క్యాబరే డ్యాన్సర్‌లో ఆర్తి రీ ఎంట్రీ | Re entry Aarti Agarwal tried to commit suicide | Sakshi
Sakshi News home page

క్యాబరే డ్యాన్సర్‌లో ఆర్తి రీ ఎంట్రీ

Published Sun, May 31 2015 3:36 AM | Last Updated on Wed, Sep 18 2019 2:52 PM

క్యాబరే డ్యాన్సర్‌లో ఆర్తి రీ ఎంట్రీ - Sakshi

క్యాబరే డ్యాన్సర్‌లో ఆర్తి రీ ఎంట్రీ

టీనగర్: పంబర కన్నాలే చిత్రం ద్వారా తమిళ తెరకు పరిచయమయ్యారు నటి ఆర్తిఆగర్వాల్. 2000 సంవత్సరంలో తెలుగు చిత్రాల్లో బిజీగా నటించారు. హఠాత్తుగా చిత్ర అవకాశాలు తగ్గిపోయాయి. దీంతో ఇంటికే పరిమితమయ్యారు. ఈ క్రమంలో ఒక నటునితో ఏర్పడిన ప్రేమ వైఫల్యం కారణంగా ఆత్మహత్యకు ప్రయత్నించారు.
 
 కోలుకున్న తర్వాత నటనకు దూరమయ్యారు. ఈ సంఘటన జరిగిన రెండేళ్ల అనంతరం మానసికంగా దెబ్బతిన్న ఆమెకు కౌన్సెలింగ్ అందించారు. ప్రస్తుతం ఆమె పూర్తిగా కోలుకున్నారు. ప్రస్తుతం ఆర్త్తీకి రీ ఎంట్రీపై ఆసక్తి ఏర్పడింది. ఈ దఫా పూర్తిగా గ్లామరస్‌గా నటించేందుకు నిర్ణయించారు. క్యాబరే డ్యాన్సర్ అనే తెలుగు చిత్రంలో ఆమె నటించనున్నారు. చల్లా సుబ్రమణ్యం నవల ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కనుంది. శివనాగు దర్శకత్వం వహిస్తున్నారు. ఇంతవరకు తనకు సినిమాలో అదృష్టం కలిసి రాలేదని, ఇకపై తనకు మంచి రోజులు వస్తాయనే ఆశాభావంతో ఈ చిత్రంలో నటిస్తున్నట్లు తెలిపారు ఆర్తి అగర్వాల్.
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement