
సవ్యసాచి
‘ఒకే రక్తం పంచుకుని పుడితే అన్నదమ్ములు అంటారు. ఒకే రక్తం, ఒకే శరీరం పంచుకు పుడితే అద్భుతం అంటారు. వరసకు కనిపించని అన్నని, కడదాకా ఉండే కవచాన్ని. సవ్యసాచిలో సగాన్ని’ అంటున్నారు నాగచైతన్య. చందూ మొండేటి దర్శకత్వంలో నాగచైతన్య, నిధీ అగర్వాల్ జంటగా తెరకెక్కిన చిత్రం ‘సవ్యసాచి’. మాధవన్ విలన్‌గా నటించారు. ఈ చిత్రం టీజర్‌ను సోమవారం రిలీజ్ చేశారు. ఈ చిత్రంలో రెండు చేతులను ఒకే బలంతో ఉపయోగించగలిగే సవ్యసాచిగా నాగచైతన్య కనిపించనున్నారు. టీజర్ చూస్తుంటే మంచి సైంటిఫిక్ కాన్సెప్ట్‌ను కమర్షియల్ చిత్రానికి జోడించినట్టున్నారు దర్శకుడు చందు. ‘‘నేను బాగా ఎగై్జట్ అయిన కాన్సెప్ట్ ఇది. మీ అందరికీ నచ్చుతుందని ఆశిస్తున్నాను’’ అని నాగచైతన్య పేర్కొన్నారు. నవంబర్ 2న రిలీజ్ కానున్న ఈ చిత్రానికి యం.యం. కీరవాణి సంగీత దర్శకుడు.
Comments
Please login to add a commentAdd a comment