‘సవ్యసాచి’ ప్రీ లుక్ పోస్టర్
నాగచైతన్యకు ప్రేమ కథా చిత్రాలే కలిసి వచ్చాయి. మాస్ హీరోయిజం ట్రై చేసిన ప్రతిసారి చేతులు కాలాయి. చైతు లవర్ బాయ్‌లా కనిపించిన సినిమాలే బాక్సాఫీస్ వద్ద విజయాన్ని సాధించాయి. అయినా సరే మాస్ హీరోగా గుర్తింపు తెచ్చుకోవడానికి తెగ కష్టపడుతున్నాడు అక్కినేని హీరో. తనకు ప్రేమమ్ లాంటి బిగ్ హిట్ ఇచ్చిన దర్శకుడు చందూ మొండేటి డైరెక్షన్‌లో ‘సవ్యసాచి’ సినిమాను చేస్తున్నాడు చైతు.
మరి ఈ సినిమా తనకు మాస్ ఇమేజ్‌ను తెచ్చిపెడుతుందో లేదో వేచి చూడాలి. సవ్యసాచి అని టైటిల్ పెట్టే ఆసక్తి రేకెత్తించారు. అర్జునుడికి మరో పేరే సవ్యసాచి. అయితే ఈ సినిమాకు సంబంధంచిన తొలి పోస్టర్‌ను మార్చి 16న విడుదల చేయనున్నారు. ఫస్ట్ పంచ్ పేరుతో ఈ పోస్టర్ రేపు (శుక్రవారం) ఉదయం 10:30 లకు విడుదల కానుంది. ఈ సినిమాలో హీరో మాధవన్ విలన్‌గా నటిస్తున్నారు. వీరిద్దరి మధ్య వచ్చే సీన్లు, పోరాటాలు సినిమాకి హైలెట్ అవుతాయని చిత్రబృంద్ అంటోంది. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమాకు సీనియర్ సంగీత దర్శకులు ఎం.ఎం. కీరవాణీ సంగీతమందిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment