నాగచైతన్య ఇంటి నుంచి మాధవన్ ఇల్లు ఎంతో దూరంలో లేదు. ఆ ఇంటికీ ఈ ఇంటికీ చకాచకా వెళ్లిపోవచ్చు. ఇన్నాళ్లూ మాధవన్ ఇంట్లోనే చైతూ, నిధీ అగర్వాల్, ఇంకా చాలామంది సందడి చేశారు. ఇప్పుడు చైతూ అడ్డాలో హంగామా చేయనున్నారు. ఇల్లేంటి? హంగామా ఏంటి అనుకుంటున్నారా? ఇదంతా నాగచైతన్య, నిధి అగర్వాల్ జంటగా రూపొందుతున్న ‘సవ్యసాచి’ మూవీ హంగామా. ‘కార్తికేయ’, ‘ప్రేమమ్’ వంటి హిట్స్ తర్వాత దర్శకుడు చందు మొండేటి తెరకెక్కిస్తోన్న చిత్రమిది. మైత్రి మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్, మెహన్ చెరుకూరి నిర్మిస్తున్నారు. కొన్ని రోజులుగా మాధవన్ ఇంటికి సంబంధించిన సీన్స్ తీశారు. ఈ షెడ్యూల్ వరకూ మాధవన్ వర్క్ కంప్లీట్ అయింది. దాంతో అందరికీ టాటా చెప్పి, చెన్నై చెక్కేశారాయన. ఇప్పుడు నాగచైతన్య ఇల్లు, వర్క్ ప్లేస్ సీన్స్ తీయడానికి ప్లాన్ చేశారు.
ఈ నెల 28 వరకూ ఈ షెడ్యూల్ జరుగుతుంది. మరి, క్రిస్మస్ పండగకి సెలవు లేదా? అంటే.. ‘‘ఆ ఒక్క రోజు సెలవు ఇవ్వాలనుకుంటున్నారు’’ అని యూనిట్ సన్నిహిత వర్గాలు తెలిపాయి. జనవరి 4న ఓ కొత్త షెడ్యూల్ మొదలుపెట్టనున్నారు. ఇంతకీ.. ఇందులో చైతూ రెండు చేతులకు సేమ్ పవర్ ఉంటుందన్న సంగతి తెలిసిందే. హీరో ఒంటి చేత్తో విలన్లను రఫ్ఫాడిస్తే చూడ్డానికి రెండు కళ్లూ చాలవు. ఇక, రెండు చేతులతో అంటే.. దుమ్ము దుమారమే. అయినా రెండు చేతులకూ పవర్ ఉండటం ఏంటి? చందు మొండేటికి ఈ ఐడియా ఎలా వచ్చింది? అంటే.. ‘‘భారతంలో అర్జునుడి రెండు చేతులకూ ఒకే సామర్థ్యం ఉంటుంది. అది తెలుసు. నేనొక ఆర్టికల్ చదివాను. అందులో ఒక వ్యక్తి రెండు చేతులకూ సేమ్ పవర్ ఉంటుంది. అది ఇన్‌స్పైరింగ్‌గా అనిపించి, హీరో పాత్రను మలిచాను’’ అని చందు మొండేటి తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment