నా పేరు అఖిల. నాకు 16 సంవత్సరాల వయస్సు ఉన్నప్పుడు మా ఫ్యామిలీ ఫ్రెండ్ అయిన ఒక అబ్బాయి ఫ్రెండ్ అయ్యాడు. తరువాత మా స్నేహం ప్రేమగా మారింది. తను నన్ను చాలా ఇష్టపడేవాడు. ఎంతలా అంటే నేను లేకుండా ఒక్క క్షణం కూడా ఉండలేకపోయేవాడు. మా విషయం మా ఇళ్లలో తెలిసింది. తరువాత మేం ఒక సంవత్సరం మాట్లాడుకోలేదు. తరువాత ఒకరోజు తనే కాల్ చేశాడు. ఈ సంవత్సరం మేం దూరంగా ఉన్నామే కానీ ఒకరినొకరం మర్చిపోలేదు. మేం అప్పుడప్పుడు మాట్లాడుకునేవాళ్లం. తరువాత మా మధ్య కొంచెం గ్యాప్ వచ్చింది. 5 సంవత్సరాల తరువాత వాళ్ల ఫ్రెండ్స్ ద్వారా నంబర్ తీసుకొని తనతో మాట్లాడాను. తను అంతగా మాట్లాడలేదు అనిపించింది. తరువాత 10 రోజుకు తనే నాకు ఫోన్ చేసి బాగా మాట్లాడాడు. తనతో మాట్లాడుతుంటే నాకు ప్రపంచమే తెలియదు. తను నన్ను అంత బాగా చూసుకుంటాడు.
వాళ్ల అమ్మ మా ప్రేమను ఒప్పుకోరు అని తను చెప్పాడు. నాకు తన కోసం లైఫ్ లాంగ్ ఎదురుచూడాలనుంది. కానీ నాకు మా ఇంట్లో మ్యాచ్‌లు చూస్తున్నారు. ఇంత లవ్ చేసే అబ్బాయి దొరకడు అని నాకు తెలుసు. కానీ ఇంట్లో వాళ్ల కోసం తప్పడం లేదు. తన కోసం ఎదురు చూస్తూ ఉండాలని ఉన్నా తప్పదు. మనం ఒకటి అనుకుంటే లైఫ్‌లో మరొకటి జరుగుతుంది. నేను ఎప్పటికీ తనని తప్పుపట్టను. వాళ్ల పేరెంట్స్ మీద ఉన్న గౌరవంతో ఇలా చేస్తున్నాడు. చూడాలి నా జీవితం ఎలా ఉండబోతుందో. వచ్చే జన్మలో అయినా నీ లవర్‌గా నీ భార్యగా పుట్టాలని కోరుకుంటున్నాను.
అఖిల(హైదరాబాద్)
Comments
Please login to add a commentAdd a comment