మేషం: మీ అభిప్రాయాలను, మనోగతాన్ని ఇష్టులకు తెలియజేసేందుకు బుధ, గురువారాలు అత్యంత అనుకూలమైనవిగా చెప్పవచ్చు. ఈకాలంలో మీ మనస్సులోని భావాలను వెల్లడిస్తే అవతలి నుంచి కూడా సానుకూల సందేశాలు రావచ్చు. ఇక ఈరోజుల్లో మీరు పింక్, ఆరెంజ్ రంగు దుస్తులు ధరిస్తే మేలు. అలాగే, ఇంటి నుంచి తూర్పు ఈశాన్య దిశగా బయలుదేరండి. ఇక, సోమ, మంగళవారాలు మీ ప్రయత్నాలకు దూరంగా ఉండండి.
వృషభం: మీ మనస్సులోని భావాలను ప్రీతిపాత్రులకు తెలియజేసేందుకు శని, బుధవారాలు సానుకూలం. ఈరోజుల్లో మీనోట వచ్చిన శుభసందేశంతో అవతలి వారు మరింత ఉత్సాహం చూపుతారు. ఈ సమయంలో మీరు రెడ్, వైట్ రంగు దుస్తులు ధరిస్తే మంచిది. ఇక ఇంటి నుంచి దక్షిణదిశగా బయలుదేరితే శుభకరంగా ఉంటుంది. ఇక, ఆది, సోమవారాలు వీటికి స్వస్తి చెప్పడం మంచిది.
మిథునం: మీరు అత్యంత ఇష్టపడే వ్యక్తులకు మీ అభిప్రాయాలను వెల్లడించేందుకు ఆది, సోమవారాలు అత్యంత అనుకూలమైనవి. ఈ సమయంలో మీ అభిప్రాయాలను అవతలి వారు మన్నించి మీకు సానుకూల సందేశం అందించే వీలుంది. ఇటువంటి సమయంలో మీరు రెడ్, ఎల్లో రంగు దుస్తులు ధరిస్తే మంచిది. అలాగే, ఇంటి నుంచి పశ్చిమదిశగా బయలుదేరండి. ఇక శుక్ర, శనివారాలు ఇటువంటి ప్రయత్నాలు విరమించండి.
కర్కాటకం: మీరు కోరుకున్న వ్యక్తులకు ఇంతకాలం మీలో దాచుకున్న భావాలను తెలియజేసేందుకు శని, సోమవారాలు అనుకూలమైనవిగా చెప్పవచ్చు. ఈ రోజుల్లో మీ ప్రతిపాదనలకు అవతలి వారు కూడా సానుకూలంగా స్పందించే వీలుంది. ఈ సమయంలో మీరు గ్రీన్, ఆరెంజ్ రంగు దుస్తులు ధరిస్తే మంచిది. అలాగే, ఇంటి నుంచి ఉత్తరదిశగా బయలుదేరితే శుభదాయకంగా ఉంటుంది. ఇక, బుధ, గురువారాలు మీ ప్రయత్నాలకు విరామం ఇవ్వండి.
సింహం: మీరు అత్యంత ఇష్టపడే వ్యక్తులకు మీ మనోగతాన్ని తెలిపేందుకు సోమ, గురువారాలు చాలా అనుకూలమైనవిగా చెప్పవచ్చు. ఈరోజుల్లో మీ ప్రతిపాదనలపై అవతలి వారు కూడా అనుకూలంగా స్పందించే అవకాశాలుంటాయి. ఇటువంటి సమయంలో మీరు ఎల్లో, పింక్ రంగు దుస్తులు ధరిస్తే మంచిది. అలాగే, ఇంటి నుంచి తూర్పుదిశగా బయలుదేరితే శుభకరంగా ఉంటుంది. ఇక, శుక్ర, మంగళవారాలు వీటికి దూరంగా ఉండండి.
కన్య: మీమనస్సులో ఆరాధించే వారికి మీ అభిప్రాయాలను వెల్లడించేందుకు శుక్ర, సోమవారాలు విశేషమైనవిగా చెప్పవచ్చు. ఈరోజుల్లో మీ అభిప్రాయాలపై అవతలి వారు కూడా అనుకూలత వ్యక్తం చేయవచ్చు. ఈరోజుల్లో మీరు వైట్, పింక్ రంగు దుస్తులు ధరిస్తే అనుకూలం. ఇక ఇంటి నుంచి పశ్చిమ వాయువ్య దిశగా బయలుదేరితే శుభకరంగా ఉంటుంది. అయితే, ఆది, బుధవారాలు మీ ప్రయత్నాలకు విరామం ఇవ్వండి.
తుల: మీ అభిప్రాయాలను, ప్రతిపాదనలను మీరు ఇష్టపడే వారికి తెలిపేందుకు శని, గురువారాలు అత్యంత సానుకూలమైనవిగా చెప్పవచ్చు. ఈ సమయంలో మీకు అవతలి వ్యక్తులు కూడా సానుకూల సందేశాలు అందించే వీలుంది. ఈరోజుల్లో మీరు ఆరెంజ్, రెడ్ రంగు దుస్తులు ధరిస్తే మేలు. ఇక, ఇంటి నుంచి దక్షిణ ఆగ్నేయదిశగా బయలుదేరండి శుభదాయకంగా ఉంటుంద. ఇక, సోమ, మంగళవారాలు మాత్రం మీ ప్రయత్నాలు విరమించండి.
వృశ్చికం: మీరు అత్యంత ఇష్టపడే వారికి మీ మనోగతాన్ని తెలిపేందుకు ఆది, సోమవారాలు అత్యంత అనుకూలమైనవి. ఈరోజుల్లో మీ అభిప్రాయాలకు అవతలి వారు సైతం అనుకూలంగా స్పందించే అవకాశం ఉంది. మీ ప్రతిపాదనల సమయంలో ఎల్లో, గ్రీన్ రంగు దుస్తులు ధరిస్తే మంచిది. అలాగే, ఇంటి నుంచి తూర్పుదిశగా బయలుదేరండి. ఇక, శని, గురువారాలు ఇటువంటి వాటికి దూరంగా ఉండండి.
ధనుస్సు: మీరు మనస్సులో ఆరాధించే వ్యక్తులకు మీ మనోగతాన్ని తెలిపేందుకు సోమ, బుధవారాలు చాలా అనుకూలమైనవిగా చెప్పవచ్చు. ఈ సమయంలో మీ అభిప్రాయాలకు అవతలి వారు కూడా తక్షణం స్పందించే వీలుంటుంది. ఈ రోజుల్లో మీరు రెడ్, పింక్ రంగు దుస్తులు ధరిస్తే మంచిది. ఇక, ఇంటి నుంచి పశ్చిమవాయువ్య దిశగా బయలుదేరండి. అయితే, శుక్ర, శనివారాలు మాత్రం ఇటువంటి వాటికి దూరంగా ఉండండి.
మకరం: మీ అభిప్రాయాలు, ప్రతిపాదనలు మీరు కోరుకున్న వ్యక్తులకు అందించేందుకు శని, గురువారాలు అత్యంత అనుకూలమైనవిగా చెప్పవచ్చు. ఈరోజుల్లో మీరు చేసే ప్రతిపాదనలపై అవతలి నుంచి కూడా సానుకూల సందేశాలు రావచ్చు. ఈ సమయంలో మీరు గ్రీన్, వైట్ రంగు దుస్తులు ధరిస్తే మంచిది. అలాగే, ఇంటి నుంచి దక్షిణదిశగా బయలుదేరితే లాభదాయకంగా ఉంటుంది. ఇక, సోమ, మంగళవారాలు మాత్రం ఇటువంటి వాటికి దూరంగా ఉండండి.
కుంభం: మీరు అభిమానించే వ్యక్తులకు మనస్సులోని భావాలను తెలిపేందుకు శని, ఆదివారాలు చాలా అనుకూలమైనవి. ఈ సమయంలో మీ ప్రతిపాదనలు విన్న అవతలి వారు అనుకూలంగా స్పందించే వీలుంది. ఈ రోజుల్లో మీరు ఆరెంజ్, ఎల్లో రంగు దుస్తులు ధరిస్తే ఉపయుక్తంగా ఉంటుంది. అలాగే, ఇంటి నుంచి తూర్పుదిశగా బయలుదేరితే శుభకరంగా ఉంటుంది. ఇక, మంగళ, బుధవారాలు ఇటువంటి వాటికి దూరంగా ఉండడం మంచిది.
మీనం: మీరు ఇష్టపడే వారికి మనోగతాన్ని తెలిపేందుకు ఆది, సోమవారాలు అత్యంత అనుకూలమైనవిగా చెప్పవచ్చు. ఈ రోజుల్లో మీ అభిప్రాయాలకు అవతలి వారు కూడా తమ ఇష్టాన్ని తెలియజేసే వీలుంది. ఇటువంటి సమయంలో మీరు రెడ్, పింక్ రంగు దుస్తులు ధరిస్తే మంచిది. ఇక, ఇంటి నుంచి ఉత్తరదిశగా బయలుదేరితే శుభకరంగా ఉంటుంది. అయితే, శుక్ర, శనివారాలు మాత్రం మీ ప్రయత్నాలను విరమిస్తే మంచిది.
Comments
Please login to add a commentAdd a comment