Nikhil and Karthikeya 2 Movie Team Visits Tirumala Tirupati Devasthanam - Sakshi
Sakshi News home page

Karthikeya 2 Movie-Nikhil: శ్రీవారిని దర్శించుకున్న కార్తీకేయ 2 మూవీ టీం

Published Sat, Aug 20 2022 12:47 PM | Last Updated on Sat, Aug 20 2022 1:52 PM

Nikhil and Karthikeya 2 Movie Team Visits Tirumala Tirupati Devasthanam - Sakshi

యంగ్‌ హీరో నిఖిల్‌ సిద్ధార్థ్‌ తాజాగా నటించిన చిత్రం కార్తికేయ 2. ఆగస్ట్‌ 13న విడుదలైన ఈ చిత్రం ఊహించని విజయం సొంతం చేసుకుంది. బాలీవుడ్‌లో ఈ మూవీకి విపరీతమైన రెస్పాన్స్‌ వస్తోంది. హిందీలో తొలిరోజు కేవలం 50 థియేటర్స్‌లో విడుదల చేస్తే అది ఆరో రోజు వచ్చేసరికి 1000 థియేటర్స్‌లలో విజయవంతంగా ఆడుతోంది. ఇక ఈమూవీ సక్సెస్‌ నేపథ్యంలో నేడు(శనివారం) హీరో నిఖిల్‌, కార్తికేయ 2 టీం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. 

చదవండి: కరీనాకు ‘ది కశ్మీర్‌ ఫైల్స్‌’ డైరెక్టర్‌ చురక, ఆమె కామెంట్స్‌పై ఘాటు స్పందన

ఉదయం వీఐపీ దర్శన సమయంలో హీరో నిఖిల్‌తో పాటు డైరెక్టర్‌ చందు మొండేటి, నిర్మాత అభిషేక్‌ అగర్వాల్‌, ఇతర టీం సభ్యులు స్వామివారిని దర్శించుకుని మొక్కలు చెల్లించుకున్నారు. ఈ సందర్బంగా ఆలయ అర్చకులకు వారిని ఆశీర్వదించి తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఆనంతరం మీడియాతో మాట్లాడుతూ.. కార్తికేయ 2 మంచి విజయం సాధించడంతో స్వామివారిని దర్శించుకున్నామని మూవీ టీం పేర్కొంది. ఇక నిఖిల్‌ మాట్లాడుతూ.. ‘కార్తికేయ 2 సినిమాకు ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ లభిస్తోంది. సినిమా విజయవంతం కావడంతో స్వామి వారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నాం’ అని తెలిపాడు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement