savya sachi
-
రంగురంగుల దుస్తులు.. చినుకులతో కలిసి చిందేయ్యండి
వసంతమాసంలోనే పువ్వుల సింగారం గురించి మాట్లాడుకుంటాం. కానీ, చినుకు సందడి చేసే వర్షాకాలంలోనూ పువ్వుల సందడి ఎంత అందాన్నిస్తుందో మాటల్లో చెప్పలేం.పచ్చని ప్రకృతి చినుకు స్నానం చేస్తుంటే.. పూల సింగారం విహారానికి వస్తే..మబ్బు పట్టిన నింగి నుంచి నేలకు మెరుపు దిగివచ్చినట్టే. మీదైన ముద్ర తెలియాలంటే ఈ కాలం రకరకాల ప్రింట్ల దుస్తులను ఎంపిక చేయండి. రంగురంగులుగా చినుకులతో కలిసి చిందేయ్యండి. రంగుల వర్ణాలు వేడి నుండి చినుకులు ఉపశమనం ఇచ్చేదే ఈ సమయం. కాకపోతే చెత్త రోడ్లు, తడిపాదాలు, ట్రాఫిక్ మనకు రకరకాల పరీక్షలను తీసుకువస్తాయి. కాబట్టి, రుతుపవనాలు మీ స్టైల్‌ను ఎలా తగ్గించబోతున్నాయనే దాని గురించి చింతిస్తున్నట్లయితే ముందుగా, రెయిన్ గేర్ ఎంపిక బెస్ట్ ఎంపిక అంటారు ఇండియన్ డిజైనర్ మసాబా గుప్త. ‘ఈ కాలం ప్రకాశవంతమైన నారింజ, ఎరుపు, పసుపు, గులాబీ, నీలం రంగులు మబ్బుగా ఉండే వాతావరణాన్ని ఎదుర్కోవడానికి సరైనవి. లైక్రా లేదా పాలిస్టర్ వంటి లైట్ బ్లెండెడ్ ఫ్యాబ్రిక్లను ధరించడం మంచిది. ఎందుకంటే అవి ముడతలు పడకుండానూ, సులభంగా పొడిగా మారడానికి ఉపయోగపడతాయి. బయటకు వెళ్లేటప్పుడు బిగుతుగా ఉండే ఏదైనా బాటమ్‌ను ఎంచుకోండి. కానీ డెనిమ్, కాడ్రాయ్ల నుండి దూరంగా ఉండండి. పలాజోలు కూడా బాటమ్‌గా ఈ కాలం బాగుంటాయి. ►ఈ కాలం లెదర్ చెప్పులు, బ్యాగులకు దూరంగా ఉండండి. బదులుగా, రంగురంగుల బాలేరినా ఫ్లాట్లు, జెల్లీ షూస్, ఫ్లిఫాప్స్, ఫ్లోటర్లు లేదా క్రోక్స్‌ను ఎంచుకోండి. వాటర్‌ప్రూఫ్, టోట్తో చేసిన అధునాతన బ్యాగ్‌లు వాడటం మేలు. ►తేమతో కూడిన వాతావరణం కారణంగా జుట్టు చిట్లిపోయే అవకాశం ఉంది. కాబట్టి, చక్కని బన్ను లేదా పోనీ టైల్ మంచిది. హాట్ బ్లో డ్రైయింగ్, కర్లింగ్ లేదా స్ట్రెయిటెనింగ్ ఐరన్‌లతో కూడిన హెయిర్స్టైల్స్కు ఈ కాలం దూరంగా ఉండటమే మంచిది. ►మేకప్ విషయానికి వస్తే చాలా తక్కువ చేసుకోవాలి. వాటర్‌ప్రూఫ్ మస్కారాకు బదులు కొద్దిగా పెట్రోలియమ్ జెల్లీతో మీ కనురెప్పలను దిద్దుకోవచ్చు. ముఖం కోసం బ్రౌన్, న్యూడ్ లేదా కాఫీ రంగులో క్లీన్ టోన్లను ఉపయోగించాలి. పీచ్ సూపర్ మ్యాట్ లిప్స్టిక్స్ బాగుంటాయి. ముఖ్యంగా, శుభ్రం చేయడానికి కష్టంగా ఉండే మేకప్‌కు దూరంగా ఉండాలి’ అని తెలియజేస్తున్నారు. కాంతిమంతం ►అబ్స్ట్రాక్ట్ ప్రింట్లు ఉన్న సిల్క్ డ్రెస్సులు, చీరలు ఈ కాలాన్ని మరింత ఉత్తేజితంగా మార్చేస్తాయి. ►చిన్నపాటి గెట్ టుగెదర్ పార్టీలకు ప్రింటెడ్ ఆర్గంజా వంటివి బాగుంటాయి. అయితే, వర్షంలో తడిస్తే ట్రాన్స్పరెంట్గా ఉంటాయి కనుక ఇబ్బందిగా ఉంటుంది. కానీ, డల్‌గా ఉన్న వాతావరణాన్ని బ్రైట్‌గా మార్చేసే సుగుణం ఈ ప్రింట్లకు ఉంటుంది. ►ఓవర్ కోట్స్, జంప్ సూట్స్ .. సౌకర్యంగా ఉండే ఏ డ్రెస్ అయినా ఏదో ఒక చిన్న ప్రింట్ అయినా ఉన్నవి ఎంచుకుంటే ఆకర్షణీయంగా కనిపిస్తారు. తేలికైన సిల్క్ ప్రింట్లు ‘వర్షాకాల వివాహాలకు పూల ప్రింట్లు సరైనవి. తేలికగా ఉండే షిమ్మర్ బ్లైజ్, సిల్క్ లెహంగాకు పెద్ద పెద్ద బార్డర్లు లుక్‌కి గ్లామరస్ టచ్‌ని జోడిస్తాయి. అంతేకాదు రంగుల ఎంపికలలో పీచ్, పగడపు రంగులు ఆకర్షణీయంగా ఉంటాయి. వీటి మీదకు చిన్న పొట్లీ వంటి ఆభరణాలు మరింత అందాన్నిస్తాయి’ అంటారు ఇండియన్ ఫ్యాషన్ డిజైనర్ సవ్యసాచి. -
పెళ్లయ్యాక మారిపోయా
‘‘పెళ్లి తర్వాత లైఫ్‌లో ఒక బ్యాలెన్స్ వచ్చింది. జీవితంలో ఎదురయ్యే ఎత్తు పల్లాలను తట్టుకోగలననే నమ్మకం ఏర్పడింది. హ్యూమన్ బీయింగ్‌గా ఇంకా బెటర్ అయ్యాననిపిస్తోంది’’ అన్నారు నాగచైతన్య. చందూ మొండేటి దర్శకత్వంలో నాగచైతన్య, నిధి అగర్వాల్ జంటగా మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ ఎర్నేని, చెరుకూరి మోహన్, వై. రవిశంకర్ నిర్మించిన ‘సవ్యసాచి’ చిత్రం నేడు విడుదలవుతోంది. ఈ సందర్భంగా నాగచైతన్య చెప్పిన విశేషాలు... ‘ప్రేమమ్’ రిలీజ్ తర్వాత కమర్షియల్ ఎలిమెంట్స్ జోడించి ‘సవ్యసాచి’ కథ చెప్పాడు చందు. కథ నచ్చింది. ‘ట్విన్ వ్యానిషింగ్ సిండ్రోమ్’ అనే కొత్త పాయింట్‌తో సినిమా కదా అని స్టార్టింగ్‌లో కాస్త భయపడ్డాను. రెండు మూడు షెడ్యూల్స్ తర్వాత ఆ భయం పోయింది. ‘ప్రేమమ్’ సినిమాను రీమేక్ చేద్దామనుకున్నప్పుడు కూడా ఆలోచించుకోమని కొందరు సలహాలు ఇచ్చారు. కానీ వర్కౌట్ చేశాం. నా కెరీర్లో బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది. దాంతో చందూపై ఉన్న నమ్మకం పెరిగింది. యాక్టర్‌గా నాలో ఆత్మవిశ్వాసం పెరగడానికి ఆయన ఒక కారణం. చందూ కొత్తగా ఆలోచిస్తాడు. అన్నీ కుదిరితే చందుతో మరో సినిమా చేస్తాను. ►మాధవన్‌గారు సూపర్‌గా చేశారు. ‘సఖి’ సినిమాతో ఆయన ట్రెండ్ క్రియేట్ చేశారు. ఇప్పుడు ‘విక్రమ్ వేదా, రాకెట్రీ: ది నంబి ఎఫెక్ట్’ సినిమాలోనూ అదే చేస్తున్నారు. యాక్టర్‌గా ఆయన దగ్గర్నుంచి నేర్చుకోవాల్సిన అంశాలు చాలా ఉన్నాయి. భూమికగారు బాగా చేశారు. కీరవాణిగారి సంగీతం ఈ సినిమాకు హైలైట్‌గా ఉంటుంది. నా బాడీ లాంగ్వేజ్‌కి తగ్గట్టుగా మూమెంట్స్‌ను కంపోజ్ చేసిన శేఖర్ మాస్టర్‌కు థ్యాంక్స్. నిధి అగర్వాల్ ఆల్‌రౌండర్. మంచి డ్యాన్సర్. ‘హాలోబ్రదర్’ సినిమాలోని నాన్నగారి(నాగార్జున) క్యారెక్టర్స్‌తో ఈ సినిమాకు సంబంధం లేదు. అక్కడ ట్విన్స్ ఉంటారు. ఇక్కడ ఒకే శరీరంలో ట్విన్స్ ఉంటారు. గ్రాఫిక్స్ కారణంగా ఈ సినిమా ఆలస్యం అయ్యింది. ►ఆర్ట్ డైరెక్టర్ రామకృష్ణగారికి ఫ్యాన్‌ని నేను. మా సినిమాకు బాగా వర్క్ చేశారు. నా సినిమానే కాదు ‘అంతరిక్షం’ సినిమా సెట్స్‌ను కూడా చూశాను. ఒక తెలుగు టెక్నీషియన్ ఆ రేంజ్లో చేస్తున్నారంటే అది మంచి పరిణామం. ►నిర్మాణ విలువల పరంగా ఇప్పటివరకు నా కెరీర్లో మైత్రీ మూవీ మేకర్స్‌కు ఫస్ట్ ప్లేస్ ఇస్తాను. ఎందుకంటే వాళ్లు కంటెంట్‌ని నమ్మి సినిమా తీశారు. నిజాయతీగా చెప్పాలంటే నాకు ప్రస్తుతం ఉన్న మార్కెట్‌కు అంత బడ్జెట్ పెట్టాల్సిన అవసరం లేదు కానీ పెట్టారు. మార్కెట్ ఏంటీ? ఎంత లాభం అనే విషయాలను ఆలోచించకుండా కథపై నమ్మకంతో ఖర్చు పెట్టారు. ►అసరమైతే రీషూట్ చేయాలన్న నాన్నగారి ఫార్ములాను నేను నమ్ముతాను. కచ్చితంగా రీషూట్స్ చేయాలనే ఫార్ములా లేదు. డౌట్స్ ఉన్నప్పుడు చేయడంలో తప్పులేదు. సినిమా రిలీజైన తర్వాత ఆ సీన్ రీపేర్ చేసి ఉన్నట్లయితే బాగుండేది. ఇప్పుడు ఆడియన్స్ చెబుతున్న ఆ మార్పు అప్పుడే మనకు అనిపించింది కదా. అప్పుడే చేసి ఉంటే బాగుండు అని అంతా అయిపోయాక ఆలోచించడంకన్నా సెట్స్‌లో ఉన్నప్పుడే రీషూట్స్ చేయడం మంచిదే అని నా అభిప్రాయం. ప్రపంచంలో ఉన్న టాప్ యాక్టర్స్, హీరోలు రీషూట్స్ చేస్తారు. రీషూట్స్ అంటే అది బెటర్మెంట్ అని నా అభిప్రాయం. ►‘శైలజారెడ్డి అల్లుడు’ రిజల్ట్ విషయంలో ఓపెనింగ్ కలెక్షన్స్ పరంగా హ్యాపీగానే ఉన్నాను. ప్రతి సినిమా స్క్రిప్ట్ విషయంలో ఇన్వాల్వ్ అవుతాను. కానీ ఒక లైన్ దాటి వెళ్లకూడదు. అది దర్శకుడికి మనం ఇచ్చే గౌరవంగా నేను ఫీలవుతాను. మారుతిగారు కథ చెప్పినప్పుడు కన్విన్స్ అయ్యాను. కానీ రిజల్ట్స్‌ను ఊహించలేం కదా. ఇక ఒకే రోజు రిలీజైన ‘శైలజారెడ్డి అల్లుడు, యు–టర్న్’ సినిమాల పోటీ అనేది ఓ డిఫరెంట్ సిట్యువేషన్. రివ్యూస్ పరంగా ‘యు–టర్న్’ గెలిచింది (నవ్వుతూ). ►శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న సినిమాలో నేను, సమంత దంపతులుగానే నటిస్తున్నాం. స్క్రిప్ట్ పరంగా కథలో నాకు, సమంతకు గొడవలు ఎక్కువ. నటించడానికి అది కొంచెం కష్టంగా ఉంది. రియల్ౖ లెఫ్‌లో లేవు కదా (నవ్వుతూ). శివ మంచి డైరెక్టర్. వచ్చే ఏడాది ఫిబ్రవరి కల్లా షూటింగ్ పూర్తవుతుందని అనుకుంటున్నాం. ‘మజిలీ’ అనేది వర్కింగ్ టైటిల్‌గా పెట్టుకున్నాం. ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను అలరిస్తుందన్న నమ్మకం ఉంది. ‘వెంకీమామ’ సినిమాను డిసెంబర్లో స్టార్ట్ చేస్తా. పౌరాణికం సినిమాలను టచ్ చేయాలని ఉంది. కానీ ముందు ఓ మూడు నాలుగు హిట్స్ సాధించాలి. ప్రస్తుతానికి నెక్ట్స్ ప్రాజెక్ట్స్ ఇంకా సైన్ చేయలేదు. ►నా కెరీర్ స్టార్టింగ్‌లో నాన్నగారు కథలు విన్నారు కానీ ఇప్పుడు నాకు ఫ్రీ హ్యాండ్ ఇచ్చారు. నాన్నగారు ‘సవ్యసాచి’ సినిమా చూశారు. కొన్ని సలహాలు చెప్పారు. నాన్నగారు చూస్తున్నప్పుడే ఎడిట్ రూమ్‌లో సమంత చూసింది. ►నాన్నగారి ‘నిన్ను రోడ్డు మీద చూసినది..’ సాంగ్ రీమిక్స్ చేస్తున్నప్పుడు మొదట్లో కాస్త కంగారు పడ్డాను. కానీ అవుట్‌పుట్ చూసి హ్యాపీ ఫీలయ్యా. కీరవాణిగారు మంచి సంగీతం ఇచ్చారు. సెకండాఫ్‌కు ఈ సాంగ్ ప్లస్ అవుతుందన్న నమ్మకం ఉంది. -
అంత డ్రామా వద్దన్నారు
హైదరాబాద్ టు ముంబై వయా బెంగళూరు... నిధి అగర్వాల్‌కి ఈ మూడు రాష్ట్రాలతో అనుబంధం ఉంది. పుట్టింది హైదరాబాద్. చదువకున్నది బెంగళూరు. నటిగా కెరీర్ స్టార్ట్ చేసింది ముంబైలో. ఇప్పుడు ‘సవ్యసాచి’ చిత్రం ద్వారా తెలుగు తెరకు పరిచయం అవుతున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నాగచైతన్య, నిధి జంటగా చందూ మొండేటి దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం నవంబర్ 2న విడుదల కానుంది. ఈ సందర్భంగా నిధి అగర్వాల్ చెప్పిన విశేషాలు. ► ‘మున్నా మైఖేల్’ అనే హిందీ చిత్రం ద్వారా కథానాయికగా హిందీలో పరిచయమయ్యాను. అందులో టైగర్ ష్రాఫ్‌కు జోడీగా నటించాను. ఆ సినిమా చూసి చందూ మొండేటి ‘సవ్యసాచి’కి చాన్స్ ఇచ్చారు. హీరో నాగచైతన్య సరసన అవకాశం కావటంతో ఎగిరి గంతేశాను. చైతన్య మంచి కో–స్టార్. చిన్న చిన్న డిటేల్స్‌ను కూడా దర్శకుణ్ణి అడిగి తెలుసుకుంటాడు. సమంత, చైతూ ఇద్దర్ని చాలాసార్లు కలిశాను. వాళ్లిద్దర్నీ చూస్తున్నప్పుడు చైతూ ఎంత లక్కీయో అనిపించేది. ఇద్దరూ సోల్‌మేట్స్. సమంత గ్రేట్ అండ్ బ్యూటిఫుల్. ► ఈ సినిమా కోసం దాదాపు 40 రోజుల పైనే వర్క్ చేశాను. సినిమాలో గ్రాఫిక్స్ పార్ట్ ఎక్కువ. అందుకే ఎక్కువ టైమ్ పట్టింది. నాగార్జునగారి ఓల్డ్ సాంగ్ ‘నిన్ను రోడ్డు మీద చూసినది లగాయితు..’ పాటకు డాన్స్ చేస్తున్నప్పుడు చాలా ఎంజాయ్ చేశాను. కీరవాణి గారి మ్యూజిక్కు ఫిదా అయ్యాను. ఇప్పటివరకు రిలీజైన టీజర్‌ను, ట్రైలర్‌ను కొన్ని వందల సార్లు చూసుకున్నాను. అంత నచ్చాయి. ► నా గురించి చెప్పాలంటే.. మా ఇంట్లో నేను చాలా మొండిదాన్ని. నేను ఏదైనా కోరుకున్నానంటే అది జరిగి తీరాల్సిందే. ఆర్టిస్ట్ అవుతానని పేరెంట్స్ దగ్గర అమాయకంగా అడిగితే, ‘అంత డ్రామా క్రియేట్ చేయకు. నువ్వు ఏది కావాలంటే అదే జరుగుద్ది’ అన్నారు. ‘డోంట్ వర్రీ. మేమంతా నీతో ఉంటాం. కెరీర్‌ని సీరియస్‌గా తీసుకో.. అలాగే ఎంజాయ్ చెయ్’ అని ఎంకరేజ్ చేశారు. ► హ్యాపీగా ఉండాలంటే రోజూ శుభ్రంగా పనిచేయాలి. టైమ్‌కు తిని , చక్కగా నిద్రపోవాలి. హైదరాబాద్‌లో ఉన్నన్ని రోజులు పూర్ణ టిఫిన్ సెంటర్లో ఇడ్లీలు తింటూ (ఎన్నో చెప్పను– నవ్వుతూ), ఐమాక్స్‌లో సినిమాలు చూస్తూ గడిపేస్తాను. ఐ లవ్ హైదరాబాద్. ప్రస్తుతం అఖిల్‌తో ‘మిస్టర్ మజ్ను’ చేస్తున్నాను. కుదిరితే నాగార్జునగారితో కూడా చేయాలని ఉంది. పర్సనల్‌గా దీపికా పదుకోన్గారికి వీరాభిమానిని. ఆమె నాకు ఆదర్శం. బెంగళూర్‌లో చదువుకుని బాలీవుడ్లో అంత ఎత్తుకు ఎదిగారామె. మనం మాత్రం ఎందుకు ఎదగకూడదు? మనమూ ట్రై చేద్దాం అనుకున్నాను. అందుకే ఇండస్ట్రీకి వచ్చా. -
చైతూ.. ఈసారైనా హిట్ కొట్టేనా..?
అక్కినేని వారసుడిగా ఎంట్రీ ఇచ్చిన నాగచైతన్యలో ఆదినుంచీ లవర్ బాయ్‌లానే చూస్తున్నారు ప్రేక్షకులు. మాస్ మంత్రం జపించి హిట్కొట్టాలనుకున్న ప్రతిసారీ చైతూకు ఎదురుదెబ్బే తగిలింది. జోష్‌తో ఎంట్రీ ఇస్తే అంతగా వర్కౌట్ కాలేదు. తరువాత లవర్ బాయ్‌గా నటించిన ఏమాయ చేసావే, 100% లవ్ సినిమాలతో నాగచైతన్య సక్సెస్ సాధించాడు. అయితే మళ్లీ దడ, ఆటోనగర్ సూర్య లాంటి సినిమాలతో మాస్ ప్రేక్షకులను మెప్పించేందుకు ట్రై చేశాడు. కానీ అవి కూడా మిశ్రమ ఫలితాన్నే ఇచ్చాయి. కానీ మాస్ ఆడియన్స్‌కు దగ్గరచేయలేకపోయాయి. బెజవాడ, దోచేయ్, యుద్దం శరణంలాంటి సినిమాలు తీసి చేతులు కాల్చుకున్నాడు. ఒక లైలాకోసం, రారండోయ్ వేడుక చూద్దాం, శైలజా రెడ్డి అల్లుడు లాంటి ఫ్యామిలి, లవ్ ఎంటర్టైనర్తో ఫర్వాలేదనిపించాడు. ప్రేక్షకులు చైతూలో ఓ లవర్బాయ్ను చూస్తుంటే.. చైతూ మాత్రం మాస్ ప్రేక్షకులను మెప్పించేందుకు ట్రై చేస్తూ.. యాక్షన్ సినిమాలను ఎంచుకుంటున్నాడు. మళ్లీ ‘సవ్యసాచి’తో యాక్షన్ ఓరియెంటెడ్‌ను చేస్తూ.. మాస్‌ను ఆకట్టుకునేందుకు డిఫరెంట్ కాన్సెప్ట్‌తో మనముందుకు వస్తున్నాడు. మరి ఈసారైనా చైతూ మాంచి హిట్ కొడతాడో లేదో చూడాలి. నిధి అగర్వాల్ హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రం నవంబర్ 2న విడుదల కానుంది. -
అందాల నిధి
హైదరాబాద్‌లో పుట్టి బెంగళూరులో పెరిగిన నిధి అగర్వాల్ బాలీవుడ్లో తొలిచిత్రం ‘మున్నా మైఖేల్’తో మంచి మార్కులు కొట్టేసింది. నెక్ట్స్ జెన్ స్టార్ అనిపించుకుంది. ‘సవ్యసాచి’తో తెలుగు చిత్రసీమలోకి అడుగుపెడుతున్న నిధి అగర్వాల్ గురించి కొన్నిముచ్చట్లు... అంత ఈజీ కాదు! నిధి కుటుంబం, చుట్టాలలో అటు ఏడుతరాలు ఇటు ఏడుతరాలు నటులు ఎవరూ లేరు. అయినప్పటికీ ‘నటి’ కావాలనేది ఆమె లక్ష్యం. ఇదే విషయాన్ని ఇంట్లోనో, బంధువుల దగ్గరో చెప్పినప్పుడు నవ్వులు వినిపించేవి. ఆ నవ్వుల అర్థం ‘నటి కావాలనుకోవడం అంతా ఈజీ అనుకుంటున్నావా!’ అని కూడా కావచ్చు. బిజినెస్ మేనేజ్మెంట్ చేసిన నిధికి బ్యాలె, కథక్, బెల్లీ నృత్యాలలో ప్రవేశం ఉంది. అందాల పోటీల్లో విజేతలుగా నిలిచి, ఆ తరువాత సినిమాల్లో రాణించిన ఐశ్వర్యారాయ్, ప్రియాంకాచోప్రా, సుస్మితాసేన్... తనకు స్ఫూర్తి అంటోంది నిధి అగర్వాల్. చలో ముంబై నటి కావాలనే పట్టుదలతో ముంబై విమానం ఎక్కేసింది నిధి. నటి కావడానికి ముందు మోడలింగ్‌లో స్టార్ అనిపించుకుంటే అవకాశాలు వాటికవే నడిచొచ్చి డోర్‌బెల్ నొక్కుతాయని సన్నిహితులు చెప్పిన మాటలు నిజమయ్యాయి. మోడలింగ్‌లో రాణిస్తున్నప్పుడే డైరెక్టర్ షబ్బీర్‌ఖాన్ దృష్టిలో పడింది. అలా ‘మున్నా మైఖేల్’ సినిమాతో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టింది. ఈ సినిమాలో ‘డాలీ’ పాత్ర చేసింది. డాలీలాగే నిజజీవితంలోనూ తనకు డ్యాన్స్ అంటే ప్రాణం. అభిమాని తలచే... తక్కువ కాలంలో ఎక్కువమంది అభిమానులను సంపాదించుకున్న కథానాయికల్లో నిధి అగర్వాల్ ఒకరు. ఒక అభిమాని అయితే ఒక గోడ మీద గ్రాఫిటీ ఆర్ట్‌లో నిధి చిత్రం వేసి సామాజిక మాధ్యమాల్లో తెగ హడావుడి చేశాడు. ఇలాంటి అభిమానులకు తన ఫ్యాన్ పేజీలో తప్పనిసరిగా ‘థ్యాంక్స్’ చెప్పేస్తుంది నిధి. ఇదే తొలిమెట్టు నాగచైతన్య ‘సవ్యసాచి’తో తెలుగు చిత్రసీమకు పరిచయమవుతున్న నిధి అఖిల్‌తో కూడా ఒక సినిమాలో నటిస్తుంది. ‘కల కనడం ఒక ఎత్తు. ఆ కలను నెరవేర్చుకోవడం ఒక ఎత్తు. నెరవేరిన కలను నిలబెట్టుకోవడం ఒక ఎత్తు. ‘తక్షణ తీర్పు’ ‘తక్షణ విమర్శ’ ఎదురయ్యే ప్రస్తుత కాలంలో ప్రతికూల ఆలోచనను దగ్గరకు రానివ్వక పోవడం విజయానికి తొలిమెట్టు అంటుంది అందాల నిధి అగర్వాల్. -
శాంపిల్ రెడీ
భారతంలో అర్జునుడి రెండు చేతులకు సమానమైన బలం ఉండేది. అలాంటి శక్తి ఓ హీరోకి ఉంటే ఎలా ఉంటుంది? అనే అంశం ఆధారంగా రూపొందిన సినిమా ‘సవ్యసాచి’. నాగచైతన్య, నిధీ అగర్వాల్ జంటగా చందూ మొండేటి దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ నవీన్, రవిశంకర్, మోహన్ నిర్మించారు. ‘‘ఈ సినిమా ట్రైలర్‌ను అక్టోబర్ 1న ఉదయం 10 గంటలకు విడుదల చేయబోతున్నాం. షూటింగ్ పూర్తయింది. పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు వేగంగా జరుగుతున్నాయి. సినిమా ప్రేక్షకులకు నచ్చుతుందన్న నమ్మకం ఉంది’’ అని చిత్రబృందం పేర్కొంది. మాధవన్, భూమికా చావ్లా, ‘వెన్నెల’ కిశోర్, సత్య, రావు రమేశ్ కీలక పాత్రలు చేశారు. యం.యం. కీరవాణి సంగీతం అందించారు. యువరాజ్ సినిమాటోగ్రఫీ అందించిన ‘సవ్యసాచి’ చిత్రం నవంబర్‌లో ప్రేక్షకుల ముందుకు రానుంది. -
సవ్యసాచి, అమర్ అక్బర్ ఆంటోని రిలీజ్ డేట్స్ ఫిక్స్!
శ్రీమంతుడు, జనతా గ్యారెజ్, రంగస్థలం సినిమాలతో హ్యాట్రిక్ కొట్టిన సంస్థ మైత్రి మూవీ మేకర్స్. బ్లాక్ బస్టర్ హిట్లతో దూసుకుపోతున్న మైత్రి మూవీస్ ప్రస్తుతం టాలీవుడ్లో ప్రతిష్టాత్మక సంస్థగా మారింది. వరుస ప్రాజెక్ట్‌లతో మైత్రీ మూవీస్ బిజీగా ఉంది. ప్రస్తుతం నాగ చైతన్యతో సవ్యసాచి, రవితేజతో అమర్ అక్బర్ ఆంటోని చిత్రాలను నిర్మిస్తున్నారు. ఈ చిత్రాల విడుదల తేదీని అధికారికంగా ప్రకటించింది ఈ సంస్థ. సవ్యసాచి సినిమాను నవంబర్ 2న , అమర్ అక్బర్ ఆంటోని మూవీని అక్టోబర్ 5న రిలీజ్ చేయనున్నారు. మహేష్‌బాబు 26వ సినిమాను సుకుమార్ దర్శకత్వంలో మైత్రీ మూవీస్ నిర్మించబోతున్న విషయం తెలిసిందే. #AAAOnOct5th#SavyasachiOnNov2nd pic.twitter.com/De3obFUydU — Mythri Movie Makers (@MythriOfficial) August 11, 2018 -
ఫారిన్ పోదాం
సవ్యసాచి తన గమ్యాన్ని చేరుకోవడానికి జస్ట్ కొంచెం దూరంలోనే ఉన్నాడు. ఈ ప్రయాణంలో అతను ఎదుర్కొన్న సవాళ్లేంటో తెలియాలంటే మా చిత్రం చూడాల్సిందే అంటున్నారు చందు మొండేటి. నాగచైతన్య, నిధీ అగర్వాల్ హీరో, హీరోయిన్లుగా దర్శకుడు చందు మొండేటి తెరకెక్కిస్తున్న చిత్రం ‘సవ్యసాచి’. మాధవన్, భూమిక ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ యర్నేని, వై. రవిశంకర్, మోహన్ చెరుకూరి నిర్మిస్తున్నారు. ఇందులో నాగచైతన్య యాడ్ ఫిల్మ్ మేకర్‌గా కనిపించనున్నారు. రెండు చేతులను ఒకే సామర్థ్యంతో ఉపయోగించగలిగే సవ్యసాచిలా నాగచైతన్య రోల్ ఉంటుందని తెలిసిన విషయమే. ఈ సినిమా షూటింగ్ లాస్ట్ షెడ్యూల్లో ఉంది. ‘‘టాకీ పార్ట్ ఆగస్ట్ 8తో కంప్లీట్ చేస్తాం. ఒక సాంగ్‌ను ఫారిన్లో షూట్ చేయనున్నాం. అది ఆగస్ట్ 15కల్లా పూర్తవుతుంది. ఆ తర్వాత పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్, సిజీ వర్క్స్ అన్నీ కూడా సెప్టెంబర్ 15 లోపు కంప్లీట్ చేస్తాం. త్వరలో రిలీజ్ డేట్ అనౌన్స్ చేయాలనుకుంటున్నాం’’ అని చిత్రబృందం పేర్కొంది. ఇదిలా ఉంటే, నాగచైతన్య హీరోగా మారుతి దర్శకత్వంలో సితార ఎంటర్టైన్మెంట్స్ నిర్మించిన ‘శైలజారెడ్డి అల్లుడు’ ఆగస్టు 31న విడుదల కానుంది. -
‘సవ్యసాచి’ చివరి షెడ్యుల్
‘రారండోయ్ వేడుకచూద్దాం’ సినిమాతో మంచి విజయాన్ని సొంతం చేసుకున్నాడు నాగచైతన్య. ప్రస్తుతం ఈ హీరో సవ్యసాచి, శైలజా రెడ్డి అల్లుడు షూటింగ్స్‌తో బిజీగా ఉన్నారు. ఇవే కాకుండా శివ నిర్వాణ డైరెక్షన్లో ఓ ప్రేమకథను కూడా అంగీకరించాడు. ఈ మూవీలో సమంత హీరోయిన్గా నటించనున్నారు. శైలజా రెడ్డి అల్లుడు ఆగస్ట్ 31న విడుదల కానుంది. మారుతి డైరెక్షన్లో రమ్యకృష్ణ ముఖ్య పాత్రలో నటించగా.. చైతన్యకు జోడిగా అను ఇమ్మాన్యుయెల్ నటిస్తున్నారు. మరోపక్క చందూ మొండేటీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సవ్యసాచి.. ప్రస్తుతం చివరి షెడ్యుల్ జరుపుకుంటోందని సమాచారం. త్వరలోనే విడుదల తేదిని ప్రకటించనున్నట్లు నిర్మాతలు తెలిపారు. ఈ మూవీలో నిధి అగర్వాల్ హీరోయిన్గా నటిస్తున్నారు. -
మార్చి 16న ‘పంచ్’ పడుద్ది!
నాగచైతన్యకు ప్రేమ కథా చిత్రాలే కలిసి వచ్చాయి. మాస్ హీరోయిజం ట్రై చేసిన ప్రతిసారి చేతులు కాలాయి. చైతు లవర్ బాయ్‌లా కనిపించిన సినిమాలే బాక్సాఫీస్ వద్ద విజయాన్ని సాధించాయి. అయినా సరే మాస్ హీరోగా గుర్తింపు తెచ్చుకోవడానికి తెగ కష్టపడుతున్నాడు అక్కినేని హీరో. తనకు ప్రేమమ్ లాంటి బిగ్ హిట్ ఇచ్చిన దర్శకుడు చందూ మొండేటి డైరెక్షన్లో ‘సవ్యసాచి’ సినిమాను చేస్తున్నాడు చైతు. మరి ఈ సినిమా తనకు మాస్ ఇమేజ్ను తెచ్చిపెడుతుందో లేదో వేచి చూడాలి. సవ్యసాచి అని టైటిల్ పెట్టే ఆసక్తి రేకెత్తించారు. అర్జునుడికి మరో పేరే సవ్యసాచి. అయితే ఈ సినిమాకు సంబంధంచిన తొలి పోస్టర్‌ను మార్చి 16న విడుదల చేయనున్నారు. ఫస్ట్ పంచ్ పేరుతో ఈ పోస్టర్ రేపు (శుక్రవారం) ఉదయం 10:30 లకు విడుదల కానుంది. ఈ సినిమాలో హీరో మాధవన్ విలన్‌గా నటిస్తున్నారు. వీరిద్దరి మధ్య వచ్చే సీన్లు, పోరాటాలు సినిమాకి హైలెట్ అవుతాయని చిత్రబృంద్ అంటోంది. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమాకు సీనియర్ సంగీత దర్శకులు ఎం.ఎం. కీరవాణీ సంగీతమందిస్తున్నారు. -
రన్ చైతూ రన్
టైమ్ బాగుంటే గెలిచే చాన్స్ అందరికీ ఉంటుంది. కానీ గెలుపు తలుపు తీయడం అంత ఈజీ కాదు. ఎన్నో ఇబ్బందులు, మరెన్నో ఎదురు దెబ్బలు ఎదుర్కోవాలి. కానీ గెలవాలంటే పరుగు అపకూడదు.. పోరాడాలి. ఎంత ఎక్కువ పోరాడి గెలిస్తే అంత ఎక్కువ మజా ఉంటుంది. ప్రస్తుతం ఆ మజా కోసమే పోరాడుతున్నారు హీరో నాగచైతన్య. చందు మొండేటి దర్శకత్వంలో నాగచైతన్య హీరోగా మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై రూపొందుతున్న సినిమా ‘సవ్యసాచి’. నిధి అగర్వాల్ కథానాయిక. ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్‌లో జరుగుతోంది. నాగచైతన్యపై ఛేజింగ్ సీన్స్‌ను తెరకెక్కిస్తున్నారు. ‘‘ప్రజెంట్ ప్రీ–క్లైమాక్స్ ఫైట్ సీన్ జరుగుతోంది. సినిమాలో మూడు రిస్కీ ఫైట్లు ఉంటాయి. వీటిలో మేజర్ రిస్కీ ఫైట్‌ను ప్రస్తుతం షూట్ చేస్తున్నాం. ఈ ౖఫైట్ను సిక్స్ డేస్ షూట్ చేస్తాం. రామ్–లక్ష్మణ్ మాస్టర్స్ డిజైన్ చేసిన ఈ ఫైట్ థ్రిల్‌కి గురి చేసే విధంగా ఉంటుంది. ఈ నెల 7న మొదలుపెట్టిన ఈ ఫైట్‌ను 12న పూర్తి చేస్తాం. ఆ తర్వాత సంక్రాంతికి బ్రేక్ తీసుకుంటాం. ఈ నెలాఖరున మరో షెడ్యూల్‌ను మొదలుపెడతాం’’ అని యూనిట్ సన్నిహిత వర్గాలు తెలిపాయి. -
బ్యాంగ్ బ్యాంగ్
భూమిక చివరిసారిగా తెలుగు స్క్రీన్‌పై కనిపించింది ఎప్పుడు? ఓ మూడేళ్లు అయ్యుంటుంది. ఈ ఏడాది ‘ఎంసీఏ’ (మిడిల్ క్లాస్ అబ్బాయి)తో తెలుగుకి మళ్లీ వచ్చారు. ఈ చిత్రంలో ఆమె హీరో నానికి వదినగా నటించి, మంచి మార్కులే కొట్టేశారు. కమ్‌బ్యాక్ అంటే.. ఇలా బ్యాంగ్ బ్యాంగ్‌గా ఉండాలన్నట్టు ఈ చిత్రంలో భూమిక మెప్పించారు. నెక్ట్స్ ఏంటి? మళ్లీ కనిపిస్తారా? గ్యాప్ తీసుకుంటారా? అంటే.. చాన్సే లేదు. ఇక వరుసగా సినిమాలు చేసేలా ఉన్నారు. ఎందుకంటే, ‘ఎంసీఏ’ ఇలా రిలీజైందో లేదో భూమిక మరో సినిమాతో బిజీ అయ్యారు. ప్రస్తుతం చందూ మొండేటి దర్శకత్వంలో నాగచైతన్య నటిస్తున్న ‘సవ్యసాచి’ షూటింగ్లో చాలా బిజీగా ఉన్నారు భూమిక. దీన్నిబట్టి చూస్తుంటే ఈ బ్యూటీ తన కెరీర్ మీద ఫుల్ ఫోకస్ పెట్టారనిపిస్తోంది. సో.. భూమిక యూత్ హీరోలందరికీ అక్క, వదినగా, అవి కాకపోతే కథ డిమాండ్‌ని బట్టి కథానాయికగా కూడా కనిపించే అవకాశం ఉంది. -
ఇల్లు మారారు
నాగచైతన్య ఇంటి నుంచి మాధవన్ ఇల్లు ఎంతో దూరంలో లేదు. ఆ ఇంటికీ ఈ ఇంటికీ చకాచకా వెళ్లిపోవచ్చు. ఇన్నాళ్లూ మాధవన్ ఇంట్లోనే చైతూ, నిధీ అగర్వాల్, ఇంకా చాలామంది సందడి చేశారు. ఇప్పుడు చైతూ అడ్డాలో హంగామా చేయనున్నారు. ఇల్లేంటి? హంగామా ఏంటి అనుకుంటున్నారా? ఇదంతా నాగచైతన్య, నిధి అగర్వాల్ జంటగా రూపొందుతున్న ‘సవ్యసాచి’ మూవీ హంగామా. ‘కార్తికేయ’, ‘ప్రేమమ్’ వంటి హిట్స్ తర్వాత దర్శకుడు చందు మొండేటి తెరకెక్కిస్తోన్న చిత్రమిది. మైత్రి మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్, మెహన్ చెరుకూరి నిర్మిస్తున్నారు. కొన్ని రోజులుగా మాధవన్ ఇంటికి సంబంధించిన సీన్స్ తీశారు. ఈ షెడ్యూల్ వరకూ మాధవన్ వర్క్ కంప్లీట్ అయింది. దాంతో అందరికీ టాటా చెప్పి, చెన్నై చెక్కేశారాయన. ఇప్పుడు నాగచైతన్య ఇల్లు, వర్క్ ప్లేస్ సీన్స్ తీయడానికి ప్లాన్ చేశారు. ఈ నెల 28 వరకూ ఈ షెడ్యూల్ జరుగుతుంది. మరి, క్రిస్మస్ పండగకి సెలవు లేదా? అంటే.. ‘‘ఆ ఒక్క రోజు సెలవు ఇవ్వాలనుకుంటున్నారు’’ అని యూనిట్ సన్నిహిత వర్గాలు తెలిపాయి. జనవరి 4న ఓ కొత్త షెడ్యూల్ మొదలుపెట్టనున్నారు. ఇంతకీ.. ఇందులో చైతూ రెండు చేతులకు సేమ్ పవర్ ఉంటుందన్న సంగతి తెలిసిందే. హీరో ఒంటి చేత్తో విలన్లను రఫ్ఫాడిస్తే చూడ్డానికి రెండు కళ్లూ చాలవు. ఇక, రెండు చేతులతో అంటే.. దుమ్ము దుమారమే. అయినా రెండు చేతులకూ పవర్ ఉండటం ఏంటి? చందు మొండేటికి ఈ ఐడియా ఎలా వచ్చింది? అంటే.. ‘‘భారతంలో అర్జునుడి రెండు చేతులకూ ఒకే సామర్థ్యం ఉంటుంది. అది తెలుసు. నేనొక ఆర్టికల్ చదివాను. అందులో ఒక వ్యక్తి రెండు చేతులకూ సేమ్ పవర్ ఉంటుంది. అది ఇన్స్పైరింగ్గా అనిపించి, హీరో పాత్రను మలిచాను’’ అని చందు మొండేటి తెలిపారు. -
సవ్యసాచి... ఎటు నీ చూపుల గురి?
‘సవ్యసాచి’... పంచ పాండవుల్లోని అర్జునుడికున్న పేర్లలో ఒకటి! ఈ పేరు ఎందుకు వచ్చిందంటే... ‘రెండు చేతులతోనూ విల్లు ఎక్కుపెట్టగల సమర్ధుడు కాబట్టి’ అనే ఆన్సర్ వస్తుంది. అక్కినేని నాగచైతన్య హీరోగా చందూ మొండేటి దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ ‘సవ్యసాచి’ పేరుతో సినిమా నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సిన్మా టైటిల్ లోగోతో పాటు రెండు చేతులను వెనక్కి పెట్టుకుని శూలాలు పట్టుకున్న హీరోని చూస్తే పైన చెప్పిన ఆన్సర్ నిజమే అన్పిస్తుంది. అయితే... అర్జునుణ్ణి ‘సవ్యసాచి’ అనడానికి ఇంకో కారణం ఉంది. అదేంటంటే... పట్టుదల, అంకితభావం, కఠోర శ్రమతో అతి తక్కువ కాంతిలోనూ శబ్దాన్ని బట్టి విల్లు ఎక్కుపెట్టి వస్తువు ని కొట్టగల నైపుణ్యం అర్జునుడి సొంతమట! ఈ మాటలను దృష్టిలో పెట్టుకునే ఈ రోజు నాగచైతన్య బర్త్‌డే సందర్భంగా విడుదల చేసిన లుక్‌ను డిజైన్ చేసినట్టున్నారు. చైతూ చూపుల్లో ఓ పట్టుదల, కసి కనిపిస్తున్నాయ్ కదూ!! ఆ చూపుల గురి ఎటో మరి? ప్రస్తుతం హైదరాబాద్‌లో చైతూ, మాధవన్ తదితరులపై సీన్స్ తీస్తున్నారు. ఇందులో నిధీ అగర్వాల్ హీరోయిన్. ఈ చిత్రానికి సంగీతం: కీరవాణి, కెమెరా: యువరాజ్, సీఈఓ: చిరంజీవి (చెర్రీ), లైన్ ప్రొడ్యూసర్: పీటీ గిరిధర్, నిర్మాతలు: వై. నవీన్, వై. రవిశంకర్, మోహన్ (సీవీయం). -
షూటింగ్ షురూ!
మీ లెఫ్ట్ హ్యాండ్ మీ హ్యాండోవర్లోనే ఉందా..? ఇదేం తిక్క ప్రశ్న. రైట్ అయినా లెఫ్ట్ అయినా ఎవరి హ్యాండ్ వారి హ్యాండోవర్లోనే ఉంటుంది కదా అనుకోవచ్చు. కానీ హీరో నాగచైతన్య లెఫ్ట్ హ్యాండ్‌కు మాత్రం నో కంట్రోల్. అంతేకాదు.. కుడి చేతికి ఎంత పవర్ ఉందో సేమ్ టు సేమ్ అంతే పవర్ ఎడమ చేతికి ఉంది. కానీ ఇక్కడో ప్రాబ్లమ్ ఉంది. ఏంటంటే... నాగచైతన్య లెఫ్ట్ హ్యాండ్ అతని బ్రెయిన్ చెప్పిన పని చేయదు. వినడానికి చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది కదూ. అన్నట్లు.. చైకి లెఫ్ట్‌హ్యాండ్ మీద కంట్రోల్ లేనిది రీల్ లైఫ్‌లోనే. రియల్ లైఫ్‌లో కాదండోయ్. చందూ మొండేటి దర్శకత్వంలో నాగచైతన్య హీరోగా ‘సవ్యసాచి’ అనే చిత్రం రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఇందులో నాగచైతన్య క్యారెక్టర్ పైన చెప్పిన విధంగా ఉంటుంది. ఈ సినిమా షూటింగ్‌ను ఈ నెల 8న స్టార్ట్ చేయాలనుకుంటున్నారు. కన్నడ బ్యూటీ నిధీ అగర్వాల్‌ను హీరోయిన్గా సెలక్ట్ చేశారని ఇన్సైడ్ టాక్. పెళ్లి తర్వాత చై–సామ్ హనీమూన్ వెళ్లారు. ట్రిప్‌ని ఎంజాయ్ చేసి, హైదరాబాద్ కూడా వచ్చేశారు. ఇక, ఇద్దరూ తమ తమ షూటింగ్స్‌తో బిజీగా ఉంటారు. -
'సవ్యసాచి'గా నాగచైతన్య
ప్రేమమ్, రారండోయ్ వేడుక చూద్దాం సినిమాల సక్సెస్ తో మంచి ఫాంలో ఉన్న నాగచైతన్య వరుస సినిమాలతో బిజీ అవుతున్నాడు. ఇప్పటికే కృష్ణ ఆర్వీ మరిముత్తు దర్శకత్వంలో యుద్ధం శరణం సినిమాను పూర్తి చేసిన చైతూ.. మరో సినిమాను స్టార్ట్ చేస్తున్నాడు. తనకు ప్రేమమ్ లాంటి ఘన విజయాన్ని అందించిన చందూ మొండేటి దర్శకత్వంలో కొత్త సినిమాను ప్రారంభిస్తున్నాడు. మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తున్న ఈ సినిమాకు సవ్యసాచి అనే టైటిల్ ను ఫైనల్ చేశారు. ఈ రోజు (బుధవారం) సినిమా టైటిల్ లోగోనూ రిలీజ్ చేశారు. ఈ టైటిల్ పోస్టర్ చూస్తే సినిమా యాక్షన్ జానర్ లో సాగుతుందని తెలుస్తోంది. సెప్టెంబర్ లో సవ్యసాచి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది. చాలా కాలంగా మాస్ హీరోగా ప్రూవ్ చేసుకునేందుకు ప్రయత్నిస్తున్న చైతన్య, వరుసగా రెండు మాస్ యాక్షన్ సినిమాలతో అలరించేందుకు రెడీ అవుతున్నాడు. Excited to be back with Chandoo and @MythriOfficial supporting us .. my next is #Savyasachi .. shoot starts this September pic.twitter.com/qfZvQrxywA — chaitanya akkineni (@chay_akkineni) 16 August 2017