కొత్త జాబ్‌ | R Madhavan's ISRO Scientist Biopic Project , 'Rocketry | Sakshi
Sakshi News home page

కొత్త జాబ్‌

Published Thu, Nov 1 2018 2:49 AM | Last Updated on Thu, Nov 1 2018 2:49 AM

R Madhavan's ISRO Scientist Biopic Project , 'Rocketry - Sakshi

మాధవన్‌, నంబీ నారాయణ్‌

‘రాకెట్రీ : ది నంబీ ఎఫెక్ట్‌’... మాధవన్‌ లేటెస్ట్‌ సినిమా. ఇస్రో శాస్త్రవేత్త నంబీ నారాయణ్‌ జీవితం ఆధారంగా రూపొందుతోన్న ఈ చిత్రంలో మాధవన్‌ టైటిల్‌ రోల్‌ చేస్తున్నారు. నటుడిగానే కాదు.. ఈ సినిమాకి దర్శకుడిగానూ బాధ్యతలు చేపట్టారు. ఇక నంబీ నారాయణ్‌ గురించి చెప్పాలంటే.. విదేశీ గూఢచారి అంటూ ఆయనపై 1994లో కేసులు నమోదయ్యాయి. చాలా ఏళ్లు పోరాడిన తర్వాత ఆయన ‘నిర్దోషి’ అనే తీర్పు వచ్చింది. ఆ విధంగా జీవితంలో పెద్ద సవాల్‌ని ఎదుర్కొన్న నారాయణ్‌ పాత్ర చేయడం మంచి సవాల్‌లా భావిస్తున్నారు మాధవన్‌. ఈ చిత్రం టీజర్‌ను బుధవారం రిలీజ్‌ చేశారు. అనంత మహదేవన్‌తో కలసి ఈ చిత్రాన్ని డైరెక్ట్‌ చేస్తున్నారు మాధవన్‌. తమిళ, తెలుగు, హిందీ, మలయాళ భాషల్లో ఈ చిత్రం రూపొందుతోంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement