, స్వాతి నటించిన ఈ సినిమాపై ప్రారంభం నుంచి మంచి అంచనాలు ఉన్నాయి’’ అని తనికెళ్ల భరణి చెప్పారు. నిఖిల్, స్వాతి జంటగా చందు మొండేటి దర్శకత్వంలో వెంకట శ్రీనివాస్ బొగ్గరం నిర్మించిన ‘కార్తికేయ’ పాటల ఆవిష్కరణ హైదరాబాద్‌లో జరిగింది. తనికెళ్ల భరణి పాటల సీడీని ఆవిష్కరించారు. మంచు మనోజ్ మాట్లాడుతూ -‘‘ఈ సినిమా విడుదలకు ముందే మంచి లాభాలు తెచ్చిపెట్టింది. నిఖిల్ చాలా చిన్నస్థాయి నుంచి వచ్చి ఈ స్థాయికెదిగాడు’’ అన్నారు. నిఖిల్ మాట్లాడుతూ -‘‘స్వాతి లక్కీ ఆర్టిస్ట్. నేను పనిచేసిన నాయికల్లో ది బెస్ట్ అంటే స్వాతీనే. మా నిర్మాత చాలా మంచి వ్యక్తి. ఈ సినిమా కోసం చాలా ఖర్చు పెట్టారు’’ అని చెప్పారు. మంచి కథతో పాటు మంచి టీమ్ కుదిరిందని, రొటీన్‌గా కాకుండా డిఫరెంట్‌గా ఉండే సినిమా ఇదని నిర్మాత తెలిపారు. ప్రచార చిత్రం చాలా బావుందని ‘అల్లరి’ నరేశ్ అభినందించారు. ఈ వేడుకలో సుధీర్‌బాబు, వరుణ్ సందేశ్, ఆది, సుధీర్‌వర్మ, రామజోగయ్య శాస్త్రి, వనమాలి తదితరులు పాల్గొన్నారు.