
నేను డిగ్రీ చదివే రోజుల్లో నన్ను ఫస్ట్ ఇయర్ నుంచే ఒక అబ్బాయి లవ్ చేయడం మొదలు పెట్టాడు. ఆ విషయం నాకు మా సెకండ్ ఇయర్‌లో తెలిసింది. నాకు మా బావతో ఎప్పుడో పెళ్లి ఫిక్స్ అయ్యింది. ఆ విషయం అతనికి చెప్పి బుద్ధిగా చదువుకోమని చెప్పాను. కానీ తను వినలేదు. రోజు ఉదయం, సాయంత్రం నా వెంట వచ్చి నేను జాగ్రత్తగా వస్తున్నానా, ఇంటికి సేఫ్‌గా వెళుతున్నానా లేదా అని చూసేవాడు. చాలా అంటే చాలా లవ్ అండ్ కేరింగ్ చూపించేవాడు. నాకు మ్యారేజ్ ఫిక్స్ అయ్యి ఉండకపోతే తననే లవ్ చేసేదాన్ని ఏమో? తను అంతలా నా మీద ప్రేమ చూపించేవాడు.
తను నన్ను ఎంతలా ప్రేమించాడు అంటే నా పేరును తన చేతి మీద పచ్చబొట్టు వేయించుకున్నాడు. డిగ్రీ అయిపోయిన వెంటనే నాకు పెళ్లి అయ్యిపోయింది. కానీ తనది నిజమైన ప్రేమ అని తన కళ్లలో నాకు కనిపించేది. ఆ నిజమైన ప్రేమను నేను మిస్ అయ్యాను. తనది నిజమైన ప్రేమ అని ఎందుకు అంటున్నాను అంటే నా మ్యారేజ్ అయ్యాక తను నువ్వు ఎక్కడ ఉన్న హ్యాపీగా ఉండాలి అది చాలు నాకు అన్నాడు. అలాగే ఇప్పుడు నేను కూడా అదే కోరుకుంటున్నాను ఎక్కడ ఉన్న తను హ్యపీగా ఉండాలి.
అవని(గుంటూరు).
( పేరు మార్చాం).
Comments
Please login to add a commentAdd a comment