ఐ హేట్‌ యూ అని చెప్పాను! | Nellore boy Sai success Love story | Sakshi
Sakshi News home page

ఆమె నాకు కాల్‌ చేసింది!

Published Thu, Jan 23 2020 3:15 PM | Last Updated on Thu, Jan 23 2020 3:26 PM

Nellore boy Sai  success Love story - Sakshi

నా పేరు సాయి. బిజినెస్‌ కారణంగా మేము నెల్లూరులో సెటిల్‌ అయ్యాం. మా ఫ్రెండ్స్‌ అందరం కలసి ఒకసారి అరకు టూర్‌కు వైజాగ్‌ వెళ్లాము. అక్కడ నాకు ఒక అమ్మాయి పరిచయం అయ్యింది. అం‍దరు అరకు అందాలను చూస్తుంటే నేను మాత్రం ఆ అమ్మాయిని చూస్తూ ఉండే వాడిని. ఆమె కూడా నన్ను గమనిస్తూ ఉండేది. ఆమె నన్ను చూసిన ప్రతిసారి నేను నా ముఖాన్ని పక్కకు తిప్పేసే వాడిని. ఒకసారి నేను ఆమెతో మాట్లాడి మీ పేరేంటి అని అడిగాను. ఆమె చెప్పలేదు. ఎలాగో కష్టపడి వాళ్ల ఫ్రెండ్స్‌ను అడిగి ఆమె పేరు అనిత అని తెలుసుకున్నాను. ఆ రోజు అంతా బాగా ఎంజాయ్‌ చేసి రూమ్‌కు వచ్చాము. సరిగ్గా 10 గంటలకు నా ఫోన్‌కు ఒక కొత్త నంబర్‌ నుంచి ఫోన్‌ వచ్చింది. నేను కాల్‌లిఫ్ట్‌ చేసి ఎవరు అని అడిగాను. తను నేను ఎవరో నీకు తెలియదా అని అడిగింది.తెలీదు అన్నాను. సరిగా ఆలోచించు అంది. కొద్దిగా ఆలోచించాక అనిత అని అన్నాను. నీకెలా తెలుసు నా పేరు అని అడిగింది. ఎలాగో తెలుసులే అన్నాను. తనని నేను నా నంబర్‌ నీకు ఎలా తెలుసు అని అడిగాను. తను కూడా ఎలాగో తెలుసుకున్నాలే అంది. సరేలే ఎందుకు కాల్‌ చేశారు అని అడిగాను. తను ఊరికే కాల్‌ చేశాను అని చెప్పింది. నేను వెంటనే ఫోన్‌ కట్‌ చేశాను. తను మళ్లీ కాల్‌ చేసింది. నేను కట్‌ చేశాను. తను తరువాత కూడా వెంటనే కాల్‌ చేయండంతో ఏంటి కాల్‌ చేస్తున్నారు అని అడిగాను. తను ఎందుకు కట్‌ చేస్తున్నారు అని అడిగింది. ఉరికే అన్నావుగా అందుకే చేస్తున్నాను అని చెప్పాను. తనకి కోపం వచ్చింది. నేను సారీ సారీ అని చెప్పాను. తను మేమే రేపు ఆర్‌కే బీచ్‌కు వెళ్తున్నాం. మీరు కూడా వస్తారా అని అడిగింది. నేను మా ఫ్రెండ్స్‌ వస్తానంటే వస్తాను అని చెప్పాను. వచ్చేటట్లయితే ఈ నెంబర్‌కు ఉదయం 6 గంటలకు ఫోన్‌ చేయండి అని చెప్పింది. 

మా ఫ్రెండ్స్‌ కూడా వాళ్ల ఫ్రెండ్స్‌లో కొందరిని ఇష్టపడటం వల్ల బీచ్‌కు వెళ్లడానికి ఒప్పుకున్నారు. మేము బాగా ఎంజాయ్‌ చేశాము.మేమిద్దరం చాలా చోట్లకు తిరిగాము. నాలుగు రోజుల తరువాత మేమింకా ఊరికి బయలుదేరాము. తను నా దగ్గరకు వచ్చి నేను వెళ్తున్నాను అని చెప్పింది.నేను వెళ్లు అని చెప్పాను. తను సరే వెళ్తున్నా అని కోపంగా చెప్పింది. నేను నీతో ఒకటి చెప్పాలి అన్నాను. ఏంటి అని కోపంగానే అడిగింది. నేను ఐ హేట్‌ యూ అని చెప్పాను.తను షాక్‌ తిన్నట్టు ఏంటి అని అడిగింది. నేనేం చేశాను అని అంది.నేను ఇన్ని రోజులు నీ వల్లే హ్యాపీగా ఉన్నాను ఇప్పుడు నువ్వు వెళ్లిపోతుంటే ఏం చెప్పాలి అని అన్నాను. నువ్వేగా వెళ్లిపో అన్నావు అంది.నేను మరి నేను ఉండమంటే ఉంటావా అని అన్నాను. తను ఉండలేనుగా ట్రైన్‌ టైమ్‌ అవుతుంది అని వెళ్లిపోయింది.తరువాత కాల్‌ చేస్తాను అని చెప్పింది. 

కానీ తను తరువాత కాల్‌ చేయలేదు. నేను అందరమ్మాయిలు లాగా తను కూడా అని అనుకున్నాను. తరవాత చాలారోజులకు  ఆమె కొత్త నంబర్‌ నుంచి కాల్‌ చేసింది. నేను ఎవరు అని అడిగాను. నేను అనితను అంది.నేను ఇప్పటికీ గుర్తొచ్చానా నీకు అని అడిగాను. తను ఫోన్‌ పోయిందని కాలేజీలో బిజీగా ఉండటం వల్ల చేయలేదు అని చెప్పింది. తను కటక్‌లో కాలేజీ జాయిన్‌ అయ్యానని చెప్పింది. అప్పటి నుంచి మేం ఎప్పుడూ కలుస్తూ సినిమాలకు, పార్క్‌లకు అన్ని చోట్లకు తిరిగే వాళ్లం. అలా మేం ఒకరిని ఒకరం మా ప్రేమను చెప్పుకున్నాం. 

తరువాత తను మా ప్రేమ విషయం వాళ్ల ఇంట్లో చెప్పేసింది. నేను కూడా మా ఇంట్లో చెప్పాను. కాస్ట్‌లు ఒకటే కావడంతో కొంచెం లేటుగా అయిన మా ఇంట్లో ఒప్పుకున్నారు. రెండు నెలల్లో మా పెళ్లి జరిగింది. ఇవన్నీ నా జీవితంలో మర్చిపోలేని విషయాలు. లవ్‌ యూ అనిత. 

సాయి(నెల్లూరు). 
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement