సర్‌ప్రైజ్‌ సర్‌ప్రైజ్‌ | venky mama teaser release date announced | Sakshi
Sakshi News home page

సర్‌ప్రైజ్‌ సర్‌ప్రైజ్‌

Nov 22 2019 12:17 AM | Updated on Nov 22 2019 12:17 AM

venky mama teaser release date announced - Sakshi

నాగచైతన్య

నాగచైతన్య బర్త్‌డేకు (నవంబర్‌ 23) స్పెషల్‌ బర్త్‌డే సర్‌ప్రైజ్‌ ప్లాన్‌ చేసింది ‘వెంకీమామ’ చిత్రబృందం. ఈ నెల 23న నాగచైతన్య పాత్రను పరిచయం చేస్తూ ఓ టీజర్‌ను రిలీజ్‌ చేయాలనుకుంటున్నారట. వెంకటేశ్, నాగచైతన్య హీరోలుగా కేయస్‌ రవీందర్‌(బాబీ) తెరకెక్కించిన చిత్రం ‘వెంకీమామ’. పాయల్‌ రాజ్‌పుత్, రాశీ ఖన్నా హీరోయిన్లు. ‘కెప్టెన్‌ కార్తీక్‌’ పాత్రలో ఆర్మీ ఆఫీసర్‌గా చైతన్య ఈ సినిమాలో నటించారు. ఈ టీజర్‌లోనే ‘వెంకీమామ’ రిలీజ్‌ డేట్‌ కూడా ప్రకటించనున్నారని తెలిసింది.

లవ్‌స్టోరీ కూడా
శేఖర్‌ కమ్ముల దర్శకత్వంలో నాగచైతన్య, సాయి పల్లవి ఓ ప్రేమకథాచిత్రంలో నటిస్తున్నారు. ఈ సినిమాకు ‘లవ్‌స్టోరీ’ అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నారట.  చైతన్య బర్త్‌డేకి ‘లవ్‌ స్టోరీ’ టీజర్‌ను కూడా రిలీజ్‌ చేస్తున్నట్టు చిత్రబృందం తెలిపింది. చైతన్య అభిమానులకు డబుల్‌ ధమాకా.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement