
2009 లో బీటెక్ చేయడం కోసం హైదరాబాద్ వచ్చాను. ఆమెను మొదటిసారి అక్కడే కలిశాను. మా క్లాస్‌మెట్ తను. పేరు సుష్మా. బాగా మాట్లాడుకునే వాళ్ళం. ఒక రోజు ప్రపోజ్ చేశాను. మనం ఫ్రెండ్స్ అంది. నీ మీద నాకు ఫీలింగ్స్ ఉన్నాయి ఇంకా ఫ్రెండ్లీగా నీతో ఉండలేను అని తనకి దూరంగా ఉన్నాను. తర్వాత కొన్ని రోజులకు తను నా ప్రేమను ఒప్పుకుంది. మా కాలేజీ అంతా మా ప్రేమ గురించి తెలుసు. ఎప్పుడూ కలిసే ఉండేవాళ్ళం.
బీటెక్‌లో క్యాంపస్ ఇంటర్వ్యూలో జాబ్ వచ్చింది. ఢిల్లీలో ఒక సాఫ్ట్‌వేర్ కంపెనీలో చేరాను. మంచి జీతం, మంచి జీవితం. కానీ నీకు దూరంగా ఉండలేను హైదరాబాద్ వచ్చేయ్ అని అంది. తన కోసం ఏమి ఆలోచించకుండా జాబ్ వదిలేసి వచ్చేశా. నేను తన కోసం అన్ని వదిలేసి వచ్చేశాను... తను మాత్రం నన్ను వదిలేసి వేరే పెళ్ళి చేసుకుని వెళ్లిపోయింది. తన జ్ఞాపకాల నుంచి బయటకు రావడానికి చాలా టైం పట్టింది. చాలా కాలం తరువాత తన జ్ఞాపకాల నుంచి బయటకు వచ్చాను. ఇప్పుడు ఒక బ్యాంక్ మేనేజర్‌గా పనిచేస్తున్నాను. ఆ తరవాత నాతో మాట్లాడాలి అని చాలా ట్రై చేసింది. కానీ నేను మాట్లాలేదు. నా తొలి ప్రేమ నాకు చేదు అనుభవాన్ని మిగిల్చింది. కానీ ఫ్రెండ్స్ వల్ల ఫ్యామిలీ సపోర్ట్ వల్ల ఈరోజు హ్యాపీగా ఉన్నాను.
Comments
Please login to add a commentAdd a comment