తనని మొదటిసారి డిగ్రీ ఫస్ట్ ఇయర్‌లో చూశాను. చూడగానే నచ్చేసింది. రోజు తనని అలాగే చూస్తూ ఉండేవాడిని. తను లాస్ట్ బెంచ్‌లో కూర్చునేది. నేను కూడా అలాగే కుర్చునేవాడిని. 2 సంవత్సరాలు అలాగే గడిచిపోయాయి. ఒకసారి ధైర్యం చేసి మా ఫ్రెండ్‌కు చెప్పి పంపాను. తను ఒకసారి నా వైపు చూసింది. రెండు రోజుల తరువాత పిలిచి నువ్వే కదా రోజు నాకు ఫోన్ చేసేది అని అడిగింది. నేను కాదు అని చెప్పాను. అదే ఫస్ట్ టైమ్ నేను తనతో మాట్లాడింది. ఆ తరువాత 2,3 సార్లు మాట్లాడాను. డిగ్రీ చివరి ఎగ్జామ్స్ రోజు గుడిలో నాతో మాట్లాడతాను అని తన ఫ్రెండ్ ద్వారా నాకు చెప్పించింది.
ఆ రోజు వెళ్లే సరికి తను వెళ్లి పోయింది. తననే అదే చివరిసారి చూశాను. ఆ తరువాత నేను బస్టాండ్‌లో ఉన్నప్పుడు తను కోచింగ్‌కు వెళుతూ ఒకసారి కనిపించింది. తను నన్ను చూసి నవ్వింది. రెండు రోజుల తరువాత తనకి కాల్ చేశాను. తన నంబర్ నా దగ్గర ఉన్న నేను ఎప్పుడూ తనకి కాల్ చేయలేదు. నేను ఫోన్ చేసినప్పుడు తను నాతో చాలా మంచిగా మాట్లాడింది. అలా ఆరోజు నుంచి రోజు ఫోన్‌లో మాట్లాడుకునే వాళ్లం. మూడు సంవత్సరాలు ఫోన్‌లో మాట్లాడుకున్నాం. కానీ ఎప్పుడు తనని కలవలేదు. నేను తనని చాలా నిజాయితీగా ప్రేమిస్తున్నాను అనే విషయాన్ని ఆమె నమ్మింది.
కొన్ని రోజుల తరువాత పెళ్లి విషయం వచ్చింది. ఆమె వాళ్ల ఫ్యామిలీ చూపించిన అబ్బాయినే చేసుకుంటాను, ఇంట్లో వాళ్లని మోసం చేయలేను అని చెప్పింది. నేను కూడా ఆలోచించాను. తన ఇష్టానికి నేను కూడా ఓకే చెప్పాను. ఫ్రెండ్స్ లాగా ఉందామని డిసైడ్ అయ్యాం. తనకి పెళ్లి ఫిక్స్ అయ్యింది. నన్ను మిస్ అవుతున్నాను అని చెప్పింది. నేను కూడా అదే ఫీల్ అవుతున్నాను. ఇప్పటికీ నువ్వంటే ఇష్టమే. ఇప్పటి వరకు నీ పక్కన కూర్చోని మాట్లాడలేకపోయాను అని ఒక బాధ. మిస్ యు.
పేరు చెప్పలేదు(కామారెడ్డి).
Comments
Please login to add a commentAdd a comment