మాది కరీంనగర్ జిల్లా. మా అక్క కూతురు ద్వారా నాకు ఒక అమ్మాయి పరిచయం అయ్యింది. రోజు ఆ అమ్మాయితో చాట్ చేసే వాడిని. అలా కొన్ని రోజులు మాట్లాడుకుంటూ ఉండగా నాకు ఆమె పై ప్రేమ కలిగింది. ఒకరోజు మా ఫ్రెండ్ ఇలా రోజు చాట్ చేసుకోవడం బదులు నీ ప్రేమ గురించి ఆమెకు చెప్పుచుగా అన్నాడు. అప్పుడు నేను ఉన్న ఫ్రెండ్షిప్ లాస్ చేసుకోవడం ఎందుకని అన్నాను.దానికి నా ఫ్రెండ్ నువ్వు చెప్పినా చెప్పకున్నా తను ఎలాగూ దూరం అవుతుంది కదా అని అన్నాడు. ఆలోచించి ఒకరోజు అర్దరాత్రి తనకు నా మనసులోని ప్రేమను మెసేజ్ ద్వారా చెప్పాను.
రెండు రోజుల వరకు తన దగ్గర నుంచి ఎలాంటి సమాధానం రాలేదు. నేను కూడా రెండు రోజుల వరకు మళ్లీ మెసేజ్ చేయలేదు. మూడు రోజుల తర్వాత తన నుంచి మెసేజ్ వచ్చింది. అప్పుడు నా ఆనందానికి అవధులు లేవు.. అలా మూడు సంవత్సరాలు చాటింగ్ చేసుకున్నాం. వాళ్ళ చెల్లి సహాయంతో మా బంధువుల ద్వారా పెళ్లి చూపులు కూడా అయిన తర్వాత అన్ని ఓకే అనుకున్నాక ఎవరో ఏమో చెప్పారు అని వాళ్ళ నాన్న గారు ఈ పెళ్లి వద్దు అన్నారు. మేమిద్దరం చాలా రోజులు ప్రయత్నించాం. కానీ సఫలం కాలేదు. తను మా నాన్న గారి మాట నేను కాదనలేను అలాగని నిన్ను వదులుకోలేను అని అంది. పరిస్థితుల కారణంగా ఆమె పెళ్ళి చేసుకుని వెళ్లిపోయింది. అప్పటి నుండి ఇప్పటి వరకూ ఎలాంటి విషయం తన గురించి తెలియదు.. కానీ తను బాగుందని తెలిసింది..తన పెళ్ళి అయిన తర్వాత నేను కూడా పెళ్లి చేసుకున్నాను. అందరం ఎవరికి వారు చాలా సంతోషంగా ఉన్నాం. ఒక్క సారైనా తనని చూడాలని కోరిక. ఇందులో ముఖ్యమైన విషయం ఏమిటంటే తను నేను 3 సంవత్సరాలు చాట్ చేసుకున్నాం తప్ప ఒకసారి కూడా మాట్లాడుకోలేదు.
వేముల సంపత్ ( కరీంనగర్)
Comments
Please login to add a commentAdd a comment