
నేను పీజీ చదువుతున్న రోజుల్లో కీర్తిని (పేరు మార్చాం) ప్రేమించాను. ఆర్నెళ్లు తన చుట్టూ తిరిగాను. నా గురించి వాళ్ల ఫ్రెండ్స్ ఏం చెప్పారో తెలియదు కానీ నన్ను పట్టించుకోవడం మానేసింది. అప్పుడు అడిగా..ఎందుకిలా చేస్తున్నావ్ అని. నాకు ఇవన్నీ ఇష్టంలేదు, నాతో మాట్లాడకు అంది. నా ఫ్రెండ్స్ అందరితో బాగానే మాట్లాడేది. నాతో మాత్రం అస్సలు మాట్లాడకుండా, నేను మాట్లాడినా పట్టించుకునేది కాదు. చాలా బాధపడ్డా. ఇంక తనని డిస్రబ్ చేయోద్దని డిసైడ్ అయ్యా. మా ఫైనల్ ఇయర్ ఎగ్జామ్స్ వచ్చాయ్. తర్వాత బెంగుళూరులో మంచి కంపెనీలో నాకు ఉద్యోగం దొరికింది.
ఓరోజు ఏదో అన్‌నౌన్ నెంబర్ నుంచి కాల్ వచ్చింది. ఎవరా అని ఫోన్ తీశా. కీర్తి అంది. ఒక్క క్షణం ఏం మాట్లాడలేక నా గొంతు మూగబోయింది. అప్పుడు ఎందుకు మాట్లాడలేదు అని అడిగా. భయం వేసింది, కాలేజీలో ఎవరైనా ఏమైనా అనుకుంటారేమో అని చెప్పింది. మరి ఇప్పుడు భయం లేదా అని అడిగా. లేదు అంది. అలా మాటలు పెరిగాయి. నా ప్రేమ మళ్లీ నాకు దగ్గరైందనుకొని చాలా సంతోషించా. ప్రతీరోజు కీర్తితో మాట్లాడకుండా నారోజు మొదలయ్యేది కాదు. ఇంతలో ఏమైందో ఏమో తెలీదు కానీ పది రోజుల నుంచి కీర్తి నుంచి ఫోన్ లేదు. నేను కాల్ చేస్తే..ఇంకోసారి నాకు ఫోన్ చేయకు, నేను నీతో మాట్లాడను అని చెప్పింది. అసలు ఏం అయ్యిందో, కీర్తి ఎందుకు ఇలా చేస్తుందో అర్థం కావడం లేదు. తన ఆలోచనల నుంచి దూరంగా బెంగుళూరులో ఉద్యోగం చేసుకుంటూ నా మానాన నేనుంటే తనే పలకరించింది. మనసుల మధ్య దూరాన్ని తన మాటలతో దగ్గరయ్యేలా చేసింది. ఇప్పుడు తను లేకుండా నేనుండలేను అనుకునేలా తనకి అడిక్ట్ అయ్యా. మళ్లీ నాకు దుఃఖాన్ని మిగిల్చి ఒంటరి చేశావా కీర్తి...
నాగేశ్ (పలమనేరు)
Comments
Please login to add a commentAdd a comment