నేను ఇంటర్‌మీడియట్‌లో ఉన్నప్పుడు మా పెద్దబాపు కొడుకు దుబాయ్ నుంచి వచ్చాడు. తన వాళ్ల ఫ్రెండ్స్ అందరి కోసం గిఫ్ట్‌లు తీసుకువచ్చాడు. అవి వాళ్లకు ఇవ్వడానికి నేను కూడా తనతోపాటు వెళ్లాను. అక్కడే నేను మొదటిసారి ఆమెను చూశాను. తనని చూడగానే తను నాకు బాగా నచ్చింది. మాట్లాదాం అనుకున్నాను కానీ కుదరలేదు. మేం ఇంటికి తిరిగి వచ్చేశాం. తరువాత మళ్లీ వాళ్ల బంధువుల పెళ్లి అయితే వెళ్లాం. నేను తనని చూస్తూ ఉండిపోయాను. తనతో ఒక్కసారి మాట్లాడాను. తరువాత మా పెద్దబాపు కొడుకును అడిగి ఆమె ఫోన్ నంబర్ తీసుకున్నాను. తనకి మెసేజ్ చేశాను. చాలా రోజుల వరకు రిప్లై రాలేదు.
తరువాత ఎవరు మెసేజ్ చేసింది అని రిప్లై వచ్చింది. నేను చెప్పగానే నన్ను గుర్తుపట్టింది. నేను ఇంకా రోజు మెసేజ్ చేసేవాడ్ని బాగానే మాట్లాడేది. తనకి నా ప్రేమ విషయం ఎదురుగా వెళ్లి చెబుదాం అనుకున్నాను. కానీ ధైర్యం చాలలేదు. ఫోన్‌లోనే నా ప్రేమ విషయం చెప్పాను. తను రిప్లై ఇవ్వలేదు. కానీ తరువాత రోజు నుంచి నాతో మాములుగానే చాట్ చేసేది. నాకు ఎందుకో తనని ఇబ్బంది పెడుతున్నాను అనిపించింది. నేను దుబాయ్ వెళ్లిపోవాలని నిర్ణయించుకున్నాను.
అయితే నేను దుబాయ్ వెళ్లే రెండు రోజుల ముందు తను నాకు ఐ లవ్ అని చెప్పింది. దుబాయ్ హ్యాపీగా వెళ్లిరా అని చెప్పింది. రెండు సంవత్సరాలు దుబాయ్ లోనే ఉన్నాను. నేను ఒకసారి తన ఫోటో అడిగాను. తను ఎందుకు అని అడిగింది. నిన్ను చూడాలనిపిస్తోంది అని చెప్పాను. తను పంపింది. అది ఒక్కటే ప్రస్తుతం నాకు మిగిలింది. కొన్ని రోజులకు వాళ్ల ఇంటిలో తనకు సంబంధాలు చూస్తున్నారు అని ఇంట్లో వచ్చి మాట్లాడమని చెప్పింది. నేను మాట్లాడితే బాగోదు అని మా ఇంట్లో ఒప్పించి వాళ్ల ఇంటికి పంపిచాను. వాళ్ల ఇంట్లో ఒప్పుకోలేదు. తను అప్పటి నుంచి నాతో మాట్లాడటం మానేసింది. తనకు వేరే వాళ్లతో పెళ్లి అయిపోయింది. నాకు అసలు అర్థం కానీ విషయం ఏంటంటే అమ్మాయిలు అంత తేలికగా ఎలా మారిపోతారు. ప్రేమించిన వ్యక్తిని మర్చిపోతారు.అసలు తను నన్న ఎలా మర్చిపోయిందో అర్థం కావడం లేదు. నేను మాత్రం తనని మర్చిపోలేకపోతున్నాను. కొన్ని కొన్ని సార్లు అయితే చచ్చిపోవాలనిపిస్తోంది. తనతో మాట్లాడిన ప్రతి మాట నాకొక మధుర జ్ఞాపకమే. తను ఎక్కడ ఉన్న ఆనందంగా ఉండాలని కోరుకుంటున్నాను.
ఇట్లు,
నాని(హైదరాబాద్).
Comments
Please login to add a commentAdd a comment