ప్రేమమ్.... ఓ మధుర సంతకం | First look of Naga Chaitanya's Premam is out | Sakshi
Sakshi News home page

ప్రేమమ్.... ఓ మధుర సంతకం

Published Fri, Feb 19 2016 10:48 PM | Last Updated on Sun, Sep 3 2017 5:58 PM

ప్రేమమ్.... ఓ మధుర సంతకం

ప్రేమమ్.... ఓ మధుర సంతకం

ప్రేమకథలకు ముగింపు ఉంటుంది గానీ, అనుభూతులకు కాదు. అందుకే ప్రేమకథల్లోని అనుభూతులు ప్రేక్షకుల మనోఫలకాలపై చెరగని ముద్ర వేస్తాయి. అలాంటి ప్రేమకథా చిత్రమే - ‘ప్రేమమ్’. రెండు అక్షరాల ప్రేమ ఓ యువకుని హృదయంలో రేపిన అందమైన అలజడే కథాంశంగా తెరకెక్కిన ఈ మలయాళ చిత్రం తెలుగులో రీమేక్ అవుతున్న విషయం తెలిసిందే. నాగచైతన్య హీరోగా చందూ మొండేటి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రానికి తెలుగులో కూడా చివరకు ‘ప్రేమమ్’ అనే టైటిల్‌నే ఖరారు చేశారు. సితార సినిమా పతాకంపై సూర్యదేవర నాగవంశీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

చందూ మొండేటి మాట్లాడుతూ- ‘‘ఈ చిత్రానికి ‘లవ్‌స్టోరీస్ ఎండ్... ఫీలింగ్స్ డోన్ట్...’ అనేది ఉపశీర్షిక. నాగచైతన్య పాత్ర ఇందులో మూడు వైవిధ్యమైన పార్శ్వాలతో సాగుతూ ఆసక్తి కలిగిస్తుంది. శ్రుతీహాసన్, అనుపమా పరమేశ్వరన్, మడొన్నా సెబాస్టియన్ లు ఈ చిత్రంలో కథానాయికలుగా బాగా సూట్ అయ్యారు. ఇక్కడి నేటివిటీకి తగ్గట్టుగా మార్పులు చేశాం’’ అని తెలిపారు. ఈ చిత్రానికి ఛాయాగ్రహణం: కార్తీక్ ఘట్టమనేని, సంగీతం: గోపీసుందర్, రాజేశ్ మురుగేశన్, సమర్పణ: పీడీవీ ప్రసాద్.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement