![Thandel Movie Day 1 Collections](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/8/Thandel-Movie.jpg.webp?itok=ykee5cFr)
బాక్సాఫీస్ వద్ద తండేల్ మొదటిరోజే భారీ కలెక్షన్స్ సాధించింది. నాగచైతన్య, సాయి పల్లవి జోడికి ప్రేక్షకులు ఫిదా అవుతున్నారు. చందు మొండేటి డైరెక్షన్‌లో తెరకెక్కిన ఈ చిత్రం ఫిబ్రవరి 7న ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. భారీ బడ్జెట్‌తో బన్నీ వాసు, అల్లు అరవింద్ ఈ మూవీని నిర్మించారు. సినిమా విడుదలకు ముందే తండేల్ పాటలు, డైలాగులతో భారీ అంచనాలను క్రియేట్ చేసింది. సినిమా బాగుందని పాజిటివ్ టాక్ రావడంతో టికెట్ల బుకింగ్‌లో వేగం పెరిగింది. దీంతో ఫస్ట్ డే నాడు భారీ కలెక్షన్స్ రాబట్టింది.
![](https://www.sakshi.com/s3fs-public/inline-images/1_437.jpg)
తండేల్ సినిమాకు తొలి రోజు ప్రపంచవ్యాప్తంగా సుమారు రూ. 21.27 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వచ్చినట్లు తెలుస్తోంది. పాన్ ఇండియా రేంజ్‌లో సినిమా విడుదలైనప్పటికీ తెలుగులోనే అత్యధికంగా వసూళు చేసింది. నాగచైతన్య కెరీర్‌లో బిగ్గెస్ట్ ఓపెనింగ్ చిత్రంగా తండేల్ రికార్డ్ క్రియేట్ చేసింది. ఇప్పటి వరకు గతంలో తను నటించిన 'లవ్‌స్టోరీ' మొదటిరోజు సుమారు రూ. 10 కోట్ల గ్రాస్ రాబట్టింది. ఇప్పుడా రికార్డ్‌ను తండేల్ దాటేసింది. దీంతో అక్కినేని ఫ్యాన్స్ నెట్టింట భారీగా వైరల్ చేస్తున్నారు. విదేశాల్లో మొదటిరోజు ఈ చిత్రం రూ. 3.7 కోట్లు రాబట్టినట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది. ఇదే విషయాన్ని తెలుపుతూ నిర్మాణ సంస్థ ఒక పోస్టర్‌ను కూడా విడుదల చేసింది. 'అలలు మరింత బలపడుతున్నాయి' అంటూ ఒక క్యాప్షన్‌ను పెట్టింది. విదేశాల్లోనే సుమారు రూ. 10 కోట్ల వరకు రాబట్టవచ్చని సినీ ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
బుక్‌మై షోలో మొదటిరోజే సుమారు 2.5 లక్షలకు పైగా ‘తండేల్’ టికెట్స్ సేల్ అయ్యాయి. ఆ ట్రెండ్ ఇప్పుడు కూడా కొనసాగుతుంది. ప్రతి గంటకు 10 వేల టికిట్లు అమ్ముడుపోతున్నాయి. రాజుగా నాగచైతన్య, సత్య పాత్రలో సాయిపల్లవి జోడికి ప్రేక్షకులు ఫిదా అవుతున్నారు. ఈ సినిమాకు సంగీతం, విజువల్స్ చాలా బాగున్నాయని ప్రశంసలు వస్తున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment