
నా పేరు రియా. తన పేరు నోబి. మేమిద్దరం నాలుగు సంవత్సరాల నుంచి ప్రేమించుకుంటున్నాం. నేను తను ఒకే కాలేజీలో బీటెక్ చేశాము. ఫస్ట్‌ఈయర్ నుంచి నేను తనతో చాలా క్లోజ్‌గా మాట్లాడుతూ ఉండేదాన్ని. అన్ని విషయాలను తనతో షేర్ చేసుకునేదాన్ని. నా సంతోషాన్ని, బాధల్ని అన్నింటిని చాలా చక్కగా అర్ధం చేసుకొని ప్రతి విషయంలో నాకు తోడుగా ఉంటాడు నోబి. నన్ను ఎంతో ముద్దుగా చూసుకునే వాడు.
అతని కేరింగ్, నా మీద చూపిస్తున్న ప్రేమ చూసి తనని చాలా ఇష్టపడ్డాను. కానీ ఆ విషయం నోబికి చెప్పలేదు. తనకి కూడా నేనంటే ఇష్టం ఉండటంతో ఒకరోజు తనే నాకు ప్రపోజ్ చేశాడు. నాకు కూడా నోబి అంటే ఇష్టం ఉండటంతో ఎక్కువ టైమ్ తీసుకోకుండా ఆ తరువాత రోజే ఐ లవ్‌యూ టూచెప్పేశాను. అలా మేమిద్దరం మా బీటెక్ ముగిసేవరకు చాలా హ్యాపీగా గడిపాము. మా బీటెక్ అయిపోగానే తను జాబ్ కోసం వేరే ఊరు వెళ్లాడు. తను ప్రస్తుతం ఒక యమ్‌ఎన్‌సీ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు.
మా ఇంట్లో వాళ్లకు నేను జాబ్ చేయడం ఇష్టం లేదు. అందుకే బీటెక్ అవగానే నన్ను ఇంట్లోనే ఉంచి పెళ్లి సంబంధాలు చూస్తున్నారు. నాది నోబిది ఒకే కాస్ట్. కానీ నోబిని ప్రేమిస్తున్న విషయాన్ని ఇంట్లో చెప్పాలంటే చాలా భయంగా ఉంది. ధైర్యం సరిపోవడం లేదు. అలా అని తనని కాకుండా వేరే వాళ్లని చేసుకోలేను. తను లేకుండా నేను ఉండలేను. ఏం చేయాలో అర్ధం కావడం లేదు.
రియా( హైదరాబాద్)
Comments
Please login to add a commentAdd a comment