List Of Upcoming Love Story Movies Of Tollywood In 2023, Deets Inside - Sakshi
Sakshi News home page

పడతారండి ప్రేమలో మళ్లీ..!

Published Fri, Jun 16 2023 3:57 AM | Last Updated on Fri, Jun 16 2023 9:27 AM

Upcoming love story movies Tollywood 2023 - Sakshi

నిన్నమొన్నటివరకూ పాన్‌ ఇండియా ట్రెండ్‌లో యాక్షన్‌ సినిమాలొచ్చాయి. అయితే ఇప్పుడు ఇండస్ట్రీలో మళ్లీ లవ్‌ట్రెండ్‌ మొదలైంది. యాక్షన్‌ సినిమాలు చేస్తున్న హీరోలు మళ్లీ వెండితెరపై ప్రేమలో పడటానికి ప్రేమకథలు వింటున్నారు. కొందరి ప్రేమకథలు ఆల్రెడీ ఆన్‌ సెట్స్‌లో ఉన్నాయి. ఈ వెండితెర ప్రేమికుల ప్రేమకథా చిత్రాల గురించి తెలుసుకుందాం.

► ప్రభాస్‌ అనగానే సినిమా లవర్స్‌ ఎక్కువగా ‘బాహుబలి’, ‘ఛత్రపతి’, ‘మిర్చి’, ‘సాహో’ వంటి యాక్షన్‌ మూవీస్‌ గురించి మాట్లాడుకుంటారు. కాగా ప్రభాస్‌ కెరీర్‌లో మంచి హిట్స్‌ సాధించిన ‘వర్షం’, ‘డార్లింగ్‌’, ‘మిస్టర్‌ పర్‌ఫెక్ట్‌’ వంటి ప్రేమకథా చిత్రాలు కూడా ఉన్నాయి. అయితే గడచిన పదేళ్లల్లో ప్రభాస్‌ ‘రాధేశ్యామ్‌’ (2022) తప్ప అన్నీ యాక్షన్‌ చిత్రాలే చేశారు. ప్రస్తుతం ‘సలార్‌’,
‘ప్రాజెక్ట్‌ కె’ సినిమాలతో యాక్షన్‌ మోడ్‌లోనే ఉన్నారు. మళ్లీ ఓ ప్రేమక£ý  చేయాలని ప్రభాస్‌ భావిస్తున్నారట. ఇందులో భాగంగా లవ్‌ స్టోరీస్‌ స్పెషలిస్ట్‌ డైరెక్టర్‌ హను రాఘవపూడి రెడీ చేసిన ఓ ప్రేమ కథను ప్రభాస్‌ విన్నారని, ఇది పీరియాడికల్‌ లవ్‌స్టోరీ అనీ సమాచారం.

► ‘100 పర్సెంట్‌ లవ్‌’, ‘ఏ మాయ చేసావె’, ‘మనం’ , ‘ఒక లైలా కోసం’, ‘ప్రేమమ్‌’, ‘మజిలీ’, ‘లవ్‌స్టోరీ’.... ఇలా చెప్పుకుంటూ పోతే నాగచైతన్య కెరీర్‌లోని మేజర్‌ పార్ట్‌ అంతా ప్రేమతోనే నిండిపోయి ఉంటుంది. కాగా తన గత చిత్రం ‘కస్టడీ’లో నాగ చైతన్య ఎక్కువగా యాక్షన్‌ చేశారు. అయితే చైతూ తన ప్రేమతో మరోసారి ఆడియన్స్‌ను ప్రేమలో పడేయనున్నారని తెలుస్తోంది. నాగచైతన్య హీరోగా చందు మొండేటి దర్శకత్వంలో ఓ సినిమా రూపొందనుంది. సూరత్‌ బ్యాక్‌డ్రాప్‌తో సాగే ఓ లవ్‌స్టోరీగా ఈ చిత్రం తెరకెక్కనుందని, ఇందులో నాగచైతన్య బోటు డ్రైవర్‌ పాత్ర చేయనునున్నారనీ టాక్‌.  

► హీరో విజయ్‌ దేవరకొండ కెరీర్‌లో ప్రేమ, మాస్‌ కథలు సమానంగా కనిపిస్తాయి. కానీ విజయ్‌కు ఇండస్ట్రీలో మంచి గుర్తింపును తెచ్చిపెట్టింది మాత్రం మాస్‌ లవ్‌స్టోరీ ‘అర్జున్‌రెడ్డి’, క్లాస్‌ లవ్‌స్టోరీస్‌ ‘పెళ్ళి చూపులు’, ‘గీతగోవిందం’ వంటి సినిమాలే. దీంతో విజయ్‌ మరోసారి లవ్‌స్టోరీస్‌పై ఫోకస్‌ పెట్టినట్లు ఉన్నారు.   దర్శకుడు శివ నిర్వాణతో విజయ్‌ ప్రస్తుతం ‘ఖుషి’ అనే లవ్‌స్టోరీ చేస్తున్నారు. ఇందులో సమంత హీరోయిన్‌. అలాగే ‘గీత గోవిందం’ తర్వాత దర్శకుడు పరశురామ్‌తో మరో సినిమా చేస్తున్నారు విజయ్‌. ఇది కూడా ప్రేమకథా చిత్రమేనన్నది ఫిల్మ్‌నగర్‌ టాక్‌.  

► ‘డీజే టిల్లు’తో మరింత పాపులారిటీని సాధించిన సిద్ధు జొన్నలగడ్డ కెరీర్‌లో ‘కృష్ణ అండ్‌ హిజ్‌ లీల’, ‘మా వింత గాథ వినుమా’ వంటి ప్రేమకథా చిత్రాలు ఉన్నాయి. ప్రస్తుతం సిద్ధు ‘డీజే టిల్లు స్క్వేర్‌’తో బిజీగా ఉన్నారు. అలాగే దర్శకురాలు నందినీ రెడ్డితో ఓ సినిమా కమిట్‌ అయ్యారు. ఓ డిఫరెంట్‌ లవ్‌స్టోరీగా ఈ చిత్రం తెరకెక్కనుందని టాక్‌.

► ‘దొరసాని’ వంటి ప్రేమకథతో పరిచయం అయిన ఆనంద్‌ దేవరకొండ ఆ తర్వాత ‘హైవే’ వంటి క్రైమ్‌ థ్రిల్లర్‌ చేశారు. ఆనంద్‌ నటించిన మరో లవ్‌స్టోరీ ‘బేబీ’. ప్రేమకథా చిత్రంగా సాయిరాజేష్‌ తెరకెక్కించిన ఈ చిత్రం జూలై 14న రిలీజ్‌ కానుంది. మరికొందరు  హీరోలు కూడా ఆడియన్స్‌ను ప్రేమలో పడేసేందుకు ప్రేమకథలు వింటున్నట్లు తెలుస్తోంది.       

► ‘హలో’, ‘మిస్టర్‌ మజ్ను’,  ‘మోస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచ్‌లర్‌’... ఇలా కొన్ని ప్రేమకథల్లో నటించారు అఖిల్‌. అయితే అఖిల్‌ గత చిత్రం ‘ఏజెంట్‌’ ఫుల్‌ యాక్షన్‌ ఫిల్మ్‌. దీంతో తన తర్వాతి చిత్రాన్ని లవ్‌ జానర్‌లోనే చేయాలనుకుంటున్నారట అఖిల్‌. ఈ క్రమంలోనే అనిల్‌కుమార్‌ అనే ఓ కొత్త దర్శకుడి కథకు అఖిల్‌ గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చారనీ, ఫ్యాంటసీ లవ్‌స్టోరీ బ్యాక్‌ డ్రాప్‌లో ఈ సినిమా కథనం ఉంటుందని, ‘ధీర’ టైటిల్‌ను పరిశీలిస్తున్నారనీ టాక్‌.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement