నేనంటే తనకు ఇప్పటికీ కోపమే! | Bhimavaram Boy Venkat Sad Ending Love Story | Sakshi
Sakshi News home page

కావాలని అలా చేయలేదు!

Published Wed, Jan 22 2020 12:47 PM | Last Updated on Wed, Jan 22 2020 12:53 PM

Bhimavaram Boy Venkat Sad Ending Love Story - Sakshi

నేను ఇంటర్‌లో రమ(పేరు మార్చాం) అనే అమ్మాయిని లవ్‌ చేశాను. కానీ తను నన్ను లవ్‌ చేయలేదు. తరువాత ఇంటర్‌ సెకండ్‌ ఇయర్‌లో తను నాకు ఓకే చెప్పింది. తరువాత ఇద్దరం చాలా హ్యాపీగా ఉండేవాళ్లం. తిట్టుకుంటూ, కొట్టుకుంటూ అలా మా ప్రేమ డిగ్రీ అయిపోయేదాకా కూడా కంటిన్యూ అయ్యింది. అలా ఆరు సంవత్సరాలు లవ్‌ చేసుకున్నాము. తరువాత తను నన్ను పెళ్లి చేసుకోమని అడిగింది. నేను చేసుకుంటాను అన్నాను. ఇంతలో తనకు వాళ్ల ఇంటిలో పెళ్లి సంబంధాలు చూశారు. తనకి పెళ్లైపోయింది.

నేను చేసుకుందాం అనుకుంటే అప్పటికీ నేను ఇంకా సెటిల్‌ అవ్వలేదు. ఇప్పుడు స్థిరపడ్డాను కానీ ఇప్పుడు తను నాతో లేదు. పెళ్లి అయ్యాక ఒక్కసారి కూడా తను నాతో మాట్లాడలేదు. నేను పెళ్లి చేసుకోలేదు అనే కోసం తనకి ఇప్పటికీ ఉంది. అప్పుడు నాకు కుదరక చేసుకోలేకపోయాను కానీ తన మీద ప్రేమ లేక కాదు. తను ఎక్కడ ఉన్న బాగుండాలి. తనకి ఒకప్పుడు నేనంటే చాలా ఇష్టం, ఇప్పుడు నేనంటే తనకు చాలా అసహ్యం. కానీ తనంటే నాకు ఇప్పుడు, ఎప్పుడు ఎప్పటికీ ఇష్టమే. ఐ లవ్‌ యూ రమ. 
 

వెంకట్‌ (భీమవరం). 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement