టాలీవుడ్‌లో ప్రేమ కథలకు మంచి ఆదరణ ఉంటుంది. కొంచెం కొత్తగా ప్రేమ కథను చెబితే చాలు ఆ సినిమాకు ప్రేక్షకులు బ్రహ్మరథం పడతారు. అందుకే మన దర్శకనిర్మాతలు లవ్‌స్టోరీలకు అతి ప్రాధాన్యత ఇస్తారు. హీరోలు సైతం తొలుత లవ్‌స్టోరీలు చేయడానికే ఇష్టపడతారు. ఆ తర్వాత కొంతకాలానికి మాస్ ఇమేజ్‌ని కోరుకుంటారు. ఆ తరహా సినిమాలు వర్కౌట్ అయితే సరే, ఏ మాత్రం తేడా కొట్టినా.. ఉన్న ఇమేజ్ డ్యామేజ్ అవుతుంది. దాని నుంచి తేరుకునేందుకు మళ్లీ ప్రేమ బాట పడతారు. ప్రస్తుతం టాలీవుడ్ చెందిన కొంతమంది హీరోలు అదే పని చేస్తున్నారు. యాక్షన్‌ని నో చెప్పి ప్రేమలో మునిగితేలుతున్నారు. వరుసగా లవ్‌స్టోరీలు చేస్తూ బీజీగా ఉన్న హీరోలపై ఓ లుక్కేద్దాం.
ప్యార్‌కి సై అంటున్న విజయ్
‘లైగర్’తో పాన్ ఇండియా స్టార్ అయ్యాడు విజయ్ దేవరకొండ. కానీ ఆ సినిమా మాత్రం బాక్సాఫీస్ వద్ద దారుణంగా బోల్తా పడింది. దీంతో విజయ్ యాక్షన్‌కి రాం రాం చెప్పాడు. హిట్ అందుకునేందుకు మళ్లీ ‘గీత గోవిందం’ పార్మెట్‌లోకి వెళ్లి పోయాడు. శివ నిర్మాణతో కలిసి ‘ఖుషి’ సినిమా చేస్తున్నాడు. సమంత హీరోయిన్. సెప్టెంబర్ 1న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా తర్వాత కూడా విజయ్ మరో ప్రేమ కథా చిత్రంతోనే ప్రేక్షకులను పలకరించనున్నాడు. గీత గోవిందం దర్శకుడు పరశురాంతో విజయ్ ఓ సినిమా చేస్తున్నాడు. ఇది కూడా లవ్‌స్టోరీనే. గీత గోవిందం చిత్రానికి ఇది సీక్వెల్. ఇలా విజయ్ యాక్షన్‌కి నో చెప్పి ఫ్యార్‌కి సై అంటున్నాడు.
మరోసారి ప్రేమలో పడ్డ డీజే టిల్లు
ప్రేమలో పడడమే పనిగా పెట్టుకున్నాడు సిద్దు జొన్నలగడ్డ. డీజే టిల్లుతో సూపర్ హిట్ కొట్టిన ఈ యంగ్ హీరో త్వరలోనే ఈ చిత్రం సీక్వెల్ ‘టిల్లు స్క్వేర్’తో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇది కూడా లవ్ స్టోరీనే. ఈ చిత్రం నుంచి విడుదలైన ఫస్ట్ సింగిల్ చూస్తే ఆ విషయం ఇట్టే అర్థమవుతుంది. ఇక ఈ చిత్రం తర్వాత కూడా మళ్లీ లవ్‌స్టోరీలోనే కనిపించబోతున్నాడు ఈ టిల్లుగాడు. బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో సిద్దు ఓ సినిమా చేస్తున్నాడు. ఇది పూర్తి ప్రేమ కథా చిత్రమని తెలుస్తోంది.
ఫేవరెట్ జానర్‌లోకి చైతూ రీఎంట్రీ
మొదట్లో వరుసగా లవ్‌స్టోరీలు చేస్తూ లవర్ బాయ్‌గా ముద్ర వేసుకున్నాడు నాగ చైతన్య. ఆ ముద్ర నుంచి బయట పడేందుకు మధ్య మధ్యలో యాక్షన్ చిత్రాలు చేశాడు. కానీ అవేవి హిట్ కాలేదు. అయినప్పటికీ యాక్షన్‌ని వీడలేదు. కానీ ఆ మధ్య విడుదలైన ‘కస్టడీ’ చైతు కల్లు తెరిపించింది. విడుదలైన తొలి రోజే డిజాస్టర్ టాక్ వచ్చింది. దీంతో చై మళ్లీ తన ఫేవరెట్ జానర్‌లోకి తిరిగి వచ్చాడు.
ప్రేమమ్ డైరెక్టర్ చందు మొండేటితో కలిసి త్వరలోనే పాన్ ఇండియా స్థాయిలో లవ్‌స్టోరీ చేయబోతున్నాడు. దానికి సంబంధించిన ప్రీప్రొడక్షన్ వర్క్ ఈ మధ్యే స్టార్ట్ అయింది. ఈ చిత్రంలో నాగచైతన్యకు జోడీగా కీర్తి సురేశ్ నటించబోతున్నట్లు సమాచారం. ఇలా మొత్తానికి టాలీవుడ్ యంగ్ హీరోలంతా మళ్లీ లవ్‌స్టోరీలు చేస్తూ ప్రేమలో మునిగిపోతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment