Sri Devi From Hyderabad | Rahul Still Loves Me? | Telugu Love Stories - Sakshi World of Love
Sakshi News home page

ఇప్పుటికీ తను నన్ను లవ్‌ చేస్తున్నాడా?

Published Wed, Mar 4 2020 4:20 PM | Last Updated on Thu, Mar 5 2020 12:48 PM

Hyderabad Girl Love Story - Sakshi

నా పేరు శ్రీదేవి. నేను చాలా యాక్టివ్‌.అందరితో ఇట్టే కలిసి పోతాను. తన పేరు రాహుల్‌. తను మా ఆఫీస్‌లోనే పనిచేస్తూ ఉంటాడు. కానీ తన డిపార్ట్‌మెంట్‌ వేరు మా డిపార్ట్‌మెంట్‌ వేరు. అప్పుడప్పుడు తను మా డిపార్ట్‌మెంట్‌ దగ్గరకు వచ్చేవాడు. చూడటానికి చాలా బాగుండే వాడు.  చాలా పొడవుగా ప్రభాస్‌లా ఉండేవాడు. కాకపోతే తను నాకు పూర్తి భిన్నంగా ఉండేవాడు. చాలా సైలెంట్‌గా ఎవరితో మాట్లాడేవాడు కాదు. తను నాతో ఒకేఒక్కసారి మాట్లాడాడు. తరువాత కొన్ని రోజులకు తను నన్ను నా ఫోన్‌ నంబర్‌ అడిగాడు. నేను ఎందుకు అడిగాడు అనుకుంటూనే ఇచ్చాను. తను ఫోన్‌ నంబర్‌ తీసుకున్న రోజే నాకు కాల్‌ చేశాడు. నేను ఆఫీస్‌లో చూసిన రాహుల్‌కు నేను మాట్లాడిన అతనికి సంబంధమే లేదు.

నాతో ఫోన్‌ మాట్లాడేటప్పుడు రాహుల్‌ చాలా యాక్టివ్‌గా మాట్లాడేవాడు. చాలా జోక్‌లు వేసేవాడు. తనకు కూడా సరదాగా ఉండటమంటే ఇష్టమని, కానీ అందరితో కలవలేనని చెప్పాడు. నేను చేసే అల్లరి తనకు చాలా ఇష్టమని చెప్పాడు. అలా రోజు మాట్లాడే రాహుల్‌ ఒక రోజు సడెన్‌గా నాకు ప్రపోజ్‌ చేశాడు. నాకు టైం కావాలి అని చెప్పాను. తరువాత కూడా రోజు కాల్‌ చేసి మాట్లాడుకునే వాళ్లం. చాలా రోజుల తరువాత తను మళ్లీ కాల్‌ చేసి నేను నీకు ఎందుకు నచ్చడం లేదు అని అడిగాడు.

నేను అదేం లేదు. నువ్వంటే ఇష్టమే కానీ అది ప్రేమ కాదు. గతంలో నాకు బ్రేకప్‌ అయ్యింది అని చెప్పాను. తరువాత నుంచి తను నన్ను ఇంకా బాగా చూసుకోవడం మొదలుపెట్టాడు. బాధ అనిపించినప్పుడల్లా తనతో చెప్పుకొని బాధపడేదాన్ని. చాలా సపోర్టివ్‌గా ఉండేవాడు. రోజు మాట్లాడుకుంటూనే ఉండే వాళ్లం. తను మళ్లీ ప్రేమ విషయం అడిగాడు. మాట్లాడటం అంటే ఇష్టం కానీ ప్రేమించలేను అని చెప్పాను. తను అప్పటి నుంచి నాతో మాట్లాడటం తగ్గించాడు. ఎందుకు మాట్లాడటం లేదు అని అడిగితే నీతో మాట్లాడుతూ ఉంటే నీ మీద ఇష్టం పెరిగిపోతుంది. నీకు దూరంగా ఉండలేకపోతున్నా అందుకే కావాలనే దూరంగా ఉంటున్నాను అని చెప్పాడు.

నేను కూడా అదే మంచిది కదా అని దూరంగా ఉన్నాను. తరువాత తనకి వేరే ఊర్లో ఉద్యోగం వచ్చి వెళ్లిపోయాడు. అప్పటి నుంచి నాకు అసలు కాల్‌ కానీ మెసేజ్‌ కానీ 
చేయడం లేదు. తను నాతో మాట్లాడకుండా ఉంటే తట్టుకోలేకపోతున్నాను. తను నాకు దూరంమవుతున్నాడు అంటే గుండె పిండేస్తున్నట్లుగా ఉంది. నాకు తను కావాలి అనిపిస్తోంది. ఇప్పుడు నేనేం చేయాలో అర్థం కావడం లేదు. ఫోన్‌ చేసి మాట్లాడితే అసలుఏం అంటాడో అర్థం కావడం లేదు. 

ఇట్లు
శ్రీదేవి (హైదరాబాద్‌)


 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement