ప్రతీకాత్మక చిత్రం
నేను బీటెక్ చేశాను. కానీ కమ్యూనికేషన్ స్కిల్స్ లేక నాకు సరియైన జాబ్ రాలేదు. ఏదో చిన్న జాబ్‌లో చేరాను. బాగా చదివి టాప్‌లో ఉండే నాకు సరిగా మాట్లాడలేకపోవడం, ఇంగ్లీష్ రాకపోవడం వల్ల మంచి జాబ్‌లో చేరలేకపోయాను. ఆ బాధ నన్ను చాలా వెంటాడుతూ ఉండేది. ఎందుకు ఈ జాబ్ చేస్తున్నానో కూడా అర్థం అయ్యేది కాదు. చాలా డిప్రెషన్‌లో ఉండే వాడిని. నవ్వి కూడా చాలా రోజులు అయ్యింది.
అలా డల్‌గా ఉన్న నా లైఫ్‌లోకి ఒక అమ్మాయి వచ్చింది. ఆమె కోసమే అక్కడ చేరాను అని తరువాత అర్థం అయ్యింది. అంతేనేమో లైఫ్ లో జరిగే ప్రతి విషయం మరో విషయంతో ముడిపడి ఉంటుందేమో!. ఆమె అక్కడ హెచ్‌ఆర్‌గా చేరింది. చాలా యాక్టివ్‌గా ఉండేది. అందరితో మంచిగా మాట్లాడేది. ఎప్పుడు నవ్వతూనే ఉంటుంది తను. నాతో కూడా తనే వచ్చి మాట్లాడింది. అప్పటి నుంచి రోజు మాట్లాడుతూనే ఉండేది. నేను బీటెక్ మంచి మార్కులతో పాస్ అయిన ఇంగ్లీష్ రాకపోవడం, కమ్యూనికేషన్ స్కిల్స్ లేకపోవడం వల్ల ఇలా అయ్యానని తెలుసుకొని చాలా బాధపడింది. తరువాత నుంచి నన్ను ప్రతి విషయంలో ప్రోత్సహిస్తూ నాలో ధైర్యాన్ని నింపింది. నెమ్మది నెమ్మదిగా రోజు నాతో ఇంగ్లీష్‌లో మాట్లాడుతూ నా స్కిల్స్ ఇంప్రూవ్ కావడంలో సహాయం చేసింది. తరువాత నాకొక మంచి జాబ్ వచ్చింది. నా జీవితమే మారిపోయింది. నాకు ఇంతలా సాయం చేసిన ఆమెనే పెళ‍్లి చేసుకోవాలనుంది. కానీ ఆమె ఏమంటుందో అని నా ప్రేమను చెప్పలేకపోతున్నాను.
సురేష్ (గుంటూరు).
Comments
Please login to add a commentAdd a comment