నేను జాబ్ చేసే టైంలో నాతో పాటు జాజ్ చేసే ఒక అమ్మాయి చాలా రోజులు నా వెంట పడింది. ప్రేమిస్తున్న అని చాలా కాలం నా కోసం ఎదురు చూసింది. నేను అంత తొందరగా ఆమె ప్రేమను ఒప్పుకోలేదు. కొన్ని రోజుల తర్వాత ఆమె ప్రేమలో నిజాయితీ చూసి ఒప్పుకున్నా. నాలుగు సంవత్సరాలు మా ప్రేమ ప్రయాణం సాగింది. ఆమెకు పెళ్లి సంబంధాలు చూస్తున్నారు అని పెళ్లి చేసుకుందాం అంది. నేను రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుందాం అన్నాను, ఆమె మాత్రం వాళ్ళ నాన్న ను ఓప్పించి చేసుకోవాలి అంది. అలా ఒప్పుకోరు పెళ్లి చేసుకున్నాక వాళ్లే ఒప్పుకుంటారు అన్నాను. అయినా ఆమె నా మాట వినలేదు.
ఇద్దరికి చాలా పెద్ద గొడవ అయ్యింది. ఇంట్లో ఎవరికీ తెలియకుండా నన్ను లవ్ చేశావు, పెళ్లి కి మాత్రం అందరూ ఒప్పుకోవాలి అనడం కరెక్ట్ కాదు అని నేను ఆమెతో విడిపోయాను. నేను మాత్రం మా నాన్న కి తెలియకుండా అసలు చేసుకొను అంది. అలా మేమిద్దరం విడిపోయాం. ఆమె మాత్రం పెళ్లి చేసుకొని హ్యాపీగా ఉంది. నేను మాత్రం ఆమె జ్ఞాపకాల నుంచి బయటకు రాలేకపోతున్నా. ఆమె వస్తుంది అని పెళ్లి చేసుకోకుండా ఒంటరిగా ఉంటున్నా. లవ్ చేసే ముందు గుర్తు రాని తల్లిదండ్రులు పెళ్లి చేసుకునే ముందు ఎందుకు గుర్తు వస్తారో నాకు అర్థం కాదు. ఇప్పటికీ ఫోన్ చేస్తోంది. పెళ్లి చేసుకో అని చెప్తుంది. నేను ఒకటే చెప్పా తనతో నువ్వు చేసిన మోసం నుంచే ఇంకా కోలుకోలేదు. ఇంకో అమ్మాయిని పెళ్లి చేసుకొని మోసం చేయలేను అని చెప్పాను.
కమల్(సికింద్రాబాద్).
Comments
Please login to add a commentAdd a comment