Rocketry
-
జిమ్ లేదు..సర్జరీ లేదు.. అలా 21 రోజుల్లోనే బరువు తగ్గాను: మాధవన్
‘‘వ్యాయామం చేయలేదు. రన్నింగ్ చేయలేదు. సర్జరీ అసలే లేదు. మెడికేషన్ పాటించలేదు... కానీ 21 రోజుల్లోనే పూర్తిగా ట్రాన్స్‌ఫార్మ్ అయ్యాను. బాగా బరువు తగ్గిపోయాను’’... ‘రాకెట్రీ: ది నంబి ఎఫెక్ట్’ సినిమాలో తన బాడీ ట్రాన్స్ఫార్మేషన్ గురించి మాధవన్ చెప్పిన మాటలు ఇవి. ఈ ఆసక్తికరమైన విషయాలను ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాధవన్ వెల్లడించగా, ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మాధవన్ నటించి, స్వీయ దర్శకత్వం వహించిన బయోగ్రాఫికల్ డ్రామా ‘రాకెట్రీ: ది నంబి ఎఫెక్ట్’. ఇస్రో మాజీ శాస్త్రవేత్త నంబి నారాయణన్ జీవితం ఆధారంగా మాధవన్ ఈ సినిమాను తెరకెక్కించి, టైటిల్ రోల్ చేశారు. ఈ చిత్రంలో మాధవన్ వివిధ వయస్సుల్లో కనిపిస్తారు. కొన్ని సన్నివేశాల్లో బాగా బరువు పెరిగి, పొట్ట ఉన్న వ్యక్తిగా కనిపిస్తారు. ఈ లుక్ నుంచి మాధవన్ మళ్లీ తన సాధారణ లుక్కు మారేందుకు కేవలం 21 రోజులు మాత్రమే పట్టిందట. ఆ మార్పు గురించి మాధవన్ మాట్లాడుతూ– ‘‘నేనొక డాక్టర్లా మాట్లాడుతున్నానని అనుకోవచ్చు. నా శరీరానికి ఏది మంచి ఆహారమని భావించానో దాన్నే తిన్నాను. ‘రాకెట్రీ: ది నంబి ఎఫెక్ట్’కి దర్శకత్వం వహిస్తున్నప్పుడు కాస్త పొట్టతో కనిపించేవాడిని. ఆ తర్వాత 21 రోజులకు నార్మల్‌గా మారిపోయాను. ఇదంతా నేను తీసుకున్న ఆహారం వల్లే జరిగిందని అనుకుంటున్నాను. చెప్పాలంటే నా జీవితంలోనే సైన్స్ ఓ భాగమైపోయిందని అనిపిస్తోంది’’ అని చెప్పుకొచ్చారు. ఇంకా ‘ఎక్స్’ వేదికగా ఈ విషయంపై మాధవన్ స్పందిస్తూ– ‘‘అప్పుడప్పుడూ ఉపవాసం ఉన్నాను. ఆహారాన్ని 45 నుంచి 60 సార్లు బాగా నమిలాను (మీ ఆహారాన్ని తాగండి... నీటిని నమలండి). సాయంత్రం 6 గంటల 45 నిమిషాలకే రోజులోని నా చివరి భోజనం పూర్తయ్యేది. జ్యూస్‌లు ఎక్కువగా తాగాను. ఆకుపచ్చ కూరగాయలు తిన్నాను. ఉదయాన్నే సుదీర్ఘంగా నడిచేవాడ్ని. నిద్రపోవడానికి 90 నిమిషాల ముందు ఏ స్క్రీనూ చూడలేదు. రాత్రివేళ గాఢంగా నిద్రపోతాను. నా శరీరానికి, నా ఆరోగ్యానికి, నా జీవన శైలికి, జీవక్రియకు తగ్గట్లుగా ఆహారాన్ని తీసుకున్నాను. దాంతో క్రమ క్రమంగా మార్పు వచ్చింది’’ అన్నారు. No exercise, No running... 😏21 நாட்களில் மாதவன் உடல் மாற்றம், அது எப்படி சாத்தியம்? 🤔 pic.twitter.com/ssrATrqOnr— Aadhavan (@aadaavaan) July 17, 2024 -
ఆదాయపు పన్ను శాఖ పనితీరుపై స్పందించిన నటుడు మాధవన్
ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలుచేసిన మూడు వారాల్లోనే తనకు నగదు రీఫండ్ అయిందని నటుడు మాధవన్ అన్నారు. తన సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ ఎక్స్‌లో ఆదాయపు పన్ను శాఖ పనితీరును ప్రశంసించారు. మాధవన్‌కు చెందిన ల్యూకోస్ ఫిల్మ్స్ కంపెనీ ఇటీవల ఆదాయపు పన్ను రిటర్న్న్ దాఖలు చేసింది. ఎలాంటి చిక్కులు లేకుండా మూడు వారాల్లోనే ఆదాయపు పన్ను శాఖ నుంచి రీఫండ్ పొందడంతో ఆయన స్పందించారు. అక్టోబర్ 31 వరకు రికార్డు స్థాయిలో 7.85 కోట్ల ఐటీఆర్‌లు దాఖలయ్యాయని ఆదాయపు పన్ను శాఖ ఇటీవల తెలిపింది. 2022-23 ఆర్థిక సంవత్సరంలో దాఖలు చేసిన మొత్తం 7.78 కోట్ల ఐటీఆర్‌లతో పోలిస్తే ఇదే ఆల్ టైమ్ హై అని ఐటీ శాఖ చెప్పింది. The income tax refund for our company was received within 3 weeks after filing of return for AY 2023-24. The speed and promptness is simply unheard of ..The efficiency and transparency of the income tax department is unbelievable. Totally impressed and flabbergasted .… — Ranganathan Madhavan (@ActorMadhavan) November 13, 2023 -
2022లో విడుదలైన సినిమాలకు 2021 అవార్డులా.. అదెలా?
2021 సంవత్సరానికిగాను జాతీయ చలన చిత్ర అవార్డుల్లో తొలిసారి తెలుగు సినిమాలు దుమ్ము రేపాయి. తెలుగు సినిమా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో తన సత్తా ఏంటో మరోసారి చూపించింది. గురువారం ప్రకటించిన 69వ జాతీయ పురస్కారాల్లో ఉత్తమ సినీ విమర్శకుడు విభాగంతో కలుపుకొని మొత్తంగా 11 పురస్కారాల్ని టాలీవుడ్ దక్కించుకుంది. 69 ఏళ్ల జాతీయ అవార్డుల చరిత్రలో తెలుగు నుంచి జాతీయ ఉత్తమ నటుడిగా అల్లు అర్జున్ రికార్డ్ సాధించారు. మరోవైపు ఆస్కార్ అవార్డుతో చరిత్ర సృష్టించిన ‘ఆర్ఆర్ఆర్’కు ఏకంగా ఆరు అవార్డులతో పతాకస్థాయిలో నిలిచింది. కానీ చాలామంది నెటిజన్లు 2022లో విడుదలైన సినిమాలకు 2021 అవార్డులా? అంటూ ప్రశ్నిస్తున్నారు. ప్రస్తుతం 69వ జాతీయ చలనచిత్ర పురస్కారాలు 2021 సంవత్సరంలో విడుదలైన సినిమాలకు సంబంధించినవి కానీ ఇందులో RRR (2022 మార్చి) , రాకెట్రీ సినిమా (2022 జులై), గంగూబాయ్ కాఠియావాడి సినిమా (2022 ఫిబ్రవరి) నెలలో విడుదలయ్యాయి. ఇందులో ఆర్ఆర్ఆర్ సినిమాకు గాను 6 అవార్డులు, గంగూబాయ్ కాఠియావాడి సినిమాకు గాను ఉత్తమ నటిగా అలియా భట్‌కు అవార్డు దక్కింది. జాతీయ ఉత్తమ చిత్రం విభాగంలో రాకెట్రీ సినిమాకు దక్కింది. (ఇదీ చదవండి: ‘బెదురులంక 2012’మూవీ రివ్యూ) దీనిపై సమాచార, ప్రసార శాఖ అదనపు కార్యదర్శి నీర్జా శేఖర్‌ను పలువురు ప్రశ్నించారు. జాతీయ చలన చిత్ర అవార్డు నిబంధనల ప్రకారం 2021 జనవరి 1 నుంచి 2021 డిసెంబరు 31 నడుమ ఈ సినిమాలన్నీ ప్రభుత్వ అనుమతి రూల్స్ ప్రకారం సెన్సార్ సర్టిఫికెట్ పొందాయి.. కాబట్టి ఈ విధంగా విడుదలైన సినిమాలను 2021 సంవత్సరానికి సంబంధించిన చిత్రాలుగా పరిగణిస్తామని చెప్పారు. ఆర్ఆర్ఆర్ 2021 డిసెంబరులోనే సెన్సార్ బోర్డు యు/ఏ సర్టిఫికెట్ ఇచ్చిందని, కాబట్టి ఆ చిత్రానికి 2021 సంవత్సరానికిగాను జాతీయ పురస్కారం దక్కినట్లు వచ్చినట్టు భావించవచ్చన్నారు. ఈ విధంగా విడుదలైన మిగిలిన చిత్రాలకూ కూడా ఇదే విధానం వర్తిస్తుందని నీర్జా శేఖర్ తెలిపారు. -
రాకెట్రీ సినిమా కోసం హీరో మాధవన్ ఇల్లు అమ్మేశాడా?
ఇస్రో శాస్త్రవేత్త నంబి నారాయణన్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన చిత్రం రాకెట్రీ:ది నంబి ఎఫెక్ట్. హీరో ఆర్ మాధవన్ ప్రధాన పాత్రలో నటించడమే కాకుండా తొలిసారి దర్శకత్వం వహించిన చిత్రమిది. ఈ సినిమా అందరికీ చేరువవ్వాలని ఎంతగానో తాపత్రయపడ్డాడు మ్యాడీ. అనుకున్నట్లే అటు థియేటర్లో, ఇటు ఓటీటీలో విజయవంతంగా దూసుకుపోయి చిత్రయూనిట్ పడ్డ కష్టానికి తగ్గ ప్రతిఫలం దక్కింది. అయితే మాధవన్ రాకెట్రీ సినిమా బడ్జెట్ కోసం నిధులు సేకరించే క్రమంలో తన ఇంటినే అమ్మేశాడంటూ ఓ వార్త వైరల్ అవుతోంది. నిజానికి రాకెట్రీ సినిమాకు తొలుత మాధవన్ దర్శకుడు కాదని, ఓ ప్రముఖ డైరెక్టర్ ఈ సినిమాను చేయాల్సి ఉండగా అప్పటికే చేతిలో పలు ప్రాజెక్టులతో బిజీగా ఉండటంతో రాకెట్రీ నుంచి తప్పుకున్నాడని, దీంతో మ్యాడీ ఈ సినిమాకు దర్శకత్వం వహించాడరి సదరు కథనం పేర్కొంది. మరోవైపు అతడి కొడుకు వేదాంత్ స్విమ్మింగ్‌లో దేశం తరపున పాల్గొని బంగారు పతకాలు సాధించాడంటూ మ్యాడీ కుటుంబాన్ని కీర్తించింది. తాజాగా దీనిపై హీరో మాధవన్ స్పందించాడు.. 'ఓరి దేవుడా.. నేనేదో గొప్ప త్యాగం చేశానని మీరు నన్ను ఆకాశానికి ఎత్తేయొద్దు. ఎందుకంటే నేను నా ఇల్లే కాదు, దేన్నీ కోల్పోలేదు. దేవుడి దయ వల్ల రాకెట్రీ సినిమాలో పాలుపంచుకున్న అందరూ ఈ ఏడాది ఎక్కువ ఆదాయపన్ను చెల్లించనున్నారు. అంత గొప్పగా, గర్వించదగ్గ లాభాలు వచ్చాయి. నేను ఇప్పటికీ నా ఇంటిని ప్రేమిస్తున్నాను, అదే ఇంట్లో నివసిస్తున్నాను కూడా!' అని ట్వీట్‌తో క్లారిటీ ఇచ్చాడు మ్యాడీ. Oh Yaar. Pls don’t over patronize my sacrifice. I did not lose my house or anything. In fact all involved in Rocketry will be very proudly paying heavy Income Tax this year. Gods grace 😃😃🙏🙏🇮🇳🇮🇳🇮🇳We all made very good and proud profits. I still love and live in my house .🚀❤️ https://t.co/5L0h4iBert — Ranganathan Madhavan (@ActorMadhavan) August 17, 2022 చదవండి: రూ.200 కోట్ల మనీ లాండరింగ్ కేసులో నిందితురాలిగా జాక్వెలిన్ ఈ రెండు చిత్రాలకు సీక్వెల్ తీసే ధ్యైర్యం చేస్తారా? -
రజనీకాంత్ కాళ్లు మొక్కిన హీరో మాధవన్
కోలీవుడ్ హీరో మాధవన్ నటించిన తాజా చిత్రం రాకెట్రీ: ది నంబి ఎఫెక్ట్. ఇస్రో శాస్త్రవేత్త నంబి నారాయణన్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన ఈ మూవీ థియేటర్లలో రిలీజై మంచి విజయాన్ని నమోదు చేసుకుంది. తాజాగా ఈ సినిమాపై ప్రశంసలు కురిపించాడు రజనీకాంత్. అనంతరం మాధవన్‌కు శాలువా కప్పి సత్కరించాడు. ఈ ఆనందకర క్షణాలను సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకున్నాడు మాధవన్. 'ఒక లెజెండ్ ఆధ్వర్యంలో వన్ మ్యాన్ ఇండస్ట్రీ, లెజెండ్ రజనీకాంత్ నుంచి ఆశీర్వాదాలు తీసుకోవడం మర్చిపోలేను' అంటూ వీడియో షేర్ చేశాడు మాధవన్. ఈ వీడియోలో రజనీకాంత్ పాదాలను తాకి ఆయన ఆశీస్సులు తీసుకున్నాడు మ్యాడీ. ప్రస్తుతం రాకెట్రీ మూవీ అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. When you get the blessings from a one man industry & the Leagend himself in the presence on @NambiNOfficial -it’s a moment etched for eternity-Thank you for you kindest words on #Rocketry & the affection @rajinikanth sir.This motivation has completely rejuvenated us. We love you pic.twitter.com/ooCyp1AfWd — Ranganathan Madhavan (@ActorMadhavan) July 31, 2022 View this post on Instagram A post shared by R. Madhavan (@actormaddy) చదవండి: నెల రోజులైనా కాకముందే ఓటీటీలోకి వారియర్! హీరోయిన్ కొడుకుగా నటించి చివరకు ఆమెనే పెళ్లాడిన నటుడు! -
ఈ వారం అలరించనున్న సినిమాలు, సిరీస్‌లు ఇవే..
Upcoming Movies Web Series July Last Week: సినీ ప్రియుల కోసం ప్రతివారం కొత్త సినిమాలు థియేటర్లలో అలరిస్తుంటాయి. సమ్మర్లో పెద్ద సినిమాలు బాక్సాఫీస్ వద్ సందడి చేయగా తర్వాత వచ్చిన చిత్రాలు అంతగా అంచనాలను అందుకోలేకపోయాయి. ఈ క్రమంలోనే జులై చివరి వారంలో అటు థియేటర్, ఇటు ఓటీటీల్లో మేం ఉన్నామంటూ సందడి చేసేందుకు సిద్ధమైన సినిమాలు, వెబ్ సిరీస్‌లు ఏంటో ఓ లుక్కేద్దామా ! 1 విక్రాంత్ రోణ- జులై 28, 2022 2. ది లెజెండ్- జులై 28, 2022 3. రామారావు ఆన్ డ్యూటీ- జులై 29, 2022 4. ఏక్ విలన్ రిటర్న్స్- జులై 29, 2022 ఓటీటీలో రిలీజయ్యే సినిమాలు, సిరీస్‌లు అమెజాన్ ప్రైమ్ వీడియో 1. రాకెట్రీ: ది నంబి ఎఫెక్ట్- జులై 26 2. ది బ్యాట్ మ్యాన్- జులై 27 3. బిగ్ మౌత (వెబ్ సిరీస్)- జులై 29 డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ 1. అదమస్ (వెబ్ సిరీస్)- జులై 27 2. గుడ్ లక్ జెర్రీ- జులై 29 3. 19 (1) (ఎ)- జులై 29 నెట్‌ఫ్లిక్స్ 1. ది మోస్ట్ హేటెడ్ మ్యాన్ ఆన్ ది ఇంటర్నెట్ (వెబ్ సిరీస్)- జులై 27 2. డ్రీమ్ హోమ్ మేకోవర్ (వెబ్ సిరీస్)- జులై 27 3. కీప్ బ్రీతింగ్ (వెబ్ సిరీస్)- జులై 28 4. మసాబా మసాబా (వెబ్ సిరీస్)- జులై 29 5. పర్పుల్ హార్ట్స్ (వెబ్ సిరీస్)- జులై 29 1. షికారు- జులై 29 (ఆహా) 2. పేపర్ రాకెట్- జులై 29 (జీ5) 3. 777 చార్లీ- జులై 29 (వూట్) -
ఓటీటీలో వచ్చేస్తున్న ‘రాకెట్రీ.. స్ట్రీమింగ్ ఎప్పుడు, ఎక్కడంటే..
విలక్షణ నటుడు ఆర్ మాధవన్ స్వయంగా దర్శకత్వం వహిస్తూ నటించిన సినిమా ‘రాకెట్రీ: ది నంబి ఎఫెక్ట్’. ఇస్రో శాస్త్రవేత్త నంబి నారాయణన్ జీవిత కథ ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించారు. జులై 1న థియేటర్స్‌లో విడుదలైన ఈ చిత్రం పాజిటివ్ టాక్ని దక్కించుకుంది. మాధవన్ టేకింగ్,యాక్టింగ్‌పై విమర్శకులు సైతం ప్రశంసల జల్లు కురిపించారు. దాదాపు రూ.25 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ చిత్రం రూ. 40 కోట్ల వసూళ్లను సాధించి రికార్డు సృష్టించింది. (చదవండి: ‘రాకెట్రీ: ది నంబి ఎఫెక్ట్’ మూవీ రివ్యూ) ఇప్పటి వరకు థియేటర్స్‌లో సందడి చేసిన ఈ చిత్రం.. ఇక ఓటీటీలోకి ఎంట్రీ ఇచ్చేందుకు సిద్దమైంది. ప్రముఖ ఓటీటీ అమెజాన్ ప్రైమ్ వీడియోలో జులై 26 నుంచి ఈ చిత్రం స్ట్రీమింగ్ కానుంది. తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళ భాషల్లో అందుబాటులో ఉంటుంది. ఈ విషయాన్ని అమెజాన్ ప్రైమ్ సంస్థ అధికారికంగా తెలియజేస్తూ ఓ స్పెషల్ పోస్టర్ని విడుదల చేసింది. రితా మాధవన్, వర్గీస్ మూలన్, విజయ్ మూలన్ సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రంలో సిమ్రాన్, రవి రాఘవేంద్ర, మిషా ఘోషాల్ ఇతర కీలక పాత్రల్లో నటించారు. hop on for a space adventure 🚀#RocketryOnPrime, July 26 pic.twitter.com/W3JDZEz2eD — amazon prime video IN (@PrimeVideoIN) July 20, 2022 (చదవండి: చేయని నేరానికి శాస్త్రవేత్తపై దేశద్రోహి కేసు.. నంబి నారాయణన్ రియల్ స్టోరీ) -
కోల్‌కతా థియేటర్లో ‘రాకెట్రీ’ ప్రదర్శన నిలిపివేత.. ఫ్యాన్స్‌కి మాధవన్ విజ్ఞప్తి
స్టార్ హీరో మాధవన్ నటించిన లేటెస్ట్ మూవీ ‘రాకెట్రీ: ది నంబి ఎఫెక్ట్’. ప్రముఖ ఇస్రో శాస్త్రవేత్త నంబి నారాయణన్ నిజ జీవితంలో జరిగిన సంఘటన ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కింది. స్యయంగా మాధవన్ దర్శకత్వం వహించి నటించిన ఈ సినిమా జూలై 1న విడుదలైంది. ప్రస్తుతం బాక్సాఫీసు వద్ద ఈ చిత్రం పాజిటివ్ టాక్‌తో దూసుకుపోతుంది. విమర్శకుల నుంచి సైతం ప్రశంసలు అందుకుంటుంది ఈ మూవీ. చదవండి: నా వ్యాఖ్యలను తప్పుగా అర్థం చేసుకోవడం బాధగా ఉంది ఇందులో మాధవన్ యాక్టింగ్, డైరెక్షన్‌కు ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. గొప్ప సినిమా చేశావంటూ ఆయనను పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. ఇదిలా ఉంటే కోల్‌కతాలోని ఓ థియేటర్లో రాకెట్రీ మూవీ ప్రదర్శనను మధ్యలో నిలిపివేయాల్సిన పరిస్థితి నెలకొంది. షో మొదలైన కొద్ది సమయం తర్వాత ఫ్యాన్స్‌కు, థియేటర్ యాజమాన్యానికి మద్య వాగ్వాదం చోటుచేసుకుంది. దీంతో మూవీ ప్రదర్శనను మధ్యలోనే నిలిపివేశారు. అనంతరం ఈ సంఘటనపై మాధవన్ సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ.. కాస్తా నెమ్మదించాలని ఫ్యాన్స్‌ను కోరాడు. చదవండి: కోబ్రా ఆడియో లాంచ్‌లో విక్రమ్ సందడి, పుకార్లపై ఫన్నీ రియాక్షన్ ఈ సందర్భంగా థియేటర్లో చోటుచేసుకున్న ఈ సంఘటనకు సంబంధించిన వీడియోను కూడా మాధవన్ షేర్ చేశాడు. ఈ వీడియోలో కొంతమంది ఆడియన్స్.. థియేటర్ యాజమాన్యంతో గోడవ పడుతూ కనిపించారు. చూస్తుంటే వారిమధ్య పెద్ద వాగ్వాదమే చోటు చేసుకున్నట్లు కనిపిస్తోంది. దీంతో మాడీ ట్వీట్ చేస్తూ... ‘ఏం జరిగిందో తెలియదు. మీరు గొడవ పడటం వెనక అసలైన కారణమే ఉండోచ్చు. కానీ మీరు కాస్తా శాంతించండి. ఇతరుల పట్ల ప్రేమతో వ్యవహరించండి. ఇది నా విజ్ఞప్తి. షో తిరిగి మొదలవుతుంది’ అంటూ రాసుకొచ్చాడు. There must have been a genuine reason and cause . Pls do be calm and show some love ppl. Humble request. The show will be in soon.all the love 🚀🚀🙏🙏❤️❤️ https://t.co/MPPMh6e9b3 — Ranganathan Madhavan (@ActorMadhavan) July 10, 2022 -
థియేటర్లో ఆ సీన్ మళ్లీ మళ్లీ ఎలా చూశావు?: నెటిజన్‌కు హీరో ప్రశ్న
కోలీవుడ్ స్టార్ మాధవన్ నటించిన లేటెస్ట్ మూవీ రాకెట్రీ: ది నంబి ఎఫెక్ట్. ప్రముఖ ఇస్రో శాస్త్రవేత్త నంబి నారాయణన్ బయోపిక్ ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కింది. మాధవన్ ప్రధాన పాత్రలో నటించి, దర్శకత్వం వహించిన ఈ సినిమా తీయడానికి దాదాపు ఆరేళ్లు పట్టింది. జూలై 1న విడుదలైన ఈ సినిమాకు విమర్శకుల నుంచి సైతం ప్రశంసలు లభిస్తున్నాయి. ఆయన అభిమానులైతే గొప్ప సినిమా చేశావంటూ పొగడ్తలు కురిపిస్తున్నారు. ఈ క్రమంలో ఓ నెటిజన్.. 'నిన్న రాకెట్రీ సినిమా చూశాను. చివరి సీన్ ఏదైతే ఉందో దాన్ని పదేపదే చూశాను. మీ తొలి దర్శకత్వమే అద్భుతంగా ఉంది. ఇక నటనకు కొంచెం కూడా వంక పెట్టాల్సిన పని లేదు' అంటూ హీరో మాధవన్‌ను ట్యాగ్ చేశాడు. దీంతో మాధవన్ ఈ ట్వీట్‌పై స్పందిస్తూ.. 'నువ్వు ఒక్క సన్నివేశాన్నే పదే పదే ఎలా చూడగలిగావు?' అని ప్రశ్నించాడు. దీంతో అడ్డంగా దొరికిపోయాననుకున్న నెటిజన్ వెంటనే తన ట్వీట్‌ను డిలీట్ చేశాడు. కానీ అప్పటికే దానికి సంబంధించిన స్క్రీన్‌షాట్‌ను ఇతర నెటిజన్లు నెట్టింట వైరల్ చేశారు. సినిమా వచ్చి కేవలం వారం రోజులు మాత్రమే అవుతోంది. థియేటర్లలో విజయవంతంగా ఆడుతున్న ఈ మూవీ ఇప్పుడప్పుడే ఓటీటీలోకి వచ్చే అవకాశాలు కూడా కనిపించడం లేదు. మరి అతడు నచ్చిన సన్నివేశాన్ని పదే పదే చూశాడంటే అది థియేటర్లో సాధ్యపడదు. అంటే అతడు పైరసీ ద్వారా సినిమా చూశాడని ఇట్టే తెలిసిపోతుంది. అతడికి దిమ్మ తిరిగి బొమ్మ కనిపించేలా మ్యాడీ కౌంటర్ ఇవ్వడంతో నెటిజన్లు పడీపడీ నవ్వుతున్నారు. 😂😂 nice question pic.twitter.com/kY9a8um3Bb — Praveen Kumar (@by_PraveenKumar) July 8, 2022 చదవండి: ప్రేయసితో హృతిక్ రోషన్ రోడ్ ట్రిప్, వీడియో చూశారా? తనకన్నా ఆరేళ్లు చిన్నవాడితో ఆరేళ్లు డేటింగ్, పిల్లలు పుట్టాక పెళ్లి -
‘రాకెట్రీ: ది నంబి ఎఫెక్ట్’ మూవీ రివ్యూ
టైటిల్ : ‘రాకెట్రీ: ది నంబి ఎఫెక్ట్’ నటీనటులు : ఆర్. మాధవన్, సిమ్రన్ , సూర్య, గుల్షన్ గ్రోవర్, రజిత్ కపూర్, రవి రాఘవేంద్ర తదితరులు నిర్మాణ సంస్థలు : కలర్ ఫిల్మ్స్, వర్ఘీస్ మూలన్ పిక్చరర్స్ నిర్మాతలు: సరితా మాధవన్, మాధవన్, వర్ఘీస్ మూలన్, విజయ్ మూలన్ రచన,దర్శకత్వం : ఆర్ మాధవన్ సంగీతం : శ్యామ్. సీఎస్ సినిమాటోగ్రఫీ : సిర్షా రే ఎడిటర్ : బిజిత్ బాలా విడుదల తేది : జులై 1, 2022 ప్రస్తుతం చిత్ర పరిశ్రమలో బయోపిక్‌ల సీజన్ నడుస్తోంది. సినీ, రాజకీయ,క్రీడా ప్రముఖుల జీవిత కథల నేపథ్యంలో పలు భాషల్లో సినిమాలు రూపొందుతున్నాయి. ఈ లిస్ట్‌లో ఓ సైంటిస్ట్ కూడా చేరాడు. ఆర్ మాధవన్ స్వయంగా దర్శకత్వం వహిస్తూ నటించిన సినిమా ‘రాకెట్రీ: ది నంబి ఎఫెక్ట్’. ఇస్రో శాస్త్రవేత్త నంబి నారాయణన్ జీవిత కథ ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించారు. ఇప్పటికే విడుదలైన ఈ చిత్రం టీజర్‌కు మంచి స్పందన లభించింది. భారీ అంచనాల మధ్య ఈ శుక్రవారం(జులై 1)థియేటర్స్‌లో విడుదలైన ఈ చిత్రం ఎలా ఉంది? నంబి నారాయణన్‌గా మాధవన్ ఏ మేరకు మెప్పించారో రివ్యూలో చూద్దాం. కథేంటంటే.. ఈ సినిమ కథంతా ఇంటర్వ్యూగా సాగుతుంది. ఓ టీవీ చానల్లో హీరో సూర్య నంబి నారాయణన్(మాధవన్)ని ఇంటర్వ్యూ చేస్తూ.. తన జీవితం ఎలా సాగింది? ఇస్రోలో ఎలా చేరారు? తనపై వచ్చిన ఆరోపణలు ఎలా ఎదుర్కొన్నాడు తదితర విషయాలను అడుగుతారు. 1966లో భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో)లో చేరుతాడు నంబి నారాయణన్. అంచెలంచెలుగా ఎదుగుతూ.. అమెరికాలోని ప్రిన్స్టన్ యూనివర్సీటీలో రాకెట్ ప్రొపల్షన్ సిస్టమ్స్ చదివేందుకు స్కాలర్షిప్ పొందారు. అక్కడ సానా ఆఫర్ వచ్చిన సున్నితంగా తిరస్కరించి తిరిగి ఇండియాకు వచ్చిన మళ్లీ ఇస్రోలో చేరుతారు.. స్వదేశీ రాకెట్లను అభివృద్ది చేసే ప్రాజెక్ట్‌లో భాగంగా రష్యా డెవలప్ చేసిన క్రయోజెనిక్ ఇంజన్స్‌ని భారత్ తీసుకురావాలనుకుంటారు. ఇదే సమయంలో పాకిస్తాన్‌కు భారత రాకెట్ సాంకేతిక విషయాలను చేరవేశారనే నెపంతో అరెస్ట్ అవుతారు. ఆ తర్వాత నంబి నారాయణన్ జీవితం ఎలా మలుపు తిరిగింది? అరెస్ట్ తర్వాత కేరళ పోలీసుల చేతిలో నంబి ఎలాంటి చిత్రహింసలు అనుభవించారు? తనపై వచ్చిన తప్పుడు ఆరోపణలను నుంచి ఎలా విముక్తి పొందారు? అనేదే మిగతా కథ. ఎలా ఉందంటే.. భారత అంతరిక్ష పరిశోధన రంగం అభివృద్ధిలో విశేష కృషి చేసిన వ్యక్తుల్లో నంబి నారాయణన్ ఒకరు. దేశం కోసం అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసా ఆఫర్‌ని తిరస్కరించి ఇస్రోలో చేరారు. అలాంటి వ్యక్తి ఒకానొక సమయంలో ఆయన దేశ ద్రోహం కేసును ఎదుర్కొన్నారు.తర్వాత ఆయనపై వేసిన దేశ ద్రోహం కేసును సుప్రీం కొట్టి వేసింది.నంబి నారాయణన్ మీద ఆరోపణలూ చెదిరిపోయిన తర్వాత భారత ప్రభుత్వం ఆయన్ని పద్మభూషణ్ పురస్కారంతో సత్కరించింది. ఇలా ఎన్నో ఎత్తు పల్లాలను చవిచూసిన ఆయన జీవితాన్ని మాధవన్ వెండితెరపై అద్భుతంగా ఆవిష్కరించాడు.ఫస్టాఫ్ అంతా స్వదేశీ రాకెట్లను అభివృద్ది కోసం నంబి నారాయణన్ చేసిన కృషిని చూపించారు. సెకండాఫ్‌లో తప్పుడు కేసు వల్ల ఆయనతో కుటుంబ సభ్యులు ఎలాంటి అవమానాలకు గురయ్యారు? చివరకు నిర్థోషిగా ఎలా బయటకు వచ్చారనే విషయాలను చాలా భావోద్వేంగా చూపించారు.అయితే ఫస్టాఫ్ అంతా అంతరిక్ష పరిశోధన, ప్యూయల్ టెక్నాలజీ, వికాస్ ఇంజన్ అభివృద్ది తదితర అంశాలను లోతుగా చూపించడంతో డ్యాక్యూమెంటరీ ఫీల్ కలుగుతుంది. రాకెట్ సైన్స్ సామాన్య ప్రేక్షకులకు అంతగా అర్థం కాదు..కానీ దానితోనే నంబి నారాయణన్ జీవితం సాగింది కాబట్టి కచ్చితంగా వాటిని చూపించాల్సిందే. దర్శకుడు అదే పని చేశారు. ఇక సెకండాఫ్ మొత్తం చాలా భావోద్వేగంగా సాగుతుంది. దేశం కోసం అన్ని త్యాగాలు చేసిన నంబి నారాయణన్.. దేశద్రోహి కేసు కింద అరెస్ట్ కావడం.. ఆ సమయంలో ఆయనతో పాటు కుటుంబ సభ్యులు ఎలాంటి మానసిక క్షోభని అనుభవించారు, నిర్దోషిగా బయటకు రావడమే కాకుండా దేశ మూడో అత్యున్నత పురస్కారమైన ‘పద్మభూషణ్’ అందుకున్న సీన్స్ చాలా భావోద్వేగాన్ని కలిగించేలా అద్భుతంగా తెరకెక్కించారు. ‘ఒక రాకెట్ కూలిపోతే రియాక్ట్ అయ్యే మాకు.. ఒక మనిషి కూలిపోతే రియాక్ట్ అవడం తెలియదు’ అంటూ తోటి సైంటిస్టుల గురించి నంబి చెప్పె డైలాగ్, ఒక వీధి కుక్కను కొట్టి చంపాలనకుంటే దానికి పిచ్చి అన్న పట్టం కడితే సరిపోతుంది..అదేవిధంగా ఒక మనిషిని తనకు తెలియకుండా కొట్టాలంటే దేశద్రోహి అనే పట్టం కడితే సరిపోతుంది’ అని హీరో సూర్య చెప్పే డైలాగ్ అందరిని ఆకట్టుకోవడమే కాదు ఆలోచింపజేస్తాయి కూడా. దేశం కోసం కష్టపడిన మీ ఓ గొప్ప శాస్త్రవేత్తని అన్యాయంగా తప్పుడు కేసులో ఇరికించారే అనే ఫీల్‌తో ప్రేక్షకుడు బయటకు వస్తాడు. ఈ సినిమా సామాన్య ప్రేక్షకులను ఏ మేరకు మెప్పిస్తుందో తెలియదు కానీ.. మాధవన్ చాలా నిజయతీగా, ఉన్నతంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు. ఎవరెలా చేశారంటే.. నంబి నారాయణన్ పాత్రలో మాధవన్ నటించడం కంటే ఒదిగిపోయాడు. ఈ సినిమా కోసం దర్శకుడిగా, నటుడిగా మాధవన్ పడిన కష్టమంతా తెరపై కనిపించింది. యంగ్ లుక్‌తో పాటు ప్రస్తుతం నంబి నారాయణన్ ఎలా ఉన్నారో.. అలానే తెరపై చూపించే ప్రయత్నం చేశారు. దాని కోసం మాధవన్ చాలా కష్టపడ్డారు. పొట్టపెంచడం, పంటి వరుసను మార్చుకోవడం.. గెడ్డం పెంచడం ..ఇలా చాలా విషయాల్లో మాధవన్ డేరింగ్ స్టెప్స్ వేశాడు. ఎమోషనల్ సీన్స్‌ని చక్కగా పండించారు. అబ్దుల్ కలాంగా గుల్షన్ గ్రోవర్ , నంబిని ఇంటర్వ్యూ చేసే హీరోగా సూర్య(హిందీలో షారుఖ్) చక్కగా నటించారు. ఇక సినిమాకు మరో ప్రధాన బలం శ్యామ్. సీఎస్ సంగీతం. చక్కటి నేపథ్య సంగీతంతో సినిమాని మరోస్థాయికి తీసుకెళ్లారు.సిర్షా రే సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగినట్లుగా ఉన్నతంగా ఉన్నాయి. - అంజి శెట్టె, సాక్షి వెబ్‌డెస్క్ -
చేయని నేరానికి శాస్త్రవేత్తపై దేశద్రోహి కేసు.. నంబి నారాయణన్ రియల్ స్టోరీ
1994 నవంబర్ 30.. అప్పటి వరకు ఆయన దేశం గర్వించదగ్గ శాస్త్రవేత్త. యావత్ భారత్ ఆయనపై ప్రశంసలు జల్లు కురిపించింది. ఆయన కనిపెట్టిన ‘వికాస్’ ఇంజన్ అద్భుతమైనదని ప్రపంచమంతా కొనియాడింది. కానీ ఒకే ఒక ఘటనతో ఆయన జీవితం తలకిందులైపోయింది. దేశం కోసం అహర్నిశలు శ్రమించిన ఆయనను ‘దేశద్రోహి’ అన్నారు. చేయని తప్పుకు 50 రోజులు జైలులో పెట్టి నరకం చూపించారు. చివరకు నిర్థోషిగా బయటకు రావడమే కాకుండా.. దేశ మూడో అత్యున్నత పురస్కారమైన ‘పద్మభూషణ్’ అందుకున్నారు. ఆయనే భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) మాజీ శాస్త్రవేత్త నంబి నారాయణన్. జీవితంలో ఎన్నో ఎత్తు పల్లాలను చవిచూసిన నంబి నారాయణన్ జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన చిత్రం ‘రాకెట్రీ: ది నంబి ఎఫెక్ట్’. విలక్షణ నటుడు మాధవన్ స్వీయ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం జులై 1న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సందర్భంగా నంబి నారాయణన్ గురించి.. నాసా ఆఫర్‌ని సున్నితంగా తిరస్కరించి.. నంబి నారాయణన్ మధ్య తరగతి కుటుంబానికి చెందినవారు. 1941 డిసెంబర్ 12న తమిళనాడులో జన్మించారు. ఆయన తల్లిదంద్రులు కొబ్బరి పీచు వ్యాపారం చేసేవారు. ఐదుగురి బాలికల తర్వాత ఆయన పుట్టాడు. ఇంట్లో అందరికంటే చిన్నవాడైన నారాయణన్.. చదువులో మాత్రం బాగా రాణించేవాడు. ఇంజనీరింగ్ పూర్తి చేశాక.. కొంతకాలం స్థానికంగా ఉండే చక్కెర కర్మాగారంలో పనిచేశారు. 1966లో భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో)లో చేరారు. అంచెలంచెలుగా ఎదుగుతూ.. అమెరికాలోని ప్రిన్స్టన్ యూనివర్సీటీలో రాకెట్ ప్రొపల్షన్ సిస్టమ్స్ చదివేందుకు స్కాలర్షిప్ పొందారు. 1966లో నంబి నారాయణన్ నాసాలో ఉద్యోగ అవకాశం లభించినా.. దేశం కోసం సున్నితంగా తిరస్కరించి తిరిగి ఇస్రోలో చేరారు. అక్కడ విక్రమ్ సారాబాయి, సతీష్ ధావన్, అబ్దుల్ కలాం లాంటి ప్రఖ్యాత శాస్త్రవేత్తలతో కలిసి పనిచేశారు. స్వదేశీ రాకెట్లను అభివృద్ది చేసే ప్రాజెక్ట్‌లో నారాయణన్ కీలక పాత్ర పోషించారు. ప్యూయల్ టెక్నాలజీని ఇస్రోకు అందించాలనుకున్నాడు. ఆ ఆలోచనల నుంచి పుట్టిందే క్రయోజెనిక్ ఇంజిన్స్. ఈ టెక్నాలజీ అప్పట్లో మనకు అందుబాటులో లేదు. దీంతో రష్యాతో రూ.235 కోట్ల ఒప్పందం కుదుర్చుకొని ఈ టెక్నాలజీని దిగుమతి చేసుకోవాలనుకున్నారు. ఈమేరకు సంప్రదింపులు కూడా పూర్తయ్యాయి. ఆ సమయంలోనే ఊహించని పరిణామం చోటు చేసుకుంది. చేయని తప్పుకు నంబి నారాయణన్ని పోలీసులు అరెస్ట్ చేశారు. అసలేం జరిగింది? 1994 నవంబర్ 30న నంబిని కేరళ పోలీసులు అరెస్ట్ చేశారు. అంతకు నెల రోజుల ముందు వీసా గడువు ముగిసిన తర్వాత కూడా భారత్‌లోనే ఉన్నారంటూ మాల్దీవులకు చెందిన మహిళ మరియమ్ రషీదా, ఫయూజియ్యా హసన్‌ను పోలీసులు అరెస్టు చేశారు. విచారణలో ఆ మహిళలిద్దరు భారత రాకెట్ సాంకేతిక విషయాలను పాకిస్తాన్‌కు చేరవేస్తున్నారని తేలింది. అంతేకాదు వీరికి ఇస్త్రోలో పని చేస్తున్న శాస్త్రవేత్తలు సహకరిస్తున్నారని మీడియాతో వార్తలు వచ్చాయి. ఆ మహిళలు వేసిన వలలో నంబి నారాయణన్ కూడా ఉన్నారని కేరళ పోలీసులు అభియోగాలు మోపారు. దేశద్రోహం కేసు కింద అరెస్ట్ చేసి 50 రోజులు జైల్లో పెట్టి విచారణ పేరుతో నరకం చూపించారు. దేశం గర్వించదగ్గ సైంటిస్ట్ అని కొనియాడిన మీడియానే ఆయన్ను ‘దేశద్రోహి’గా చూపించింది. గూఢచారి, దేశద్రోహి అంటూ అనేకమంది ఆయనను నిందించారు. పెద్ద ఎత్తున నినాదాలు చేస్తే ఆయన ఇంటిపై దాడి చేశారు. న్యాయమే గెలిచింది దేశం కోసం నాసా ఆఫర్‌ని తిరస్కరించిన నంబి నారాయణన్‌కు.. అసలు తనని ఎందుకు అరెస్ట్ చేశారో కూడా మొదట్లో అర్థం కాలేదు. పోలీసులు ఎంత హింసించిన నేరం ఒప్పుకోలేదు. అరెస్టయిన నెల రోజుల తర్వాత ఈ కేసు కేరళ ఇంటలిజెన్స్ బ్యూరో నుంచి సీబీఐకు బదిలీ అయింది. 1995 జనవరి 19న ఆయనకు బెయిల్ వచ్చింది. సీబీఐ విచారణలో నంబి నారాయణన్ ఎలాంటి తప్పు చేయలేదని తేలింది. సీబీఐ తమ నివేదికను 1996 ఏప్రిల్‌లో కేరళ హైకోర్టుకు సమర్పించింది. ఇస్రోకు చెందిన సమాచారం పాకిస్తాన్‌కు వెళ్లినట్లు ఎక్కడ ఆధారాలు లేకపోవడంతో నంబి నారాయణన్‌తో పాటు మరో ఐదుగురికి కోర్టు క్లీన్చిట్ ఇచ్చింది. దీంతో నంబి నారాయణన్ తిరిగి ఇస్రోలో చేరారు. సీబీఐ ఈ కేసును మూసివేసినా.. అప్పటి కేరళ ప్రభుత్వం మళ్లీ తెరిచేందుకు ప్రయత్నించింది. ఈ కేసుని మళ్లీ విచారించాలని కోరుతూ..1998లో సుప్రీకోర్టు మెట్లు ఎక్కింది. కానీ దేశ అత్యున్నత న్యాయస్థానం ఈ కేసును తిరస్కరించింది. తనపై అక్రమంగా కేసును బనాయించి, వేధించిన కేరళ ప్రభుత్వంపై డాక్టర్ నారాయణన్ కేసు వేశారు. నారాయణన్‌కు రూ.50 లక్షల రూపాయలు పరిహారంగా చెల్లించాలని సుప్రీంకోర్టు 2018లో ఆదేశించింది. అంతేకాదు తప్పుడు కేసు బనాయించడంపై సమగ్ర విచారణ జరపాలని ఆదేశాలు జారీ చేసింది. తన తప్పును తెలుసుకున్న కేరళ ప్రభుత్వం కోర్టు ఆదేశించిన పరిహారానికి అదనంగా రూ.1.3 కోట్లు అదనంగా ఇస్తామని 2019లో ప్రకటించింది. 2019లో భారత ప్రభుత్వం నారాయణన్ని ‘పద్మభూషణ్’తో సత్కరించింది. నారాయణన్‌పై కుట్ర పన్నిందెవరనే విషయాలు ఇప్పటికీ మిస్టరీగానే ఉన్నాయి. గుఢచార్యం కేసు వెనుక అమెరికా హస్తం ఉందని కేరళ హైకోర్టు ఎదుట నారాయణన్ అనుమానం వ్యక్తం చేశారు. - అంజి శెట్టె, సాక్షి వెబ్‌డెస్క్ -
తొలిసారిగా అది చూపించబోతున్నాం: మాధవన్
R Madhavan Says Nambi Narayanan Is James Bond: ‘‘రాకెట్రీ.. ది నంబి ఎఫెక్ట్’ సినిమాకి ఆరేళ్లు పట్టింది. సాధారణంగా స్పేస్ సినిమాల్లో రాకెట్స్‌ను, స్పేస్ షిప్స్‌ను చూస్తుంటాం. కానీ ఏ సినిమాలోనూ రాకెట్ ఇంజిన్‌ను చూపించి ఉండరు. తొలిసారి మా సినిమాలో చూపించబోతున్నాం’’ అని హీరో ఆర్. మాధవన్ అన్నారు. ప్రముఖ ఇస్రో శాస్త్రవేత్త నంబి నారాయణన్ బయోపిక్‌గా తెరకెక్కిన చిత్రం ‘రాకెట్రీ.. ది నంబి ఎఫెక్ట్’. ఆర్. మాధవన్ లీడ్ రోల్లో నటించి, దర్శకత్వం వహించారు. మాధవన్, సరితా మాధవన్, వర్గీస్ మూలన్, విజయ్ మూలన్ నిర్మించిన ఈ సినిమా జూలై 1న విడుదల కానుంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో ఆర్. మాధవన్ విలేకరులతో మాట్లాడుతూ.. ‘‘మన దేశానికి చెందిన రాకెట్రీ సీక్రెట్స్‌ను నంబి నారాయణన్ పాకిస్థాన్‌కి అమ్మేశారనే నేరం కింద ఆయన్ని అరెస్ట్ చేసి, చిత్రహింసలు పెట్టారు. కానీ సీబీఐ దర్యాప్తులో ఆయన నిరపరాధిగా నిరూపించబడ్డారు ? అదే ఈ చిత్రకథ. ఆయన లైఫ్ నాకు పేదవాడి జేమ్స్ బాండ్ స్టోరీలా అనిపించింది. చదవండి: హీరోను దుమ్మెత్తిపోసిన నెటిజన్లు.. సైలెంట్‌గా ఉండమని కామెంట్లు.. ఏడాదిన్నర పాటు ఈ కథను తయారు చేశాను. సైన్స్, టెక్నాలజీ రంగంలో చాలామంది మేధావులున్నారు. వారి గురించి ఈ ప్రపంచానికి తెలియజేయాలనే ‘రాకెట్రీ.. ది నంబి ఎఫెక్ట్’ సినిమా చేశాను. ఈ సినిమాకి నేను ప్రోస్థటిక్ మేకప్స్ ఉపయోగించలేదు. నంబి నారాయణన్‌లా కనిపించటానికి బాగా కష్టపడ్డాను. ‘బాహుబలి’ వంటి గొప్ప సినిమాను చేయడానికి ఆ టీమ్ ఎంత కష్టపడ్డారో ‘రాకెట్రీ.. ది నంబి ఎఫెక్ట్’ కోసం మా టీమ్ కూడా అంతే కష్టపడింది’’ అని మాధవన్ తెలిపారు. చదవండి: తెరపైకి అటల్ బిహారీ వాజ్‌పేయి జీవిత కథ.. -
మాధవన్‌ను చూసి ఒక్కసారిగా షాకైన సూర్య, వీడియో వైరల్
వైవిధ్యమైన పాత్రలు, కథలతో అలరిస్తుంటాడు మాధవన్. తాజాగా ఆయన రాకెట్రీ అనే బయోపిక్‌తో రాబోతున్నాడు. ప్రముఖ ఇస్రో శాస్త్రవేత్త నంబి నారాయణ్ జీవితాన్ని ఆధారంగా ఈ మూవీ తెరకెక్కింది. ఇందులో మాధవన్ లీడ్ రోల్ పోషిస్తుండగా.. పాత్ర కోసం మ్యాడీ తనని తాను పూర్తిగా మేకోవర్ చేసుకున్నాడు. అచ్చం నంబి నారాయణ్‌లా తెల్ల జుట్టు, కళ్లద్దాలతో కనిపించనున్నాడు. చదవండి: అది చెత్త సినిమా.. దానివల్ల ఏడాది పాటు ఆఫర్స్ రాలేదు: పూజా హెగ్డే అయితే ఈ సినిమాలో కీలక పాత్ర పోషించిన స్టార్ హీరో సూర్య షూటింగ్ చూసేందుకు నంబి నారాయణ్‌తో కలిసి సెట్‌కు వెళ్లిన ఓ దృశ్యం ఒకటి తాజాగా బయటకు వచ్చింది. సెట్లోకి అడుగుపెట్టగానే నంబి నారాయణన్ గేటప్ ఉన్న మాధవన్‌ను చూసి ఆశ్చర్యానికి లోనయ్యాడు. ఒక్క క్షణం ఎవరూ నిజమైన నంబి నారాయణ్ అని గుర్తు పట్టలేదనేంతగా ఓ షాకింగ్ లుక్ ఇచ్చాడు. ఇక సెట్స్‌లోని సూర్య, నారాయణ్ రాగానే కూర్చి నుంచి లేచి ఇరువురి స్వాగతం పలికాడు మ్యాడీ. అనంతరం సూర్యను తన స్నేహితుడు అంటూ నారాయణ్‌కు పరిచయం చేశాడు. చదవండి: కొత్త కారు కొన్న బిగ్‌బాస్ బ్యూటీ, ధరెంతో తెలుసా? ఇక ఆయన సూర్యను పలకరిస్తూ.. మీ సినిమాలు చాలా బాగుంటాయని, మీ నటన అద్భుతమని కొనియాడారు. అంతేకాదు మీ నాన్నగారు(శివకూమార్) దర్శకత్వం కూడా తనకు బాగా నచ్చుందని చెప్పడంతో సూర్య ఆయనకు కృతజ్ఞతలు తెలిపాడు. కాగా తమిళం, తెలుగులో చేస్తున్న సూర్య పాత్రలో హిందీలో షారుక్ ఖాన్ పోషిస్తున్నాడు. ఇక నంబి నారాయణ్ భార్య పాత్రలో సీనియర్ నటి సిమ్రాన్ కనిపించనుంది. అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఈ చిత్రం జూలై 1న విడుదలకు సిద్ధమవుతుంది. View this post on Instagram A post shared by R. Madhavan (@actormaddy) -
హీరోను దుమ్మెత్తిపోసిన నెటిజన్లు.. సైలెంట్‌గా ఉండమని కామెంట్లు..
R Madhavan Gets Trolled For Claiming ISRO Used Hindu Calendar For Mars Mission: దక్షిణాది భాషల్లోనే కాకుండా బాలీవుడ్‌లోనూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటుడు మాధవన్. ఆయన తాజాగా నటించి, దర్శకత్వం వహించిన చిత్రం రాకెట్రీ. ప్రముఖ ఇస్రో శాస్త్రవేత్త నంబి నారాయణ్ జీవితాన్ని ఆధారంగా చేసుకుని తెరకెక్కింది ఈ చిత్రం. బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్, స్టార్ హీరో సూర్య కీలక పాత్రల్లో నటించిన ఈ మూవీ తెలుగు, తమిళం, హిందీ, ఇంగ్లీషు భాషల్లో జులై 1న ప్రేక్షకుల ముందుకు రానుంది. దీంతో ప్రమోషన్లో భాగంగా చిత్రబృందం మీడియా సమావేశాలకు హాజరవుతోంది. ఈ క్రమంలోనే మాధవన్ చేసిన వ్యాఖ్యలు నెట్టింట ట్రోల్స్ ఎదుర్కొంటున్నాయి. ఓ ప్రెస్ మీట్లో అంతరిక్షంలోకి రాకెట్‌ను ప్రయోగించినప్పుడు, అది అంగారక కక్ష్యలోకి చేరేందుకు ఇస్రోకు పంచాగం ఉపయోగపడిందని మాధవన్ అన్నాడు. 'ఇస్రోవాళ్లు పంచాంగం చూసి పెట్టిన ముహుర్త బలం వల్లే భారత మార్స్ మిషన్ అవాంతరాలను అధిగమించి కక్ష్యలోకి చేరింది. గ్రహాల స్థితిగతులన్నీ పంచాంగాల్లో నిక్షిప్తమై ఉంటాయి.' అని మాధవన్ వ్యాఖ్యలు చేశాడు. ఈ వీడియో నెట్టింట్లో వైరల్ కాగా నెటిజన్స్ ట్రోలింగ్‌తో ఏకిపారేస్తున్నారు. (చదవండి: చై-సామ్ బాటలో మరో టాలీవుడ్ జంట ?) When panjakam plays a important role in Mars mission #Madhavan #MarsMission #science #technology #sciencefiction pic.twitter.com/tnZOqYfaiN — கல்கி (@kalkyraj) June 23, 2022 'సైన్స్ అందరికీ అర్థమయ్యే విషయం కాదు. అలా అని సైన్స్ తెలియకపోవడం కూడా పెద్ద సమస్య కాదు. కానీ అసలు విషయం తెలుసుకోకుండా ఇలా మాట్లాడే బదులు సైలెంట్‌గా ఉండటం మంచిది', 'మీరు మాట్లాడే దాంట్లో ఏమైనా అర్థం ఉందా ?', 'ఇవేం పిచ్చి మాటలు' అంటూ వరుస కామెంట్లతో నెటిజన్లు దుమ్మెత్తిపోశారు. అయితే ఈ ట్రోలింగ్‌పై తాజాగా మాధవన్ స్పందించాడు. 'పంచాంగాన్ని తమిళంలో పంచాంగ్ అని అనడం నా తప్పే. ఈ విమర్శలకు నేను అర్హుడినే. నేను అజ్ఞానినే. అయితే ఈ మాటల వల్ల మనం కేవలం 2 ఇంజిన్ల సహాయంతో మార్స్ మిషన్‌లో విజయం సాధించామనే నిజం కాకుండా పోదు. ఇది ఒక రికార్డు. వికాస్ ఇంజిన్ ఒక రాక్‌స్టార్.' అని ట్వీట్ మాధవన్ ట్వీట్ చేశాడు. (చదవండి: 'నువ్వే కావాలి' నటుడికి నిర్మాత బెదిరింపులు.. పోలీసులకు ఫిర్యాదు) 🙏🙏I deserve this for calling the Almanac the “Panchang” in tamil. Very ignorant of me.🙈🙈🙈🤗🚀❤️Though this cannot take away for the fact that what was achieved with just 2 engines by us in the Mars Mission.A record by itself. @NambiNOfficial Vikas engine is a rockstar. 🚀❤️ https://t.co/CsLloHPOwN — Ranganathan Madhavan (@ActorMadhavan) June 26, 2022 (చదవండి: 9 సార్లు పిల్లలను కోల్పోయిన స్టార్ హీరోయిన్..) -
సూర్య, షారుక్ పైసా కూడా తీసుకోలేదు: హీరో
ప్రఖ్యాత ఇస్రో శాస్తవేత్త నంబి నారాయణన్లోని నెగెటివ్ కోణాన్ని తమ సినిమాలో చూపించినట్లు నటుడు మాధవన్ తెలిపారు. ఈయన తొలిసారిగా మెగాఫోన్ పట్టి స్వీయ నిర్మాణంలో కథానాయకుడిగా నటించిన రాకెట్రీ చిత్రాన్ని పాన్ఇండియా మూవీగా తమిళం, మలయాళం, హిందీ భాషల్లో రూపొందించారు. ఈ సినిమా జులై ఒకటో తేదీన విడుదలకు సిద్ధమవుతోంది. ఈ సందర్భంగా బుధవారం మాధవన్ చెన్నైలో మీడియాతో మాట్లాడుతూ ఇస్రో శాస్త్రవేత్త నంబి నారాయణన్ జీవిత చరిత్ర తెరకెక్కించే ముందు తాను ఆయన్ని కలిశానని చెప్పారు. ఆయన చెప్పిన వివరాలు తనను ఆశ్చర్యచకితుడిని చేశాయన్నారు. భారతదేశానికి సంబంధించిన రహస్యాలను పాకిస్తాన్‌కు చేరవేశారన్న ఆరోపణతో జైలులో చిత్రహింసలు అనుభవించి బయటకు వచ్చిన తరువాత తన నిర్ధోషిత్వాన్ని నిరూపించుకున్న నంబి నారాయణన్ గొప్పతనాన్ని మాత్రమే కాకుండా ఆయనలోని నెగెటివ్ కోణాన్ని ఆవిష్కరించినట్లు తెలిపారు. సహజత్వం కోసం తాను ఎలాంటి విగ్గు లేకుండా నంబి నారాయణన్‌లా తయారయ్యానని చెప్పారు. ఇందులో నటుడు షారుక్‌ఖాన్, సూర్య అతిథి పాత్రల్లో ఎలాంటి పారితోషికం తీసుకోకుండా మరీ నటించారని చెప్పారు. చదవండి: ఓటీటీలోనూ 'ఆర్ఆర్ఆర్' రికార్డు.. ‘సమ్మతమే’ మూవీ రివ్యూ -
అంతరిక్షంపై సినిమాలు: సుశాంత్ కల కలగానే మిగిలిపోయింది!
నింగిలో ఏం ఉంది? తెలుసుకోవాలని అందరికీ ఉంటుంది. వెళ్లి తెలుసుకునే ధీరోదాత్తులు కొందరే ఉంటారు. గతంలో రాకేశ్ శర్మ, కల్పనా చావ్లా వంటివారు స్పేస్‌కి వెళ్లారు. తాజాగా అంతరిక్ష యానం చేసిన తొలి తెలుగు అమ్మాయిగా బండ్ల శిరీష రికార్డ్ సాధించారు. ఆస్ట్రోనాట్లను నింగికి పంపడానికి నేల మీద శాస్త్ర వేత్తలు జె. అబ్దుల్ కలామ్, నంబి నారాయణన్ వంటివారు కృషి చేశారు. వ్యోమ గాములు... శాస్త్రవేత్తల జీవితం ఆదర్శప్రాయం. అందుకే రాకేశ్ శర్మ, కల్పనా చావ్లా, అబ్దుల్ కలామ్, నంబి నారాయణన్ బయోపిక్స్‌కి శ్రీకారం జరిగింది. ఆ చిత్రాల విశేషాలను తెలుసుకుందాం. కల్పనా చావ్లా అంతరిక్షంలో అడుగుపెట్టిన తొలి భారతీయ మహిళా ఆస్ట్రోనాట్ కల్పనా చావ్లా. 1997లో కల్పన అంతరిక్షంలోకి అడుగుపెట్టారు. ఆ తర్వాత మరో స్పేస్ మిషన్ కోసం అంతరిక్షంలోకి వెళ్లి తిరిగి భూమిని చేరుకునే క్రమంలో జరిగిన ప్రమాదంలో కల్పన మరణించారు. ఇండియా నేషనల్ హీరోస్లో ఒకరు అనిపించుకున్న కల్పనా చావ్లా 40 ఏళ్ళ వయసులోనే మరణించడం విషాదం. అయితే కల్పన సాధించిన ఘనత మాత్రం ఎందరికో స్ఫూర్తిదాయకం. అందుకే ఆమె జీవితాన్ని వెండితెరపైకి తీసుకుని రావాలనుకున్నారు ‘చక్ దే ఇండియా’ డైరెక్టర్ షిమిత్ అమిన్. ఈ చిత్రంలో ప్రియాంకా చోప్రా నటిస్తారని వార్తలు వచ్చాయి. అలాగే కల్పనా చావ్లా బయోపిక్‌లో నటించేందుకు తాను ఆసక్తిగా ఉన్నట్లు ఓ సందర్భంలో హీరోయిన్ వాణీ కపూర్ వెల్లడించారు. అయితే ప్రియాంక దాదాపు ఖరారయ్యారని టాక్. సుశాంత్ సింగ్ - చందమామ దూర్ కే యువహీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఎన్నో కలలు కన్నాడు. అందులో వ్యోమగామి పాత్ర చేయాలన్న కల ఒకటి. 2017లో సంజయ్ పూరన్ సింగ్ దర్శకత్వంలో ఈ సినిమాని ప్రకటించారు కూడా. అసలు సిసలైన ఆస్ట్రోనాట్‌గా ఒదిగిపోవడానికి సుశాంత్ ‘నాసా’లో శిక్షణ కూడా తీసుకున్నారు. అయితే గత ఏడాది సుశాంత్ ఆకస్మిక మరణంతో ఈ సినిమా పట్టాలెక్కలేదు. ‘చందమామ దూర్ కే’ టైటిల్‌తో సినిమా తీయాలనుకున్నారు. ఈ సినిమా ఆగలేదని దర్శకుడు సంజయ్ చెబుతూ – ‘‘సుశాంత్ మరణం నాకు తీరని లోటు. ‘చందమామ...’ కథ ఆయనకు చాలా నచ్చింది. కొన్ని ఇన్పుట్స్ కూడా ఇచ్చారు. అందుకే సుశాంత్‌కి నివాళిగా ఈ సినిమా తీస్తాను. కానీ ఎప్పుడు తీస్తానో చెప్పలేను’’ అన్నారు. ఏపీజే అబ్దుల్ కలామ్ భారతరత్న అవార్డుగ్రహీత, భారత మాజీ రాష్ట్రపతి, మిసైల్ మ్యాన్ ఆఫ్ ఇండియాగా పిలుచుకునే ఏపీజే అబ్దుల్ కలామ్ జీవితం వెండితెరపైకి రానుంది. డీఆర్డీవో (డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్), ఇస్రో (ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్) సంస్థల్లో నిర్వహించిన బాధ్యతల ద్వారా భారత అంతరిక్ష రంగం అభివృద్ధికి అబ్దుల్ కలామ్ ఎంతో కృషి చేశారు. ఆయన జీవితం ఆధారంగా బయోపిక్‌ల ప్రకటనలు వచ్చాయి. నిర్మాతలు అభిషేక్ అగర్వాల్, అనిల్ సుంకర ఓ బయోపిక్‌ను ప్రకటించారు. ఇందులో అబ్దుల్ కలామ్గా నటించనున్నట్లు ప్రముఖ నటుడు పరేష్ రావల్ గత ఏడాది జనవరిలో వెల్లడించారు. అలాగే అబ్దుల్ కలామ్ జీవితం ఆధారంగా వస్తున్న మరో చిత్రం ‘ఏపీజే అబ్దుల్ కలాం: ది మిసైల్ మ్యాన్’. ఇందులో అలీ టైటిల్ రోల్ చేస్తున్నారు. జగదీష్ తానేటి, సువర్ణ, జానీ మార్టిన్ నిర్మిస్తున్నారు. నంబి నారాయణన్ ఇస్రో మాజీ శాస్త్రవేత్త నంబి నారాయణన్ జీవితం ఆధారంగా ‘రాకెట్రీ: ది నంబి ఎఫెక్ట్’ చిత్రం రూపొందింది. ఇందులో నారాయణన్‌గా మాధవన్ నటించి, దర్శకత్వం వహించారు. ‘ఇస్రో’లో ముఖ్య విభాగానికి ఇన్చార్జ్గా నారాయణన్ విధులు నిర్వహిస్తున్న సమయంలో ఆయనపై కొన్ని ఆరోపణలు వచ్చాయి. దీంతో ఆయన ఉద్యోగాన్ని వదులుకోవాల్సి వచ్చింది. కొంతకాలం తర్వాత ఈ ఆరోపణల్లో నిజం లేదని, నంబి నారాయణన్ నిర్దోషి అని కోర్టు తీర్పు ఇచ్చింది. ఈ అంశాలతో తమిళం, హిందీ భాషల్లో రూపొందిన ‘రాకెట్రీ: ది నంబి ఎఫెక్ట్’ చిత్రాన్ని తెలుగులోనూ రిలీజ్ చేయాలనుకుంటున్నారు. రాకేశ్ శర్మ అంతరిక్షంలో కాలుమోపిన మొట్టమొదటి భారతీయ వ్యక్తి రాకేశ్ శర్మ బయో పిక్ గురించి 2018లో ఓ ప్రకటన వచ్చింది. మహేశ్ మాథై దర్శకత్వంలో ఈ చిత్రాన్ని సిద్ధార్థ్‌రాయ్ కపూర్ నిర్మించనున్నారు. ‘సారే జహా సే అచ్చా’ టైటిల్ కూడా అనుకున్నారు. మొదట్లో హీరోగా ఆమిర్ ఖాన్ పేరు బలంగా వినిపించింది. ఆ తర్వాత షారుక్ ఖాన్ పేరు తెరపైకి వచ్చింది. ఇక వరుసగా రణ్‌బీర్ కపూర్, విక్కీ కౌశల్ లేటెస్ట్గా ఫర్హాన్ అక్తర్ పేర్లు ప్రచారంలోకి వచ్చాయి. కానీ ఎవరూ ఫైనలైజ్ కాలేదు. ఈ సినిమా ప్రకటించి మూడేళ్లయిన నేపథ్యంలో ఆగిందనే వార్త గతేడాది ప్రచారంలోకి వచ్చింది. అయితే సినిమా ఆగిపోలేదని, వర్క్ జరుగుతోందని సిద్ధార్థ్ రాయ్ స్పష్టం చేశారు. -
జర్నలిస్ట్ షారుక్!
హీరో మాధవన్‌ను ప్రశ్నించారు బాలీవుడ్ బాద్షా షారుక్‌ఖాన్.. ఏం ప్రశ్నించారు? వాటికి మాధవన్ సమాధానాలు ఏమిటి? అనేవి వెండితెరపైనే తెలుసుకోవాలి. ఇస్రో శాస్త్రవేత్త నంబి నారాయణన్ జీవితం ఆధారంగా ‘రాకెట్రీ: ది నంబి ఎఫెక్ట్’ అనే చిత్రం తెరకెక్కిన సంగతి తెలిసిందే. ఇందులో నంబి నారాయణన్ పాత్రలో నటించి, దర్శకత్వం వహించారు మాధవన్ . జర్నలిస్ట్‌గా కనిపించబోతున్నారు షారుక్ ఖాన్ . నంబి నారాయణన్ని ఓ జర్నలిస్ట్ ప్రశ్నలు అడిగే సన్నివేశంతో ‘రాకెట్రీ’ సినిమా మొదలై, ఆ తర్వాత ఫ్లాష్‌బ్యాక్ ఎపిసోడ్స్‌కి వెళుతుంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది విడుదల చేయాలనుకుంటున్నారు. ఈ సంగతి ఇలా ఉంచితే.. షారుక్ నటించిన గత చిత్రం ‘జీరో’లో మాధవన్ సైంటిస్ట్‌గా నటించిన సంగతి తెలిసిందే. -
ప్రయాణం ముగిసింది; మిమ్మల్ని పెళ్లి చేసుకోవచ్చా!
మాధవన్ హీరోగా నటించిన తాజా చిత్రం ‘రాకెట్రీ: ది నంబి ఎఫెక్ట్’. ఈ చిత్రానికి దర్శకుడు కూడా మాధవనే కావడం విశేషం. ఈ క్రమంలో సినిమాకు సంబంధించిన ప్రతీ అప్డేట్ను మ్యాడీ సోషల్ మీడియాలో అభిమానులతో షేర్ చేసుకుంటున్నాడు. ఇందులో భాగంగా..‘ ఎడిటింగ్ చాలా సరదాగా సాగపోతుంది. ఎంజాయ్ చేస్తున్నా. అదే సమయంలో ఎంతో భయపడుతున్నా. నేటితో ఈ ప్రయాణం ముగిసింది. నిజంగా వృద్ధుడిని అయిపోతున్నా అంటూ తన సెల్ఫీని ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశాడు. కాగా నెరిసిన జుట్టు, గడ్డంతో ఉన్న మాధవన్ ఫొటో అభిమానులను విపరీతంగా ఆకర్షిస్తోంది. ఈ క్రమంలో ఓ మహిళా అభిమాని.. ‘నాకిప్పుడు 18 ఏళ్లు. నేను మిమ్మల్ని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. ఇందులో తప్పేం లేదు కదా’ అంటూ సరదాగా కామెంట్ చేసింది. ఇందుకు స్పందించిన మ్యాడీ.. ‘ఆ దేవుడు నిన్ను తప్పక ఆశీర్వదిస్తాడు. నాకంటే ఎంతో విలువైన వ్యక్తిని భాగస్వామిగా పొందుతావు’ అంటూ ఆమెకు ఆల్ ద బెస్ట్ చెప్పాడు. కాగా మాధవన్ రిప్లై నెటిజన్లను ఆకట్టుకుంటోంది. మీరు అందగాడు మాత్రమే కాదు. మనసున్న వారు. మీ సినిమా కచ్చితంగా హిట్ అవుతుంది అంటూ పలువురు కామెంట్ చేస్తున్నారు. ఇక ఇంతకు ముందు మణిరత్నం దర్శకత్వంలో వచ్చిన ‘కన్నత్తిల్ ముత్తమిట్టాళ్’ (తెలుగులో ‘అమృత’) సినిమాలో కలిసి నటించిన మాధవన్, సిమ్రాన్ ఈ సినిమాలో మరోసారి జంటగా కనిపించనున్నారు. వీరితో పాటు హాలీవుడ్ యాక్టర్లు రాన్ డోనాచీ (గేమ్ ఆఫ్ థ్రోన్స్ ఫేమ్), ఫిలిస్ లోగాన్ రాకెట్రీలో కీలక పాత్రలు పోషిస్తున్నారు. View this post on Instagram Editing is so much fun and exhausting:. Enjoying and fearing it..End of long travel day. Definitely getting older .. 🤣🤣🚀🚀🙏🙏#rocketrythefilm #actormaddy #Rocketryfilm A post shared by R. Madhavan (@actormaddy) on Jul 23, 2019 at 11:08am PDT -
స్పేస్ జర్నీ ముగిసింది
‘రాకెట్రీ’లో మాధవన్ అంతరిక్ష ప్రయాణం సెర్బియాలో ముగిసింది. మాధవన్ హీరోగా నటించిన తాజా చిత్రం ‘రాకెట్రీ: ది నంబి ఎఫెక్ట్’. ఈ చిత్రానికి దర్శకుడు కూడా మాధవనే కావడం విశేషం. ఇస్రో మాజీ శాస్త్రవేత్త నంబి నారాయణన్ జీవితం ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించారు. ఈ సినిమా చిత్రీకరణ ముగిసింది. నారాయణన్ పాత్రలో మాధవన్ నటించారు. దాదాపు పదిహేడేళ్ల తర్వాత మాధవన్, సిమ్రాన్ జంటగా నటించిన చిత్రం ఇది. ఇంతకు ముందు మణిరత్నం దర్శకత్వంలో వచ్చిన ‘కన్నత్తిల్ ముత్తమిట్టాళ్’ (తెలుగులో ‘అమృత’) సినిమాలో మాధవన్, సిమ్రాన్ నటించారు. ‘‘రాకెట్రీ సినిమా ముగిసింది. నా జీవితంలోనే అత్యద్భుతంగా ఈ సినిమా చిత్రీకరణ జరిగింది. నా హృదయం ఎన్నో భావోద్వేగాలతో నిండిపోయింది’’ అన్నారు మాధవన్. ఇందులో హాలీవుడ్ యాక్టర్లు రాన్ డోనాచీ (గేమ్ ఆఫ్ థ్రోన్స్ ఫేమ్), ఫిలిస్ లోగాన్ కీలక పాత్రలు చేశారు. -
మైనస్ పది డిగ్రీల చలిలో!
రష్యాలో షూటింగ్ కంప్లీట్ చేశారు మాధవన్. ఆయన దర్శకత్వం వహిస్తూ, నటిస్తున్న చిత్రం ‘రాకెట్రీ: ది నంబి ఎఫెక్ట్’. ఇస్రో (ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్) శాస్త్రవేత్త నంబి నారాయణన్ జీవితం ఆధారంగా ఈ సినిమాను తెరెక్కిస్తున్నారు. నంబి నారాయణన్ లుక్‌లోకి మారేందుకు మాధవన్ చాలా కష్టపడ్డ విషయం తెలిసిందే. తాజాగా రష్యా షెడ్యూల్‌ను కంప్లీట్ చేశారు మాధవన్. ‘‘రష్యా షెడ్యూల్‌ను సక్సెస్‌ఫుల్‌గా కంప్లీట్ చేశాం. మైనస్ పది డిగ్రీల వాతావరణంలో ఈ షూటింగ్ చేశాం. అనుకున్నదానికన్నా ఐదు రోజులు ముందే ఈ షెడ్యూల్ పూర్తి చేశాం. దీనికి మా టీమ్ అందరి కృషి ఉంది’’ అని పేర్కొన్నారు మాధవన్. తమిళ, హిందీ భాషల్లో రూపొందుతున్న ఈ సినిమాను తెలుగులో కూడా రిలీజ్ చేయాలనుకుంటున్నారు. -
రీల్ సైంటిస్ట్.. రియల్ సైంటిస్ట్
ప్రస్తుతం అన్ని ఇండస్ట్రీలలో బయోపిక్‌ల సీజన్ నడుస్తోంది. సినీ రాజకీయా క్రీడా ప్రముఖుల జీవిత కథల నేపథ్యంలో పలు భాషల్లో సినిమాలు రూపొందుతున్నాయి. ఈ లిస్ట్‌లో ఓ సైంటిస్ట్ కూడా చేరబోతున్నాడు.ఆర్ మాధవన్ స్వయంగా దర్శకత్వం వహిస్తూ నటిస్తున్న సినిమా రాకెట్రీ. ఇస్రో శాస్త్రవేత్త నంబి నారాయణన్ జీవిత కథ ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా కోసం మాధవన్ చూపిస్తున్న డెడికేషన్ అందరిని విస్మయానికి గురిచేస్తుంది. ఇప్పటికే తన లుక్కు సంబంధించిన అప్డేట్స్తో ఆకట్టుకుంటున్న మాధవన్ తాజాగా తన ఫైనల్ లుక్‌ను రివీల్ చేశాడు. అచ్చు నంబి నారాయణన్‌లా మారిపోయాడు మాధవన్. ప్రస్తుతం చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ సినిమాను తెలుగు, తమిళ, ఇంగ్లీష్, హిందీ భాషల్లో తెరకెక్కిస్తున్నారు. -
రెండేళ్లు... పద్నాలుగు గంటలు
కదలకుండా కుర్చీలో ఐదు గంటలకు మించి కూర్చోవాలంటే ఎవరైనా కాస్త ఇబ్బంది పడాల్సిందే. అలాంటిది ‘రాకెట్రీ: ది నంబి ఎఫెక్ట్’ సినిమాలోని క్యారెక్టర్ కోసం హీరో మాధవన్ దాదాపు 14 గంటలు మేకప్‌తో అలాగే కుర్చీలో కూర్చుండిపోయారట. ఇస్రో మాజీ శాస్త్రవేత్త నంబి నారాయణన్ జీవితం ఆధారంగా తమిళం, హిందీ, తెలుగు భాషల్లో రూపొందుతున్న ఈ సినిమాలో మాధవన్ హీరోగా నటిస్తున్నారు. అంతేకాదు ఒక దర్శకుడు కూడా. అనంత మహాదేవన్ మరో దర్శకుడు. ‘‘నంబి నారాయణన్ పాత్ర కోసం రెండేళ్లు కష్టపడ్డాం. ఇప్పుడు ఈ సినిమాలోని నా పాత్ర లుక్ కోసం కుర్చీలో పద్నాలుగు గంటలు కూర్చుండిపోవాల్సి వచ్చింది’’ అని పేర్కొన్నారు మాధవన్. ఈ సినిమా సమ్మర్లో విడుదల కానుంది. ‘సవ్యసాచి’ సినిమాతో తెలుగులో డైరెక్ట్ చిత్రం చేసిన మాధవన్ నెక్ట్స్ ‘వస్తాడు నా రాజు’ ఫేమ్ హేమంత్ మధుకర్ దర్శకత్వంలో మరో తెలుగు సినిమాలో హీరోగా నటించనున్నారు. అనుష్క, అంజలి, షాలినీ పాండే ప్రధానపాత్రల్లో కనిపిస్తారు. మార్చిలో ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ కానుంది. -
ఈసారి వినిపిస్తా!
‘సవ్యసాచి’తో తొలిసారి స్ట్రయిట్ తెలుగు చిత్రంలో తెలుగు ప్రేక్షకులను పలకరించారు మాధవన్. ఈ చిత్రంలో మాధవన్ పోషించిన నెగటివ్ పాత్రకు మంచి అభినందనలు కూడా వస్తున్నాయి. ప్రస్తుతం మాధవన్ ‘రాకెట్రీ: ది నంబీ ఎఫెక్ట్’ అనే చిత్రంలో యాక్ట్ చేస్తున్నారు. శాస్త్రవేత్త నంబీ నారాయణ్ జీవితం ఆధారంగా తెరకెక్కుతోన్న ఈ చిత్రాన్ని అనంత్ మహదేవ్‌తో కలసి దర్శకత్వ బాధ్యతలు కూడా చేపడుతున్నారు మాధవన్. ఈ సినిమా తెలుగు, తమిళ, హిందీ, మలయాళ భాషల్లో తెరకెక్కుతోంది. ఈ చిత్రం తెలుగు వెర్షన్‌కు మాధవన్ సొంతంగా డబ్బింగ్ చెప్పుకోనున్నారు. ‘‘సవ్య సాచి’ సినిమాలో పాత్రకు డబ్బింగ్ చెప్పాలనుకున్నా అనివార్య కారణాల వల్ల కుదరలేదు. ఈ సినిమా చేస్తున్నప్పుడు నా సినిమాలను ఫాలో అయ్యేవాళ్లు తెలుగు రాష్ట్రాల్లో చాలామంది ఉన్నారని తెలుసుకున్నాను. అందుకే ‘రాకెట్రీ’ సినిమాలో నా గొంతునే వినిపిస్తాను’’ అని మాధవన్ పేర్కొన్నారు. -
కొత్త జాబ్
‘రాకెట్రీ : ది నంబీ ఎఫెక్ట్’... మాధవన్ లేటెస్ట్ సినిమా. ఇస్రో శాస్త్రవేత్త నంబీ నారాయణ్ జీవితం ఆధారంగా రూపొందుతోన్న ఈ చిత్రంలో మాధవన్ టైటిల్ రోల్ చేస్తున్నారు. నటుడిగానే కాదు.. ఈ సినిమాకి దర్శకుడిగానూ బాధ్యతలు చేపట్టారు. ఇక నంబీ నారాయణ్ గురించి చెప్పాలంటే.. విదేశీ గూఢచారి అంటూ ఆయనపై 1994లో కేసులు నమోదయ్యాయి. చాలా ఏళ్లు పోరాడిన తర్వాత ఆయన ‘నిర్దోషి’ అనే తీర్పు వచ్చింది. ఆ విధంగా జీవితంలో పెద్ద సవాల్‌ని ఎదుర్కొన్న నారాయణ్ పాత్ర చేయడం మంచి సవాల్‌లా భావిస్తున్నారు మాధవన్. ఈ చిత్రం టీజర్‌ను బుధవారం రిలీజ్ చేశారు. అనంత మహదేవన్‌తో కలసి ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేస్తున్నారు మాధవన్. తమిళ, తెలుగు, హిందీ, మలయాళ భాషల్లో ఈ చిత్రం రూపొందుతోంది. -
‘రాకెట్రీ : ది నంబి ఎఫెక్ట్’
ప్రస్తుతం అన్ని ఇండస్ట్రీలలో బయోపిక్‌ల సీజన్ నడుస్తోంది. సినీ రాజకీయా క్రీడా ప్రముఖుల జీవిత కథల నేపథ్యంలో పలు భాషల్లో సినిమాలు రూపొందుతున్నాయి. తాజాగా ఈ లిస్ట్‌లో ఓ సైంటిస్ట్ కూడా చేరబోతున్నాడు. ప్రస్తుతం ఇస్రో శాస్త్రవేత్త నంబి నారాయణన్ జీవిత కథ ఆధారంగా రాకెట్రీ అనే సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో టైటిల్ రోల్లో బహు భాష నటుడు మాధవన్ కనిపించనున్నాడు. తమిళ దర్శకుడు అనంత మహదేవన్‌తో కలిసి మాధవన్ స్వయంగా దర్శకత్వం వహిస్తున్నాడు. నంబి నారాయణ్ జీవితంలోని మూడు ప్రధాన కోణాలని బయోపిక్‌లో చూపించనున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ సినిమా టీజర్‌ను రిలీజ్ చేశారు. తెలుగు, తమిళ, ఇంగ్లీష్, హిందీ భాషల్లో తెరకెక్కుతున్న ఈ సినిమాను 2019 సమ్మర్‌కు రిలీజ్ చేయనున్నారు. రాకెట్రీ తెలుగు టీజర్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి