
నా పేరు ఈశ్వర్. నేను 8 సంవత్సరాల నుంచి ఒక అమ్మాయిను ప్రాణానికి ప్రాణంగా ప్రేమిస్తున్నాను. ఆమె మా బంధుల అమ్మాయే. కానీ తనతో నా ప్రేమ విషయం చెప్పాలి అంటే చాలా భయం వేసేది. తను ఎక్కడ బాధ పడుతుందో అని నా ప్రేమ విషయం చాలా రోజులు తనకి చెప్పలేదు. ఇంకా ఆలస్యం చేస్తే మంచిది కాదు అనుకొని ఒకరోజు ధైర్యం చేసి ఆమెకు నా మనసులోని మాటను చెప్పుశాను.
కానీ తనకి నేనంటే ఇష్టం లేదని అప్పుడే నాకు అర్థం అయ్యింది. బంధువులు కాబట్టి పెద్దగా గోల చేయలేదు. నేనంటే ఇష్టం లేదు అని చెప్పినా నేను మాత్రం తనని మర్చిపోలేకపోతున్నాను. ఎప్పుడూ తనే గుర్తుకు వస్తుంది. నా ప్రేమ నాకు పూర్తి నమ్మకం ఉంది. ఎప్పటికైనా తనే స్వయంగా నాకోసం వస్తుందనే నమ్మకం నాకుంది. తన కోసం ఎప్పటికీ ఎదురుచూస్తూనే ఉంటా...
ఈశ్వర్ కుమార్ (గుంటూరు).
Comments
Please login to add a commentAdd a comment