హీరో నాగచైతన్య సరసన కీర్తీ సురేష్ హీరోయిన్‌గా నటించనున్నారన్నది ఫిల్మ్‌నగర్ టాక్. ‘ప్రేమమ్’, ‘సవ్యసాచి’ చిత్రాల తర్వాత హీరో నాగచైతన్య, దర్శకుడు చందూ మొండేటి కాంబినేషన్‌లో మరో సినిమా రూ΄÷ందనుందనే వార్తలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలోనే కీర్తీ సురేష్ కథానాయికగా నటించనున్నారట.
సూరత్ బ్యాక్‌డ్రాప్‌లో సాగే ఈ లవ్‌స్టోరీలో నాగచైతన్య బోటు డ్రైవర్ ΄ాత్రలో నటించనున్నారని, జీఏ2 పిక్చర్స్ ఈ చిత్రాన్ని నిర్మించనుందని ప్రచారం జరుగుతోంది. కాగా హీరోయిన్ ΄ాత్ర కోసం కీర్తీ సురేష్, అనుపమా పరమేశ్వరన్ తదితర పేర్లను చందు పరిశీలిస్తున్నారట. కీర్తీ సురేష్‌ని ఫైనలైజ్ చేశారని భోగట్టా. మరి.. నాగచైతన్య, కీర్తీ సురేష్‌ల జోడీ కుదురుతుందా? వేచి చూడాల్సిందే.
Comments
Please login to add a commentAdd a comment