Madhavan Urges Fans: Rocketry Movie Show Stopped Midway in Kolkata - Sakshi
Sakshi News home page

Madhavan Movie: కోల్‌కతా థియేటర్లో ‘రాకెట్రీ’ ప్రదర్శన నిలిపివేత.. ఫ్యాన్స్‌కి మాధవన్‌ విజ్ఞప్తి

Published Tue, Jul 12 2022 1:27 PM | Last Updated on Tue, Jul 12 2022 3:26 PM

Rocketry Movie Show Stopped Midway in Kolkata After Madhavan Urges Fans - Sakshi

స్టార్‌ హీరో మాధవన్‌ నటించిన లేటెస్ట్‌ మూవీ ‘రాకెట్రీ: ది నంబి ఎఫెక్ట్‌’. ప్రముఖ ఇస్రో శాస్త్రవేత్త నంబి నారాయణన్‌ నిజ జీవితంలో జరిగిన సంఘటన ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కింది. స్యయంగా మాధవన్‌ దర్శకత్వం వహించి నటించిన ఈ సినిమా జూలై 1న విడుదలైంది. ప్రస్తుతం బాక్సాఫీసు వద్ద ఈ చిత్రం పాజిటివ్‌ టాక్‌తో దూసుకుపోతుంది. విమర్శకుల నుంచి సైతం ప్రశంసలు అందుకుంటుంది ఈ​ మూవీ.

చదవండి: నా వ్యాఖ్యలను తప్పుగా అర్థం చేసుకోవడం బాధగా ఉంది

ఇందులో మాధవన్‌ యాక్టింగ్‌, డైరెక్షన్‌కు ఫ్యాన్స్‌ ఫిదా అవుతున్నారు. గొప్ప సినిమా చేశావంటూ ఆయనను పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. ఇదిలా ఉంటే కోల్‌కతాలోని ఓ థియేటర్లో రాకెట్రీ మూవీ ప్రదర్శనను మధ్యలో నిలిపివేయాల్సిన పరిస్థితి నెలకొంది. షో మొదలైన కొద్ది సమయం తర్వాత ఫ్యాన్స్‌కు, థియేటర్‌ యాజమాన్యానికి మద్య వాగ్వాదం చోటుచేసుకుంది. దీంతో మూవీ ప్రదర్శనను మధ్యలోనే నిలిపివేశారు. అనంతరం ఈ సంఘటనపై మాధవన్‌ సోషల్‌ మీడియా వేదికగా స్పందిస్తూ.. కాస్తా నెమ్మదించాలని ఫ్యాన్స్‌ను కోరాడు.

చదవండి: కోబ్రా ఆడియో లాంచ్‌లో విక్రమ్‌ సందడి, పుకార్లపై ఫన్నీ రియాక్షన్‌

ఈ సందర్భంగా థియేటర్లో చోటుచేసుకున్న ఈ సంఘటనకు సంబంధించిన వీడియోను కూడా మాధవన్‌ షేర్‌ చేశాడు. ఈ వీడియోలో కొంతమంది ఆడియన్స్‌.. థియేటర్‌ యాజమాన్యంతో గోడవ పడుతూ కనిపించారు. చూస్తుంటే వారిమధ్య పెద్ద వాగ్వాదమే చోటు చేసుకున్నట్లు కనిపిస్తోంది. దీంతో మాడీ ట్వీట్‌ చేస్తూ... ‘ఏం జరిగిందో తెలియదు. మీరు గొడవ పడటం వెనక అసలైన కారణమే ఉండోచ్చు. కానీ మీరు కాస్తా శాంతించండి. ఇతరుల పట్ల ప్రేమతో వ్యవహరించండి. ఇది నా విజ్ఞప్తి. షో తిరిగి మొదలవుతుంది’ అంటూ రాసుకొచ్చాడు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement