Failure love
-
True Love Story: 65 ఏళ్ల ఎదురుచూపు.. అద్భుత ప్రేమ గాథ!
ప్రేమకు చావు లేదు. అది అజరామరం అంటారు. ప్రేమలో ప్రేమతప్ప ధ్వేషభేషజాలు అస్సలుండవు. దీనిని రుజువుచేసే ఎందరో వీర ప్రేమికులను చరిత్రలో చూశాం కూడా. అవన్నీ పిచ్చి ప్రేమలని కొట్టి పారేయలేం కూడా. ఎందుకంటే ఆయా గాథల్లో రాతిని కూడా చలింపచేయగల శక్తి ఉంటుంది. ఇప్పుడు మీరు తెలుసుకోబోయే ప్రేమికుల ప్రేమ కథ కూడా అటువంటిదే! ఈనాటి ప్రేమ కూడా కాదండోయ్! 1911 నాటి ప్రణయగాథ.. మొదలెడదామా.. పెర్లె స్క్వార్జ్, మాక్స్ వెల్ అనుకోకుండా ఒక కంట్రీ క్లబ్లో కలిశారు. లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అంటారే.. వీళ్లది కూడా అటువంటి ప్రేమే. తొలిచూపులోనే ఒకరినొకరు ఇష్టపడ్డారు. వాళ్లకే తెలీకుండా పీకల్లోతు ప్రేమలో మునిగిపోయారు. ఇరు కుటుంబాల్లో విషయం చెప్పారు. ఇరువురి మతాలు వారి పెళ్లికి అడ్డుపడ్డాయి. తల్లిదండ్రులు ససేమిరా అన్నారు. కుటుంబ పరువు కోసం ఆజన్మాంతం ప్రేమికులుగానే మిగిలిపోయారు. చదవండి: 150 ఏళ్లు పట్టేదట! కానీ.. కేవలం 18 ఏళ్లలోనే.. !! తర్వాత మ్యాక్స్‌వెల్ నావీలో జాయిన్ అయ్యాడు. ఎమ్ఏ, ఎమ్బీఏలు పూర్తి చేసి, కొలంబియా విశ్వవిద్యాలయం నుండి పీహెచ్డీ సంపాదించాడు. అదే యూనివర్సిటీలో చరిత్ర బోధించాడు. తర్వాత వాషింగ్టన్ విశ్వవిద్యాలయంలో అమెరికన్ వలసరాజ్య చరిత్ర ప్రొఫెసర్‌గా పనిచేశాడు. అనేక పరిశోధన పత్రాలను ప్రచురించాడు. కొన్ని పుస్తకాలు కూడా రాశాడు. 83 సంవత్సరాల వయస్సులో 1979 లో మరణించాడు. పెర్లె మాత్రం చనిపోయేవరకు ప్రియుడికోసం ఎదురుచూస్తూనే ఉంది. పేరెంట్స్ ఆమెను అతని దగ్గరికి పోనివ్వలేదు. 65 యేళ్ల వరకు పెర్లీ నిశ్శబ్ద జీవితాన్ని గడిపింది. మ్యాక్స్ మరణం గురించి విన్న 3 నెలల తర్వాత ఆమె 1980లో కన్నుమూసింది. చదవండి: Unknown Facts About China: చైనా గుట్టు రట్టు చేసే.. 20 షాకింగ్ నిజాలు! ఆనాటి ప్రేమతాలూకు ఆనవాళ్లు తాజాగా ఒక ఇంట్లో ఉత్తరాల రూపంలో బయటపడ్డాయి. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా వందల కొద్దీ ఉత్తరాలు. పెర్లె నివసించిన ఆ ఇంట్లో అటకపై ఒక పెట్టెలో మాక్స్ అనే వ్యక్తి నుంచి వచ్చిన ప్రేమలేఖలు కుప్పలు తెప్పలుగా ఉన్నాయి. చూస్తే అందులోని విషయాలు చాలా ఆసక్తికరంగా ఉన్నాయి. దాదాపు 1913-1978 వరకు మాక్స్,పెర్లేకి రాసిన ఉత్తరాలవి. అతని లేఖలన్నీ “మై స్వీట్ పెర్ల్” తో ప్రారంభమై.. “ఫరెవర్ యువర్స్.. మాక్స్” తో ముగిశాయి. విధి వాళ్లని కలపనప్పటికీ.. వారు మాత్రం తమ జీవితాంతం ఒకరికొకరు ఉత్తరాలు రాయడం కొనసాగించినట్లు ఆ లేఖలను బట్టి తెలుస్తోంది. ఐతే మాక్స్ నుండి వచ్చిన ఉత్తరాలు మాత్రమే దొరికాయి. పెర్లె రాసిన ఉత్తరాలు దొరకలేదు. ఆఫ్రికా, స్పెయిన్, చిలీ, కెనడా, వాషింగ్టన్, రోడ్ ఐలాండ్, ఫ్రాన్స్‌ల నుండి పెర్లెకి ఉత్తరాలు వచ్చాయి. అతను ఎక్కడికి వెళ్లినా, ఎక్కడున్నా ... ఉత్తరాలు మాత్రం రాస్తూనే ఉండేవాడు. ఇవి ప్రత్యుత్తరాలు అని లేఖల కంటెంట్ తెల్పుతుంది. ఈ విధంగా వాళ్లిరువురు 65 సంవత్సరాలకు పైగా ఉత్తర ప్రత్యుత్తరాలను కొనసాగించినట్లు తెలుస్తోంది. చివరికి మాక్స్ వివాహం చేసుకున్నడని, అతనికి మిచెల్ అనే ఒక కూతురు కూడా ఉన్నట్లు ఆ లేఖలను బట్టి తెలుస్తోంది. ఐతే ఉత్తరాల్లో దాని గురించి ఎక్కువ సమాచారం లేదు. చదవండి: రెస్టారెంట్ విచిత్ర షరతు.. ఫైర్ అవుతున్న నెటిజన్లు! 1980లో పెర్లే మరణించినప్పుడు ఆమె దాచుకున్న మాక్స్ ఉత్తరాల్లో కొన్ని కాలిపోయాయట. ఆమె కుటుంబం ఆ ఉత్తరాలన్నింటినీ అటకపై ఒక బాక్స్‌లో భద్రపరిచింది. గొప్ప ప్రేమ కథలలో ఒకటి ఉత్తరాల రూపంలో తాజాగా బయటపడింది. ‘ఐ లవ్యూ.. ఇంకేం చెప్పలేను- మాక్స్’ (మతం మారితేనే పెళ్లి చేసుకోవచ్చని పెర్లే చెప్పిన తర్వాత మాక్స్ ఆమెకు రాసిన మొదటి ఉత్తరం ఇది). తదుపరి అక్షరాలు పోస్ట్‌మార్క్ చేసిన ఎన్వలప్లలో ఉన్నాయి. ‘సోమవారం సాయంత్రం నాకు అర్థమైంది. నేను మొదటి నుండి అర్థం చేసుకున్నాను. నువ్వేం అనుకుంటున్నావనేదే అర్థం కావడంలేదు. ఇకపై క్లబ్‌కి రాలేను. నిన్ను ప్రేమిస్తున్నందుకు నాకు అర్థం అయ్యే హింసను నేను అనుభవించలేను. నీ దగ్గర ఉండడం, నిన్ను చూడడం, నువ్వు అని అనిపించడం నేను తట్టుకోలేకపోయాను... (మిగిలిన ఉత్తరం చిరిగిపోయింది) ఇది పెర్లె, మాక్స్‌కు రాసిన ఉత్తరం. ‘మనం కలిసి ఉండలేమని చెప్పిన తర్వాత నాకు వచ్చిన మొదటి లేఖ’ అని కవరుపై రాసివుంది (పెర్లే రాసిన లేఖ గురించి మాక్స్ రాసుకున్న అక్షరాలవి) ఎంత అందమైన ప్రేమ కథ ఇది. చదవండి: Mystery Case: ఐదేళ్ల క్రితం హత్యచేశారు.. కానీ.. -
ఆ ఉద్యోగంలో అందుకే చేరానేమో!
నేను బీటెక్ చేశాను. కానీ కమ్యూనికేషన్ స్కిల్స్ లేక నాకు సరియైన జాబ్ రాలేదు. ఏదో చిన్న జాబ్‌లో చేరాను. బాగా చదివి టాప్‌లో ఉండే నాకు సరిగా మాట్లాడలేకపోవడం, ఇంగ్లీష్ రాకపోవడం వల్ల మంచి జాబ్‌లో చేరలేకపోయాను. ఆ బాధ నన్ను చాలా వెంటాడుతూ ఉండేది. ఎందుకు ఈ జాబ్ చేస్తున్నానో కూడా అర్థం అయ్యేది కాదు. చాలా డిప్రెషన్లో ఉండే వాడిని. నవ్వి కూడా చాలా రోజులు అయ్యింది. అలా డల్‌గా ఉన్న నా లైఫ్‌లోకి ఒక అమ్మాయి వచ్చింది. ఆమె కోసమే అక్కడ చేరాను అని తరువాత అర్థం అయ్యింది. అంతేనేమో లైఫ్ లో జరిగే ప్రతి విషయం మరో విషయంతో ముడిపడి ఉంటుందేమో!. ఆమె అక్కడ హెచ్ఆర్గా చేరింది. చాలా యాక్టివ్‌గా ఉండేది. అందరితో మంచిగా మాట్లాడేది. ఎప్పుడు నవ్వతూనే ఉంటుంది తను. నాతో కూడా తనే వచ్చి మాట్లాడింది. అప్పటి నుంచి రోజు మాట్లాడుతూనే ఉండేది. నేను బీటెక్ మంచి మార్కులతో పాస్ అయిన ఇంగ్లీష్ రాకపోవడం, కమ్యూనికేషన్ స్కిల్స్ లేకపోవడం వల్ల ఇలా అయ్యానని తెలుసుకొని చాలా బాధపడింది. తరువాత నుంచి నన్ను ప్రతి విషయంలో ప్రోత్సహిస్తూ నాలో ధైర్యాన్ని నింపింది. నెమ్మది నెమ్మదిగా రోజు నాతో ఇంగ్లీష్‌లో మాట్లాడుతూ నా స్కిల్స్ ఇంప్రూవ్ కావడంలో సహాయం చేసింది. తరువాత నాకొక మంచి జాబ్ వచ్చింది. నా జీవితమే మారిపోయింది. నాకు ఇంతలా సాయం చేసిన ఆమెనే పెళ్లి చేసుకోవాలనుంది. కానీ ఆమె ఏమంటుందో అని నా ప్రేమను చెప్పలేకపోతున్నాను. సురేష్ (గుంటూరు). -
ఆ మాట చెప్పకపోవడం నాదే తప్పు!
ప్రేమ అన్న పదం ఇద్దరి మనసులో చేసే ఆ చిలిపి చేష్టలు.. నా జీవితంలోనూ ఆ రెండు అక్షరాల ప్రేమ ఎన్నో మలుపులతో ప్రయానిస్తోంది. నా వయసుకి తెలియదు ప్రేమంటే ఏంటో అప్పుడే ఆ అమ్మాయి నా కళ్లముందుకు వచ్చి వాలింది... తనని చూడగానే ఏదో తెలియని ఓ ఆనందం తననే చూస్తూ ఉండాలనే స్వార్ధం అది కొన్నాళ్లకి మరింత ఇష్టంగా మారింది. తనని చూసే ప్రతిక్షణం, కలిసిన అనుక్షణం ఏదో తెలియని సంతోషంతో ఉప్పొంగిపోయేవాడ్ని. తను పిలిచిన ప్రతిసారి, తనతో మాట్లాడిన అనుక్షణం, తను చేసే ప్రతి పని చూసి మురిసిపోయేవాడ్ని. అలా నాలో నేను ఇష్టాన్ని పెంచుకుంటూ వచ్చా. తన అందం మందారం. తన స్వభావమే అందులో మకరందం. అందుకే నన్ను తనవైపు మళ్లించి మరింత ఆశను నాలో కలిగించింది. ఇలా కొంతకాలం తరువాత అది ఇష్టం నుంచి ప్రేమగా మారింది. ప్రేమకు అర్ధం తెలుసుకున్న నేను తనే నా అర్ధాంగి అనుకున్నా. తనుకు నా పైన ఇష్టం ఉంది అని అనుకుంటూ గడిపా. కొన్నాళ్లకి నా ప్రేమను చెప్పాలి అనుకున్నా కానీ ఆ ప్రేమను తనతో చెప్పలేక నా గుండెలోనే దాచేశా. కాని అప్పుడే నాకు ఒక విషయం తెలిసింది. అప్పుడే నాలో ఏదో తెలియని అలజడి మొదలై గుండె గుభేలుమంది. తనికి ఇంట్లో పెళ్లిసంబంధాలు చూస్తున్నారు అని తెలిసింది. అది విన్న ఒక్క క్షణము నా గుండె ఆగినంత పని అయ్యింది. అయిన ప్రాణంగా ప్రేమిచిన అమ్మాయికి నా ప్రేమను చెప్పకపోవడం నా తప్పే. ఇన్ని రోజుల మా ప్రయాణంలో తనికి నాపై ఇష్టం తప్పా ప్రేమ కలగలేదు. అది తెలిసి బలవంతం చేసి బంధాలను దూరం చేసుకోలేక నా ప్రేమను చంపుకున్నాను. అయిన తనని ప్రేమించడం మానలేదు తనిని మరిచిపోలేదు. ఉదయ్( చిత్తూరు). -
అంతా ఓకే అనుకున్నాక!
మాది కరీంనగర్ జిల్లా. మా అక్క కూతురు ద్వారా నాకు ఒక అమ్మాయి పరిచయం అయ్యింది. రోజు ఆ అమ్మాయితో చాట్ చేసే వాడిని. అలా కొన్ని రోజులు మాట్లాడుకుంటూ ఉండగా నాకు ఆమె పై ప్రేమ కలిగింది. ఒకరోజు మా ఫ్రెండ్ ఇలా రోజు చాట్ చేసుకోవడం బదులు నీ ప్రేమ గురించి ఆమెకు చెప్పుచుగా అన్నాడు. అప్పుడు నేను ఉన్న ఫ్రెండ్షిప్ లాస్ చేసుకోవడం ఎందుకని అన్నాను.దానికి నా ఫ్రెండ్ నువ్వు చెప్పినా చెప్పకున్నా తను ఎలాగూ దూరం అవుతుంది కదా అని అన్నాడు. ఆలోచించి ఒకరోజు అర్దరాత్రి తనకు నా మనసులోని ప్రేమను మెసేజ్ ద్వారా చెప్పాను. రెండు రోజుల వరకు తన దగ్గర నుంచి ఎలాంటి సమాధానం రాలేదు. నేను కూడా రెండు రోజుల వరకు మళ్లీ మెసేజ్ చేయలేదు. మూడు రోజుల తర్వాత తన నుంచి మెసేజ్ వచ్చింది. అప్పుడు నా ఆనందానికి అవధులు లేవు.. అలా మూడు సంవత్సరాలు చాటింగ్ చేసుకున్నాం. వాళ్ళ చెల్లి సహాయంతో మా బంధువుల ద్వారా పెళ్లి చూపులు కూడా అయిన తర్వాత అన్ని ఓకే అనుకున్నాక ఎవరో ఏమో చెప్పారు అని వాళ్ళ నాన్న గారు ఈ పెళ్లి వద్దు అన్నారు. మేమిద్దరం చాలా రోజులు ప్రయత్నించాం. కానీ సఫలం కాలేదు. తను మా నాన్న గారి మాట నేను కాదనలేను అలాగని నిన్ను వదులుకోలేను అని అంది. పరిస్థితుల కారణంగా ఆమె పెళ్ళి చేసుకుని వెళ్లిపోయింది. అప్పటి నుండి ఇప్పటి వరకూ ఎలాంటి విషయం తన గురించి తెలియదు.. కానీ తను బాగుందని తెలిసింది..తన పెళ్ళి అయిన తర్వాత నేను కూడా పెళ్లి చేసుకున్నాను. అందరం ఎవరికి వారు చాలా సంతోషంగా ఉన్నాం. ఒక్క సారైనా తనని చూడాలని కోరిక. ఇందులో ముఖ్యమైన విషయం ఏమిటంటే తను నేను 3 సంవత్సరాలు చాట్ చేసుకున్నాం తప్ప ఒకసారి కూడా మాట్లాడుకోలేదు. వేముల సంపత్ ( కరీంనగర్) -
క్యాబరే డ్యాన్సర్లో ఆర్తి రీ ఎంట్రీ
టీనగర్: పంబర కన్నాలే చిత్రం ద్వారా తమిళ తెరకు పరిచయమయ్యారు నటి ఆర్తిఆగర్వాల్. 2000 సంవత్సరంలో తెలుగు చిత్రాల్లో బిజీగా నటించారు. హఠాత్తుగా చిత్ర అవకాశాలు తగ్గిపోయాయి. దీంతో ఇంటికే పరిమితమయ్యారు. ఈ క్రమంలో ఒక నటునితో ఏర్పడిన ప్రేమ వైఫల్యం కారణంగా ఆత్మహత్యకు ప్రయత్నించారు. కోలుకున్న తర్వాత నటనకు దూరమయ్యారు. ఈ సంఘటన జరిగిన రెండేళ్ల అనంతరం మానసికంగా దెబ్బతిన్న ఆమెకు కౌన్సెలింగ్ అందించారు. ప్రస్తుతం ఆమె పూర్తిగా కోలుకున్నారు. ప్రస్తుతం ఆర్త్తీకి రీ ఎంట్రీపై ఆసక్తి ఏర్పడింది. ఈ దఫా పూర్తిగా గ్లామరస్‌గా నటించేందుకు నిర్ణయించారు. క్యాబరే డ్యాన్సర్ అనే తెలుగు చిత్రంలో ఆమె నటించనున్నారు. చల్లా సుబ్రమణ్యం నవల ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కనుంది. శివనాగు దర్శకత్వం వహిస్తున్నారు. ఇంతవరకు తనకు సినిమాలో అదృష్టం కలిసి రాలేదని, ఇకపై తనకు మంచి రోజులు వస్తాయనే ఆశాభావంతో ఈ చిత్రంలో నటిస్తున్నట్లు తెలిపారు ఆర్తి అగర్వాల్.