ప్రేమమ్ తర్వాత... | Chandu Mondeti's next with iDream | Sakshi
Sakshi News home page

ప్రేమమ్ తర్వాత...

Published Sat, Sep 3 2016 10:55 PM | Last Updated on Mon, Sep 4 2017 12:09 PM

ప్రేమమ్ తర్వాత...

ప్రేమమ్ తర్వాత...

 ‘కార్తికేయ’తో దర్శకుడిగా పరిచయమైన చందు  మొండేటి, తొలి చిత్రంతోనే విజయం అందుకున్నారు. ప్రస్తుతం నాగచైతన్య హీరోగా ‘ప్రేమమ్’ తెరకెక్కిస్తున్నారు. దసరా కానుకగా ప్రేక్షకుల ముందుకు రానున్న ‘ప్రేమమ్’ తర్వాత ఐ డ్రీమ్ మీడియా సంస్థ నిర్మించబోయే సినిమాకి దర్శకత్వం వహించనున్నారు. ఐ డ్రీమ్ సంస్థ వ్యవస్థాపకులు వాసుదేవరెడ్డి, రాజ్ కుమార్ ఆకెళ్లతో ఎంతో కాలంగా పరిచయముందని చందు మొండేటి తెలిపారు. ఈ ఏడాది ఆఖరున ఈ సినిమా సెట్స్‌పైకి వెళ్లనుంది. హీరో హీరోయిన్లు, ఇతర ఆర్టిస్టులు, టెక్నీషియన్ల వివరాలు త్వరలో వెల్లడిస్తామని చిత్ర నిర్మాత వాసుదేవరెడ్డి తెలిపారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement