నా పేరు రవి. మేము వైజాగ్‌లో ఉంటాం. మా స్కూల్‌లో రాధా అని ఒక అమ్మాయి ఉండేది.నాకెందుకో ఎప్పుడూ ఆ అమ్మాయితో మాట్లాడాలి అనిపిస్తూ ఉండేది. కానీ ఆ అమ్మాయి ఎవరితో మాట్లాడేది కాదు. చాలా సైలెంట్‌గా ఉండేది. కానీ చదువులో అన్నింటిలో ముందుండేది. చూడటానికి చాలా అందంగా కూడా ఉండేది. నేనే కాదు మా స్కూల్‌లో చాలా మంది ఆమె అంటే ఇష్టపడేవాళ్లు. ఆమె మాత్రం వాళ్లను ఎవరిని పట్టించుకునేది కాదు. నా మనసులో మాట చెప్తాదామని చాలా సార్లు అనుకున్నాను.కానీ ఎప్పుడూ ధైర్యం చాలలేదు. నేను తనకు నా ప్రేమ విషయం చెప్పకుండానే మా టెన్త్ క్లాస్ అయిపోయింది. ఇంటర్‌లో నేను వేరే కాలేజీ, తను వేరే కాలేజీలో చేరాం. కానీ నేనెప్పుడు తనని మర్చిపోలేదు. ఎవరిని చూసిన తనే గుర్తొచ్చేది.
ఆ రెండు సంవత్సరాలు నేను ఒక్కసారి కూడా తనని కలవలేదు. చూడలేదు. తరువాత అనుకోకుండా నేను తను బీటెక్‌లో ఒకే బ్రాండ్ ఒకే కాలేజ్‌లో జాయిన్ అయ్యాము. మా కాలేజీలో మొదటిసారి తనని చూసినప్పుడు నా ఆనందానికి అవధులు లేవు. తను నాకు రాసిపెట్టి ఉంది కాబట్టే మా కాలేజీలో చేరింది అనిపించింది. నా ప్రేమ కొత్త రెక్కలు తొడుక్కున్నట్లు, మళ్లీ చిగురించినట్లు ఎక్కడలేని ఆనందం ఏవేవో ఆలోచనలు.
ఎలాగైనా తనతో పరిచయం పెంచుకోవాలని , ప్రతి చిన్న విషయానికి తనతో మాట్లాడేవాడిని. నెమ్మదిగా తను కూడా నాతో మాట్లాడటం మొదలు పెట్టింది. ఇక చాటింగ్ స్టాట్ అయ్యింది. అక్కడి నుంచి ఫోన్లు మాట్లాడుకోవడం మొదలయ్యింది. తను నాతో క్లోజ్‌గా ఉంటుంది కదా అని నువ్వు ఎవరినైనా లవ్ చేశావా అని క్లారిటి కోసం అడిగాను. అప్పుడు తను చెప్పిన మాట విని నాకు గుండె ఆగినంత పని అయ్యింది. తను ఇంటర్‌లో ఉండగానే తన సీనియర్ ఒకతన్ని లవ్ చేశాను అని చెప్పింది. అతను ఎవరు అని తెలుసుకుంటే నాకు మరో షాక్ తగిలింది. అతను నాకు వరుసకు అన్నయ్య అవుతాడు. ఇక నాకు అంతా చీకటి అయిపోయినట్లు అనిపించింది. నెమ్మది నెమ్మదిగా తనకి దూరంగా ఉంటూ వచ్చాను. ఇక తనని మర్చిపోవాలని బీటెక్ అయిపోగానే యమ్ ఎస్ చేయడానికి అమెరికా వెళ్లిపోయాను. తన ఆలోచనలను పూర్తిగా తీసేయాలి అనుకున్నాను. నెమ్మది నెమ్మదిగా తనని మర్చిపోతున్నాను. తను ఎప్పుడూ హ్యాపీగా ఉండాలి అని కోరుకుంటున్నాను.
రవి (వైజాగ్).
Comments
Please login to add a commentAdd a comment