ఖమ్మంలో ‘వెంకీ మామ’ | Venky Mama Cinema Pre Release Ceremony Was Held In Khammam | Sakshi
Sakshi News home page

ఖమ్మంలో ‘వెంకీ మామ’

Published Sun, Dec 8 2019 8:13 AM | Last Updated on Sun, Dec 8 2019 8:13 AM

Venky Mama Cinema Pre Release Ceremony Was Held In Khammam - Sakshi

మాట్లాడుతున్న హీరో నాగచైతన్య (ఇన్‌సెట్‌) మాట్లాడుతున్న పాయల్, రాశీఖన్నా

సాక్షి, ఖమ్మం: ఖమ్మం పట్టణంలో వెంకీమామ చిత్రబృందం తళుక్కుమంది. హీరోహీరోయిన్లు విక్టరీ వెంకటేశ్, నాగచైతన్య, రాశీఖన్నా, పాయల్‌రాజ్‌పుత్‌లు అభిమానులను హోరెత్తించారు. ఈ సినిమా ప్రీరిలీజ్‌ వేడుక శనివారం రాత్రి ఖమ్మంలోని లేక్‌వ్యూ క్లబ్‌ ప్రాంగణంలో అంగరంగ వైభవంగా జరిగింది. మ్యూజిక్‌ డైరెక్టర్‌ థమన్‌ బృందంలోని సింగర్స్‌ పాడిన పాటలు.. సత్యమాస్టర్‌ బృందం నృత్యాలు ప్రేక్షకులను కట్టిపడేశాయి.

శ్రేయాస్‌ మీడియా అధినేత  శ్రీనివాస్, లేక్‌వ్యూ క్లబ్‌ అధినేత దొడ్డ రవి పర్యవేక్షణలో జరిగిన ఈ ఉత్సవం హైలెట్‌గా నిలిచింది. ఖమ్మానికి తొలిసారిగా వచ్చిన తమ అభిమాన నటుడు వెంకటేశ్‌ను చూసేందుకు అభిమానులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. సినిమాకు సంబంధించి థియేట్రికల్‌ ట్రైలర్‌ను హీరోలు వెంకటేశ్, నాగచైతన్య విడుదల చేశారు. వేదికపై హీరోయిన్‌లు పాయల్‌రాజ్‌పుత్, రాశీఖన్నాలతో కలిసి హీరోలు, డైరెక్టర్‌ బాబీ, యాంకర్‌ శ్రీముఖి చిత్రంలోని కొకొకోలా పెప్సీ.. వెంకీమామ సెక్సీ పాటకు స్టెప్‌లు వేయడంతో ప్రాంగణం కేరింతలతో హోరెత్తిపోయింది.

యాంకర్‌ శ్రీముఖి, హైపర్‌ ఆది, చమ్మక్‌ చంద్ర చేసిన స్కిట్లు నవ్వుల్లో ముంచెత్తాయి. ఈ సందర్భంగా హీరో వెంకటేశ్‌ మాట్లాడుతూ వెంకీమామ సినిమా మంచి కథతో ప్రారంభమైందని, దర్శకుడు బాబీ బాగా తీశాడని, పెద్ద హిట్‌ అవుతుందన్నారు. ఇప్పటివరకు తాను నాగచైతన్యకు మాత్రమే మామనని, వెంకీమామ సినిమా తర్వాత అందరికీ మామనవుతానని పేర్కొన్నారు. అనంతరం నాగచైతన్య మాట్లాడుతూ మనం, వెంకీమామ సినిమాలు జీవితంలో గుర్తుండిపోయేవని తెలి పారు. థమన్‌ మ్యూజిక్, బాబీ దర్శకత్వం, సు రేశ్‌బాబు, టీజీ విశ్వప్రసాద్‌ల నిర్మాణం ఈ సి నిమాకు అదనపు బలమన్నారు. ప్రొడ్యూసర్లు సురేశ్‌బాబు, విశ్వప్రసాద్, డైరెక్టర్‌ బాబి మాట్లాడుతూ ఈ నెల 13న విడుదలవుతోందన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement