
వాట్సాప్ మెసేజ్‌తో ప్రారంభమైంది మా పరిచయం. తన పేరు లత (పేరు మార్చాం). మా కజిన్ ద్వారా తను నాకు పరిచయమైంది. వాట్సాప్‌లో తన డీపీ చూడగానే ప్రేమలో పడిపోయా. లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అంటే అదేనేమో అనిపించింది. అలా మొదలైన మా పరిచయంలో ప్రతిరోజూ కాల్స్, మెసేజ్‌లు తప్పనిసరి అయ్యాయి. మా ప్రేమ గురించి మా పేరేంట్స్‌తో చెప్పాను. తనని తప్పా ఇంకెవరినీ పెళ్లిచేసుకోనని చెప్పాను. వాళ్లు నా ప్రేమను అంగీకరించారు. లత వాళ్లింట్లో వాళ్లతో కూడా మాట్లాడటానికి వెళ్లారు. కానీ వారు మా పెళ్లికి ససేమిరా అన్నారు. నేను కూడా చాలా ప్రయత్నించాను. కానీ వారు ఒప్పుకోలేదు.
ఇక లాభం లేదనకుకొని బయటికి వెళ్లి పెళ్లిచేసుకుందాం అంది లత. కానీ కొంచెం టైం తీసుకొని వాళ్లని ఒప్పిద్దాం అని నేను దానికి ఒప్పుకోలేదు. కొన్ని రోజుల తర్వాత ఏమైందో ఏమో కానీ తన నుంచి కాల్స్, మెసేజ్‌లు ఆగిపోయాయి. నేను ఎన్నిసార్లు కాల్ చేసినా రెస్పాండ్ అయ్యేది కాదు. వారం తర్వాత తన నుంచి కాల్ వచ్చింది. నాకు ఎంగేజ్‌మెంట్ ఫిక్స్ అయ్యింది అని నా గుండెల్లో బాంబ్ పేల్చి తను మాత్రం చాలా కూల్‌గా చెప్పింది. ఆ క్షణం నాకేమీ అర్థం కాలేదు. తనను కన్విన్స్ చేయడానికి చాలా ప్రయత్నించా. కానీ తను నా మాట వినలేదు. కొన్ని రోజులకు తనకి ఎంగేజ్‌మెంట్ కూడా జరిగింది. అప్పట్నుంచి నెంబర్ కూడా మార్చేసింది.
లతని కలవడానికి ఏ అవకాశం ఉండేది కాదు. డైరెక్ట్‌గా వాళ్లింటికి వెళ్తే వాళ్ల పేరేంట్స్ నన్ను లతతో మాట్లాడనివ్వలేదు. ఏం జరిగింతో తెలీదు. అసలు నేను లేకపోతే ఉండలేను అని చెప్పిన లత..ఇప్పడు ఇలా మాట మార్చడానికి కారణం ఏముంటుంది? వాళ్ల పేరేంట్స్ తనని అంతలా మార్చేశారా? నేను కాకుండా ఇంకొకరితో తను నిజంగా సంతోషంగా ఉండగలదా? నా గురించి ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా ఎంగేజ్‌మెంట్ ఎలా చేసుకుంది? కానీ లత..ఇప్పటికీ నా మనసు నిన్నే కోరుకుంటుంది. నీ ప్రేమలోంచి బయటకు రాలేను. నువ్వు నాకోసం వస్తావని ఎదురుచూస్తున్నా.
--శ్రీకాంత్ రెడ్డి (వైఎస్సార్ జిల్లా)
Comments
Please login to add a commentAdd a comment