love stories
-
ట్రూ హార్ట్స్..వన్ హార్ట్..! 'కళ' కలిపిన ప్రేమ జంటలు..!
కళాభిరుచిని కొనసాగించాలంటే.. కలలు కనాలి. అలాంటి కలలే కన్న మరో జత కనులు తోడైతే.. కల సాకారం అవడం తథ్యం. నచ్చిన అభిరుచిని పంచుకుంటూ పరస్పరం ప్రేమను పెంచుకుంటూ దగ్గరైన హృదయాలు ఆలపించే యుగళగీతం మృదు మధురంగా ఉంటుంది. ఆ మధురిమలు ఆస్వాదిస్తున్న కొన్ని జంటల్ని ప్రేమికుల దినోత్సవం సందర్భంగా పలకరించినప్పుడు.. తమ రెండు హృదయాలను ఒకటి చేసిన కళాత్మక జ్ఞాపకాలను నెమరువేసుకున్నారిలా.. ప్రేమించాలనుకోలేదు.. పెళ్లి చేసుకోవాలనుకున్నా..నేను 7వ తరగతి చదువుతున్నప్పుడు గాయనిగా, ఆయన(రేణుకాప్రసాద్) ఇంటర్లో ఉండగా మృదంగం కళాకారుడిగా.. మా ఇద్దరికీ ప్రథమ పరిచయం. సంప్రదాయ సంగీతం అంటే ఇద్దరికీ ప్రాణం. చిన్న వయసు నుంచే కలిసి ‘కళ’లు పండించుకున్నాం. ఎన్నో వేదికలపై ఎన్నో కార్యక్రమాలు కలిసి చేయడం వల్ల సహజంగానే ఇద్దరికీ ఒకరి మీద ఒకరికి సదాభిప్రాయం, అభిమానం.. ఆ తర్వాత నాకు పెళ్లి వయసు వచ్చే సమయానికి నా ఫ్రెండ్స్ అనేక మంది పెళ్లిళ్లు చేసుకుని తమకెంతో ఇష్టమైన కళకు వీడ్కోలు పలకాల్సి రావడం కళ్లారా చూశాను. చాలా వరకూ అత్తింటి ఆంక్షలే అందుకు కారణం అవడం కూడా గమనించాను. ఎంతో శ్రమించి అభిమానించి ప్రాణంగా ప్రేమించిన కళను పెళ్లి కోసం వదిలేసుకోవాల్సి రావడం చూశాక.. తప్పనిసరిగా నాతో పాటు ఇదే రంగంలో ఉన్న వ్యక్తినే పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నాను. అలా అనుకున్న వెంటనే నా మదిలో ఆయనే మెదలడం.. బహుశా దాన్నే ప్రేమ అనుకోవచ్చేమో.. ధైర్యంగా నా మనసులో మాట ఆయనకు చెప్పడం.. ఆయన కొంత సమయం తీసుకుని ఓకే చెప్పడం.. నేను ఇంట్లో వాళ్లని కన్విన్స్ చేయడం.. వరుసగా జరిగిపోయాయి. మా పెళ్లితో సహా.. నాకు ఊహ తెలిసిన దగ్గర్నుంచీ కలిసి సాగుతున్న మా కళాత్మక ప్రయాణం.. చక్కని చిక్కని సంగీతంలా కన–వినసొంపుగా సాగిపోతూనే ఉంది. శ్వేత, ప్రముఖ గాయని కలర్ ఫుల్.. కళ కపుల్.. కలిసి చదువుకున్నాం.. కలిసి బొమ్మలేశాం.. కలిసి ఏడడుగులు నడిచాం.. నగరంలోని జేఎన్ టీయూ ఫైన్ ఆర్ట్స్ కళాశాలలో విద్యార్థులుగా ఉన్నప్పుడు తొలుత పెయింటింగ్ అంటే మాకున్న ఇష్టాల్ని పంచుకున్నాం. అలా అలా పరస్పరం ప్రేమను పెంచుకున్నాం. మా ప్రేమ ప్రయాణం మీద మాకెంత నమ్మకం వచ్చిందంటే.. వృత్తిలోనో, ఉద్యోగంలోనో స్థిరపడాలి ఆ తర్వాతే పెళ్లి అనే ఆలోచన కూడా చేయకుండా.. డిగ్రీ ఫైనల్ ఇయర్లో ఉండగానే పెళ్లి చేసేసుకున్నాం. ఆ తర్వాత స్ట్రీట్ ఆర్టిస్ట్స్‌గా హైదరాబాద్ నగర వ్యాప్తంగా వైవిధ్యభరితమైన ఆర్ట్ వర్క్స్ గీశాం. తద్వారా సిటీలో పుట్టిన క్యూరియాసిటీ.. మా కపుల్ ఆర్ట్‌కి క్రేజ్ తెచ్చిపెట్టింది. ఆ సమయంలో అర్ధరాత్రి సమయంలో ఇద్దరం కలిసి నగరంలోని పలు గోడలమీద బొమ్మలు గీసిన రోజులు మాకు ఇంకా గుర్తున్నాయి. ఫ్రెండ్స్‌గా మొదలుపెట్టి ఫ్రాన్స్ ఆర్ట్ ఫెస్టివల్ దాకా.. ఇంకా అనేకానేక జ్ఞాపకాలతో సాగుతున్న మా కలర్‌ఫుల్ జర్నీకి బాటలు వేసింది మా ప్రేమే.. – విజయ్, స్వాతి ప్రముఖ చిత్రకారులు పాట కలిపిన ప్రేమ బాట గురించి వారి మాటల్లోనే.. పాటల ప్రయాణంలో.. చిగురించిన ప్రేమ.. ఎవరో వీరెవరో కలవని ఇరు ప్రేమికులా.., ఎవరో వీరెవరో విడిపోని యాత్రికులా.., ఈ రాతలే దోబూచులే.. అంటూ ప్రభాస్ రాధేశ్యామ్ సినిమాలో అద్భుతమైన ప్రేమ గీతం పాడిన సింగర్ హరిణి ఇవటూరి.. తన జీవితంలో మాత్రం కలవని ఇరు ప్రేమికుల్లా ఉండకూడదు అనుకుందో ఏమో.. తన స్వరానికి తోడుగా మరో స్వరాన్ని ప్రేమతో కలిపేసుకుంది. సలార్‌లో తను పాడిన.. సూరీడే గొడుగు పట్టి, వచ్చాడే భుజం తట్టి.. చిమ్మచీకటిలోనూ నీడలా ఉండేటోడు.. రెప్పనొదలక కాపు కాసెడి కన్నువాడు.. అనే పాటను ప్రతిబింబించేలా తన ప్రియసఖుడు భాస్కరుని సాయిచరణ్ ఆమె ప్రేమకు పెళ్లి కానుక అందించారు. ఆయనెవరో కాదు.. ప్రముఖ హిట్ మూవీస్ హనుమాన్, కాటమరాయుడు, సుప్రీమ్ వంటి సినిమాల్లో హిట్ సాంగ్స్‌తో తెలుగు సంగీత ప్రియుల మన్ననలను పొందినవాడే..మా మొదటి పరిచయం 2011–12 సంవత్సర కాలంలో ఓ టీవీ ఛానెల్లో నిర్వహించిన పాటల కార్యక్రమంలో.., కానీ మా మధ్య సాన్నిహిత్యం పెరిగింది మాత్రం ప్రముఖ సింగర్ బాల సుబ్రహ్మణ్యం ఆధ్వర్యంలో తెలుగు రాష్ట్రాలతో పాటు విదేశాల్లో నిర్వహించిన సంగీత ప్రదర్శనల్లోనే.. ఈ ప్రదర్శనల కోసం చాలా చోట్లకు ప్రయాణం చేశాం.. ఈ సమయంలో బెస్ట్ ఫ్రెండ్స్‌గా మారాం.. ఒకానొక సమయంలో మా బంధం స్నేహం మాత్రమే కాదు అంతకుమించి అనిపించింది. అలా 2014లో మా స్నేహం కాస్త ప్రేమని తెలుసుకున్నాం. ‘హరిణికి తన పైన ప్రేమ ఉందో లేదో తెలుసుకుందామని.. ‘స్నేహానికి మించిన బంధంమనది అనిపిస్తుంది, ఇకపై నువ్వు నన్ను అన్నయ్య అని పిలువు’ అని సాయి చరణ్ ఆర్డర్ వేయగా, ఎట్టి పరిస్థితుల్లోనూ అన్నయ్య అని పిలువను అని చెప్పకనే తన ప్రేమను చెప్పిందని తమ ప్రేమ స్మృతులను గుర్తు చేసుకున్నారు’. మేమే కాకుండా మా స్నేహం వల్ల మా ఇద్దరి కుటుంబాలు కూడా కలిసిపోయాయి. కానీ.. అప్పటికీ మేమింకా సెటిల్ కాలేదు. మా కుటుంబాల్లో ప్రేమ పెళ్లి ఒప్పుకుంటారా అనే అనుమానంతో భయపడ్డాం. ఇరు కుటుంబాలపైన ఉన్న నమ్మకంతో నిజాయితీగా మా ప్రేమ విషయం చెప్పడం, మా ప్రేమను గౌరవించి వారు కూడా ఒప్పుకోవడం చకచకా జరిగిపోయాయి. కానీ మీరు సెటిల్ అయ్యాకే కలిసి జీవితాన్ని ప్రారంభించండి అనే వారి సూచన మేరకు మూడేళ్ల తర్వాత 2017లో పెళ్లి చేసుకున్నాం. ప్రస్తుతం మాకొక బాబు ఉన్నాడు. పెళ్లికి ముందు ఈ ప్రేమ గురించి మా గురువు బాలసుబ్రహ్మణ్యంకు తెలపగా., కుటుంబ సభ్యులు ఒప్పుకోకుంటే తను మాట్లాడతానని భరోసా ఇచ్చారు. పెళ్లికి రావడంతో పాటు పెళ్లి కానుకగా మా కోరిక మేరకు మా ఇంటికి భోజనానికి వచ్చి ఆశీర్వదించారు. ప్రస్తుతం హరిహర వీరమల్లు, విశ్వంభర వంటి సినిమాల్లో పాటలు పాడుతున్నాం. ఆస్కార్ విజేత కీరవాణి సంగీత దర్శకత్వంలో రాజమౌళి–మహేష్ బాబు ప్రాజెక్టుకు సైతం పాడుతున్నాం. ప్రేమికులు ఎవరికైనా వేరు వేరు ఇష్టాలు అభిప్రాయాలు ఉంటాయి. కేవలం 10 శాతం మాత్రమే ఆ ఇద్దరికీ ఆలోచనలు కలుస్తాయి. ఈ విషయంలో సమన్వయం ఉంటే ప్రేమ జీవితం అద్భుతంగా కొనసాగుతుంది. – భాస్కరుని సాయి చరణ్, హరిణి నాటి అభిమాని.. నేటి జీవిత భాగస్వామి..తను (డా.బిజినా సురేంద్రనాథ్) కూచిపూడి నృత్యం నేర్చుకుంటూ విద్యార్థినిగా ఉన్నప్పుడు నేను కూచిపూడి నృత్యకళాకారుడిగా ప్రదర్శనలు ఇస్తుండేవాడిని. ఒకసారి సిలికానాంధ్ర కార్యక్రమంలో మేము ఇద్దరం కలిసి ప్రదర్శన ఇచ్చాం. అప్పుడే తను నా ప్రదర్శనలు చూస్తున్నానని, నా నృత్యానికి అభిమానినని చెప్పింది. నిజం చెప్పాలంటే ఆ ప్రదర్శనలో నాకన్నా తనే బాగా నృత్యం చేసింది. ఆ విషయం తనతో చెప్పాను. అక్కడి నుంచి ఇద్దరం సన్నిహితులమయ్యాం. నృత్యం అంటే ఉన్న ఇష్టం పరస్పరం ఒకరి మీద ఒకరికి కూడా ఏర్పడింది. కొంత కాలం తర్వాత మేం పెళ్లి ప్రస్తావన తెచ్చినప్పుడు నాకు సరైన ఉద్యోగం లేదని ఆమె ఇంట్లో వాళ్లు అభ్యంతరం పెట్టారు. దాంతో నేను సెటిలయ్యాకే వివాహం చేసుకుందామని అనుకుని.. ఇద్దరం కలిసి ప్రణాళికాబద్ధంగా ప్రదర్శనలు ఇస్తూ వచ్చాం. ఏడాదిలోనే నేను మంచి స్థితికి రావడంతో మా పెళ్లికి అడ్డంకులు తొలగిపోయాయి. ఇప్పుడు దేశ విదేశాల్లో ప్రదర్శనలు ఇస్తూ.. మా నడక నర్తన సంతోష భరితంగా సాగిపోతున్నాయి. – సురేంద్రనాథ్, కూచిపూడి నృత్యకళాకారుడు. (చదవండి: చరిత్ర గుర్తించని 500 ఏళ్ల నాటి రియల్ లవ్ స్టోరీ..!) -
ప్రేమికులూ.. ఓటీటీలో ఈ సినిమాలు అస్సలు మిస్ అవొద్దు!
ప్రేమికుల రోజు (February 14 - Valentine's Day) చాలామందికి స్పెషల్. ఆల్రెడీ ప్రేమలో ఉన్నవారు బహుమతులు ఇచ్చిపుచ్చుకుంటూనో, కలిసి కాలక్షేపం చేస్తూనో సెలబ్రేట్ చేసుకుంటారు. ప్రేమను వ్యక్తం చేయనివారు ఎలాగైనా ధైర్యం చేసి అవతలి వ్యక్తికి ప్రపోజ్ చేసేందుకు సిద్ధమవుతుంటారు. అసలు ప్రేమలోనే లేనివాళ్లు మేమెప్పుడూ ఆ జాబితాలో చేరుతామో ఏంటోనని నిట్టూర్పు విడుస్తారు. అయితే వీరందరినీ ఏకం చేసే శక్తి సినిమాకుంది. ప్రేమలో ఉన్నా, లేకపోయినా మీ మనసుల్ని మెలిపెట్టి, ఏడిపించి, నవ్వించి, గిలిగింతలు పెట్టే వెండితెర కథలు ఎన్నో.. అందులో కేవలం పదింటిని కింద ఇస్తున్నాం. ఇవి ఏయే ఓటీటీలో ఉన్నాయన్న వివరాలు కూడా పొందుపర్చాం. నచ్చితే మీరూ చూసేయండి..🎦 ఏ మాయ చేసావెజీ5, అమెజాన్ ప్రైమ్ ఓటీటీల్లో అందుబాటులో ఉంది.🎦 ఆనంద్హాట్స్టార్లో అందుబాటులో ఉంది.🎦 రాజా రాణిహాట్స్టార్, అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఉంది.🎦 మళ్లీ మళ్లీ ఇది రాని రోజుహాట్స్టార్లో అందుబాటులో ఉంది.🎦 సీతారామంఅమెజాన్ ప్రైమ్‌లో ఉంది.🎦 మజిలీసన్ నెక్స్ట్, అమెజాన్ ప్రైమ్‌లో అందుబాటులో ఉంది.🎦 ఆర్యసన్ నెక్స్ట్లో ఉంది.🎦 3నెట్‌ఫ్లిక్స్‌లో అందుబాటులో ఉంది.🎦 నువ్వొస్తానంటే నేనొద్దంటానాజియో టీవీ, సన్ నెక్స్ట్లో ఉంది.🎦 శ్యామ్సింగరాయ్నెట్ఫ్లిక్స్లో అందుబాటులో ఉంది.చదవండి: రెండుసార్లు ప్రేమ.. నరకం చూపించారు.. నా ఎగ్స్ దాచిపెట్టా: ఐశ్వర్య రాజేశ్భార్య వేధింపులు తాళలేక సింగర్ ఆత్మహత్య -
Valentines Day 2025: చరిత్రలో అజరామరంగా నిలిచిపోయిన ప్రేమకథలు..!
ఫిబ్రవరి అనగానే ఠక్కున ప్రేమికుల రోజు గుర్తొచ్చేస్తుంది. అదీగాక ఆ నెలంతా కూడా హగ్ డే, కిస్ డే వంటివి వచ్చి.. చివరికి ప్రేమికుల రోజుతో ముగుస్తుంది. రొమాంటిక్ భావనను కలుగజేసే ఆ నెలలో ఉండే సందడి అంత ఇంత కాదు. ప్రేమికులు, వివిధ ప్రేమలు సినిమాలు, టీవీల పుణ్యమా అని వాటి గురించి తెలుసుకుని ఆశ్చర్యపోతున్నాం. కానీ వేల ఏళ్ల చరిత్ర కాలంలోనే హృదయాల్ని కదిలించే అందమైన ప్రేమ కథలు ఉన్నాయి. అవి వింటుంటేనే మనసు అదొలా అయిపోతుంటుంది. మరీ ఈ వాలెంటైన్స్‌డే సందర్భంగా చరిత్ర ముడిపడి ఉండి, అజరామరంగా నిలిచిపోయిన అందమైన లవ్ స్టోరీలను గురించి తెలుసుకుందామా..!మార్క్ ఆంటోనీ- క్లియోపాత్రా:చరిత్రకారులను బాగా ఆకర్షించిన ప్రేమ కథల్లో ఒకటి మార్క్ ఆంటోనీ- క్లియోపాత్రా కథ. జూలియస్ సీజర్ మరణం తరువాత, రోమన్ సామ్రాజ్యాన్ని ముగ్గురు వ్యక్తులు పరిపాలించారు. వారే మార్క్ ఆంటోనీ, ఆక్టేవియస్ సీజర్, లెపిడస్. మార్క్ ఆంటోనీ తూర్పు మధ్యధరాను శాసిస్తూ ఈజిప్టులో నివసిస్తున్నాడు. అతను ఈజిప్ట్ రాణి క్లియోపాత్రాతో కూడా ప్రేమలో పడ్డాడు. ఆంటోని తన భార్య ఫుల్వియా మరణం, తన తోటి పాలకుడు ఆక్టేవియస్ సీజర్‌పై పాంపే తిరుగుబాటు తదితరాల వల్ల ఆంటోనీ రోమ్కు వెళ్లవలసి వస్తుంది. అతను తన స్నేహితుడు ఎనోబార్బస్తో కలిసి ప్రయాణిస్తాడు. అయితే ఆంటోనీకి తన స్నేహితుడు ఆక్టేవియస్ సీజర్‌కి కొన్ని కారణాల వల్ల మనస్పర్థలు వస్తాయి. దీంతో వీటిని రూపుమాపుకునేలా సీజర్ సోదరి ఆక్టేవియస్ని రాజకీయ వివాహం చేసుకుంటాడు. ఈ వివాహంతో లెపిడస్‌తో సహా పాలకులు తిరుగుబాటుదారుడైన పాంపేతో శాంతి ఒప్పందం ఏర్పరుచుకుంటాడు ఆంటోని. అయితే ఆంటోని మాటతప్పి మళ్లీ క్లియోపాత్ర వద్దకు వెళ్లిపోతాడు. దీంతో విసిగిపోయిన ఆక్టేవియస్ సీజర్ తాము ఏర్పరచుకున్న ఒప్పందాన్ని రద్దుచేసుకుని మార్క్ ఆంటోని, క్లియోపాత్రలపై యుద్ధం చేసేందుకు దిగుతాడు. అయితే ఈ యుద్ధంలో ఆంటోని ఓటమిని చవి చూడాల్సి వస్తుంది. ఓపక్క తన ప్రాణ స్నేహితుడు ఎనోబార్బస్ సైతం ఈ కష్టకాలంలో వదిలి దూరంగా వెళ్లిపోతాడు. మరోవైపు క్లియోపాత్రకు ఆంటోని పెళ్లి చేసుకున్నట్లు తెలుసుకుని దూరం జరిగే ప్రయత్నం చేస్తుంది. అందులో భాగంగానే క్లియో పాత్ర సైనికులు ఆంటోనికి సహకరించకుండా పారిపోవడం జరుగుతుంది. దీంతో ఆంటోనికి క్లియోపాత్ర తనను మోసం చేసిందన్న కోపం ఎక్కువవ్వుతుంటుంది. కానీ క్లియోపాత్ర అతడి ప్రేమను పరీక్షించే నిమిత్తం తన సహచర చెలికెత్తలతో తాను మరణించినట్లుగా వార్త పంపిస్తుంది. ఈ వార్త విని ఆంటోని కుంగిపోయి తన కత్తితో పొడుచుకుని చనిపోతాడు. వెంటనే అతడిని క్లియోపాత్ర పరిచారికలు అతడిని ఆమె వద్దకు తీసుకురావడం జరుగుతుంది. అక్కడ ఆంటోని ఆమె చేతిలోని ప్రాణాలు వదిలేస్తాడు. మరోవైపు ఆక్టేవియస్ సీజర్ దండయాత్ర చేసుకుంటూ రోమ్ వైపుకి వచ్చేస్తుంటాడు. దీంతో ఆమె ఒక విషపాముతో కరిపించుకుని మరీ ప్రాణాలు వదిలేస్తుంది. ఇక్కడ ఇరువురు ఎంతో గాఢంగా ప్రేమించుకునన్నారు చిన్న మనస్పర్థ ఒకరినొకరు దూరం చేసుకునేందుకు కారణమైంది. అయితే వారికి ప్రాణాలు కోల్పోయిన టైంలో తమది నిజమైన ప్రేమ అని గుర్తించడం బాధకరం.ముంతాజ్ మహల్- షాజహాన్: !అర్జుమంద్ బాను బేగంగా జన్మించిన ముంతాజ్ మహల్ యువరాజు ఖుర్రామ్(షాజహాన్ ) హృదయాన్ని దోచుకుంది. ఆమె కేవలం ఖుర్రామ్కి రాణి మాత్రమే కాదు నమ్మకమైన సలహాదారు, సహచరురాలు. అయితే ముంతాజ్ విషాదకరంగా 1631లో తన పద్నాలుగో బిడ్డకు జన్మినిస్తున్నప్పుడు ప్రాణాలు వదిలేస్తుంది. దీంతో షాజహాన్ ఏళ్ల తరబడి తీవ్ర దుఃఖంలో మునిగిపోయాడు. అలా ఆమె జ్ఞాపకార్థం కట్టించిన స్మారక చిహ్నమే తాజ్ మహల్. ఏడు వింతల్లో ఒకటిగా నిలవడమే గాక యునెస్కో గుర్తింపును కూడా పొందింది. ఏటా లక్షలాదిమంది ఈ మహల్‌ని చూసేందుకు రావడమే గాక శాశ్వత ప్రేమకు చిహ్నంగా కీర్తిస్తారు. రోమియో - జూలియట్:ఈ ప్రేమ కథ వెరోనా నగరంలో జరిగింది. ఇరువురి కుటుంబాల నేపథ్యం వేరు. దీంతో వీరిద్దరిని కలవనిచ్చేవారు కాదు బంధువులు. అయినప్పటికి వాళ్ల కళ్లుగప్పి కలుసుకుంటూనే ఉండేవారు. తమ ప్రేమను ఎలాగైన నిజం చేసుకోవాలని ఇరువురు ఆరాటపడ్డారు. అయితే రోమియో అనుకోకుండా జూలియట్ బంధువు టైబాల్ట్‌ను క్షణికావేశంలో చంపడం జరుగుతుంది. ఈ నేరం కారణంగా రోమియోను వెరోనా నగరం నుంచి బహిష్కరిస్తారు. దీంతో ఇరువురూ ఒకరినొకరు చూసుకోలేనంత అగాథం ఏర్పడుతుంది. అయితే రోమియోకి జూలియట్ చనిపోయినట్లు నమ్మించేలా ఆమె అచేతనంగా పడి ఉన్నట్లు చూపిస్తారు ఆమె బంధువులు. దీంతో జూలియట్ లేకుండా జీవించలేనంటూ ప్రాణం తీసుకుంటాడు. ఇంతలో మెల్కొన్న జూలియంట్ రోమియో చనిపోవడం దుఃఖంతో గట్టిగా విలపిస్తుంది. అలా ఏడుస్తూనే ప్రాణాలు వదిలేస్తుంది. అప్పడు గానీ వారి స్వచ్ఛమైన ప్రేమను గుర్తించరు అక్కడి ప్రజలు.షిరిన్- ఫర్హాద్: ఇది పర్షియన్ ప్రేమ కథ. అందమైన ఆర్మేనియన్ యువరాణి షిరిన్. ఆమె అందం ససానియన్ రాజు ఖోస్రో II దృష్టిని కూడా ఆకర్షించింది. అయితే ఫర్హాద్ శిల్పి, రాతికట్టడాలను నిర్మించడంలో నేర్పరి. ఇరువురి మధ్య హోదాల పరంగా చాలా వ్యత్యాసం ఉంది. అయినా వాటన్నింటిని పక్కన పెట్టి ఒకరినొకరు విడిచి ఉండలేనంత గాఢంగా ప్రేమించుకున్నారు. అయితే వీరిని ఎలాగైన విడదీయాలన్న ఉద్దేశ్యంతో యువరాజు ఖోస్రో ఫర్హాద్కి కష్టమైన పనులన్నీ అప్పగించేవాడు. అన్నింటిని అలవోకగా చేసేయడంతో చివరికి షిరిన్ చనిపోయినట్లు అబద్ధం చెబుతాడు. ఆ వార్త వినడంతోనే కుప్పకూలిపోతాడు ఫర్హాద్. ఆవేదనతో తమ ప్రేమను ఏ పర్వతంపై చెక్కాడా అక్కడకే వెళ్లి ఆత్మహత్య చేసుకుంటాడు. ఫర్హాద్ మరణవార్త విని అతడున్న చోటుకి పరిగెత్తుకుంటూ వెళ్తుంది షిరిన్. ఆమె కూడా అక్కడ నుంచే దూకి చనిపోతుంది.లైలా-మజ్నున్: పర్షియన్, అరబిక్ సాహిత్యంలో భావితరాల కోసం భద్రపరచబడిన గొప్ప ప్రేమ కథ లైలా-మజ్నులది. మజ్నుగా పిలిచే ఖైస్ కవి. అతడు సంపన్న కుటుంబానికి చెందిన లైలాతో ప్రేమలో పడతాడు. లైలా అందం, తెలివిలో ఆమెకు సాటిలేరెవ్వరూ. అయితే మజ్ను ప్రవర్తన విచిత్రంగా ఉంటుంది. అందువల్ల లైలాకు అతడు తగిన జోడి కాదని ఇరువురి కుటుంబాలు వారి ప్రేమను నిరాకరిస్తాయి. అయినా కూడా వాటిని లెక్కచేయకుండా తమ ప్రేమ ఎంత స్వచ్ఛమైనదో చూపించాలాని భావిస్తారిద్దరు. విధి మరోలా వారిప్రేమను పరీక్షించింది. ఇక్కడ లైలా తండ్రి మరో సంపన్న వ్యక్తితో పెళ్లి చేసి పంపేస్తాడు. లైలా మరో వ్యక్తిని పెళ్లి చేసుకుందన్న విరహంతో పిచ్చి వాడైపోతాడు మజ్ను. అక్కడ లైలా పరిస్థితి కూడా అలాగే ఉంటుంది. రాజభోగాల మధ్య ఉన్నా.. ముళ్లమీద కూర్చున్నట్లుగానే ఉంటుంది ఆమెకు. మనసు ఎల్లపుడూ కైస్ చుట్టూనే తిరుగుతుంటుంది. కొన్నేళ్లకు భర్తతో కలిసి ఆమె ఇరాక్ వెళ్లిపోతుంది. కొద్దిరోజులకే అక్కడ అనారోగ్యం బారినపడి లైలా కన్నుమూస్తుంది. లైలా మరణవార్త తెలుసుకున్న కైస్ మిత్రులు విషయం అతడికి చెప్పాలని ఎంతో ప్రయత్నిస్తారు. కానీ, కైస్ జాడ దొరకదు. కొద్దిరోజుల తర్వాత ఓ చోట కైస్ ఆచూకీని కనుగొంటారు. వాళ్లు అక్కడికి వెళ్లి చూడగా.. కైస్, లైలా సమాధి దగ్గర ప్రాణం లేకుండా పడి ఉంటాడు. లైలా కోసం పిచ్చివాడిలా తిరగటం వల్లే కైస్కు మజ్ను అనే పేరు వచ్చిందని అంటారు చరిత్రకారులు. ఎందుకంటే "మజ్ను లైల" అంటే లైలా కోసం పిచ్చివాడిలా తిరిగిన వాడు అని అర్థం వస్తుంది. వారిప్రేమ విషాదంగా ముగిసినా..ఇప్పటికీ ప్రేమికులు వారిని తలుచుకుంటూనే ఉంటారు. అలాగే "ప్రేమ" అనగానే ఆ ఇరువురే గుర్తు వచ్చేలా చిరస్మరణీయంగా నిలిచిపోయారు.(చదవండి: ప్రేమకు ప్రతిరూపమైన అమ్మను ప్రేమిద్దామిలా..!) -
మా అన్న శ్రీయ లవ్ అలా స్టార్ట్ అయ్యింది
-
నేను ఎంత మందిని లవ్ చేశాను అంటే..!
-
పడతారండి ప్రేమలో మళ్లీ..!
నిన్నమొన్నటివరకూ పాన్ ఇండియా ట్రెండ్‌లో యాక్షన్ సినిమాలొచ్చాయి. అయితే ఇప్పుడు ఇండస్ట్రీలో మళ్లీ లవ్ట్రెండ్ మొదలైంది. యాక్షన్ సినిమాలు చేస్తున్న హీరోలు మళ్లీ వెండితెరపై ప్రేమలో పడటానికి ప్రేమకథలు వింటున్నారు. కొందరి ప్రేమకథలు ఆల్రెడీ ఆన్ సెట్స్‌లో ఉన్నాయి. ఈ వెండితెర ప్రేమికుల ప్రేమకథా చిత్రాల గురించి తెలుసుకుందాం. ► ప్రభాస్ అనగానే సినిమా లవర్స్ ఎక్కువగా ‘బాహుబలి’, ‘ఛత్రపతి’, ‘మిర్చి’, ‘సాహో’ వంటి యాక్షన్ మూవీస్ గురించి మాట్లాడుకుంటారు. కాగా ప్రభాస్ కెరీర్లో మంచి హిట్స్ సాధించిన ‘వర్షం’, ‘డార్లింగ్’, ‘మిస్టర్ పర్ఫెక్ట్’ వంటి ప్రేమకథా చిత్రాలు కూడా ఉన్నాయి. అయితే గడచిన పదేళ్లల్లో ప్రభాస్ ‘రాధేశ్యామ్’ (2022) తప్ప అన్నీ యాక్షన్ చిత్రాలే చేశారు. ప్రస్తుతం ‘సలార్’, ‘ప్రాజెక్ట్ కె’ సినిమాలతో యాక్షన్ మోడ్‌లోనే ఉన్నారు. మళ్లీ ఓ ప్రేమక£ý చేయాలని ప్రభాస్ భావిస్తున్నారట. ఇందులో భాగంగా లవ్ స్టోరీస్ స్పెషలిస్ట్ డైరెక్టర్ హను రాఘవపూడి రెడీ చేసిన ఓ ప్రేమ కథను ప్రభాస్ విన్నారని, ఇది పీరియాడికల్ లవ్‌స్టోరీ అనీ సమాచారం. ► ‘100 పర్సెంట్ లవ్’, ‘ఏ మాయ చేసావె’, ‘మనం’ , ‘ఒక లైలా కోసం’, ‘ప్రేమమ్’, ‘మజిలీ’, ‘లవ్‌స్టోరీ’.... ఇలా చెప్పుకుంటూ పోతే నాగచైతన్య కెరీర్‌లోని మేజర్ పార్ట్ అంతా ప్రేమతోనే నిండిపోయి ఉంటుంది. కాగా తన గత చిత్రం ‘కస్టడీ’లో నాగ చైతన్య ఎక్కువగా యాక్షన్ చేశారు. అయితే చైతూ తన ప్రేమతో మరోసారి ఆడియన్స్‌ను ప్రేమలో పడేయనున్నారని తెలుస్తోంది. నాగచైతన్య హీరోగా చందు మొండేటి దర్శకత్వంలో ఓ సినిమా రూపొందనుంది. సూరత్ బ్యాక్‌డ్రాప్‌తో సాగే ఓ లవ్‌స్టోరీగా ఈ చిత్రం తెరకెక్కనుందని, ఇందులో నాగచైతన్య బోటు డ్రైవర్ పాత్ర చేయనునున్నారనీ టాక్. ► హీరో విజయ్ దేవరకొండ కెరీర్లో ప్రేమ, మాస్ కథలు సమానంగా కనిపిస్తాయి. కానీ విజయ్‌కు ఇండస్ట్రీలో మంచి గుర్తింపును తెచ్చిపెట్టింది మాత్రం మాస్ లవ్‌స్టోరీ ‘అర్జున్‌రెడ్డి’, క్లాస్ లవ్‌స్టోరీస్ ‘పెళ్ళి చూపులు’, ‘గీతగోవిందం’ వంటి సినిమాలే. దీంతో విజయ్ మరోసారి లవ్‌స్టోరీస్‌పై ఫోకస్ పెట్టినట్లు ఉన్నారు. దర్శకుడు శివ నిర్వాణతో విజయ్ ప్రస్తుతం ‘ఖుషి’ అనే లవ్‌స్టోరీ చేస్తున్నారు. ఇందులో సమంత హీరోయిన్. అలాగే ‘గీత గోవిందం’ తర్వాత దర్శకుడు పరశురామ్‌తో మరో సినిమా చేస్తున్నారు విజయ్. ఇది కూడా ప్రేమకథా చిత్రమేనన్నది ఫిల్మ్‌నగర్ టాక్. ► ‘డీజే టిల్లు’తో మరింత పాపులారిటీని సాధించిన సిద్ధు జొన్నలగడ్డ కెరీర్లో ‘కృష్ణ అండ్ హిజ్ లీల’, ‘మా వింత గాథ వినుమా’ వంటి ప్రేమకథా చిత్రాలు ఉన్నాయి. ప్రస్తుతం సిద్ధు ‘డీజే టిల్లు స్క్వేర్’తో బిజీగా ఉన్నారు. అలాగే దర్శకురాలు నందినీ రెడ్డితో ఓ సినిమా కమిట్ అయ్యారు. ఓ డిఫరెంట్ లవ్‌స్టోరీగా ఈ చిత్రం తెరకెక్కనుందని టాక్. ► ‘దొరసాని’ వంటి ప్రేమకథతో పరిచయం అయిన ఆనంద్ దేవరకొండ ఆ తర్వాత ‘హైవే’ వంటి క్రైమ్ థ్రిల్లర్ చేశారు. ఆనంద్ నటించిన మరో లవ్‌స్టోరీ ‘బేబీ’. ప్రేమకథా చిత్రంగా సాయిరాజేష్ తెరకెక్కించిన ఈ చిత్రం జూలై 14న రిలీజ్ కానుంది. మరికొందరు హీరోలు కూడా ఆడియన్స్‌ను ప్రేమలో పడేసేందుకు ప్రేమకథలు వింటున్నట్లు తెలుస్తోంది. ► ‘హలో’, ‘మిస్టర్ మజ్ను’, ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్’... ఇలా కొన్ని ప్రేమకథల్లో నటించారు అఖిల్. అయితే అఖిల్ గత చిత్రం ‘ఏజెంట్’ ఫుల్ యాక్షన్ ఫిల్మ్. దీంతో తన తర్వాతి చిత్రాన్ని లవ్ జానర్లోనే చేయాలనుకుంటున్నారట అఖిల్. ఈ క్రమంలోనే అనిల్‌కుమార్ అనే ఓ కొత్త దర్శకుడి కథకు అఖిల్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారనీ, ఫ్యాంటసీ లవ్‌స్టోరీ బ్యాక్ డ్రాప్లో ఈ సినిమా కథనం ఉంటుందని, ‘ధీర’ టైటిల్‌ను పరిశీలిస్తున్నారనీ టాక్. -
మూవీ మ్యాటర్స్ @ 14 February 2023
-
Valentine's Day: ఖండాంతరాలు దాటిన ప్రేమ
సాక్షి, హైదరాబాద్: కొండాపూర్‌లో నివసించే హర్షవర్ధన్ అచ్చమైన తెలంగాణ అబ్బాయి. చదువుకునే సమయంలో తమిళనాడుకు చెందిన ‘అరు’ అనే యువతి ప్రేమలో పడ్డాడు. పెళ్లి తంతు మొత్తం తమిళ బ్రాహ్మణ సంప్రదాయంలో జరగడం.. ఆమెతో పెళ్లి కోసం అతను చేసుకున్న సర్దుబాట్లలో ఒకటి మాత్రమే. అతని భార్యగా మారాక అరు కూడా ఇక్కడి ఆచారాలు, అలవాట్లకు తగ్గట్టుగా తన వంతుగా మారే ప్రయత్నం చేస్తున్నారు. ప్రేమ ముందు సంస్కృతీ సంప్రదాయాలు కూడా తలవంచుతాయి అని ఇలాంటి జంటలు నిరూపిస్తున్నాయి. ఖండాంతరాలు దాటిన ప్రేమ ‘మేం ఇద్దరం ఆరేళ్ల పాటు ప్రేమించుకుని ఆ తర్వాత పెళ్లి చేసుకున్నాం. మేం పరిచయమయ్యే నాటికి నా వయసు 18 ఆయనకు 25పైనే’ అంటూ గుర్తు చేసుకున్నారు సెలీన్ (41). ప్రస్తుతం నగరంలోని మణికొండలో నివసిస్తున్న సెలీన్, ఆమె భర్త కాకుమాను విక్రమ్‌ను ఫ్రాన్స్‌లోనే కలిసి ప్రేమించుకుని పెళ్లి చేసుకున్నారు. ఖండాంతరాలు దాటిన వీరి ప్రేమ పెద్దలు, మతాలు వంటి అవాంతరాలు దాటి 2006లో జరిగిన పెళ్లితో సుఖాంతమైంది. పెళ్లి అనంతరం ఫ్రెంచ్ భాషలో ప్రావీణ్యం సాధించిన విక్రమ్ ప్రస్తుతం ఓ ఫ్రెంచ్ కంపెనీలోనే ఉద్యోగం చేస్తుండగా సెలెన్ నగరంలో ఫ్రెంచ్ భాషా ఉపాధ్యాయిని. తనకెంతో ఇష్టమైన తెలుగు వంటలు వండటం భార్యకు రాకపోయినా విక్రమ్ సర్దుకుపోతుంటే.. భర్తతో కలిసి తిరుపతి వంటి హిందూ దేవుళ్ల ఆలయాలు, ఆధ్యాత్మిక కేంద్రాలను సందర్శించడం సెలెన్ అలవాటు చేసుకున్నారు. ఇక్కడి ఫంక్షన్లకు చక్కగా చీర కట్టుకుని మరీ హాజరయ్యే సెలెన్‌ను చూసినవారెవరైనా ఫ్రెంచ్ జాతీయురాలు అంటే నమ్మడం కష్టం. హైదరాబాద్ వాతావరణం చాలా నచ్చిందని, తెలుగు భాష కొద్దిగా నేర్చుకున్నానని చెబుతున్న సెలెన్.. తన భర్తకు నచ్చే విధంగా అత్తయ్యా, మావయ్యా అంటూ ఆయన తల్లిదండ్రులను సంబోధిస్తూ సంతోషపెడతారు. ఆపం, పుట్టు అతనికి.. ఇడ్లీ.. దోశ ఆమెకి.. సికింద్రాబాద్‌లోని కిమ్స్ ఆస్పత్రిలో నగరానికి చెందిన దేవేందర్ ఫార్మాసిస్ట్‌గా.. కేరళకు చెందిన శశికళ స్టాఫ్ నర్సుగా పనిచేస్తూ.. ప్రేమించుకున్నారు. ఆ తర్వాత కేరళ–హైదరాబాద్ మధ్య దూరం తరిగిపోయింది. సెటిలయ్యాకే పెళ్లి అనుకున్నారు కాబట్టి పెద్దలు ససేమిరా అని అడ్డం పడినా ఆ అభ్యంతరాలన్నీ దూది పింజలైపోయాయి. పెళ్లి తర్వాత కొబ్బరినూనెతో వండే కేరళ తరహా వంటలు దేవేందర్ ఇష్టపడక తప్పలేదు. అత్తగారి ఊరెళ్లాక అక్కడి వస్త్రధారణ అయిన పంచెకట్టులోనే గుళ్లూ గోపురాలూ తిరగడం అతనికి అలవాటైంది. మరోవైపు కొబ్బరినూనె లేకుండా వండే వంటలు శశికళ తినక తప్పలేదు. అయితే తర్వాత తర్వాత అక్కడి కోకోనట్ ఆయిల్‌తో వంటలు ఆరోగ్యకరమని గ్రహించిన దేవేందర్ తనకు తన పిల్లల వరకూ అదే ఆయిల్‌ని వాడడం కోసం కేరళ నుంచి 4 కిలోల నూనెను ప్రత్యేకంగా తెప్పిస్తారు. పుట్టు, ఆపం వంటి కేరళ వంటలతో పాటే దేవేందర్‌కు మలయాళం, ఇక్కడి ఇడ్లీ, పూరిలతో పాటే శశికళకు తెలుగు భాష కూడా వంటబట్టేశాయి. ఇంకా కొన్ని చేసుకోవాల్సినవి ఉన్నా...పరస్పరంప్రేమ ముందు ఇలాంటి సర్దుబాట్లు చిన్నవే అంటోందీ జంట. కేరళ అబ్బాయి.. తమిళ అమ్మాయి అమెజాన్ కంపెనీలో పనిచేస్తూనే ప్రేమలో పడిన ప్రియాంక తమిళమ్మాయి, అబ్బాయి శ్రీకాంత్‌ది కేరళ. ఇద్దరూ ప్రేమను పంచుకున్నారు. మరి పూర్తిగా భిన్నమైన సంప్రదాయాలను ఎలా పంచుకుంటున్నారు? అంటే.. సందర్భాన్ని బట్టి, అప్పటికప్పుడు ఏది బెటరయితే అది ఫాలో అయిపోవడమే అంటూ సింపుల్‌గా చెప్పేస్తారిద్దరూ. ఉదాహరణకి వీరి పెళ్లి ఏ సంప్రదాయంలో జరగాలి? అనే చర్చ వచ్చినప్పుడు ఇద్దరూ కలిసి ఆలోచించుకున్నారు. కేరళ సంప్రదాయంలో పెళ్లి పట్టుమని 15 నిమిషాలు కూడా ఉండదు కాబట్టి కాస్త గుర్తుంచుకునేలా ఉండడానికి ఇక్కడి సంప్రదాయాన్నే ఎంచుకున్నారు. ‘ప్యారా’నాపూల్ చార్మినార్: ప్రేమకు గుర్తుగా మూసీ నదిపై పురానాపూల్ వంతెనను నిర్మించారు. అప్పట్లో దీనిని ‘ప్యారా’నాపూల్ అనేవారు. తాను ప్రేమించిన భాగమతి దక్షిణ మూసీ ప్రాంతంలో ఉండటంతో.. ఉత్తరం వైపు ఉన్న గోల్కొండ నుంచి ప్రాణాలకు తెగించి నదిని దాటుకుంటూ వచ్చి వెళ్లేవాడు మహ్మద్ కులీ కుతుబ్ షా. ఇలా నది నీటిలో ఈదుకుంటూ వెళ్లి రావడం ఎప్పటికైనా ప్రమాదమని భావించిన మహ్మద్ కులీ కుతుబ్ షా తండ్రి సుల్తాన్ ఇబ్రహీం కులీ కుతుబ్ షా మూసీపై కొత్తగా వంతెన నిర్మాణానికి పూనుకున్నాడు. మూసీ నదిపై వంతెన నిర్మిస్తే తన కుమారుడు క్షేమంగా ఇవతలి నుంచి అవతలికి వెళ్లి రావడానికి అనువుగా ఉంటుందని.. అతను ప్రేమించిన భాగమతిని కలిసి వస్తాడని భావించి 1578లో బ్రిడ్జి నిర్మాణం చేపట్టాడు. దీంతో మూసీ నదిపై భాగమతి ప్రేమకు గుర్తుగా ఈ వంతెనను నిర్మించాడు. అప్పట్లో ప్యారానాపూల్‌గా ప్రసిద్ధి గాంచిన ఈ వంతెన.. అనంతర కాలంలో పురానాపూల్‌గా వాడుకలోకి వచ్చింది. -
Love Stories: ప్రేమ అదే ప్రాబ్లం వేరు
ఉన్నోళ్లు లేనోళ్లు... పట్నం పల్లె... ఆ మతం ఈ మతం... వెజ్ నాన్‌వెజ్... సమాజంలో సినిమాల్లో ప్రేమకు ప్రాబ్లమ్స్ సృష్టించాయి. ప్రేమ అలాగే ఉంది. ఇప్పుడు తెలుగు సినిమా ఇంకా సీరియస్ సమస్యలను చర్చిస్తోంది. మొన్నటి ‘ఉప్పెన’ నిన్నటి ‘శ్రీదేవి సోడా సెంటర్’ ఇవాళ్టి ‘లవ్‌స్టోరీ’ ఆ సంగతే చెబుతున్నాయి. కె.బాలచందర్ ‘మరో చరిత్ర’తో ప్రేక్షకులకు ప్రేమ అలల ప్రతాపం చూపించాడు. నిప్పులోన కాలదు నీటిలోన నానదు అని క్లయిమాక్స్ చేశాడు. మీరు ప్రేమికుల్ని నాశనం చేయగలరు... ప్రేమను కాదు అని చెప్పాడు. ఆ సినిమాలో హీరోయిన్ తెలుగు, హీరో తమిళం. పెద్దవాళ్లు వారిని ఎన్ని బాధలు పెట్టాలో అన్నీ పెట్టారు. చివరకు వాళ్లు ప్రాణం తీసుకునేదాకా ఊరుకోలేదు. శేఖర్ కమ్ముల ‘లవ్‌స్టోరీ’లో ‘పంచాయితీల్లో పడాలని ఎవరనుకుంటారు. ప్రేమ అయిపోతుంది. అంతే’ అనే డైలాగ్ ఉంది. నిజం. ప్రేమ అయిపోతుంది. ఆ వయసు, ఆ ఆకర్షణ, ఆ శక్తి, ఆ సహనం ప్రేమికుల్ని వివశుల్ని చేస్తాయి. ప్రేమను తెగించే స్థాయికి తీసుకెళతాయి. ప్రేమికులు మారలేదు. పెద్దలే ఒక సమస్యను వదిలి ఇంకో సమస్యను ముందుకు తెస్తూ వెళుతున్నారు. భారతీరాజా ‘సీతాకోకచిలుక’ కూడా భారీగా హిట్ అయ్యింది. దానిలో హిందూ క్రిస్టియన్ల మధ్య ప్రేమ. క్లయిమాక్స్‌లో ఊరే తగలబడే స్థాయికి వెళుతుంది. ఆర్థికంగా శక్తిమంతుడైన శరత్‌బాబు తన చెల్లెలు ముచ్చర్ల అరుణ ప్రేమను సంగీత పాఠాలు చెప్పుకునే ఇంటి కార్తీక్‌కు ఇవ్వడానికి ఇష్టపడడు. ఇక్కడ మతంతోపాటు ఆర్థిక స్థాయి కూడా విలన్ కావడాన్ని దర్శకుడు చూపిస్తాడు. అయితే ఆ కథ సుఖాంతం అవుతుంది. చదవండి: (చై-సామ్ విడాకులు: సమంతకు భరణం ఎన్ని కోట్లు ఉంటుందంటే..!) ‘కులం’ ప్రేమకు అడ్డం కారాదని, ప్రేమ అలాంటి సంకుచితాల కంటే ఉన్నతమైనదని కె.విశ్వనాథ్ ‘సప్తపది’ తీసినప్పుడు ఆయన నుంచి అలాంటి ప్రేమకథ చూసి ప్రేక్షకులు ఆశ్చర్యపోయారు. ఆయన చెప్పిన పద్ధతికి కన్విన్స్ అయ్యారు. సినిమాను హిట్ చేశారు. అందులో అగ్రహారం అమ్మాయి దళిత కుర్రాడిని ప్రేమిస్తుంది. ‘గోవుల్లు తెల్లన గోపయ్య నల్లన’ పాట ఉంది ఇందులో. పశువు రంగుకీ పాల రంగుకీ సంబంధం లేదు. ఆరాధనకు వర్ణం లేదు. ప్రేమకు కులం లేదు. కలిసిన ఏ రెండు మనసులైనా సప్తపదికి అర్హమైనవే అని దర్శకుడు చెబుతాడు. ఆ తర్వాత చాలారోజులకు హిందీ ‘బాబీ’ స్ఫూర్తితో తేజ ‘నువ్వు నేను’ తీశాడు. ఇందుకు సాంస్కృతిక తారతమ్యం ప్రధానంగా విభేదం తెస్తుంది. డబ్బు రెండు వర్గాల దగ్గర ఉంది. కాని ఒకరు సూటూ బూటూ వేసే బంగళావాళ్లైతే మరొకరు పాడీ పశువూ యాస ఉన్నవారు. ‘మీపెద్దోళ్లున్నారే’ అని హీరో ఉదయ్‌కిరణ్ అన్నట్టు పెద్దోళ్ల లెక్కలు పెద్దోళ్లవి. పిల్లలకు ఆ లెక్కలు పట్టవు. వారి దృష్టిలో వాటి విలువ గుండుసున్నా. చదవండి: (సోషల్ మీడియా వేదికగా భావోద్వేగానికి లోనైన సమంత, పోస్ట్ వైరల్) కులపట్టింపు ప్రేమికులు పెళ్లి చేసుకున్నాక కూడా వెంటాడుతుందని తమిళంలో నుంచి తెలుగులోకి డబ్ అయిన ‘ప్రేమిస్తే’ చెప్పింది. అందులో పారిపోయిన ప్రేమికులను వెంటాడి విడదీస్తారు. మరాఠిలో ‘సైరా’ ఇదే పాయింట్‌ను పట్టుకుని పరువు హత్యను చూపించి భారీ విజయం నమోదు చేసింది. అందులో పారిపోయి పెళ్లి చేసుకుని పిల్లల్ని కన్నాక కూడా ఆ ప్రేమికులను కుల అహంభావులు చంపుతారు. ఇప్పుడు ఈ కుల అహంభావం తెలుగు సినిమాల్లో చర్చకు వస్తోంది. ‘మంచివాడే కానీ మనవాడు కాడు’ అనే డైలాగ్ ఉంది కరుణ కుమార్ తీసిన ‘శ్రీదేవి సోడా సెంటర్’ సినిమాలో. ఈ ‘మనవాడు’ కాకపోవడమే హీరోయిన్ తండ్రికి సమస్య. అతనిది సోడా వ్యాపారం. కాని కుల పట్టింపు విషయంలో రాజీ పడడు. చివరకు కన్నకూతురినే పరువు కోసం హత్య చేస్తాడు. ‘ఉప్పెన’లో కూడా అంతే. హీరోయిన్‌కు ఆస్తి ఉంది. కులం ఉంది. హీరో కులం వాళ్లకు ‘చాల్లేదు’. సముద్రం మీద సాహసంగా వెళ్లి వేట చేసే కుర్రాడు ఎంత యోగ్యుడైనా హీరోయిన్ తండ్రి అహానికి సరిపోడు. చివరకు హీరో మగతనానికే నష్టం కలిగించే స్థాయికి వెళతాడు. ‘లవ్‌స్టోరీ’లో హీరో కులం హీరోయిన్ ఇంటికి బయట చెప్పులు విడిచి వచ్చే స్థాయికి ‘నెట్టబడిన’ కులం. ఊళ్లో ఉన్న వివక్షను తట్టుకోలేక సిటీకి వచ్చి బతుకుతుంటే ప్రేమ విషయంలో పెళ్లి విషయంలో ఊరు హీరోను తరుముతూనే ఉంటుంది. చివరకు శ్మశానం కూడా అగ్రకులాలకు ఒకటి... అణగారిన కులాలకు ఒకటి. ‘తిరగబడి ప్రేమను సాధించుకుందాం’ అనుకుంటాడు హీరో. తిరగబడే తెగింపుకు నెడుతున్నది ఎవరు? సమాజం అయినా సినిమా అయినా ప్రేమను తప్పించుకోలేదు. సమాజం ప్రేమికులకు ఎన్నో సవాళ్లు విసురుతున్నా ప్రేమికులు ఓడిపోతుండవచ్చు కాని ప్రేమ ఓడిపోవడం లేదు. అది మళ్లీ మళ్లీ జన్మిస్తూనే ఉంది. ఇవాళ చాలా కుటుంబాల్లో ప్రేమ వివాహాలు జరుగుతున్నాయి. వాటిలో కులాంతరం, మతాంతరం, ఖండాంతరం ఉన్నాయి. ఒప్పుకునే మనసుంటే ఎంత పెద్ద సమస్యా సమస్య కాకుండా పోతుంది. ఒప్పుకోకపోతే చిన్న సమస్య కూడా సమస్యే. ప్రేమ పుట్టనే కూడదు. పుట్టాక దానిని సఫలం చేసుకోవడానికి ప్రేమికులు చేసే ప్రతి పోరాటం ఇక ముందు కూడా సినిమా కథే అవుతుంది. -
వైరల్ వీడియో: ‘సారంగదరియా’పై పేరడి సాంగ్
-
‘సారంగదరియా’పై పేరడి సాంగ్ వైరలయ్యా..
ఎవరి నోట విన్నా.. ఎవరి ఫోన్లోనైనా.. సారంగదరియా పాట మార్మోగుతోంది. యూట్యూబ్‌లో ఇటీవల వంద మిలియన్ల వ్యూస్ సొంతం చేసుకున్న సారంగదరియా పాటకు పేరడి పాట ఒకటి ప్రస్తుతం వైరల్ అయ్యింది. కరోనా టీకాపై సారంగదరియా పాటను రీమేక్ చేస్తూ ఓ ప్రభుత్వ ఉపాధ్యాయుడు రాశాడని తెలుస్తోంది. ఆ పాటకు సంబంధించిన లిరిక్స్ సోషల్ మీడియాలో ట్రెండింగ్‌గా మారింది. దీంతో చాలామంది వాట్సప్ స్టేటస్లు.. ఫేసుబుక్ పోస్టులు చేస్తున్నారు. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో అక్కినేని నాగచైతన్య, సాయిపల్లవి జోడిగా లవ్‌స్టోరీస్ సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమాలోని సారంగదరియా పాటను విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ పాట విడుదలై ఎంత హిట్టయ్యిందో అంత వివాదాస్పదమైంది. ఆ పాటపై ఎన్నో వివాదాలు కొనసాగుతున్నాయి. ఇటీవల ఈ పాట వివాదంపై ఓ షోలో దర్శకుడు శేఖర్ కమ్ముల భావోద్వేగానికి గురయిన విషయం తెలిసిందే. అవన్నీ పక్కన పెడితే ప్రస్తుతం ట్రెండింగ్ అవుతున్న సారంగదరియా పేరడీ సాంగ్ చూడండి.. వినండి. ఓ పాప అద్భుతంగా ఆ పాటను పాడుతూ ఆకట్టుకుంది. కుడి భుజం మీద టీకా మీరు వేసుకొనుటకిది మోకా వ్యాధి రమ్మన్న రాదురా కాకా దాని పేరే కోవిడ్ టీకా.. వారి ఎడమ భుజం మీద టీకా జర వేసుకొనుడి ఇది మోకా వ్యాధి రమ్మన్న రాదురా కాకా దాని పేరే కోవిట్ టీకా మక్కుకి కాటన్ మాస్కుల్ లేకున్న బతుకులు ముష్కిల్ చేతికి ప్లాస్టిక్ గ్లౌజుల్ లేకున్న ఉంటయ్ రిస్కుల్ అడుగడుగున కోవిడ్ ఆంక్షల్ పాటిస్తే ఉండవు చావుల్ ఒంట్లో మజిల్సు నొప్పుల్ లేకున్న జ్వరము నిప్పుల్ దివి కంటితో చూడగా తప్పుల్ తుర్రున పోతయిరా ముప్పుల్ టీకా… టీకా… టీకా ఇది కరోనా కట్టడి మోకా వ్యాధి రమ్మన్న రాదురా కాకా దాని పేరే కోవిడ్ టీకా -
వాలెంటైన్స్ డే: మంత్రి కొప్పుల ఈశ్వర్ లవ్ స్టోరీ
► జగిత్యాల జిల్లాలో.. ఆ ఇద్దరూ ప్రేమించుకున్నారు. అయితే, ప్రేమ విషయం పెద్దలకు చెప్పలేక యువతి ఉరివేసుకుంది. ఇది తెలిసి.. దుబాయ్‌లో ఉన్న ప్రియుడు ‘నువ్వు లేక నేను లేను’ అంటూ సెల్ఫీ వీడియో తీసుకుంటూనే బలవన్మరణానికి పాల్పడ్డాడు. ► పెద్దలు పెళ్లికి అంగీకరించరనే కారణంతో ఆ ప్రేమికులిద్దరూ కలిసి బావిలోకి దూకి బలవన్మరణానికి పాల్పడ్డారు. మహబూబాబాద్ జిల్లా గార్ల మండలం వడ్లతండాలో చోటుచేసుకున్న ఘటన ఇది. ► నిజామాబాద్ జిల్లాలో.. వారిద్దరివీ వేర్వేరు కులాలు.. ప్రేమతో ఒక్కటవ్వాలనుకున్నారు. కానీ, పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకోవాలని ఒకరు.. కాదని మరొకరు అభిప్రాయ భేదాలకు గురై.. చివరకు ఇద్దరూ ఉరివేసుకున్నారు. కేవలం పెద్దలు పెళ్లికి అంగీకరించరనే భయంతోనే గడిచిన మూడు నెలల్లో పదిహేనుకుపైగా ప్రేమజంటలు ఆత్మహత్యలకు పాల్పడ్డాయి. చనిపోవడానికి కూడా ధైర్యం కావాలి.. అదే ధైర్యాన్ని వారు పెద్దల్ని ఒప్పించడానికి లేదా కలిసి బతకడానికి చూపాలని అంటున్నారు ఒకప్పటి ప్రేమికులు. కులమతాలు వేరైనా.. ‘ప్రేమ కోసం ధైర్యంగా నిలబడ్డాం. ఆ ధైర్యంతోనే ఇరుపక్షాల పెద్దల్ని ఒప్పించాం. ఇప్పుడెలాంటి స్పర్థలు లేకుండా ఆనందంగా ఉన్నాం’ అంటున్నాయి ‘ప్రేమ–పెళ్లి’లో సక్సెస్ అయిన జంటలు. నొప్పించకుండా పెద్దలను ఒప్పించగలగాలి.. అందుకోసం ఎన్నాళ్లైనా వేచిచూడగలగాలి.. ఇలాంటివి లోపించే నేటి ప్రేమలు విషాదాంతమవుతున్నాయని చెబుతున్న వీరు.. నాడు తామేం చేశామన్న సంగతిని ప్రేమికుల దినోత్సవం సందర్భంగా ‘సాక్షి’ తో పంచుకున్నారు. చనిపోవడానికైనా ధైర్యం కావాలి.. ఆ ధైర్యంతోనే కలిసి బతకొచ్చు ప్రేమలో సఫలం కావడానికి మేం చేసింది ఇదీ.. ‘ప్రేమికుల దినోత్సవం’ సందర్భంగా నాటి ప్రేమజంటలు చెబుతున్న సక్సెస్ స్టోరీస్ పెద్దల అంగీకారంతో.. జగిత్యాల: ‘ప్రేమించి పెళ్లి చేసుకున్నా.. పెద్దల్ని ఒప్పించి చేసుకున్నా.. ఒకరినొకరు అర్థం చేసుకోవడమనేది ముఖ్యం’ అంటున్నారు సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ దంపతులు. 37 ఏళ్ల కిందట వీరు పెద్దల సమక్షంలో ఆషాఢమాసంలో కులాంతర వివాహం చేసుకున్నారు. నిజామాబాద్ జిల్లా బోధన్‌కు చెందిన స్నేహలత తండ్రి కమ్యూనిస్ట్ పార్టీ నాయకుడు. ఆ సమయంలో సింగరేణిలో పనిచేస్తూ కమ్యూనిస్ట్ పారీ్టలో ఉన్న కొప్పుల ఈశ్వర్ స్నేహలతను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఆమె అసలు పేరు కోకిలాదేవి. కమ్యూనిస్ట్ ఉద్యమ సమయంలో చనిపోయిన తన తోటి సహచరి స్నేహలత పేరును ఈశ్వర్ తన సతీమణికి పెట్టుకున్నారు. ఉద్యమం కలిపింది.. తొర్రూరు: ఆదిలాబాద్ జిల్లా లక్సెట్టిపేటకు చెందిన సబీహాబాను, మహబాబూబాద్ జిల్లా తొర్రూరుకు చెందిన మంగళపల్లి శ్రీనివాస్ 25 ఏళ్ల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నారు. ఆదివాసీలు, గిరిజనుల సమస్యలపై శ్రీనివాస్‌తో కలిసి సబీహాబాను ఉద్యమాలు చేపట్టింది. ఆ ఉద్యమ సాహచర్యం కాస్తా ప్రేమ.. పెళ్లికి దారితీసింది. ఇంటర్ వరకు చదివిన సబీహాబానును హిందీలో పీజీ చదివించి ప్రభుత్వ టీచర్ ఉద్యోగం సాధించేలా శ్రీనివాస్ సహకరించాడు. ప్రస్తుతం ఆమె చెర్లపాలెం ప్రభుత్వ పాఠశాలలో హిందీ టీచర్‌గా పనిచేస్తున్నారు. శ్రీనివాస్ ప్రత్యక్ష రాజకీయాల్లో చేరి తొర్రూరు జెడ్పీటీసీగా గెలుపొందారు. వీరికి ఇంజనీరింగ్ చదివే వాసే, 9వ తరగతి చదివే అమన్ సంతానం. ‘ప్రేమించడం తప్పుకాదు. నేడు దాన్ని సాధించేందుకు ఎంచుకునే మార్గాలే అభ్యంతరకరంగా ఉంటున్నా’యనేది వీరిమాట. ఒప్పించే చేసుకున్నాం మంచిర్యాలటౌన్: ‘మాది ప్రేమ వివాహమే. అయితే పెద్దల్ని ఒప్పించి చేసుకున్నాం’ అంటున్నారు మంచిర్యాల జిల్లా కలెక్టర్ భారతి హోళికేరి. ‘మాది కర్ణాటకలోని బెల్గాం జిల్లా గోకాక్ గ్రామం. సివిల్స్ సాధించాలనే లక్ష్యంతో హైదరాబాద్ ఆర్సీ రెడ్డి ఐఏఎస్ స్టడీసర్కిల్‌లో 2002లో చేరాను. అప్పుడే ఏపీలోని కడప జిల్లా పొద్దుటూరుకు చెందిన సీవీ శంకర్‌రెడ్డి పరిచయమయ్యారు. మా ఇద్దరి భాషలు, రాష్ట్రాలు వేరు. అయినా ప్రేమ చిగురించింది. అయితే అది చదువుకు, లక్ష్యానికి అడ్డురాకూడదని నిర్ణయించుకున్నాం. 2002–03లో కోచింగ్ పూర్తి చేసుకుని ఇళ్లకు వెళ్లాం. ప్రేమ గురించి ఇంట్లో వాళ్లకు చెప్పాం. అలా పెద్దలను ఒప్పించి 2007లో పెళ్లి చేసుకున్నాం. 2009లో ఐపీఎస్‌కు, 2010లో ఐఏఎస్‌కు ఎంపికయ్యా. ఆయనకు తెలంగాణ టూరిజంలో ఉద్యోగం వచి్చంది. ప్రస్తుతం ఆయన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా టూరిజం ఎగ్జిక్యూటివ్ డైరక్టర్. ఇప్పుడు మాకో పాప. పేరు ఆధ్య. మా అత్తగారు నన్ను కోడలిగా కాకుండా కూతురుగా చూసుకుంటుంది. అలాంటి మంచి కుటుంబాన్ని నా భర్త అందించారు. ఒప్పించడానికి నాలుగేళ్లు.. కోదాడ: ‘ప్రేమించినంత తేలిక్కాదు తల్లిదండ్రులను ఒప్పించడం. అందుకు ఓపికుండాలి.. నమ్మివచ్చిన భాగస్వామికి ఇబ్బంది రాకుండా చూసుకోవాలి. మేం ప్రేమ వివాహం చేసుకున్నాక తల్లిదండ్రులను ఒప్పించడానికి నాలుగేళ్లు పట్టింది. అందరం కలిసిపోయాం. పిల్లలతో ఆనందంగా ఉన్నా’మని చెబుతున్నారు కోదాడకు చెందిన కందుల మధు– విజయలక్ష్మి దంపతులు. ఉస్మానియా యూనివర్సిటీలో 2010లో ఎంబీఏ చదివే రోజుల్లో ఏర్పడిన పరిచయం ప్రేమగా మారి పెళ్లి చేసుకోవాలనుకున్నారు. సామాజికవర్గాలు వేరు కావడంతో పెద్దలు ఒప్పుకోలేదు. దీంతో రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నారు. ఇప్పుడు ఇద్దరు పిల్లలు. నాలుగేళ్ల తరువాత వీరి అన్యోన్య దాంపత్యాన్ని చూసిన ఇరుపక్షాల పెద్దలు ఇప్పుడు దగ్గరయ్యారు. నలభై ఐదేళ్ల క్రితం.. డోర్నకల్: ‘నలభై ఐదేళ్ల క్రితం.. ఇప్పటితో పోలిస్తే ఆ కాలంలో కట్టుబాట్లు ఎక్కువ. పెద్దలు కొందరు సరేనన్నారు. మరికొందరు కాదన్నారు. అయినా ధైర్యంగా పెళ్లి చేసుకుని నిలబడ్డాం’ అంటున్నారు డోర్నకల్ అంబేడ్కర్‌నగర్‌కు చెందిన దేవకృపామణి, ఉప్పరి నారాయణ. వీరి కులమతాలు వేర్వేరు. పక్కపక్కిళ్లలో ఉండటం, ఒకే పాఠశాల, కళాశాలలో చదువుతున్న క్రమంలో ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది. పెళ్లి చేసుకుంటామంటే ఇరుపక్షాల నుంచి భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. పెళ్లి చేసుకుని ఒక్కటవ్వడమే కాక.. అందరినీ మెప్పించాలని ధైర్యంచేసి 1976, నవంబర్ 19న పెళ్లి చేసుకున్నారు. తర్వాత ఇరు కుటుంబాలు కలసిపోయాయి. పిల్లల్లేకున్నా ఒకరికొకరుగా జీవితం సాగిస్తున్నారు నారాయణ, కృపామణి దంపతులు. ‘ప్రస్తుతం ప్రేమ పేరుతో జరుగుతున్న హింస, పెళ్లి చేసుకోలేమనే భయంతో ప్రాణాలు తీసుకోవడం వంటి సంఘటనలు వింటుంటే బాధ కలుగుతుంది. ధైర్యంగా ముందడుగు వేస్తే అన్నీ సర్దుకుంటాయి’ అంటున్నారు వీరు. నాలుగేళ్లకు ఒప్పించాం.. మహబూబాబాద్: తమ ప్రేమ.. పెళ్లి వైపు నడిపించిన రోజుల్ని గుర్తుచేసుకున్నారు మహబూబాబాద్ ఎమ్మెల్యే శంకర్‌నాయక్. ‘32 ఏళ్ల క్రితం నేను వరంగల్ ఆర్ఈసీ (ప్రస్తుతం నిట్)లో చదువుకుంటున్న సమయంలో ఒక ఫెస్ట్‌లో మెడిసిన్ చదువుతున్న సీతామహాలక్ష్మి (గుంటూరు జిల్లా తెనాలి) పరిచయమైంది. అదికాస్తా ప్రేమగా మారింది. ఇద్దరి సామాజిక వర్గాలు వేర్వేరు. ఆమె ఇంట్లో విషయం తెలియడంతో.. మా ఇద్దరి మధ్య మాటలు బందయ్యాయి. అప్పట్లో ఇప్పటి మాదిరి సమాచార వ్యవస్థ లేదు. మా ప్రేమను కమ్యూనికేట్ చేసుకోవడానికి ఇబ్బంది పడేవాళ్లం. ఇద్దరం ప్రభుత్వోద్యోగాలు సాధించి పెద్దల్ని ఒప్పిద్దామనుకుంటే అప్పుడూ నిరాకరణే ఎదురైంది. వాళ్ల అంగీకారం కోసం నాలుగేళ్లు వేచిచూశాం. అయితే, మా ప్రేమలోని నిజాయితీని తరువాత పెద్దలు గుర్తించారు. చివరకు 1994లో వారే దగ్గరుండి పెళ్లి చేశారు. నేను ఆర్అండ్బీ డీఈగా ఉద్యోగం వదిలి రాజకీయాల్లోకి వచ్చినప్పుడు సీతామహాలక్ష్మి ఎంతో సహకరించింది. ఆమె డాక్టర్. సూర్యచంద్ర, తేజస్వి.. మాపిల్లలు. ప్రేమకు కులమతాలు అడ్డుకాదు. కాకపోతే, జీవితంలో స్థిరపడి, పరస్పరం నమ్మకం, భరోసా ఏర్పడ్డాకే పెళ్లి చేసుకోవాలి. తొందరపడి ప్రేమలోకి దిగి.. పెద్దల భయంతో ఆత్మహత్యలు చేసుకుంటున్న ప్రేమికులను చూస్తే బాధ కలుగుతుంది’. ఒప్పించి.. మెప్పించాం కోల్‌సిటీ (రామగుండం): ‘మనస్ఫూర్తిగా ప్రేమించుకుంటే కనుక పెద్దలను ఒప్పించాలి’ అంటున్నారు పెద్దపల్లి జిల్లా గోదావరిఖనికి చెందిన డాక్టర్లు మహేందర్‌కుమార్, లావణ్య. ఖమ్మం జిల్లా ఇల్లందుకు చెందిన మహేందర్కుమార్కు, గోదావరిఖని లక్ష్మీనగర్‌కు చెందిన లావణ్యకు సంగారెడ్డిలోని ఎంఎన్ఆర్ మెడికల్ కాలేజీలో 2006లో సీటొచి్చంది. చదువులో చురుగ్గా ఉండే ఇద్దరూ ప్రేమలో పడ్డారు. అయితే కులాలు వేర్వేరు. మహేందర్ దాపరికం లేకుండా ఇంట్లో విషయం చెప్పి ఒప్పించాడు. లావణ్యా అలాగే చేసింది. చదువుకు తమ ప్రేమ అడ్డుకాకుండా.. ఇద్దరూ డాక్టర్లయ్యాక 2012 నవంబర్ 29న పెద్దల సమక్షంలో ప్రేమపెళ్లి చేసుకున్నారు. ఈ దంపతులు నేటి ప్రేమల గురించి మాట్లాడుతూ– ‘ప్రేమలో పరిపక్వత ఉండాలి. పేరెంట్స్‌ను ఒప్పించి పెళ్లి చేసుకోగలమనే నమ్మకం ఉండాలి. మా కాలేజీలో దాదాపు 50 ప్రేమజంటల్ని చూశాం. కేవలం ఆరుజంటలే పెళ్లి చేసుకున్నాయి’ అని చెప్పారీ దంపతులు. మహేందర్ ప్రస్తుతం పెద్దపల్లి జిల్లా కాల్వశ్రీరాంపూర్ పీహెచ్సీలో మెడికల్ ఆఫీసర్, డీడీవోగా, డాక్టర్ లావణ్య జగిత్యాల జిల్లా మల్యాల పీహెచ్సీలో మెడికల్ ఆఫీసర్, డీడీవోగా పని చేస్తున్నారు. -
తనని మనసులో ఉంచుకొని వేరే పెళ్లి చేసుకున్నాను, అప్పుడు...
ప్రేమ అనేది ఎప్పుడు, ఎక్కడ, ఎలా మొదలవుతుందో ఎవరం చెప్పలేము, ఎవరికి తెలియదు కూడా. అంతేకాకుండా ప్రేమకి వయస్సుతో పని లేదంటారు. చిన్న పెద్ద అని ఏ తేడా లేకుండా ప్రతి ఒక్కరికీ ఈ ప్రేమ అవసరమే. మన జీవితంలో ఈ ప్రేమ మనకి తెలియకుండానే ఎక్కడో, ఎప్పుడో మొదలయి, ఇంకెక్కడో, ఇంకెప్పుడో మనతో కలిసిపోతుంది. అలా ప్రేమంటే ఎంటో తెలియని వయస్సులో మన జీవితంలోకి వచ్చి ఆ ప్రేమానుభూతుల్ని పరిచయం చేసి వెళ్లిపోయి మళ్లీ మనకి ఆ ప్రేమ దోరుకుంతుందో లేదో అనే సమయంలో మనల్ని వెతుక్కుంటూ వస్తే....??? అదే నా ప్రేమ కథ. నాకు అప్పుడు సరిగ్గా పన్నెండేళ్ళు . అప్పుడు నాకు ప్రేమంటే ఏంటో కూడా సరిగ్గా తెలియదు. అప్పుడే ప్రేమ నాకు పరిచయం అయింది. నేను నా చిన్నతనం నుంచి నాకు ఊహ తెలిసినప్పటి నుండి ప్రతి వేసవి సెలవులకి మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్లేదాన్ని. ప్రతి సంవత్సరం సెలవులు అక్కడే గడిపేదాన్ని. అలాగే నా పన్నెండేళ్ళ వయసప్పుడు వేసవి కాలం సెలవులు రాగానే యధావిధిగా మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్లాను. కానీ ఆ వేసవి సెలవులు నాకు మర్చిపోలేని జ్ఞాపకాలని ఇస్తాయి అనుకోలేదు. మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి దగ్గరలో నా స్నేహితుడు సాయి ఉంటాడు, నేను అక్కడికి వెళ్ళిన ప్రతి సారి సాయిని కలిసేదాన్ని. అలాగే అప్పుడు కూడా కలవడానికి వెళ్ళాను. అప్పుడే నేను అక్కడ సాయి తో తన స్నేహితుడు కూడా ఉండడం చూశాను. సాయి నాకు తనని పరిచయం చేశాడు, తన పేరు విక్కీ. అలా సాయిని కలవడానికి వెళ్లిన ప్రతి సారి విక్కీ కూడా అక్కడే ఉండడం తో మెల్ల మెల్లగా మా ఇద్దరి మధ్య పరిచయం ఏర్పడింది. ఎందుకో తెలియదు నేను విక్కీ తో ఉన్నంత సేపు, తనతో మాట్లాడినప్పుడు నాకు ఏదో తెలియని సంతోషం కలిగేది. తనతో అలాగే ఇంకాసేపు ఉంటే బాగుండు అనిపించేది. అలా సెలవులు గడిచిపోవడంతో నేను మా ఇంటికి తిరిగి వెళ్లాను. తనని విడిచి వెళ్తుంటే ఏదో బాధ కానీ తప్పదు ఇక వెళ్లాల్సిందే మళ్లీ వేసవి కాలం సెలవులు ఎప్పుడు వస్తాయో అని ఎంతో ఆతృతతో చూస్తూనే ఉన్నా అంతలోనే రానే వచ్చాయి. ఇక ఎంతో ఆనందంతో, ఎప్పుడు లేని సంతోషంతో వెళ్ళాను. (తప్పు నాదీ...శిక్ష ఆమెకి) విక్కీ నీ కలుద్దాం అని ఎంతో సంతోషంగా సాయి దగ్గరికి వెళ్ళాను. కానీ అప్పుడే నాకు తెలిసింది విక్కీ వాళ్ళ తండ్రికి గవర్నమెంటు ఉద్యోగం, వేరే ఊరికి ట్రాన్స్ఫర్ కావడం వలన వాళ్ళు ఆ ఊరు వదిలి వెళ్ళిపోయారు అని . ఏ ఊరో కూడా సాయి కి తెలియదు అని చెప్పాడు. నా ఆశలు అన్ని అడియాశలు అయ్యాయి. ఇక అక్కడ ఉండలేక మా ఇంటికి వచ్చేశాను. కానీ ప్రతి సంవత్సరం విక్కీ వస్తాడేమో అన్న చిన్న ఆశతో మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తూ ఉండేదాన్ని. కానీ తనని మాత్రం మళ్లీ కలవలేదు. ఎందుకో తెలియదు కానీ తను మాత్రం నా మనసుకి చాలా దగ్గర అయ్యాడు, తనతో గడిపిన అన్ని రోజులు ఎంతో సంతోషంగా ఉండేవి, తనని తలచుకొని రోజు అంటూ ఉండేది కాదు. ఆ కొద్ది రోజుల మా పరియచయానికి ఏ పేరు పెట్టాలో కూడా నాకు అర్థం కాలేదు. అలా అలా నా చదువు పూర్తయింది. మా తల్లిదండ్రులు నాకు పెళ్లి చెయ్యాలని ఒక మంచి సంబంధం తెచ్చారు. కానీ అప్పటికి నా మనసులో ఇంకా విక్కీ నే ఉన్నాడు, తనని నేను చాలా వెతికాను, తనకోసం నేను చెయ్యని ప్రయత్నం అంటూ లేదు. అయినా విక్కీ నాకు దొరకలేదు. ఇక చేసేది ఏమీ లేక మా తల్లిదండ్రులు తెచ్చిన అబ్బాయినే నేను పెళ్లి చేసుకున్నాను, తన పేరు విక్రమ్, తనది గవర్నమెంటు ఉద్యోగం. విక్రమ్ కూడా చాలా మంచివాడు, నన్ను ఎంతో సంతోషంగా చూసుకుంటున్నాడు. అయినప్పటికీ నా మనసులో ఏదో వెలితి, విక్కీని మళ్లీ కలవలేకపోయా అని. (తను చనిపోయాడు అనుకున్నాను, కానీ...!) కలలో కూడా విక్కీని మళ్లీ కలుస్తానో లేనో అని అనుకునే సమయంలో, మళ్లీ విక్కీ రాకా నా జీవితంలో సంతోషాన్నిచ్చింది. పెళ్లి అయిన మూడు నెలలకి నేను విక్రమ్ తో కలిసి తన అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాను. అక్కడ అనుకోకుండా నేను విక్రమ్ చిన్నప్పటి ఫోటోని చూశాను. ఆ ఫోటో చూడగానే నేను ఆనంద, ఆశ్చర్యాలతో ఉండిపోయాను. విక్రమ్ మరెవరో కాదు నేను చిన్నప్పుడు కలిసిన విక్కీనే...విక్రమ్. ఎంతో సంతోషంగా విక్రమ్ దగ్గరికి వెళ్ళి నేనే తన చిన్నప్పటి నీతూని అని చెప్పాలి అనేలోపు విక్రమ్ నా దగ్గరికి వచ్చి.... నేను విక్కీని కలిశాక నాకు ఎలాంటి అభిప్రాయాలు, ఎలాంటి భావనలు అయితే కలిగాయో విక్కీ కి కూడా అలాంటి భావనలే కలిగాయి అని ఆ తర్వాత వాళ్ళు వేరే ఊరు వెళ్ళడం వల్ల మళ్లీ కలవలేకపోయా అని, తర్వాత కొన్ని సంవత్సరాలకు సాయి దగ్గరికి వెళ్లి నా వివరాలు అన్ని తెలుసుకుని, ఇప్పటికీ నేను తన గురించి వెతుకుతున్న అని తెలుసుకుని, తన ఇంట్లో వాళ్ళతో మాట్లాడి పెళ్లి వరకు తీసుకొచ్చానని చెప్పాడు. తన మాటలు విని నేను ఆనందంతో ఉప్పొంగి పోయాను. ఇలా విక్కీనే.. విక్రమ్ గా వచ్చి మా చిన్నప్పటి పరిచయానికి పేరే "ప్రేమ" అని నా ప్రశ్నకి సమాధానాన్ని, నా జీవితానికి ప్రేమని, సంతోషాన్ని ఇచ్చాడు. ఇది మా కథ నిత్య - విక్రమ్ ( నీతూ ❤విక్కీ ) -
తప్పు నాదీ...శిక్ష ఆమెకి
అబద్ధం అనేది ఈ ప్రపంచంలో ప్రతి మనిషి తన జీవితంలో ఎదో ఒక విషయంలో చెప్తాడు. కానీ అబద్ధం చెప్పడం వలన కలిగే అనర్థాలు కూడా చాలానే ఉన్నాయి. అందుకే అబద్ధం చెప్పి అన్ని అనర్థాలకు కారణం అయ్యే బదులు నిజం చెప్పి సంతోషంగా ఉండడం ఉత్తమం. అబద్ధం మనం చెప్పిన ఆ ఒక్క క్షణం ప్రశాంతతని ఇస్తుంది కావచ్చు, కానీ నిజం చెప్పడానికి కష్టం అయినా అది మనకి జీవితాంతం ప్రశాంతతని ఇస్తుంది. మనం ఆడే అబద్దం ఇతరుల జీవితంలో ఊహించని మలుపు కి దారి తీస్తే.. ఇప్పుడు నేను మీకు చెప్పబోయే నా ఈ కథ కూడా అలాంటిదే. ఒక్క క్షణం సంతోషం కోసం నేను ఆడిన అబద్ధం నా జీవితంలో ఎలాంటి బాధని తీసుకొచ్చిందో నేను మీతో పంచుకోబోతున్నాను. నేను బి.టెక్ చదువుతున్న రోజుల్లో నాకు ముగ్గురు స్నేహితులు ఉండేవారు. నేను ఎక్కువగా ఆ ముగ్గురితోనే ఉండేవాడిని, వారితోనే కళాశాలకు వెళ్ళడం రావడం చేసేవాడిని. ప్రతి ఒక్కటి వారితోనే పంచుకునేవాడిని. నా స్నేహితులందరిలో కూడా నేను ఆ ముగ్గురిని ఎక్కువగా నమ్మేవాడిని. అంతేకాకుండా మా కళాశాలలో నాకు ఒక అమ్మాయి అంటే చాలా ఇష్టం. ఆ అమ్మాయి పేరు రక్ష. నేను ఆ కళాశాలలో చేరిన మొదటి రోజే రక్షని చూశాను. నేను తనని చూసిన క్షణం నుండే తనని ప్రేమించడం మొదలు పెట్టాను. ఇప్పటికీ ప్రేమిస్తూనే ఉన్నాను కానీ నా ప్రేమ విషయం మాత్రం రక్ష కి ఇంతవరకు చెప్పలేదు. కారణం రక్ష నన్ను ఒక మంచి స్నేహితుడిగా భావిస్తోంది. ఇప్పుడు నేను తనని ప్రేమిస్తున్న విషయం చెప్తే రక్ష తన స్నేహాన్ని తప్పుగా అర్థం చేసుకున్నానని ఎక్కడ బాధ పడుతుందో అని, నాతో మాట్లాడడం ఎక్కడ మానెస్తుందో అని, తనని బాధ పెట్టడం ఇష్టం లేక ప్రేమికుడిలా కాకపోయినా ఒక మంచి స్నేహితుడిలా అయినా ఉందాం అని చెప్పలేదు. నా స్నేహితులు ముగ్గురికి కూడా నా ప్రేమ విషయం తెలుసు. అది అలా ఉండగా బీ.టెక్ నాలుగవ సంవత్సరం రానే వచ్చింది. రక్ష కి నాకు మధ్య స్నేహం ఇంకా పెరిగి మేమిద్దరం చాలా దగ్గరయ్యారు. అది గమనించిన నా స్నేహితులు నాతో రక్ష కూడా నన్ను ప్రేమిస్తుందనీ అందుకే నాతో అంత సన్నిహితంగా ఉంటుందనీ చెప్పారు. ఇక మిగిలింది ఒక్క సంవత్సరం మాత్రమే ఇప్పుడు కూడా నేను నా ప్రేమ విషయం చెప్పకపోతే తనని కోల్పోయి చాలా బాధ పడాల్సి వస్తుంది అని హెచ్చరించారు. వెంటనే వెళ్లి రక్ష కి నా ప్రేమ విషయం చెప్పమన్నారు. నేను కూడా ఏమి ఆలోచించకుండా నా స్నేహితులు చెప్పింది విని రక్ష దగ్గరికి వెళ్ళి నా ప్రేమ విషయం చెప్పాను. కానీ ఇక్కడ నేను మొదట్లో అనుకున్నదే నిజం అయింది. రక్ష నన్ను ప్రేమించడం లేదు. నన్ను ఓ మంచి స్నేహితుడిగానే భావిస్తోంది. ఇక చేసేది ఏమి లేక తిరిగి నా స్నేహితుల దగ్గరికి వచ్చాను. అప్పటికే నా స్నేహితులు రక్ష కూడా నన్ను ప్రేమిస్తుంది అనే నమ్మకంతోనే ఉన్నారు, వారికి రక్ష నన్ను ప్రేమించడం లేదని చెప్పలేక, చెప్తే స్నేహితుల ముందు నా పరువు పోతుందేమో అని ఆలోచించి వారికి రక్ష కూడా నన్ను ప్రేమిస్తుంది అని, ఆ ఒక్క క్షణం సంతోషం, ప్రశాంతత కోసం అబద్ధం చెప్పాను. ఇక మా ప్రేమ విషయం నా స్నేహితుల ద్వారా కళాశాల మొత్తం తెలిసింది. అంతేకాకుండా మా కళాశాలలోనే రక్ష వాళ్ళ బంధువుల అమ్మాయి కూడా చదువుతుండడం తో తనకి కూడా ఈ విషయం తెలిసింది. ఆ అమ్మాయి రక్ష ఎవరినో ప్రేమిస్తుంది అని తన ఇంట్లో వాళ్ళకి చెప్పేసింది. వారు రక్ష కి బంధువులే కావడం వలన ఆ విషయం రక్ష వాళ్ళ ఇంట్లో అందరికి తెలిసింది. (కోవిడ్–19 లవ్‌స్టోరీ) రక్ష ప్రేమ విషయం తెలిసి తన పరువు అందరి ముందు పోయింది అని రక్ష తండ్రి తనని చదువు మాన్పించి, తను ఎవరిని ప్రేమించడం లేదని ఎంత చెప్పినా వినకుండా వేరే సంబంధం తెచ్చి పెళ్లి చేశాడు. కానీ ఈ విషయాలేవీ కూడా అప్పటికి నాకు తెలియవు. నేను నా బీ.టెక్ పూర్తి చేసుకుని, రక్ష ఎలాగో నన్ను ప్రేమించడం లేదు కదా అని తనని మెల్ల మెల్లగా మర్చిపోతూ, జీవితంలో పైకి ఎదగాలని ఒక మంచి ఉద్యోగం చేస్తూ బెంగుళూర్ లో స్థిర పడ్డాను. కొన్నాళ్ళకు నా తల్లిదండ్రులు ఒక మంచి సంబంధం తెచ్చి నా పెళ్లి చేశారు, ఆ అమ్మాయి చాలా మంచిది, నేను తనతో సంతోషంగా నా జీవితాన్ని గడుపుతున్నాను. ఇది ఇలా ఉండగా ఒకరోజు రక్ష భర్త తాగి వాహనం నడపడం వలన ప్రమాదం జరిగి చనిపోయాడు. దాంతో రక్ష తన కలలు తన చదువు అంతేకాకుండా తన జీవితం కూడా ఇలా మధ్యలో ఆగిపోయినందుకు డిప్రెషన్ లోకి వెళ్లిపోయింది. ఈ విషయాలన్ని నేను ఆఫీస్ పని మీద హైదరాబాద్ వెళ్ళినప్పుడు నా స్నేహితులని కలిస్తే వాళ్ళు జరిగిందంతా చెప్పారు. ఆ విషయాలన్ని తెలిసి నేను చాలా బాధ పడ్డాను. నేను ప్రేమించిన అమ్మాయి జీవితాన్ని నా చేతులారా నేనే నాశనం చేశానా అని కృంగిపోయాను. వెంటనే వెళ్ళి రక్షని కలవడానికి ప్రయత్నించాను కానీ కుదరలేదు. చేసేది ఏమీ లేక బెంగుళూర్ తిరిగి వెళ్ళిపోయాను. కానీ నా వల్లేరక్ష జీవితం ఇలా అయిందన్న బాధ నన్ను వెంటాడుతూ ఉంటుంది. అంతేకాకుండా నేను చేసిన తప్పుకి జీవితాంతం పశ్చాత్తాప పడుతూనే ఉంటాను. చదవండి: (ఎవరైనా ఇలా ప్రేమిస్తారా?) ఇలా నా జీవితంలో నేను క్షణ కాల సంతోషం, ప్రశాంతత కోసం చెప్పిన అబద్దం మరొకరి జీవితంతో ఆడుకోవడమే కాకుండా జీవితాంతం భరించలేని బాధని కూడా నాకు ఇచ్చింది. "మనం మన జీవితంలో అబద్దంఆడాల్సి వస్తే అది పది మందికి ఉపయోగపడేలా ఉండాలి కానీ మరొకరి జీవితాంతంతో ఆడుకునేలా మాత్రం కాదు. ఇట్లు వివేక్. -
జీవితాన్ని మార్చిన చిన్న పరిచయం
పరిచయం అనేది నాలుగు అక్షరాల పదమే అయినా ఎంతో మందిని కలుపుతున్న ఒక అద్బుతం. ఒక్క చిన్న పరిచయం ఎన్నో సంబంధ బాంధవ్యాలకి మూల కారణమవుతుంది. చిన్న చిన్న పరిచయాలే కొన్ని గొప్ప గొప్ప స్నేహాలు గా, మరికొన్ని ప్రేమగా, ఇంకొన్ని బంధుత్వాలుగా మారితాయి. పరిచయం అనేది ఒకరి నుండి మరొకరికి, వారి నుండి ఇంకొకరికి అలా అలా పెరుగుతూ పోతూ ఎక్కడో ఉన్న ఒకరిని, ఇంకెక్కడో ఉన్న మరొకరిని కలుపుతుంది. అలా ఏర్పడ్డ ఒక చిన్న పరిచయమే నా జీవితానికి ప్రేమని పరిచయం చేసి, తనని నా జీవితంలోకి ఆహ్వానించింది. ఆ చిన్న పరిచయం నా జీవితంలో చేసిన మార్పులని నేను మీతో పంచుకోబోతున్నాను. నేను పీ.జీ చదువుతున్న రోజులవి. అప్పట్లో నాకు స్నేహం అన్నా స్నేహితులు అన్నా చాలా ఇష్టం. నాకు స్నేహితులు కూడా ఎక్కువే. అమ్మాయి, అబ్బాయి అని ఏ తేడా కూడా లేకుండా స్నేహం చేసేవాడిని. ఎవరికి ఎంత ప్రాధాన్యత ఇవ్వాలో అంతా ఇచ్చి అందరితో సంతోషంగా ఉండేవాడిని. నా స్నేహితులకి నేనంటే కూడా అంతే ఇష్టం ఉండేది. కాకపోతే చిన్న చిన్న పరిచయాల ద్వారా కలిసిన వాళ్ళతో నేను ఎక్కువగా ఉండేవాడిని కాదు. వాళ్ళతో స్నేహం చేసేవాడిని కాదు. చిన్న చిన్న పరిచయాలు ఎక్కువ కాలం ఉండవు అని నమ్మేవాడిని. కానీ నా నమ్మకం నిజం కాదు అని చెప్పడానికి నా జీవితంలోకి వచ్చింది ఒక అమ్మాయి. ఆ అమ్మాయి నా జీవితంలోకి రావడమే కాదు తానే నా జీవితంగా మారిపోయింది. నాకున్న స్నేహితుల పిచ్చితో నాకు ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ లో స్నేహితులు ఉండేవారు. అందులో ఒక డిపార్ట్మెంట్ అమ్మాయితో నా స్నేహం కొంచెం ఎక్కువగానే ఉండేది. తన పేరు లేఖ్య. నా ఖాళీ సమయాల్లో ఎక్కువగా లేఖ్య దగ్గరికి వెళ్ళి తనతో సమయాన్ని గడిపేవాడిని . నా గురించి నా జీవితం గురించి ప్రతి ఒక్కటి తనకి తెలుసు. లేఖ్యకి తన ఇంటివద్ద చిన్ననాటి స్నేహితురాలు కీర్తి ఉండేది. ఇద్దరు చిన్నప్పటి నుండి చాలా మంచి స్నేహితులు. ఒకసారి లేఖ్య, కీర్తిని తీసుకుని మా కళాశాలకు వచ్చింది. నేను కీర్తి నీ మొదటి సారి చూసింది అక్కడే. లేఖ్య తన స్నేహితులు అందరికి కీర్తిని పరిచయం చేసింది. అప్పుడే నాకు తను పరిచయం అయ్యింది. ఆ క్షణం తనని అలానే చూస్తూ ఉండిపోవాలని అనిపించింది. తను అక్కడ ఉన్నంత సేపు నేను తననే చూస్తూ ఉండిపోయా. కాసేపటి తరువాత తను వెళ్లిపోయింది. ఇక అప్పటి నుండి నా మనసు నాలో లేదు, తనని చూడాలి మాట్లాడాలి అనే తపన నాలో పెరిగింది. లేఖ్య దగ్గరికి వెళ్ళి తన గురించి తెలుసుకుని, తన ఫోన్ నంబర్ అడగాలి అనిపించింది. కానీ అలా అడిగి తర్వాత నా వల్ల వారిద్దరి మధ్య ఏదైనా ఇబ్బంది వచ్చి, గొడవ రాకూడదు అని అడగకుండానే ఉండిపోయా. ఇక ఆ తర్వాత అప్పుడప్పుడు కీర్తి మా కళాశాలకు వచ్చేది, వచ్చిన ప్రతి సారి నేను ఏమి మాట్లాడకుండా తనని చూస్తూ ఉండేవాడిని. తను కూడా ఏమి మాట్లాడేది కాదు. అలా అలా కొన్ని రోజులు గడిచాయి, అయినా నేను తనని చూడడం, తను నన్ను చూడడంతోనే సరిపోయేది. కొన్ని రోజుల తర్వాత నేను మా స్నేహితులు, లేఖ్య అందరం కలిసి ఒక చిన్న విహార యాత్రకి వెళ్ళాలి అని నిర్ణయించుకుని వెళ్ళాం, అక్కడికి మాతో పాటు కీర్తి కూడా వచ్చేది. నాకు తనకి మధ్య మాటలు కలిశాయి. మెల్ల మెల్లగా మేమిద్దరం మాట్లాడుకోవడం ప్రారంభించాం. మేమందరం ఒకసారి విహారయాత్రకి వెళ్లాం. విహారయాత్ర లో ఎంతో ఆనందంగా గడిపి తిరిగి ఇంటికి వచ్చేశాం. ఆ విహార యాత్ర నాకు జీవితంలో మర్చిపోలేని ఆనందాన్ని, జ్ఞాపకాలని ఇచ్చింది. ఎప్పుడు కుటుంబం తో, స్నేహితులతో వెళ్ళినా రాని సంతోషం ఎందుకో నాకు తెలియకుండానే ఈ విహారయాత్ర నాకు ఇచ్చింది, దానికి కారణం కీర్తి రాకనే అని నా మనసు చెప్పింది. ఇక బాగా ఆలోచించాను, కీర్తితో నేను చేసిన విహారయాత్ర నే నాకు అంత సంతోషాన్ని, ఆనందాన్ని, జీవితంలో మర్చిపోలేని జ్ఞాపకాలను ఇచ్చినప్పుడు, నేను నా జీవితం మొత్తం కనుక కీర్తి తో ఉంటే ఎంత అద్భుతంగా ఉంటుందో అనిపించింది. తను నాతో ఉన్న అన్ని రోజులు నేను ఎంతో సంతోషంగా ఉన్నాను, అదే తను నాతో జీవితాంతం ఉంటే ఇంకెంత సంతోషంగా ఉంటానో అనిపించింది. ఇక ఆలస్యం చెయ్యకుండా కీర్తిని కలవాలి అనేలోపు కీర్తినే నన్ను కలవడానికి వచ్చింది. నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని కీర్తి తో నేను చెప్పేలోపు తానే నన్ను ప్రేమిస్తున్నాను అని, లేఖ్య నిన్ను పరిచయం చేసినప్పుడే, నీ గురించి ఏమీ తెలియకుండానే నిన్ను ప్రేమించడం మొదలుపెట్టాను... అంతేకాకుండా మీ కళాశాలకు పదే పదే రావడానికి కారణం కూడా నిన్ను చూడడానికే. నీతో మాట్లాడాలి అని చాలా సార్లు ప్రయత్నించాను, కానీ ఎందుకో నా వల్ల కాలేదు. ప్రతి రోజు నీ గురించి లేఖ్యని అడిగి తెలుసుకునే దానిని. విహారయాత్ర లో నీతో గడిపిన ప్రతి రోజూ నాకు ఎంతో సంతోషాన్ని ఇచ్చింది. అందుకే ఆ సంతోషం నాకు జీవితాంతం కావాలి అని నిర్ణయించుకుని నీ దగ్గరికి వచ్చాను. నన్ను పెళ్ళిచేసుకుని నాకు నా సంతోషాన్ని ఇస్తావా ?? అని అడిగింది. తను అలా అడిగేసరికి నాకు ఎంతో సంతోషంగా అనిపించింది. నిజానికి నేను తనకి ఇదే విషయం చెప్పడానికి వచ్చాను అని నేను కూడా తనని ప్రేమిస్తున్నాను అని చెప్పేశాను.ఇక అలా మా ప్రేమ యాత్ర మొదలయింది. నాకు ఒక సాఫ్టువేర్ కంపెనీలో లో మంచి ఉద్యోగం వచ్చింది. వెంటనే నేను కీర్తి విషయం మా ఇంట్లో చెప్పి మా పెళ్లికి నా తల్లిదండ్రులని ఒప్పించాను. కానీ కీర్తి ఇంట్లో మాత్రం మా పెళ్ళికి ఒప్పుకోలేదు, అంతేకాకుండా కీర్తి కి మరో సంబంధం తెచ్చి పెళ్లి చెయ్యాలని చూశారు. తన తల్లిదండ్రులకి ఎంత చెప్పినా వినకపోయేసరికి ఏమి చెయ్యలేని నిస్సహాయ స్థితిలో కీర్తి ఉండిపోయింది. ఇక నేను నా తల్లిదండ్రుల అండతో కీర్తి దగ్గరికి వెళ్లి నాతో పాటు వస్తావా?? పెళ్లి చేసుకుని జీవితాంతం నిన్ను సంతోషంగా చూసుకుంటా అని అడిగాను. తను నాతో నా తల్లిదండ్రులు తెచ్చిన సంబంధం నేను చేసుకోలేను, గడిపితే నీతోనే సంతోషంగా నా జీవితాన్ని పంచుకుంటాను, లేకుంటే నువ్వు లేని ఈ జీవితం నాకు వద్దు అని చెప్పేసింది. ఇదే విషయం తన ఇంట్లో వాళ్ళకి చెప్పి తను నాతో పాటు వచ్చేసింది. నా తల్లిదండ్రులు మా ఇద్దరి పెళ్లి చేసేశారు. అంతేకాకుండా తన తల్లిదండ్రులు తనతో లేరు అన్న లోటు తనకి తెలియకుండా నా తల్లిదండ్రులు కీర్తి నీ సంతోషంగా చూసుకుంటున్నారు. నన్ను నమ్మి నాకోసం తన తల్లిదండ్రులని వదులుకున్న కీర్తి కి నేను వాళ్ళని తిరిగి ఇవ్వ లేకపోవచ్చు కానీ, జీవితాంతం తనకి ఎలాంటి కష్టం రాకుండా, సంతోషంగా చూసుకుంటాను. ఇలా నా జీవితంలో ఏర్పడిన చిన్న పరిచయం కాస్తా ప్రేమగా మారి నాకు జీవితాంతం సంతోషాన్ని ఇస్తూ, నాతో జీవితాన్ని పంచుకుంది. ఇట్లు ఆదిత్య (హైదరాబాద్) -
తను చనిపోయాడు అనుకున్నాను, కానీ...!
ఈ ప్రపంచంలో ప్రతి మనిషి జీవితంలో సర్వసాధారణంగా వారికే తెలియకుండా జరిగేవి రెండే రెండు విషయాలు. ఒకటి జననం ; రెండు మరణం. ఈ రెండు విషయాలు ప్రతి మనిషి జీవితంలో ఏదో ఒక భావనని మాత్రం కలిగిస్తాయి. జననం పది మందికి సంతోషాన్ని కలిగిస్తే , మరణం వంద మందికి బాధని కలిగిస్తుంది. అయితే ఈ జనన మరణాల మధ్య కొట్టు మిట్టాడే ప్రతి మనిషి జీవితంలో కలిగే మధురానుభూతి ప్రేమ. ఈ ప్రేమ కూడా జనన మరణాల్లో ఒక భాగమే. "రెండు ప్రేమల కలయిక జననం అయితే ... అదే రెండు ప్రేమలు విడిపోవడం మరణం". జననం ఎంత సంతోషాన్ని ఇస్తుందో మరణం అంతకు రెట్టింపు బాధని ఇస్తుంది. ఆ బాధకి కారణం కూడా ప్రేమే. మనం ప్రేమించిన వాళ్ళు మరణిస్తే ఆ బాధ ఇంకా చెప్పలేనిది. ఆ వార్త వినడానికి కూడా మనం సిద్దంగా ఉండం. ఒకవేళ అదే వార్త ఒక అబద్ధం అయితే , అబ్బా ..!! ఆ ఊహ కూడా ఎంతో సంతోషాన్ని ఇస్తుంది కదా !? ఇప్పుడు చెప్పబోయే నా ఈ కథ కూడా అలాంటిదే. నా పేరు దీక్ష. నేను పీజీ చదువుతున్న రోజులవి. ప్రతి రోజు కళాశాలకు వెళ్ళడం ఇంటికి రావడం నా తల్లిదండ్రులతో సంతోషంగా గడపడం ఇదే నా దిన చర్య గా ఉండేది. నేను నా తల్లిదండ్రులకి ఒక్కగానన్కొక్క కూతురిని కావడం వల్ల నన్ను కొంచెం గారంబంగానే పెంచారు. అంతే కాకుండా వాళ్ళకి నేను అంటే ఎంతో ఇష్టం. నాకు నా తల్లిదండ్రులు అంటే చాలా ప్రేమ. నా తల్లిదండ్రులు, వాళ్ళ ప్రేమ తప్ప ఇంకొక మనిషికి, వారి ప్రేమకి నా మనసులో చోటు ఉండేది కాదు. అలాంటి నన్ను మార్చి నా మనసులో ఇంకొకరికి స్థానం ఇచ్చేలా చేసి ఇంకో ప్రేమని పరిచయం చేసిన వ్యక్తి ఆనంద్. తను నేను చదివే కళాశాల లోనే పీజీ చదువుతున్నాడు. మొదట్లో తనకి నాకు అస్సలు పడేది కాదు, కానీ నిజానికి తను చాలా మంచివాడు, మంచి మనస్తత్వం కలవాడు, సున్నిత స్వభావి. తనని నేను మొదటిగా మా కళాశాలలో ఒకరితో గొడవ పడుతుండగా చూశాను. అలా గొడవ పడటం నాకు నచ్చలేదు, తర్వాత తను నా సహా విద్యార్థే అని తెలిసింది. మొదట్లో నేను తనతో సరిగ్గా మాట్లాడేదాన్ని కాదు. ఒకే తరగతి కావడం వల్ల తర్వాత తర్వాత మా ఇద్దరి మధ్య మాటలు కలిశాయి కానీ, ఆ మాటలు కూడా తూటాల్లా ఉండేవి. అలా మేము కలిసిన ప్రతి సారి ఏదో ఒక గొడవ పడుతూ ఉండేవాళ్ళం. మా ఇద్దరికీ రోజు ఏదో ఒక గొడవ కాకపోతే ఆ రోజు గడిచినట్టే అనిపించేది కాదు. అలా ఉన్న సమయంలో ఒకరోజు ఆనంద్ కళాశాలకు రాలేదు, ఎవరికి ఎలాంటి సమాచారం కూడా ఇవ్వలేదు. ఎందుకో తెలియదు కానీ ఆ రోజు నేను నేనుగా లేను. ఏదో తెలియని కల్లోలం, ఎందుకో తెలియని బాధ, ఏదో కోల్పోతున్న అనే భావన నాలో కలిగింది. అలా ఒక వారం తరువాత తను కళాశాలకు వచ్చాడు. తనని చూడగానే నాకు ప్రాణం తిరిగివచ్చినట్టుగా అనిపించింది. వెంటనే తన దగ్గరికి వెళ్ళి రాకపోవడానికి గల కారణాన్ని తెలుసుకుని, నాకు కలిగిన భావన నేను తనతో చెప్పాను. అప్పుడు ఆనంద్ నీకు అలా జరగడానికి గల కారణం ప్రేమ అని చెప్పాడు. ఎందుకంటే ఈ వారం రోజులు తన పరిస్థితి కూడా అలానే ఉండడం వల్ల దానికి గల కారణం గురించి ఆలోచిస్తే తనకి బాగా అర్థం అయిన విషయం అది అని నాకు చెప్పాడు. నేను ఒక్కసారిగా ఆశ్చర్యపోయాను, కానీ తీరిగ్గా ఆలోచిస్తే తను చెప్పిందే వాస్తవం అని తెలిసింది. ఇక ఇద్దరికీ అర్ధం అయ్యింది ఏంటంటే ఒకరికి తెలియకుండానే ఒకరం తిట్టుకుంటూ, గొడవ పడుతూ ప్రేమలో పడ్డాం అని. ఒకరు లేకుంటే ఒకరం ఉండలేము అని. ఇక అలా మా ప్రేమ యాత్ర మొదలయింది. మేము మా ప్రేమ యాత్ర లో మునిగి తేలుతూ ఉండగా, ఒకరోజు ఆనంద్ కళాశాలకు వస్తుండగా అనుకోకుండా ఒక కారు తప్పు దారిలో వచ్చి ఆనంద్ నీ ఢీకొంది. అక్కడ ఉన్న వాళ్ళు ఆనంద్ నీ ఆసుపత్రిలో చేర్పించారు. కానీ , చిగురిస్తున్న మా ప్రేమ పూవుగా మారకముందే వాడిపోయింది. ఆ ప్రమాదంలో ఆనంద్ తలకి గాయం అయి బాగా రక్తం పోవడంతో తను మరణించాడు అనే వార్త నాకు తెలిసింది. ఆ వార్త విన్న క్షణం ఒక్కసారిగా నా గుండెలు పగిలిపోయాయి. ప్రాణాలు పోయినట్టుగా అనిపించింది, పిచ్చిదానిలా గుండెలు బాదుకుంటూ ఏడ్చాను. ఆ సమయంలో నా బాధ చెప్పుకుని ఏడ్వటానికి కూడా ఎవరు లేరు, నా తల్లిదండ్రులకి ఈ విషయం తెలియదు వాళ్ళతో అయినా నా బాధ నీ పంచుకుందాం అంటే. ఇక ఏమి చెయ్యాలో తోచక పిచ్చిదానిలా అయి చనిపోదాం అని అనుకున్నాను, కానీ, ఇంత ఇష్ట పడ్డ ఆనంద్ దూరం అవుతేనే నా పరిస్థితి ఇలా ఉంటే ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమించిన నా తల్లిదండ్రులకి నేను దూరం అయితే ఇక వాళ్ళు ఎలా తట్టుకుంటారని నా ప్రేమని, నా బాధని నా గుండెల్లోనే దాచుకుని వాళ్ళకోసం బ్రతుకుతూ ఉన్నాను. అంతలోనే నా పీజీ పూర్తి కావచ్చింది. ఇక నా తల్లిదండ్రులు నాకు పెళ్లి చెయ్యాలి అని సంబంధాలు చూడడం ప్రారంభించారు. ఒక మంచి సంబంధం వచ్చిందిజ అబ్బాయి పేరు కృష్ణ, అమెరికా లో ఉద్యోగం, మంచి కుటంబం ఇలాంటి సంబంధం మళ్లీ రాదు అని నన్ను ఒప్పించారు, నేను వాళ్ళ మాట కాదు అనలేక ఆనంద్ ఎలాగో తిరిగి రాడు, తననే తలచుకుంటూ నా తల్లిదండ్రులని బాధ పెట్టలేక, ఆ పెళ్లి చేసుకుని ఇక్కడి నుండి దూరంగా వెళ్తే అయినా ఆనంద్‌ని మరిచిపోతా అని ఆ సంబంధం ఒప్పుకున్నాను. ఒప్పుకోవడమే ఆలస్యం పెళ్లి ముహూర్తాలు పెట్టించారు. నిశ్చితార్థం రానే వచ్చింది. నా తల్లిదండ్రులు అనుకున్నట్టుగానే కృష్ణ తో నా నిశ్చితార్థం అయ్యింది. నిశ్చితార్థానికి పెళ్లికి మధ్య రెండు నెలల వ్యవధి రావడంతో జీవితాంతం కలిసి ఉండాల్సింది తనతోనే కాబట్టి ఒకరి అభిప్రాయాలు ఒకరం తెలుసుకోవాలి అని మెల్ల మెల్లగా కృష్ణతో మాట్లాడడం మొదలుపెట్టాను. తను నాపై చూపించే ప్రేమాభిమానాలకి తన దగ్గర నా గతం దాచడం సరైంది కాదు అని ఆనంద్ విషయం చెప్పేశాను. తను నా ప్రేమని అర్థం చేసుకుని నా బాధని పంచుకుంటూ నా బాధలో నాకు తోడుగా ఉంటూ నన్ను జాగ్రత్తగా చూసుకున్నాడు. తను చూపించే ప్రేమాభిమానాలు, జాగ్రత్తలు నాకు తన మీద ప్రేమ కలిగేలా చేశాయి. . అలా మెల్ల మెల్లగా నేను కృష్ణ నీ ప్రేమించడం మొదలు పెట్టాను. కానీ ఇంతలోనే ఒక సంఘటన జరిగింది. ఆ సంఘటన మళ్లీ నన్ను మొదటికి తీసుకొచ్చింది. ఒకరోజు మా స్నేహితులని పెళ్లికి ముందు కలవాలని, పెళ్లి తర్వాత అమెరికా వెళ్ళడం, మళ్లీ కలవడం కుదురుతుందో లేదో అని అందరం అనుకుని కలుసుకున్నాం. కానీ అక్కడ నేను ఊహించనిది ఒకటి జరిగింది. ఆ సంఘటన ఏంటి అంటే అక్కడికి ఆనంద్ కూడా వచ్చాడు. ఆ రోజు ప్రమాదం లో ఆనంద్ కి తలకి గాయం అయి రక్తం బాగా పోవడం వలన తను కోమా లోకి వెళ్ళాడు, మళ్లీ ఎన్ని రోజులకు కోమా నుండి వస్తాడో తెలియక, తనకోసమే చూస్తూ నేను నా జీవితాన్ని పాడు చేసుకోకూడదు అని తన తల్లిదండ్రులే నాకు తను చనిపోయాడు అని అలా అబద్ధం చెప్పారు. ( ఆనంద్ మా ప్రేమ విషయం ఆ ప్రమాదం జరిగే ముందు రోజే తన తల్లిదండ్రులకి చెప్పి వాళ్ళని ఒప్పించాడు ). తనని చూడగానే నాకు ప్రాణాలు లేచి వచ్చినట్టుగా, ఇన్ని రోజుల తరువాత ఊపిరి పీల్చుకున్న ట్టుగా అనిపించింది, వెంటనే తనని పట్టుకుని గట్టిగా ఏడ్చాను, తను లేని నా జీవితం ఎలా ఉందో, ఎలా గడిపానో జరిగింది అంతా చెప్పాను. నాకు నిశ్చితార్థం అయింది అని తెలిసి ఆనంద్ నిర్ఘాంతపోయాడు. చాలా బాధ పడ్డాడు, పెళ్లి అంటూ చేసుకుంటే అది నన్నే అంటూ ఏడ్చాడు. ఇక ఏమి చెయ్యాలో తోచక ఇప్పటికే నిశ్చితార్థం అయిన అమ్మాయి వేరే అబ్బాయిని ప్రేమిస్తుంది అని తెలిస్తే నా తల్లిదండ్రుల గౌరవ మర్యాదలకు భంగం కలుగుతుందని, వాళ్ళని బాధ పెట్టడం ఇష్టం లేక మా విషయం తెలిసింది కృష్ణకే కాబట్టి తన దగ్గరికి వెళ్లి జరిగింది అంతా చెప్పాను. కృష్ణ కూడా మా ప్రేమని అర్థం చేసుకుని ఇంకొకరిని ప్రేమించి తననే మనసులో పెట్టుకుని నువ్వు నాతో జీవితాంతం సంతోషంగా ఉండలేవు. నాపై నీకు ఇష్టం ప్రేమ లేనప్పుడు నేను నిన్ను చేసుకుని సంతోషంగా ఉండలేను కాబట్టి నువ్వు ఆనంద్ నీ పెళ్లి చేసుకోవడమే సరైనది అన్నాడు. కృష్ణ నా తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళి మా ప్రేమ గురించి, మా గతం గురించి అంతా చెప్పాడు. మొదట్లో నా తల్లిదండ్రులు మా పెళ్ళికి ఒప్పుకోలేదు, ఒక అబ్బాయితో నిశ్చితార్థం జరిగి ఇంకొకరితో పెళ్లి చేస్తే మా పరువు పోతుంది అని అన్నారు. కానీ బాగా ఆలోచించిన తర్వాత కొన్ని రోజులకు నా సంతోషం ముందు వాళ్ళకి అవి అన్ని కూడా చిన్నగానే అనిపించాయి. చివరికి ఆనంద్ తో నా పెళ్లికి ఒప్పుకున్నారు. నా తల్లిదండ్రులు ఒప్పుకోవడానికి కారణం అయిన కృష్ణనే దగ్గర ఉండి మా పెళ్లి జరిపించాడు. అలా నా జీవితంలో ఊహించని మలుపులతో ఆనంద్ తో నా పెళ్లి జరిగింది. "ఒకసారి మనం ప్రాణంలా ప్రేమించిన వాళ్ళు దూరం అయితే వాళ్లు దూరంగా ఉన్నా బ్రతికే ఉన్నారు అన్న ఒక్క చిన్న ఆశ మనల్ని బ్రతికిస్తుంది. అదే వాళ్ళు చనిపోయారు అని తెలిస్తే ఆ ఊహ కూడా మనల్ని చంపేస్తుంది, అలా మరణించి ఇక వాళ్ళు మనకి లేరు అని అనుకునే సమయానికి వాళ్ళు మళ్లీ మన జీవితంలోకి తిరిగి వస్తే....!!!" "అదే నా జీవితం". ఇట్లు దీక్ష ఆనంద్. -
నా వల్లే తను చనిపోయింది.
ఈ ప్రపంచాన్ని అందులో ఉన్న మనుషులను నడిపిస్తుంది రెండే రెండు అక్షరాల రెండు పదాలు. అందులో మొదటి రెండు అక్షరాల పదం డబ్బు అయితే... రెండోది ప్రేమ. డబ్బు లేకుండా ఏ మనిషి బ్రతక లేడు. కానీ ప్రేమ లేకుండా ఏ మనిషికి జీవం లేదు. ప్రస్తుతం ఉన్న రోజుల్లో ప్రతి మనిషి డబ్బుకోసం మాత్రమే బ్రతుకుతున్నాడు. ప్రేమ ఉన్నా లేకున్నా డబ్బు ఉంటే చాలు జీవితాంతం సంతోషంగా బ్రతికేయ్యొచ్చు అనే ఆలోచనలతోనే ఉంటున్నాడు. డబ్బు మాయలో పడి, డబ్బు సంపాదించాలి అనే ఆలోచనలతో నిజమైన ప్రేమని కూడా అబద్దంగా మార్చేస్తున్నాడు. నిజానికి ప్రేమ గొప్పదా ...? డబ్బు గొప్పదా...? అనే ప్రశ్నకి జవాబు మాత్రం దొరకడం లేదు. ఇలాంటి చిక్కు ప్రశ్న కి సమాధానం వెతుక్కోవాల్సి న రోజూ వస్తుంది అని ఎవరం అనుకోం కదా ! కాని నా జీవితం లో అలాంటి రోజు ఒకటి వచ్చింది. ఆ క్షణం నేను తీసుకున్న నిర్ణయం నా జీవితాన్నే మార్చేసింది. ఇప్పుడు నేను ఆ ప్రశ్న కి సమాధానాన్ని , నేను ఎదుర్కొన్న సంఘటనని మీకు చెప్పబోతున్నాను. నా పేరు అరుణ్. మాది ఒక బీద కుటుంబం. నేను , అమ్మ , నాన్న ఉండేవాళ్ళం. నా తల్లిదండ్రులు రోజూ వారి కూలి చేసి దానితో వచ్చిన డబ్బుతో ఇల్లు గడిపేవాళ్ళం. ఒక్క రోజు కూలీ కి వెళ్లకుంటే ఆ రోజు పస్తులు ఉండాల్సిన పరిస్థితి మాది. ఇలాంటి పరిస్థితుల్లో కూడా నా తల్లదండ్రులు పస్తులు ఉంటూ మరీ కూలీతో వచ్చిన డబ్బులతో నన్ను బడికి పంపించి చదువించేవారు. వాళ్ళు ప్రతి రోజు నాకు ఒకటే మాట చెప్పేవారు... నువ్వు మంచిగా చదువుకుని మంచి ఉద్యోగం సంపాదించి మంచి స్థాయిలో ఉండాలి అని. వాళ్ళలా నేను కూలీ పని చేసుకోకూడదు అని , బాగా కష్ట పడి చదివి బాగా డబ్బులు సంపాదించాలని వాళ్ళ కోరిక. నేను నా తల్లిదండ్రుల కష్టం చూడలేక బాగా చదువుకుని ఎలాగైనా డబ్బు సంపాదించాలని నిర్ణయించుకుని ప్రతి రోజూ పాఠశాలకి వెళ్తూ మంచిగా చదువుకుంటూ నా ఎం. బి. ఎ నీ మొదటి తరగతిలో పూర్తిచేశాను. తర్వాత నా మార్కులను , నాలోని నైపుణ్యాలను చూసి ఒక పెద్ద కంపెనీ వాళ్ళు నాకు వాళ్ళ కంపెనీ లో పని చేసేందుకు అవకాశం ఇచ్చారు. నేను ఎంతో సంతోషంగా వెళ్లి నా తల్లిదండ్రలకు ఈ విషయం చెప్పాను, వాళ్ళు ఎంతో సంతోషించారు. ఇక నేను ఆ కంపెనీకి వెళ్లి పని చెయ్యడం ప్రారంభించాను. అలా నా జీవితంలో సంపాదన ప్రారంభం అయింది. నేను అనుకున్నట్టుగానే బాగా సంపాదించడం ప్రారంభించాను. నేను పని చేస్తున్న కంపెనీ లోనే ప్రమోషన్లు పొందుతూ బాగా సంపాదిస్తూ నా తల్లిదండ్రులు అనుకున్నట్టుగానే ఉన్నత స్థాయికి ఎదిగాను. ఇలా సంపాదనలో మునిగి తేలుతున్న నా జీవితం ఒక్కసారిగా మలుపు తిరిగింది. ఆ మలుపుకి కారణం ఒక అమ్మాయి. ఆ అమ్మాయి రాక నన్ను నా జీవితాన్ని మొత్తం మార్చేసింది. డబ్బు పిచ్చితో బ్రతుకుతున్న నా జీవితానికి ప్రేమని పరిచయం చేసి , ప్రేమ లోతుల్ని అర్థం అయ్యేలా చేసిన ఆ అమ్మాయి పేరు దీప్తి. తను నేను పనిచేసే కంపెనీలోన నా సహోద్యోగి. నేను కంపెనీలో చేరిన మొదట్లో పని విషయంలో నాకు ఎలాంటి సందేహం ఉన్న తీర్చేది. ఒక్కోసారి నా పని కూడా తనే చేసేది. అలా అలా మా ఇద్దరి మధ్య పరిచయం పెరిగింది. తను మొదటి నుండి నాపై ఎక్కువగా జాగ్రత్త , ప్రేమ , అభిమానాలు చూపించేది. ఇక అలా తను చూపించే ప్రేమాభిమానాలకి నేను ముగ్ధుడిని అయ్యాను. నాకు తెలియకుండానే నేను తనతో ప్రేమలో పడిపోయాను. అలా అలా మా పరిచయం కాస్తా ప్రేమగా, సన్నిహితులం కాస్తా ప్రేమికులుగా మారిపోయాం. ఒకే కంపెనీ కావడంతో మా ప్రేమకి ఎలాంటి అడ్దంకులు , ఇబ్బందులు ఉండేవి కావు. దీప్తి మా ప్రేమ విషయం ఇంట్లో చెప్పింది. నన్ను మా ఇంట్లో చెప్పి ఒప్పించమంది. సరే అని నేను చెప్పబోయాను . కానీ అంతలోనే సిటీలోనే అతి పెద్ద కంపెనీకి ఓనరు వచ్చి నా నైపుణ్యాలను , సామర్థ్యాల ను చూసి నన్ను వాళ్ళ కంపెనీలో చేరమని చెప్పడానికి వచ్చారు . అంతే కాకుండా నన్ను తన కూతురికి ఇచ్చి పెళ్లి చేసి ఆ కంపెనీని కూడా నా సొంతం చేస్తాను అని అన్నాడు. ఇక నాకు ఏం చెయ్యాలో అర్థం కాలేదు , బాగా ఆలోచించాను ఇంత డబ్బు దానితో పాటు అమ్మాయి వస్తుంది అంటే ఏ అబ్బాయి అయినా ఎందుకు కాదు అంటాడు. పైగా నాకు ఉన్న డబ్బు పిచ్చితో ప్రేమ కావాలా...? డబ్బు కావాలా...?అంటే డబ్బే కావాలి అని నేను దానికి ఒప్పుకున్నాను. ఈ విషయం తెలుసుకున్న దీప్తి ఏకంగా మా ఇంటికే వచ్చి నా తల్లిదండ్రులకు జరిగింది అంతా చెప్పి ,,," ఛీ!!! నువ్వు ఇలాంటి వాడివి అని అనుకోలేదు. నీకు డబ్బు అంటే ఇంత పిచ్చి ఉంది. నువ్వు డబ్బుకోసం ఏం అయినా చేస్తావ్ , ఎంతకైనా దిగజారుతావు అని నాకు ఇన్ని రోజులలో తెలియలేదు , తెలిసుంటే నీలాంటి వాడిని అస్సలు ప్రేమించేదానినే కాదు. ఏ డబ్బు కోసం అయితే నువ్వు నన్ను నా ప్రేమని కాదని వెళ్ళావో ఏదో ఒక రోజు నువ్వు నీ డబ్బు తప్ప నీకంటూ నిన్ను ప్రేమించే వాళ్ళు, నిన్ను చూసుకునేవారు ఎవరు ఉండరు. ఏ డబ్బు కోసం అయితే నువ్వు నన్ను మోసం చేశావో అదే డబ్బు మాయలో పడి నువ్వు తప్పకుండా మోసపోతావు" అని నన్ను తిట్టి....బోరుమని ఏడుస్తూ అక్కడి నుండి వెళ్లిపోయింది. ఇదంతా చూసిన నా తల్లిదండ్రులు ఎంతో బాధ పడుతూ " నువ్వు ఇంత బాగా చదువుకుని మంచి ఉద్యోగం చేస్తూ ఇంత సంపాదిస్తుంటే నా కొడుకు అని ఎంతో సంతోషంగా గర్వంగా చెప్పుకుని తిరిగాం... కానీ నువ్వు ఇంత నీచుడివని, డబ్బు కోసం ప్రాణంగా ప్రేమించే అమ్మాయి నీ వదులుకున్నావు, నీలాంటి కొడుకు మాకు పుట్టకున్న బాగుండు అనిపిస్తుందన్నారు. దీప్తి మాటలు , నా తల్లిదండ్రుల మాటలు విన్నాక నాపై నాకే అసహ్యం వేసింది. నేను చేసిన తప్పు ఏంటో బాగా తెలిసొచ్చింది. ఇక వెంటనే ఆలస్యం చెయ్యకుండా దీప్తి దగ్గరకి వెళ్ళాను. కానీ.... నేను వెళ్ళే సరికి దీప్తి లేదు తన శవం మాత్రం ఉంది. నన్ను తిట్టి అక్కడి నుండి ఎంతో బాధతో ఇంటికి వెళ్తున్న దీప్తినీ ఒక లారీ వచ్చి గుద్దడంతో అక్కడికక్కడే చనిపోయింది. ఆ వార్త విని ఒక్కసారిగా నేను షాక్ అయ్యాను . ఏమి చెయ్యలేక పిచ్చి వాడిలా దీప్తి పై పడి నువ్వు , నీ ప్రేమ నాకు కావాలి అని గుండెలు పగిలేలా ఏడ్చాను . కానీ ఏమి లాభం బ్రతికుండగా వద్దు అని చనిపోయాక కావాలి అంటే ఏదీ రాదు కదా..!! నాకున్న నా డబ్బు పిచ్చే దీప్తి చావు కి కారణం అయింది. డబ్బే లోకం అనుకునే నన్ను తన లోకంగా భావించి, ప్రేమించిన దీప్తి నీ దూరం చేసుకునీ ,,, చివరకి తప్పు తెలుసుకుని తను తన ప్రేమ కావాలని వెళ్తే అందనంత దూరంగా తిరిగిరాని లోకాలకు వెళ్ళింది నా దీప్తి. తను లేని లోటు తీరనిది. తను చనిపోయాక దీప్తినే తల్చుకుంటూ , నేను చేసిన తప్పుకి బాధ పడుతూ నా తల్లిదండ్రులు చెప్పింది వింటు ఈ ఒంటరి జీవితాన్ని గడుపుతున్నాను. నా ఈ జీవితానికి నేనే విలన్ . డబ్బు ఒకటి ఉంటే సరిపోతుంది అనుకున్నాను కానీ దానికంటే విలువైంది మరొకటి ఉంది అదే ప్రేమ అని తెలుసుకోలేక పోయాను. నేను డబ్బు కావాలా? ప్రేమ కావాలా ? అన్నప్పుడు నాకు ప్రేమే కావాలి అని అనుంటే ఈ రోజు నా జీవితం దీప్తి తో చాలా అద్భుతంగా ఉండేది. నా జీవితం నాకు నేర్పింది ఏంటంటే డబ్బు కన్న ప్రేమే గొప్పది . ఎందుకంటే డబ్బుతో ప్రపంచం నడుస్తుండొచ్చు కానీ మనిషి పుట్టిన దగ్గర నుండి చనిపోయే వరకు ప్రేమ కావాలి ""మనం పుట్టినప్పుడు మనల్ని జాగ్రత్త గా చూసుకునే "అమ్మ ప్రేమ" పెరుగుతూ ఉన్నప్పుడు మనల్ని నడిపించే "నాన్న ప్రేమ" సరదాగా ఆనందించే సమయంలో "మిత్రుల ప్రేమ" పెళ్లి అయ్యాక "భార్య/ భర్త ప్రేమ" ముసలి వాళ్ళం అయ్యాక "పిల్లల ప్రేమ" . ఇక్కడ ప్రేమించే విధానం , ప్రేమించే వ్యక్తులు వేరు కావచ్చు కానీ , ప్రేమ మాత్రం ఒక్కటే ,,,,అదే శాశ్వతం. డబ్బు ప్రతి ఒక్కరీ దగ్గరా ఉంటుంది కానీ ప్రేమ మాత్రం కొందరికే దక్కుతుంది. మన జీవితం లో ఒక్క నిమిషంలో తీసుకునే కొన్ని నిర్ణయాలు మన జీవితాన్ని ఊహించలేని మలుపు తిప్పుతాయి. కాబట్టి ఆ ఒక్క నిమిషం ఆలోచించి నిర్ణయం తీసుకుందాం, ప్రేమ బాటకై అడుగేద్దాం ఇట్లు ఈ విషాద గాథకి విలన్ అరుణ్ (హైదరాబాద్). -
వారంలో పెళ్లి... అంతలోనే!
జీవితం ఎప్పుడు ఎలా మారుతుందో మనం ఊహించలేము. తలచినదే జరిగినదా దైవం ఎందులకు అన్నట్లుగా మనం ఎన్ని చేద్దాం అనుకున్నా జరిగేది ఆపలేము. ఇది నా జీవితం నాకు నేర్పిన పాఠం. మాది చాలా రిచ్ ఫ్యామిలీ. నేను కోరుకున్నది అప్పటి వరకు అన్ని దక్కాయి. ఓడిపోవడం అంటే ఏంటో నాకు తెలియదు. మా అమ్మనాన్నలకు నేనొక్కడినే. నా పేరు అభి. నన్ను ఎంతో గారాబంగా పెంచారు. నేను అడగకుండానే అన్ని ఇచ్చారు. ఏది అడిగిన ఎప్పుడు కాదనలేదు. నేను మా కాలేజీ డేస్‌లో ఒక అమ్మాయిని ప్రేమించాను. తన పేరు సరిత. చాలా మంచిది. మానవత్వం ఎక్కువ. ఎప్పుడూ ఏదో ఒక సేవ కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉండేది. చిన్న వయస్సులోనే ఇలా ఉండటం చూసి నాకు చాలా బాగా నచ్చింది. నాతో చాలా ఫ్రెండ్లీగా మాట్లాడేది. ఒకరోజు తనకి నా ప్రేమ విషయం చెప్పాను. తను కొన్ని రోజులు తరువాత నాకు ఒకే చెప్పింది. వాళ్ల ఇంట్లో ఒప్పుకుంటే నన్ను చేసుకోవడానికి తనకి ఎలాంటి ప్రాబ్లెమ్ లేదని చెప్పింది. నేను మా ఇంట్లో విషయం చెప్పాను. ఎప్పటిలాగానే వాళ్లు నా ఇష్టానికి అడ్డుచెప్పలేదు. వాళ్లే వెళ్లి సరిత వాళ్ల ఇంట్లో మాట్లాడారు. కులాలు వేరు కావడంతో మొదట వాళ్లు ఒప్పుకోకపోయిన తరువాత అంగీకరించారు. చాలా హ్యాపీగా ఉన్నాం. ఎంగేజ్మెంట్ కూడా గ్రాండ్‌గా చేసుకున్నాం. పెళ్లి పనులు కూడా చాలా స్పీడ్‌గా జరుగుతున్నాయి. పెళ్లి ఇంకో వారం ఉందనగా అనుకోని ఘటన జరిగింది. సరిత యాక్సిడెంట్లో చనిపోయింది. రెండు కుటుంబాలలో విషాదం అలముకుంది. నేను డిప్రెషన్లోకి వెళ్లిపోయాను. నా బాధ చూడలేక మా అమ్మ ఆరోగ్యం కూడా పాడైంది. నేను ఆ బాధలో నుంచి బయటపడటానికి రెండు సంవత్సరాలు పట్టింది. ఇప్పటికీ సరిత రోజు గుర్తుకొస్తూనే ఉంటుంది. మనం ఎన్ని అనుకున్న ఏదీ జరగాలనుంటే అదే జరుగుతుందని అర్థం అయ్యింది. మా ఇంట్లో వాళ్లు నన్ను పెళ్లి చేసుకోమంటున్నారు. నేను మాత్రం సరిత ఆలోచనల్లో నుంచి ఇంకా పూర్తిగా బయటకు రాలేకపోతున్నాను. తన స్థానంలో మరొకరిని ఊహించుకోలేకపోతున్నాను. అభి, కృష్ణా జిల్లా. -
అంతా బాగున్న సమయంలో అలా జరిగింది!
నా పేరు వినయ్. నాది చాలా హ్యాపీ లైఫ్. అన్ని ఉన్నాయి నాకు. మంచి అమ్మనాన్న, అల్లరి చేసే చెల్లి, ప్రేమగా చూసుకునే నాన్నమ్మ, తాతయ్య అందరూ నన్ను చాలా బాగా చూసుకుంటారు. చాలా ఆనందంగా ఉండేది మా లైఫ్. అంతా మంచిగా ఉంటుంది అనుకున్న సమయంలో మా అమ్మ క్యాన్సర్‌తో చనిపోయింది. అంతా ఒక్కసారిగా తలకిందులై పోయింది. మా ఇంట్లో నవ్వులు మాయమయ్యాయి. మా నాన్న ఇష్టం లేకపోయిన రెండో పెళ్లి చేసుకోవల్సి వచ్చింది. మా చెల్లి చాలా చిన్నపిల్ల. తనకోసమే మా నాన్న మా పిన్నిని చేసుకున్నారు. ఇంకా మాకు కష్టాలు మొదలయ్యాయి. రోజు ఏదో ఒక గొడవ. ఇంట్లో ఉండాలంటేనే చిరాకు వేసేది. నేను ఇంటర్ అయిపోయి బీటెక్‌లో జాయిన్ అయ్యాను. ఎవ్వరితో మాట్లాడేవాడిని కాదు. చాలా సైలెంట్‌గా ఉండేవాడ్ని. అప్పుడే నా లైఫ్‌లోకి నందు వచ్చింది. ఎప్పుడూ నవ్వుతూ పక్క వారిని నవ్విస్తూ ఉండేది. తను నా దగ్గరకు కూడా వచ్చి ఎందుకు బాబు ఎప్పుడు మొహం ఉమ్మ్...అని పెట్టుకొని ఉంటావు అంది. నాకు కోపం వచ్చి నువ్వు ఎవరివే నన్ను అడగడానికి పో ఇక్కడి నుంచి అని గట్టిగా అరిచాను. అంతే తన కంట్లో నుంచి నీళ్లు ధారలా కారిపోయాయి. తను ఎప్పుడు ఏడవడం నేను చూడలేదు. నాకే చాలా బాధ వేసింది. తరువాత కొద్దిసేపటికి నేనే వెళ్లి సారీ చెప్పాను. నందు చాలా మంచిది వెంటనే క్షమించేసింది. అప్పటి నుంచి తనతో మాట్లాడటం మొదలు పెట్టాను. చాలా చక్కగా మాట్లాడేది. మా ఇంట్లో విషయాలు తనతో చెప్పాను చాలా బాధపడింది. నన్ను చాలా ప్రేమగా చూసుకునేది. నా కోసం స్పెషల్‌గా బాక్స్ తెచ్చేది. మేమిద్దరం చాలా క్లోజ్ అయిపోయాం. మళ్లీ నా లైఫ్‌లోకి హ్యాపీ డేస్ వచ్చాయి అనిపించింది. తను లేకుండా నేను ఉండలేకపోయేవాడ్ని. అందుకే తనకు ఒకరోజు నేను నిన్ను ప్రేమిస్తున్నాను. లైఫ్ లాంగ్ మా అమ్మను ఎంత ప్రేమిస్తానో అంత ప్రేమిస్తాను అని చెప్పాను. తను కూడా ఒక వారం టైం తీసుకొని మా ఇంట్లో ఒప్పిస్తే పెళ్లి చేసుకుంటాను అంది. మా ఇద్దరి కాస్ట్‌లు వేరు. అయినా నేను చదువు అయిపోయిన వెంటనే మంచి జాబ్ తెచ్చుకొని వాళ్ల ఇంట్లో ఒప్పించాను. మా నా జీవితంలోకి సంతోషం వచ్చింది. నందు, నేను, మా చెల్లి ముగ్గురం కలిసి ఉంటున్నాం. మా చెల్లిని కూడా నందు అమ్మలా చూసుకుంటుంది. నా నందు దొరకడం నా అదృష్టం. ఐ లవ్ యూ సో మచ్ నందు. వినయ్ కర్నూలు. -
ప్రేమలో ఉన్నారా.. ఈ వారం మీ జాతకం తెలుసుకోండి!
మేషం: మీ అభిప్రాయాలను, మనోగతాన్ని ఇష్టులకు తెలియజేసేందుకు బుధ, గురువారాలు అత్యంత అనుకూలమైనవిగా చెప్పవచ్చు. ఈకాలంలో మీ మనస్సులోని భావాలను వెల్లడిస్తే అవతలి నుంచి కూడా సానుకూల సందేశాలు రావచ్చు. ఇక ఈరోజుల్లో మీరు పింక్, ఆరెంజ్ రంగు దుస్తులు ధరిస్తే మేలు. అలాగే, ఇంటి నుంచి తూర్పు ఈశాన్య దిశగా బయలుదేరండి. ఇక, సోమ, మంగళవారాలు మీ ప్రయత్నాలకు దూరంగా ఉండండి. వృషభం: మీ మనస్సులోని భావాలను ప్రీతిపాత్రులకు తెలియజేసేందుకు శని, బుధవారాలు సానుకూలం. ఈరోజుల్లో మీనోట వచ్చిన శుభసందేశంతో అవతలి వారు మరింత ఉత్సాహం చూపుతారు. ఈ సమయంలో మీరు రెడ్, వైట్ రంగు దుస్తులు ధరిస్తే మంచిది. ఇక ఇంటి నుంచి దక్షిణదిశగా బయలుదేరితే శుభకరంగా ఉంటుంది. ఇక, ఆది, సోమవారాలు వీటికి స్వస్తి చెప్పడం మంచిది. మిథునం: మీరు అత్యంత ఇష్టపడే వ్యక్తులకు మీ అభిప్రాయాలను వెల్లడించేందుకు ఆది, సోమవారాలు అత్యంత అనుకూలమైనవి. ఈ సమయంలో మీ అభిప్రాయాలను అవతలి వారు మన్నించి మీకు సానుకూల సందేశం అందించే వీలుంది. ఇటువంటి సమయంలో మీరు రెడ్, ఎల్లో రంగు దుస్తులు ధరిస్తే మంచిది. అలాగే, ఇంటి నుంచి పశ్చిమదిశగా బయలుదేరండి. ఇక శుక్ర, శనివారాలు ఇటువంటి ప్రయత్నాలు విరమించండి. కర్కాటకం: మీరు కోరుకున్న వ్యక్తులకు ఇంతకాలం మీలో దాచుకున్న భావాలను తెలియజేసేందుకు శని, సోమవారాలు అనుకూలమైనవిగా చెప్పవచ్చు. ఈ రోజుల్లో మీ ప్రతిపాదనలకు అవతలి వారు కూడా సానుకూలంగా స్పందించే వీలుంది. ఈ సమయంలో మీరు గ్రీన్, ఆరెంజ్ రంగు దుస్తులు ధరిస్తే మంచిది. అలాగే, ఇంటి నుంచి ఉత్తరదిశగా బయలుదేరితే శుభదాయకంగా ఉంటుంది. ఇక, బుధ, గురువారాలు మీ ప్రయత్నాలకు విరామం ఇవ్వండి. సింహం: మీరు అత్యంత ఇష్టపడే వ్యక్తులకు మీ మనోగతాన్ని తెలిపేందుకు సోమ, గురువారాలు చాలా అనుకూలమైనవిగా చెప్పవచ్చు. ఈరోజుల్లో మీ ప్రతిపాదనలపై అవతలి వారు కూడా అనుకూలంగా స్పందించే అవకాశాలుంటాయి. ఇటువంటి సమయంలో మీరు ఎల్లో, పింక్ రంగు దుస్తులు ధరిస్తే మంచిది. అలాగే, ఇంటి నుంచి తూర్పుదిశగా బయలుదేరితే శుభకరంగా ఉంటుంది. ఇక, శుక్ర, మంగళవారాలు వీటికి దూరంగా ఉండండి. కన్య: మీమనస్సులో ఆరాధించే వారికి మీ అభిప్రాయాలను వెల్లడించేందుకు శుక్ర, సోమవారాలు విశేషమైనవిగా చెప్పవచ్చు. ఈరోజుల్లో మీ అభిప్రాయాలపై అవతలి వారు కూడా అనుకూలత వ్యక్తం చేయవచ్చు. ఈరోజుల్లో మీరు వైట్, పింక్ రంగు దుస్తులు ధరిస్తే అనుకూలం. ఇక ఇంటి నుంచి పశ్చిమ వాయువ్య దిశగా బయలుదేరితే శుభకరంగా ఉంటుంది. అయితే, ఆది, బుధవారాలు మీ ప్రయత్నాలకు విరామం ఇవ్వండి. తుల: మీ అభిప్రాయాలను, ప్రతిపాదనలను మీరు ఇష్టపడే వారికి తెలిపేందుకు శని, గురువారాలు అత్యంత సానుకూలమైనవిగా చెప్పవచ్చు. ఈ సమయంలో మీకు అవతలి వ్యక్తులు కూడా సానుకూల సందేశాలు అందించే వీలుంది. ఈరోజుల్లో మీరు ఆరెంజ్, రెడ్ రంగు దుస్తులు ధరిస్తే మేలు. ఇక, ఇంటి నుంచి దక్షిణ ఆగ్నేయదిశగా బయలుదేరండి శుభదాయకంగా ఉంటుంద. ఇక, సోమ, మంగళవారాలు మాత్రం మీ ప్రయత్నాలు విరమించండి. వృశ్చికం: మీరు అత్యంత ఇష్టపడే వారికి మీ మనోగతాన్ని తెలిపేందుకు ఆది, సోమవారాలు అత్యంత అనుకూలమైనవి. ఈరోజుల్లో మీ అభిప్రాయాలకు అవతలి వారు సైతం అనుకూలంగా స్పందించే అవకాశం ఉంది. మీ ప్రతిపాదనల సమయంలో ఎల్లో, గ్రీన్ రంగు దుస్తులు ధరిస్తే మంచిది. అలాగే, ఇంటి నుంచి తూర్పుదిశగా బయలుదేరండి. ఇక, శని, గురువారాలు ఇటువంటి వాటికి దూరంగా ఉండండి. ధనుస్సు: మీరు మనస్సులో ఆరాధించే వ్యక్తులకు మీ మనోగతాన్ని తెలిపేందుకు సోమ, బుధవారాలు చాలా అనుకూలమైనవిగా చెప్పవచ్చు. ఈ సమయంలో మీ అభిప్రాయాలకు అవతలి వారు కూడా తక్షణం స్పందించే వీలుంటుంది. ఈ రోజుల్లో మీరు రెడ్, పింక్ రంగు దుస్తులు ధరిస్తే మంచిది. ఇక, ఇంటి నుంచి పశ్చిమవాయువ్య దిశగా బయలుదేరండి. అయితే, శుక్ర, శనివారాలు మాత్రం ఇటువంటి వాటికి దూరంగా ఉండండి. మకరం: మీ అభిప్రాయాలు, ప్రతిపాదనలు మీరు కోరుకున్న వ్యక్తులకు అందించేందుకు శని, గురువారాలు అత్యంత అనుకూలమైనవిగా చెప్పవచ్చు. ఈరోజుల్లో మీరు చేసే ప్రతిపాదనలపై అవతలి నుంచి కూడా సానుకూల సందేశాలు రావచ్చు. ఈ సమయంలో మీరు గ్రీన్, వైట్ రంగు దుస్తులు ధరిస్తే మంచిది. అలాగే, ఇంటి నుంచి దక్షిణదిశగా బయలుదేరితే లాభదాయకంగా ఉంటుంది. ఇక, సోమ, మంగళవారాలు మాత్రం ఇటువంటి వాటికి దూరంగా ఉండండి. కుంభం: మీరు అభిమానించే వ్యక్తులకు మనస్సులోని భావాలను తెలిపేందుకు శని, ఆదివారాలు చాలా అనుకూలమైనవి. ఈ సమయంలో మీ ప్రతిపాదనలు విన్న అవతలి వారు అనుకూలంగా స్పందించే వీలుంది. ఈ రోజుల్లో మీరు ఆరెంజ్, ఎల్లో రంగు దుస్తులు ధరిస్తే ఉపయుక్తంగా ఉంటుంది. అలాగే, ఇంటి నుంచి తూర్పుదిశగా బయలుదేరితే శుభకరంగా ఉంటుంది. ఇక, మంగళ, బుధవారాలు ఇటువంటి వాటికి దూరంగా ఉండడం మంచిది. మీనం: మీరు ఇష్టపడే వారికి మనోగతాన్ని తెలిపేందుకు ఆది, సోమవారాలు అత్యంత అనుకూలమైనవిగా చెప్పవచ్చు. ఈ రోజుల్లో మీ అభిప్రాయాలకు అవతలి వారు కూడా తమ ఇష్టాన్ని తెలియజేసే వీలుంది. ఇటువంటి సమయంలో మీరు రెడ్, పింక్ రంగు దుస్తులు ధరిస్తే మంచిది. ఇక, ఇంటి నుంచి ఉత్తరదిశగా బయలుదేరితే శుభకరంగా ఉంటుంది. అయితే, శుక్ర, శనివారాలు మాత్రం మీ ప్రయత్నాలను విరమిస్తే మంచిది. -
ఎన్నోసార్లు అడిగింది కానీ....
మాది అందమైన ఊరు. చుట్టూ పచ్చని పొలాలు, ఎప్పుడూ నవ్వుతూ ఉండే కల్మషం లేని మనుషులు. నేను ఇంటర్ వరకు మా ఊరిలోనే చదివాను. చాలా హ్యాపీగా గడిచిపోయేది జీవితం. తరువాత బీటెక్ చదవడం కోసం నేను హైదరాబాద్ వచ్చాను. ఇక్కడ వాళ్లను చూస్తేనే భయమేసేది. ఎవ్వరూ నాలా లేరు. అందరూ చాలా స్టైల్‌గా ఉన్నారు.వాళ్లందరూ మంచి ఇంగ్లీష్ మాట్లాడుతూ ఉండేవారు. నేను క్లాస్‌లో జాయిన్ అయిన రోజే నాకు ఒక అమ్మాయి నచ్చింది. ఫస్ట్ టైమ్ తనని ఎల్లో కలర్ డ్రెస్‌లో చూశాను. తన జుట్టు రింగులు రింగులుగా ముఖం మీద పడుతూ ఉండేది. చాలా అందంగా ఉండేది. తనని అలా చూస్తూ ఉండాలనిపించేది. తను రాగానే ఫస్ట్ బెంచ్‌లో కూర్చుంది. చాలా సైలెంట్‌గా ఉండేది.అందరు పేర్లు చెప్పి పరిచయం చేసుకుంటుంటే తన పేరు చందు అని తెలిసింది. తను ఎవరితో ఎక్కువగా మాట్లాడేది కాదు. తనతో మాట్లాడం ఎలా అని ఆలోచించేవాడిని. క్లాస్‌లో ఎప్పుడు ఏ కార్యక్రమ జరిగిన తను ముందుండేది. ఇంగ్లీష్‌లో టకటక మాట్లాడేది. అది చూస్తేనే నా గుండె దడదడ అనేది. తనతో ఎలా అయిన ఫ్రెండ్షిప్ చేయాలి అని ఆలోచించే సమయంలో తను మా ఫ్రెండ్ వాళ్ల లవర్ రూమ్మేట్ అని తెలిసింది. ఇంకా నా లైన్ క్లియర్ అయ్యింది అనుకున్నాను. మా ఫ్రెండ్‌కు చెబితే కావాలని మేం ఇద్దరం కలిసేలా ప్లాన్ చేశారు. మేం కలిసిన తరువాత తను అడిగిన ప్రశ్న విని నేను షాక్ అయ్యాను. నువ్వు మా క్లాస్యేనా? నిన్ను ఎప్పుడూ చూడలేదే నీ పేరు ఏంటి అని అడిగింది. అప్పుడు నన్ను నేనే ఎన్ని తిట్టుకున్నానో తెలియదు. తరువాత నుంచి రోజు క్లాస్‌లో చూసి నవ్వేది. అప్పుడప్పుడు కొంచెం కొంచెం మాట్లాడేది. తనకు ఒక బెస్ట్ ఫ్రెండ్ ఉండేది. ఆమెతో నాతో మాత్రమే మాట్లాడేది. నా నెంబర్, తన నెంబర్ పక్కపక్కనే ఎప్పుడు ఎగ్జామ్స్ జరిగిన తన వెనకాలే నేను ఉండేవాడిని. తను మాత్రం కొంచెం కూడా కాపీ కొట్టనిచ్చేది కాదు. అలా కొన్ని రోజులు గడిచాక నేను,చందు, చందు వాళ్ల ఫ్రెండ్ బాగా క్లోజ్ అయిపోయాం. రోజు కలిసి క్యాంటీన్‌కి వెళ్లి తిని రచ్చ రచ్చ చేసేవాళ్లం. అందరు మమ్మల్ని చూసి మా లాగా ఉండాలి అనుకునే వాళ్లు. అలాగే చాలా మంది చందు నాకు ఓకే చెప్పేసింది, మేమిద్దరం లవర్స్ అనుకునేవాళ్లు. వాళ్ల మాటలన్ని విని తను చాలా సార్లు నేనుంటే నీకిష్టమా? ఎందుకు అందరూ ఎందుకు అలా అనుకుంటున్నారు అని అడిగేది. తను అంటే ఇష్టం ఉన్ననిజం చెబితే తను ఎక్కడ దూరం అవుతుందో అని అదేం లేదు, చాలా మంది చాలా అనుకుంటారు వదిలేయ్ అని చెప్పేవాడ్ని. మా ఫైనల్ ఇయర్లో తనకు మా ప్రేమ విషయం చెబుదాం అనుకున్నాను. కానీ ఇంతలో తను నాకు ఒక షాకింగ్ న్యూస్ చెప్పింది. తను వేరు అతనితో ప్రేమలో పడింది అని. నాకు ఏం చేయాలో అర్థం కాలేదు. నేనేం మాట్లాడకుండా సరే అని అన్నాను. తరువాత నాకేమైందో తెలియదు ఆరోజు రాత్రి తనని ఫోన్ చేసి అసలు నువ్వు వాడిని ఎందుకు లవ్ చేశావ్. వాడు నీకు సెట్ కాడు. మీరు విడిపోతారు అని ఇష్టం వచ్చినట్లు తిట్టేశాను. తనని చాలా బాధ పెట్టాను. అప్పటి నుంచి తను నాతో మాట్లాడటం మానేసింది. నిన్ను చాలా సార్లు అడిగాను అప్పుడు ఏం చెప్పలేదు. ఎప్పుడు ఇలా మాట్లాడతావనుకోలేదు అని చెప్పింది. అప్పటి నుంచి ఒక్కసారి కూడా నాతో మాట్లాడలేదు. నన్ను చూడలేదు. మా కాలేజ్ అయిపోయి నాలుగు సంవత్సరాలు ఇప్పటి వరకు తను ఎలా ఉందో ఏం చేస్తుందో కూడా నాకు తెలియదు. ఒక్కసారి తనకి సారీ అని మనస్ఫూర్తిగా చెప్పాలనుంది. ఇట్లు అరవింద్‌కుమార్ కరీంనగర్ -
అతనికి లవర్ ఉందని తెలిసినా....?
నా పేరు కావ్య. నేను ఇంటర్వ్యూ కోసం ఒక ఆఫీస్‌కు వెళ్లాను. ఆ ఆఫీస్ చూడటానికి చాలా బాగుంది. అంత పెద్ద బిల్డింగ్‌ను చూడగానే భయపడుతూనే లోపలికి వెళ్లాను. రిసెస్ఫన్లో కుర్చున్నాను. ఇంటర్వ్యూ కోసం లోపలికి పిలవడానికి చాలా సేపే పట్టింది. నేను ఒక సోఫాలో కూర్చొని వచ్చే పోయే వాళ్లను గమనిస్తూ ఉన్నాను. అప్పుడే ఫస్ట్ టైం తనని చూశాను. చూడటానికి చాలా పొడవుగా, ఆకర్షణీయంగా ఉన్నాడు. అప్పటి వరకు ఎవరిని చూసినా నాకు అంతలా నచ్చలేదు. వచ్చిన ఇంటర్య్వూ గురించి కాకుండా నా ఆలోచనలన్ని అతని చుట్టే తిరుగుతున్నాయి. ఈ ఉద్యోగం వస్తే అతనిని కలవచ్చు అనుకున్నాను. అసలు అతను ఎవరో కూడా తెలియదు. కానీ ఎందుకో నన్ను కట్టిపడేసేలా ఉన్నాడు. అందమైన అమ్మాయిని చూడగానే అబ్బాయిలు కవిత్వాలు ఎలా చెబుతారా అనుకునే దాన్ని. తనని చూశాక నచ్చిన వాళ్లు కనబడితే కవితలు, పాటలు అలాగే వస్తాయి అని అర్థం అయ్యింది. ఇంటర్వ్యూ బాగానే జరిగింది. ఇంటికి వెళ్లిపోయాక కూడా ఎందుకో తనే కనబడుతున్నట్లు ఉంది. ఒక రెండు మూడు రోజుల్లోనే ఆ ఆఫీస్ నుంచి సెలెక్ట్ అయినట్లు ఫోన్ వచ్చింది. ఎగిరిగంతేశాను. ఉద్యోగం వచ్చింది అన్న ఆనందం కన్నా అతన్ని చూస్తాను అన్న ఆనందమే ఎక్కువగా ఉంది. నేను జాయిన్ అయిన రెండు మూడు రోజుల దాకా అతను కనిపించలేదు. తరువాత ఒక రోజు మా డిపార్ట్మెంట్ దగ్గరకు వచ్చాడు. అప్పుడు మళ్లీ అనుకోకుండా తనని చూశాను. తన పేరు ఏంటో, ఏ డిపార్ట్మెంటో తెలుసుకోవాలనిపించింది. నా కోలింగ్కు నేను అతనిని ఇష్టపడుతున్న విషయం చెప్పాను. అతని పేరు కాంత్ అని చెప్పాడు. రోజు లంచ్ టైమ్‌లో అతనిని చూసేదాన్ని. మా ఫ్రెండ్స్ అందరూ అతనిని చూడగానే నన్ను ఆట పట్టించే వారు. ఒక్కరోజు తనని చూడకపోయిన చాలా బాధగా అనిపించేది. నేను తనని చూస్తున్న అన్న విషయం తనకి కూడా తెలుసు. నన్ను చూడగానే వాళ్ల ఫ్రెండ్స్ కూడా తనని ఏడిపించేవారు. కాంత్‌తో మాట్లాడాలని చాలా సార్లు ట్రై చేశాను. కానీ ధైర్యం చాలలేదు. ఒకరోజు తనకి లవర్ ఉంది అనే విషయం తెలిసింది. చాలా ఏడుపొచ్చింది. కానీ తను వస్తే మాత్రం చూడకుండా ఉండలేకపోయేదాన్ని. అనుకోకుండా ఒక రోజు తను ఆఫీస్ మానేసి వేరే జాబ్‌లో జాయిన్ అయ్యాడని తెలిసింది. అప్పటి నుంచి ఎప్పుడు లంచ్ చేయడానికి క్యాంటీన్‌కు వెళ్లిన తనే గుర్తుకు వస్తాడు. తనని చాలా మిస్ అవుతున్నాను. ఇట్లు కావ్య(హైదరాబాద్) -
అప్పుడు వద్దన్నా... ఇప్పుడు కావాలనిపిస్తోంది!
నా పేరు శ్రీదేవి. నేను చాలా యాక్టివ్.అందరితో ఇట్టే కలిసి పోతాను. తన పేరు రాహుల్. తను మా ఆఫీస్‌లోనే పనిచేస్తూ ఉంటాడు. కానీ తన డిపార్ట్మెంట్ వేరు మా డిపార్ట్మెంట్ వేరు. అప్పుడప్పుడు తను మా డిపార్ట్మెంట్ దగ్గరకు వచ్చేవాడు. చూడటానికి చాలా బాగుండే వాడు. చాలా పొడవుగా ప్రభాస్‌లా ఉండేవాడు. కాకపోతే తను నాకు పూర్తి భిన్నంగా ఉండేవాడు. చాలా సైలెంట్‌గా ఎవరితో మాట్లాడేవాడు కాదు. తను నాతో ఒకేఒక్కసారి మాట్లాడాడు. తరువాత కొన్ని రోజులకు తను నన్ను నా ఫోన్ నంబర్ అడిగాడు. నేను ఎందుకు అడిగాడు అనుకుంటూనే ఇచ్చాను. తను ఫోన్ నంబర్ తీసుకున్న రోజే నాకు కాల్ చేశాడు. నేను ఆఫీస్‌లో చూసిన రాహుల్‌కు నేను మాట్లాడిన అతనికి సంబంధమే లేదు. నాతో ఫోన్ మాట్లాడేటప్పుడు రాహుల్ చాలా యాక్టివ్‌గా మాట్లాడేవాడు. చాలా జోక్‌లు వేసేవాడు. తనకు కూడా సరదాగా ఉండటమంటే ఇష్టమని, కానీ అందరితో కలవలేనని చెప్పాడు. నేను చేసే అల్లరి తనకు చాలా ఇష్టమని చెప్పాడు. అలా రోజు మాట్లాడే రాహుల్ ఒక రోజు సడెన్‌గా నాకు ప్రపోజ్ చేశాడు. నాకు టైం కావాలి అని చెప్పాను. తరువాత కూడా రోజు కాల్ చేసి మాట్లాడుకునే వాళ్లం. చాలా రోజుల తరువాత తను మళ్లీ కాల్ చేసి నేను నీకు ఎందుకు నచ్చడం లేదు అని అడిగాడు. నేను అదేం లేదు. నువ్వంటే ఇష్టమే కానీ అది ప్రేమ కాదు. గతంలో నాకు బ్రేకప్ అయ్యింది అని చెప్పాను. తరువాత నుంచి తను నన్ను ఇంకా బాగా చూసుకోవడం మొదలుపెట్టాడు. బాధ అనిపించినప్పుడల్లా తనతో చెప్పుకొని బాధపడేదాన్ని. చాలా సపోర్టివ్‌గా ఉండేవాడు. రోజు మాట్లాడుకుంటూనే ఉండే వాళ్లం. తను మళ్లీ ప్రేమ విషయం అడిగాడు. మాట్లాడటం అంటే ఇష్టం కానీ ప్రేమించలేను అని చెప్పాను. తను అప్పటి నుంచి నాతో మాట్లాడటం తగ్గించాడు. ఎందుకు మాట్లాడటం లేదు అని అడిగితే నీతో మాట్లాడుతూ ఉంటే నీ మీద ఇష్టం పెరిగిపోతుంది. నీకు దూరంగా ఉండలేకపోతున్నా అందుకే కావాలనే దూరంగా ఉంటున్నాను అని చెప్పాడు. నేను కూడా అదే మంచిది కదా అని దూరంగా ఉన్నాను. తరువాత తనకి వేరే ఊర్లో ఉద్యోగం వచ్చి వెళ్లిపోయాడు. అప్పటి నుంచి నాకు అసలు కాల్ కానీ మెసేజ్ కానీ చేయడం లేదు. తను నాతో మాట్లాడకుండా ఉంటే తట్టుకోలేకపోతున్నాను. తను నాకు దూరంమవుతున్నాడు అంటే గుండె పిండేస్తున్నట్లుగా ఉంది. నాకు తను కావాలి అనిపిస్తోంది. ఇప్పుడు నేనేం చేయాలో అర్థం కావడం లేదు. ఫోన్ చేసి మాట్లాడితే అసలుఏం అంటాడో అర్థం కావడం లేదు. ఇట్లు శ్రీదేవి (హైదరాబాద్) -
బిజినెస్‌లో నష్టం వచ్చింది...అప్పుడు తను!
డియర్ ‘సాక్షి’ నేను నా ఫ్రెండ్స్ స్టోరీని చెప్పాలనుకుంటున్నాను.నా స్కూల్ డేస్‌లో నాకు ఇద్దరు స్నేహితులు ఉండేవారు. వారిద్దరు నాకు చాలా క్లోజ్. ముగ్గురం కలసి ఒకే చోట తినేవాళ్లం, చదువుకునే వాళ్లం. నా ఫ్రెండ్స్ ఇద్దరు వరుసకు బావ మరదళ్లు అవుతారు. మేం డిగ్రీ వరకు కలిసే చదువుకున్నాం. డిగ్రీ అయ్యాక నా స్నేహతురాలికి పెళ్లి చేయలానుకున్నారు. అప్పుడు వాళ్లిద్దరు దూరంమవుతున్నమన్న బాధలో వారిద్దరు ఒకరిని విడిచి ఒకరు ఉండలేరని అర్థం చేసుకున్నారు. ఆ విషయం ఇంట్లో చెప్పారు. ఇంట్లో వాళ్లు కూడా వెంటనే ఒప్పుకన్నారు. నా స్నేహితుడికి చదువు అయిపోయిన వెంటనే జాబ్ వచ్చింది. వెంటనే పెళ్లి చేసుకున్నారు. వాళ్ల జీవితం చాలా చక్కగా సాగిపోతున్న సమయంలో నా ఫ్రెండ్ బిజినెస్ స్టాట్ చేశాడు. అది మూడు సంవత్సరాలు బాగానే కలిసొచ్చింది. కానీ తరువాత చాలా నష్టాలు వచ్చాయి. ఆ టైంలో నా స్నేహితురాలు తనకు చాలా సపోర్టు ఇచ్చింది. తను లేకపోతే సూసైడ్ చేసుకునే వాడేమో. తరువాత బిజినెస్ వదిలేసి జాబ్‌లో జాయిన్ అయ్యాడు. వాళ్లకు ఇద్దరు మగపిల్లలు పుట్టారు. అంతా చక్కగా సాగిపోతున్న సమయంలో ఆ దేవుడికి కన్ను కుట్టిందేమో నా స్నేహితురాలికి క్యాన్సర్ అని తెలిసింది. ఆ విషయం తనకు చెప్పకుండా నా ఫ్రెండ్ ట్రీట్మెంట్ ఇప్పించేవాడు. కానీ రెండు సంవత్సరాల తరువాత తను దేవుడి దగ్గరకు వెళ్లిపోయింది. తను ఆ బాధను పంటిబిగువన భరిస్తూ ఇద్దరి పిల్లల్ని చూసుకుంటూ అలానే ఉంటున్నాడు. నేను ‘సాక్షి’ ద్వారా తనకు చెప్పాలనుకుంది ఒక్కటే మీ లైఫ్ మళ్లీ కొత్తగా మొదలు పెట్టండి. మీరు జీవితంలో ఇంకా ఉన్నతస్థాయికి చేరుకోవాలి. దానికి మీకు ఒక తోడు కావాలి. మీ ముఖం మీద మీ హృదయం నుంచి వచ్చే చిరునవ్వు ఉండాలి. ఇట్లు మీ చిన్ననాటి స్నేహితురాలు మీనాక్షి. -
నేను దుబాయ్‌కు వెళ్లే రెండు రోజుల ముందు!
నేను ఇంటర్మీడియట్లో ఉన్నప్పుడు మా పెద్దబాపు కొడుకు దుబాయ్ నుంచి వచ్చాడు. తన వాళ్ల ఫ్రెండ్స్ అందరి కోసం గిఫ్ట్‌లు తీసుకువచ్చాడు. అవి వాళ్లకు ఇవ్వడానికి నేను కూడా తనతోపాటు వెళ్లాను. అక్కడే నేను మొదటిసారి ఆమెను చూశాను. తనని చూడగానే తను నాకు బాగా నచ్చింది. మాట్లాదాం అనుకున్నాను కానీ కుదరలేదు. మేం ఇంటికి తిరిగి వచ్చేశాం. తరువాత మళ్లీ వాళ్ల బంధువుల పెళ్లి అయితే వెళ్లాం. నేను తనని చూస్తూ ఉండిపోయాను. తనతో ఒక్కసారి మాట్లాడాను. తరువాత మా పెద్దబాపు కొడుకును అడిగి ఆమె ఫోన్ నంబర్ తీసుకున్నాను. తనకి మెసేజ్ చేశాను. చాలా రోజుల వరకు రిప్లై రాలేదు. తరువాత ఎవరు మెసేజ్ చేసింది అని రిప్లై వచ్చింది. నేను చెప్పగానే నన్ను గుర్తుపట్టింది. నేను ఇంకా రోజు మెసేజ్ చేసేవాడ్ని బాగానే మాట్లాడేది. తనకి నా ప్రేమ విషయం ఎదురుగా వెళ్లి చెబుదాం అనుకున్నాను. కానీ ధైర్యం చాలలేదు. ఫోన్లోనే నా ప్రేమ విషయం చెప్పాను. తను రిప్లై ఇవ్వలేదు. కానీ తరువాత రోజు నుంచి నాతో మాములుగానే చాట్ చేసేది. నాకు ఎందుకో తనని ఇబ్బంది పెడుతున్నాను అనిపించింది. నేను దుబాయ్ వెళ్లిపోవాలని నిర్ణయించుకున్నాను. అయితే నేను దుబాయ్ వెళ్లే రెండు రోజుల ముందు తను నాకు ఐ లవ్ అని చెప్పింది. దుబాయ్ హ్యాపీగా వెళ్లిరా అని చెప్పింది. రెండు సంవత్సరాలు దుబాయ్ లోనే ఉన్నాను. నేను ఒకసారి తన ఫోటో అడిగాను. తను ఎందుకు అని అడిగింది. నిన్ను చూడాలనిపిస్తోంది అని చెప్పాను. తను పంపింది. అది ఒక్కటే ప్రస్తుతం నాకు మిగిలింది. కొన్ని రోజులకు వాళ్ల ఇంటిలో తనకు సంబంధాలు చూస్తున్నారు అని ఇంట్లో వచ్చి మాట్లాడమని చెప్పింది. నేను మాట్లాడితే బాగోదు అని మా ఇంట్లో ఒప్పించి వాళ్ల ఇంటికి పంపిచాను. వాళ్ల ఇంట్లో ఒప్పుకోలేదు. తను అప్పటి నుంచి నాతో మాట్లాడటం మానేసింది. తనకు వేరే వాళ్లతో పెళ్లి అయిపోయింది. నాకు అసలు అర్థం కానీ విషయం ఏంటంటే అమ్మాయిలు అంత తేలికగా ఎలా మారిపోతారు. ప్రేమించిన వ్యక్తిని మర్చిపోతారు.అసలు తను నన్న ఎలా మర్చిపోయిందో అర్థం కావడం లేదు. నేను మాత్రం తనని మర్చిపోలేకపోతున్నాను. కొన్ని కొన్ని సార్లు అయితే చచ్చిపోవాలనిపిస్తోంది. తనతో మాట్లాడిన ప్రతి మాట నాకొక మధుర జ్ఞాపకమే. తను ఎక్కడ ఉన్న ఆనందంగా ఉండాలని కోరుకుంటున్నాను. ఇట్లు, నాని(హైదరాబాద్). -
తనని ఆ ఒక్క విషయం అడగాలనుంది!
తన పేరు శిల్పా. నేను 6 వ తరగతిలో ఉన్నప్పుడు మొదటిసారి ఆమెను చూశాను. ఆమె చాలా అందంగా ఉండేది. ఆమె అందమైన ముఖం నాకు ఇప్పటికీ గుర్తుకు వస్తోంది. తనని ప్రతి రోజు ఇంటికి వెళ్లేటప్పుడు ఆమెకు తెలియకుండా ఫాలో అయ్యేవాడ్ని. నాకు పేవర్గా ఉండే ఒక సార్ నన్ను క్లాస్ లీడర్‌గా చేశారు. తనని కూడా చేశారు. నాకు ప్రతి రోజు తనని చూడటమే సరిపోయేది. కానీ ఎప్పుడు నా ఫీలింగ్స్ చెప్పలేదు. వాళ్ల ఇంటి చుట్టూ తిరుగుతున్నని మా నాన్న నన్ను వేరు స్కూల్లో చేర్చించారు. తను మాత్రం గవర్నమెంట్ స్కూల్లో ఉండిపోయింది. నేను ప్రతి రోజు స్కూల్ నుంచి రాగానే తనని చూసే వరకు నిద్రపోయే వాడ్ని కాదు. తను ట్యూషన్లో చేరిందని తెలిసి నేను కూడా అదే ట్యూషన్లో చేరాను. కానీ తను ఎప్పుడు నన్ను పట్టించుకోలేదు. మా 9వ తరగతిలో తను కూడా ఏదో ప్రైవేట్ స్కూల్లో చేరింది. నేను రోజు వాళ్ల హాస్టల్ దగ్గరకు వెళ్లిన తను కనిపించేది కాదు. ప్రతి రోజు బాధపడే వాడ్ని. ఇంటర్‌కు వెళ్లాక తన కాలేజ్ చుట్టూ తిరుగుతూ ఉండేవాడ్ని. కానీ నేను తన చుట్టూ తిరుగుతున్న ఒక్కసారి కూడా తనకి ఆ విషయం తెలిసేది కాదు. ఎన్నోసార్లు ప్రయత్నించా నేను నిన్ను ఇష్టపడుతున్నాను అని చెప్పడానికి కానీ ఊర్లో తెలిస్తే గొడవలు అవుతాయని భయంవేసేది. తన ఊరు వచ్చినప్పుడల్లా నేను వాళ్ల ఇంటివైపు ఏదో పని వంకతో వెళ్లి చూసి వచ్చేవాడ్ని. అలాగే ఒక్కసారి అయినా నాతో మాట్లాడుతుందేమో అనే ఆశతో 2002 నుంచి 2017 వరకు తన చుట్టూ తిరిగాను. కానీ నా బ్యాడ్ లక్ నేను నా ప్రేమ విషయం తనకు చెప్పకుండానే తనకు పెళ్లి అయిపోయింది. కానీ నేను ఇప్పటికీ తనని ఒక దేవతలానే చూస్తాను. నేను చచ్చేలోపు ఒక్కసారి అయినా నేను నీతో మాట్లాడాలి శిల్ప ప్లీజ్. నేను అసలు ఎవరో తనకి తెలుసా లేదో అనే విషయాన్ని ఒక్కసారి తనని అడగాలనుంది. ఒకే ఒక్క మాట నేను నీకు తెలుసా అని అడగాలి అని చాలా సార్లు అనిపిస్తుంది. తనని మొదటిసారి చూసిన ఆ క్షణం తన ముఖం ఎప్పుడూ నాకు గుర్తువస్తూనే ఉంటుంది. అది తల్చుకున్నప్పుడల్లా నా ముఖం మీద చిరునవ్వు వస్తుంది. శిల్ప ఈ మెసేజ్ నువ్వు చూస్తే ఒక్కసారి నాతో మాట్లాడు. ఇది నువ్వు గుర్తుపట్టాలి అనుకుంటే ఒక హింట్ ఇస్తాను నీకు అరవ తరగతిలో ఉన్నప్పుడు ప్రతిమ, గీత అనే ఫ్రెండ్స్ ఉన్నారు. ప్లీజ్ శిల్ప నువ్వు గుర్తుపడితే ఒక్కసారి నాతో మాట్లాడు. ఇట్లు కుమార్ (పేరు మార్చాం) ఒంగోలు. -
ఆ ఉద్యోగంలో అందుకే చేరానేమో!
నేను బీటెక్ చేశాను. కానీ కమ్యూనికేషన్ స్కిల్స్ లేక నాకు సరియైన జాబ్ రాలేదు. ఏదో చిన్న జాబ్‌లో చేరాను. బాగా చదివి టాప్‌లో ఉండే నాకు సరిగా మాట్లాడలేకపోవడం, ఇంగ్లీష్ రాకపోవడం వల్ల మంచి జాబ్‌లో చేరలేకపోయాను. ఆ బాధ నన్ను చాలా వెంటాడుతూ ఉండేది. ఎందుకు ఈ జాబ్ చేస్తున్నానో కూడా అర్థం అయ్యేది కాదు. చాలా డిప్రెషన్లో ఉండే వాడిని. నవ్వి కూడా చాలా రోజులు అయ్యింది. అలా డల్‌గా ఉన్న నా లైఫ్‌లోకి ఒక అమ్మాయి వచ్చింది. ఆమె కోసమే అక్కడ చేరాను అని తరువాత అర్థం అయ్యింది. అంతేనేమో లైఫ్ లో జరిగే ప్రతి విషయం మరో విషయంతో ముడిపడి ఉంటుందేమో!. ఆమె అక్కడ హెచ్ఆర్గా చేరింది. చాలా యాక్టివ్‌గా ఉండేది. అందరితో మంచిగా మాట్లాడేది. ఎప్పుడు నవ్వతూనే ఉంటుంది తను. నాతో కూడా తనే వచ్చి మాట్లాడింది. అప్పటి నుంచి రోజు మాట్లాడుతూనే ఉండేది. నేను బీటెక్ మంచి మార్కులతో పాస్ అయిన ఇంగ్లీష్ రాకపోవడం, కమ్యూనికేషన్ స్కిల్స్ లేకపోవడం వల్ల ఇలా అయ్యానని తెలుసుకొని చాలా బాధపడింది. తరువాత నుంచి నన్ను ప్రతి విషయంలో ప్రోత్సహిస్తూ నాలో ధైర్యాన్ని నింపింది. నెమ్మది నెమ్మదిగా రోజు నాతో ఇంగ్లీష్‌లో మాట్లాడుతూ నా స్కిల్స్ ఇంప్రూవ్ కావడంలో సహాయం చేసింది. తరువాత నాకొక మంచి జాబ్ వచ్చింది. నా జీవితమే మారిపోయింది. నాకు ఇంతలా సాయం చేసిన ఆమెనే పెళ్లి చేసుకోవాలనుంది. కానీ ఆమె ఏమంటుందో అని నా ప్రేమను చెప్పలేకపోతున్నాను. సురేష్ (గుంటూరు). -
నన్ను మోసం చేసింది అనుకున్నా... కానీ!
నా ప్రాణ స్నేహితురాలు అలా చేస్తుందని ఎప్పుడూ ఊహించలేదు. నేను ఎవరినైతే నా కంటే ఎక్కువగా ప్రేమించానో తనే ఇలా చేస్తుందని ఎన్నడూ అనుకోలేదు. నేను నమ్మిన ఇద్దరు వ్యక్తులు ఒకేసారి వెన్నుపోటు పొడిచి నాకు ద్రోహం చేసిన ఆ క్షణం నేను ప్రాణాలతో ఎందుకున్నానా అని తొలిసారి అనిపించింది. దేనినైనా భరించగలం కానీ అలాంటి బాధను భరించలేము. అసలేం జరిగిందంటే నా పేరు లిఖిత, తన పేరు లాస్య. మా ఇంటిపక్కనే వాళ్ల ఇళ్లు. చిన్నప్పటి నుంచి కలిసే ఉన్నాం. ఎప్పుడూ కలిసే ఆడుకునే వాళ్లం, కలిసే స్కూల్‌కు వెళ్లే వాళ్లం. ఇద్దరి మధ్య మంచి స్నేహం ఉండేది. నేను అన్ని విషయాలు తనతో పంచుకునే దాన్ని. మేం 8వ తరగతిలో ఉన్నప్పుడు వాళ్ల నాన్న ఉద్యోగం వేరే చోటకు మారడంతో వాళ్లు హైదరాబాద్ వెళ్లిపోయారు. అయినా కూడా మా స్నేహం కొనసాగుతూనే ఉంది. తరువాత బీటెక్‌లో మేం ఇద్దరం ఒకే కాలేజీలో చేశాం. చాలా హ్యాపీగా ఉండేవాళ్లం. బీటెక్ 3వ సంవత్సరంలో నాకు శ్యామ్ అనే ఒక అబ్బాయి ప్రపోజ్ చేశాడు. తను మా క్లాసే. చాలా జోవియల్‌గా ఉండే వాడు. అతనంటే నాకు కూడా చాలా ఇష్టం. అందుకే తను ప్రపోజ్ చేయగానే నేను కూడా ఓకే చెప్పేశాను. ఆ విషయం నేను వెంటనే లాస్యకు చెప్పాను. లాస్య కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యింది. శ్యామ్ నేను బాగా ఎంజాయ్ చేసేవాళ్లం. మాతో అప్పుడప్పుడు లాస్య కూడా వచ్చేది. కొన్ని రోజుల తరువాత శ్యామ్ ప్రవర్తనలో మార్పు వచ్చింది. నన్ను అవాయిడ్ చేయడం మొదలు పెట్టాడు. నాకు ఒక రోజు డౌట్ వచ్చి తన ఫోన్‌ను చెక్ చేశాను. ఆ ఫోన్ చూసి నేను షాకయ్యాను. ఎందుకంటే లాస్య శ్యామ్ ఒకరితో ఒకరు చాలా క్లోజ్‌గా చాట్ చేసుకోవడం చూశాను. ఇద్దరు నన్ను మోసం చేశారని తెలుసుకున్నాను. నేను శ్యామ్‌ను ఈ విషయం గురించి ప్రశ్నించాను. నాకు లాస్య అంటే మొదటి నుంచి ఇష్టం. తనతో క్లోజ్ అవడం కోసమే నీకు ప్రపోజ్ చేశాను అని చెప్పాడు. ఆ మాటలు వినగానే నేను ఎంతలా మోసపోయానో అర్ధం అయ్యింది. ఇంకా లాస్యతో మాట్లాడాలి అనిపించక లాస్య హాస్టల్ నుంచి వేరు హాస్టల్‌కు వెళ్లిపోయాను. కొన్ని రోజుల తరువాత శ్యామ్ ఏడుస్తూ నా దగ్గరకు వచ్చి లాస్య తనని మోసం చేసిందని చెప్పాడు. తనకు అంతకు ముందే లవర్ ఉన్నాడంటా వాడితోనే ఉంటా అంటుంది,నన్ను మోసం చేసింది అన్నాడు. నేను లాస్యను చాలా రోజులు తరువత కలిసి అసలు నువ్వు ఏం చేస్తున్నావో అర్థం అవుతుందా అని అడిగాను. అవుతుంది. నీకు శ్యామ్ అంటే చాలా ఇష్టం కానీ శ్యామ్ ఒక ప్లేబాయ్. ఆ విషయం నీకు అర్థం కావాలనే శ్యామ్‌తో క్లోజ్‌గా ఉన్నట్లు నటించాను. తరువాత మోసం చేస్తే ఎంత బాధగా ఉంటుందో తనకి తెలిసేలా చేశాను అంది. నాకు ఒక్కసారిగా లాస్య మీద ఎంతో గౌరవం పెరిగింది. నేను తనని తప్పుగా అర్థం చేసుకున్నాను అని తెలిసింది. లాస్యను నేను జీవితాంతం నిన్ను గుర్తుపెట్టుకుంటాను. నువ్వు చేసిన సాయం ఎప్పటికీ మర్చిపోలేను అని చెప్పాను. కొన్ని సార్లు మనం నమ్మిన వాళ్లు మోసం చేశారనుకొని ద్వేషం పెంచుకుంటాం. కానీ నిజమైన స్నేహితులు మన మంచి కోసం ఏదైనా చేస్తారు. ప్రేమ విషంలో నేను మోసపోయిన ఫ్రెండ్షిప్ విషయంలో నేను గెలిచాను. లవ్ యూ లాస్య. లిఖిత( ఏలూరు) -
కలరింగ్ లేక తెగ బోర్ కొట్టేది... అప్పుడు!
ప్రేమ ప్రతి ఒక్కరి జీవితంలో తీపిని నింపుతుంది. కానీ నా జీవితంలో మాత్రం అది విషాన్ని మిగిల్చింది. ఎప్పుడు నవ్వుతూ ఉండే నా పెదాలపై ఆ నవ్వునే లేకుండా చేసింది రెండక్షరాల ప్రేమ. నేను ప్రేమించిన అమ్మాయి పేరు శ్రావ్య. పేరుకు తగ్గట్టుగానే వినసొంపైన గొంతు, అందమైన రూపం ఆమెది. ఎన్నో ఆశలతో లైఫ్‌ను ఎంజాయ్ చేయెచ్చని ఒక ఆఫీస్‌లో చేరాను. ఆ ఆఫీస్‌లో పనిలో ఒత్తిడి లేకపోయినా కలరింగ్ లేక లైఫ్ చాలా బోర్ కొడుతూ ఉండేది. అలాంటి టైంలో నేను ఉదయం ఆఫీస్‌కు వచ్చే టైంకు నాకు ఒక విషయం తెలిసింది. కొత్తగా ట్రైనింగ్ పూర్తి చేసుకున్న ఒక ఐదుగురు అమ్మాయిలు మా డెస్క్‌లో చేరారు అని. వెంటనే వాళ్లని చూడాలనిపించి వాళ్ల కోసం ఎదురుచూశాను. సరిగ్దా ఉదయం 10 గంటలు కాగానే వాళ్లు డెస్క్‌లో అడుగు పెట్టారు. అందరూ బాగానే ఉన్నారు. కానీ అందులో నలుపు రంగు డ్రెస్‌లో ఉండి హెయిర్ లీవ్ చేసుకున్న ఉన్న అమ్మాయి నాకు బాగా నచ్చింది. చాలా సేపు ఆమె గురించే ఆలోచిస్తూ ఉండిపోయాను. కొత్తగా రావడంతో వాళ్లు ఒక్కక్కరి దగ్గర ఒక్కో విషయం నేర్చుకుంటూ ఉన్నారు. నా దగ్గరకు ఎప్పుడు వస్తుందా తను అని చాలా రోజులు ఎదురు చూశాను. ఇంకా ఏం చేయాలో తెలియక తను నా కొలిగ్ దగ్గర డౌట్ కోసం వెళితే నా దగ్గరకు పంపియ్యమని రిక్వెస్ట్ చేశాను. తను నా దగ్గరకు వచ్చింది. ఒక్క క్షణం ఆకాశాన్ని జయించినంత ఆనందం కలిగింది. మనసులోనే ఎగిరి గంతేశాను. తను రాగానే పేరు తెలియనట్టు నీ పేరేంటి అని అడిగాను. శ్రావ్య అని చెప్పింది. ఎందుకో అప్పుడే నాకు ఎక్కడ లేని ధైర్యం వచ్చి ఫోన్‌నంబర్ చెప్పు అని అడిగేశాను. తను ఏమనుకుందో కానీ ఏదో అనుకుంటూనే నాకు నంబర్ ఇచ్చింది. నేను సాయంత్రం అవగానే తనకు కాల్ చేశాను. తను సరిగా రెస్పాన్డ్ కాలేదు. తరువాత రోజు నేను కాల్ చేయడానికి రీజన్ వేరే ఉంది అని కవర్ చేశాను. తను సరే సార్ అంది. ఆ తరువాత నుంచి కాల్ చేసినప్పుడు బాగానే మాట్లాడేది. చాలా జోవియల్ గా మాట్లాడేది. తన మాటలు రోజు కొత్తగా అనిపించేవి. చాలా అందంగా ఉండేవి ఆ రోజులు. తను నన్ను లవ్ చేస్తోందో లేదో తెలుసుకోవడానికి నేను తన ఫ్రెండ్ ఫోన్ నంబర్ కూడా తీసుకొని తనతో క్లోజ్‌గా మాట్లాడుతున్నట్లు నటించాను. అప్పటి నుంచి తను నాతో మాట్లాడటం మానేసింది. నన్ను ప్లేబాయ్ అనుకుంది. ఎన్ని సార్లు చెప్పినా అర్థం చేసుకోకుండా నీకు నేను కాకపోతే ఇంకోటి వస్తుందిలే అని దూరం పెట్టింది. నా ఫోన్ లిఫ్ట్ చేయదు. మెసేజ్‌కు రిప్లై ఇవ్వదు. అంత మంచిగా మాట్లాడిన తను ఒక్కసారిగా మాట్లాడటం మానేస్తే తట్టుకోలేకపోతున్నా. నేను చేసిన చిన్న తప్పు నన్ను ఆ అమ్మాయి ముందు దోషిగా నిలబెట్టింది. ఆ తప్పు గురించి ఎప్పుడూ బాధ పడుతూనే ఉంటాను. ప్రవీణ్(విజయవాడ) -
తను ప్రేమించింది మా అన్నయ్యనే!
నా పేరు రవి. మేము వైజాగ్‌లో ఉంటాం. మా స్కూల్లో రాధా అని ఒక అమ్మాయి ఉండేది.నాకెందుకో ఎప్పుడూ ఆ అమ్మాయితో మాట్లాడాలి అనిపిస్తూ ఉండేది. కానీ ఆ అమ్మాయి ఎవరితో మాట్లాడేది కాదు. చాలా సైలెంట్‌గా ఉండేది. కానీ చదువులో అన్నింటిలో ముందుండేది. చూడటానికి చాలా అందంగా కూడా ఉండేది. నేనే కాదు మా స్కూల్లో చాలా మంది ఆమె అంటే ఇష్టపడేవాళ్లు. ఆమె మాత్రం వాళ్లను ఎవరిని పట్టించుకునేది కాదు. నా మనసులో మాట చెప్తాదామని చాలా సార్లు అనుకున్నాను.కానీ ఎప్పుడూ ధైర్యం చాలలేదు. నేను తనకు నా ప్రేమ విషయం చెప్పకుండానే మా టెన్త్ క్లాస్ అయిపోయింది. ఇంటర్లో నేను వేరే కాలేజీ, తను వేరే కాలేజీలో చేరాం. కానీ నేనెప్పుడు తనని మర్చిపోలేదు. ఎవరిని చూసిన తనే గుర్తొచ్చేది. ఆ రెండు సంవత్సరాలు నేను ఒక్కసారి కూడా తనని కలవలేదు. చూడలేదు. తరువాత అనుకోకుండా నేను తను బీటెక్‌లో ఒకే బ్రాండ్ ఒకే కాలేజ్‌లో జాయిన్ అయ్యాము. మా కాలేజీలో మొదటిసారి తనని చూసినప్పుడు నా ఆనందానికి అవధులు లేవు. తను నాకు రాసిపెట్టి ఉంది కాబట్టే మా కాలేజీలో చేరింది అనిపించింది. నా ప్రేమ కొత్త రెక్కలు తొడుక్కున్నట్లు, మళ్లీ చిగురించినట్లు ఎక్కడలేని ఆనందం ఏవేవో ఆలోచనలు. ఎలాగైనా తనతో పరిచయం పెంచుకోవాలని , ప్రతి చిన్న విషయానికి తనతో మాట్లాడేవాడిని. నెమ్మదిగా తను కూడా నాతో మాట్లాడటం మొదలు పెట్టింది. ఇక చాటింగ్ స్టాట్ అయ్యింది. అక్కడి నుంచి ఫోన్లు మాట్లాడుకోవడం మొదలయ్యింది. తను నాతో క్లోజ్‌గా ఉంటుంది కదా అని నువ్వు ఎవరినైనా లవ్ చేశావా అని క్లారిటి కోసం అడిగాను. అప్పుడు తను చెప్పిన మాట విని నాకు గుండె ఆగినంత పని అయ్యింది. తను ఇంటర్లో ఉండగానే తన సీనియర్ ఒకతన్ని లవ్ చేశాను అని చెప్పింది. అతను ఎవరు అని తెలుసుకుంటే నాకు మరో షాక్ తగిలింది. అతను నాకు వరుసకు అన్నయ్య అవుతాడు. ఇక నాకు అంతా చీకటి అయిపోయినట్లు అనిపించింది. నెమ్మది నెమ్మదిగా తనకి దూరంగా ఉంటూ వచ్చాను. ఇక తనని మర్చిపోవాలని బీటెక్ అయిపోగానే యమ్ ఎస్ చేయడానికి అమెరికా వెళ్లిపోయాను. తన ఆలోచనలను పూర్తిగా తీసేయాలి అనుకున్నాను. నెమ్మది నెమ్మదిగా తనని మర్చిపోతున్నాను. తను ఎప్పుడూ హ్యాపీగా ఉండాలి అని కోరుకుంటున్నాను. రవి (వైజాగ్). -
నిన్ను మర్చిపోవడం అంటే చచ్చిపోవడమే!
హాయ్ నా పేరు కృష్ణ. నేను బీఎస్సీ ఫైనల్ ఇయర్లో ఉన్నప్పుడు ఒక అమ్మాయిని చూశాను. తన పేరు శృతి. తను టైలరింగ్ నేర్చుకోవడానికి వచ్చేది. అప్పుడే తను నాకు పరిచయం అయ్యింది. కొద్ది రోజుల తరవాత అది ప్రేమగా మారింది. నేను ఒక రోజు శృతికి ఆ విషయం చెప్పాను. తను కూడా నా ప్రేమను ఒప్పుకుంది. మా ప్రేమ విషయంలో మాకు చాలా గొడవలు అయ్యాయి. అయిన మేం ఒకరిని వదిలి ఒకరం ఉండలేకపోయేవాళ్లం. ఎన్ని గొడవలు అయిన ఒక్క రోజు కూడా తనతో మాట్లాడకుండా ఉండలేకపోయేవాడిని. శృతి అంతలా నా మీద ప్రేమ చూపించేది. ఒక రోజు తను వాళ్ల ఇంట్లో తనకు పెళ్లి సంబంధాలు చూస్తున్నారు అని చెప్పింది. నేను మనం వెళ్లిపోయి పెళ్లి చేసుకుందాం అన్నాను. తను సరే అంది. మా ఇద్దరి కులాలు వేరు. అందుకే నేను ఒక సంవత్సరం పాటు ఎదురు చూశాను. తను ఒకరోజు ఫోన్ చేసి నాకు ఇంట్లో మ్యారేజ్ ఫిక్స్ చేశారు. నాకు ఇంకా ఫోన్ చేయకు అని చెప్పింది. అప్పుడు నాకు జీవితంలో ఎప్పుడూ లేనంత బాధ వేసింది. శృతికి ఆ పెళ్లి ఇష్టం లేకపోయిన వాళ్ల ఇంట్లో వాళ్ల కోసం ఆ పెళ్లికి ఒప్పుకుందని తరువాత నాకు తెలిసింది. అప్పుడు నేను వచ్చేసేయ్ మనం పెళ్లి చేసుకుందాం అని అడిగాను. తను రాలేదు. ఇప్పుడు కూడ తన కోసమే నా ఆలోచన. నా స్థానంలో వేరే వాళ్లను ఊహించుకోలేకపోతున్నాను. నా ఊపిరి ఉన్నంత కాలం నేను తనని మర్చిపోలేను. నువ్వు జాగ్రత్త శృతి నువ్వు లేని జీవితం శూన్యం శృతి. నువ్వే నా ప్రపంచం. నువ్వు గుర్తురాని క్షణం లేదు. ఐ లవ్ యూ శృతి. ఐ మిస్ యూ. నేను నిన్ను మర్చిపోవడం అంటే చచ్చిపోవడమే. కృష్ణ(అమలాపురం). -
అంత తొందరగా ఆమె ప్రేమను ఒప్పుకోలేదు!
నేను జాబ్ చేసే టైంలో నాతో పాటు జాజ్ చేసే ఒక అమ్మాయి చాలా రోజులు నా వెంట పడింది. ప్రేమిస్తున్న అని చాలా కాలం నా కోసం ఎదురు చూసింది. నేను అంత తొందరగా ఆమె ప్రేమను ఒప్పుకోలేదు. కొన్ని రోజుల తర్వాత ఆమె ప్రేమలో నిజాయితీ చూసి ఒప్పుకున్నా. నాలుగు సంవత్సరాలు మా ప్రేమ ప్రయాణం సాగింది. ఆమెకు పెళ్లి సంబంధాలు చూస్తున్నారు అని పెళ్లి చేసుకుందాం అంది. నేను రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుందాం అన్నాను, ఆమె మాత్రం వాళ్ళ నాన్న ను ఓప్పించి చేసుకోవాలి అంది. అలా ఒప్పుకోరు పెళ్లి చేసుకున్నాక వాళ్లే ఒప్పుకుంటారు అన్నాను. అయినా ఆమె నా మాట వినలేదు. ఇద్దరికి చాలా పెద్ద గొడవ అయ్యింది. ఇంట్లో ఎవరికీ తెలియకుండా నన్ను లవ్ చేశావు, పెళ్లి కి మాత్రం అందరూ ఒప్పుకోవాలి అనడం కరెక్ట్ కాదు అని నేను ఆమెతో విడిపోయాను. నేను మాత్రం మా నాన్న కి తెలియకుండా అసలు చేసుకొను అంది. అలా మేమిద్దరం విడిపోయాం. ఆమె మాత్రం పెళ్లి చేసుకొని హ్యాపీగా ఉంది. నేను మాత్రం ఆమె జ్ఞాపకాల నుంచి బయటకు రాలేకపోతున్నా. ఆమె వస్తుంది అని పెళ్లి చేసుకోకుండా ఒంటరిగా ఉంటున్నా. లవ్ చేసే ముందు గుర్తు రాని తల్లిదండ్రులు పెళ్లి చేసుకునే ముందు ఎందుకు గుర్తు వస్తారో నాకు అర్థం కాదు. ఇప్పటికీ ఫోన్ చేస్తోంది. పెళ్లి చేసుకో అని చెప్తుంది. నేను ఒకటే చెప్పా తనతో నువ్వు చేసిన మోసం నుంచే ఇంకా కోలుకోలేదు. ఇంకో అమ్మాయిని పెళ్లి చేసుకొని మోసం చేయలేను అని చెప్పాను. కమల్(సికింద్రాబాద్). -
మనం ఫేస్బుక్ ఫ్రెండ్స్ మాత్రమే అంది!
నేను ఎప్పుడూ ఎవరితోనూ ఎక్కువగా మాట్లాడే వాడిని కాదు. అందరి అబ్బాయిల్లాగా అమ్మాయిల వెంట పడే వాడ్ని కాదు. ఎప్పుడూ చదువు మీదే ఉండేది నా ధ్యాసంతా. అలా నా డిగ్రీని 2015 లో డిస్టింక్షన్ లో పాస్ అయ్యాను. తరువాత ఐసెట్ ద్వారా ఎంసీఏ హైదరాబద్ లో పూర్తి చేశాను. నేను నా సెమిస్టర్ ఎగ్జామ్స్ అప్పుడు మాత్రమే కాలేజీకి వెళ్ళేవాడిని. అలా నేను కాలేజీకి వెళ్లకుండానే ఫస్ట్ క్లాస్ లో ఎంసీఏ పూర్తి చేశాను. ఎంసీఏ పూర్తి చేసిన తరువాత అందరి లాగా ఏదో సాఫ్టువేర్ కంపెనీ లో జాబ్ చేయాలి అనుకోలేదు. సొంతంగా బిజినెస్ స్టార్ట్ చేద్దామని సోషల్ మీడియాను ఎంచుకున్నాను. ఎందుకంటే నా ఆలోచనలు ఎప్పుడు పెద్దవిగా వుండేవి. ఆ ఆలోచనలే ఇప్పుడు నన్ను అయోమయంలో పడేస్తాయి అని ఎప్పుడూ అనుకోలేదు. నా బిజినెస్ ఐడియా ఏంటంటే చాలా మంది ప్రజలు టీవీల కంటే సోషల్ మీడియాలోనే ఎక్కువ గడుపుతారు. కొంత మంది తమ వెబ్ సైట్ డిజైన్ కోసం సాఫ్ట్వేర్ కంపెనీని సంప్రదిస్తారు. కొంత మంది వెబ్సైట్ ట్రాఫిక్ కోసం గూగుల్ లాంటివి సంప్రదిస్తారు. వాళ్ళ అందరి కోసం నేను కొన్ని ఫేస్బుక్ పేజెస్, ఇన్స్టాగ్రామ్ అకౌంట్స్ ను క్రియేట్ చేశాను. అలా నేను ఒక ఫేస్బుక్ పేజీను సైన్స్ & టెక్నాలజీ పేరుతో స్టార్ట్ చేశాను. అలా నేను సోషల్ మీడియాలో లీనం అయ్యాను. నాలాంటి ఆలోచనలు ఉన్న అమ్మాయి ఫేస్బుక్ ద్వారా పరిచయం అయ్యింది. నేను ఎప్పుడూ మెసేజెస్ పెట్టేవాడిని కాదు. ఆ అమ్మాయి కూడా నాలాగే ఫేస్బుక్ సొసైటీకి సంబంధించిన పేజిని రన్ చేస్తుండేది. ఆమె ఎప్పుడూ సొసైటీ మీదే ఎక్కువ దృష్టి పెట్టేది. అలా నేను ఆమె ప్రతి పోస్ట్ కు లైక్స్, కామెంట్స్ పెట్టేవాడిని. ఎవరైనా నెగటివ్ గా కామెంట్స్ పెడితే నేను హీరో లాగా వాళ్ళకు రిప్లై ఇచ్చేవాడిని. ఆమె నన్ను ఇష్టపడుతుంది అనే భ్రమలో నేను నా బిజినెస్, జాబ్ మీద దృష్టి పెట్టలేదు. ఒక రోజు నా మనస్సు లోనీ మాట ఆమెకు చెప్పాను. కానీ ఆమె నాకు ఇలా రిప్లై ఇచ్చింది. నువ్వు జస్ట్ ఫేస్బుక్ ఫ్రెండ్‌వు మాత్రమే అని అంది. నేను పూర్తిగా డిప్రెషన్ లోకి వెళ్ళాను. నాకు అందరిలాగ ఫ్రెండ్స్ ఎక్కువగా లేకపోవడం వల్ల అలా అయ్యాను. ఇప్పుడు నేను సోషల్ మీడియా ను పక్కన పెట్టి జాబ్ కోసం ట్రై చేస్తున్న. ఇప్పుడు ప్రేమ అంటేనే చాలా భయం వేస్తోంది. విజయ్(పేరు మార్చాం). -
ఇంట్లో వాళ్లను మోసం చేయలేనంది!
తనని మొదటిసారి డిగ్రీ ఫస్ట్ ఇయర్లో చూశాను. చూడగానే నచ్చేసింది. రోజు తనని అలాగే చూస్తూ ఉండేవాడిని. తను లాస్ట్ బెంచ్‌లో కూర్చునేది. నేను కూడా అలాగే కుర్చునేవాడిని. 2 సంవత్సరాలు అలాగే గడిచిపోయాయి. ఒకసారి ధైర్యం చేసి మా ఫ్రెండ్‌కు చెప్పి పంపాను. తను ఒకసారి నా వైపు చూసింది. రెండు రోజుల తరువాత పిలిచి నువ్వే కదా రోజు నాకు ఫోన్ చేసేది అని అడిగింది. నేను కాదు అని చెప్పాను. అదే ఫస్ట్ టైమ్ నేను తనతో మాట్లాడింది. ఆ తరువాత 2,3 సార్లు మాట్లాడాను. డిగ్రీ చివరి ఎగ్జామ్స్ రోజు గుడిలో నాతో మాట్లాడతాను అని తన ఫ్రెండ్ ద్వారా నాకు చెప్పించింది. ఆ రోజు వెళ్లే సరికి తను వెళ్లి పోయింది. తననే అదే చివరిసారి చూశాను. ఆ తరువాత నేను బస్టాండ్‌లో ఉన్నప్పుడు తను కోచింగ్‌కు వెళుతూ ఒకసారి కనిపించింది. తను నన్ను చూసి నవ్వింది. రెండు రోజుల తరువాత తనకి కాల్ చేశాను. తన నంబర్ నా దగ్గర ఉన్న నేను ఎప్పుడూ తనకి కాల్ చేయలేదు. నేను ఫోన్ చేసినప్పుడు తను నాతో చాలా మంచిగా మాట్లాడింది. అలా ఆరోజు నుంచి రోజు ఫోన్లో మాట్లాడుకునే వాళ్లం. మూడు సంవత్సరాలు ఫోన్లో మాట్లాడుకున్నాం. కానీ ఎప్పుడు తనని కలవలేదు. నేను తనని చాలా నిజాయితీగా ప్రేమిస్తున్నాను అనే విషయాన్ని ఆమె నమ్మింది. కొన్ని రోజుల తరువాత పెళ్లి విషయం వచ్చింది. ఆమె వాళ్ల ఫ్యామిలీ చూపించిన అబ్బాయినే చేసుకుంటాను, ఇంట్లో వాళ్లని మోసం చేయలేను అని చెప్పింది. నేను కూడా ఆలోచించాను. తన ఇష్టానికి నేను కూడా ఓకే చెప్పాను. ఫ్రెండ్స్ లాగా ఉందామని డిసైడ్ అయ్యాం. తనకి పెళ్లి ఫిక్స్ అయ్యింది. నన్ను మిస్ అవుతున్నాను అని చెప్పింది. నేను కూడా అదే ఫీల్ అవుతున్నాను. ఇప్పటికీ నువ్వంటే ఇష్టమే. ఇప్పటి వరకు నీ పక్కన కూర్చోని మాట్లాడలేకపోయాను అని ఒక బాధ. మిస్ యు. పేరు చెప్పలేదు(కామారెడ్డి). -
నా జీవితంపై వెయ్యి ఎపిసోడ్లు తీయొచ్చు!
నా పేరు కన్నా. నాకు స్కూల్ డేస్‌లో ఒక లవ్ స్టోరీ ఉండేది.అది మర్చిపోతున్న సమయంలో స్టడీస్ కోసం ముంబాయ్‌కు వెళ్లాం. అక్కడ నాకు ఒక అమ్మాయి పరిచయం అయ్యింది. 7 సంవత్సరాల ఫ్రెండ్షిప్ తరువాత అది అలా అలా లవ్ దాకా వెళ్లింది. అది కూడా నా వైపు నుంచే. ఆమెతో ఉన్న ఫ్రెండ్షిప్ కారణంగానో లేదో నా అమాయకత్వం వల్లనో నాకు ఆమెను పెళ్లి చేసుకోవాలి అనిపించింది. ఆమెకు క్లారిటీ లేకపోవడం వల్ల నేను రోజుకు ఒక యుద్దం చేయాల్సి వచ్చేది. 2 సంవత్సరాల క్రితం నేను పార్క్‌లో ఆమెకు ప్రపోజ్ చేశాను. తను నేనంటే ఇష్టం లేదని నా ముఖం మీద చెప్పింది. ఇంకా ఏం చేస్తాను ఏడ్చుకుంటూ వచ్చేశాను. తరువాత 2017లో నాకు నువ్వు కావాలి అని మెసేజ్ చేసింది. తరువాత మళ్లీ 6 నెలల తరువాత మళ్లీ సేమ్ నాకు నువ్వు వద్దు మా నాన్నకి ఇష్టం లేదు అని చెప్పింది. అప్పుడు నేను డిప్రెషన్లో గుండు కొట్టించుకున్నాను. నా మీద నాకే అంతలా అసహ్యం వేసింది. మళ్లీ 2019లో సేమ్ సీన్ రిపీట్ అయ్యింది. మళ్లీ నేను ఓకే చెప్పాను. ఈసారి మా ప్రేమ ఎంగేజ్మెంట్దాకా వచ్చింది. నా లైఫ్‌లో క్లైమాక్స్ అదే. కొన్ని కారణాల వల్ల మా పెళ్లి ఒక నెల ముందు ఆగిపోయింది. రీజన్ వింటే నవ్వు ఏడుపు రెండూ వస్తాయి. ఎవరో చెప్పిన మాటలు విని పెళ్లి వద్దు అని చెప్పింది. ఇదంతా అయ్యాక లాస్ట్ ఇయర్ నుంచి మళ్లీ డిప్రెషన్. నా జీవితంలో ఆనందం కంటే డిప్రెషనే ఎక్కువ అని నా ఫీలింగ్. నా లైఫ్ ఎందుకు ఇలా అయ్యింది అని ఏడవని రోజు లేదు. 7 సంవత్సరాల నుంచి ఒకే అమ్మాయి అన్ని తనే అనుకొని ఉన్నాను. ఇప్పుడు ఇలా అయ్యింది. తనకు క్లారిటీ లేకపోవడం వల్లే ఇలా జరిగింది. లేకపోతే ఎవరు ఎన్ని చెప్పినా ఇలా జరిగేది కాదు. ఇలా జరిగి సంవత్సరం అయ్యింది.కానీ ఇప్పటికీ నేను ఆమెను ప్రేమిస్తున్నాను. కానీ ప్రయోజనం లేదు. ఆమెది పిల్లల మనస్తత్వం, ఎవరు ఏం చెప్పినా నమ్మేస్తుంది. ఏదో ఒక రోజు మెసేజ్ చేస్తుంది అనే నమ్మకంతో అలానే ఉన్నాను. మా ఇంట్లో వాళ్లు నన్ను ఇంకా పెళ్లి చేసుకో అంటున్నారు. నాకేము ఇప్పటివరకు చేసిన స్టంట్లు చాలు అనిపిస్తోంది. ఏం చేయాలో అర్ధం కావడం లేదు. ఇంకా మా అమ్మ నాన్న నాకు ఒక మంచి ఆఫర్కూడా ఇచ్చారు. నేను ఎవరిని లవ్ చేసిన వాళ్లకి ఎలాంటి ఇబ్బంది లేదు అని. కానీ నా ముఖానికి ఎవరు పడతారు చెప్పండి ( చూడటానికి బాగానే ఉంటాలే). కానీ ఏ అమ్మాయితో మాట్లాడిన అక్క, చెల్లి అనేవాడిని. అందుకే నా లైఫ్‌లో అక్క చెల్లెళ్లు తప్ప లవర్లు, క్రష్‌లు ఏం ఉంటారు చెప్పండి. నా లైఫ్ ఒక జోక్. నా జీవితం మీద 1000 ఎపిసోడ్లు తీయ్యెచ్చు, అన్ని ట్వీస్ట్‌లు ఉంటాయి. అయినా కూడా ఆ దేవుడికి నా మీద జాలి కలగడం లేదు. బయటకు వెళ్లిపోదాం అని వీసా అప్ల చేస్తే రెండుసార్లు రిజెక్ట్ అయ్యింది. చెప్పడం మర్చిపోయాను, మొన్నిమధ్య ఒక అమ్మాయి వచ్చి నేనంటే ఇష్టం అని చెప్పింది. నేను ఇంకా నా లైఫ్ లో ట్విస్ట్‌లు చాలు అక్క అని చెప్పాను. అందరికి ఒకే ఒక గమనిక ఏదో సినిమాలో అన్నట్లు లైఫ్ అందరి దూలా తీర్చేస్తుంది భయ్యా ఎవరిని వదలదు, ఇది మాత్రం పక్కా. ఇప్పుడు నా వయస్సు 28. ఒక పక్క ఫ్యామిలి గొడవలు, ఇంకొ పక్క నా దురదృష్టం. ఇంకా ఎన్నెళ్లో ఇలా. నాకు కూడా మంచి రోజులు వస్తాయిలే అనే నమ్మకంతో రోజు లేస్తున్నాను. లేకపోతే ఎప్పుడో చచ్చిపోయే వాడిని. అయినా చచ్చి పోయి ఏం సాధిస్తాం, అమ్మనాన్నలను ఏడిపించడం తప్ప. నాలా ఎవరైనా డిప్రెషన్లో ఉంటే మా లాగే ఇంకో వెదవకూడా ఉన్నాడు అని నవ్వుకుంటూ ధైర్యంగా ఉంటారని ఈ లెటర్ రాస్తున్నాను. ఇట్లు, మీ తెలుగోడు( ముంబాయి). -
తనతో ఉంటే ప్రపంచాన్ని మర్చిపోతా!
నా పేరు అఖిల. నాకు 16 సంవత్సరాల వయస్సు ఉన్నప్పుడు మా ఫ్యామిలీ ఫ్రెండ్ అయిన ఒక అబ్బాయి ఫ్రెండ్ అయ్యాడు. తరువాత మా స్నేహం ప్రేమగా మారింది. తను నన్ను చాలా ఇష్టపడేవాడు. ఎంతలా అంటే నేను లేకుండా ఒక్క క్షణం కూడా ఉండలేకపోయేవాడు. మా విషయం మా ఇళ్లలో తెలిసింది. తరువాత మేం ఒక సంవత్సరం మాట్లాడుకోలేదు. తరువాత ఒకరోజు తనే కాల్ చేశాడు. ఈ సంవత్సరం మేం దూరంగా ఉన్నామే కానీ ఒకరినొకరం మర్చిపోలేదు. మేం అప్పుడప్పుడు మాట్లాడుకునేవాళ్లం. తరువాత మా మధ్య కొంచెం గ్యాప్ వచ్చింది. 5 సంవత్సరాల తరువాత వాళ్ల ఫ్రెండ్స్ ద్వారా నంబర్ తీసుకొని తనతో మాట్లాడాను. తను అంతగా మాట్లాడలేదు అనిపించింది. తరువాత 10 రోజుకు తనే నాకు ఫోన్ చేసి బాగా మాట్లాడాడు. తనతో మాట్లాడుతుంటే నాకు ప్రపంచమే తెలియదు. తను నన్ను అంత బాగా చూసుకుంటాడు. వాళ్ల అమ్మ మా ప్రేమను ఒప్పుకోరు అని తను చెప్పాడు. నాకు తన కోసం లైఫ్ లాంగ్ ఎదురుచూడాలనుంది. కానీ నాకు మా ఇంట్లో మ్యాచ్‌లు చూస్తున్నారు. ఇంత లవ్ చేసే అబ్బాయి దొరకడు అని నాకు తెలుసు. కానీ ఇంట్లో వాళ్ల కోసం తప్పడం లేదు. తన కోసం ఎదురు చూస్తూ ఉండాలని ఉన్నా తప్పదు. మనం ఒకటి అనుకుంటే లైఫ్‌లో మరొకటి జరుగుతుంది. నేను ఎప్పటికీ తనని తప్పుపట్టను. వాళ్ల పేరెంట్స్ మీద ఉన్న గౌరవంతో ఇలా చేస్తున్నాడు. చూడాలి నా జీవితం ఎలా ఉండబోతుందో. వచ్చే జన్మలో అయినా నీ లవర్‌గా నీ భార్యగా పుట్టాలని కోరుకుంటున్నాను. అఖిల(హైదరాబాద్) -
నువ్వు మంచిదానివి నేను నీకు వద్దు!
నువ్వు చాలా మంచి అమ్మాయివి నేను నీకు వద్దు అని వదిలేసి వెళ్లిపోయాడు. నేను స్కూల్ డేస్ నుంచి చాలా సైలెంట్‌గా ఉంటూ ఎవరితో మాట్లాడేదాన్ని కాదు. ఇంటర్ కూడా వైజాగ్‌లో గార్ల్స్ హాస్టల్లో ఉండే చదువుకున్నాను. డిగ్రీలో చేరాక సగంలో తను పరిచయం అయ్యాడు. తను ఒక షార్ట్ ఫిలిం డైరెక్టర్. నేనే ముందు తనకి మెసేజ్ చేశాను. మేం చాలా మాట్లాడుకునేవాళ్లం. తను నాకు నీతో రిలేషన్షిప్ కావాలి అని అడిగాడు. నేను సరే అన్నాను. అలా నాకు తెలియకుండా నేను తనని చాలా ప్రేమించాను. చాలా సార్లు చెప్పాలనుకున్నాను. కానీ తను ఏమనుకుంటాడో అని భయమేసి చెప్పలేదు. కానీ తనంటే నాకు ఇష్టం అని తనకి తెలుసు కావాలనే నన్ను దూరం పెట్టాడు. తను గతంలో ఒక అమ్మాయిని ప్రేమించాడు. తను ఎప్పుడూ హ్యాపీగా ఉండాలనుకునే దాన్ని. ఈ విషయాలు అన్ని తెలిసి కూడా నేను తనని ప్రేమించాను. తను నన్ను లవ్ చేయకపోయిన పర్వాలేదు నాతో మాట్లాడితే చాలు అని అనుకునేదాన్ని. కానీ తను నాతో మాట్లాడటం మానేశాడు. తన కోసం ఏడవని రోజు లేదు. ప్రతి రోజు తన ఫోటోస్ చూసుకుంటూ, పాత మెసేజ్‌లను చదువుకుంటూ బతికేస్తున్నాను. తనంటే అంత పిచ్చి నాకు. ఈ జన్మలో కాకపోయిన వచ్చే జన్మ అంటూ ఉంటే నువ్వు ప్రేమించే అమ్మాయిని నేనే కావాలనుకుంటున్నాను. నా జీవితంలో నిన్ను ఎప్పటికీ మర్చిపోను. గీత(విశాఖపట్నం). -
నా జీవితంతో తెగిపోని అనుబంధమా... ఓ నా ప్రియతమా!
విరించి, తెగ తపించి, మలచిన అందమా , నా జీవితంతో తెగిపోని అనుబంధమా, ఓ నా ప్రియతమా. నీకోసమే ఈ పలుకులు , నా మది వర్షించిన తేనే చినుకులు. ఇలా చాలానే రాసుకున్నాను తన గురించి. మాది చిన్ననాటి నుంచి మొదలైన ప్రేమ. మా వయసులా మా ప్రేమ కూడా పెరిగి పెద్దదయ్యింది. అప్పుడు మా వయసులు 25. కులం జులం నాకు తెలిసొచ్చిన రోజులు అవి. మా ప్రేమ గురించి వాళ్ళ పెద్దలతో మాట్లాడాను. అందరిలానే కులాలు కలవవు అని కాదన్నారు. నా కులం, నా అప్పటి ఆర్థిక స్థితినే వాళ్లు చూశారు, తూలనాడారే కానీ, నా చదువు, భవిష్యత్తు గురించి ఆలోచించలేదు. తనని అడిగాను నాతో వచ్చేయమని పెద్దల్ని ఎదిరించే ధైర్యం లేదో మరింకేమో తెలియదు కానీ నాకు నువ్వూ కావాలి మావాళ్లు కావాలి ఇదే తన సమాధానం. కొన్నాళ్లకు కబురొచ్చింది తనకు పెళ్లి అని, మళ్లీ అడిగి చూశాను తనని. నీ సంపాదనతో నువ్వే బ్రతకలేవు(అప్పటికే నేను ఒక ప్రభుత్వ విభాగంలో ఉద్యోగం చేస్తున్న) నన్ను ఏమి పెట్టి పోషిస్తావు అంది. తనమాటలు నాలో పట్టుదల, సాధించాలి అనే కసిని రగిలించాయి. రెండు సంవత్సరాలు సమయం ఇవ్వు అని అడిగా, సరే అన్న తనే పెద్దలు నిర్ణయించిన ముహూర్తానికి పెళ్లి చేసుకొని తన మాటను తుంగలో తొక్కింది. అయినా తనమీద కోపం లేదు. మంచి స్థాయికి చేరుకోవాలి అనే కోరిక తప్ప. ఉద్యోగం వదిలి, విదేశాలకు కదిలి , ఉన్నత స్థితికి చేరాను. ఇప్పటికీ తనంటే నాకు అదే ఇష్టం, అదే ప్రేమ. ఎందుకంటే నేను ఉన్నత స్థితిలో ఉండటానికి కారణం తనే. అందుకే తను నా జీవితంలో ఒక మలుపు, నా గెలుపు, తొలివలపు. తను ఎక్కడున్నా సుఖంగా సంతోషంగా ఉండాలి అని ఆ దేవుడ్ని కోరుకుంటూ... సెలవు పుల్లారావు నక్కా (అబూదాబి) -
అలా అన్నప్పుడు నా ప్రాణం పోయినట్లు ఉంటుంది!
హాయ్ నా పేరు రాజు.నేను హైదరాబాద్ లో ఉంటాను. 2006లో అనుకోకుండా ఒక పని వల్ల నెల రోజులు వేరే ఊరు వెళ్లాల్సి వచ్చింది.అంతా బాగానే ఉంది 15 రోజులు చాలా తొందరగా గడిచి పోయాయి. నేను పని చేసే ఇంటి పక్కన ఒక అమ్మాయికి నాకు అసలు పడేది కాదు. ప్రతీ విషయంలో నాతో గొడవపడేది. నేను కూడా అలాగే ప్రవర్తించేవాడిని. నేను స్వతహాగా డ్యాన్సర్‌ని. పని అయిపోయాక డాన్స్ చేయడం అలవాటు. తను ఉండే ఊర్లో ఒక పండగ వచ్చింది. వాళ్ల ఇళ్లంత బంధువులతో నిండి పోయింది . ప్రతీ రోజూలాగే ఆ రోజు కూడా నేను డాన్స్ చేస్తున్నా...తన బంధువులు అనుకోకుండా నేను డాన్స్ చేస్తుంటే చూడటానికి వచ్చారు. వాళ్లతో పాటు తను కూడా వచ్చింది. వాళ్లంతా నన్ను మళ్లీ డాన్స్ చేయమని అడిగారు సరే అని నేను చేశాను. ఎప్పుడూ నాతో గొడవ పడే ఆ అమ్మాయి నా డాన్స్ చూసి హ్యాపీగా ఫీల్ అయ్యింది. తన బంధువులు కూడా నాతో చాలా బాగుంది అని చెప్పారు. ఏమయ్యిందో తెలియదు కానీ తరువాత రోజు నుంచి తను నన్ను చూసి నవ్వేది. నేను కూడా నవ్వే వాడిని. అది లవ్ అని తెలియడానికి ఎక్కువ సమయం పట్టలేదు. అలా అనుకోకుండా మా ప్రేమ కథ స్టార్ అయ్యింది. డైలీ తను నాకు ఒకచిన్న పిల్లాడికి అమ్మ లాగ అన్నం కలిపి పెట్టేది. అలా మిగతా 15రోజులు అయిపోయాయి. నేను తిరిగి హైదరాబాద్ వెళ్లిపోవాలి. అప్పుడు తను చాలా ఏడ్చింది. నేను కూడా ఏడ్చాను. మా ఇద్దరి కులాలు వేరే. ఒకసారి వాళ్ల అమ్మని వేరే విధంగా అడిగాను మీ అమ్మాయి కి పెళ్లికి ఎలాంటి వాడు కావాలి అని. తను వాళ్ల కులం తప్ప వేరే చేయను అని చెప్పింది. తను నేను లేకుండా ఉండలేను అని చెప్పింది.మ హైదరాబాద్ వెళ్లిన తరువాత మా ఇంట్లో విషయం చెప్పాను. సరే అన్నారు. మా బ్రదర్ తప్ప ఇంట్లో అందరూ మా పెళ్లికి ఒప్పుకున్నారు. అప్పుడు నా ఫ్రెండ్స్ నాకు తనకు శంషాబాద్ సిద్దుల గుట్ట శివాలయంలో పెళ్లి చేయడనికి అంతా రెడీ చేశారు. తను బస్ ఎక్కే టైంకి వాళ్ల బ్రదర్ పట్టుకున్నాడు. ఆమె రాలేకపోయింది. నేను నా ఫ్రెండ్స్ కలసి తనని ఇంట్లో నుంచి తీసుకువద్దమని వాళ్ల ఊరు వెళ్లాం. అప్పుడు వాళ్ల బ్రదర్ మా లవ్ గురించి వాళ్ల ఇంట్లో చెప్పాడు. గొడవ స్టార్ట్ అయింది. నేను వెళ్ళిపోయాను. తరువాత మా అన్న నాకు వేరే పెళ్లి ఫిక్స్ చేశాడు. వద్దు అని చెప్పినా వినలేదు.ఎంగేజ్మెంట్ అయ్యింది. తను నాకు కాల్ చేసి చాలా ఏడ్చింది. నేను కూడా చాలా ఏడ్చాను. నాకు వేరే పెళ్లి అయ్యింది. కానీ నాకు మాత్రం తను ప్రతి క్షణం గుర్తుకు వస్తోంది. తన కోసం మళ్లీ వాళ్ల ఇంటికి వెళ్లాను. కానీ తనతో మాట్లడలేదు.మళ్లీ ఇంకోసారి తన కాలేజీకి వెళ్లాను. కానీ ప్రయోజనం లేదు. 2009లో తనకి పెళ్లి అయ్యింది. అప్పటి నుంచి తనని చూడలేదు. తరువాత అనుకోకుండా ఒక రోజు తన ఫోన్ నంబర్ దొరికింది . తన నంబర్‌కు ఫోన్ చేశాను.తన నుంచి ఎలాంటి సమాధానం లేదు. నా నంబర్ బ్లాక్ చేసింది. తను హ్యాపీగా ఉంది అని తెలిసింది. నేను హ్యాపీగా ఫీల్ అయ్యాను. .అనుకోకుండా మళ్లీ తను నాకు మెసేజ్ చేసింది. తను కూడా నేను ఎలా ఉన్నాను అని తెలుసుకోవడానికి ఫోన్ చేసింది..అప్పుడప్పుడు ఫోన్ చేసి ఎందుకు వదిలేసి పోయవురా అన్నప్పుడు నాకు చనిపోయిన ఫీలింగ్ కలుగుతుంది. నేను కోరుకునేది ఒక్కటే నా వల్ల తనకు ఎలాంటి ఇబ్బంది రాకూడదు, రావద్దు అని. అందుకే నేను తనకు ఎలాంటి మెసేజ్ కానీ ఫోన్ కానీ చేయను. తను చేస్తే తప్పకుండా సమాధానం ఇస్తాను.జీవితాంతం నీకు ఎలాంటి ప్రాబ్లెమ్ వచ్చిన నేను నీకు తోడుగా ఉంటాను. త్వరలో నీ పేరుతో ఒక అనాధాశ్రమం పెట్టాలని కోరిక ఉంది. తప్పకుండా పెడతాను. ఎక్కడున్న నువ్వు హ్యాపీగా ఉంటే చాలమ్మ. ఇట్లు, నీ రాజు -
ప్రేమించానంది.. కాస్ట్ చెప్పాక వదిలేసింది.
నా పేరు అజయ్. చిన్నప్పటి నుంచి సినిమాలంటే ఉన్న పిచ్చితో హైదరాబాద్ వచ్చాను. మూడు నెలలు చాలా కష్టపడ్డాను అవకాశాల కోసం. కానీ రాలేదు. ఓరోజు అమ్మతో ఫోన్లో మాట్లాడుకుంటూ ఉండగా..మా రూమ్ ముందునుంచి ఓ అమ్మాయి వెళ్లింది. దేవకన్యలా కనిపించింది. తనను ఫాలో చేసుకుంటూ వెళ్లా. ఇంతలో నా మొబైల్ రింగ్ అయ్యింది. వెనక్కి తిరిగి నన్ను చూసి ఒక చిన్న నవ్వు నవ్వింది. అంతే నా గుండెలో గంటలు మోగాయి. సినిమా డైలాగు అనుకోకండి. నిజంగానే నాకు అలా అనిపించింది. తనతో మాట్లాడాలి కానీ ఎలా అనుకుంటుండగానే తను వాళ్లింటికి వెళ్లిపోయింది. తన ఊహల్లోనే తేలిపోతున్న నాకు తను మళ్లీ దర్శనమిచ్చింది. మా రూమ్ ముందునుంచే వాళ్ల ఫ్రెండ్‌తో కలిసి కాలేజీకి వెళ్తుంది. అప్పుడు వాళ్ల ఫ్రెండ్..ఏంటీ నీ ఫేస్బుక్ ఫ్రొఫైల్ ఫోటో ఫ్రభాస్ది పెట్టావ్ అని అడిగింది. తను అంతకుముందే ఐడీ పేరు కూడా చెప్పింది. నేను వెంటనే తన ఫేస్బుక్ ఐడీ వెతికి తనకి ఫ్రెండ్ రిక్వెస్ట్ పెట్టా. అప్పట్నుంచి తను ఎప్పుడు నా రిక్వెస్ట్ ఓకే చేస్తుందా అని ఫోన్ చూస్తునే ఉన్నా. సాయంత్రానికి నన్ను కరుణించింది. తన పేరు అంజలి (పేరు మార్చాం) వెంటనే హాయ్ అని మెసేజ్ పెట్టేశా. కానీ తను గంట తర్వాత రిప్లై ఇచ్చింది. నువ్వంటే నాకిష్టం. నేను నిన్ను నెలరోజులుగా చూస్తున్నా. నువ్వు నాకు రిక్వెస్ట్ పెట్టాలనే మా ఫ్రెండ్‌తో నా ఫేస్బుక్ ఐడీ గురించి మాట్లాడించా అనేసరికి నేను షాక్ అయ్యా. అప్పట్నుంచి మేం హైదరాబాద్‌లో తిరగని ప్లేస్ అంటూ లేదు. అలా సంవత్సరం అయ్యక మా ప్రేమ విషయం వాళ్ల అమ్మతో చెప్పింది. ఆంటీ ఒప్పుకున్నారు. ఇక నాదే లేటు అని మా ఇంట్లో చెప్పా. ఒప్పుకున్నారు. కాదు ఒప్పించా. వారం అయ్యాక తన నుంచి కాల్ వచ్చింది. ఇంతకీ మీ కాస్ట్ ఏంటీ అని. నేను చెప్పా. ఆ తర్వాత ఏం జరిగిందో తెలీదు కానీ నేను ఫోన్ చేస్తే లిఫ్ట్ చేసేది కాదు. నాతో మాట్లాడేది కాదు. మా నాన్నకి ఆరోగ్యం బాలేకపోవడంతో 15 రోజుల పాటు ఇంటి దగ్గరే ఉండాల్సి వచ్చింది. అసలు అంజలి అలా ఎందుకు చేస్తుందో తెలీక నరకంగా అనిపించేది. హైదరాబాద్ వెళ్లా. తనతో మాట్లాడాక అమ్మాయిలు ప్రేమించిన వ్యక్తిని ఇంత తొందరగా ఎలా మర్చిపోతారో అని ఆశ్చర్యం వేసింది. మా నాన్నకు కాస్ట్ ఫీలింగ్ ఎక్కువ. నీతో పెళ్లికి అస్సలు ఒప్పుకోరు. నేను మా బావని పెళ్లిచేసుకుంటున్నానంది. నువ్వే నా ప్రాణం, నీతోనే జీవితం అన్న మాటలు అంజలి అప్పుడే మర్చిపోయిందా అనిపించింది. తనని ఒప్పించడానికి చాలా ప్రాథేయపడ్డా. అయినా వినలేదు. తను నాకు దూరమైనా..అంజలి పేరు నా గుండెల మీద పచ్చబొట్టులా మిగిలిపోయింది. -- అజయ్ -
మూడు లక్షల జీతం సంపాదించేవాడు కావాలి!
నాకు ఆ అమ్మాయి కావాలి ,కానీ వాళ్ళ నాన్నకి ఆ అమ్మాయిని నెలకు 3 లక్షల సంపాదించే వాడికి ఇచ్చి పెళ్లి చేయాలి అని ఉంది. మేమిద్దరం ప్రేమించుకున్నాం. కలిసి బ్రతకాలి అంటే కులం అడ్డు కాకపోయినా నువ్వు చేసే ఉద్యోగం మా నాన్నకు నచ్చదు. ప్రేమించడం వరకు ఐతే నా చేతిలో ఉంది కానీ, పెళ్లి చేసుకోవడం మాత్రం మా నాన్న గారు ఏం చెప్తే అదే చేస్తాను అని చెప్పి తను వెళ్ళిపోయింది. చాలా తేలికగా నన్ను ఇక నుంచి గుర్తుకు తెచ్చుకొని బాధ పడకుండా ఇంత కంటే మంచి ఉద్యోగం చూసుకొని, మంచి అమ్మాయిని చూసి పెళ్లి చేసుకో అని కూడా చెప్పింది. వెతికితే మంచి అమ్మాయి, నచ్చిన ఉద్యోగం వస్తుంది ఏమో కానీ నువ్వు నా లైఫ్ లో ఉండవు కదా బుజ్జి. అప్పుడు అర్ధమయ్యింది మధ్య తరగతి అబ్బాయిలు గొప్పగా డబ్బు ఉన్న వాళ్ళని ప్రేమించకూడదు అని. నేనింకా నీ కోసమే వేచి చూస్తున్న బుజ్జి మనిషి ప్రేమ కంటే నెలకి 3 లక్షలు తెచ్చే వాడు అవసరం లేదు అని నువ్వు తెలుసుకొని నా దగ్గరకు వస్తావు అని. ఇట్లు నీ శివ -
అతను రాసిన లెటర్స్ చదవాలనుంది!
మేము 3 సంవత్సరాలు అనంతపురంలో ఉన్నాం. అక్కడే నేను 8వ తరగతి నుంచి 10వ తరగతి వరకు అక్కడే చదివాను. చాలా కష్టపడి చదివేదాన్ని. చదువే నా లోకం. నేను అక్కడ ఒక చోట ట్యూషన్లో చేరాను. చాలా బిడియం, అమాయకం. మగ పురుగును చూడటం కూడా తప్పు అని అనుకునేదాన్ని. ఒకబ్బాయి పేరు వరదరాజు. నన్ను నాకు తెలియకుండా రోజు చూసేవాడు. నా కోసం 9 వ తరగతిలో ట్యూషన్ మానేసిన తను 10వ తరగతిలో నాకోసమే మా ట్యూషన్లో చేరాడు. నేను చాలా యాక్టివ్‌గా ఉండేదాన్ని. డ్రాయింగ్, సింగింగ్ ఇలా అన్నింటిలో పాల్గొనేదాన్ని. అతను కూడా నేను వెళ్లే ప్రతి కాంపిటిషన్‌కు వచ్చే వాడు. వాళ్లది బాయ్స్ స్కూల్. అతను నన్ను చాలా డీప్‌గా లవ్ చేస్తున్నాడని మా ఫ్రెండ్స్ చెప్తే నాకు తెలిసింది. నా పేరు ట్యూషన్లో ఉండే సోఫా మీద వందసార్లు రాశాడు. నేను ఎప్పుడైనా చూస్తే చాలు మా క్లాస్ గర్ల్స్ అందరూ చూసింది చూసింది అని అనేవారు. దాంతో ఏదో తప్పు చేసినట్లు తల దించుకుని స్టడీస్ మీద శ్రద్ద పెట్టేదాన్ని. హాలిడేస్ వస్తే చాలు నా కోసం మా వీధి చివర నిల్చునేవాడు. నేను వచ్చేంత వరకు అక్కడే ఉండేవాడు. నా టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ అప్పుడు ఏమి రాసేవాడో ఏమో కానీ నేను ఎగ్జామ్ సెంటర్‌కు వెళ్లేటప్పుడు వచ్చేటప్పుడు నా వెంట వచ్చేవాడు. లాస్ట్ రోజు రొప్పుతూ నా దగ్గరకు వచ్చి నన్ను మిస్ అవుతున్నానని చెప్పాడు. తను నా కోసం చాలా ఉత్తరాలు రాశాడంట అది నేను వినాలి అని చెప్పాడు. అప్పుడు నేను తనది చాలా స్ట్రాంగ్ లవ్ అని నమ్మాను. తరువాత హాలిడేస్‌లో మేం హైదరాబాద్ షిఫ్ట్ అయ్యాము. ఒక్కసారి కూడా నేను తనని సరిగా చూడలేదు, మాట్లాడలేదు. కానీ రిసెంట్‌గా స్వప్న మూవీలో లవ్ లెటర్స్ మూవీ చూశాక చాలా బాధపడ్డాను. నేను ఎంత ట్రూ లవ్‌ను మిస్సయ్యనో అనిపించింది. ఎలా తట్టుకున్నాడో నేను వెళ్లిపోయాక. అసలు ఉన్నాడా అని నా డౌట్. 30 ఏళ్ల నుంచి నా మనస్సులో ఆ అనుమానం ఉంది. కానీ నేనేం చేయలేను. ఎక్కడ ఉన్నా సారీ చెప్పాలని ఉంది. ఆ లెటర్స్ చదవాలని ఉంది. చాలా సంఘటనలు ఉన్నాయి. తను నా కోసం చాలా ప్రయత్నాలు చేశాడు. ఇంకా చెప్పాలంటే చాలా ఉన్నాయి. ఐయమ్ సారీ. గౌరీ(అనంతపురం). -
అమ్మలేదు... ఆ అమ్మాయి కూడా రాదు!
నాకు అమ్మలేదు. మా అమ్మ పేరు ఉష. నేను ప్రేమించిన అమ్మాయి పేరు కూడా ఉషనే. అమ్మ ఇప్పుడు నాతో లేదు. ఆ అమ్మాయి కూడా నాతో ఉండదేమో అనిపిస్తుంది. తను మా అత్తమ్మ వాళ్ల అమ్మాయి. నేను ఆమెకు ప్రపోజ్ చేసి రెండు సంవత్సరాల పైనే అయ్యింది. ఆమె నుంచి ఎలాంటి స్పందన రావడం లేదు. వస్తుంది అనే నమ్మకం కూడా లేదు. నాకు ఉష కావాలి. ఉష లేకపోతే చచ్చిపోతాను అని చెప్పాను కానీ నా బాధ మాత్రం దానికి సమానమైనదే. తనకి నా ప్రేమ ఎందుకు అర్థం కావడంలేదో. బహుశా నాకు ఉద్యోగం లేదు. అంత అందంగానూ ఉండను. కానీ తను అలా అనుకునే అమ్మాయి కాదు. అందుకే ఆమెను ప్రేమించాను. జాబ్ లేకపోయిన నేను రైతును అన్నింటికి మించి తనని చాలా ప్రేమిస్తున్నాను. ఇది చాలదా ఆమె నన్ను ప్రేమించడానికి? నీకు నచ్చడానికి ఏమైనా చేయాలా చెప్పండి ఉషగారు. అలాగే ఉంటాను. అంతేగాని నాకు మాత్రం దూరంగా ఉండకండి. ఏడుపొస్తోంది. నీ కోసం ఎన్ని రోజులైన ఎదురుచూస్తూ ఉంటాను. నువ్వు ఒప్పుకునే వరకు ఉంటాను. లేదా మీరు ఎవరినైనా ప్రేమిస్తే చెప్పండి. నిజంగా మిమ్మల్ని మర్చిపోవడానికి ప్రయత్నిస్తాను. ఐ లవ్ యూ మేడమ్. నాకు ఈ ప్రపంచంలో ఉండాలి అనిపించడం లేదు. బాధపడుతూ అయిన ఉంటాను. మిస్ యూ ఉషగారు. శివ (నెల్లూరు). -
కాలేజ్‌లో చేరాక తను మారిపోయింది!
నా పేరు హర్ష(పేరు మార్చాం). నా జీవితంలో ఒక మంచి లవ్ స్టోరీ ఉంది. నేను ప్రేమించిన అమ్మాయి పేరు సుధారాణి. తనంటే నాకు చాలా ఇష్టం. ఆ అమ్మాయిని మొదటిసారి చూసినప్పుడే బాగా నచ్చింది. ఐ లవ్ యూ చెప్పాలనిపించింది. వాళ్ల ఇళ్లు మా రూమ్ పక్కనే ఉండేది. తనకి ఐ లవ్ యూ అనే మూడు ముక్కలు చెప్పడానికి నాకు మూడు నెలలు పట్టింది. అది కూడా నేను చెప్పలేదు. మా చెల్లితో నా ప్రేమ విషయం తనకి చెప్పించాను. తను ఒప్పుకుంది. తరువాత మేం చాలా హ్యాపీగా ఉన్నాం. అలా రెండు సంవత్సరాలు గడిచాయి. తరువాత తను బీటెక్ చదవడానికి కాలేజీలో చేరింది. అప్పటి నుంచి తను పూర్తిగా మారిపోయింది. నన్ను చెడ్డగా అనుకోవడం మొదలుపెట్టింది. అయినా నేను తనని బతిమిలాడాను. తరువాత కూడా మేం రెండు సంవత్సారాలు కలిసి ఉన్నాం. తరువాత ఒకరోజు నేనంటే తనకి ఇష్టం లేదని నన్ను ఫ్రెండ్‌గానే చూశాను అని చెప్పింది. అప్పుడు ప్రాణం పోయేంత బాధగా అనిపించింది. తరువాత నాకు ఆమెకు చాలా మంది బాయ్‌ఫ్రెండ్స్ ఉన్నారని తెలిసి షాక అయ్యాను. నిజంగా చెప్పాలంటే ఈ రోజుల్లో ఎవ్వరూ కరెక్ట్‌గా లేరు( ఇది నా ఉద్దేశ్యం మాత్రమే). హర్ష( హైదరాబాద్) -
ఐ హేట్ యూ అని చెప్పాను!
నా పేరు సాయి. బిజినెస్ కారణంగా మేము నెల్లూరులో సెటిల్ అయ్యాం. మా ఫ్రెండ్స్ అందరం కలసి ఒకసారి అరకు టూర్‌కు వైజాగ్ వెళ్లాము. అక్కడ నాకు ఒక అమ్మాయి పరిచయం అయ్యింది. అందరు అరకు అందాలను చూస్తుంటే నేను మాత్రం ఆ అమ్మాయిని చూస్తూ ఉండే వాడిని. ఆమె కూడా నన్ను గమనిస్తూ ఉండేది. ఆమె నన్ను చూసిన ప్రతిసారి నేను నా ముఖాన్ని పక్కకు తిప్పేసే వాడిని. ఒకసారి నేను ఆమెతో మాట్లాడి మీ పేరేంటి అని అడిగాను. ఆమె చెప్పలేదు. ఎలాగో కష్టపడి వాళ్ల ఫ్రెండ్స్‌ను అడిగి ఆమె పేరు అనిత అని తెలుసుకున్నాను. ఆ రోజు అంతా బాగా ఎంజాయ్ చేసి రూమ్‌కు వచ్చాము. సరిగ్గా 10 గంటలకు నా ఫోన్‌కు ఒక కొత్త నంబర్ నుంచి ఫోన్ వచ్చింది. నేను కాల్లిఫ్ట్ చేసి ఎవరు అని అడిగాను. తను నేను ఎవరో నీకు తెలియదా అని అడిగింది.తెలీదు అన్నాను. సరిగా ఆలోచించు అంది. కొద్దిగా ఆలోచించాక అనిత అని అన్నాను. నీకెలా తెలుసు నా పేరు అని అడిగింది. ఎలాగో తెలుసులే అన్నాను. తనని నేను నా నంబర్ నీకు ఎలా తెలుసు అని అడిగాను. తను కూడా ఎలాగో తెలుసుకున్నాలే అంది. సరేలే ఎందుకు కాల్ చేశారు అని అడిగాను. తను ఊరికే కాల్ చేశాను అని చెప్పింది. నేను వెంటనే ఫోన్ కట్ చేశాను. తను మళ్లీ కాల్ చేసింది. నేను కట్ చేశాను. తను తరువాత కూడా వెంటనే కాల్ చేయండంతో ఏంటి కాల్ చేస్తున్నారు అని అడిగాను. తను ఎందుకు కట్ చేస్తున్నారు అని అడిగింది. ఉరికే అన్నావుగా అందుకే చేస్తున్నాను అని చెప్పాను. తనకి కోపం వచ్చింది. నేను సారీ సారీ అని చెప్పాను. తను మేమే రేపు ఆర్కే బీచ్‌కు వెళ్తున్నాం. మీరు కూడా వస్తారా అని అడిగింది. నేను మా ఫ్రెండ్స్ వస్తానంటే వస్తాను అని చెప్పాను. వచ్చేటట్లయితే ఈ నెంబర్‌కు ఉదయం 6 గంటలకు ఫోన్ చేయండి అని చెప్పింది. మా ఫ్రెండ్స్ కూడా వాళ్ల ఫ్రెండ్స్‌లో కొందరిని ఇష్టపడటం వల్ల బీచ్‌కు వెళ్లడానికి ఒప్పుకున్నారు. మేము బాగా ఎంజాయ్ చేశాము.మేమిద్దరం చాలా చోట్లకు తిరిగాము. నాలుగు రోజుల తరువాత మేమింకా ఊరికి బయలుదేరాము. తను నా దగ్గరకు వచ్చి నేను వెళ్తున్నాను అని చెప్పింది.నేను వెళ్లు అని చెప్పాను. తను సరే వెళ్తున్నా అని కోపంగా చెప్పింది. నేను నీతో ఒకటి చెప్పాలి అన్నాను. ఏంటి అని కోపంగానే అడిగింది. నేను ఐ హేట్ యూ అని చెప్పాను.తను షాక్ తిన్నట్టు ఏంటి అని అడిగింది. నేనేం చేశాను అని అంది.నేను ఇన్ని రోజులు నీ వల్లే హ్యాపీగా ఉన్నాను ఇప్పుడు నువ్వు వెళ్లిపోతుంటే ఏం చెప్పాలి అని అన్నాను. నువ్వేగా వెళ్లిపో అన్నావు అంది.నేను మరి నేను ఉండమంటే ఉంటావా అని అన్నాను. తను ఉండలేనుగా ట్రైన్ టైమ్ అవుతుంది అని వెళ్లిపోయింది.తరువాత కాల్ చేస్తాను అని చెప్పింది. కానీ తను తరువాత కాల్ చేయలేదు. నేను అందరమ్మాయిలు లాగా తను కూడా అని అనుకున్నాను. తరవాత చాలారోజులకు ఆమె కొత్త నంబర్ నుంచి కాల్ చేసింది. నేను ఎవరు అని అడిగాను. నేను అనితను అంది.నేను ఇప్పటికీ గుర్తొచ్చానా నీకు అని అడిగాను. తను ఫోన్ పోయిందని కాలేజీలో బిజీగా ఉండటం వల్ల చేయలేదు అని చెప్పింది. తను కటక్‌లో కాలేజీ జాయిన్ అయ్యానని చెప్పింది. అప్పటి నుంచి మేం ఎప్పుడూ కలుస్తూ సినిమాలకు, పార్క్‌లకు అన్ని చోట్లకు తిరిగే వాళ్లం. అలా మేం ఒకరిని ఒకరం మా ప్రేమను చెప్పుకున్నాం. తరువాత తను మా ప్రేమ విషయం వాళ్ల ఇంట్లో చెప్పేసింది. నేను కూడా మా ఇంట్లో చెప్పాను. కాస్ట్‌లు ఒకటే కావడంతో కొంచెం లేటుగా అయిన మా ఇంట్లో ఒప్పుకున్నారు. రెండు నెలల్లో మా పెళ్లి జరిగింది. ఇవన్నీ నా జీవితంలో మర్చిపోలేని విషయాలు. లవ్ యూ అనిత. సాయి(నెల్లూరు). -
ఐఫోన్ కారణంగా ఆమెను కలిశాను!
హాయ్ ఫ్రెండ్స్... నా పేరు నవీన్. మాది విశాఖపట్నం. 2019 దీపావళి రోజు నేను మామూలుగానే మాకు దగ్గరలో ఉండే స్పెన్సర్‌కు కొన్ని వస్తువులు కొనడానికి వెళ్లాను. ఆ షాప్ రామాటాకీస్ రోడ్డులో ఉంది. నేను నాకు కావలసిన వస్తువుల కోసం వెతుకుతున్న టైంలో వెజిటెబుల్స్ బ్లాక్‌లో నాకు ఒక ఐఫోన్ కనిపించింది. నేను ఎవరో మర్చిపోయారు పాపం దీని కోసం కంగారు పడతారు అనుకొని నా దగ్గరే ఉంచుకున్నాను. తరవాత 10 నిమిషాలకు ఒకరు ఆ ఫోన్‌కు కాల్ చేశారు. ఆమె పేరు నిహా. ఆమె అది తన ఫోన్ అని మర్చిపోయాను అని చెప్పింది. నేను 7వ నెంబర్ బిల్లింగ్ కౌంటర్ దగ్గర ఉన్నాను అని చెప్పాను. తను వాళ్ల ఫ్రెండ్ ఒకతనితో కలసి వచ్చింది. నేను ఆమెకు ఫోన్ ఇచ్చాను. వాళ్లు నాకు చాక్లెట్ ఇవ్వబోయారు. నేను తీసుకోలేదు. దాని తరువాత నుంచి నేను ఆమెను మర్చిపోలేకపోతున్నాను. ఇప్పటికి ఆమె నాకు గుర్తుంది. ఇది చదివిన తరువాత ఆమె నాతో మాట్లాడుతుంది అనుకుంటున్నాను. ఆమె నన్ను కలవాలని దేవుడ్ని ప్రార్థిస్తున్నాను. థ్యాంక్స్ టు ‘సాక్షి’. నవీన్(విశాఖపట్నం). -
ఉద్యోగం వచ్చాక తన నుంచి కాల్..
నేను పీజీ చదువుతున్న రోజుల్లో కీర్తిని (పేరు మార్చాం) ప్రేమించాను. ఆర్నెళ్లు తన చుట్టూ తిరిగాను. నా గురించి వాళ్ల ఫ్రెండ్స్ ఏం చెప్పారో తెలియదు కానీ నన్ను పట్టించుకోవడం మానేసింది. అప్పుడు అడిగా..ఎందుకిలా చేస్తున్నావ్ అని. నాకు ఇవన్నీ ఇష్టంలేదు, నాతో మాట్లాడకు అంది. నా ఫ్రెండ్స్ అందరితో బాగానే మాట్లాడేది. నాతో మాత్రం అస్సలు మాట్లాడకుండా, నేను మాట్లాడినా పట్టించుకునేది కాదు. చాలా బాధపడ్డా. ఇంక తనని డిస్రబ్ చేయోద్దని డిసైడ్ అయ్యా. మా ఫైనల్ ఇయర్ ఎగ్జామ్స్ వచ్చాయ్. తర్వాత బెంగుళూరులో మంచి కంపెనీలో నాకు ఉద్యోగం దొరికింది. ఓరోజు ఏదో అన్నౌన్ నెంబర్ నుంచి కాల్ వచ్చింది. ఎవరా అని ఫోన్ తీశా. కీర్తి అంది. ఒక్క క్షణం ఏం మాట్లాడలేక నా గొంతు మూగబోయింది. అప్పుడు ఎందుకు మాట్లాడలేదు అని అడిగా. భయం వేసింది, కాలేజీలో ఎవరైనా ఏమైనా అనుకుంటారేమో అని చెప్పింది. మరి ఇప్పుడు భయం లేదా అని అడిగా. లేదు అంది. అలా మాటలు పెరిగాయి. నా ప్రేమ మళ్లీ నాకు దగ్గరైందనుకొని చాలా సంతోషించా. ప్రతీరోజు కీర్తితో మాట్లాడకుండా నారోజు మొదలయ్యేది కాదు. ఇంతలో ఏమైందో ఏమో తెలీదు కానీ పది రోజుల నుంచి కీర్తి నుంచి ఫోన్ లేదు. నేను కాల్ చేస్తే..ఇంకోసారి నాకు ఫోన్ చేయకు, నేను నీతో మాట్లాడను అని చెప్పింది. అసలు ఏం అయ్యిందో, కీర్తి ఎందుకు ఇలా చేస్తుందో అర్థం కావడం లేదు. తన ఆలోచనల నుంచి దూరంగా బెంగుళూరులో ఉద్యోగం చేసుకుంటూ నా మానాన నేనుంటే తనే పలకరించింది. మనసుల మధ్య దూరాన్ని తన మాటలతో దగ్గరయ్యేలా చేసింది. ఇప్పుడు తను లేకుండా నేనుండలేను అనుకునేలా తనకి అడిక్ట్ అయ్యా. మళ్లీ నాకు దుఃఖాన్ని మిగిల్చి ఒంటరి చేశావా కీర్తి... నాగేశ్ (పలమనేరు) -
ప్రేమ అన్నాడు..తన పెళ్లికి రమ్మని పిలిచాడు
నేను తొమ్మిదవ తరగతిలో ఉన్నప్పుడు సాగర్ (పేరు మార్చాం) నాకు ప్రపోజ్ చేశాడు. అప్పుడు తను డిగ్రీ చదువుతున్నాడు. వాళ్లది మా ఇంటి పక్కనే. అప్పుడప్పుడు క్యారమ్స్ ఆడటానికి వాళ్లింటికి వెళ్లేదాన్ని. అలా నాపై ఇష్టం పెంచుకున్నాడు. కానీ నాకు తన మీద ఎలాంటి ఫీలింగ్స్ లేవు. వెంటనే నో అని తెగేసి చెప్పాను. కొన్ని రోజులకి తను ఎక్స్పైరీ ట్యాబ్లెట్స్ వేసుకున్నాడు. నేను ఒప్పుకోకపోతే చనిపోతానన్నాడు. ఆ టైంకి ఏం చెయ్యాలో తెలియక సరే అన్నాను. తర్వాత తనని కన్విన్స్ చెయ్యొచ్చు అని. ఆ తర్వాత సాగర్ చూపించే ప్రేమకి నాకు తెలియకుండానే తనతో ప్రేమలో పడిపోయా. అబ్బాయిలు.. లవ్ ఒప్పుకునేంత వరకు ఒకలా ఉంటారు. ఒప్పుకున్నాక తర్వాత ఒకలా ఉంటారు అని సాగర్ని చూశాక అర్థమైంది. మెల్లిమెల్లిగా నాపై ఆంక్షలు విధించడం మొదలైంది. అక్కడికి వెళ్లొద్దు, వాళ్లతో మాట్లాడొద్దు అని ఆంక్షలు పెట్టేవాడు. అయినా భరించా. కానీ తను నన్ను చాలా డామినేట్ చేసేవాడు. తను చెప్పేదే వినాలనకునేవాడు. గొడవలు మొదలయ్యాయి. దాదాపు సంవత్సరం అయ్యింది మా మధ్య మాటల్లేవ్. తర్వాత తనే సారీ, నాదే తప్పు అని బతిమాలాడు. ప్రేమించాను కదా, అందుకే కరుణించా. మళ్లీ మాట్లాడుకోవడం మొదలైంది. తను లేకపోతే నేను ఉండలేనేమో అనిపించేలా ఉండేది జీవితం. నాకు అన్నీ తనే. సాగర్‌తోనే నా జీవితం అనుకున్నా. కానీ తను అలా అనుకోలేదు. నేనే లేకపోయినా పర్వాలేదనుకున్నాడు. మా ఇంట్లో సంబంధాలు చూస్తున్నారు. వచ్చి మా వాళ్లతో మాట్లాడు అంటే ధైర్యం చెయ్యలేదు. మెల్లిగా నన్ను అవాయిడ్ చేయడం ప్రారంభించాడు. ఇంకా షాకింగ్ వార్త ఏంటంటే..మా అమ్మావాళ్లు వేరే అమ్మాయితో పెళ్లి ఫిక్స్ చేశారు. ఇంకేమీ చెయ్యలేను. నువ్వు నన్ను మర్చిపోయి వేరే వాళ్లని పెళ్లిచేసుకో అన్నాడు. అసలు ప్రేమించిన వాళ్లు చెప్పే మాటలేనా అని బాధేసేది. తన పెళ్లికి వెళ్లాను. ఎంత హ్యాపీగా ఉన్నాడో స్పష్టంగా కనిపించింది. అసలు నన్ను కోల్పోయానన్న బాధ..ఏ కోశాన కనబడలేదు. ఇతని కోసమో నేను ఇంతలా ఆరాటపడ్డాను అనిపించింది. ఆరోజే అర్థమైంది. ప్రేమిస్తున్నా అని చెప్పగానే అది ప్రేమ అవ్వదు. ప్రేమకి, ఆకర్షణకి ఉన్న తేడా ఏంటో తెలుసుకున్నాను. ఇలాంటి వ్యక్తిని ప్రేమించి తప్పు చేశాననిపించింది. చాలా రోజులు బాధపడ్డా. మళ్లీ తన నుంచి ఫోన్ వచ్చింది. నువ్వు లేకుండా నేను ఉండలేను, నిన్ను కూడా పెళ్లి చేసుకుంటాను అన్నాడు. ఇలాంటి కపట ప్రేమ చూపించేవాళ్లని ఏం చేసినా తప్పు లేదనిపించింది. అసలు ఇలాంటి వాడినా నేను ప్రేమించింది? ఇతని కోసమా నేను ఇన్నాళ్లు బాధపడింది అనిపించింది. ప్రేమ నేర్పిన గుణపాఠాల నుంచి ఇప్పుడిప్పుడే బయటపడి హాయిగా ఉద్యోగం చేసుకుంటున్నాను. జీవితంలో ఎదురుదెబ్బలు తగిలినంత మాత్రానా..జీవితం అక్కడే ఆగిపోకూడదు. మళ్లీ కొత్త జీవితాన్ని ప్రారంభించాలి. స్వాతి (పేర్లు మార్చాం) -
నా జీవితంలో అదే గొప్ప విజయం..
మా అక్కవాళ్ల ఇంట్లో ఫంక్షన్లో చూశా తనని. చూసిన క్షణమే పడిపోయా. ఎవరా ఈ అమ్మాయి అని ఆరాతీస్తే మా బందువుల అమ్మాయే వరుసకు నాకు మరదలు అవుతుంది అని చెప్పగానే గాల్లో తేలియాడినంత సంతోషం కలిగింది. తన పేరు చిన్నూ. నేనే కల్పించుకొని తనతో మాట్లాడా. అప్పట్నుంచి నాతో చాలా సరదాగా ఉండేది. బావా బావా అంటూ నా వెంటే తిరిగేది. ఫోన్లో చాటింగ్ స్టార్ట్ అయ్యింది. నాతో అన్ని విషయాలు పంచుకునేది. ఇద్దరికి ఒకరంటే ఒకరకి చాలా ఇష్టం ఏర్పడింది. కానీ ప్రేమిస్తున్నా అని చెబితే తను ఎలా రియాక్ట్ అవుతుందో అని చాలా మధనపడేవాడ్ని. ఒకరోజు తనకి లవ్ ప్రపోజ్ చేశా. ఈ క్షణం కోసమే ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న అని చిన్నూ అనేసరికి నా ఆనందానికి అవధుల్లేవు. తనను కలవడానికి అప్పుడప్పుడు వాళ్లింటికి వెళ్లేవాడిని. అత్తయ్య ఎంతో ఆప్యాయత చూపించేది. అసలు విషయం చెబితే అత్తయ్య ఏమనుకుంటారో అనుకునేవాడ్ని. ఒకసారి ధైర్యం చేసి చిన్నూని నేనింత ప్రేమిస్తున్నానన్నది అత్తయ్యకి చెప్పాను. చిన్నూ వాళ్ల నాన్న ఒప్పుకుంటే నాకేమీ అభ్యంతరం లేదని చెప్పింది. హమ్మయ్య..ఒక గండం గడిచింది. ఇక మామయ్యని ఒప్పిస్తే సరి అనుకున్నా. అది అంత ఈజీ కాదని తర్వాత అర్థమైంది. ఆయన మా పెళ్లికి ససేమీరా అన్నారు. అమ్మానాన్న లేనివాడికి కూతుర్ని ఇచ్చే ప్రసక్తే లేదని ఖరాఖండిగా చెప్పేశారు. నా గుండె బద్దలైనంత పనైంది. బయటికి వెళ్లి పెళ్లిచేసుకోవాలా అన్న ఆలోచన కూడా వచ్చింది. కానీ నాకు తల్లిదండ్రులు లేరు, ఇలా చేస్తే వాళ్లెంత బాధపడతారో ఊహించగలను. అందుకే ఎలా అయినా మామయ్యని ఒప్పించి వాళ్ల అంగీకారంతోనే చిన్నూని పెళ్లాడాలనుకున్నా. నేనే చిన్నూని ఎంత బాగా చూసుకోగలనో వివరించాను. చిన్నూపై నాకున్న ప్రేమను వ్యక్తపరిచాను. కొన్నాళ్లకు రంగంలోకి మా అక్క,బావ దిగారు. మూడు సంవత్సరాలు యుధ్ధం చేశాక మామయ్య ఒప్పుకున్నారు. మా పెళ్లి చాలా గ్రాండ్‌గా జరిగింది. ఇప్పుడు చిన్నూ 9 నెలల గర్భవతి. నేనే త్వరలో నాన్నను కాబోతున్నాను. నీ జీవితంలో నేను సాధించిన గొప్ప విజయం ఏదైనా ఉందంటే అది నా ప్రేమను సాధించడమే. --అన్ను మహేశ్ (వనపర్తి) -
నేనంటే తనకు ఇప్పటికీ కోపమే!
నేను ఇంటర్లో రమ(పేరు మార్చాం) అనే అమ్మాయిని లవ్ చేశాను. కానీ తను నన్ను లవ్ చేయలేదు. తరువాత ఇంటర్ సెకండ్ ఇయర్లో తను నాకు ఓకే చెప్పింది. తరువాత ఇద్దరం చాలా హ్యాపీగా ఉండేవాళ్లం. తిట్టుకుంటూ, కొట్టుకుంటూ అలా మా ప్రేమ డిగ్రీ అయిపోయేదాకా కూడా కంటిన్యూ అయ్యింది. అలా ఆరు సంవత్సరాలు లవ్ చేసుకున్నాము. తరువాత తను నన్ను పెళ్లి చేసుకోమని అడిగింది. నేను చేసుకుంటాను అన్నాను. ఇంతలో తనకు వాళ్ల ఇంటిలో పెళ్లి సంబంధాలు చూశారు. తనకి పెళ్లైపోయింది. నేను చేసుకుందాం అనుకుంటే అప్పటికీ నేను ఇంకా సెటిల్ అవ్వలేదు. ఇప్పుడు స్థిరపడ్డాను కానీ ఇప్పుడు తను నాతో లేదు. పెళ్లి అయ్యాక ఒక్కసారి కూడా తను నాతో మాట్లాడలేదు. నేను పెళ్లి చేసుకోలేదు అనే కోసం తనకి ఇప్పటికీ ఉంది. అప్పుడు నాకు కుదరక చేసుకోలేకపోయాను కానీ తన మీద ప్రేమ లేక కాదు. తను ఎక్కడ ఉన్న బాగుండాలి. తనకి ఒకప్పుడు నేనంటే చాలా ఇష్టం, ఇప్పుడు నేనంటే తనకు చాలా అసహ్యం. కానీ తనంటే నాకు ఇప్పుడు, ఎప్పుడు ఎప్పటికీ ఇష్టమే. ఐ లవ్ యూ రమ. వెంకట్ (భీమవరం). -
వాట్సాప్ డీపీ చూశా.అప్పట్నుంచి..
వాట్సాప్ మెసేజ్‌తో ప్రారంభమైంది మా పరిచయం. తన పేరు లత (పేరు మార్చాం). మా కజిన్ ద్వారా తను నాకు పరిచయమైంది. వాట్సాప్‌లో తన డీపీ చూడగానే ప్రేమలో పడిపోయా. లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అంటే అదేనేమో అనిపించింది. అలా మొదలైన మా పరిచయంలో ప్రతిరోజూ కాల్స్, మెసేజ్‌లు తప్పనిసరి అయ్యాయి. మా ప్రేమ గురించి మా పేరేంట్స్‌తో చెప్పాను. తనని తప్పా ఇంకెవరినీ పెళ్లిచేసుకోనని చెప్పాను. వాళ్లు నా ప్రేమను అంగీకరించారు. లత వాళ్లింట్లో వాళ్లతో కూడా మాట్లాడటానికి వెళ్లారు. కానీ వారు మా పెళ్లికి ససేమిరా అన్నారు. నేను కూడా చాలా ప్రయత్నించాను. కానీ వారు ఒప్పుకోలేదు. ఇక లాభం లేదనకుకొని బయటికి వెళ్లి పెళ్లిచేసుకుందాం అంది లత. కానీ కొంచెం టైం తీసుకొని వాళ్లని ఒప్పిద్దాం అని నేను దానికి ఒప్పుకోలేదు. కొన్ని రోజుల తర్వాత ఏమైందో ఏమో కానీ తన నుంచి కాల్స్, మెసేజ్‌లు ఆగిపోయాయి. నేను ఎన్నిసార్లు కాల్ చేసినా రెస్పాండ్ అయ్యేది కాదు. వారం తర్వాత తన నుంచి కాల్ వచ్చింది. నాకు ఎంగేజ్మెంట్ ఫిక్స్ అయ్యింది అని నా గుండెల్లో బాంబ్ పేల్చి తను మాత్రం చాలా కూల్‌గా చెప్పింది. ఆ క్షణం నాకేమీ అర్థం కాలేదు. తనను కన్విన్స్ చేయడానికి చాలా ప్రయత్నించా. కానీ తను నా మాట వినలేదు. కొన్ని రోజులకు తనకి ఎంగేజ్మెంట్ కూడా జరిగింది. అప్పట్నుంచి నెంబర్ కూడా మార్చేసింది. లతని కలవడానికి ఏ అవకాశం ఉండేది కాదు. డైరెక్ట్‌గా వాళ్లింటికి వెళ్తే వాళ్ల పేరేంట్స్ నన్ను లతతో మాట్లాడనివ్వలేదు. ఏం జరిగింతో తెలీదు. అసలు నేను లేకపోతే ఉండలేను అని చెప్పిన లత..ఇప్పడు ఇలా మాట మార్చడానికి కారణం ఏముంటుంది? వాళ్ల పేరేంట్స్ తనని అంతలా మార్చేశారా? నేను కాకుండా ఇంకొకరితో తను నిజంగా సంతోషంగా ఉండగలదా? నా గురించి ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా ఎంగేజ్మెంట్ ఎలా చేసుకుంది? కానీ లత..ఇప్పటికీ నా మనసు నిన్నే కోరుకుంటుంది. నీ ప్రేమలోంచి బయటకు రాలేను. నువ్వు నాకోసం వస్తావని ఎదురుచూస్తున్నా. --శ్రీకాంత్ రెడ్డి (వైఎస్సార్ జిల్లా) -
నా ప్రాణం పోయినట్లు అనిపించేది!
సరిగ్గా అది 2017వ సంవత్సరం. నాకు ఫేసుబుక్ లో ఒక అమ్మాయి పరిచయం అయ్యింది. వాళ్ళది మా ఊరి పక్కనే. కానీ వాళ్ళు నల్గొండలో సెటిల్ అయ్యారు. తను నర్సింగ్ చదువుతూ ఉండేది. మేమిద్దరం రోజు మెస్సేజ్ చేసుకుంటూ ఉండేవాళ్ళం. అలా అలా రోజులు గడుస్తూ ఉన్నాయి. మేమిద్దరం కాల్ చేసుకొని సరదాగా మాట్లాడుకునే వాళ్ళం. తనకోసం వాళ్ళ కాలేజీ దగ్గరికి వెళ్లేవాడిని. చాలా సరదాగా ఉండేవాళ్ళం. మా స్నేహం కాస్త ప్రేమగా మారింది. నేను ఒకరోజు తనకి ప్రపోస్ చేశాను. తను ఒప్పుకోలేదు. ఆ టైంలో నాకు చాలా అంటే చాలా బాధ వేసింది. చాలా రిక్వెస్ట్ చేశాను. అప్పటికీ తాను మాత్రం ఒప్పుకోలేదు. చాలా ఏడ్చాను. కొన్ని రోజుల తరువాత తను నా లవ్‌ను ఒప్పుకుంది. ఆ టైం లో చాలా అంటే చాలా సంతోషంగా అనిపించింది. తనకోసం కాలేజీ దగ్గరికి వెళ్ళేవాడిని. తనని చూసినప్పుడు ఏదో తెలియని సంతోషం చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించేది. తన కోసం బస్టాండ్‌కు వెళ్ళేవాడిని. మేము ఇద్దరం కలిసి బస్‌లో నల్గొండకు వెళ్లే వాళ్లం. బస్‌లో వెళ్తుంటే చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించేది. ఆ టైంలో నా ఆనందానికి హద్దులు ఉండేవి కావు. తన లేకపోతే నేను ఉండలేను అనేంత ప్రేమ ఎక్కువైంది. నేను జాబ్ కోసం అని హైదరాబాద్ వచ్చేశాను. తను కూడా చదవు ముగించుకొని హైదరాబాద్ లో జాబ్ చేయడానికి వచ్చేసింది. మేమిద్దరం హ్యాపీగా ఉండేవాళ్ళం. తను హాస్పిటల్లో జాబ్ చేస్తూ ఉండేది. అలా కొన్ని రోజులు గడిచిపోయాయి. నేను కొంచెం పనిమీద మాఊరికి వెళ్ళాను. తను సడన్‌గా కాల్ చేసి నాకు జాబ్ నచ్చడం లేదు, నేను మా ఇంటికి వెళ్తున్న అని చెప్పింది. ఆ టైంలో నాకు చాలా బాధవేసింది. తను చదివిన కాలేజీ లోనే జాబ్ చేస్తోంది. తనకోసం నేను హైదరాబాద్ నుంచి ఆమె పనిచేసే హాస్పిటల్ దగ్గరకి వెళ్లి కలిసేవాడిని. ఆమెను చూడడానికి కనీసం నెలకు ఐదుసార్లు వెళ్ళేవాడిని. తనంటే నాకు ప్రాణాలు ఇచ్చేంత ఇష్టం.సడన్‌గా తనకి ఇంట్లో పెళ్లి బంధాలు చూస్తున్నారు అని నాకు చెప్పింది. మేమిద్దరం కలిసి వెళ్ళిపోదాం అనుకున్నాం కానీ వాళ్ళ ఇంట్లో తనంటే చాలా ఇష్టం. చాలా ప్రేమగా పెంచుకున్నారు.ఆమెకు వాళ్ళ నాన్న అంటే ప్రాణం. నా బంగారాన్ని అంత ప్రేమగా చూసుకున్నారు. తను లేకుంటే వాళ్ళ నాన్న ఉండలేరు అని తెలిసింది. వాళ్ళ నాన్న దుబాయ్‌లో ఉంటూ కుటుంబాన్ని పోషిస్తునారు. ఆయనకు తన కూతురిమీద ఉన్న ప్రేమ కంటే నా ప్రేమ చాలా చిన్నదిగా అనిపించింది. కావాలని తనని దూరం చేస్తూ వచ్చాను. నేను మంచివాడిని కాదు అని మా ఫ్రెండ్స్ తో చెప్పించాను. నాకు చెడు అలవాట్లు ఉన్నాయని కూడా చెప్పించాను. తను మాత్రం నమ్మలేదు. నాకు కాల్ చేస్తే కట్ చేస్తూ ఉండేవాడి. ఎందుకు అలా చేశానంటే నాతో తను వస్తే వాళ్ల నాన్న బతకలేరు. వాళ్ల నాన్నకు హార్ట్ ప్రాబ్లెమ్ ఉంది. నా వల్ల వాళ్ల ఫ్యామిలీ కి ఏం కావద్దు అని కావాలని దూరం చేస్తూవచ్చాను. కానీ నేను ప్రాణంగా ప్రేమించిన అమ్మాయిని అవాయిడ్ చేస్తుంటే నా ప్రాణం పోయినట్టు ఉంది. చాలా అంటే చాలా ఏడ్చాను. అలా కొన్ని రోజులు గడిచాక ఆమెకు పెళ్లి ఫిక్స్ అయ్యింది అని తెలిసింది. ఆ టైంలో ఎంత ఏడ్చానంటే అది మాటల్లో చెప్పలేను. నేను ప్రాణంగా ప్రేమించిన అమ్మాయి వేరే వాడి సొంతం అవుతుంది అని తెలిసి గుండెలు పగిలేలా ఏడ్చాను. 10 నెలల దాకా మనిషిని కాలేదు. తనని నేను బ్రతికి ఉన్నంత వరకు మర్చిపోలేను. సారీ బంగారం నువ్వు ఎక్కడ ఉన్న హ్యాపీగా ఉండాలి ఐ లవ్ యూ బంగారం, ఐ మిస్ యూ. జగదీష్ ( నల్గొండ). -
అమ్మలా చూసుకుంటానంది.. కేసు పెట్టింది
నా పేరు రాజు. నవ్య,నేను 14 ఏళ్లుగా ప్రాణానికి ప్రాణంగా ప్రేమించుకున్నాం. తనకి నేనంటే పిచ్చి ఇష్టం. నన్ను చాలా బాగా చూసుకునేది. మేం ఇద్దరం కలిసి తిరగని ప్రాంతం లేదు. షాపింగ్, సినిమాలు ఇలా కలిసే తిరిగేవాళ్లం. మా అమ్మ చనిపోయినప్పుడు ..నవ్య నాకు కాల్ చేసి ఇప్పట్నుంచి నేనే మీ అమ్మనంది. మాటల వరకే కాదు, నిజంగానే తను నన్ను అమ్మలా చూసుకుంది. అమ్మలేని బాధను దూరం చేయడానికి నన్నెంతో ప్రేమగా చూసుకునేది. నాకు ఇష్టమైనవన్నీ తనే స్వయంగా వండిపెట్టేది. ఇద్దరికీ ఒకరంటే ఒకరికి చాలా ఇష్టం. ఆ ప్రేమతోనే ఇద్దరం రహస్యంగా గుళ్లో పెళ్లి చేసుకున్నాం. ఆ తర్వాత అంతా బాగానే ఉందనుకుంటున్న టైంలో మా విషయం వాళ్లింట్లో తెలిసింది. తనను ఏం చేశారో, ఏం మాయమాటలు చెప్పారో తెలీదు కానీ 10 రోజుల్లోనే నన్ను వదిలేసింది. నాతో మాట్లాడటం లేదు. నా నెంబర్ బ్లాక్ చేసింది. నా మీద పోలీస్‌స్టేషన్‌లో ఎఫ్ఐఆర్ కేసు పెట్టారు. నా తప్పేంటో నాకే తెలియడం లేదు. ఇదంతా తనతో ఎందుకు చేయిస్తున్నారో తెలియడం లేదు. అసలు వాళ్లింట్లో తనను ఎంత బాధపెడుతున్నారో అని భయంగా ఉంది. ఏ తప్పు చేయని నాపై తప్పుడు కేసులు పెట్టారు. సరే తను నాతో సంతోషంగా ఉండదని వాళ్ల పేరేంట్స్ ఎలా డిసైడ్ చేస్తారు? మరి తనకు సంబంధాలు చూసి ఆ అబ్బాయితో సంతోషంగా ఉంటుందని వాళ్లు నాకు హామీ ఇవ్వగలరా? వాళ్ల పేరేంట్స్ ఆడిన నాటకంలో మేం ఇద్దరం బలిపశువులమయ్యాం. - రాజు (రాజమండ్రి) -
అన్నయ్యగా పరిచయం చేసి తర్వాత..
ప్రాణంగా ప్రేమించాను. తనే జీవితం అనుకున్నాను. తన కోసం ఎవరినైనా ఎదురించాలి. తనతోనే జీవితం పంచుకోవాలనుకున్నా. కానీ తను నన్ను మోసం చేసి వెళ్లిపోయింది. తనను మొదటిసారి చూసినప్పుడే అనుకున్నా తను నా జీవితంలో ఉంటే ఎంత బావుండు అని. తననే చూస్తూ ఉండిపోయా. తన కళ్లు నన్ను మరింత ఆకర్షించాయి. కాసేపటికి తను వెళ్లిపోయింది. కానీ నా మనసు మాత్రంతన చుట్టే తిరిగేది. తన ఊహల్లో విహరిస్తున్న నాకు మళ్లీ తను ఎదురుపడింది. తను ఉండేది మేం ఉంటున్న వీధిలోనే అని తెలిసి చాలా సంతోషించా. ఓరోజు తనతో మాట కలిపా. సీరియస్‌గా చూసి వెళ్లిపోయింది. రోజూ నేను వెళ్లే దారిలోనే తను కూడా కాలేజీకి వెళ్తుంది అని తెలిసి..నా మొదటి క్లాస్ ఎగ్గొట్టి మరీ తన కోసం నిరీక్షించేవాడిని. ఫలితంగా కొద్ది రోజులకు ఫోన్‌నంబర్లు మారాయి. మాటలు పెరిగాయి. దూరం తగ్గింది. తనకి నేనంటే చాలా ఇష్టమని తను ప్రపోజ్ చేయగానే ఆనందంతో ఎగిరి గంతులేశా. అలా సరదాగా ఏడాది గడిచింది. నేను ఉన్నత చదువుల కోసం హైదరాబాద్ వెళ్లాను. అప్పటినుంచి తన ప్రవర్తనలో చాలా మార్పు కనిపించింది. కాల్ చేస్తే లిఫ్ట్ చేసేది కాదు, మళ్లీ ఫోన్ చేస్తే కాల్వెయిటింగ్ వచ్చేది. కొత్త సిమ్‌కార్డులు కొనేది. నేను కలవడానికి వెళ్లినప్పుడు అవి దాచిపెట్టేది. ఏదో నెంబర్నుంచి మెసేజ్ వస్తే ఎవరు అని అడిగా. అన్నయ్య అని బదులిచ్చింది. ఆ నెంబర్‌కు నేను కాల్చేశా. నన్ను తన అన్నయ్యగా ఆ వ్యక్తికి చెప్పిందని తెలిసి మనసు విరిగిపోయింది. తర్వాత మరో వ్యక్తి అర్ధరాత్రిపూట కాల్ చేసి బయటకు వెళ్దాం అన్నాడు. ఎవరు అని ప్రశ్నిస్తే తన నుంచి సమాధానం లేదు. ఎదురింటి వ్యక్తి అని తర్వాత తెలిసింది. అతనికి నన్ను అన్నయ్యగా పరిచయం చేసింది. నాకోసం హైదరాబాద్ వెళ్తున్న అని ఎదురింటి వ్యక్తితో చెప్పి ..మొదట నన్ను అన్నయ్యగా చెప్పిన వ్యక్తితో కలిసి వారం రోజులు హైదరాబాద్ తిరిగి వాళ్లింట్లోనే ఉందని తర్వాత తెలిసింది. తను ఇన్ని చేసినా..నా మనసు మాత్రం తననే కోరుకుంది. కానీ తను మాత్రంనన్ను దారుణంగా మోసం చేసి నువ్వు నాకొద్దు అని చెప్పి వెరెవరినో పెళ్లిచేసుకుని వెళ్లిపోయింది. తను చేసిన మోసాన్ని భరించలేకపోయా. ఉన్న ఉద్యోగం వదిలేశా. పిచ్చోడిలా చీకటి గదిలో రోజుల తరబడి కూర్చుని ఏడ్చా... ఇప్పుడు నన్ను ఇష్టపడ్డ మనిషిని పెళ్లి చేసుకున్నా. తన పేరు వినిపించిన ప్రతిసారి పాత గాయం నొప్పెడుతూనే ఉంది. -సంతోష్ -
ఆరోజు విడిపోయాం.. మళ్లీ ఇన్నాళ్లకు..
ప్రేమ... అదొక అందమైన పదం. మనం నిజంగా ఒక వ్యక్తిని ప్రేమించి ఉంటే మనస్సలో వాళ్లకి తప్ప వేరే వాళ్లకి చోటివ్వలేం. అంత నిజాయితీ మన ప్రేమలో ఉంటే దేవుడు కూడా మన ప్రేమను ఓడించలేడు. ఇది నిజం.. నేను ఒకబ్బాయిని ప్రేమించాను. అతను కూడా నన్ను చాలా ప్రేమించాడు. కానీ కొన్ని పరిస్థితుల కారణంగా మా ఇంట్లో వాళ్లని అడగలేకపోయాడు. వాళ్లింట్లో అతనికి పెళ్లి ఒత్తిడి ఎక్కువైంది. చేసేది లేక ఇక బయటికి వెళ్లి పెళ్లి చేసుకుందాం అన్నాడు. కానీ నాకు అలాంటివి ఇష్టం లేక మససు చంపుకున్నాను. తల్లిదండ్రుల మనసు బాధపెట్టి మనం సంతోషంగా ఉండలేమనేది నా అభిప్రాయం. తర్వాత వాళ్ల అమ్మానాన్న చూసిన అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. తను నా నుండి దూరమయ్యాక ఏడవని రోజు లేదు. బాధపడని క్షణం లేదు. కొన్నేళ్లకి తను మళ్లీ వచ్చాడు. నా నుంచి ఇన్నేళ్లు దూరంగా ఎలా ఉండగలిగావ్ అని గట్టిగా అరవాలనిపించింది. అప్పుడు చెప్పాడు. తను పెళ్లిచేసుకున్న అమ్మాయి ఒక ప్రమాదంలో చనిపోయిందని. తర్వాత మా ఇంట్లో వాళ్లందరినీ ఒప్పించి నన్ను పెళ్లిచేసుకున్నాడు. తను నన్ను వదిలేసి వెళ్లినప్పుడు అనిపించింది. నా ప్రేమలో నిజాయితీ ఉంది. ఏదో ఒకరోజు తను కచ్చితంగా నా దగ్గరకొస్తాడని. నా నమ్మకమే నిజమైంది. పరిస్థితుల కారణంగా ఆరోజు మేము దూరం కావాల్సి వచ్చింది. ఇప్పుడు అవే పరిస్థితుల వల్ల మేము ఒకటయ్యాం. ఒకటే చెప్పాలనుకుంటున్నా. మన ప్రేమలో నిజాయితీ ఉంటే ఎవరూ విడదీయలేరు. నిజంగా ఒక వ్యక్తిని ప్రేమిస్తాన్నామంటే ఎంత మంది వచ్చినా, వాళ్లని మరిచిపోలేం. ఎందుకుంటే అదే ప్రేమ కాబట్టి. - సావళ్ల పుష్ప -
మన ప్రేమకథను సినిమాగా చేస్తా!
నా పేరు శ్రీకాంత్. నేను ఓ కాలేజీలో బీఫామ్ చదువుతున్నాను. ప్రేమ అనేది ప్రతి ఒక్కరి జీవితంలో మరిచిపోలేని ఒక మధురమైన అనుభూతి. కానీ అది నా జీవితంలో మోయలేక మోస్తున్న ఒక భారం. నేను ఆ కాలేజీకి ఇష్టం లేకుండా అయిష్టంగానే వెళ్లాను. కానీ మా కాలేజీలో నా ర్యాంక్ ప్రకారం నేనే టాపర్‌ను. అంతేకాదు నేనే క్లాస్ సీఆర్గా కూడా ఏకగ్రీవంగా ఎన్నికయ్యాను. దీలీప్ అనే ఒక ఫ్రెండ్ ద్వారా తన అల్లరి గురించి విన్నాను. ఒక రోజు మా క్లాస్ అందరికి కలిపి ఫేస్బుక్లో ఒక గ్రూప్ ఏర్పాటు చేశారు. ఆ గ్రూప్‌లో ఫ్రెండ్స్ ద్వారా యాడ్ అయిన తను వెంటనే నాకు ఫ్రెండ్ రిక్వెస్ట్ పెట్టింది. అప్పటి నుంచి రోజు రాత్రి 2 వరకు చాట్ చేసుకునేవాళ్లం. తను నాకు ఫ్రెండ్ రిక్వెస్ట్ పెట్టక ముందు తన పేరుతో నేనే ఫేక్ ఫేస్బుక్ అకౌంట్ క్రియేట్ చేసి మా ఫ్రెండ్ రోహిత్‌కు రిక్వెస్ట్ పెట్టాను. వాడితో సరదాగా ఆడుకునేవాడిని. తను పరిచయం అయిన తరువాత తప్పు తెలుసుకొని ఇద్దరికీ నిజం చెప్పేశాను. ఆ సంఘటనతో మా ఇద్దరికి మరింత పరిచయం పెరిగింది. ఈ లోపు ఎలా మరిందో తెలియదు కానీ పరిచయం కాస్తా తన మీద ప్రేమగా మారింది. ఒక రోజు ధైర్యం చేసి తనకు ప్రపోజ్ చేశాను. ఆ తరువాత ఒక వారం రోజుల వరకు మా మధ్య మాటలు లేవు. ఆ తరువాత ఒక పోలియో క్యాంప్ ద్వారా మా మధ్య బంధం మరింత పెరిగింది. అది ఎంత అంటే చాట్ చేసుకోవడం నుంచి కాల్ చేసుకునే వరకు. ఇద్దరం క్లాస్ బంక్ కొట్టి మరీ ఫోన్స్ మాట్లాడుకునే వాళ్లం. ఒకసారి మేమిద్దరం మా దగ్గరలో ఉండే టెంపుల్‌కు కూడా వెళ్లాము. మా ఫ్రెండ్ ఒకడు తన గురించి బ్యాడ్‌గా కామెంట్ చేస్తే నేను మా ఫ్రెండ్ కలసి వాడిని కాలేజీ వాష్‌రూమ్‌లో కొట్టాము. ఇంతలో నా పుట్టినరోజు వచ్చింది. తను రాత్రి 12 ఇంటికి కాల్ చేసి నాకు విష్ చేసి కొరియన్ భాషలో ఐ లవ్ యూ చెప్పింది. నా ఆనందానికి అవధులు లేవు. కానీ ఆ తరువాత రోజు తను ఫోన్ చేసి కేవలం నీ పుట్టిన రోజు నాడు నువ్వు ఆనందపడతావని అలా చెప్పాను అంది. నేను తను సిగ్గుపడి అలా చేసింది ఏమో అనుకున్నాను. ఇంతలో మా ఎగ్జామ్స్ దగ్గర పడ్డాయి.నేను టాపర్ కావడంతో నైట్ నేను చదివి తనకు అన్ని అర్దం అయ్యేలా చెప్పేవాడిని. ఆ తరువాత వచ్చిన మా సెమ్ ఎగ్జామ్స్ టైంలో మాకు చిన్న గొడవ అయ్యింది. అది చిలికి చిలికి గాలి వాన అయ్యింది. అప్పుడు బ్రేక్ అయిన రిలేషన్ ఇప్పటి వరకు కలవలేదు. తను సారీ చెప్పడానికి కాల్ చేసింది. నేను ఆ టైంలో తాగి ఉండటం వల్ల తనని చాలా తిట్టేశాను. అంతే మా ఫస్ట్ ఇయర్లో అయిన ఆ గొడవ వల్ల విడిపోయిన మేము ఇప్పుడు మా ఫైనల్ ఇయర్ అయిన ఇంకా కలవలేదు. నాకు ఇప్పటి వరకు 6 బ్యాక్‌లాగ్స్ ఉన్నాయి. 5 సార్లు కాలేజీ నుంచి సస్పెండ్ అయ్యాను. తాగి క్లాస్‌కు వెళ్లడం, లెక్చలర్స్తో దురుసుగా ప్రవర్తించడం వల్ల అలా జరిగింది. ది మోస్ట్ ఫనియస్ట్ గయ్ నుంచి ది మోస్ట్ ఫ్రస్టెటెడ్ గాయ్ గా నా ఫ్రేమ్ మారిపోయింది. తన ప్రేమ కోసం అలా 4 సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్నాను. తన కోసం మా ప్రేమను సినిమాగా తీయాలనుకుంటున్నాను. ఇంకొన్ని నెలల్లో ఆ సినిమా తీస్తాను. ఇంకో మూడు నెలల్లో మా ఫైనల్ ఇయర్ అయిపోతుంది. నా కళ్లు మళ్లీ ఆమెను చూడలేవు. నా మనసు ఆమె నవ్వును, చెవులు ఆమె స్వరాన్ని వినలేవు. నా ఈ అలుపెరుగని ప్రేమకు ముగింపు పడనుంది.ఈ సందర్భంగా నా బాధలో, నా నవ్వులో తోడున్న నా ఫ్రెండ్స్ అందరికి ధన్యవాదాలు. ఫైనల్‌గా నీకు ఓ మాట చెప్పాలనుకుంటున్నా మన మొదటి ఫేస్బుక్ పరిచయం, ఆ తరువాత చాట్, ట్రూత్ ఆర్ డేర్ గేమ్, టెంపుల్‌కు వెళ్లడం, చిలకజోస్యం, ఎగ్జామ్స్, సీనియర్‌తో నీ గొడవ, వాష్ రూంలో నా గొడవ, నేను నీ బర్త్‌డే కి ఇచ్చిన గిఫ్ట్, నా బర్త్‌డేకు నువ్వు ఇచ్చిన గిఫ్ట్( వాల్ముతే కొరియన్లో ఐ లవ్ యూ), గురు సినిమాకు వెళ్లి సినిమా చూడకుండా ఇంటర్వెల్ వరకు సినిమా చూడకుండా నీతో మాట్లాడుతూ గడిపిన ఆ రోజు, నేను నీకు చేసిన ప్రపోజల్, ఇచ్చిన లవ్ లెటర్, టెంప్టెషన్ ఆల్మండ్, మీ ఫ్రెండ్‌గా నాకు పరిచయమయిన మన జూనియర్, తనతో ముచ్చట్లు, బసూది, మార్చుకున్న మన క్యారెక్టర్స్, ఫైనల్‌గా మన గొడవ... అన్ని అలా నా కళ్ల ముందు కదులుతూ ఇంకొన్ని రోజులే నేను నిన్ను చూసేది అని గుర్తుచేస్తూ నా కళ్లు తడుపుతున్నాయి.మళ్లీ నేను నీకు ఈ మాట ‘సాక్షి’ సాక్షిగా చెపుతున్నా అప్పుడు 50 మంది ముందు చెప్పలేకపోవచ్చు, ఇప్పుడు ఈ పేపర్ చదివే లక్షల మంది సాక్షిగా చెబుతున్నా ఐ లవ్ యూ ఫర్ ఎవర్ మహి. శ్రీకాంత్( మంగళగిరి). -
కౌగిలించుకుంది...తరువాత మిస్సయ్యింది!
నా పేరు అనిల్ కుమార్. నేను ఇంటర్మీడియట్ అయిపోయిన తరువాత డీసెట్ ఎంట్రెన్స్ కోసం కోచింగ్‌కు వెళ్లాను. కొన్ని రోజుల తరువాత ఒకమ్మాయి కొత్తగా కోచింగ్‌లో చేరింది. నేను కొత్తలో పెద్దగా పట్టించుకోలేదు. తరువాత తను కొంచెం కొంచెం పరిచయమయ్యింది. చాలా తక్కువ మాట్లాడుకునేవాళ్లం. కాలం గడుస్తున్న కొద్ది ఒకరిని ఒకరం చూసుకోవడం మొదలుపెట్టాం. నేను ఎవరిని ఏం అడిగిన తను తెచ్చి నాకు ఇచ్చేది. ఒకరోజు నువ్వంటే నాకిష్టమని తనకి చెప్పేశాను. తను నాకు సమాధానం చెప్పకుండా ఆ రోజు వాళ్ల ఊరిలో ఫెస్టివల్ ఉందని రమ్మని చెప్పింది. నేను అక్కడికి వెళ్లాను కానీ తను మాత్రం అక్కడికి రాలేదు. నేను తరువాత రోజు నేను మీ ఊరు వచ్చాను. నువ్వు ఫెస్టివల్‌కు ఎందుకు రాలేదు అని అడిగాను. తను నా కోసంవచ్చావా అని నన్ను చూస్తూ ఉంది. క్లాస్‌లో ఎవరు లేరు. తను నన్ను కౌగిలించుకుంది. నేను వెంటనే ఇంకోసారి ఐ లవ్ యూ చెప్పాను. తను వెంటనే నన్ను వదిలి క్లాస్‌లో నుంచి బయటకు వెళ్లిపోయింది. ఆ తరువాత తను నాతో మాట్లాడలేదు. నాలుగురోజులకు మా కోచింగ్ అయిపోయింది. ఎంత రిక్వెస్ట్ చేసిన తన నుంచి నో రెస్పాన్స్. కోచింగ్ అయిపోయిన తరువాత తను ఒక్కసారి కూడా నాకు కనిపించలేదు. నేను ఇప్పుడు డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతున్నాను. అనిల్‌కుమార్(కోటనందూరు). -
నన్ను వదిలించుకోవడానికే అలా చేశాడు!
నా పేరు బుజ్జి. నేను బీటెక్ పూర్తి చేసిన ఇంట్లో ఉన్నాను. అప్పుడు మా నాన్న గారికి యాక్సిడెంట్ అయ్యింది . అప్పుడు మా నాన్నకి సాయంగా ఒక వారం రోజులు నేను హాస్పిటల్ ఉన్నాను. అప్పుడే ఫేసుబుక్‌లో నాకు హాయ్ అని ఒక మెసేజ్ వచ్చింది. నేను కూడా హాయ్ అని పెట్టాను. తనకి నేను తెలిసినట్లే చాట్ చేశాడు. నేను మా బాబాయికి చెప్పాను ఇలా ఎవరో చాట్ చేస్తున్నారు అని,తను నీకు వరసకి బావ అవుతాడు అని మా బాబాయి చెప్పారు. మన వాళ్ళే కదా అని చాట్ చేశాను.చాటింగ్ తరవాత కాల్స్ ఆలా ఆలా చాలా మాట్లాడుకున్నాము.తాను నాకు ప్రపోజ్ చేశాడు.నాకు అలాంటి ఆలోచన లేదు అన్నాను. నాకు చదువు ఇంకా మా ఫ్యామిలీతో హ్యాపీగా ఉండటం అదే తెలుసు. తను నన్ను పెళ్లి చేసుకుంటున్నాను అన్నాడు.నాకు టైం కావాలి అన్నాను.ఒక రోజు నాన్న గారిని హాస్పిటల్ తీసుకొని వెళ్ళాం తను కూడా ఆ రోజు మా దగ్గరికి వచ్చారు. అదే ఫస్ట్ టైం తనని చూడటం . చూడగానే నాకు నచ్చారనిపించింది. మా ఇంట్లో చెప్పాను కులాలు కూడా ఒక్కటే మా ఇంట్లో ఒపుకున్నారు. కానీ తన ఇంట్లో ఒప్పుకోవాలంటే మంచి జాబ్ తెచ్చుకోవాలి అప్పుడే మా ఇంట్లో చెప్తాను అన్నాడు.అవును కదా మంచి పొజిషన్లో ఉంటే అందరికి మంచిది కదా అని అనుకున్నాను. తను జాబ్ కోసం హైదరాబాద్ వెళ్ళాడు. కానీ తనకి జాబ్ రాలేదు, నాకు హైదరాబాద్ లో జాబ్ వచ్చింది. నేను హైదరాబాద్ వెళ్ళాను. మా ఇంట్లో నాకు మంచి సంబంధాలు వస్తున్నాయి. కానీ తనకి జాబ్ లేదు కాబట్టి నన్ను వేరే సంబంధం చేసుకోమని మా నాన్నమ్మ ఫోర్స్ చేసింది. అప్పుడే తనకి నాకు తెలిసిన ఆఫీసులోనే జాబ్ ఇప్పించాను.మా ఇంట్లోపెళ్లి చూపులకి వచ్చి వెళ్ళు అని ఫోర్స్ చేశారు. నేను ఆ విషయం తనకి చెప్పాను ఒకసారి వెళ్లి రా .. అని చెప్పాడు. తరువాత తనకి జాబ్ చేసే దగ్గర ఒక అమ్మాయి పరిచయం అయింది. తను నన్ను అవాయిడ్ చేయడం మొదలు పెట్టాడు . నాకు నాకు తెలియదు వాళ్ళు లవ్ చేసుకుంటున్నారని,నేను అడిగాను ఎందుకు బావ నన్ను అవాయిడ్ చేస్తున్నావ్ అని. అప్పుడు నన్ను చాలా తిట్టాడు పెళ్లి చూపులకి ఎందుకు వెళ్ళావ్ అని. కానీ నిజం ఏమిటంటే తను వెళ్ళమంటేనే నేను వెళ్ళాను, మా ఇంట్లో టైం అడిగి వచ్చాను. అది తను నమ్మలేదు. నన్ను వదిలించుకోవడానికే ఇదంత చేశాడు అని నాకు తెలిసింది . నాకు తనంటే చాలా ఇష్టం. తన కోసం ఏమైనా చేస్తా అని తెలుసు. అందుకేనేమో తను త్వరగా ఆ అమ్మాయిని వాళ్ళ ఇంట్లో చెప్పి 15రోజుల్లోనే పెళ్లి చేసున్నారు. నాకు చచ్చిపోవాలనిపించింది. చాలా ఏడ్చాను. కానీ తను చాలా హ్యాపీగా ఉన్నాడు. అబ్బాయిని ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమించాను అదే నా ఫస్ట్ లవ్ కూడా. ఎప్పుడు తను హ్యాపీగా ఉండాలని ఆ దేవుడ్ని కోరుకుంటున్నాను. బుజ్జి(గుంటూరు). -
నా కడుపున పుడతానన్నాడు!
వేసవి సెలవులు కావడంతో మా పెద్దమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాను . అక్కడ నాకు ఒక అబ్బాయి పరిచయం అయ్యాడు తన పేరు ఉష కుమార్ . తను నన్నురోజూ చూసేవాడు అని నాకు మా అక్క చెప్పేది. ఒక రోజు తను నా దగ్గరకి వచ్చి నీ పేరు ఏంటి అని అడిగాడు భయమేసి నేను చెప్పలేదు. కానీ వన్డేలోనే నా పేరు నా వివరాలు అన్ని తెలుసుకున్నాడు.నేను బయటకి ఎక్కడికి వెళ్లిన నా వెనుక ఫాలో అయ్యేవాడు. కొన్ని రోజులకి నాకు ప్రపోజ్ చేశాడు. కానీ నేను ఏమీ చెప్పకుండా అక్కడ నుండి వెళ్ళిపోయా. నాకు డైలీ లవ్ యూ అని మెసేజ్ చేసేవాడు. నువ్వు లేకుండా నేను ఉండలేను అని చెప్పేవాడు. తన బిహేవియర్ నచ్చి నేను ఓకే చేశా. చాలా తొందరగా సమ్మర్ హాలిడేస్ గడచిపోయాయి. నేను హైదరాబాద్ కి వెళ్ళిపోయాను. రోజూ కాల్స్, మెసేజ్‌లు చేసుకునేవాళ్ళం. తరువాత కొన్ని రోజులకి మా ప్రేమకు చాలా పెద్ద ప్రాబ్లమ్ వచ్చింది. తను నాతో సరిగా మాట్లాడకపోయేవాడు. కాల్ చేస్తే కట్ చేసేవాడు. మెసేజ్ చేస్తే రిప్లై ఇవ్వడం మానేశాడు. నాకు ఏమి చేయాలో అర్థం కాక చాలా ఏడ్చాను. ఇంకా అలా కాదు అని మా పెద్దమ్మ వాళ్ళ ఊరికి వెళ్లి తనను మీట్ అయ్యాను. నన్ను చూడగానే తన కళ్ళలో ఏదో తెలియని బాధ. నన్ను వచ్చి ఒకసారి హగ్ చేసుకొని చాలా ఏడ్చాడు. ఏమైంది అంటే ఏం చెప్పలేదు. కొంచెంసేపటి తరువాత ఎందుకు వచ్చావు వెళ్లు, నువ్వంటే నాకు ఇష్టం లేదు అని పంపించేశాడు. తరువాత కొంతకాలానికి నేను వాళ్ల సిస్టర్‌కు కాల్ చేశాను. అసలు ఏమైందో చెప్పమని అడిగాను. అప్పుడు తను వదిన మా అన్నయ్యను మర్చిపో, అన్నయ్యకు బ్లడ్ క్యాన్సర్ అంది. ఆ మాటతో నా గుండె పగిలిపోయింది. చాలా ఏడ్చాను. తను నన్ను మర్చిపోయి నువ్వు హ్యాపీగా ఉండు, నిన్ను పెళ్లి చేసుకొని చాలా హ్యాపీగా చూసుకుందాం అనుకున్నాను. కానీ ఆ దేవుడు నాకు అంత అదృష్టాన్ని ఇవ్వలేదు. నేను ఇంకా ఎన్నో రోజులు బతకను, నన్ను మరచిపోయి నువ్వు వేరే పెళ్లి చేసుకొని హాయిగా ఉండు అని చెప్పాడు. కొన్ని రోజులకు అతను చనిపోయాడు. ఇప్పటికీ వాళ్ల ఇంటికి అప్పుడప్పుడు వెళ్తూ ఉంటాను. తన జ్ఞాపకాలు తనని మర్చిపోలేకుండా చేస్తున్నాయి. మా ఇంట్లో నాకు పెళ్లి సంబంధాలు చూస్తున్నారు. నేనే వేరే వ్యక్తిని పెళ్లి చేసుకొని హ్యపీగా ఉండాలని తను కోరుకున్నాడు. నా కడుపున బేబీగా పుడతాను అని చెప్పాడు. లవ్ యూ బంగారం, తొందరగా రా ఓకే నా! అక్షర ( కామా రెడ్డి) -
ఆ మాట చెప్పకపోవడం నాదే తప్పు!
ప్రేమ అన్న పదం ఇద్దరి మనసులో చేసే ఆ చిలిపి చేష్టలు.. నా జీవితంలోనూ ఆ రెండు అక్షరాల ప్రేమ ఎన్నో మలుపులతో ప్రయానిస్తోంది. నా వయసుకి తెలియదు ప్రేమంటే ఏంటో అప్పుడే ఆ అమ్మాయి నా కళ్లముందుకు వచ్చి వాలింది... తనని చూడగానే ఏదో తెలియని ఓ ఆనందం తననే చూస్తూ ఉండాలనే స్వార్ధం అది కొన్నాళ్లకి మరింత ఇష్టంగా మారింది. తనని చూసే ప్రతిక్షణం, కలిసిన అనుక్షణం ఏదో తెలియని సంతోషంతో ఉప్పొంగిపోయేవాడ్ని. తను పిలిచిన ప్రతిసారి, తనతో మాట్లాడిన అనుక్షణం, తను చేసే ప్రతి పని చూసి మురిసిపోయేవాడ్ని. అలా నాలో నేను ఇష్టాన్ని పెంచుకుంటూ వచ్చా. తన అందం మందారం. తన స్వభావమే అందులో మకరందం. అందుకే నన్ను తనవైపు మళ్లించి మరింత ఆశను నాలో కలిగించింది. ఇలా కొంతకాలం తరువాత అది ఇష్టం నుంచి ప్రేమగా మారింది. ప్రేమకు అర్ధం తెలుసుకున్న నేను తనే నా అర్ధాంగి అనుకున్నా. తనుకు నా పైన ఇష్టం ఉంది అని అనుకుంటూ గడిపా. కొన్నాళ్లకి నా ప్రేమను చెప్పాలి అనుకున్నా కానీ ఆ ప్రేమను తనతో చెప్పలేక నా గుండెలోనే దాచేశా. కాని అప్పుడే నాకు ఒక విషయం తెలిసింది. అప్పుడే నాలో ఏదో తెలియని అలజడి మొదలై గుండె గుభేలుమంది. తనికి ఇంట్లో పెళ్లిసంబంధాలు చూస్తున్నారు అని తెలిసింది. అది విన్న ఒక్క క్షణము నా గుండె ఆగినంత పని అయ్యింది. అయిన ప్రాణంగా ప్రేమిచిన అమ్మాయికి నా ప్రేమను చెప్పకపోవడం నా తప్పే. ఇన్ని రోజుల మా ప్రయాణంలో తనికి నాపై ఇష్టం తప్పా ప్రేమ కలగలేదు. అది తెలిసి బలవంతం చేసి బంధాలను దూరం చేసుకోలేక నా ప్రేమను చంపుకున్నాను. అయిన తనని ప్రేమించడం మానలేదు తనిని మరిచిపోలేదు. ఉదయ్( చిత్తూరు). -
అలా జరగకపోతే తననే లవ్ చేసేదాన్నేమో!
నేను డిగ్రీ చదివే రోజుల్లో నన్ను ఫస్ట్ ఇయర్ నుంచే ఒక అబ్బాయి లవ్ చేయడం మొదలు పెట్టాడు. ఆ విషయం నాకు మా సెకండ్ ఇయర్లో తెలిసింది. నాకు మా బావతో ఎప్పుడో పెళ్లి ఫిక్స్ అయ్యింది. ఆ విషయం అతనికి చెప్పి బుద్ధిగా చదువుకోమని చెప్పాను. కానీ తను వినలేదు. రోజు ఉదయం, సాయంత్రం నా వెంట వచ్చి నేను జాగ్రత్తగా వస్తున్నానా, ఇంటికి సేఫ్‌గా వెళుతున్నానా లేదా అని చూసేవాడు. చాలా అంటే చాలా లవ్ అండ్ కేరింగ్ చూపించేవాడు. నాకు మ్యారేజ్ ఫిక్స్ అయ్యి ఉండకపోతే తననే లవ్ చేసేదాన్ని ఏమో? తను అంతలా నా మీద ప్రేమ చూపించేవాడు. తను నన్ను ఎంతలా ప్రేమించాడు అంటే నా పేరును తన చేతి మీద పచ్చబొట్టు వేయించుకున్నాడు. డిగ్రీ అయిపోయిన వెంటనే నాకు పెళ్లి అయ్యిపోయింది. కానీ తనది నిజమైన ప్రేమ అని తన కళ్లలో నాకు కనిపించేది. ఆ నిజమైన ప్రేమను నేను మిస్ అయ్యాను. తనది నిజమైన ప్రేమ అని ఎందుకు అంటున్నాను అంటే నా మ్యారేజ్ అయ్యాక తను నువ్వు ఎక్కడ ఉన్న హ్యాపీగా ఉండాలి అది చాలు నాకు అన్నాడు. అలాగే ఇప్పుడు నేను కూడా అదే కోరుకుంటున్నాను ఎక్కడ ఉన్న తను హ్యపీగా ఉండాలి. అవని(గుంటూరు). ( పేరు మార్చాం). -
నాకంటూ లవ్ స్టోరీలు లేవు: హీరోయిన్
తనకంటూ ప్రత్యేకమైన ప్రేమ కథలు లేవని చెప్పుకొచ్చింది నటి త్రిష. వరుసగా రెండు మూడు చిత్రాలు ఫ్లాప్ అయితే ఈ అమ్మడి పనైపోయింది అన్న పరిస్థితి ఒకప్పుడు ఉండేదేమోగానీ ఇప్పుడు లేదు. కొన్ని చిత్రాలు వరుసగా ఫ్లాప్ అయినా, ఆ తరువాత నటించిన ఒక్క చిత్రం హిట్ అయితే మళ్లీ ఫామ్‌లోకి వచ్చేస్తున్న పరిస్థితి ఇప్పుడు నెలకొంది. అందుకు ఉదాహరణ నటి త్రిషనే. ఈ చెన్నై చిన్నది 17 ఏళ్లుగా నటిస్తూ వస్తోంది. మధ్యలో చాలా ఒడిదొడుకులు ఎదుర్కొంది. ముఖ్యంగా 96 చిత్రానికి ముందు త్రిష మార్కెట్ చాలా డౌన్ అయిపోయ్యింది. తను నటించిన హీరోయిన్ సెంట్రిక్ కథా చిత్రాలు చాలా ఘోరంగా నిరాశ పరిచాయి. అలాంటి పరిస్థితుల్లో వచ్చిన చిత్రం 96. త్రిష విజయ్‌సేతుపతితో కలిసి నటించిన ఈ చిత్రం అనూహ్య విజయాన్ని సొంతం చేసుకుంది. అంత విజయం సాధిస్తుందని త్రిషనే ఊహించలేదట. దీని గురించి ఒటీవల ఒక ఇంటర్వ్యూలో ఈ బ్యూటీ మాట్లాడుతూ 96 చిత్ర విజయం ఆశించనిదని చెప్పింది. అందులో తనది మంచి కథా పాత్ర అని తెలుసు అని చెప్పిది. అలాంటి కథా పాత్రతో కూడిన చిత్రాలను ఇంతకు ముందే చూశానని అంది.అలాంటి పాత్రలో తాను నటించిన చిత్రం అంతగా పేరు తెచ్చిపెడుతుందని ఊహించలేదని అంది. చిత్రం సక్సెస్ అవుతుందని, అందులోని రామ్, జాను కథాపాత్రల్లో ప్రేక్షకులు తమను చూసుకుంటారని భావించానని చెప్పింది. అయితే ఒక సాధారణ పసుపురంగు చుడీదార్ ధరించి నటించిన పాత్ర ఎంతగానో ఆదరించబడిందని అంది. అంత నిరాడంబర రూపంలో ఆ చిత్రంలో కనిపించానని పేర్కొంది. నిరాడంబరత ఎప్పుడూ ఆదరించబతుందని చెప్పింది. అలా ఒకటి రెండు కథా పాత్రలు మ్యాజిక్‌గా నిలుస్తాయని అంది. ఇంతకు ముందు విన్నైతాండి వరువాయా చిత్రంలో జెస్సీ పాత్ర తరువాత ఈ 96 చిత్రంలో జాన్ పాత్రనే అలాంటి అద్భుతాన్ని చేశాయని చెప్పింది. ప్రేమ కథా చిత్రాలు ప్రేక్షకులను సులభంగా ఆకట్టుకుంటాయనుకుంటున్నానని అంది. నిజానికి తనకు పాఠశాలలో గానీ, కళాశాలలో గానీ ప్రేమ కథలు లేవని చెప్పింది. అయినా 96 చిత్రంలో ఏదో ఒక ఒకటి తన మనసును హత్తుకుందని త్రిష పేర్కొంది. అలా మొత్తం మీద 96, రజనీకాంత్‌తో జత కట్టిన పేట చిత్రాల తరువాత ఈ బ్యూటీ మళ్లీ పుల్ ఫామ్‌లోకి వచ్చేసింది. ఇప్పుడు చేతి నిండా చిత్రాలతో బిజీగా ఉంది. చదవండి: త్రిష @17 త్రిష చిత్రానికి సెన్సార్ షాక్ -
ఇప్పటి వరకు అతన్ని చూడలేదు...కానీ!
నా బీటెక్ నా లైఫ్‌ను, నా కెరీర్‌ను మార్చేసింది. నా ఇంటర్ వరకు నేను మా ఊర్లో ఉండే చదువుకునేదాన్ని. నాకు చదువు తప్ప ఇంకేమి తెలియదు. ఫేస్బుక్, ఇంటర్నెట్లాంటివి కూడా నాకు తెలియదు. చదువే నా ప్రపంచం. నేను బీటెక్ ఫస్ట్ ఇయర్లో హాస్టల్లో జాయిన్ అయ్యాను. నేను అదే ఫస్ట్ టైం హాస్టల్లో ఉండటం. చాలా బాధగా అనిపించేది. నేను అంత తొందరగా వేరే వాళ్లతో కలిసే దాన్ని కాదు. ఆ టైంలో నా ఫోన్‌కు ఫన్చాట్ అని ఒక నోటిఫికేషన్ వచ్చింది. దాన్నిఓకే చేశాను. అందులో ఫేస్బుక్లో లాగా మెసేజ్‌లు వచ్చేవి. అప్పుడే పరిచయం అయ్యాడు తను. నాకు తను ఒక మంచి పర్సన్ అనిపించి తనకు నా నంబర్ కూడా ఇచ్చాను. తరువాత తనే కాల్స్, మెసేజ్ లు చేసేవాడు. అలా 4 సంవత్సరాలు తను నాకు రోజు ఫోనులు, మెసేజ్‌లు చేసేవాడు. నాకు ఏదైనా ప్రాబ్లమ్ అనిపిస్తే నాకు ధైర్యం చెప్పేవాడు. కానీ నేను ఎప్పుడూ అతనని చూడలేదు. కనీసం అతని ఫోటో కూడా చూడలేదు. తనతో మాట్లాడటం మొదలు పెట్టాక నాకు తెలియకుండానే తనని ఇష్టపడ్డాను. ఎంతలా తనని ప్రేమించాను అంటే తనతో మాట్లాడకుండా ఒక్కరోజు కూడా ఉండలేకపోయేదాన్ని. ఇదంతా నేను ఒకసారి అతనికి చెప్పాను. అప్పుడు తను నేను నిన్ను సిస్టర్లా చూశాను. నాకు వేరే ఉద్దేశ్యం లేదు అని నన్ను దూరంగా పెట్టడం లాంటి పనులు చేశాడు. తన నంబర్ మార్చేశాడు. తనకి బీటెక్ అయిపోగానే జాబ్ వచ్చింది. ఇంకా అన్నింటిలో నన్ను బ్లాక్ చేశాడు. నేను పిచ్చిదాన్నిలా తన కోసం రోడ్లు పట్టుకొని తిరిగాను. నా లవ్ అంగీకరించకపోయినా కనీసం తనని ఒకసారి చూద్దామని తన కోసం చాలా వెతికాను. కానీ తను నాకు ఏ అవకాశాన్ని ఇవ్వలేదు. తన ధ్యాసలో నా చదువును, కెరీర్‌ను వదిలేశాను. తను ఇప్పుడు హ్యపీగానే ఉన్నాడు. నేను మా పేరెంట్స్ కోసం వేరే అబ్బాయిని పెళ్లి చేసుకున్నాను. తనని మరచిపోలేక ఇప్పటికీ బతికి ఉన్న చచ్చిన శవంలా జీవిస్తున్నా...నేను తనని 7 సంవత్సరాలు లవ్ చేశాను. కానీ తనని ఒక్కసారి కూడా చూడలేకపోయానే అన్న బాధ నా ప్రాణం పోయేలా చేస్తోంది. ఇప్పటికీ నేను తనని చూడలేదు కానీ నా ప్రాణం పోయే వరకు నేను తనని మర్చిపోలేను. సౌమ్య ( వరంగల్). -
తనతోనే లేదంటే ఒంటరిగానే!
హాయ్ నా పేరు అమ్ము. నేను ఒక కాలేజీలో లెక్చరర్ గా పనిచేసేదానిని. తను నా కొలిగ్. మొదటిసారి తనని చూసినప్పుడు నాకు తన మీద ఎలాంటి ఫీలింగ్స్ లేవు. ఎవరి పని వాళ్లు చేసుకునే వాళ్లం. నేను తనకి హాయ్ అని కూడా సరిగా చెప్పేదాన్ని కాదు. కానీ కొన్ని రోజుల తరువాత మేమిద్దరం ఫ్రెండ్స్ అయ్యాం. తను నాకు రోజు మెసేజ్ చేసేవాడు. అలా మా ఫ్రెండ్షిప్ పెరిగిపోయింది. ఎంతలా అంటే ఒక్కరోజు కూడా మేసేజ్ చేయకుండా ఉండలేకపోయేవాళ్లం. అలా మంచి ఫ్రెండ్స్‌లా ఉన్న టైంలో నేను కాలేజీలో జాబ్‌కు రాజీనామా చేశాను. మా ఇంటికి వచ్చేశాను. మా ఫ్యామిలి నా పెళ్లి మా బావతో చేయాలి అనుకున్నారు. నాకు నో చెప్పడానికి ఏ కారణం లేకపోవడంతో నేను కాదనలేకపోయాను. తరువాత నాకు చింటూకు నేనంటే ఇష్టమని నన్ను ప్రేమిస్తున్నాడని తెలిసింది. నేను కాలేజీ నుంచి వెళ్లిపోయేటప్పుడు అందుకే తను అంత బాధ పడ్డాడని అర్థం అయ్యింది. మొదట్లో ఫ్రెండ్ షిప్ అనుకున్నాం కానీ దూరం అయ్యాకే అది ప్రేమ అని తెలిసింది. ఒకరు లేకపోతే మరొకరం ఉండలేనంత దగ్గరయ్యామని అర్ధం అయ్యింది. కానీ ఇంట్లో అప్పటికే మాట ఇచ్చేశాను. చింటు వాళ్లది మా కంటే పెద్ద కులం. వాళ్ల ఇంట్లో వాళ్లకు కుల పిచ్చి ఎక్కువ. మా ప్రేమను వాళ్లింట్లో ఒప్పుకోలేదు. తను మాత్రం నేను లేకుండా ఉండలేను అంటాడు. వాళ్ల అమ్మనాన్నలకు ఒక్కడే కొడుకు. వాళ్ల నాన్నగారికి హార్ట్ ప్రాబ్లమ్ ఉంది. ఈ పరిస్థితుల్లో వాళ్లని వదిలి ఎలా రాను అని అడిగాడు. ఇన్ని సమస్యలు ఉన్న కూడా రెండు సంవత్సరాలుగా మేం మా ప్రేమను కొనసాగిస్తున్నాం. భవిష్యత్తులో ఎలా రాసిపెట్టి ఉందో తెలియదు కానీ ఉంటే తనతోనే లేదంటే ఒంటరిగానే అని నిర్ణయించుకున్నాను. ఈ రెండు సంవత్సరాలలో తను చూపించిన కేరింగ్, తన ప్రేమను మాటల్లో చెప్పలేను. నా జీవితంలోకి తను రావడం నా అదృష్టం. ఐ లవ్ యూ చింటు. అమ్ము ( హైదరాబాద్) -
ప్రేమలో ఉన్నారా.. ఈ వారం మీ జాతకం తెలుసుకోండి!
మేషం: వీరికి ప్రేమ, వివాహ ప్రతిపాదనలకు ఆది, సోమవారాలు అనుకూలమైనవిగా చెప్పవచ్చు. ఈరోజుల్లో చేసే ప్రతిపాదనలు చాలా వరకూ ఫలించే వీలుంది. వీరు రెడ్, ఎల్లో రంగు దుస్తులు ధరించి ప్రతిపాదనలు చేస్తే మంచి ఫలితాలు ఉంటాయి. అలాగే, దక్షిణ ఆగ్నేయదిశగా ఇంటి నుంచి బయలుదేరితే శుభాలు పొందుతారు. ఇక శుక్ర, గురువారాలు మాత్రం ఇటువంటి వాటికి దూరంగా ఉండడం మంచిది. వృషభం: బుధ, గురువారాలు ఈరాశి వారికి సానుకూలమైనవి. ఈ రోజుల్లో ఇష్టులకు మీ ప్రతిపాదనలు అందిస్తే అవతలి నుంచి కూడా సానుకూలత వ్యక్తం కావచ్చు. ఇటువంటి వారు గ్రీన్, బ్లూ రంగు దుస్తులు ధరించి మీ అభిప్రాయాలను వెల్లడిస్తే అవతలి వారు స్పందించే వీలుంది. ఇంటి నుంచి తూర్పుదిశగా బయలుదేరితే విజయం మీ వెంటే ఉంటుంది. శని, ఆదివారాలు ఈ ప్రయత్నాలకు దూరంగా ఉండండి. మిథునం: మీకు ఇష్టమైన వ్యక్తులకు మీ సందేశాలు అందించేందుకు శని, బుధవారాలు అనుకూలమైనవి. ఇటువంటి ప్రతిపాదనలు అందించే సమయంలో వైట్, పింక్ రంగు దుస్తులు ధరిస్తే సానుకూలత ఉంటుంది. అలాగే, ఇంటి నుంచి పశ్చిమ వాయువ్యం దిశగా బయలుదేరండి. సోమ, మంగళవారాలు కొంత వ్యతిరేకత ఉండే రోజులు, వీటిని విస్మరించండి. కర్కాటకం: అత్యంత ఇష్టపడే వ్యక్తులకు మీ అభిప్రాయలను వెల్లడించేందుకు శుక్ర, శనివారాలు విశేషమైనవి. మీ ప్రతిపాదనలు అందించే సమయంలో పింక్, రెడ్ రంగు దుస్తులు ధరిస్తే మంచి ఫలితాలు ఉంటాయి. ఊహించని విధంగా అవతలి నుంచి సైతం అనుకూల సందేశాలు రావచ్చు. ఇంటి నుంచి పశ్చిమదిశగా బయలుదేరండి. అయితే ఇటువంటి ప్రతిపాదనలకు మంగళ, గురువారాలు అంతగా అనుకూలించవు. సింహం: మీలోని అభిప్రాయాలను వెల్లడించేందుకు ఆది, బుదవారాలు అనుకూలమైనవి. మీ ప్రతిపాదనలు చేసేముందు ఎల్లో, పింక్ రంగు దుస్తులు ధరించడం ఉత్తమం. ఈ రోజుల్లో మీ ప్రతిపాదనలకు సానుకూలత వ్యక్తం కావచ్చు. అలాగే, ఈ సమయంలో ఇంటి నుంచి తూర్పుఈశాన్యదిశగా బయలుదేరండి. ఇక శుక్ర, మంగళవారాలను విస్మరించండి. కన్య: ఇష్టమైన వ్యక్తులకు మీ సందేశాలు అందించేందుకు బుధ, గురువారాలు అత్యంత అనుకూలమైనవి. ఈ రోజుల్లో అవతలి నుంచి సైతం సానుకూల వైఖరి వ్యక్తం కావచ్చు. ఈ సమయంలో మీరు పింక్, వైట్ రంగు దుస్తులు ధరించండి. అలాగే, ఇంటి నుంచి ఉత్తర దిశగా బయలుదేరండి. అయితే శని, ఆదివారాలు ఇటువంటి ప్రతిపాదనలకు దూరంగా ఉండండి. తుల: మీ ప్రతిపాదనలు, అభిప్రాయాలను ఇష్టులకు తెలిపేందుకు శుక్ర, గురువారాలు విశేషమైనవి. ఈ సమయంలో మీ ప్రతిపాదనలకు సానుకూలత వ్యక్తం కావచ్చు. అలాగే, ఈ రోజుల్లో రెడ్, వైట్ రంగు దుస్తులు ధరించి అభిప్రాయాలు వెల్లడిస్తే అనుకూల సందేశాలు రావచ్చు. ఇక ఇంటి నుంచి ఉత్తరదిశగా బయలుదేరితే మంచిది. అయితే మంగళ, బుధవారాలు విస్మరించండి. వృశ్చికం: శని, బుధవారాలు మీ అభిప్రాయాలను వెల్లడించేందుకు తగిన సమయం. ఈరోజుల్లో అవతలి నుంచి అనుకూల సందేశాలు వచ్చే వీలుంది. ఇటువంటి సమయంలో గ్రీన్, పింక్ రంగు దుస్తులు ధరిస్తే మంచిది. అలాగే, పశ్చిమదిశగా ఇంటి నుంచి బయలుదేరండి, శుభాలు కలుగుతాయి. అయితే శుక్ర, మంగళవారాలు ఇటువంటి వాటికి దూరంగా ఉండడం మంచిది. ధనుస్సు: మీ మనస్సులోని భావాలను ఇష్టమైన వారికి వెల్లడించేందుకు ఆది, సోమవారాలు చాలా అనుకూలమైనవని చెప్పవచ్చు. ఈ రోజుల్లో అవతలి వారి నుంచి కూడా ఊహించిన సందేశాలు రావచ్చు. మీ ప్రతిపాదనలు చేసే సమయంలో వైట్, ఎల్లో రంగు దుస్తులు ధరిస్తే మంచిది. అలాగే, దక్షిణ ఆగ్నేయ దిశగా ఇంటి నుంచి బయలుదేరండి. ఇక బుధ, గురువారాలు వ్యతిరేకమైనవి. ఈ సమయంలో మౌనం మంచిది. మకరం: శని, బుధవారాలు మీ అభిప్రాయాలను వెల్లడిస్తే మంచి ఫలితాలు ఉంటాయి. అలాగే, మీ ప్రతిపాదనలపై అవతలి వైపు నుంచి సానుకూల సందేశాలు అందుతాయి. ఈ సమయంలో మీరు రెడ్, గ్రీన్ రంగు దుస్తులు ధరించడం మంచిది. అలాగే, దక్షిణదిశగా ఇంటి నుంచి బయలుదేరండి. ఇక శుక్ర, మంగళవారాలు ఇటువంటి ప్రతిపాదనలకు దూరంగా ఉండండి. కుంభం: మీకు ఇష్టమైన వారికి మీ బావాలను వెల్లడించేందుకు సోమ, బుధవారాలు అనుకూలమైనవి. ఈ సమయంలో అవతలి వారి నుంచి కూడా అనుకూల సందేశాలు అందవచ్చు. అలాగే, మీ ప్రతిపాదన లు అందించే సమయంలో ఎల్లో, బ్లూ రంగు దుస్తులు ధరిస్తే మంచిది. ఇక ఇంటి నుంచి పశ్చిమదిశగా ఇంటి నుంచి బయలుదేరండి. ఇక శుక్ర, ఆదివారాలు ఇటువంటి ప్రయత్నాలకు దూరంగా ఉండడం మంచిది. మీనం: మీలోని భావాలను ఇష్టులకు వెల్లడించేందుకు ఆది, సోమవారాలు అనుకూలమైనవి. ఈరోజుల్లో అవతలి నుంచి సైతం సానుకూలత వ్యక్తం కావచ్చు. అలాగే, ఇటువంటి సమయంలో పింక్, రెడ్ రంగు దుస్తులు ధరించడం ఉత్తమం. ఇక ఇంటి నుంచి ఉత్తరదిశగా బయలుదేరండి శుభాలు కలుగుతాయి. అయితే బుధ, గురువారాలు ఇటువంటి వాటికి దూరంగా ఉండండి. -
తనకోసం అన్ని వదిలేస్తే... తను నన్నే వదిలేసింది!
2009 లో బీటెక్ చేయడం కోసం హైదరాబాద్ వచ్చాను. ఆమెను మొదటిసారి అక్కడే కలిశాను. మా క్లాస్‌మెట్ తను. పేరు సుష్మా. బాగా మాట్లాడుకునే వాళ్ళం. ఒక రోజు ప్రపోజ్ చేశాను. మనం ఫ్రెండ్స్ అంది. నీ మీద నాకు ఫీలింగ్స్ ఉన్నాయి ఇంకా ఫ్రెండ్లీగా నీతో ఉండలేను అని తనకి దూరంగా ఉన్నాను. తర్వాత కొన్ని రోజులకు తను నా ప్రేమను ఒప్పుకుంది. మా కాలేజీ అంతా మా ప్రేమ గురించి తెలుసు. ఎప్పుడూ కలిసే ఉండేవాళ్ళం. బీటెక్‌లో క్యాంపస్ ఇంటర్వ్యూలో జాబ్ వచ్చింది. ఢిల్లీలో ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో చేరాను. మంచి జీతం, మంచి జీవితం. కానీ నీకు దూరంగా ఉండలేను హైదరాబాద్ వచ్చేయ్ అని అంది. తన కోసం ఏమి ఆలోచించకుండా జాబ్ వదిలేసి వచ్చేశా. నేను తన కోసం అన్ని వదిలేసి వచ్చేశాను... తను మాత్రం నన్ను వదిలేసి వేరే పెళ్ళి చేసుకుని వెళ్లిపోయింది. తన జ్ఞాపకాల నుంచి బయటకు రావడానికి చాలా టైం పట్టింది. చాలా కాలం తరువాత తన జ్ఞాపకాల నుంచి బయటకు వచ్చాను. ఇప్పుడు ఒక బ్యాంక్ మేనేజర్‌గా పనిచేస్తున్నాను. ఆ తరవాత నాతో మాట్లాడాలి అని చాలా ట్రై చేసింది. కానీ నేను మాట్లాలేదు. నా తొలి ప్రేమ నాకు చేదు అనుభవాన్ని మిగిల్చింది. కానీ ఫ్రెండ్స్ వల్ల ఫ్యామిలీ సపోర్ట్ వల్ల ఈరోజు హ్యాపీగా ఉన్నాను. -
మా మధ్య ఉన్న బంధం ఏంటో అర్థం కావడం లేదు!
నా పేరు రవి. బీటెక్ పూర్తి చేశాను. ప్రస్తుతం జాబ్ ట్రైల్స్‌లో ఉన్నాను. తను నాకు ఇంటర్లో పరిచయం అయ్యింది. తనకు ముందే లవర్ ఉన్నాడు. అప్పుడప్పుడు నాతో మాట్లాడేది. బీటెక్‌లో ఒకే కాలేజీలో చేరాం. తరువాత ఫ్రెండ్స్ కాస్తా బెస్ట్‌ఫ్రెండ్స్ అయ్యాం. తనకు సంతోషం వచ్చినా, బాధ వచ్చినా తన లవర్ కంటే ముందు నాతోనే పంచుకునేది. నేను కూడా నా ప్రతి విషయాన్ని ఆమెతోనే పంచుకునే వాడిని. ఆమెకు లవర్‌తో గొడవలు జరుగుతున్నాయి అంటే మొదట్లో నేను పట్టించుకునే వాడిని కాదు. తరువాత ఆ గొడవలకు కారణం నేనే అని తెలిసి ఆమెతో మాట్లాడటం మానేశాను. కానీ ఎక్కువ కాలం అలా ఉండలేకపోయాను. మళ్లీ మేమిద్దరం మాట్లాడుకోవడం మొదలుపెట్టాము. ఎప్పుడు మొదలైందో తెలియదు కానీ ఆమె మీద నాకు ప్రేమ పుట్టింది. తనకు చెబుదాం అంటే ఉన్న ఫ్రెండ్షిప్ కూడా పోతుందేమో అనే భయంతో చెప్పలేదు. కొన్నిసార్లు తనకు కూడా నా మీద ఫీలింగ్స్ ఉన్నయ్యేమో అనిపించేది. కానీ ఎప్పుడూ అడిగే ధైర్యం చేయలేదు. బీటెక్ లాస్ట్ డే తనకు నా ఫీలింగ్స్ చెప్పాను. తను కూడా సేమ్ టు యూ అని చెప్పింది. తరువాత మేం రోజు మాట్లాడుకునే వాళ్లం. తరువాత కొన్ని రోజులకు ఆమె తనకు తన ఫస్ట్ లవర్ గుర్తొస్తున్నాడు అని చెప్పింది. నాకు ఏం చెప్పాలో తెలియక నీ ఇష్టం అని చెప్పాను. తను వెళ్లిపోయింది. మళ్లీ కొన్ని నెలల తరువాత నేను ఆ అమ్మాయి మాట్లాడుకోవడం స్టాట్ చేశాం. కానీ మా ఇద్దరి మధ్య ఉన్న రిలేషన్ ఏంటో అర్ధం కావడం లేదు. ఆమె మాత్రం నాకు కావాలి అనిపిస్తుంది. ఆ విషయం ఆమెను అడగలేకపోతున్నా...ఇప్పుడు నేనేం చేయాలో మీరే చెప్పండి. రవికుమార్ (కర్నూల్) -
తనే స్వయంగా నా కోసం వస్తుంది!
నా పేరు ఈశ్వర్. నేను 8 సంవత్సరాల నుంచి ఒక అమ్మాయిను ప్రాణానికి ప్రాణంగా ప్రేమిస్తున్నాను. ఆమె మా బంధుల అమ్మాయే. కానీ తనతో నా ప్రేమ విషయం చెప్పాలి అంటే చాలా భయం వేసేది. తను ఎక్కడ బాధ పడుతుందో అని నా ప్రేమ విషయం చాలా రోజులు తనకి చెప్పలేదు. ఇంకా ఆలస్యం చేస్తే మంచిది కాదు అనుకొని ఒకరోజు ధైర్యం చేసి ఆమెకు నా మనసులోని మాటను చెప్పుశాను. కానీ తనకి నేనంటే ఇష్టం లేదని అప్పుడే నాకు అర్థం అయ్యింది. బంధువులు కాబట్టి పెద్దగా గోల చేయలేదు. నేనంటే ఇష్టం లేదు అని చెప్పినా నేను మాత్రం తనని మర్చిపోలేకపోతున్నాను. ఎప్పుడూ తనే గుర్తుకు వస్తుంది. నా ప్రేమ నాకు పూర్తి నమ్మకం ఉంది. ఎప్పటికైనా తనే స్వయంగా నాకోసం వస్తుందనే నమ్మకం నాకుంది. తన కోసం ఎప్పటికీ ఎదురుచూస్తూనే ఉంటా... ఈశ్వర్ కుమార్ (గుంటూరు). -
అతి ప్రేమ ఆరోగ్యానికి హానికరం!
ప్రేమ అంటే నాకు భక్తి, చాలా గౌరవం ఉండేవి. నేను కూడా ఒక మంచి అమ్మాయిను ప్రేమించి హ్యాపీగా ఉండాలి అనుకున్నాను. అలాగే ఒక మంచి అమ్మాయిని లవ్ చేశాను. కానీ ఆ తరువాతే నాకు ప్రేమ మీద ఉన్న భక్తిపోయి భయం పట్టుకుంది. తనకు నా ప్రేమ గురించి చెప్పక ముందు ప్రేమంటే ఆహా...అనిపించేది. ఇప్పుడు ప్రేమంటో ఓహ్ నో... అనిపిస్తుంది. ఒకప్పుడు ప్రేమించిన వ్యక్తి ఏం చేసినా భరించాలి అనిపించేది. ఇప్పుడు నెత్తి నేలకేసి బాదుకోవాలనిపిస్తుంది. చాలా భరించాను తనని. ప్రతి విషయంలో గొడవ పెట్టుకున్నా, అలిగినా అన్నింటికి సర్దుకుపోయాను. నాకు ఓర్పు, సహనం చాలా ఎక్కువ. తనంటే ఉన్న ప్రేమతో తను ఏం చేసినా చాలా ఓపికగా ఉన్నా.నా సహనం, ఓర్పే నా మైనస్ పాయింట్లు అని అర్థం అయ్యింది. అవి తనకు ప్లస్ పాయింట్లుగా మారిపోయాయి. ఇప్పుడు తను నాతో 150 ఓవర్స్ టెస్ట్ మ్యాచ్ ఆడుకుంటుంది. తన వల్ల నాకు షుగర్, బీపీ, షార్ట్ టెంపర్ ఇలా చాలా పనికిమాలిన రోగాలు వస్తున్నాయి. ఓర్పు, సహనం నా నుంచి దూరంగా వెళ్లిపోయాయి. తన వల్ల నేను ప్రేమించడం మానేసి నటించడం మొదలు పెట్టాల్సి వచ్చింది. ఇంత చెబుతున్నా... ఇంతకీ నా సమస్య ఏంటో చెప్పలేదు కదా! రోజు మొత్తం తనతో ఫోన్ మాట్లాడుతూనే ఉండాలి. తినేటప్పుడు మాట్లాడాలి. డ్రైవింగ్‌లో, ఆఫీస్‌లో, చివరికి బాస్ ముందు ఉన్నాడు అని చెప్పినా కూడా నువ్వు నాకు టైం ఇవ్వడం లేదు అంటుంది. ఏం చేయాలి చెప్పండి. అందరికి అది ప్రేమలా అనిపిస్తుంది. నాకు మాత్రం టార్చర్ అంటే ఇదేనా అనిపిస్తుంది. ప్రేమికులు ప్రపంచాన్ని మరిచిపోయి గంటలు గంటలు మాట్లాడుకుంటారు అంటారు. కానీ ఇలా మాట్లాడమంటే మాత్రం చాలా కష్టమే. అది చూసే వాళ్లకి చదివే వాళ్లకు అర్ధం కాదు భరించేవాడికే తెలుస్తుంది. అతి ప్రేమ అన్ని విధాల అనర్ధం. శివ(నరసన్నపేట) -
ఇంట్లో చెప్పలేను... తనను వదులుకోలేను!
నా పేరు రియా. తన పేరు నోబి. మేమిద్దరం నాలుగు సంవత్సరాల నుంచి ప్రేమించుకుంటున్నాం. నేను తను ఒకే కాలేజీలో బీటెక్ చేశాము. ఫస్ట్‌ఈయర్ నుంచి నేను తనతో చాలా క్లోజ్‌గా మాట్లాడుతూ ఉండేదాన్ని. అన్ని విషయాలను తనతో షేర్ చేసుకునేదాన్ని. నా సంతోషాన్ని, బాధల్ని అన్నింటిని చాలా చక్కగా అర్ధం చేసుకొని ప్రతి విషయంలో నాకు తోడుగా ఉంటాడు నోబి. నన్ను ఎంతో ముద్దుగా చూసుకునే వాడు. అతని కేరింగ్, నా మీద చూపిస్తున్న ప్రేమ చూసి తనని చాలా ఇష్టపడ్డాను. కానీ ఆ విషయం నోబికి చెప్పలేదు. తనకి కూడా నేనంటే ఇష్టం ఉండటంతో ఒకరోజు తనే నాకు ప్రపోజ్ చేశాడు. నాకు కూడా నోబి అంటే ఇష్టం ఉండటంతో ఎక్కువ టైమ్ తీసుకోకుండా ఆ తరువాత రోజే ఐ లవ్యూ టూచెప్పేశాను. అలా మేమిద్దరం మా బీటెక్ ముగిసేవరకు చాలా హ్యాపీగా గడిపాము. మా బీటెక్ అయిపోగానే తను జాబ్ కోసం వేరే ఊరు వెళ్లాడు. తను ప్రస్తుతం ఒక యమ్ఎన్సీ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. మా ఇంట్లో వాళ్లకు నేను జాబ్ చేయడం ఇష్టం లేదు. అందుకే బీటెక్ అవగానే నన్ను ఇంట్లోనే ఉంచి పెళ్లి సంబంధాలు చూస్తున్నారు. నాది నోబిది ఒకే కాస్ట్. కానీ నోబిని ప్రేమిస్తున్న విషయాన్ని ఇంట్లో చెప్పాలంటే చాలా భయంగా ఉంది. ధైర్యం సరిపోవడం లేదు. అలా అని తనని కాకుండా వేరే వాళ్లని చేసుకోలేను. తను లేకుండా నేను ఉండలేను. ఏం చేయాలో అర్ధం కావడం లేదు. రియా( హైదరాబాద్) -
కోపంలో పెద్ద తప్పు చేశాను!
తన పేరు రాధిక. మా టెన్త్‌క్లాస్ అయిపోయాక 7 సంవత్సరాలకు గెట్ టూ గెదర్ ఏర్పాటు చేశారు. ఆ ఈవెంట్లో నేను తనని చూశాను. చూడగానే నాకు చాలా బాగా నచ్చింది. వెంటనే తను నాకు నచ్చిందని మా ఫ్రెండ్‌కు చెప్పాను. తనకి కూడా ఇష్టం ఉందేమో కనుక్కోమని చెప్పాను. అంత ధైర్యం ఉంటే తననే నాతో చెప్పమను అని చెప్పింది అంటా. కానీ నాకు భయంవేసి అప్పుడు చెప్పలేదు. తరువాత కొన్ని రోజులు మేం ఫోన్లో మాట్లాడుకున్నాం. తరువాత నేనంటే తనకు ఇష్టమని తెలిసింది. ఒక రోజు విజయవాడలో పరీక్ష ఉంది వెళ్లాలి అని చెప్పింది. నేను కూడా రానా అని అడిగాను. నీ ఇష్టం అని చెప్పింది. సరే అని తనతో పాటే వెళ్లాను. తను పరీక్ష రాసే అంతసేపు నేను పార్కులో తనకోసం వేచిచూశాను. తను రాగానే వెంటనే ప్రపోజ్ చేశాను. తను ఏం మాట్లాడకుండా వెళ్లిపోయింది. తరువాత రోజు ఫోన్‌చేసి నేను కంభం వెళుతున్నా వస్తావా అని అడిగింది. మార్నింగ్ వరకు విజయవాడలోనే ఉన్నా. రైల్వేస్టేషన్లో నన్ను చూడగానే తను నవ్వింది. వెంటనే తనని హగ్ చేసుకొని లవ్ యూ బంగారం అని చెప్పాను. తను సీరియస్ అయ్యింది. కానీ ఫ్రెండ్లీగానే మాట్లాడేది. నేను నంద్యాలలో ట్రైన్ దిగగానే నేనంటే ఇష్టం ఉంటే మహానంది చూపించు లేకపోతే హైదరాబాద్ వెళ్లిపోతా అని చెప్పాను. తను నన్ను మహానందికి తీసువెళ్లి అక్కడ ఐలవ్యూ చెప్పింది. తరువాత 4 సంవత్సరాలు చాలా హ్యాపీగా గడిపాం. తరువాత పెళ్లి చేసుకుందాం అనుకున్నాం. తను ఓకే అంది. కానీ తనకి ఏం అయ్యిందో ఏమో కానీ ప్రతి చిన్న విషయానికి గొడపడేది. చాలాసార్లు నేనే సర్ధుకుపోయేవాడిని. ఒకరోజు ఉండలేక మనం ఎప్పుడు పెళ్లి చేసుకుందాం అని గట్టిగా అడిగాను. 4 నెలల తరువాత చేసుకుందాం అని అంది. సరే అని నాలుగు నెలలు ఓపిక పట్టాను. తరువాత పెళ్లి చేసుకుందాం అని అడిగితే మా ఇంట్లో కాస్ట్ ఫీలింగ్ చాలా ఎక్కువ మన పెళ్లికి ఒప్పుకోరు అని ఏడ్చింది. నన్ను వేరే పెళ్లి చేసుకోమని చెప్పింది. వెంటనే నాకు కోపం వచ్చి తనని కొట్టాను. ఏం చేసినా మా పెళ్లి జరగదని చెప్పింది. నాకు తన మీద కోపం వచ్చి వెంటనే వేరే అమ్మాయిని పెళ్లి చేసేసుకున్నాను. కానీ తనని ఇప్పటికీ మర్చిపోలేకపోతున్నాను. తనతో గడిపిన ప్రతి క్షణం నాకు ఇప్పటికీ గుర్తుంది. చాలా సార్లు తనకి కాల్ చేస్తూనే ఉన్నా. ఎప్పటికీ ఆమెను ప్రేమిస్తూనే ఉంటా... రఘ(కంభం) -
చూసుకోకుండానే పెళ్లి చేసుకున్నాం!
నా పేరు రాజా సాఫ్ట్వేర్ కోచింగ్ కోసమని హైదరాబాద్ కు వచ్చాను. ఒక రోజు సాయంత్రం హాస్టల్ పైకి వెళ్లి చల్ల గాలిలో హాయిగా అటు ఇటు తిరుగుతూ ఉన్న సమయంలో నా మొబైల్ ఫోన్ ట్రింగ్ ట్రింగ్ అని మోగింది. ఏదో ఎస్టీడీ నెంబర్ నుండి వచ్చింది ఆ ఫోన్. హలో ఎవరు అన్నాను, హలో ప్రసాద్ గారు అని ఒక అమ్మాయి గొంతు, కాదండి అని అన్నాను. మరి ఎవరు అని అడిగింది ఆ అమ్మాయి. ఇంతకీ మీరు ఎవరు ? అన్నాను మీరు ప్రసాదా అంది మళ్ళీ... కాదండీ బాబు, ఒకసారి నెంబర్ చెక్ చేసుకొండి అన్నాను. ఆ అమ్మాయి నమ్మలేదు, సరే మీ పేరేంటి అంది ఆ అమ్మాయి, ముందు మీ పేరు చెప్పండి అన్నాను. నా పేరు అమ్మాయి అంది. అబ్బా చా... ఫోన్ పెట్టెయ్ అన్నాను. కాల్ కట్ చేసింది. మళ్ళీ కాల్ చేసింది. మళ్ళీ ఫోన్ పెట్టెయ్ అని గట్టిగా అరిచాను. తరువాత రోజు మళ్ళీ అదే టైమ్‌కు మొబైల్ ట్రింగ్ ట్రింగ్ అంది.మళ్లీ అదే ప్రశ్న ప్రసాదా అని? చెప్పాను కదా నేను ప్రసాద్‌ను కాదు అని అన్నాను. అప్పుడు ఆమె తెలుసు బాబు నాకు, ఎందుకు అంతా చిరాకు అంది. ఫోన్ చేసింది నేనే కదా మాట్లాడండి, నాకే కదా బిల్లు అని అంది (సరే అనుకున్నాను. అసలే కొత్తగా మార్కెట్ లో కి మొబైల్ ఫోన్ వచ్చింది. అప్పుడు మొబైల్ ఫోన్ లో మాట్లాడడము అంటే ఒక సరదా గా ఉండేది). సరే ఓకే చెప్పండి అని మాటలు కలిపాను. ఆ పరిచయం కాస్తా ఇష్టంగా మారింది. ఒక సారి కలుద్దామని అనుకున్నాము. అంత వరకు ఒకరినొకరం చూసుకోలేదు. ఇంత మంచి అమ్మాయిని ఒకసారి చూడాలి అనుకున్నాను. ఒక డేట్ ఫిక్స్ చేసుకొని కలుద్దాం అనుకున్నాం. కానీ అదే టైమ్‌లో నాకు జాబ్ వచ్చి వెళ్లలేక పోయాను. అలా ఫోన్లోనే వన్ఇయర్ గడిచింది. ఆ తరువాత శాంతి వాళ్ళ ఇంట్లో, శాంతి ఎవరితోనో ఫోన్ మాట్లాడుతుంది అన్న విషయం తెలిసింది.తనకి మొబైల్ ఫోన్ లేదు. ఒక ఎస్టీడీ బూత్ నుంచి రోజూ ఫోన్ చేసేది. తరువాత చాలా రోజులు తను ఫోన్ చేయలేదు. ఏదో తెలియని బాధ మొదలైంది. నా మనస్సు అంతా శాంతి కోసమే తపించిపోయింది. తరువాత ఒక రోజు ఫోన్ చేసి ఇంట్లో వాళ్ళు పెళ్లి సంబంధాలు చూస్తున్నారు. నువ్వు వచ్చి మాట్లాడు అంది.తన పేరు, ఊరు తప్ప ఇంకేమీ తెలియదు. నిన్ను కాకుండా ఇంకెవరిని పెళ్లి చేసుకోను అంది.వచ్చి నన్ను తీసుకెళ్లు లేదంటే చచ్చిపోతాను అంది. ఏమి ఆలోచించకుండ సరే అన్నాను. ఆలస్యం చేయకుండా వాళ్ల ఊరు వెళ్లాలి అని నిర్ణయించుకున్నాను. శాంతి ఫోన్ కాల్ కోసం ఎదురుచూశాను. ఫోన్ వచ్చింది. పెళ్లి చేసుకుందాం నీకోసం వస్తాను... నువ్వువస్తావా అని అడిగాను. శాంతి వస్తాను అంది. మరుసటి రోజు విజయవాడ బస్‌స్టాండ్ లో తన కోసం ఎదురు చూశాను. వస్తాను అన్న టైమ్ కి రాలేదు. ఫోన్ కూడా చేయలేదు.టైమ్ గడిచి పోతుంది, టెన్షన్ పెరిగి పోతుంది. చాలా సమయం ఎదురు చూశాను. ఏమో చేయాలో అర్ధం లేదు. శాంతికి ఫోన్ చెద్దాం అంటే మొబైల్ ఫోన్ లేదు. ఎలా ఎలా.. చాలా సమయం తరువాత తను వచ్చింది. తొందరగా వెళ్ళి పోదాం పదా అంది. సరే అని ఇద్దరం తిరుపతి బస్ ఎక్కాము. నా ఫ్రెండ్స్ సాయం తో మా పెళ్లి ఆ ఏడుకొండల వెంకన్న స్వామి సమక్షమంలో జరిగింది. తరువాత ఇంట్లో వాళ్ళ ని ఒప్పించాము. ఇప్పుడు హ్యపీగా ఉన్నాం. ఒకవేళ నేను వెళ్లకపోయినా, తాను రాక పోయినా, లైఫ్ లో ఒక మంచి అమ్మాయిని మిస్ అయ్యే వాణ్ని...అలా ఒకరిని ఒకరము చూసుకోకుండానే, మనసులు కలసి పెళ్లి చేసుకున్నాము. ఇప్పుడు అందరూ మా జంట బాగుంది అంటున్నారు. మా ఇద్దరి ని ఇలా కలిపినా ఆ దేవుడికి జీవితాంతం రుణపడి ఉంటాను. రాజా(హైదరాబాద్) -
ప్రేమికులు మెచ్చే నవలలు
ప్రేమకు సంబంధించిన పుస్తకాలు, సినిమాలు ఇష్టపడని వారు ఉండరంటే అతిశయోక్తి కాదేమో! ప్రేమలో పడిన వారే కాకుండా మిగిలిన వారు కూడా ప్రేమకు సంబంధించిన పుస్తకాలు చదవడానికి ఆసక్తి చూపిస్తూ ఉంటారు. వాటిల్లో ఉండే మాధుర్యాన్ని ఆశ్వాదిస్తూ ఉంటారు. సినిమా చూసిన అనుభూతి కొద్దిసేపు మాత్రమే ఉంటుంది. కానీ ఒక కథ చదివితే అందులో పాత్రలు మనల్ని ఎంతగానో ప్రభావితం చేస్తాయి. ప్రేమికులు ఎంతగానో ఇష్టపడే నవలలు ఏంటో తెలుసుకోవాలంటే ఈ వీడియో క్లిక్ చేయండి. -
లాంగ్ డ్రైవ్‌ను ఎప్పటికీ మర్చిపోలేను!
ప్రేమలో ఎలా పడ్డానో చెప్పడం కంటే ప్రేమించుకున్న తరువాత మేమిద్దరం ఎలా ఉన్నామో చెప్పాలనుకుంటున్నాను. అందరిలానే మేమిద్దరం కూడా ఒకరినొకరం ఇష్టపడ్డాం. మా ప్రేమను ఒకరితో ఒకరం చెప్పుకున్నాం. ఇద్దరి మధ్య బంధం బలపడాలంటే అంత తేలికైన పని కాదు. దాని కోసం రెండు వైపుల నుంచి కృషి చేయాల్సి ఉంటుంది. అప్పుడే ప్రేమ అంటే ఏంటో దాని అనుభూతి ఏంటో తెలుస్తుంది. నా ప్రేమ పేరు శ్వేత. తనంటే నాకు చాలా ఇష్టం. ఎంత ఇష్టం అంటే ఎప్పుడూ తనని సంతోషంగా ఉంచడం కోసం ఏమి చేయాలి అని ఆలోచించే అంత. మేం చాలా తక్కువ సార్లే గొడవపడ్డాం. గొడవలు పడ్డ ప్రతిసారి మా ప్రేమ పెరుగుతూనే ఉంది. ఇద్దరం కలసి హ్యాపిగా ఉండటానికి రీజన్ ప్రతి విషయంలో ఇద్దరం కలసి ఉండటమే. తను నాకు ఏదైనా చెప్తే చాలు ఆలస్యం చేయకుండా వెంటనే ఆ పని చేస్తాను. అప్పుడు తన కళ్లల్లో కనిపించే ఆనందం నాకు చాలా ఇష్టం. ప్రతి రోజు ఉదయం తను చేసే ఫోన్ కాల్తోనే నా రోజు మొదలవుతుంది. కాల్ చేసిన ప్రతిసారి లవ్ యు చెప్పుకుంటాం. అలా చెప్పకపోతే అలగడంతోపాటు పన్షిమెంట్ కూడా ఉంటుంది. అది ఏంటంటే లవ్యు అని 50 సార్లు చెప్పాలి. ఇద్దరం ప్రతి విషయాన్ని మాట్లాడుకుంటాం. ఎంత మాట్లాడుకున్న ఏదో ఒక టాపిక్ ఇంకా మిగిలే ఉంటుంది. అందరిలాగే మా రిలేషన్షిప్లో కూడా బ్యాడ్ టైమ్స్ ఉన్నాయి. కానీ అవి చాలా తక్కువే ఉన్నాయి. ఏం జరిగినా మేం మాత్రం ఎప్పటికీ కలిసే ఉంటాము. తనని నేను పేరు పెట్టి పిలవను కానీ చాలా ముద్దు పేర్లతో పిలుస్తాను. ఇద్దరం ఒకరిని ఒకరం బాగా గారాబం చేస్తాము. మా ఇద్దరికి మొదటి నుంచి అలా సెట్ అయిపోయింది. ఆమె నా జీవితంలో ఉన్నందుకు నేను చాలా ఆనందంగా ఫీల్ అవుతున్నాను. మా లైఫ్‌లో ఎప్పటికీ మర్చిపోలేని కొన్ని జ్ఞాపకాలు ఉన్నాయి. ఫస్ట్ టైమ్ తనతో కలసి బైక్ మీద లాంగ్ డ్రైవ్‌కు వెళ్లాను. అది నా జీవితంలో అందమైన క్షణం. రాత్రంతా తనతో కబుర్లు చెప్పుకొని హ్యాపిగా గడిపాము. ఇంకోసారి కార్ అద్దెకు తీసుకొని లాంగ్ డ్రైవ్‌కు వెళ్లి ఎంజాయ్ చేశాము. ఆ తరువాత తనంటే ఇంకా ఇష్టం పెరిగిపోయింది. మా ఇద్దరి కులాలు వేరు. మా ఇంట్లో ఏ ప్రాబ్లెమ్ లేదు. కానీ వాళ్లింట్లోనే ప్రాబ్లెమ్ అవుతుందని తను చెబుతుంది. ఎలా అయిన వాళ్లింట్లో ఒప్పించి తనని పెళ్లి చేసుకోగలను అనే నమ్మకం నాకుంది. లవ్‌లో పడిన తరువాత ప్రేమ అంటే ఇద్దరు కలసి ఒకే మైండ్‌సెట్‌లోకి రావడం అనే విషయం నాకు అర్థం అయ్యింది. మేమిద్దరం మేడ్ ఫర్ ఈచ్ అదర్. పేరు చెప్పలేదు. -
ఇట్లు నీ వెంకట్!
నా పేరు వెంకట్. తన పేరు లక్కీ. సోషల్ మీడియా ద్వారా లక్కీ నాకు పరిచయం అయ్యింది. రోజు చాట్ చేసుకుంటూ ఇద్దరం బాగా దగ్గరయ్యాము. అన్ని విషయాలు షేర్ చేసుకునేవాళ్లం. తనతో మాట్లాడుతుంటే నాకు చాలా ఆనందంగా ఉండేది. తన ఆలోచనా విధానం, మాట్లాడే పద్దతి నాకు చాలా నచ్చేది. ఇంతకు ముందు ఎంత మందితో కలగని ఫీలింగ్ ఆమెతో మాట్లాడుతుంటే కలిగేది. ఎందుకో నాకు తన పైన ఉన్నది ప్రేమ అనిపించి ఒక రోజు తనకి ప్రపోజ్ చేశాను. దానికి తను పాజిటివ్‌గానే స్సందించింది. కానీ తన ఫ్యామిలీకి ఇష్టమైతేనే పెళ్లి చేసుకుంటాను అని చెప్పింది. నా మనసులో ఉన్న మాటనే తను కూడా చెప్పింది. నేను ఎలా అయితే తన మీద ప్రేమ పెంచుకున్నానో తను కూడా అలానే నా మీద ప్రేమ పెంచుకుంది. మేమిద్దరం పరిచయమయ్యి 2 సంవత్సరాలు అవుతుంది. కానీ మేం ఇద్దరం ఇప్పటి వరకు కలుసుకోలేదు. ఒక్కరోజు కూడా మాట్లాడుకోకుండా ఉండలేము. ప్రస్తుతం మేము జాబ్ కోసం చదువు మీద శ్రద్ద పెట్టాము. జాబ్ రాగానే మా విషయం ఇంట్లో చెబుదాం అనుకుంటున్నాం. మా ప్రేమను పెద్దలు ఒప్పుకొని పెళ్లి చేస్తారని ఆశిస్తున్నాను. ఇట్లు వెంకట్ లక్కీ(వరంగల్) -
అర్జున్ ప్రేమ కథకు మా పాటల పల్లవి
ప్రేమలో పడినపుడు పాటలు పాడుకుంటాం.ఆ పాటల్లో మనం ప్రేమించిన వారిని ఊహించుకుంటూ ప్రేమ లోకంలో విహరిస్తాం. అలాంటి పాటలతో మీ మొత్తం ప్రేమ కథను చెప్తే ఎలా ఉంటుంది. ఐడియా అదిరిపోయింది కదా! ప్రేమ కథ మీది.. దాన్ని రాసేదీ మీరే... కానీ దానికి బాణీలు జోడించి మరింత అందంగా చేసేది మాత్రం మేము. అర్జున్ కథను పాటలతో జోడించి చిన్న సినిమా రూపంలో చేసిన వీడియోను చూడండి. -
ప్రేమ ఎంత మధురం
-
నిశ్చల ప్రేమ కథా చిత్రం
ప్రేమ కథలు భారీగా ఉండక్కర్లేదు. కొన్ని కరిగిపోయే ఐస్‌క్రీమ్‌లా ఉంటాయి. కొన్ని ఎక్కడ తిన్నామో మర్చిపోయి రుచి మాత్రం మిగిలిపోయే స్ట్రీట్ ఫుడ్‌లా ఉంటాయి. కొన్ని గుంపులో మనం అనుకోకుండా క్లిక్ చేసిన ఫొటోగ్రాఫ్లా ఉంటాయి. ఫొటోలో ఉన్న అమ్మాయి నిజ జీవితంలో దొరుకుతుందని ఆశ పడటం ప్రేమకు బాగుంటుంది కాని వాస్తవానికి కాదు. ‘ఫొటోగ్రాఫ్’ సినిమా ఒక ఫొటోగ్రాఫర్‌కి, ఫొటోలోని అమ్మాయికి మధ్య నడిచే ప్రేమ కథ. ‘రఫీ... దాదీ (నానమ్మ) మందులేసుకోవడం మానేసిందట. నిజమేనా?’ అడుగుతాడు బస్తీలోని బడ్డీకొట్టు యజమాని.‘రఫీభాయ్.. మీ దాదీకి బాగలేదట?’ అంటాడు పక్కింటాయన.‘ఏ రఫీ.. దాదీ విషయం ఏదో వింటున్నాను..?’ ఆరా తీస్తాడు స్నేహితుడు!‘ఏంటీ.. ఉత్తరప్రదేశ్‌లోని మా ఊళ్లో ఉన్న దాదీ సంగతి అప్పుడే ముంబైదాకా పాకిందా?’ రఫీ మనసులో ఆశ్చర్యం.దాదీ సమస్యకు పరిష్కారం వెదికాడు. తను ‘నూరీ’ అనే అమ్మాయితో ప్రేమలో పడ్డట్టు దాదీకి ఓ ఉత్తరం రాశాడు. ఆ అమ్మాయి ఫోటోనూ జత చేసి జాబు పోస్ట్ చేశాడు. ‘పిల్ల చందమామ తునకరా! చూడ్డానికి వస్తున్నా’ అంటూ ప్రత్యుత్తరం కన్నా ముందే ముంబైకి వచ్చేసింది దాదీ.అసలు కథ ఇక్కడ నుంచి సాగే ఈ సినిమా పేరు ‘ఫోటోగ్రాఫ్’. దర్శకుడు రితేష్ బత్రా. ‘లంచ్ బాక్స్’ సినిమాను తీసి గుర్తింపు పొందిన దర్శకుడు ఇతడే. అయితే లంచ్‌బాక్స్‌ను దృష్టిలో పెట్టుకోకుండా ఫోటోగ్రాఫ్‌ను చూడండి. మీకు నచ్చుతుంది. అమేజాన్ ప్రైమ్‌లో స్ట్రీమ్ అవుతోంది. సాన్యా మల్హోత్రా (దంగల్, పటాకా, బధాయీ హో ఫేమ్), నవాజుద్దీన్ సిద్ధిఖీ, ఫరూఖ్ జఫర్, గీతాంజలీ కులకర్ణి ముఖ్య పాత్రలు. పాజ్ ఆఫ్.. ప్లే ఆన్ అయితే రఫీ చెప్పిన నూరీ ఎవరు? వాస్తవానికి ‘నూరీ’ గేట్ వే ఆఫ్ ఇండియా దగ్గర కనిపించిన అమ్మాయికి రఫీ పెట్టుకున్న పేరు. ఆమె ఒరిజినల్ పేరు మిలోని (సాన్యా మల్హోత్రా). గుజరాతీ, అప్పర్ మిడిల్‌క్లాస్ అమ్మాయి. సీఏ ఇంటర్ చదువుతూంటుంది. టాప్ స్టూడెంట్. ఒకరోజు కుటుంబంతో కలిసి షాపింగ్ వెళ్లిన మిలోని గేట్ వే ఆఫ్ ఇండియా దగ్గర ఇన్స్టంట్ ఫోటోగ్రాఫ్స్ తీసిపెట్టే రఫీ (నవాజుద్దీన్ సిద్దిఖీ)కి కనపడుతుంది. ఆమెకు ఫొటో తీసుకోవాలని ఉండదు. కాని ఆమెను కన్విన్స్ చేసి ఫోటో తీస్తాడు. ఆ ఫోటోగ్రాఫ్ తీసుకొని డబ్బు చెల్లించే లోపే తల్లి పిలవడంతో మిలోని వెళ్లిపోతుంది. ఆ రోజే రఫీకి వాళ్ల దాదీ నుంచి కొత్త బెదిరింపు ఎదురవుతోంది. తను బతికుండగానే రఫీ పెళ్లి చూడాలని.. అల్లా కరుణిస్తే.. రఫీ పిల్లలతో ఆడుకోవాలనీ ఆమె ఆశ. రఫీకేమో ఇప్పుడప్పుడే పెళ్లి ఆలోచన ఉండదు. ఊర్లో చేసిన అప్పు తీరాక.. ఆర్థికంగా కాస్త స్థిరపడ్డాక.. అంటే సొంతంగా ఓ వ్యాపారం మొదలుపెట్టిగాని పెళ్లి జోలికి వెళ్లొద్దు అనుకుంటాడు. అందుకే దాదీ మాటను లెక్కచేయడు. దాంతో దాదీ (ఫరూఖ్ జఫర్) రకరకాల హెచ్చరికలు, బెదిరింపులకు పాల్పడుతూ ఉంటుంది. ఊరి నుంచి అతడు నివాసం ఉండే ప్రాంతంలోని ఇరుగుపొరుగు వారికి తెలిసేలా గోల చేస్తుంటుంది. మనవడు పెళ్లికి ఒప్పుకునేదాకా మందులు వేసుకోవడం మానేస్తుంది. ఆ బెదిరింపుకి విరుగుడుగా రఫీ ఆడిన అబద్ధమే అనుకోకుండా కనిపించిన మిలోనీని తను ప్రేమించిన ‘నూరీ’గా ఉత్తరం ద్వారా దాదీకి పరిచయం చేయడం. ఆ అమ్మాయిని చూడ్డానికి వస్తాను అని దాదీ అనేసరికి ఆ అబద్ధాన్ని నిజంలా నటించే ప్రమాదం రఫీ నెత్తిన పడుతుంది. సెర్చింగ్‌లో.. కనీసం పేరు కూడా తెలియని మిలోనీని ఎలా వెదకాలి అనే ఆలోచనల్లో పడ్తాడు రఫీ. సిటీబస్‌లో వెళ్తుంటే ఓ చోట ఓ పెద్ద హోర్డింగ్ కనపడ్తుంది. ఆత్రంగా వెనక్కి తిరిగి మరీ చూస్తాడు. ఆ అమ్మాయే! తర్వాత స్టాప్‌లో దిగిపోయి గబగబా ఆ హోర్డింగ్ ఉన్న చోటికి వస్తాడు. అదో సీఏ కోచింగ్ ఇన్స్టిట్యూట్. టాప్ స్టూడెంట్ అయిన మిలోని ఫోటోతో పబ్లిసిటీ కోసం పెట్టిన హోర్డింగ్ అది. దాని ఆధారంగా ఆమెను వెతుక్కుంటూ వెళతాడు. కాసేపటికి మిలోనీ దర్శనమిస్తుంది. రఫీ మొహం విప్పారుతుంది. బస్‌లో కలిసే ప్రయాణం చేస్తారు. తర్వాత రోజూ ఆమెను కలుస్తాడు. విషయం వివరిస్తాడు. దాదీ ఆగమనం.. మిలోని మితభాషి. యాక్టర్ కావాలనుకుంటుంది. సీఏ కావాలని తండ్రి డిసైడ్ చేస్తాడు. మారు మాట్లాడకుండా సీఏలో చేరుతుంది. ఆ అమ్మాయి వేసుకునే బట్టలను వాళ్లమ్మ సెలెక్ట్ చేస్తుంది. తనకి ఇష్టమైనవి కాకపోయినా ఒప్పేసుకుంటుంది. అలా మిలోని మనసు విప్పి మాట్లాడే సందర్భాలను ఆ ఇంట్లో చాలా తక్కువగా కల్పిస్తుంటారు. అన్నిటికీ అన్నిటినీ పెద్దవాళ్లే నిర్ణయిస్తారు. ఆ అమ్మాయి ఫాలో అవుతుంది. అలాంటి మిలోని దాది దగ్గర గలగలా మాట్లాడుతుంది. రఫీ దాదీని పరిచయం చేశాక ‘మీరెలా కలిశారు?’ అని అడుగుతుంది దాదీ. గేట్ ఆఫ్ ఇండియా దగ్గర అని నిజమే చెప్తుంది. మీ కుటుంబం? అన్న ప్రశ్నకే అతికే అబద్ధాన్ని సెకన్లలో అవలీలగా అల్లేస్తుంది. ‘మా అమ్మానాన్న.. మస్జిద్ గోడ కూలి చనిపోయారు. అక్కా, బావల దగ్గర పెరిగాను. హాస్టల్లో ఉండి చదువుకుంటున్నాను’’ అని. ఆశ్చర్యపోతాడు రఫీ. అలా దాదీతో మాట్లాడ్డం, ఆమెతో ముంబైలో తిరగడాన్ని చాలా ఇష్టపడ్తుంది మిలోని. ఇంట్లో దొరకని సాన్నిహిత్యం, ప్రేమ, స్వేచ్ఛ ఆమె దగ్గర పొందుతున్నట్టు ఫీలవుతుంది. రఫీ బాల్యం గురించి చెప్తూ ఉంటుంది దాదీ. వింటూ ఎంజాయ్ చేస్తుంది మిలోని. సోల్‌మేట్స్.. దాదాపు రోజూ క్లాసెస్ అయిపోగానే లేదంటే కొన్ని క్లాసెస్ డుమ్మా కొట్టి మరీ దాదీని కలుస్తూ ఉంటుంది మిలోని. తెలియకుండానే రఫీ, మిలోని ఒకరి సాంగత్యాన్ని ఒకరు ఇష్టపడుతూ ఉంటారు. ఆ అమ్మాయిని సినిమాకు తీసుకెళ్తాడు. అతనితో తన బాల్య జ్ఞాపకాలను నెమరువేసుకుంటుంది. తనెలా ఉండాలని కోరుకుంటుందో అలా ఉంటూంటుంది రఫీ దగ్గర. అయినా తామిద్దరి మధ్యా ఉన్న మతం, డబ్బు అంతరాన్ని ఓ పక్క గుర్తు చేసుకుంటూనే ఉంటుంటాడు రఫీ. ఇంకోవైపు ఆమె బాయ్ప్రెండ్లా ప్రొటెక్టివ్గానూ ప్రవర్తిస్తుంటాడు. దాదీ స్ట్రీట్‌ఫుడ్ (ఐస్‌ఫ్రూట్ లాంటిది) ఇప్పిస్తున్నప్పుడు ‘వద్దు.. ఆమెకు జలుబు చేస్తుంది. అసలే పరీక్షలు. జబ్బు పడితే కష్టం’ అనే మిషతో ఆ ఐస్‌ఫ్రూట్‌ను మిలోని తిననివ్వకుండా రఫి చేసే ప్రయత్నం మొదటి విషయంలో భాగమైతే మిలోని కోచింగ్ ఇన్స్టిట్యూట్లోని ఫ్యాకల్టీ ఆ అమ్మాయి పట్ల చనువుగా బిహేవ్ చేస్తుంటే మిలోనీని అక్కడి నుంచి తీసుకెళ్లడం రెండో విషయానికి ఉదాహరణ. మొత్తానికి ఇద్దరికీ ఒకరి పట్ల ఒకరికి ఇష్టం అయితే ఉంటుంది. కాని ప్రకటించుకోరు. సోల్మేట్స్లా బిహేవ్ చేస్తారు. పెళ్లి చూపులు.. ఇంకోపక్క మిలోనికి పెళ్లి సంబంధం వస్తుంది. వరుడు విదేశాల్లో డాక్టర్. ఇంట్లో వాళ్లకు నచ్చుతాడు. మిలోని సమ్మతి మాట వరుసకే. అబ్బాయిని కలవమని చెప్తారు ఇంట్లో వాళ్లు. ఓ రెస్టరెంట్లో కలుస్తుంది. ఇష్టాయిష్టాలు తెలుసుకునే క్రమంలో ‘నీకు ఎక్కడ ఉండాలని ఉంది? ఇండియాలోనా? అబ్రాడ్లోనా?’ అంటాడు పెళ్లికొడుకు.‘ఇండియాలోని పల్లెటూళ్లో’ అని సమాధానమిస్తుంది మిలోని.అవాక్కవుతాడు అబ్బాయి.‘పల్లెటూళ్లోనా? అక్కడ ఏం చేస్తావ్?’ అడుగుతాడు అదే విస్మయాన్ని కంటిన్యూ చేస్తూ.‘ఆ స్వచ్ఛమైన గాలి పీల్చుకుంటూ పొలాల్లో పనిచేస్తూ ప్రశాంతంగా ఉంటా’ చెప్తుంది మిలోని.ఏడ్వలేక నవ్వుతాడు అబ్బాయి అయోమయంగా. అతణ్ణి కలిశాననిపించుకొని క్లాస్ ఉందని వెంటనే రఫీ దగ్గరకు వెళ్తుంది మిలోని. రఫీ దాదీ ఆ ఇద్దరి పెళ్లి ఏర్పాట్లకు సన్నద్ధమవుతుంది. ‘ఆ అమ్మాయి ఇంకా చదువుకోవాలి.. ఇప్పుడప్పుడే కాదు’’అని దాటవేసేందుకు ట్రై చేస్తాడు రఫీ. నిజానికి అతనికీ మనసులో మిలోని జీవితభాగస్వామి అయితే బాగుండు అనే బలంగా అనిపిస్తూంటుంది. ఆమెతో సమం కావాలంటే ఆ స్ట్రీట్ ఫోటోగ్రాఫర్ పనికి స్వస్తి పలక వల్సిందే అనుకుంటాడు. వ్యాపారం మొదలుపెట్టాలి ఏం వ్యాపారం? అనే తలపుతోనే ఆ రాత్రి నిద్రపోతాడు. ఫ్యాన్‌కి ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్న తన ఇంటి యజమాని కనిపిస్తాడు. తనలా కూల్‌డ్రింక్ ఫ్యాక్టరీ పెట్టుకోమని సలహా ఇచ్చి వెళ్లిపోతాడు. నిద్రలేస్తాడు. ఆ వ్యాపారం ఆరంభించాలనే నిశ్చయానికి వస్తాడు. ఆ రోజు మిలోనితో మళ్లీ సినిమాకు వెళ్తాడు. మధ్యలోనే బయటకు వచ్చేస్తుంది మిలోని. వెంట రఫీ వచ్చి.. ‘సినిమా నచ్చలేదా?’ అడుగుతాడు. ‘అన్నీ ఒకేరకంగా ఉంటున్నాయి. మీకు బోర్ కొట్టదా?’ అని తిరిగి ప్రశ్నిస్తుంది. ఇక్కడితో ఈ సినిమాకు ఎండ్ టైటిల్స్!సినిమాలన్నీ ఒకే రకంగా ఉంటాయో.. ఉండవో.. చూసే వాళ్ల పర్సెప్షన్! ప్రేమ కథలూ అన్నీ ఒకే రకంగా అనిపిస్తాయా లేదా అన్నది కూడా పాఠకుల, వీక్షకుల దృక్పథాన్ని బట్టే! ఈ ఫోటోగ్రాఫ్ కూడా అంతే! అందుకే కాబోలు.. ఈ స్టోరీ ముగింపును ప్రేక్షకులకు వదిలేశాడు దర్శకుడు.బహుశా రఫీ కూడా ఆమెకు కొన్నాళ్లకు బోర్ కొడతాడా? ఫొటో తీసిన లిప్తకాలం పాటు నిలబడి జారిపోయే ప్రేమకథా ఇది? కెమెరా ఉన్నంత మాత్రాన ఫిల్మ్‌లో బంధించే ప్రతీది ఫొటోగ్రాఫర్ సొంతమవదు కదా అని చెప్పదలుచుకున్నాడా... అది ఒక్కొక్కరు ఒక్కోవిధంగా ఊహించుకోవాలి. ఒక నిశ్చల ప్రేమ కథా చిత్రం ‘ఫొటోగ్రాఫ్’. – సరస్వతి రమ -
ప్రేమమ్.... ఓ మధుర సంతకం
ప్రేమకథలకు ముగింపు ఉంటుంది గానీ, అనుభూతులకు కాదు. అందుకే ప్రేమకథల్లోని అనుభూతులు ప్రేక్షకుల మనోఫలకాలపై చెరగని ముద్ర వేస్తాయి. అలాంటి ప్రేమకథా చిత్రమే - ‘ప్రేమమ్’. రెండు అక్షరాల ప్రేమ ఓ యువకుని హృదయంలో రేపిన అందమైన అలజడే కథాంశంగా తెరకెక్కిన ఈ మలయాళ చిత్రం తెలుగులో రీమేక్ అవుతున్న విషయం తెలిసిందే. నాగచైతన్య హీరోగా చందూ మొండేటి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రానికి తెలుగులో కూడా చివరకు ‘ప్రేమమ్’ అనే టైటిల్‌నే ఖరారు చేశారు. సితార సినిమా పతాకంపై సూర్యదేవర నాగవంశీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. చందూ మొండేటి మాట్లాడుతూ- ‘‘ఈ చిత్రానికి ‘లవ్‌స్టోరీస్ ఎండ్... ఫీలింగ్స్ డోన్ట్...’ అనేది ఉపశీర్షిక. నాగచైతన్య పాత్ర ఇందులో మూడు వైవిధ్యమైన పార్శ్వాలతో సాగుతూ ఆసక్తి కలిగిస్తుంది. శ్రుతీహాసన్, అనుపమా పరమేశ్వరన్, మడొన్నా సెబాస్టియన్ లు ఈ చిత్రంలో కథానాయికలుగా బాగా సూట్ అయ్యారు. ఇక్కడి నేటివిటీకి తగ్గట్టుగా మార్పులు చేశాం’’ అని తెలిపారు. ఈ చిత్రానికి ఛాయాగ్రహణం: కార్తీక్ ఘట్టమనేని, సంగీతం: గోపీసుందర్, రాజేశ్ మురుగేశన్, సమర్పణ: పీడీవీ ప్రసాద్. -
ఆమె అతణ్ణి పెళ్లాడాలనుకుంది
లవ్ స్టోరీ ప్రేమ కథలు స్ట్రేంజ్‌గా ఉంటాయి. డాన్సర్‌గా, నటిగా, కమెడియన్‌గా సుదీర్ఘమైన ప్రస్థానం కొనసాగించిన అరుణ ఇరానీ కూడా ఒకసారి ప్రేమలో పడింది. పడటమే కాదు పెళ్లాడాలని అనుకుంది కూడా. ఎవర్నో తెలుసా? క్యారెక్టర్ యాక్టర్ శ్రీరాం లాగూను. ఆయన మరాఠి నాటక రంగ దిగ్గజం. అంతే కాదు, సినీ రంగంలో పెద్దమనిషి. అరుణ ఇరానీ ఆయన మీద మనసు పారేసుకుంది. నోరు తెరిచి పెళ్లి చేసుకోమంది. ఆయన కంగారు పడి అరుణ పేరెత్తితే చుట్టుపక్కల లేకుండా వెళ్లిపోయేవాడు. పాపం అని అరుణ వదిలేసింది. అరుణ జీవితంలో చాలామంది పురుషులు తారసపడ్డారు. కమెడియన్ మెహమూద్‌ను ఆమె పెళ్లాడిందని, వాళ్లిద్దరూ కలిసి జీవిస్తున్నారని మీడియా కథనాలు రాసింది. వాళ్ల పోబడి కూడా అలాగే ఉండేది. వాళ్లిద్దరూ కలిసి చాలా సినిమాల్లో నటించారు. ఎవరు ఎవరిని ఉపయోగించుకున్నారో చెప్పడం కష్టం. కాని కుటుంబాన్ని నిలబెట్టడానికి అరుణ చాలా కష్టాలు పడింది. ఆమెకు ఏమాత్రం డాన్స్ రాదు. కాని డాన్సర్‌గా ఉంటూ క్లబ్సాంగ్స్కు గంతులేసే అమ్మాయిలకు డిమాండ్ ఉందని తెలిసి నేర్చుకుంది. ‘బాబీ’లో ‘మై షాయర్ తో నహీ’ పాటకు డాన్స్ చేయడంతో ఆమె ఎక్కువమంది ప్రేక్షకులకు తెలిసింది. అరుణకు ఇప్పుడు దాదాపు 70 ఏళ్లు. కాని సినిమాల్లోనూ టీవీల్లోనూ నేటికీ రెండు షిఫ్ట్‌లు పని చేస్తోంది. దర్శకుడు ఇంద్రకుమార్ (దిల్, బేటా ఫేమ్) ఈమె సోదరుడే.