ప్రేమ ప్రతి ఒక్కరి జీవితంలో తీపిని నింపుతుంది. కానీ నా జీవితంలో మాత్రం అది విషాన్ని మిగిల్చింది. ఎప్పుడు నవ్వుతూ ఉండే నా పెదాలపై ఆ నవ్వునే లేకుండా చేసింది రెండక్షరాల ప్రేమ. నేను ప్రేమించిన అమ్మాయి పేరు శ్రావ్య. పేరుకు తగ్గట్టుగానే వినసొంపైన గొంతు, అందమైన రూపం ఆమెది. ఎన్నో ఆశలతో లైఫ్‌ను ఎంజాయ్ చేయెచ్చని ఒక ఆఫీస్‌లో చేరాను. ఆ ఆఫీస్‌లో పనిలో ఒత్తిడి లేకపోయినా కలరింగ్ లేక లైఫ్ చాలా బోర్ కొడుతూ ఉండేది. అలాంటి టైంలో నేను ఉదయం ఆఫీస్‌కు వచ్చే టైంకు నాకు ఒక విషయం తెలిసింది. కొత్తగా ట్రైనింగ్ పూర్తి చేసుకున్న ఒక ఐదుగురు అమ్మాయిలు మా డెస్క్‌లో చేరారు అని. వెంటనే వాళ్లని చూడాలనిపించి వాళ్ల కోసం ఎదురుచూశాను. సరిగ్దా ఉదయం 10 గంటలు కాగానే వాళ్లు డెస్క్‌లో అడుగు పెట్టారు. అందరూ బాగానే ఉన్నారు. కానీ అందులో నలుపు రంగు డ్రెస్‌లో ఉండి హెయిర్ లీవ్ చేసుకున్న ఉన్న అమ్మాయి నాకు బాగా నచ్చింది. చాలా సేపు ఆమె గురించే ఆలోచిస్తూ ఉండిపోయాను.
కొత్తగా రావడంతో వాళ్లు ఒక్కక్కరి దగ్గర ఒక్కో విషయం నేర్చుకుంటూ ఉన్నారు. నా దగ్గరకు ఎప్పుడు వస్తుందా తను అని చాలా రోజులు ఎదురు చూశాను. ఇంకా ఏం చేయాలో తెలియక తను నా కొలిగ్ దగ్గర డౌట్ కోసం వెళితే నా దగ్గరకు పంపియ్యమని రిక్వెస్ట్ చేశాను. తను నా దగ్గరకు వచ్చింది. ఒక్క క్షణం ఆకాశాన్ని జయించినంత ఆనందం కలిగింది. మనసులోనే ఎగిరి గంతేశాను. తను రాగానే పేరు తెలియనట్టు నీ పేరేంటి అని అడిగాను. శ్రావ్య అని చెప్పింది. ఎందుకో అప్పుడే నాకు ఎక్కడ లేని ధైర్యం వచ్చి ఫోన్‌నంబర్ చెప్పు అని అడిగేశాను. తను ఏమనుకుందో కానీ ఏదో అనుకుంటూనే నాకు నంబర్ ఇచ్చింది. నేను సాయంత్రం అవగానే తనకు కాల్ చేశాను. తను సరిగా రెస్పాన్డ్ కాలేదు.
తరువాత రోజు నేను కాల్ చేయడానికి రీజన్ వేరే ఉంది అని కవర్ చేశాను. తను సరే సార్ అంది. ఆ తరువాత నుంచి కాల్ చేసినప్పుడు బాగానే మాట్లాడేది. చాలా జోవియల్ గా మాట్లాడేది. తన మాటలు రోజు కొత్తగా అనిపించేవి. చాలా అందంగా ఉండేవి ఆ రోజులు. తను నన్ను లవ్ చేస్తోందో లేదో తెలుసుకోవడానికి నేను తన ఫ్రెండ్ ఫోన్ నంబర్ కూడా తీసుకొని తనతో క్లోజ్‌గా మాట్లాడుతున్నట్లు నటించాను. అప్పటి నుంచి తను నాతో మాట్లాడటం మానేసింది. నన్ను ప్లేబాయ్ అనుకుంది. ఎన్ని సార్లు చెప్పినా అర్థం చేసుకోకుండా నీకు నేను కాకపోతే ఇంకోటి వస్తుందిలే అని దూరం పెట్టింది. నా ఫోన్ లిఫ్ట్ చేయదు. మెసేజ్‌కు రిప్లై ఇవ్వదు. అంత మంచిగా మాట్లాడిన తను ఒక్కసారిగా మాట్లాడటం మానేస్తే తట్టుకోలేకపోతున్నా. నేను చేసిన చిన్న తప్పు నన్ను ఆ అమ్మాయి ముందు దోషిగా నిలబెట్టింది. ఆ తప్పు గురించి ఎప్పుడూ బాధ పడుతూనే ఉంటాను.
ప్రవీణ్(విజయవాడ)
Comments
Please login to add a commentAdd a comment