హాయ్ నా పేరు రాజు.నేను హైదరాబాద్ లో ఉంటాను. 2006లో అనుకోకుండా ఒక పని వల్ల నెల రోజులు వేరే ఊరు వెళ్లాల్సి వచ్చింది.అంతా బాగానే ఉంది 15 రోజులు చాలా తొందరగా గడిచి పోయాయి. నేను పని చేసే ఇంటి పక్కన ఒక అమ్మాయికి నాకు అసలు పడేది కాదు. ప్రతీ విషయంలో నాతో గొడవపడేది. నేను కూడా అలాగే ప్రవర్తించేవాడిని. నేను స్వతహాగా డ్యాన్సర్‌ని. పని అయిపోయాక డాన్స్ చేయడం అలవాటు. తను ఉండే ఊర్లో ఒక పండగ వచ్చింది. వాళ్ల ఇళ్లంత బంధువులతో నిండి పోయింది . ప్రతీ రోజూలాగే ఆ రోజు కూడా నేను డాన్స్ చేస్తున్నా...తన బంధువులు అనుకోకుండా నేను డాన్స్ చేస్తుంటే చూడటానికి వచ్చారు. వాళ్లతో పాటు తను కూడా వచ్చింది. వాళ్లంతా నన్ను మళ్లీ డాన్స్ చేయమని అడిగారు సరే అని నేను చేశాను. ఎప్పుడూ నాతో గొడవ పడే ఆ అమ్మాయి నా డాన్స్ చూసి హ్యాపీగా ఫీల్ అయ్యింది. తన బంధువులు కూడా నాతో చాలా బాగుంది అని చెప్పారు.
ఏమయ్యిందో తెలియదు కానీ తరువాత రోజు నుంచి తను నన్ను చూసి నవ్వేది. నేను కూడా నవ్వే వాడిని. అది లవ్ అని తెలియడానికి ఎక్కువ సమయం పట్టలేదు. అలా అనుకోకుండా మా ప్రేమ కథ స్టార్ అయ్యింది. డైలీ తను నాకు ఒకచిన్న పిల్లాడికి అమ్మ లాగ అన్నం కలిపి పెట్టేది. అలా మిగతా 15రోజులు అయిపోయాయి. నేను తిరిగి హైదరాబాద్ వెళ్లిపోవాలి. అప్పుడు తను చాలా ఏడ్చింది. నేను కూడా ఏడ్చాను. మా ఇద్దరి కులాలు వేరే. ఒకసారి వాళ్ల అమ్మని వేరే విధంగా అడిగాను మీ అమ్మాయి కి పెళ్లికి ఎలాంటి వాడు కావాలి అని. తను వాళ్ల కులం తప్ప వేరే చేయను అని చెప్పింది. తను నేను లేకుండా ఉండలేను అని చెప్పింది.మ హైదరాబాద్ వెళ్లిన తరువాత మా ఇంట్లో విషయం చెప్పాను. సరే అన్నారు.
మా బ్రదర్ తప్ప ఇంట్లో అందరూ మా పెళ్లికి ఒప్పుకున్నారు. అప్పుడు నా ఫ్రెండ్స్ నాకు తనకు శంషాబాద్ సిద్దుల గుట్ట శివాలయంలో పెళ్లి చేయడనికి అంతా రెడీ చేశారు. తను బస్ ఎక్కే టైంకి వాళ్ల బ్రదర్ పట్టుకున్నాడు. ఆమె రాలేకపోయింది. నేను నా ఫ్రెండ్స్ కలసి తనని ఇంట్లో నుంచి తీసుకువద్దమని వాళ్ల ఊరు వెళ్లాం. అప్పుడు వాళ్ల బ్రదర్ మా లవ్ గురించి వాళ్ల ఇంట్లో చెప్పాడు. గొడవ స్టార్ట్ అయింది. నేను వెళ్ళిపోయాను. తరువాత మా అన్న నాకు వేరే పెళ్లి ఫిక్స్ చేశాడు. వద్దు అని చెప్పినా వినలేదు.ఎంగేజ్‌మెంట్ అయ్యింది. తను నాకు కాల్ చేసి చాలా ఏడ్చింది. నేను కూడా చాలా ఏడ్చాను. నాకు వేరే పెళ్లి అయ్యింది. కానీ నాకు మాత్రం తను ప్రతి క్షణం గుర్తుకు వస్తోంది. తన కోసం మళ్లీ వాళ్ల ఇంటికి వెళ్లాను.
కానీ తనతో మాట్లడలేదు.మళ్లీ ఇంకోసారి తన కాలేజీకి వెళ్లాను. కానీ ప్రయోజనం లేదు. 2009లో తనకి పెళ్లి అయ్యింది. అప్పటి నుంచి తనని చూడలేదు. తరువాత అనుకోకుండా ఒక రోజు తన ఫోన్ నంబర్ దొరికింది . తన నంబర్‌కు ఫోన్ చేశాను.తన నుంచి ఎలాంటి సమాధానం లేదు. నా నంబర్ బ్లాక్ చేసింది. తను హ్యాపీగా ఉంది అని తెలిసింది. నేను హ్యాపీగా ఫీల్ అయ్యాను. .అనుకోకుండా మళ్లీ తను నాకు మెసేజ్ చేసింది. తను కూడా నేను ఎలా ఉన్నాను అని తెలుసుకోవడానికి ఫోన్ చేసింది..అప్పుడప్పుడు ఫోన్ చేసి ఎందుకు వదిలేసి పోయవురా అన్నప్పుడు నాకు చనిపోయిన ఫీలింగ్ కలుగుతుంది. నేను కోరుకునేది ఒక్కటే నా వల్ల తనకు ఎలాంటి ఇబ్బంది రాకూడదు, రావద్దు అని. అందుకే నేను తనకు ఎలాంటి మెసేజ్ కానీ ఫోన్ కానీ చేయను. తను చేస్తే తప్పకుండా సమాధానం ఇస్తాను.జీవితాంతం నీకు ఎలాంటి ప్రాబ్లెమ్ వచ్చిన నేను నీకు తోడుగా ఉంటాను. త్వరలో నీ పేరుతో ఒక అనాధాశ్రమం పెట్టాలని కోరిక ఉంది. తప్పకుండా పెడతాను. ఎక్కడున్న నువ్వు హ్యాపీగా ఉంటే చాలమ్మ.
ఇట్లు,
నీ రాజు
Comments
Please login to add a commentAdd a comment