
నాకు ఆ అమ్మాయి కావాలి ,కానీ వాళ్ళ నాన్నకి ఆ అమ్మాయిని నెలకు 3 లక్షల సంపాదించే వాడికి ఇచ్చి పెళ్లి చేయాలి అని ఉంది. మేమిద్దరం ప్రేమించుకున్నాం. కలిసి బ్రతకాలి అంటే కులం అడ్డు కాకపోయినా నువ్వు చేసే ఉద్యోగం మా నాన్నకు నచ్చదు. ప్రేమించడం వరకు ఐతే నా చేతిలో ఉంది కానీ, పెళ్లి చేసుకోవడం మాత్రం మా నాన్న గారు ఏం చెప్తే అదే చేస్తాను అని చెప్పి తను వెళ్ళిపోయింది.
చాలా తేలికగా నన్ను ఇక నుంచి గుర్తుకు తెచ్చుకొని బాధ పడకుండా ఇంత కంటే మంచి ఉద్యోగం చూసుకొని, మంచి అమ్మాయిని చూసి పెళ్లి చేసుకో అని కూడా చెప్పింది. వెతికితే మంచి అమ్మాయి, నచ్చిన ఉద్యోగం వస్తుంది ఏమో కానీ నువ్వు నా లైఫ్ లో ఉండవు కదా బుజ్జి. అప్పుడు అర్ధమయ్యింది మధ్య తరగతి అబ్బాయిలు గొప్పగా డబ్బు ఉన్న వాళ్ళని ప్రేమించకూడదు అని. నేనింకా నీ కోసమే వేచి చూస్తున్న బుజ్జి మనిషి ప్రేమ కంటే నెలకి 3 లక్షలు తెచ్చే వాడు అవసరం లేదు అని నువ్వు తెలుసుకొని నా దగ్గరకు వస్తావు అని.
ఇట్లు
నీ శివ
Comments
Please login to add a commentAdd a comment