
తనకంటూ ప్రత్యేకమైన ప్రేమ కథలు లేవని చెప్పుకొచ్చింది నటి త్రిష. వరుసగా రెండు మూడు చిత్రాలు ఫ్లాప్ అయితే ఈ అమ్మడి పనైపోయింది అన్న పరిస్థితి ఒకప్పుడు ఉండేదేమోగానీ ఇప్పుడు లేదు. కొన్ని చిత్రాలు వరుసగా ఫ్లాప్ అయినా, ఆ తరువాత నటించిన ఒక్క చిత్రం హిట్ అయితే మళ్లీ ఫామ్‌లోకి వచ్చేస్తున్న పరిస్థితి ఇప్పుడు నెలకొంది. అందుకు ఉదాహరణ నటి త్రిషనే. ఈ చెన్నై చిన్నది 17 ఏళ్లుగా నటిస్తూ వస్తోంది. మధ్యలో చాలా ఒడిదొడుకులు ఎదుర్కొంది. ముఖ్యంగా 96 చిత్రానికి ముందు త్రిష మార్కెట్ చాలా డౌన్ అయిపోయ్యింది. తను నటించిన హీరోయిన్ సెంట్రిక్ కథా చిత్రాలు చాలా ఘోరంగా నిరాశ పరిచాయి. అలాంటి పరిస్థితుల్లో వచ్చిన చిత్రం 96. త్రిష విజయ్‌సేతుపతితో కలిసి నటించిన ఈ చిత్రం అనూహ్య విజయాన్ని సొంతం చేసుకుంది.
అంత విజయం సాధిస్తుందని త్రిషనే ఊహించలేదట. దీని గురించి ఒటీవల ఒక ఇంటర్వ్యూలో ఈ బ్యూటీ మాట్లాడుతూ 96 చిత్ర విజయం ఆశించనిదని చెప్పింది. అందులో తనది మంచి కథా పాత్ర అని తెలుసు అని చెప్పిది. అలాంటి కథా పాత్రతో కూడిన చిత్రాలను ఇంతకు ముందే చూశానని అంది.అలాంటి పాత్రలో తాను నటించిన చిత్రం అంతగా పేరు తెచ్చిపెడుతుందని ఊహించలేదని అంది. చిత్రం సక్సెస్ అవుతుందని, అందులోని రామ్, జాను కథాపాత్రల్లో ప్రేక్షకులు తమను చూసుకుంటారని భావించానని చెప్పింది. అయితే ఒక సాధారణ పసుపురంగు చుడీదార్ ధరించి నటించిన పాత్ర ఎంతగానో ఆదరించబడిందని అంది. అంత నిరాడంబర రూపంలో ఆ చిత్రంలో కనిపించానని పేర్కొంది. నిరాడంబరత ఎప్పుడూ ఆదరించబతుందని చెప్పింది.
అలా ఒకటి రెండు కథా పాత్రలు మ్యాజిక్‌గా నిలుస్తాయని అంది. ఇంతకు ముందు విన్నైతాండి వరువాయా చిత్రంలో జెస్సీ పాత్ర తరువాత ఈ 96 చిత్రంలో జాన్ పాత్రనే అలాంటి అద్భుతాన్ని చేశాయని చెప్పింది. ప్రేమ కథా చిత్రాలు ప్రేక్షకులను సులభంగా ఆకట్టుకుంటాయనుకుంటున్నానని అంది. నిజానికి తనకు పాఠశాలలో గానీ, కళాశాలలో గానీ ప్రేమ కథలు లేవని చెప్పింది. అయినా 96 చిత్రంలో ఏదో ఒక ఒకటి తన మనసును హత్తుకుందని త్రిష పేర్కొంది. అలా మొత్తం మీద 96, రజనీకాంత్‌తో జత కట్టిన పేట చిత్రాల తరువాత ఈ బ్యూటీ మళ్లీ పుల్ ఫామ్‌లోకి వచ్చేసింది. ఇప్పుడు చేతి నిండా చిత్రాలతో బిజీగా ఉంది.
Comments
Please login to add a commentAdd a comment