
అక్కినేని నాగచైతన్య ప్రస్తుతం తండేల్ మూవీతో ప్రేక్షకుల ముందుకొస్తున్నారు. చందు మొండేటి డైరెక్షన్‌లో తెరకెక్కించిన ఈ చిత్రం ఫిబ్రవరిలో రిలీజ్ కానుంది. ఈ చిత్రంలో చైతూ సరసన సాయిపల్లవి హీరోయిన్ నటించింది. ఈ నేపథ్యంలో ఈ మూవీ ట్రైలర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. వైజాగ్‌లో నిర్వహించిన ఈవెంట్‌లో ట్రైలర్ విడుదల చేశారు. ఈ సందర్భంగా నాగచైతన్య అభిమానులతో మాట్లాడారు.
నాగచైతన్య అభిమానులతో మాట్లాడుతూ.. 'వైజాగ్ నాకు ఎంతో క్లోజ్. నేను వైజాగ్ అమ్మాయిని ప్రేమించి.. పెళ్లి చేసుకున్నా. ఇప్పుడు నా ఇంట్లో కూడా వైజాగ్ ఉంది. నా ఇంట్లో రూలింగ్ పార్టీ వైజాగ్ అమ్మాయే. అభిమానులకు నా చిన్న రిక్వెస్ట్. వైజాగ్‌లో తండేల్ మూవీ కలెక్షన్స్ షేక్ అయిపోవాలి. లేదంటే ఇంట్లో నా పరువు పోతుందని' సరదాగా మాట్లాడారు. కాగా.. ఈ చిత్రం ఫిబ్రవరి 7న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రాన్ని అల్లు అరవింద్ సమర్పణలో ప్రతిష్టాత్మకమైన గీతా ఆర్ట్స్ బ్యానర్‌పై బన్నీ వాస్ నిర్మించారు.
తండేల్ కథేంటంటే..
శ్రీకాకుళం మత్స్యకార కుటుంబంలో జరిగిన కథ అధారంగా ఈ సినిమా తీస్తున్నారు. 2018లో జరిగిన యథార్థ సంఘటనల ఆధారంగా ఈ సినిమా రానుంది. శ్రీకాకుళం సాంసృతిక, సామాజిక అంశాలతో పాటు మత్స్యకారుల జీవితాలు ఎలా ఉంటాయో ఈ సినిమాలో చూపించనున్నారు. శ్రీకాకుళం జిల్లాకు చెందిన రాజు అనే జాలరి పొరపాటుగా పాకిస్థాన్ సముద్రజలాల్లోకి ప్రవేశించాడు. దీంతో పాక్ నేవి అధికారులు అరెస్ట్ చేస్తుంది. ఈ ఘటనను ఆధారం చేసుకుని తండేల్ చిత్రాన్ని నిర్మించారు. ఆ జాలరిని తిరిగి భారత్‌కు రప్పించేందుకు తన ప్రియురాలు చేసిన పోరాటం ఏంటన్నదే తండేల్ మూవీ కథ.
వైజాగ్ లో కలెక్షన్స్ రాకపోతే పెళ్ళాం ముందు నా పరువు పోతుంది - Yuvasamrat #NagaChaitanya #SobhitaDhulipala #Thandel #TeluguFilmNagar pic.twitter.com/izN3MSaue2
— Telugu FilmNagar (@telugufilmnagar) January 28, 2025
Comments
Please login to add a commentAdd a comment