Rocketry Movie Success: Rajinikanth Honours R Madhavan And Nambi Narayanan, Video Goes Viral - Sakshi
Sakshi News home page

Rocketry: మాధవన్‌, నంబి నారాయణన్‌ను సత్కరించిన రజనీకాంత్‌

Published Sun, Jul 31 2022 3:32 PM | Last Updated on Sun, Jul 31 2022 4:44 PM

Rocketry Success: Rajinikanth Honours R Madhavan And Nambi Narayanan - Sakshi

కోలీవుడ్‌ హీరో మాధవన్‌ నటించిన తాజా చిత్రం రాకెట్రీ: ది నంబి ఎఫెక్ట్‌. ఇస్రో శాస్త్రవేత్త నంబి నారాయణన్‌ జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన ఈ మూవీ థియేటర్లలో రిలీజై మంచి విజయాన్ని నమోదు చేసుకుంది. తాజాగా ఈ సినిమాపై ప్రశంసలు కురిపించాడు రజనీకాంత్‌. అనంతరం మాధవన్‌కు శాలువా కప్పి సత్కరించాడు. ఈ ఆనందకర క్షణాలను సోషల్‌ మీడియాలో అభిమానులతో పంచుకున్నాడు మాధవన్‌.

'ఒక లెజెండ్‌ ఆధ్వర్యంలో వన్‌ మ్యాన్‌ ఇండస్ట్రీ, లెజెండ్‌ రజనీకాంత్‌ నుంచి ఆశీర్వాదాలు తీసుకోవడం మర్చిపోలేను' అంటూ వీడియో షేర్‌ చేశాడు మాధవన్‌. ఈ వీడియోలో రజనీకాంత్‌ పాదాలను తాకి ఆయన ఆశీస్సులు తీసుకున్నాడు మ్యాడీ. ప్రస్తుతం రాకెట్రీ మూవీ అమెజాన్‌ ప్రైమ్‌లో స్ట్రీమింగ్‌ అవుతోంది.

చదవండి: నెల రోజులైనా కాకముందే ఓటీటీలోకి వారియర్‌!
హీరోయిన్‌ కొడుకుగా నటించి చివరకు ఆమెనే పెళ్లాడిన నటుడు!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement