
ప్రేమలో ఎలా పడ్డానో చెప్పడం కంటే ప్రేమించుకున్న తరువాత మేమిద్దరం ఎలా ఉన్నామో చెప్పాలనుకుంటున్నాను. అందరిలానే మేమిద్దరం కూడా ఒకరినొకరం ఇష్టపడ్డాం. మా ప్రేమను ఒకరితో ఒకరం చెప్పుకున్నాం. ఇద్దరి మధ్య బంధం బలపడాలంటే అంత తేలికైన పని కాదు. దాని కోసం రెండు వైపుల నుంచి కృషి చేయాల్సి ఉంటుంది. అప్పుడే ప్రేమ అంటే ఏంటో దాని అనుభూతి ఏంటో తెలుస్తుంది.
నా ప్రేమ పేరు శ్వేత. తనంటే నాకు చాలా ఇష్టం. ఎంత ఇష్టం అంటే ఎప్పుడూ తనని సంతోషంగా ఉంచడం కోసం ఏమి చేయాలి అని ఆలోచించే అంత.
మేం చాలా తక్కువ సార్లే గొడవపడ్డాం. గొడవలు పడ్డ ప్రతిసారి మా ప్రేమ పెరుగుతూనే ఉంది. ఇద్దరం కలసి హ్యాపిగా ఉండటానికి రీజన్ ప్రతి విషయంలో ఇద్దరం కలసి ఉండటమే. తను నాకు ఏదైనా చెప్తే చాలు ఆలస్యం చేయకుండా వెంటనే ఆ పని చేస్తాను. అప్పుడు తన కళ్లల్లో కనిపించే ఆనందం నాకు చాలా ఇష్టం. ప్రతి రోజు ఉదయం తను చేసే ఫోన్ కాల్‌తోనే నా రోజు మొదలవుతుంది. కాల్ చేసిన ప్రతిసారి లవ్ యు చెప్పుకుంటాం. అలా చెప్పకపోతే అలగడంతోపాటు పన్షిమెంట్ కూడా ఉంటుంది. అది ఏంటంటే లవ్‌యు అని 50 సార్లు చెప్పాలి. ఇద్దరం ప్రతి విషయాన్ని మాట్లాడుకుంటాం. ఎంత మాట్లాడుకున్న ఏదో ఒక టాపిక్ ఇంకా మిగిలే ఉంటుంది.
అందరిలాగే మా రిలేషన్‌షిప్‌లో కూడా బ్యాడ్ టైమ్స్ ఉన్నాయి. కానీ అవి చాలా తక్కువే ఉన్నాయి. ఏం జరిగినా మేం మాత్రం ఎప్పటికీ కలిసే ఉంటాము. తనని నేను పేరు పెట్టి పిలవను కానీ చాలా ముద్దు పేర్లతో పిలుస్తాను. ఇద్దరం ఒకరిని ఒకరం బాగా గారాబం చేస్తాము. మా ఇద్దరికి మొదటి నుంచి అలా సెట్ అయిపోయింది. ఆమె నా జీవితంలో ఉన్నందుకు నేను చాలా ఆనందంగా ఫీల్ అవుతున్నాను.
మా లైఫ్‌లో ఎప్పటికీ మర్చిపోలేని కొన్ని జ్ఞాపకాలు ఉన్నాయి. ఫస్ట్ టైమ్ తనతో కలసి బైక్ మీద లాంగ్ డ్రైవ్‌కు వెళ్లాను. అది నా జీవితంలో అందమైన క్షణం. రాత్రంతా తనతో కబుర్లు చెప్పుకొని హ్యాపిగా గడిపాము. ఇంకోసారి కార్ అద్దెకు తీసుకొని లాంగ్ డ్రైవ్‌కు వెళ్లి ఎంజాయ్ చేశాము. ఆ తరువాత తనంటే ఇంకా ఇష్టం పెరిగిపోయింది. మా ఇద్దరి కులాలు వేరు. మా ఇంట్లో ఏ ప్రాబ్లెమ్ లేదు. కానీ వాళ్లింట్లోనే ప్రాబ్లెమ్ అవుతుందని తను చెబుతుంది. ఎలా అయిన వాళ్లింట్లో ఒప్పించి తనని పెళ్లి చేసుకోగలను అనే నమ్మకం నాకుంది. లవ్‌లో పడిన తరువాత ప్రేమ అంటే ఇద్దరు కలసి ఒకే మైండ్‌సెట్‌లోకి రావడం అనే విషయం నాకు అర్థం అయ్యింది. మేమిద్దరం మేడ్ ఫర్ ఈచ్ అదర్.
పేరు చెప్పలేదు.
Comments
Please login to add a commentAdd a comment