
ప్రేమ అంటే నాకు భక్తి, చాలా గౌరవం ఉండేవి. నేను కూడా ఒక మంచి అమ్మాయిను ప్రేమించి హ్యాపీగా ఉండాలి అనుకున్నాను. అలాగే ఒక మంచి అమ్మాయిని లవ్ చేశాను. కానీ ఆ తరువాతే నాకు ప్రేమ మీద ఉన్న భక్తిపోయి భయం పట్టుకుంది. తనకు నా ప్రేమ గురించి చెప్పక ముందు ప్రేమంటే ఆహా...అనిపించేది. ఇప్పుడు ప్రేమంటో ఓహ్ నో... అనిపిస్తుంది.
ఒకప్పుడు ప్రేమించిన వ్యక్తి ఏం చేసినా భరించాలి అనిపించేది. ఇప్పుడు నెత్తి నేలకేసి బాదుకోవాలనిపిస్తుంది. చాలా భరించాను తనని. ప్రతి విషయంలో గొడవ పెట్టుకున్నా, అలిగినా అన్నింటికి సర్దుకుపోయాను. నాకు ఓర్పు, సహనం చాలా ఎక్కువ. తనంటే ఉన్న ప్రేమతో తను ఏం చేసినా చాలా ఓపికగా ఉన్నా.నా సహనం, ఓర్పే నా మైనస్ పాయింట్లు అని అర్థం అయ్యింది. అవి తనకు ప్లస్ పాయింట్లుగా మారిపోయాయి. ఇప్పుడు తను నాతో 150 ఓవర్స్ టెస్ట్ మ్యాచ్ ఆడుకుంటుంది. తన వల్ల నాకు షుగర్, బీపీ, షార్ట్ టెంపర్ ఇలా చాలా పనికిమాలిన రోగాలు వస్తున్నాయి. ఓర్పు, సహనం నా నుంచి దూరంగా వెళ్లిపోయాయి.
తన వల్ల నేను ప్రేమించడం మానేసి నటించడం మొదలు పెట్టాల్సి వచ్చింది. ఇంత చెబుతున్నా... ఇంతకీ నా సమస్య ఏంటో చెప్పలేదు కదా! రోజు మొత్తం తనతో ఫోన్ మాట్లాడుతూనే ఉండాలి. తినేటప్పుడు మాట్లాడాలి. డ్రైవింగ్‌లో, ఆఫీస్‌లో, చివరికి బాస్ ముందు ఉన్నాడు అని చెప్పినా కూడా నువ్వు నాకు టైం ఇవ్వడం లేదు అంటుంది. ఏం చేయాలి చెప్పండి. అందరికి అది ప్రేమలా అనిపిస్తుంది. నాకు మాత్రం టార్చర్ అంటే ఇదేనా అనిపిస్తుంది. ప్రేమికులు ప్రపంచాన్ని మరిచిపోయి గంటలు గంటలు మాట్లాడుకుంటారు అంటారు. కానీ ఇలా మాట్లాడమంటే మాత్రం చాలా కష్టమే. అది చూసే వాళ్లకి చదివే వాళ్లకు అర్ధం కాదు భరించేవాడికే తెలుస్తుంది. అతి ప్రేమ అన్ని విధాల అనర్ధం.
శివ(నరసన్నపేట)
Comments
Please login to add a commentAdd a comment