
ప్రతీకాత్మక చిత్రం
నా బీటెక్ నా లైఫ్‌ను, నా కెరీర్‌ను మార్చేసింది. నా ఇంటర్ వరకు నేను మా ఊర్లో ఉండే చదువుకునేదాన్ని. నాకు చదువు తప్ప ఇంకేమి తెలియదు. ఫేస్‌బుక్, ఇంటర్‌నెట్‌లాంటివి కూడా నాకు తెలియదు. చదువే నా ప్రపంచం. నేను బీటెక్ ఫస్ట్ ఇయర్‌లో హాస్టల్‌లో జాయిన్ అయ్యాను. నేను అదే ఫస్ట్ టైం హాస్టల్‌లో ఉండటం. చాలా బాధగా అనిపించేది. నేను అంత తొందరగా వేరే వాళ్లతో కలిసే దాన్ని కాదు. ఆ టైంలో నా ఫోన్‌కు ఫన్‌చాట్ అని ఒక నోటిఫికేషన్ వచ్చింది. దాన్నిఓకే చేశాను. అందులో ఫేస్‌బుక్‌లో లాగా మెసేజ్‌లు వచ్చేవి. అప్పుడే పరిచయం అయ్యాడు తను. నాకు తను ఒక మంచి పర్సన్ అనిపించి తనకు నా నంబర్ కూడా ఇచ్చాను. తరువాత తనే కాల్స్, మెసేజ్ లు చేసేవాడు. అలా 4 సంవత్సరాలు తను నాకు రోజు ఫోనులు, మెసేజ్‌లు చేసేవాడు. నాకు ఏదైనా ప్రాబ్లమ్ అనిపిస్తే నాకు ధైర్యం చెప్పేవాడు. కానీ నేను ఎప్పుడూ అతనని చూడలేదు. కనీసం అతని ఫోటో కూడా చూడలేదు.
తనతో మాట్లాడటం మొదలు పెట్టాక నాకు తెలియకుండానే తనని ఇష్టపడ్డాను. ఎంతలా తనని ప్రేమించాను అంటే తనతో మాట్లాడకుండా ఒక్కరోజు కూడా ఉండలేకపోయేదాన్ని. ఇదంతా నేను ఒకసారి అతనికి చెప్పాను. అప్పుడు తను నేను నిన్ను సిస్టర్‌లా చూశాను. నాకు వేరే ఉద్దేశ్యం లేదు అని నన్ను దూరంగా పెట్టడం లాంటి పనులు చేశాడు. తన నంబర్ మార్చేశాడు. తనకి బీటెక్ అయిపోగానే జాబ్ వచ్చింది. ఇంకా అన్నింటిలో నన్ను బ్లాక్ చేశాడు. నేను పిచ్చిదాన్నిలా తన కోసం రోడ్లు పట్టుకొని తిరిగాను. నా లవ్ అంగీకరించకపోయినా కనీసం తనని ఒకసారి చూద్దామని తన కోసం చాలా వెతికాను. కానీ తను నాకు ఏ అవకాశాన్ని ఇవ్వలేదు. తన ధ్యాసలో నా చదువును, కెరీర్‌ను వదిలేశాను.
తను ఇప్పుడు హ్యపీగానే ఉన్నాడు. నేను మా పేరెంట్స్ కోసం వేరే అబ్బాయిని పెళ్లి చేసుకున్నాను. తనని మరచిపోలేక ఇప్పటికీ బతికి ఉన్న చచ్చిన శవంలా జీవిస్తున్నా...నేను తనని 7 సంవత్సరాలు లవ్ చేశాను. కానీ తనని ఒక్కసారి కూడా చూడలేకపోయానే అన్న బాధ నా ప్రాణం పోయేలా చేస్తోంది. ఇప్పటికీ నేను తనని చూడలేదు కానీ నా ప్రాణం పోయే వరకు నేను తనని మర్చిపోలేను.
సౌమ్య ( వరంగల్).
Comments
Please login to add a commentAdd a comment