కోపంలో పెద్ద తప్పు చేశాను! | Sad Ending Love Story Raghu Kambam | Sakshi
Sakshi News home page

కోపంలో పెద్ద తప్పు చేశాను!

Published Wed, Nov 27 2019 3:13 PM | Last Updated on Wed, Nov 27 2019 3:14 PM

Sad Ending Love Story Raghu Kambam - Sakshi

తన పేరు రాధిక. మా టెన్త్‌క్లాస్‌ అయిపోయాక 7 సంవత్సరాలకు గెట్‌ టూ గెదర్‌ ఏర్పాటు చేశారు. ఆ ఈవెంట్‌లో నేను తనని చూశాను. చూడగానే నాకు చాలా బాగా నచ్చింది. వెంటనే తను నాకు నచ్చిందని మా ఫ్రెండ్‌కు చెప్పాను. తనకి కూడా ఇష్టం ఉందేమో కనుక్కోమని చెప్పాను. అంత ధైర్యం ఉంటే తననే నాతో చెప్పమను అని చెప్పింది అంటా. కానీ నాకు భయంవేసి అప్పుడు చెప్పలేదు. తరువాత కొన్ని రోజులు మేం ఫోన్‌లో మాట్లాడుకున్నాం. తరువాత నేనంటే తనకు ఇష్టమని తెలిసింది. ఒక రోజు విజయవాడలో పరీక్ష ఉంది వెళ్లాలి అని చెప్పింది. నేను కూడా రానా అని అడిగాను. నీ ఇష్టం అని చెప్పింది. సరే అని తనతో పాటే వెళ్లాను. తను పరీక్ష రాసే అంతసేపు నేను పార్కులో తనకోసం వేచిచూశాను. తను రాగానే వెంటనే ప్రపోజ్‌ చేశాను. తను ఏం మాట్లాడకుండా వెళ్లిపోయింది. 

తరువాత రోజు ఫోన్‌చేసి నేను కంభం వెళుతున్నా వస్తావా అని అడిగింది. మార్నింగ్‌ వరకు విజయవాడలోనే ఉన్నా. రైల్వేస్టేషన్‌లో నన్ను చూడగానే తను నవ్వింది. వెంటనే తనని హగ్‌ చేసుకొని లవ్‌ యూ బంగారం అని చెప్పాను. తను సీరియస్‌ అయ్యింది. కానీ ఫ్రెండ్లీగానే మాట్లాడేది. నేను నంద్యాలలో ట్రైన్‌ దిగగానే నేనంటే ఇష్టం ఉంటే మహానంది చూపించు లేకపోతే హైదరాబాద్‌ వెళ్లిపోతా అని చెప్పాను. తను నన్ను మహానందికి తీసువెళ్లి అక్కడ ఐలవ్‌యూ చెప్పింది. తరువాత 4 సంవత్సరాలు చాలా హ్యాపీగా గడిపాం.

తరువాత పెళ్లి చేసుకుందాం అనుకున్నాం. తను ఓకే అంది. కానీ తనకి ఏం అయ్యిందో ఏమో కానీ ప్రతి చిన్న విషయానికి గొడపడేది. చాలాసార్లు నేనే సర్ధుకుపోయేవాడిని. ఒకరోజు ఉండలేక మనం ఎప్పుడు పెళ్లి చేసుకుందాం అని గట్టిగా అడిగాను. 4 నెలల తరువాత చేసుకుందాం అని అంది. సరే అని నాలుగు నెలలు ఓపిక పట్టాను. తరువాత పెళ్లి చేసుకుందాం అని అడిగితే మా ఇంట్లో కాస్ట్‌ ఫీలింగ్‌ చాలా ఎక్కువ మన పెళ్లికి ఒప్పుకోరు అని ఏడ్చింది. నన్ను వేరే పెళ్లి చేసుకోమని చెప్పింది. వెంటనే నాకు కోపం వచ్చి తనని కొట్టాను. ఏం చేసినా మా పెళ్లి జరగదని చెప్పింది. నాకు తన మీద కోపం వచ్చి వెంటనే వేరే అమ్మాయిని పెళ్లి చేసేసుకున్నాను. కానీ తనని ఇప్పటికీ మర్చిపోలేకపోతున్నాను. తనతో గడిపిన ప్రతి క్షణం నాకు ఇప్పటికీ గుర్తుంది. చాలా సార్లు తనకి కాల్‌ చేస్తూనే ఉన్నా. ఎప్పటికీ ఆమెను ప్రేమిస్తూనే ఉంటా...

రఘ(కంభం)


 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement