
నా పేరు వెంకట్. తన పేరు లక్కీ. సోషల్ మీడియా ద్వారా లక్కీ నాకు పరిచయం అయ్యింది. రోజు చాట్ చేసుకుంటూ ఇద్దరం బాగా దగ్గరయ్యాము. అన్ని విషయాలు షేర్ చేసుకునేవాళ్లం. తనతో మాట్లాడుతుంటే నాకు చాలా ఆనందంగా ఉండేది. తన ఆలోచనా విధానం, మాట్లాడే పద్దతి నాకు చాలా నచ్చేది. ఇంతకు ముందు ఎంత మందితో కలగని ఫీలింగ్ ఆమెతో మాట్లాడుతుంటే కలిగేది. ఎందుకో నాకు తన పైన ఉన్నది ప్రేమ అనిపించి ఒక రోజు తనకి ప్రపోజ్ చేశాను. దానికి తను పాజిటివ్‌గానే స్సందించింది. కానీ తన ఫ్యామిలీకి ఇష్టమైతేనే పెళ్లి చేసుకుంటాను అని చెప్పింది. నా మనసులో ఉన్న మాటనే తను కూడా చెప్పింది. నేను ఎలా అయితే తన మీద ప్రేమ పెంచుకున్నానో తను కూడా అలానే నా మీద ప్రేమ పెంచుకుంది.
మేమిద్దరం పరిచయమయ్యి 2 సంవత్సరాలు అవుతుంది. కానీ మేం ఇద్దరం ఇప్పటి వరకు కలుసుకోలేదు. ఒక్కరోజు కూడా మాట్లాడుకోకుండా ఉండలేము. ప్రస్తుతం మేము జాబ్ కోసం చదువు మీద శ్రద్ద పెట్టాము. జాబ్ రాగానే మా విషయం ఇంట్లో చెబుదాం అనుకుంటున్నాం. మా ప్రేమను పెద్దలు ఒప్పుకొని పెళ్లి చేస్తారని ఆశిస్తున్నాను.
ఇట్లు
వెంకట్ లక్కీ(వరంగల్)
Comments
Please login to add a commentAdd a comment