నాగచైతన్య తండేల్ మూవీ.. ఐకాన్ స్టార్‌ ఫ్యాన్స్‌కు అదిరిపోయే న్యూస్ | Allu Arjun Chief Guest For Naga Chaitanya Thandel Movie Pre Release Event, Post Goes Viral | Sakshi

Thandel Movie: 'పుష్పరాజ్ ఫర్ తండేల్‌ రాజ్‌'.. రంగంలోకి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్

Jan 31 2025 5:06 PM | Updated on Jan 31 2025 6:00 PM

Akkineni Naga chaitanya Thandel Movie Latest Update

అక్కినేని హీరో నాగచైతన్య ప్రస్తుతం తండేల్ మూవీతో ప్రేక్షకుల ముందుకొస్తున్నారు. చందు మొండేటి డైరెక్షన్‌లో వస్తోన్న ఈ చిత్రం ఫిబ్రవరి 7న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఇటీవలే వైజాగ్ వేదికగా తండేల్ మూవీ ట్రైలర్‌న కూడా మేకర్స్ రిలీజ్ చేశారు. ‘తండేల్‌ అంటే ఓనరా..?’, ‘ కాదు లీడర్‌’ అనే డైలాగ్ ఆడియన్స్‌ను విపరీతంగా ఆకట్టుకుంటోంది. మత్స్యకార బ్యాక్‌ డ్రాప్‌లో తెరకెక్కించిన ఈ చిత్రంలో నేచురల్ బ్యూటీ సాయిపల్లవి హీరోయిన్‌గా నటించింది.

సినిమా రిలీజ్‌కు మరో వారం రోజులు మాత్రమే గడువు ఉండడంతో మేకర్స్ ప్రమోషన్స్‌తో బిజీగా ఉన్నారు. తాజాగా ఈ మూవీకి సంబంధించి ఆడియన్స్‌కు అదిరిపోయే అప్‌డేట్‌ ఇచ్చారు. తండేల్ మూవీ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌కు ముఖ్య అతిథిగా ఐకాన్‌ స్టార్ అల్లు అర్జున్‌ రానున్నట్లు చిత్రనిర్మాణ సంస్థ గీతా ఆర్ట్స్‌ వెల్లడించింది. ఫిబ్రవరి 1న హైదరాబాద్‌లోనే గ్రాండ్‌ ఈవెంట్ నిర్వహించనున్నట్లు తెలిపింది. పుష్పరాజ్ ఫర్ తండేల్‌ రాజ్‌... తండేల్ జాతర అంటూ పుష్పరాజ్‌  మాస్ పోస్టర్‌తో పాటు తండేల్‌ మూవీ పోస్టర్‌ను రిలీజ్‌ చేసింది. దీంతో చైతూ ఫ్యాన్స్‌తో పాటు బన్నీ అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. 

తండేల్ కథేంటంటే...

శ్రీకాకుళం మత్స్యకార కుటుంబంలో జ‌రిగిన కథ అధారంగా ఈ సినిమా తీస్తున్నారు. 2018లో జరిగిన యథార్థ సంఘటనల ఆధారంగా ఈ సినిమా రానుంది.  శ్రీకాకుళం సాంసృతిక, సామాజిక అంశాలతో పాటు మత్స్యకారుల జీవితాలు ఎలా ఉంటాయో ఈ సినిమాలో చూపించనున్నారు. శ్రీకాకుళం జిల్లాకు చెందిన రాజు అనే జాల‌రి   పొర‌పాటుగా పాకిస్థాన్ స‌ముద్ర‌జ‌లాల్లోకి ప్ర‌వేశించాడు. దీంతో పాక్‌ నేవి అధికారులు అరెస్ట్‌ చేస్తుంది. ఈ ఘటనను ఆధారం చేసుకుని తండేల్‌ చిత్రాన్ని నిర్మించారు. ఆ జాలరిని తిరిగి భారత్‌కు రప్పించేందుకు తన ప్రియురాలు చేసిన పోరాటం ఏంటో ఈ సినిమాలో చూడొచ్చు. 
 

 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement