టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్ 2014లో విడుదలైన కార్తికేయ మూవీతో సూపర్ హిట్‌ను సొంతం చేసుకున్నారు. ఆ తర్వాత ఈ సినిమాకు కొనసాగింపుగా రూపొందించిన కార్తికేయ-2 బాక్సాఫీస్ వద్ద సూపర్‌హిట్‌గా నిలిచింది. బాలీవుడ్‌లోనూ విశేష ఆదరణ దక్కించుకుంది. ఈ చిత్రానికి చందు మొండేటి దర్శకత్వం వహించారు. దీంతో నిఖిల్ ఈ సిరీస్‌లో మరో మూవీతో అలరించేందుకు సిద్ధమయ్యారు.
ఈ చిత్రాలకు కొనసాగింపుగా రానున్న కార్తికేయ-3 ప్రాజెక్ట్‌కు సంబంధించి అధికారిక ప్రకటన వెలువడింది. ఈ విషయాన్ని నిఖిల్ ట్విటర్ వేదికగా పంచుకున్నారు. 'సరికొత్త అడ్వెంచర్ సెర్చ్ చేసే పనిలో డాక్టర్ కార్తికేయ నిమగ్నమయ్యారు. త్వరలో మీ ముందుకు రానున్నాం' తాజాగా పోస్ట్ పెట్టారు. దీంతో నిఖిల్ అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. నిఖిల్ - చందు కాంబోలో మరో అడ్వెంచర్ థ్రిల్లర్ చూసేందుకు రెడీగా ఉన్నామంటూ కామెంట్స్ పెడుతున్నారు. ప్రస్తుతం ఈ ప్రాజెక్ట్ స్క్రిప్ట్ పనులు జరుగుతున్నట్లు తెలుస్తోంది. కార్తికేయ-2తో పోలిస్తే ఇది భారీ స్థాయిలో ఉండనుందని టాక్ వినిపిస్తోంది.
కాగా.. చందు మొండేటి దర్శకత్వంలో నిఖిల్ హీరోగా రానున్న మూడో చిత్రంగా నిలవనుంది. 2014లో విడుదలైన కార్తికేయతో వీరి కాంబో తొలి విజయం అందుకుంది. కార్తికేయ- 2తో పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నారు. ఈ చిత్రంలో అనుపమ పరమేశ్వరన్, అనుపమ్ ఖేర్, హర్ష, శ్రీనివాసరెడ్డి కీలకపాత్రలు పోషించారు. కాగా.. నిఖిల్ ప్రస్తుతం స్వయంభు చిత్రంలో నటిస్తున్నారు. మరో వైపు చందు మొండేటి, నాగ చైతన్య కాంబోలో తండేల్ మూవీని తెరకెక్కిస్తున్నారు.
Dr. Karthikeya In Search of a Brand new Adventure ... Soon🔥 @chandoomondeti #Karthikeya3 #Karthikeya2 #cinema #adventure pic.twitter.com/xoNeD3F2KI
— Nikhil Siddhartha (@actor_Nikhil) March 16, 2024
Comments
Please login to add a commentAdd a comment